ప్రపంచంలో ఇప్పటివరకు వర్షం కురవని ఊరు!ఎక్కడ ఉందంటే.. | Only Village In The World Where It Never Rains See Details | Sakshi
Sakshi News home page

వర్షం ప‌డ‌ని వింత గ్రామం ఎక్కడుందో మీకు తెలుసా? మేఘాలను దగ్గర్నుంచి..

Published Fri, Dec 8 2023 11:33 AM | Last Updated on Fri, Dec 8 2023 12:49 PM

Only Village In The World Where It Never Rains See Details - Sakshi

ఈ భూమ్మీద ఒక్కో చోట ఒక్కో వాతావరణం కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఎండలు మండిపోతే, మరికొన్ని చోట్ల నెలల తరబడి వర్షం కురుస్తుంది. ఇంకొన్ని చోట్ల అయితే విపరీతంగా చలి కమ్మేస్తుంది. ఇలా ఒక్కో ప్రాంతంలో వాతవరణ పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. కానీ అసలు వర్షమే కురవని గ్రామం ఈ భూమ్మీద ఉంటుందని మీకు తెలుసా? మరి ఆ గ్రామం ఎక్కడ ఉంది? అన్నది తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.

వర్షం మానవాళి మనుగడకు ఎంతో ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏది ఎక్కువైనా, ఏది తక్కువైనా కష్టమే. కానీ ఈ ఊర్లో మాత్రం ఇప్పటివరకు అసలు వర్షం ఊసే లేదు. ప్రపంచంలో వర్షం పడని ప్రాంతం ఇదే. ఆ గ్రామం పేరు ‘అల్-హుతైబ్’. ఇది యెమెన్ రాజధాని సనాకు పశ్చిమాన ఉంది. భూ ఉపరితలానికి 3,200 మీటర్ల ఎత్తులో ఎర్రటి రాతి కొండపై ఉంది. ఈ గ్రామం ఉంది. ఇక్కడ ఉదయం సూర్యుడు ఉదయించగానే వాతావరణం వేడుక్కిపోతుంది. సాయంత్రం కాగానే విపరీతమైన చలి కమ్మేస్తుంది. ఈ ఊర్లో అసలు ఎప్పుడూ వర్షం పడకపోవడానికి కారణం.. గ్రామం మేఘాలు పేరుకుపోని ఎత్తులో ఉండడమే.

సాధారణంగా ఘాలు  భూమి నుంచి రెండు కిలోమీటర్ల  ఎత్తులో ఉంటాయి. ఈ ఊరు ఏకంగా  భూమికి మూడు కిలో మీటర్ల ఎత్తులో  ఉంటుంది. మేఘాల కన్నా ఎత్తులో ఈ గ్రామం ఉంది కాబట్టే ఇక్కడ ఎప్పుడూ వర్షం కురవదు.అందుకే ప్రపంచంలోనే ‘డ్రై సిటీ’గా దీనికి పేరుంది. ఇక్కడ  అల్‌ బోహ్రా ( అల్‌ ముఖర్మ ) తెగలకు చెందిన ప్రజలు ఎక్కువగా ఉంటారు. వీరిని యెమెన్‌ కమ్యూనిటీస్‌గా పిలుస్తారు.  మరి వర్షం లేకుండా అక్కడి ప్రజలు ఎలా బతుకున్నారు అని సందేహమా? ఇక్కడి నీటి సమస్యలు తీర్చడానికి మొబైల్​ ట్యాంకర్లతో ప్రతిరోజూ నీటిని సరఫరా చేస్తారట.

ఇంట్రెస్టింగ్‌ విషయం ఏంటంటే.. ఈ ప్రాంతానికి ఎక్కువగా టూరిస్టులు వస్తుంటారు. మేఘాల కంటే ఎత్తులో ఉండటంతో ఈ వింతైన గ్రామం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. కొండ కింది భాగంలో చిన్న చిన్న జలపాతాలు కూడా ఎంతో  ఆకట్టుకుంటాయి. చేతికి తాకే దూరంలో మేఘాలు, ఇక్కడి ప్రజల లైఫ్‌స్టైల్‌ టూరిస్టులను ఆకట్టుకుంటున్నారు. అంతేకాకుండా అల్ హుతైబ్  కొండపై ‘క్వాట్​’ అనే ఆకర్షణీయమైన మొక్కలను ఎక్కువగా పండిస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement