హంద్రీ – నీవా పూర్తి చేస్తాం | Handri - niva will complete | Sakshi
Sakshi News home page

హంద్రీ – నీవా పూర్తి చేస్తాం

Published Wed, Jul 20 2016 12:59 AM | Last Updated on Wed, Sep 26 2018 6:21 PM

Handri - niva  will complete

పుట్టపర్తి అర్బన్‌: హంద్రీ–నీవాను 2016 ఆఖరుకు పూర్తి చేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పుట్టపర్తికి విచ్చేసిన ఆయన స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కష్టా, గోదావరి నదులను అనుసంధానం చేయడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక చారిత్రక ఘట్టానికి తెర లేపారన్నారు.
 
రాబోవు రోజుల్లో చెరువులను కూడా అనుసంధానం చేసి రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీటిని అందించాలన్న ధృడ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు.ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చేసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయన్నారు.
 
ఇటీవల ప్రకటించిన డిజిటల్‌ ఇండియా ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌కు మొదటి స్థానం తీసుకురావడంలో కషి చేసిన మంత్రిని టీడీపీ నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో  జడ్పీటీసీ పిట్టా ఓబులరెడ్డి, నాయకులు శ్రీరాంరెడ్డి,ఆదినారాయణరెడ్డి, చెన్నకేశవులు,కొనంకి గంగాధర్‌నాయుడు,ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ జయరాంనాయుడు  తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement