
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు శివార్లలో ఊరేగింపు సందర్భంగా 120 అడుగుల రథం కూలిన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనేకల్‌లోని హుస్కూర్‌లో శనివారం మద్దురమ్మ జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా వంద అడుగులకుపైగా ఎత్తైన రెండు రథాలను ఆలయ నిర్వాహకులు సిద్ధం చేశారు.
కాగా, ఊరేగింపు సందర్భంగా రెండు రథాలను తాళ్ల సహాయంతో భక్తులు లాగారు. అయితే ఈదురు గాలుల వల్ల120 అడుగుల ఎత్తైన రథం అదుపుతప్పి ఒక పక్కకు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి చెందగా.. పలువులు గాయపడ్డారు. వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
మృతి చెందిన వ్యక్తిని తమిళనాడులోని హోసూర్‌కు చెందిన లోహిత్‌గా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఏడాది కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ఇదే ఉత్సవంలో రథం కూలిపోవడంతో.. పార్క్ చేసిన అనేక వాహనాలు దెబ్బతిన్నాయి, అయితే, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

Comments
Please login to add a commentAdd a comment