జలజాగరణ విజయవంతం
పెద్దసంఖ్యలోతరలివచ్చిన
అన్నదాతలు
ఎమ్మెల్యే విశ్వకు అన్ని వర్గాల నుంచి సంఘీభావం
వజ్రకరూరు : హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం ద్వారా ఆయకట్టుకు నీరివ్వాలని డిమాండ్ చేస్తూ ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి నాయకత్వంలో చేపట్టిన ‘రైతుల జలజాగరణ దీక్ష’ విజయవంతమైంది. వజ్రకరూరు మండలం పొట్టిపాడు గ్రామం వద్ద శనివారం సాయంత్రం ప్రారంభమైన దీక్ష ఆదివారం ఉదయం ముగిసింది. ఉరవకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో రైతులు, వివిధ పార్టీల నాయకులు, హంద్రీ-నీవా సాధన సమితి సభ్యులు తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమం ప్రారంభం నుంచి ముగిసే దాకా మొక్కవోని దీక్షతో జాగరణ చేశారు. హంద్రీ-నీవా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వకుండా ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యంపై దుమ్మెత్తి పోశారు. మొదటి దశ కింద డిస్ట్రిబ్యూటరీలు, పిల్లకాలువలు వెంటనే నిర్మించి..ఆయకట్టుకు నీరివ్వాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.
ప్రభుత్వాన్ని మేల్కొల్పేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే అన్ని పక్షాలను కలుపుకుని జిల్లావ్యాప్తంగా మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రాయలసీమను సస్యశ్యామలం చేయాలన్న ఉద్దేశంతో హంద్రీ-నీవాపై ప్రత్యేక శ్రద్ధ చూపారని గుర్తు చేశారు. ఆయన హయాంలోనే కాలువ పనులు 90 శాతం పూర్తయ్యాయన్నారు. మిగిలిన పనులను పూర్తి చేసి.. ఆయకట్టుకు నీరివ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని దుయ్యబట్టారు. వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సుశీలమ్మ మాట్లాడుతూ ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు రైతుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.
వరుస కరువులతో అల్లాడుతున్న రాయలసీమను సస్యశ్యామలం చేయాలంటే హంద్రీ-నీవాతోనే సాధ్యమన్నారు.కార్యక్రమంలో రాయుదుర్గం వూజీ ఎమ్మెల్యే కాపు రావుచంద్రారెడ్డి, తాడిపత్రి నియోజకవర్గ అదనపు సవున్వయుకర్త రమేష్‌రెడ్డి, పార్టీ యుువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు అశోక్, దుద్దేకుంట రావూంజినేయుులు, వెంకట్‌రెడ్డి, కాకర్ల నాగేశ్వరావు, రాజశేఖర్‌రెడ్డి, జిల్లా నేత ఆలవుూరు శ్రీనివాసరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శులు ఎగ్గుల శ్రీనివాసులు, పెన్నోబులేసు, జయురాం, ఎమ్మెల్యే విశ్వ తనయుుడు వై.ప్రణయ్‌కువూర్‌రెడ్డి, వజ్రకరూరు ఎంపీపీ కొర్ర వెంకటవ్ము, వైస్ ఎంపీపీ నారాయుణప్ప, వూజీ ఎంపీపీ శైలజారెడ్డి, పార్టీ వుహిళా కన్వీనర్ భూవూ కవులారెడ్డి తదితరులు పాల్గొన్నారు.