weight gain and obesity
-
ఊబకాయానికి విరుగుడీ మాత్ర!
స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండాలని ఎవరు కోరుకోరు? కానీ తినే తిండిపై సరైన కంట్రోల్ లేకపోతే ఈజీగా బరువు పెరుగుతారు. ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఒబెసిటీతో బాధపడుతున్నారు. ఎంత నోరు కట్టేసుకుందామనుకున్నా కళ్లముందు టేస్టీ వంటలు కనిపిస్తే తినకుండా ఉండటం కష్టమే. అందుకే ఏమీ తినకపోయినా తిన్న ఫీలింగ్ కలిగించే ట్యాబ్లెట్స్ను సైంటస్టులు తయారుచేశారు. ఇది ఆకలిని తగ్గించడమే కాకుండా, బరువును అదుపులో ఉంచుతుందట. ఏంటీ ట్యాబ్లెట్? ఎప్పుడు వేసుకోవాలి? అన్న ఇంట్రెస్టింగ్ విశేషాలు మీ కోసం.. సాధారణంగా మనం కడుపునిండా భోజనం చేశాక ఇక చాలు.. అనేలా మెదడుకు సంకేతాలు వెళ్తాయి. ఇవి ఇన్సులిన్, సి-పెప్టైడ్, పైయ్, జిఎల్పి-1 వంటి హార్మోన్లను విడుదల చేస్తాయి. దీంతో కడుపునిండిన ఫీలింగ్ కలిగి తినడం మానేస్తాం. అయితే ఇదే పద్దతిని కృత్రిమంగా చేసి ఆకలిని తగ్గించొచ్చు అంటున్నారు MIT సైంటిస్టులు. అదెలా అంటే.. తిన్న తర్వాత మామూలుగానే పొట్ట కాస్త ముందుకు సాగుతుంది. దీన్ని కృత్రిమంగా అనుభూతి పొందేలా వైబ్రేటింగ్ ఇన్జెస్టిబుల్ బయోఎలక్ట్రానిక్ స్టిమ్యులేటర్ (VIBES)అనే పిల్‌ను సైంటిస్టులు రూపొందించారు. తినడానికి ముందే ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం ద్వారా కడుపునిండట్లుగా వైబ్రేషన్ కలుగుతుంది. ఇది ఆర్టిఫిషియల్‌గా మెదడుకు హార్మోన్లను పంపిస్తుంది. ఈ ప్రయోగాన్ని తొలుత పందుల్లో ప్రయోగించారు. ఆహారం తినడానికి 20 నిమిషాల ముందు వాటికి పిల్స్ ఇవ్వగా సాధారణం కంటే 40% తక్కువగా తిన్నాయని, బరువు కూడా నియంత్రణలో ఉన్నట్లు కనుగొన్నారు. ఇది ఒబెసిటీకి బెస్ట్ ట్రీట్మెంట్లా పనిచేస్తోందని సీనియర్ సైంటస్ట్ గియోవన్నీ ట్రావెర్సో అభిప్రాయపడ్డారు. పిల్లో రూపొందించిన చిన్న సిల్వర్ ఆక్సైడ్ బ్యాటరీతో నడిచే వైబ్రేటింగ్ సిస్టమ్ ద్వారా భోజనానికి ముందు, ఆ తర్వాత ఆన్, ఆఫ్ చేసుకునే వెసలుబాటు కూడా ఉందని వివరించారు. -
అతిగా తింటే ఈ రోగాలు తప్పవు!
టీనేజ్ పిల్లల్లో ఎక్కువగా ఈటింగ్ డిజార్డర్స్ కనిపిస్తాయి. కొందరు పిల్లలు అతిగా తినడం, కొందరేమో అసలేమీ తినకుండా ఎండుకుపోతుంటారు. టీనేజ్‌లో అడుగుపెట్టే సరికి అందం, శరీర ఆకృతిపై శ్రద్ధ పెరగడం సహజమే! కానీ ఇందుకోసం అతిగా తినడం లేదా పూర్తిగా మానుకోవడం పలు రకాల శారీరక ఇక్కట్లను తీసుకువస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల్లో ఈటింగ్ డిజార్డర్ ఉందని గుర్తించడానికి కొన్ని లక్షణాలుంటాయి. ఉన్నట్టుండి బరువు పెరగడంలేదా తగ్గడం, తమ శరీర ఆకృతి, బరువుపై ఎక్కువగా దృష్టిపెట్టడం, ఎక్కువ సార్లు అద్దంలో చూసుకోవడం, కొద్దిగా ఆహారం తీసుకోవడం లేదా పూర్తిగా తినడం మానేయడం, ఒంటరిగా కూర్చోని తినడానికి ఇష్టపడడం, ఆహారం తీసుకునేటప్పుడు సాధారణం కంటే అతిగా నమలడం, అతిగా వ్యాయామం చేయడం, భోజనం తరువాత విరేచనం సాఫీగా అయ్యే మాత్రలు తీసుకోవడం, బరువు పెరగకుండా ఉండేందుకు తిన్న తర్వాత వాంతి చేసుకోవడానికి ప్రయత్నించడం, వారికి వారే అతిగా డైటింగ్ చేయడం. ఇందులో భాగంగా పంచదార, కార్బొహైడ్రేట్స్, డెయిరీ ఉత్పత్తులకు దూరంగా ఉండడం, ఎక్కువగా మూడ్ స్వింగ్స్ కలిగి ఉండడం, శరీరంలో శక్తిలేక త్వరగా అలిసిపోవడం, ఎప్పుడూ డిమ్‌గా లేదా డల్‌గా ఉండడంవంటివి కనిపిస్తే ఈటింగ్ డిజార్డర్‌గా అనుమానించవచ్చు. ఈ లక్షణాల వల్ల క్రమంగా కడుపులో మంట, అజీర్తి, కడపు నొప్పి వంటి జీర్ణవ్యవస్థ సంబంధ సమస్యలతో సతమవ్వడం, శరీరానికి తగినన్ని పోషకాలు అందకపోవడం వల్ల చర్మం పొడిబారడం, చేతులు,పాదాల గోళ్లు పెళుసుబారడం, జుట్టురాలిపోవడం వంటివి కనిపిస్తాయి. బలవంతంగా వాంతులను ప్రేరేపించడం ద్వారా వేళ్ల జాయింట్ కీళ్లపై క్యాలస్ ఏర్పడుతుంది. తరచూ వాంతులు చేసుకోవడం వల్ల దంతాల రంగు మారిపోతుంది, స్త్రీలలో ఈటింగ్ డిజార్డర్ ఉంటే నెలనెల వచ్చే పిరియడ్స్ కూడా సక్రమంగా రావు. ఈ అసహజతలకు కారణాలు.. ► మానసిక ఒత్తిడి, తమపై తమకు నమ్మకం లేకపోవడం ► బలవంతంగా ఆహరపు అలవాట్లు మార్చుకోవడం ► హార్మోన్ల అసమతుల్యత ► వంశపారంపర్యత, జన్యువులలో అసంబద్ద ఉత్పరివర్తనాలు, ► గతంలో ఎదురైన దుర్ఘటనలు ► సమాజంలో కలవలేక పోవడం ► ఉద్యోగరిత్యా ఎదురయ్యే ఒత్తిడి వలన ఈటింగ్ డిజార్డర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ లక్షణాల్లో ఏ కొన్ని ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. భౌతికంగా లక్షణాలు కనిపించకపోతే రక్తపరీక్షల ద్వారా వైద్యులు నిర్ధారిస్తారు. మెడిటేషన్, ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లు ద్వారా ఈ సమస్యను కొంతవరకు నిరోధించవచ్చు. సాధారణంగా కనిపించే ఈటింగ్ డిజార్డర్స్ మూడు రకాలు. అవి.. అనోరెక్సియా నెర్వోసా.. ఈ వ్యాధి ఉన్న వారు తగినంతగా ఆహారం తినరు. కేలరీలను దృష్టిలో పెట్టుకుని ఆహారాన్ని పూర్తిగా తగ్గిస్తారు. ఫలితంగా బరువు తగ్గిపోతారు. దీంతో వారు చూడడానికి బక్కపలచగా కనిపిస్తారు. బులిమియా నెర్వోసా.. ఇది ప్రాణానికి హానీ కలిగించే రుగ్మత అనిచెప్పవచ్చు. ఈ పరిస్థితి ఉన్న వారు అతిగా తింటారు. తిన్నదానిని అరిగించుకోకుండా వాంతిచేసుకోవడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల కడుపులో మంట, చేతుల వెనక క్యాలస్ ఏర్పడుతుంది. బింగే ఈటింగ్ డిజార్డర్.. ఈ రుగ్మత కలిగిన వారు అతిగా తిని ఇబ్బంది పడుతుంటారు. అంతేగాక తమ ఆహారపు అలవాట్లు గురించి సిగ్గుపడుతుంటారు. -
అలా చేస్తే లావు అయిపోతారు!
లండన్ : డైటింగ్ చేసేవాళ్లు, ఆహార నియమాలను పాటించేవాళ్లు ఈ విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిదట. ఎందుకంటే.. డైటింగ్ చేసేవారు వేరే పనులు చేస్తూ ఆహారాన్ని లాగించేస్తే లావు అయిపోతారట.. ఈ విషయాన్ని చెబుతున్నది ఎవరో కాదు.. తాజాగా సర్వే నిర్వహించిన రీసెర్చర్స్. నడస్తూనో, టీవీ చూస్తూనో మనం సాధారణం కంటే కాస్త ఎక్కువగా తింటామని.. దీంతో బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఊబకాయులు అవుతారని ఇంగ్లండ్ లోని సర్రే విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జేన్ అగ్డేన్ తెలిపారు. పరిశోధనలు చేయడంతో పాటు ఒగ్డేన్ ఓ మంచి రచయిత. ఈయన తాజాగా నిర్వహించిన సర్వే విషయాలను వెల్లడించారు. స్నేహితులతో మాట్లాడుతూ, టీవీ చూస్తూనో, నడక కొనసాగిస్తూనో ఉన్నవాళ్లు మామూలు కంటే కాస్త ఎక్కువగా తినే అవకాశం ఉందన్నారు. 60 మంది మహిళలపై రీసెర్చ్ చేసి ఈ ఫలితాన్ని వెల్లడించారు. మూడు వివిధ స్థితులలో ఉన్నప్పుడు వారికి భోజనం అందించి తినమని చెప్పి ఈ మార్పులను కనుగొన్నారు. అయితే వారు స్నాక్స్, చాక్లెట్లు ఎక్కువగా తిన్నారని చెప్పారు. ఆ సమయంలో వారు తమ ఆహారంపై అంతగా ఆసక్తి చూపకుండానే ఇలా చేస్తారని, కొన్ని సెకన్ల కిందటే తీసుకున్న ఐటమ్స్ ను అప్పుడే తినే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయన్నారు ప్రొఫెసర్ ఒగ్డేన్. హెల్త్ సైకాలజీ అనే జర్నల్‌లోనూ సర్రే యూనివర్సిటీ సర్వే వెల్లడించిన విషయాలను ప్రచురించారు.