లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్ స్ఫూర్తి దాయక కథనం
చెరువుల పునరుద్ధరణ కోసం పాటుపడుతున్న ఆనంద్
సిలికాన్ వ్యాలీ బెంగళూరు ఇటీవల నీటి కొరత సంక్షోభానికి దారితీసింది. లేక్ సిటీగా పేరొందిన బెంగళూరులోజనం గుక్కెడు నీటికోసం అల్లాడిన పరిస్థితి తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ సందర్భంలో చెరువుల పునరుద్ధరణ మిషన్‌కోసం అహరహం శ్రమిస్తున్న బెంగళూరుకు చెందిన మెకానికల్ ఇంజనీర్ ‘లేక్ మ్యాన్’ స్ఫూర్తిదాయక జర్నీ గురించి తెలుసుకుందాం రండి!
కర్ణాటక రాజధాని బెంగళూరుకు ఎన్నో మంచి నీటి చెరువులతో కళకళలాడుతూ ఉండేది. కానీ కాంక్రీట్ జంగిల్‌గా మారిపోతున్న పరిస్థితిల్లో చెరువులన్నీ చాలా వరకు ఎండిపోయాయి. కొన్ని పూర్తిగాకనుమరుగయ్యే స్థితికి చేరాడు. దీనికితోడు తక్కువ వర్షపాతం మరింత ప్రభావితం చేసింది. ఇక్కడే మెకానికల్ ఇంజనీర్ ఆనంద్ మల్లిగవాడ్ హృదయం తప్పించిపోయింది. బాల్యంలో ఇంటికి సమీపంలోని చెరువు, దాని అందాలను ఆస్వాదించిన మల్లిగవాడ్‌కు చెరువుల దుస్థితి చూసి చలించిపోయాడు.
ఇక అప్పటినుంచి బెంగళూరు నగర దుస్థితిని తలుచుకుని నీటి వనరుల సంరక్షణకు ఆనంద్ మల్లిగవాడ్ చెరువులను కాపాడటంలో ఒక యజ్ఞమే చేస్తున్నాడు. 36ఎకరాల ఎండిపోయిన సరస్సును కేవలం 45 రోజుల్లోనే పునరుద్ధరించి ప్రజల దృష్టిని ఆకర్షించాడు. చెరువుల పునరుద్ధరించడం కోసం తన ఉద్యోగాన్ని విడిచి పెట్టేశాడు. ఇప్పుడు పర్యావరణ పరిరక్షకుడిగా మారిన ఆనంద్, ఇప్పటివరకు 7 సరస్సులను పునరుద్ధరించాడు. అంతేకాదు 2025 నాటికి నగరంలోని 45 చెరువులకు తిరిగి జీవం పోయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.
1960లలో బెంగళూరులో దాదాపు 290 సరస్సులు ఉండేవి. 2017 నాటికి 90కి పడిపోయింది.
తొలి ప్రాజెక్టుగా ఎండిపోయిన కైలాసనహళ్లి సరస్సును నీటితో నింపాలని నిర్ణయించుకున్నాడు. అందరూ చూసి నవ్వారు.. అందరూ పిచ్చి వాడన్నారు అయినా తన ప్రయాణం అపలేదు. ఈ ప్రయాణాన్ని ఒంటరిగానే ప్రారంభించాడు. అంతేకాదు ఇవాల్టి తాగు నీటి కష్టాలకు కారణం సరస్సులు, చెరువులు మాయం కావడం కూడా ఒక కారణమని అంటాడు. అందుకే భవిష్యత్తరాలకు చెరువులను ఎలా పునరుద్ధరించాలి అనే దానిపై అవగాహన కల్పించాలని అసవరం ఉందంటాడు.
ఒకప్పుడు బెంగళూరులో దాదాపు రెండువేల చెరువులు, ఐదొందలకు చేరడంతో వీటిరక్షణకు బిగించాడు.చెరువులను సంరక్షించుకునే క్రమంలో అనుసరించాల్సిన విధానాలను అధ్యయనం చేశాడు. నగరంలోని 180 పురాతనమైన చెరువులను పరిశీలించాడు ఆనంద్. ఎట్టకేలకు తాను పనిచేస్తున్న కంపెనీ సన్‌సేరా ఇంజనీరింగ్ కంపెనీని ఒప్పించి లక్ష డాలర్లు సహాయంగా పొందాడు. వీటితో బొమ్మసంద్రలోని 36 ఎకరాల కైలాసనహళ్లి చెరువుకు 2017లో మళ్లీ జీవం పోశాడు. స్థానికులు, కూలీల సహాయంతో, అతను సరస్సు ఎండిపోయిన బెడ్ నుండి నాలుగు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించగలిగాడు. ఆ మట్టిని ఉపయోగించి సరస్సులో చిన్న చిన్న దీవులను తయారు చేశాడు. ఇపుడీ ఈ ద్వీపాలు ఇప్పుడు వేలాది పక్షులు, చెట్లతో అలరారుతున్నాయి.
అలాగే 2018లో రెండెకరాల వాబసంద్రా, 2019లో 16 ఎకరాల కోనసంద్ర లేక్‌ను పునరుద్ధరించాడు. ఫార్మ, గ్రానైట్ కంపెనీల వ్యర్థాలతో నిండి వున్నచెరువును 65 రోజుల్లో 80 లక్షలతో సుందరంగా తీర్చిదిద్దాడు. మల్లిగవాడ సరస్సు పునరుద్ధరణ ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టేందుకు కార్పొరేట్లు మద్దతిచ్చారు. తిరుపాళ్య సరస్సు పునరుజ్జీవన ప్రాజెక్ట్ 180 రోజులలో పూర్తి చేశారు. పూర్తిగా ఎండిపోయిన ఈ చెరువు 30 సంవత్సరాల తర్వాత మంచినీటితో మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. దీని నిల్వ చేసే సామర్థ్యాన్ని 3 రెట్లు పెరగడం విశేషం.
ముఖ్యంగా ఈ చెరువుల పునరుద్ధరణ కోసం చెరువులో పూడిక, కలుపు, మట్టిని, చెత్తను ప్లాస్టిక్ వ్యర్థాలను త్రవ్వి తీసి కట్టలను బలోపేతం చేస్తాడు. తరువాత సరస్సు చుట్టూ బాగా మొక్కలు నాటిస్తారు. తద్వారా వలస పక్షుల కోసం ద్వీపాలను కూడా సృష్టించాడు. వర్షాకాలం తర్వాత ఆరు నెలల్లోనే సరస్సులను స్వచ్ఛమైన నీటితో నిండిపోయింది. అలాగే విరాళాల ద్వారా చెరువుల రక్షణకు పూనుకున్నాడు. 3. 5 ఎకరాల్లో ఉన్న గవిని రక్షించారు. ఇప్పటివరకు 80 చెరువులకు మళ్లీ జీవం పోశాడు.దాదాపు ఎనిమిదేళ్లలో మల్లిగవాడ్ బెంగళూరులో మరో 35 సరస్సులను, అలాగే అయోధ్యలో ఏడు, లక్నోలో తొమ్మిది , ఒడిశాలో 40 చెరువును బాగు చేయడం విశేషం. దీంతో దేశవ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణ నిపుణుడిగా ప్రసిద్ధి చెందాడు. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచుతూ,కార్పొరేట్ కంపెనీల సాయంతో ఈ ప్రయాణం ఇలా సాగుతోంది. 2026లో 900 ఎకరాల హెన్నాగర సరస్సును బాగు చేయాలనేది లక్ష్యం. తద్వారా చుట్టుపక్కల రైతులకు లాభం చేకూరాలని, భూగర్భ జలాలను కాపాడాలనేది ప్రయత్నం.
ఆనంద్ మల్లిగవాడ్ సందేశం
‘‘సహజ వనరులను గౌరవించడం నేర్చుకుందాం. ప్రకృతిని ప్రేమించుదాం. ప్రకృతి అందించిన వనరులను మనకు అవసరమై నంత మాత్రమే వాడుకుందాం. నీటిని సంరక్షింకుందాం. జీవితంలో సగం మన కోసం జీవిద్దాం. మిగిలి జీవితాన్ని పరిరక్షణ కోసం వెచ్చించుదాం. మన భవిష్యత్తరాలకు కోసం ఇదే ఉన్నతమైన దృక్పథం.
Comments
Please login to add a commentAdd a comment