స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండాలని ఎవరు కోరుకోరు? కానీ తినే తిండిపై సరైన కంట్రోల్ లేకపోతే ఈజీగా బరువు పెరుగుతారు. ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఒబెసిటీతో బాధపడుతున్నారు. ఎంత నోరు కట్టేసుకుందామనుకున్నా కళ్లముందు టేస్టీ వంటలు కనిపిస్తే తినకుండా ఉండటం కష్టమే.
అందుకే ఏమీ తినకపోయినా తిన్న ఫీలింగ్ కలిగించే ట్యాబ్లెట్స్‌ను సైంటస్టులు తయారుచేశారు. ఇది ఆకలిని తగ్గించడమే కాకుండా, బరువును అదుపులో ఉంచుతుందట. ఏంటీ ట్యాబ్లెట్? ఎప్పుడు వేసుకోవాలి? అన్న ఇంట్రెస్టింగ్ విశేషాలు మీ కోసం..
సాధారణంగా మనం కడుపునిండా భోజనం చేశాక ఇక చాలు.. అనేలా మెదడుకు సంకేతాలు వెళ్తాయి. ఇవి ఇన్సులిన్, సి-పెప్టైడ్, పైయ్, జిఎల్‌పి-1 వంటి హార్మోన్‌లను విడుదల చేస్తాయి. దీంతో కడుపునిండిన ఫీలింగ్ కలిగి తినడం మానేస్తాం. అయితే ఇదే పద్దతిని కృత్రిమంగా చేసి ఆకలిని తగ్గించొచ్చు అంటున్నారు MIT సైంటిస్టులు. అదెలా అంటే.. తిన్న తర్వాత మామూలుగానే పొట్ట కాస్త ముందుకు సాగుతుంది.
దీన్ని కృత్రిమంగా అనుభూతి పొందేలా వైబ్రేటింగ్ ఇన్‌జెస్టిబుల్ బయోఎలక్ట్రానిక్ స్టిమ్యులేటర్ (VIBES)అనే పిల్‌ను సైంటిస్టులు రూపొందించారు. తినడానికి ముందే ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం ద్వారా కడుపునిండట్లుగా వైబ్రేషన్ కలుగుతుంది. ఇది ఆర్టిఫిషియల్‌గా మెదడుకు హార్మోన్‌లను పంపిస్తుంది. ఈ ప్రయోగాన్ని తొలుత పందుల్లో ప్రయోగించారు.
ఆహారం తినడానికి 20 నిమిషాల ముందు వాటికి పిల్స్ ఇవ్వగా సాధారణం కంటే 40% తక్కువగా తిన్నాయని, బరువు కూడా నియంత్రణలో ఉన్నట్లు కనుగొన్నారు. ఇది ఒబెసిటీకి బెస్ట్ ట్రీట్‌మెంట్‌లా పనిచేస్తోందని సీనియర్ సైంటస్ట్ గియోవన్నీ ట్రావెర్సో అభిప్రాయపడ్డారు. పిల్‌లో రూపొందించిన చిన్న సిల్వర్ ఆక్సైడ్ బ్యాటరీతో నడిచే వైబ్రేటింగ్ సిస్టమ్ ద్వారా భోజనానికి ముందు, ఆ తర్వాత ఆన్, ఆఫ్ చేసుకునే వెసలుబాటు కూడా ఉందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment