సాధారణంగా కవల పిల్లలంటే కొన్ని నిమిషాల తేడాతోనే, లేక గంటల వ్యవధిలోనే పుడుతుంటారు. కానీ న్యూజెర్సీలో మాత్రం గమ్మత్తైన సంఘటన చోటుచేసుకుంది. ఓ గర్భిణీకి రెండు వేర్వేరు సంవత్సరాల్లో కవలలు పుట్టారు. అదేంటి కవల పిల్లలు ఏడాది తేడాతో పుట్టడమేంటి అనుకుంటున్నారా..?అవును మీరు చదివింది నిజమే.
వివరాల ప్రకారం.. న్యూజెర్సీకి చెందిన బిల్లి హంఫ్రీ, అతని భార్య ఈవ్ ఈ ఏడాది నూతన సంవత్సరంలో కవల పిల్లలకు జన్మనిచ్చారు. నిండు గర్భిణీ అయిన ఈవ్‌కు డిసెంబర్ 31న పురుటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో కొత్త ఏడాదికి కొన్ని నిమిషాల ముందు రాత్రి 11.48 నిమిషాలకు ఓ బాబు జన్మించగా, మరుసటి రోజు 12:28 నిమిషాలకు మరో బాబు జన్మించారు. దీంతో కేవలం 40 నిమిషాల తేడాతో ఇద్దరు వేర్వేరు సంవత్సరాల్లో పుట్టినట్లయ్యింది.
ఇది తమకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందని ఈవ్ దంపతులు పేర్కొన్నారు. అయితే తన ఇద్దరు పిల్లలు పేరుకు మాత్రమే కవలలని, వారి ముఖ కవలికల్లో, దినచర్యలోనూ తేడాలు స్పష్టంగా కనిపిస్తుందని, ఇదో విచిత్ర అనుభవం అని తెలిపారు.
మొదటి బాబు ఎజ్రా 6 పౌండ్ల బరువుతో ఉంటే, అతని తమ్ముడు ఎజెకియల్ 4 పౌండ్ల బరువుతో ఉన్నాడని వివరించారు. కాగా అయితే కవలలు ఇలా కొన్ని నిమిషాల వ్యవధిలో ఒక రోజు, ఒక నెల, ఒక ఏడాది తేడాతో వేర్వేరుగా జన్మించడం ‘20 లక్షల్లో ఒక్క ఛాన్స్’ అని వైద్యులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment