22వేల క్యూసెక్కుల నీటి విడుదల
22వేల క్యూసెక్కుల నీటి విడుదల
Published Fri, Feb 17 2017 12:18 AM | Last Updated on Wed, Sep 26 2018 6:21 PM
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయం నుంచి గత బుధవారం నుంచి గురువారం వరకు దిగువ ప్రాంతాలకు 21,927 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పాదన అనంతరం దిగువ నాగార్జున సాగర్‌కు 20,154 క్యూసెక్కుల నీటిని, బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమ ప్రాంతాలకు హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా 1,703 క్యూసెక్కులు, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా 75 క్యూసెక్కులను విడుదల చేశారు. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 6.026 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 3.994 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. గురువారం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి నీటి పరిమాణాన్ని పెంచి 225 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో లోడ్ డిశ్పాచ్ ఆదేశాల మేరకు విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 55.0461 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యాం నీటిమట్టం 842.10 అడుగులుగా నమోదైంది.
Advertisement