![Only One Night Ghost Built Temple In Karnataka - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/26/temple_650x400.jpg.webp?itok=20s0vgy7)
మన దేశంలో ఎన్నో మహిమాన్వితమైన దేవాలయాలు ఉన్నాయి. వాటి వెనుక ఎన్నో వేల ఏళ్ల చరిత్ర ఉంది, సైన్స్‌కు అందని రహస్యాలు కూడా ఉన్నాయి. అయితే ఓ ఆలయాన్ని దయ్యాలు రాత్రికి రాత్రే కట్టించాయట. అసలు దెయ్యాలు నిజంగానే ఉన్నాయా? అయినా వాటికి ఆలయం కట్టించాల్సిన పనేంటి? ఇంతకీ ఈ వింతైన ఆలయం ఎక్కడ ఉంది? దీని వెనుకున్న కథేంటి అన్నది ఈ స్టోరీలో చూసేయండి..
దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్లు దయ్యాలు కూడా ఉంటాయని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం.. మన దేశంలో కొన్ని ఆలయాలు స్వయంగా దేవతలే నిర్మించాలని విన్నాం. అదే విధంగా దెయ్యాలు కట్టించిన ఆలయాలు కూడా మనదేశంలో ఉన్నాయట. కర్ణాటకలోని దొడ్డబళాపురం-దేవనహళ్ళి మార్గం మధ్యలో వచ్చే బొమ్మావర గ్రామంలోని శివాలయాన్ని దెయ్యాలే కట్టించాయని నమ్ముతారు అక్కడి గ్రామస్తులు. సుందరేశ్వర దేవాలయంగా ఆ గుడికి పేరుంది.
సాధారణంగా దేవాలయాలపై దేవుళ్ళ రాతి శిల్పాలు, ప్రతిమలు కనిపిస్తాయి. కానీ దేవాలయంలో మాత్రం రాక్షసుల నమునాలు చెక్కబడి ఉన్నాయి. సుమారు 600 సంవత్సరాల క్రితం నుంచే ఈ ఆలయం ఉందట. ఈ గ్రామంలో వందల ఏళ్ల క్రితం దెయ్యాలు తెగ భయపెట్టేవట. బయటకు రావాలంటనే జనాలు భయపడిపోయేవారట. దీంతో ఆ ఊరు ప్రజలకు ఏం చేయాలో అర్థంకాక మాంత్రికుడిని ఆశ్రయించారు. వాటిని తరిమికొట్టేందుకు మంత్ర విద్యలు నేర్చుకున్నప్పటికీ ఆయనకు సాధ్యం కాలేదు. దీంతో అక్కడ ఓ శివాలయాన్ని నిర్మిస్తే దెయ్యాలు పారిపోతాయని తెలుసుకుని ఊరి ప్రజలందరి సహకారంతో గుడి నిర్మించారు.
దెయ్యాలు ఆ గుడిని నాశనం చేసేయడంతో కోపంతో ఊగిపోయిన మాంత్రికుడు మంత్రశక్తితో దెయ్యాలను వశపర్చుకొని బంధీగా చేశాడట. దీంతో బుచ్చయ్యను బతిమాలగా, కూలదోసిన ఆలయాన్ని తిరిగి కట్టివ్వాలని దెయ్యాలకు శరతు విధించాడట. మాంత్రికుడి ఆదేశంతో దిగి వచ్చిన దెయ్యాలు రాత్రికి రాత్రే దేవాలయాన్ని నిర్మించి ఇచ్చాయట. అప్పటి నుంచి దెయ్యాలు కట్టిన దేవాలయంగా ఆ ఆలయాన్ని పిలిచేవారు.
ఇక కొన్నాళ్లకు ఆ ప్రాంతంలో మంచినీళ్ల బావిని తవ్వుతుంటే పెద్ద శివలింగం బయటపడిందట. అప్పట్నుంచి ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారట. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఎవరికైనా దెయ్యాలు పట్టినా ఈ ఆలయానికి తీసుకొస్తే దెయ్యం వదులుతుంది అని స్థానికుల నమ్మకం.
Comments
Please login to add a commentAdd a comment