weight gain
-
ప్లాస్టిక్స్ బరువును పెంచుతాయా..?
ఇంతవరకూ ప్లాస్టిక్ బౌల్స్‌లో తినకూడదు... అందులోని ప్లాస్టిక్ ఒంట్లోకి చేరడంతో ఆరోగ్యపరంగా అనేక అనర్థాలు వస్తాయనే విషయం తెలిసిందే. కానీ ప్లాస్టిక్ బాటిళ్లలో ఉండే నోట్లోకి వెళ్లని వస్తువులతోనూ ఒంటి బరువు పెరుగుతుందనీ, దాంతో పెరిగిన బరువుతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయనీ, అందుకే ఈ ప్లాస్టిక్‌ను ‘ఒబిసోజెన్స్’ అంటారని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఉదాహరణకు... షాంపూ బాటిల్ సైతం మన బరువును పెంచేస్తుందంటున్నారు నిపుణులు. షాంపూ బాటిల్ మాత్రమే కాదు... షవర్ జెల్, హెయిర్ కండిషనింగ్లాంటి ప్లాస్టిక్ సీసాలూ, తిరిగి మాటిమాటికీ భర్తీ చేసుకోడానికి అవకాశమున్న బాటిళ్లలో ఉండే ప్లాస్టిక్ కూడా బరువును పెంచేస్తుందని నార్వేలోని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ పరిశోధనల్లో తేలింది. ఈ అధ్యయనంలో 629 రకాల వివిధ ప్లాస్టిక్ వస్తువుల్లోని దాదాపు 55,000 రకాలకు పైగా రసాయనాలను పరీక్షించారు. ప్లాస్టిక్‌లోని దాదాపు పదకొండు రకాల రసాయనాలు బరువు పెంచడానికి కారణమవుతున్నాయంటూ తెలుసుకున్నట్టు ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన అసోసియేట్ ప్రొఫెసర్ మార్టిన్ వేజ్నర్ పేర్కొన్నారు. ఆ ప్లాస్టిక్ సీసాలను వాడినప్పుడు దేహంలోకి ప్రవేశించే పదకొండు రకాల రసాయనాల కారణంగా బరువు పెరుగుతుండటంతో వాటిని ‘ఒబిసోజెన్స్’ అని వ్యవహరిస్తున్నారు. మరీ ముఖ్యంగా బైస్ఫినాల్–ఏ వంటి ‘ఒబిసోజెన్స్’ దేహంలోని జీవరసాయన ప్రక్రియల్లో పాల్గొనడంతోపాటు కొవ్వు నిండిపోయేలా ఫ్యాట్ సెల్స్ సంఖ్యను పెంచుతాయని తేలింది. దాంతో దేహం బరువు అమాంతం పెరుగుతుందని ఈ అధ్యయనంలో పాల్గొన్న మరో పరిశోధకుడు జొహన్నేస్ వోకర్ తెలిపారు. ఇప్పటివరకూ ప్లాస్టిక్ పర్యావరణానికి హానికరమని, అలాగే బైస్ఫినాల్–ఏ, థ్యాలేట్స్ వంటి ప్లాస్టిక్స్ వల్ల అనేక నరాల సంబంధిత వ్యాధులూ, వ్యాధినిరోధకతను తగ్గించే సమస్యలూ, ప్రత్యుత్పత్తి వ్యవస్థను దెబ్బతీసేలాంటి అనారోగ్యాలు కలగవచ్చని తేలింది. ఇప్పుడు అవే ప్లాస్టిక్ ఉపకరణాలూ, పరికరాలు... బరువు పెరిగేలా చేయడం ద్వారా కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని తాజా పరిశోధనల్లో విస్పష్టంగా తేలింది. ‘ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ అనే ప్రముఖ జర్నల్‌లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. (చదవండి: నెత్తురు చిందించకుండానే చక్కెర పరీక్ష..! ) -
డొనాల్డ్ ట్రంప్ బరువు తగ్గడం: ఒత్తిడి కారణంగా బరువు కోల్పోతారా..?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌పై డొనాల్డ్ ట్రంప్ ఘనవిజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. అగ్రరాజ్యం 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నా ట్రంప్ చాలా బరువు కోల్పోయినట్లుగా కనిపిస్తున్నారు. మునుపటి ట్రంప్‌లా కాకుండా చాలా స్లిమ్‌గా ఉన్నారు. ఆయన బరువు తగ్గేందుకు ఏవేవో వాడుతున్నారంటూ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కానీ అందులో ఏ మాత్రం నిజంలేదు. ఓ ఇంటర్వ్యూలో తానెందుకు బరువు తగ్గారో స్వయంగా వివరించారు ట్రంప్. ప్రస్తుతం తాను చాలా బిజీగా ఉండటం వల్లే హాయిగా తినే సమయం లేకపోయిందని అందువల్లే బరువు తగ్గినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఇలా ఆహారంపై శ్రద్ధ చూపకుండా పనిలో బిజీగా ఉంటే బరువు తగ్గిపోతామా..?. ఇలా అందరికీ సాధ్యమేనా..?.అధ్యక్ష్య ఎన్నికల కారణంగా వచ్చే ఒక విధమైన ఒత్తిడి, బిజీ షెడ్యూల్ తదితరాలు ట్రంప్ బరువు కోల్పోయేందుకు దారితీశాయి. ఇక్కడ ట్రంప్ నిరవధిక ప్రచార ర్యాలీల కారణంగా సరిగా భోజనం చేయలేకపోయానని చెప్పారు. ఓ పక్క వేళకు తిండి తిప్పలు లేకపోవడం, మరోవైపు ఎన్నికల్లో గెలుపు ఎవరిది అన్న ఆందోళన తదితరాలే ఆయన బరువు తగ్గేందుకు ప్రధాన కారణాలు. మొత్తంగా దీని ప్రభావం వల్ల ట్రంప్ దాదాపు 9 కిలోలు తగ్గిపోయారు. నిజానికి ఒత్తిడి కారణంగా బరువు పెరగాలి కానీ ట్రంప్ విషయంలో అందుకు విరుద్ధంగా ఉంది. ఇదెలా అంటే..మానిసిక ఆరోగ్య నిపుణులు బరువు తగ్గడం అనేది మనస్సు, శరీరానికి సంబంధించినదని చెబుతున్నారు. ఇక్కడ శారీరక ఆరోగ్యాన్ని ఒత్తిడి ఎలా ప్రభావితం చేస్తుంది అని చెప్పేందుకు స్వయంగా ట్రంప్ ఒక ఉదాహరణ అని అన్నారు. ఎప్పుడైనా ఒత్తిడికి లోనైతే శరీరంలో కార్డిసాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. అందుకు అనుగుణంగా శరీరం ప్రతిస్పందిస్తుంది. దీంతో రక్తప్రవాహంలో కార్టిసాల్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగి విపరీతమైన ఆకలి లేదా ఆకలి లేకపోవడం వంటి మార్పులకు లోనవుతుంది. ప్రతిఒక్కరిలో ఈ ఒత్తిడి ఒక్కో విధంగా ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. కొందరు దీని కారణంగా బరువు తగ్గొచ్చు, మరికొందరూ పెరగొచ్చు అని అన్నారు. అంతేగాదు కొందరిలో ఈ ఒత్తిడి బ్రెయిన్‌ని ఆడ్రినల్ హార్మోన్ విడుదలచేసేలా ప్రేరేపిస్తుంది. ఫలితంగా తినాలనే కోరిక ఆటోమేటిగ్గా తగ్గిపోవడం మొదలవుతుంది. అలాగే జీర్ణాశయంపై కూడా తీవ్ర ప్రభావం చూపి కేలరీలు బర్న్ అయ్యేలా చేసి బరువు కోల్పోయేందుకు దారితీస్తుంది. మరికొందరికి మాత్రం.. ఒత్తిడిలోనైతే ఇదే కార్డిసాల్ అధిక కేలరీలు కలిగిన చక్కెరతో కూడిన పదార్థాలను తినేలా ప్రేరేపిస్తుంది. దీని వల్ల చాలామందికి పొత్తికడుపు పెద్దగా లావుగా ఉండటం లేదా బానపొట్ట తదితరాలకు కారణమని చెబుతున్నారు నిపుణులు. ఇలాంటి వ్యక్తులు కనీస శారీరక శ్రమ చెయ్యనట్లయితే ఒబెసిటికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. (చదవండి: అందాల రాణి ఐశ్వర్య రాయ్ బ్యూటీ సీక్రెట్ ఇదే..!) -
గర్భవతులు మరింత బరువు పెరిగితే..?
గర్భధారణ సమయంలో కొందరు మహిళలు బరువు పెరగడం మామూలే. అది పరిమితంగానే ఉంటే పర్లేదు. కానీ మరీ ఎక్కువగా బరువు పెరిగితే కొన్ని అనర్థాలు రావచ్చు. అవి తల్లికీ, బిడ్డకూ సమస్యలు తెచ్చిపెట్టవచ్చు.గర్భవతుల్లో స్థూలకాయం అంటే... గర్భవతులు కొంత బరువు పెరగడం సాధారణమే అయినప్పటికీ... బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం... ఆ మహిళ ఎత్తుకు తగినట్లుగా ఉండాల్సిన బరువు కంటే (బీఎమ్ఐ 30 కంటే) ఎక్కువ ఉంటే దాన్ని ఒబేసిటీగా పరిగణించవచ్చు. గర్భిణుల్లో దుష్ప్రభావాలు...సాధారణ సమస్యలు: ఇతర మహిళలతో పోలిస్తే బరువు పెరుగుతున్న గర్భిణుల్లో సాధారణ ఆరోగ్య సమస్యలైన గుండెమంట, ఛాతీలో మంట, కొన్ని మామూలు ఇన్ఫెక్షన్ల వంటివి వచ్చే అవకాశాలు కాస్త ఎక్కువ. జస్టేషనల్ డయాబెటిస్: గర్భవతిగా ఉన్న టైమ్‌లో ఒంట్లో చక్కెర మోతాదులు పెరగడం వల్ల వచ్చే డయాబెటిస్‌ను ‘జెస్టేషనల్ డయాబెటిస్’ అంటారు. ఈ సమస్య వచ్చినప్పుడు కడుపులోని బిడ్డ బరువు పెరగడంతో తల్లికి ప్రసవం కష్టం కావడం. ప్రీ–ఎక్లాంప్సియా: గర్భంతో ఉన్నప్పుడు వచ్చే అధిక రక్త΄ోటు (హైబీపీ / హైపర్‌టెన్షన్)ను ‘ప్రీ–ఎక్లాంప్సియా’ అంటారు. ఒంట్లోకి చేరిన ద్రవాలు అదే స్థాయుల్లో బయటకు వెళ్లక΄ోవడం వల్ల ఒంట్లో వాపు వచ్చి ‘ప్రీ–ఎక్లాంప్సియా’తో కొన్నిసార్లు కడుపులోని చిన్నారికి రక్తప్రసరణ తగ్గడం. నొప్పులు చాలాసేపు రావడం: బరువు పెరిగిన మహిళల్లో ప్రసవం నొప్పులు చాలాసేపు వస్తూనే ఉండటం. సిజేరియన్‌కు అవకాశాలు పెరగడం: మామూలు ప్రసవానికి అవకాశాలు తగ్గడంతో కొన్నిసార్లు సిజేరియన్ తప్పక΄ోవడం. బిడ్డలకు కలిగే అనర్థాలు మ్యాక్రోసోమియా: కడుపులో బిడ్డ అనూహ్యంగా బరువు పెరగడంతో ప్రసవ మార్గం (బర్త్ కెనాల్) నుంచి తేలిగ్గా ప్రసవం కాకపోవడంతోపాటు... బర్త్కెనాల్ నుంచి బిడ్డ భుజాలు రావడం కష్టం. ఇలాంటి సందర్భాల్లో బిడ్డకు గాయాలయ్యే (షోల్డర్ డిస్టోసియా) ప్రమాదం ఎక్కువ. బిడ్డలో ఎదుగుదల / వికాసం లోపించడం: ప్రసవం తేలిగ్గా జరగకపోవడంతో ఫోర్సెప్స్ డెలివరీ వంటివి జరిగినా లేదా ప్రసవం వెంటనే జరగక బిడ్డ మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో బిడ్డ ఎదుగుదల / మెదడు వికాసంలో లోపోలు. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్: బిడ్డ వెన్నుపాము ఎదుగుదల సాధారణ స్థాయిలో జరగకపోవడం వల్ల కలిగే సమస్యను ‘న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్’ అంటారు. బిడ్డ పుట్టుకకు ముందుగా మహిళలు తగినంత ఫోలిక్ యాసిడ్ తీసుకోని సందర్భాల్లో ఫోలిక్ యాసిడ్ లోపం ప్రెగ్నెన్సీ టైమ్‌లో బరువు పెరుగుతున్న మహిళల్లోనూ ఈ ప్రమాదం ఏర్పడే అవకాశం. పిల్లల్లో స్థూలకాయం : తల్లికి స్థూలకాయం ఉంటే పిల్లల్లోనూ ఊబకాయం వచ్చి,పెద్దయ్యాక కూడా అది కొనసాగే అవకాశమెక్కువ. భవిష్యత్తులో గుండె సమస్యలు వచ్చే అవకాశాలూ ఎక్కువే. వైద్య పరీక్షలు...గర్భిణులు రొటీన్‌గా చేయించే పరీక్షలపాటు బిడ్డలో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ తెలుసుకునేందుకు గర్భధారణ తర్వాత మూడోనెలలో అల్ట్రాసౌండ్ పరీక్ష ద్వారా గుర్తించవచ్చు. (స్థూలకాయం ఉన్నవారిలో... వారి కడుపులోని కొవ్వు పోరల కారణంగా... కొన్ని సమస్యలు స్పష్టంగా తెలియకపోవచ్చు. ఈ రకంగా చూసినా గర్భిణుల్లో బరువు పెరగడం, లావెక్కడం ప్రమాద సూచికలే.) నివారణ / మేనేజ్మెంట్...👉గర్భవతిగా ఉన్నవారు మరీ ఎక్కువ బరువు పెరగకుండా జాగ్రత్త తీసుకోవడం. 👉ఆ టైమ్‌లో తీసుకోవాల్సిన మంచి సమతులాహారం, చేయాల్సిన వ్యాయామాలపై అవగాహన కలిగి ఉండటం. 👉ముందునుంచే ఎక్కువ బరువు ఉండేవారు గర్భధారణ తర్వాత అకస్మాత్తుగా బరువు తగ్గకూడదు. అలా తగ్గితే బిడ్డకు అందాల్సిన క్యాలరీలుపోషకాలు అందకపోవచ్చు. అందుకే ఆ సమయంలో పిండం ఎదుగుదలకు కావాల్సినంత ఆహారం తీసుకుంటూ ఉండాలి. బిడ్డలో తెలివితేటలు, వికాసానికి అడ్డుపడే న్యూరల్ ట్యూబ్ సమస్యల నివారణకు ప్రెగ్నెన్సీ ΄్లాన్ చేసుకున్నప్పటి నుంచే ‘ఫోలిక్ యాసిడ్’ టాబ్లెట్లు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండటం. -
బరువు పెరగాలనుకునే వారికి ఈ పూరీలు మేలు!
కొంతమంది ఆహార్యం చాలా బక్కపలచగా ఉంటుంది. ఎంత తిన్న వంటబట్టదు. చూడటానికి బలహీనంగా, అందవిహీనంగా ఉంటారు. కాస్త ఫిజిక్ ఉంటే చూడటానికి అందంగా అనిపిస్తారు. అదికూడ లేకపోతే.. పేషెంట్ మాదిరిగా ఉన్నాడ్రా బాబు అనేస్తారు. గాలి వీస్తే ఎగిరిపోయేలా ఉన్నా ఇబ్బందే!. అలాంటి వారు బరువు పెరగాలనకుంటే ఏం చేయాలంటే.. బరువు పెరగాలన్న ఆత్రుతలో ఎలా పడితే అలా తినేయ్యకూడదు. ముందు మన శరీరానికి ఏం పడతాయి, ఏవైతే బెటర్ అనేది నిర్థారించుకోవాలి. ఆ తర్వాత వాటిని క్రమబద్ధంగా ఓ నియమానుసారంగా తీసుకుంటేనే చక్కటి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా మంచి న్యూట్రిషియన్లు లేదా వైద్యులను సంప్రదించి మంచి డైట్ పాలో అవ్వాలి. ఇలా లావు అవ్వలేకపోతున్నాం అని బాధపడే వాళ్లు ఈ పూరీలు గనుకు తింటే కచ్చితంగా లావువుతారని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. ఏంటా పూరీలు..? ఎలా తయారు చేస్తారంటే..? నెయ్యితో చేసే పూరీలు.. నెయ్యితో చేసిన పూరీలు తింటే బరువు పెరగడమే గాక కండరాలు, ఎముకలు బలంగా మారతాయి. ఎలా చెయ్యాలంటే.. నెయ్యి పూరీలు తయారీకి కావాల్సిన పదార్థాలు.. గోధుమపిండి: ఒక కప్పు పాలు: 1/2 కప్పు పటికబెల్లం పొడి: సరిపడ నెయ్యి తయారీ విధానం: ముందుగా పాలలో సరైన మొత్తంలో పటికబెల్లం పొడి వేయండి. ఈ పాలతో కప్పు గోధుమ పిండిని కలిపి పూరీ పిండిలా చేయండి. దీనిని చిన్న చిన్న ఉండల్లా చేసి పూరీలు చేయండి.ఈ పూరీలను నెయ్యిలో వేసి వేయించండి. వాటిలో గనుకు ఎక్స్ట్రా నెయ్యి ఉంటే టిష్యూలు వాడండి. ఈ పూరీలను కొబ్బరిచట్నీతో తింటే ఆ టేస్టే వేరబ్బా. రుచికి రుచిగా ఉండటమే గాక ఈజీగా బరువు పెరుగుతారు. ఎలాంటి వారు తినకూడదంటే.. ఈ ఫుడ్ హెవీగా ఉంటుంది. కఫం పెరుగుతుంది. కాబట్టి, షుగర్, పీసీఓఎస్, హైపోథైరాయిడిజం, అధిక బరువు, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఈ ఫుడ్‌ని తినొద్దు. గమనిక: ఆరోగ్య నిపుణుల అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం అవగాహన కోసమే. దీన్ని ఫాలో అయ్యే ముందు వ్యక్తిగత వైద్యుల సలహాలు, సూచనల మేరకు ప్రయత్నించడం మంచిది. View this post on Instagram A post shared by Dr. Rekha Radhamony, 4th Gen Ayurveda Doctor (BAMS) (@doctorrekha) (చదవండి: కొండెక్కిన వెల్లుల్లి ధరలు చూసి భయపడొద్దు..ఈ చిట్కాలు ఫాలోకండి!) -
ఊబకాయానికి విరుగుడీ మాత్ర!
స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండాలని ఎవరు కోరుకోరు? కానీ తినే తిండిపై సరైన కంట్రోల్ లేకపోతే ఈజీగా బరువు పెరుగుతారు. ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఒబెసిటీతో బాధపడుతున్నారు. ఎంత నోరు కట్టేసుకుందామనుకున్నా కళ్లముందు టేస్టీ వంటలు కనిపిస్తే తినకుండా ఉండటం కష్టమే. అందుకే ఏమీ తినకపోయినా తిన్న ఫీలింగ్ కలిగించే ట్యాబ్లెట్స్ను సైంటస్టులు తయారుచేశారు. ఇది ఆకలిని తగ్గించడమే కాకుండా, బరువును అదుపులో ఉంచుతుందట. ఏంటీ ట్యాబ్లెట్? ఎప్పుడు వేసుకోవాలి? అన్న ఇంట్రెస్టింగ్ విశేషాలు మీ కోసం.. సాధారణంగా మనం కడుపునిండా భోజనం చేశాక ఇక చాలు.. అనేలా మెదడుకు సంకేతాలు వెళ్తాయి. ఇవి ఇన్సులిన్, సి-పెప్టైడ్, పైయ్, జిఎల్పి-1 వంటి హార్మోన్లను విడుదల చేస్తాయి. దీంతో కడుపునిండిన ఫీలింగ్ కలిగి తినడం మానేస్తాం. అయితే ఇదే పద్దతిని కృత్రిమంగా చేసి ఆకలిని తగ్గించొచ్చు అంటున్నారు MIT సైంటిస్టులు. అదెలా అంటే.. తిన్న తర్వాత మామూలుగానే పొట్ట కాస్త ముందుకు సాగుతుంది. దీన్ని కృత్రిమంగా అనుభూతి పొందేలా వైబ్రేటింగ్ ఇన్జెస్టిబుల్ బయోఎలక్ట్రానిక్ స్టిమ్యులేటర్ (VIBES)అనే పిల్‌ను సైంటిస్టులు రూపొందించారు. తినడానికి ముందే ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం ద్వారా కడుపునిండట్లుగా వైబ్రేషన్ కలుగుతుంది. ఇది ఆర్టిఫిషియల్‌గా మెదడుకు హార్మోన్లను పంపిస్తుంది. ఈ ప్రయోగాన్ని తొలుత పందుల్లో ప్రయోగించారు. ఆహారం తినడానికి 20 నిమిషాల ముందు వాటికి పిల్స్ ఇవ్వగా సాధారణం కంటే 40% తక్కువగా తిన్నాయని, బరువు కూడా నియంత్రణలో ఉన్నట్లు కనుగొన్నారు. ఇది ఒబెసిటీకి బెస్ట్ ట్రీట్మెంట్లా పనిచేస్తోందని సీనియర్ సైంటస్ట్ గియోవన్నీ ట్రావెర్సో అభిప్రాయపడ్డారు. పిల్లో రూపొందించిన చిన్న సిల్వర్ ఆక్సైడ్ బ్యాటరీతో నడిచే వైబ్రేటింగ్ సిస్టమ్ ద్వారా భోజనానికి ముందు, ఆ తర్వాత ఆన్, ఆఫ్ చేసుకునే వెసలుబాటు కూడా ఉందని వివరించారు. -
బయటపడ్డ టీడీపీ దొంగ నాటకం.. జైళ్లశాఖ డీఐజీ క్లారిటీ
సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు ఆరోగ్యం విషయంలో టీడీపీ దొంగ నాటకం బయటపడింది. బాబు బరువు తగ్గారంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు బరువు పెరిగారని ఏపీ జైళ్లశాఖ డీఐజీ రవి కిరణ్ గురువారం వెల్లడించారు. బాబు జైల్లోకి వచ్చినప్పుడు 66 కేజీలు ఉండగా.. ప్రస్తుతం 67 కేజీలకు చేరుకున్నారని తెలిపారు. చంద్రబాబు జైల్లో ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు. కాగా ఏపీ స్కిల్ డెవెలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబు గత 34 రోజులుగా రాజమండ్రి సెంట్రల్లో జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే జైలులో బాబు ఆరోగ్యాన్ని అధికారులు పట్టించుకోవడం లేదని, సరైన వైద్యం అందించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కారణాలతో బాబు 5 కిలోల బరువు తగ్గారని.. దీని వల్ల ఆయన ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలుగుతుందంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. తాజాగా చంద్రబాబు కేజీ బరువు పెరిగారంటూ జైళ్ల అధికారులు చెప్పడంతో టీడీపీ నేతల మాటలు పచ్చి అబద్ధాలుగా పటాపంచలయ్యాయి. చదవండి: తండ్రికి న్యాయం చేయాలంటూ వేడుకోలు.. లోకేష్‌కు అమిత్ ‘షా’క్ -
Anushka Shetty: బొద్దుగా మారిన అనుష్క.. కారణం ఇదేనా?
సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా చాలా మంది రాణిస్తారు. వీరిలో కొంత మంది బ్యూటీస్ మాత్రమే ప్రయోగాలు చేయటానికి ఇష్టపడతారు. వారిలో అనుష్క ఒకరు. అనుష్క అందం అభినయం కలిసిన నటి. సూపర్ సినిమాతో తెరంగ్రేటం చేసిన అనుష్క...తన అందంతోనే కాదు..అభినయంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనుష్క నటనకే కాదు..గ్లామర్ కు కూడా ప్యాన్స్ ఉన్నారు. డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు తనయుడు, కె.ప్రకాష్ దర్శకత్వంలో అనుష్క సైజ్ జీరో సినిమాలో నటించింది. సైజ్ జీరో ముందు వరకు అనుష్క చాలా స్లిమ్ గా ఉండేది. బాహుబలి, రుద్రమదేవి సినిమాల్లో నార్మల్ లుక్ లోనే కనిపించింది. సైజ్ జీరో కోసం అనుష్క చేసిన ప్రయోగం బెడిసి కొట్టింది. అనుష్క వెయిట్ కంట్రోల్ తప్పింది. ఆ సినిమా కోసం అనుష్క కావాలని విపరీతంగా బరువు పెరిగింది. రాజమౌళి వద్దని చెప్పిన వినకుండా ఆ సినిమాలో నటించింది అనుష్క. ఆ సినిమా మీద నమ్మకంతో బాగా లావుగా మారిపోయింది. అనుష్క నమ్మకం పెట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. తన యోగా పద్దతులు ద్వారా స్లిమ్ కావచ్చు అనుకున్న అనుష్క ప్రయత్నం సక్సెస్ కాలేదు. అనవసరంగా అనుష్క సైజ్ జీరో చేసిందనే కామెంట్స్ ఎక్కువైయ్యాయి.ఇక బాహుబలి 2 కోసం అనుష్క వెయిట్ లాస్ అవ్వటానికి ఎంత ట్రై చేసిన నార్మల్ లుక్ లోకి రాలేకపోయింది. దీంతో రాజమౌళి గ్రాఫిక్స్ తో ఏదో మ్యానేజ్ చేశాడు. బాహుబలి 2 తర్వాత నటించిన భాగమతి, నిశ్శబ్దం సినిమాలో అనుష్క లావుగానే కనిపించింది. నిశ్శబ్దం తర్వాత అనుష్క ఇంకో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో అందరూ అనుష్క స్లిమ్ కావటం కోసం గ్యాప్ తీసుకుందనుకున్నారు. ఇక అనుష్క కూడా అమెరికా లో వెయిట్ లాస్ అయ్యేందుకు ట్రై చేసింది. కానీ ఎలాంటి రిజల్ట్ అనుష్క కి అవి ఇవ్వలేదని..ఈ మధ్య కర్ణాటకలోని ఓ ఆలయంలో కనిపించిన అనుష్క చూస్తే అర్ధమౌతుంది. ఇక సోషల్ మీడియా లో బాగా బొద్దుగా మారిన అనుష్క వీడియో వైరల్ అయింది. అయితే అనుష్క ఇంతలా వెయిట్ పెరగడానికి కారణం థైరాయిడ్ అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.. అందులో ఎంతవరకు నిజం ఉందనేది మాత్రం అనుష్కనే తేల్చాలి. ఇక అనుష్క బొద్దుగా మారటంపై చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.అనుష్కకి సినిమాల్లో నటించే ఆలోచన లేదని..అందుకే ఫిట్ నెస్ విషయం పట్టించుకోవటం లేదంటూ డిస్కషన్ చేస్తున్నారు. ఇంకొంత మంది నెటిజన్స్ అనుష్క ఇలా లావు కనిపించటం వెనుక రీజన్ ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అనుష్క..యూవీ క్రియేషన్స్ లో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా కోసమే అనుష్క లావు అయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా రిలీజైన మిస్ శెట్టి..మిస్టర్ పొలిశెట్టి మూవీ పోస్టర్ అండ్ లిరికల్ సాంగ్ లో అనుష్క అంత బొద్దుగా కనిపించలేదు. అయితే ఈ సినిమా విషయంలో కూడా అనుష్క లావుగా కనిపించకుండా ఉండేందుకు గ్రాఫిక్స్ వాడారనే మాట టీటౌన్ లో వినిపిస్తోంది. ఇక అనుష్క ఫ్యాన్స్ మాత్రం స్వీటీ మళ్లీ నార్మల్ లుక్ లో రావాలనుకుంటున్నారు.కానీ ఫ్యాన్స్ కల నిజం అయ్యేలా లేదు. ఎందుకంటే ప్రసస్తుతం అనుష్క వయస్సు నాలుగు పదులు దాటేసింది. ఏజ్ పరంగా చూసుకున్న అనుష్క నార్మల్ లుక్ లోకి..ఫ్యాన్స్ కోరుకున్న విధంగా తయారు కావాలంటే కొంచెం కష్టమే. కానీ అనుష్క కి సినిమా అంటే చాలా ఇష్టం. అందుకే ఎంత రిస్క్ అయినా చేస్తుంది. అందుకే సైజ్ జీర్ చేసింది. ఆ సినిమా మీద ప్రేమే మళ్లీ అనుష్క ను స్లిమ్ గా మార్చేలా చేస్తుందేమో చూడాలి. -
ఇదెక్కడి చోద్యం: భార్య లావైపోయిందని విడాకులు కోరిన భర్త!
లక్నో: పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సన్నగా, నాజూగ్గా ఉండాలని కోరుకుంటారు యువకులు. కొందరు అనుకున్నట్లుగానే సన్నగా, అందంగా ఉండే అమ్మాయినే వివాహం చేసుకుంటారు. కానీ, పెళ్లయ్యాక లావెక్కితే ఏంటి పరిస్థితి అనే ఆలోచన చేయరు. ఈ కోవకే చెందిన ఓ వ్యక్తి.. పెళ్లయ్యాక తన భార్య లావైపోయిందని ఇంట్లోంచి వెళ్లగొట్టాడు. తనకు విడాకులు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ ప్రాంతంలో వెలుగు చూసింది. తాను లావైపోయాననే కారణంగా తన భర్త సల్మాన్ ఇంట్లోంచి వెళ్లగొట్టాడని తెలిపింది బాధితురాలు నజ్మా. మీరట్‌లోని జకిర్ కాలనీకి చెందిన నజ్మాకు ఎనిమిదేళ్ల క్రితం ఫతేపుర్‌కు చెందిన సల్మాన్‌తో వివాహం జరిగింది. వారికి ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. అయితే, పెళ్లి తర్వాత నజ్మా బరువు పెరిగింది. దీంతో ఆమెను రోజు లావైపోయావని, నీలా ఎవరు బతకరంటూ భర్త వేధిస్తుండేవాడు. ‘నేను బరువు పెరిగిన కారణంగా నాతో జీవించాలని అనుకోవట్లేదని నా భర్త చెప్పాడు. విడాకుల పత్రాలు పంపించాడు. కానీ, నాకు అతనితోనే జీవించాలని ఉంది. విడాకులు వద్దు.’ అని వాపోయింది నజ్మా. డైవర్స్ పేపర్స్ పంపించిన తర్వాత తనకు న్యాయం చేయాలని లిసారి గేట్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది బాధితురాలు నజ్మా. అయితే, ఈ విషయంపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని పోలీసులు తెలపటం గమనార్హం. తమకు సమాచారం అందితే.. దర్యాప్తు చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామన్నారు కొత్వాలి మీరట్ సీఐ అరవింద్ చౌరాసియా. ఇదీ చదవండి: వైఫ్ అంటే వాడుకుని వదిలేసే వస్తువు కాదు.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు -
బోయపాటి సినిమా కోసం రామ్ పోతినేని షాకింగ్ నిర్ణయం
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా కోసం హీరో రామ్ తన లుక్‌ని పూర్తిగా మార్చబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం సుమారు 11కిలోల బరువు పెరగనున్నట్లు టాక్ వినిపిస్తుంది. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు రామ్ కూడా ఈ కండిషన్‌కి వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో రెండు పాత్రల్లో వేరియేషన్స్ కోసం రామ్ కొత్తగా మేకోవర్ అవనున్నారట.కాగా అఖండ తర్వాత బోయపాటి చేస్తున్న ప్రాజెక్ట్ కావడం, అందులోనూ పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ ప్రాజెక్ట్‌గా ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాగా సెట్స్‌పైకి రానున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. -
Health Tips: గుడ్లు, బెల్లం, తేనె, అవకాడో.. పిల్లలకు వీటిని తినిపిస్తే..
Healthy Weight Gain Tips For Kids: పిల్లలు పెరిగి పెద్దవుతున్న కొద్దీ బరువు కూడా పెరుగుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు మాత్రం ఉండవలసిన దాని కన్నా తక్కువ బరువు ఉంటారు. మీ పిల్లలు బరువు తక్కువగా ఉన్నారంటే, వారు తగిన ఆహారం తీసుకోవడం లేదని, ఒకవేళ తీసుకున్నా, అది వారి వొంటికి పట్టడం లేదనీ అర్థం. తగినంత బరువు లేకపోతే పిల్లల్లో మానసిక వికాసం కూడా సరిగా ఉండదు. చదివినవి గుర్తు ఉండదు. అందువల్ల వారు తినే ఆహారం మీద దృష్టి పెట్టడం అవసరం. దాని మీద అవగాహన కోసం... జంక్‌ఫుడ్, ఫ్యాట్, షుగర్ ఎక్కువ ఉన్న ఆహారం వల్ల పిల్లలు కొంత బరువు పెరుగుతారేమో కానీ దాని వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఈ జంక్ ఫుడ్స్ పిల్లలకి కావాల్సిన పోషకాలని అందించలేవు. అందువల్ల వారు ఆరోగ్యంగా బరువు పెరిగేందుకు తోడ్పడే ఆహారాన్ని పెట్టాలి. అలాంటి వాటిలో పాలు ముఖ్యమైనవి. గుడ్లు: ఎగ్స్‌లో ప్రొటీన్ సమృద్ధిగా ఉంటుంది. పిల్లల బరువుని క్రమబద్ధీకరించడంలో గుడ్లు ఎంతో సాయం చేస్తాయి. వి గ్రోత్ మజిల్స్, శారీరక కణజాలం పెంపొందేలా చేయడంలో ఎగ్స్ పాత్ర కీలకమైనది. ఇందుకోసం బాగా ఉడికించిన గుడ్డును వారు ఇష్టపడేలా కొంచెం ఉప్పు, మిరియాలపొడి లేదా వారు తినే మరేవైనా పదార్థాల కాంబినేషన్‌తో కొంచెం కొంచెంగా మీ పిల్లలకి అలవాటు చేయండి. చికెన్: పిల్లలకి చికెన్ హై క్యాలరీ, హై ప్రొటీన్ ఫుడ్ అవుతుంది. చికెన్‌లో ఉండే ఫాస్ఫరస్ వల్ల ఎముకలు, పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. లివర్, కిడ్నీ మాత్రమే కాక కేంద్ర నాడీ వ్యవస్థ మొత్తం చికెన్ వల్ల శక్తి పుంజుకుంటుంది. బెల్లం: బెల్లంలో ఐరన్‌తో పాటూ ఎసెన్షియల్ మినరల్స్ ఉన్నాయి. చెరుకు రసం నుండి తయారయ్యే బెల్లం రిఫైండ్ షుగర్ కంటే మంచిది. మీ పిల్లలకి ఇంకొన్ని ఆరోగ్యకరమైన క్యాలరీలు అందాలంటే వారికి నచ్చిన ఆహార పదార్థాలలో ఆర్గానిక్ బెల్లాన్ని కలపండి. అయితే, బెల్లాన్ని తగిన మోతాదులోనే ఇవ్వాలని గుర్తు పెట్టుకోండి. తేనె: ఆరోగ్యంగా బరువు పెరగడానికి సాయం చేసే వాటిలో తేనె కూడా ఒకటి. తేనెలో 17% నీరు, 82% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కొవ్వు శాతం చాలా తక్కువ. టోస్ట్, శాండ్విచెస్, దిబ్బరొట్టెల వంటి వాటికి టీ స్పూన్ తేనె కలపాలి. అయితే, తేనె కూడా తగిన మోతాదులోనే తీసుకోవాలి. డ్రై ఫ్రూట్, నట్స్: జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్, ఆప్రికాట్స్ వంటి డ్రై ఫ్రూట్స్‌ని ఇష్టపడని పిల్లలు అరుదుగానే ఉంటారు. నేరుగా తీసుకుంటే అలాగే పెట్టవచ్చు. లేదంటే వీటిని స్నాక్స్‌లాగా యూజ్ చేసుకోవచ్చు. లేదా ఐస్‌క్రీమ్స్, స్మూతీల్లో కలపవచ్చు. ఆరోగ్యకరంగా బరువు పెరగడానికి అవసరమైన ఐరన్, విటమిన్స్, మెగ్నీషియం, ప్రొటీన్, హెల్దీ ఫ్యాట్స్ వంటివన్నీ డ్రై ఫ్రూట్స్, నట్స్‌లో ఉన్నాయి. ప్యాన్‌కేక్స్: ఫారిన్లో ప్యాన్‌కేక్స్ అంటారు. మన దేశంలో అయితే అట్లు అంటారు. పిల్లలు దోసెలని ఇష్టంగానే తింటారు. వీటిని బ్రేక్ ఫాస్ట్‌లా పెట్టవచ్చు లేదా స్నాక్‌గా కూడా తినిపించవచ్చు. దోసెలలో ఉండే ఇన్గ్రీడియెంట్స్ను హై క్యాలరీ ఫుడ్స్ గా పరిగణించవచ్చు. ఓట్మీల్: ఇందులో ఉండే డైటరీ ఫైబర్ పిల్లల్లో అరుగుదల బాగా జరిగేలా చూస్తుంది. ఇందులో గ్లూటెన్ కూడా ఉండదు. కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్లు, స్టార్చ్ ఉంటాయి, ఇవి పిల్లలకి ఎంతో మేలు చేస్తాయి. బీన్స్, పప్పులు: ప్రొటీన్ పుష్కలం గా లభించేది వీటిలోనే. బీన్స్‌లో ఉండే సాల్యుబుల్ ఫైబర్ బ్లడ్ షుగర్ ని క్రమబద్ధీకరించి, మూడ్ స్వింగ్స్ లేకుండా చేస్తుంది కాబట్టి పిల్లలకి వారికి నచ్చిన పద్ధతిలో బీన్స్ వండి పెట్టడం ఎంతో మేలు. అరటి పండు: మనకి సంవత్సరం పొడుగూతా దొరికే అరటి పండులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అరుగుదల సరిగ్గా జరిగేలా చేస్తాయి. ఇందులో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బీ 6 వల్ల ఆరోగ్యకరంగా బరువు పెరగడానికి పిల్లలకు అరటి పండు కూడా ఒక మంచి ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. అవకాడో: ఇందులో విటమిన్స్ సీ, ఈ, కే, బీ6, పొటాషియం, ఫ్యాట్, ఫైబర్, లుటీన్, బీటా కెరొటిన్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వలన ఓవరాల్ హెల్త్ బాగుండడానికి అవకాడో ఎంతో సాయం చేస్తుంది. అవకాడోని స్మూతీలా చేసి తీసుకోవచ్చు. మొక్కజొన్న: వీటిలో ఉండే కెరొటినాయిడ్స్ కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అంతే కాక, మొక్కజొన్న లో పిండిపదార్థాలు కూడా ఎక్కువే. మొక్కజొన్న కండె ఉడికించి పిల్లలకి పెట్టవచ్చు. చిలగడదుంప: దీనిలో ఫైబర్, విటమిన్స్ బి,సి ఐరన్, కాల్షియం, సెలీనియం వంటి మినరల్స్ ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బీటా కెరొటిన్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. బంగాళ దుంప: ఆలూని ఇష్టపడని పిల్లలు తక్కువ. కాబట్టి దీన్ని మీ పిల్లల ఆహారంలో చేర్చడం తేలికే. వీటిలో విటమిన్స్ ఏ, సీ ఇంకా ఫైబర్, కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ పిల్లలు ఆరోగ్యకరంగా బరువు పెరగడానికి సహకరిస్తాయి. ఫ్రూట్ స్మూతీ: పిల్లలకే కాదు, పండ్లు ఎవరికైనా ఎంతో మంచివి, ఎదిగే వయసులో ఉన్న పిల్లలకి మరీ మంచివి. కానీ, కొందరు పిల్లలకి పండ్లు నచ్చవు, ముఖం తిప్పుకుంటారు. అలాంటప్పుడు వీటిని స్మూతీలా చేసి ఇచ్చారనుకోండి,పేచీ పెట్టకుండా తాగేస్తారు. చివరగా... పిల్లలందరి శరీర తత్త్వం ఒకేలా ఉండదు. బరువు తక్కువ ఉన్న పిల్లలకి పెట్టడానికి ప్రొటీన్, కార్బోహైడ్రేట్స్, హెల్దీ ఫ్యాట్స్, ఇంకా ఫైబర్ ఉన్న ఫుడ్స్ ఎంచుకోవడం మేలు. అన్నింటికీ మించి వారు తిననని మారాం చేస్తుంటే బలవంతం చేసి నోటిలో కుక్కడం వల్ల బరువు పెరగరు సరికదా, అసలు తినడమంటేనే ఇష్టపడకుండా పోయే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్లు ఇష్టపడే ఆహారాన్ని లేదా ఇష్టపడే రీతిలో తినిపించడం మేలు. చదవండి: Summer Care: ఏసీ గదిలో ఎక్కువసేపు గడుపుతున్నారా.. జాగ్రత్త! -
ఆలూ తింటే వెయిట్ పెరుగుతామా?
-
సినిమా కోసం అలాంటి పని మాత్రం చేయను: రకుల్ ప్రీత్ సింగ్
Rakul Preet Singh Interesting Comments About Her Fitness: ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. హిందీ సహా ఇతర భాషల్లోనూ సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యలో మాట్లాడిన రకుల్ తన కెరీర్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సాధారణంగా పాత్ర డిమాండ్ చేస్తే దేనికైనా రెడీ అంటూ హీరోలతో సమానంగా పోటీపడుతుంటారు మన ముద్ముగుమ్మలు. అయితే తన విషయంలో ఆ ఒక్క పని మాత్రం చేయను అంటుంది రకుల్. అదేంటంటే.. సినిమా కోసం ఎంతైనా కష్టపడతాను కానీ బరువు పెరగడం, తగ్గడం లాంటివి చేయమంటే మాత్రం నా వల్ల కాదంటుంది ఈ పంజాబీ భామ. బరువు అనేది సహజమైన ప్రక్రియ. కావాలని బరువు పెరిగినా, తగ్గినా శరీరంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అది అనారోగ్య సమస్యలకి దారి తీస్తుంది. అందుకే తెలిసి తెలిసి ఆ తప్పు చేయను. నాకు నా ఫిట్నెస్ చాలా కీలకం. అయినా నా అదృష్టం కొద్దీ ఇప్పటివరకు నన్ను అలా ఎవరూ అడగలేదు అని పేర్కొంది. -
అలాంటి వాళ్లు నా ఫ్యాన్ అని మాత్రం చెప్పుకోకండి: బిగ్‌బాస్ విన్నర్
Rubina Dilaik Slams Fans Who Harass Her For Gaining Weight: స్క్రీన్‌పై కనిపించేవాళ్లు ఎప్పుడూ ఫిట్‌గానే ఉండాలనే ధోరణిలో ఉంటారు కొందరు నెటిజన్లు. ఏమాత్రం లావైనా ట్రోలింగ్ చేస్తుంటారు. హీరోయిన్స్ విషయంలో ఈ ట్రోలింగ్ మరీ ఎక్కువగా ఉంటుంది. తాజాగా హిందీ బిగ్‌బాస్14 విన్నర్, నటి రుబీనా దిలేక్కు సైతం ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇటీవలె కరోనా నుంచి కోలుకున్న ఆమె ఈ మధ్యకాలంలో బాగా బరువు పెరిగిపోయింది. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ కూడా ఎక్కువైంది. బరువు పెరగడాన్ని చాలా పెద్ద సమస్యగా చిత్రీకరిస్తే కొందరు తనపై చేస్తున్న నెగిటివ్ కామెంట్స్‌పై రుబీనా స్పందించింది. 'నా ఫ్యాన్స్, శ్రేయాభిలాషులం అని చెప్పుకునేవారికి నేను బరువు పెరగడం మిమ్మల్ని ఎంతో బాధించిందని నాకు అర్థమవుతుంది. అందుకే అసలు కనికరం లేకుండా ద్వేషాన్ని వెల్లగక్కుతూ నాకు మెసేజ్‌లు, మెయిల్స్ పంపుతున్నారు. నేను లావుగా ఉండటం, మంచి డిజైనర్ బట్టలు దరించకపోవడం, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయకపోవడం మిమ్మల్ని నిరాశ పరిచిందని నాకు తెలుసు. మీకు టాలెంట్ కంటే ఫిజికల్‌గా ఎలా ఉండటం అన్నదే ముఖ్యం. అయితే మీకో శుభవార్త. ఇది నా జీవితం. దాంట్లో ఎన్నో దశలు ఉన్నాయి. అందులో మీరు కూడా ఒకటి. నేను నా అభిమానులను గౌరవిస్తాను. కాబట్టి ప్లీజ్ ఇలాంటి వాళ్లు నా ఫ్యాన్ అని చెప్పుకోకండి' అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. View this post on Instagram A post shared by Rubina Dilaik (@rubinadilaik) -
లావు ఉండటం మైనస్సే కాదు.. బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకోండి
శరీరం పరిమాణం... ఆకృతిని బట్టి అందాన్ని కొలిచే జనరేషన్ ఇది. సన్నగా, నాజూకుగా ఉండే అమ్మాయిలనే అందగత్తెలుగా గుర్తించడం కామన్ అయింది. అలాంటిది లావుగా ఉన్నవారిని ఏ మాత్రం పట్టించుకోక పోగా, వారి మనసు గాయపడేలా కామెంట్లు చేస్తుంటారు. ప్లస్ సైజు అయితే ఏంటీ? సైజు గురించి పట్టించుకోకండి! అది అస్సలు మైనస్సే కాదు! ఒబేసిటిని బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకోండి! అంటోంది తన్వి గీతా రవిశంకర్. తన్వి లావుగా ఉన్నప్పటికీ నచ్చిన డ్రెస్‌లు వేసుకుంటూ ఫ్యాషన్‌ను ఎంజాయ్ చేస్తూ.. ఫ్యాటీ ఫ్యాషన్ వీడియోలను తన ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్లో అప్లోడ్ చేస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. డ్యాన్సర్, స్టైలిస్ట్, వాయిస్ వోవర్ ఆర్టిస్ట్ అయిన తన్వి ముంబైలో పుట్టి పెరిగింది. చిన్నప్పటినుంచి బొద్దుగా ఉండే తన్విని అందరూ బాగానే ముద్దు చేసేవారు. ఆమెకు మొదటి నుంచి డ్యాన్స్ అంటే ఆసక్తి. మిగతా విద్యార్థుల కంటే తాన్వి బాగా డ్యాన్స్ చేస్తుందని టీచర్ కూడా చెప్పేవారు. దీంతో చిన్నతనం నుంచే తన్వికి తనపై తనకు ఒక నమ్మకం ఏర్పడింది. అంతేగాక తన శరీరం భారీగా ఉన్నప్పటికీ పన్నెండేళ్ల నుంచే ఫ్యాషన్‌గా ఉండడానికి ఇష్టపడేది. మొదట్లో ఇంజినీరింగ్ చదవాలనుకుంది. కానీ డాన్స్ అంటే మక్కువతో ఫైనలియర్‌లోనే ఇంజినీరింగ్‌ను వదిలేసి, ముంబైలో డ్యాన్స్ అకాడమీలో చేరి, డాన్స్ నేర్చుకుంది. దాంతోబాటు తనకు ఫ్యాషన్ మీద కూడా ఆసక్తి ఉన్న ఉండడంతో ఫ్యాషన్ డిగ్రీ చదివింది. అయితే అక్కడా ఆమె శరీరాకృతి గురించి కామెంట్లు తప్పేవి కాదు. అయితే, అవేమీ లెక్క చేయకుండా నచి్చన డ్రెస్‌లు వేసుకుంటూ, వాటిలోనే అందంగా కనిపిస్తూ ఆత్మవిశ్వాసంతో అందరి నోళ్లు మూయించింది. శరీరాన్ని చూసి చిన్నబుచ్చుకోవద్దు..దాన్ని సెలబ్రేట్ చేసుకోండని చెబుతోన్న తన్వి మాటలు భారీకాయులెందరికో స్ఫూర్తిదాయకం. ఆ మాటలు వినకండి.. కడుపునిండా తినకండి, నెయ్యి వేసుకోవద్దు, చిప్స్ తినొద్దు. ఇలాంటి మాటలు అస్సలు వినకండి. వీటిని విన్నారంటే ఆహారాన్ని ప్రసాదంలాగా తినాల్సి వస్తుంది. మా అమ్మ తరపున వాళ్లు సన్నగా ఉంటే, నాన్న తరపు వాళ్లు బొద్దుగా ఉండేవాళ్లు. నేను వాళ్ల కమ్యూనిటీలో చేరాను. చాలామంది లావుగా ఉన్నవాళ్లను చూసి వీళ్లు అతిగా తింటారు, శరీరానికి వ్యాయామం ఉండదు. బద్దకంగా తయారవుతారు అంటారు. అది నిజం కాదు. ఇన్‌స్టా స్టైలిస్ట్‌గా స్కూలు, కాలేజీలో ఎక్కడా నేను నా శరీరాన్ని గురించి సిగ్గుపడింది లేదు. లావుగా ఉన్నానని ఫీల్ అవ్వలేదు. అందుకే ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్‌ను ఎంతో ధైర్యంగా క్రియేట్ చేసాను. ఇండియాలో దొరికే బ్రాండెడ్ డ్రెస్‌లు వేసుకుని ఇన్‌స్టాలో పోస్టు చేసేదాన్ని. జీన్స్, బికినీ, షార్ట్స్’, చీరలతోపాటు దాదాపు అన్నిరకాల డ్రెస్‌లు వేసుకుని ఫొటోలు అప్లోడ్ చేసేదాన్ని. అంతేగాక లిప్‌స్టిక్, ఐలైనర్, ఫౌండేషన్, షూస్, మ్యాచింగ్ జ్యూవెలరీ వేసుకునేదాన్ని. నా పోస్టులకు చాలా అభినందనలు వచ్చేవి. సెలబ్రేట్ చేసుకోండి! మీరు ఊబకాయం, అధిక బరువుతో ఉన్నారని ఇబ్బంది పడొద్దు. బరువు ఎక్కువగా ఉండడం వల్ల మీ శరీరంలో ఏదో లోపించిందని కాదు. సన్నగా ఉన్నవారిలాగే మీరు అన్ని చేయగలరు. ఫ్యాటీగా ఉన్నప్పటికీ ఫిట్‌గా, యాక్టివ్‌గా హెల్దీగా ఉండేందుకు ప్రయతి్నంచాలి. దీనివల్ల మిమ్మల్ని చులకన చేసి మాట్లాడే సమాజం కామెంట్ చేయడానికి ఆలోచిస్తుంది. లావుగా ఉన్న శరీరం గురించి ఫీల్ కాకుండా ప్రతిరోజూ ‘‘ఐయామ్ ఓకే, ఐయామ్ వర్త్ ఇట్’’ అని చెప్పుకుంటూ మిమ్మల్ని మీరు నమ్మండి. మీ వ్యక్తిత్వాన్ని రంగులమయం చేసుకుని డైలీ సెలబ్రేట్ చేసుకోండి. నిజంగా ఇలాంటి ప్రేరణ కలిగించే వారు ఉంటే ఎలా ఉన్నా ఆరోగ్యంగా ఉన్నామనే భావన కలుగుతుంది. -
Overhydration: నీరు ఎక్కువ తాగుతున్నారా? ఈ సమస్యలు తప్పవు మరి!
రోజుకి తగినంత నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాల గురించి ఎన్నోయేళ్లుగా చెబుతూనే ఉన్నారు. ఐతే అతి ఎప్పుడూ అనర్థమే! నీటి విషయంలో అందుకు మినహాయింపు ఏమీ లేదు. నీరు అధికంగా తీసుకున్నా ప్రమాదమేనని నిపుణులు అంటున్నారు. అవును, డీ హైడ్రెషన్ లాగానే ఓవర్ హైడ్రేషన్ కూడా ఆరోగ్యానికి హానికరమే. అనేక మంది డైట్ స్పెషలిస్ట్స్ రోజుకు మూడు లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ నీరు తాగమని సలహాలిస్తూ ఉంటారు. కానీ అది అంతమంచిపనేమీ కాదని ప్రముఖ నూట్రీషనిస్ట్ రేణు రాఖేజా ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా హెచ్చరిస్తున్నారు. ఆమె ఏం చెబుతున్నారంటే.. నీరు ఎక్కువగా తాగితే ఏమౌతుంది? శరీరంలోని ఎలక్ట్రోలైట్స్‌లో పొటాషియమ్, సోడియం, మ్యాగ్నిషియం వంటి ఖనిజాలు ఉంటాయి. నీరు అధికంగా తాగితే ఎలక్ట్రోలైట్ లెవెల్స్ పడిపోవడానికి కారణమవుతుంది. ఫలితంగా గుండె, కిడ్నీల పనితీరులపై దుష్ర్పభావాన్ని చూపుతాయి. ప్రతిరోజూ అధికమోతాదులో నీరు తాగితే మినరల్స్ నిష్పత్తిలో సమతౌల్యం దెబ్బతిని బ్రెయిన్ ఫాగ్, బరువు పెరగడం, తలనొప్పి, కండరాల బలహీణతలకు కారణమౌతుంది. రేణు రాఖేజా ఫాలోవర్స్ నీరు అదికంగా తాగడం వల్ల వారు ఎదుర్కొన్న అనుభవాలను కామెంట్ల రూపంలో వెల్లడించారు. అద్భుతం.. ఎట్టకేలకు అనుభవ పూర్వకంగా నేను నమ్మినదాన్ని ఒకరు చెప్పారు అని ఒకరు కామెంట్ చెయగా.. చాలా కాలం క్రితం నేను కూడా ఈ విధమైన అనారోగ్యం గుండా వెళ్లాను. మా డాక్టర్ నన్ను తక్కువ నీటిని తాగమని సూచించారు. అప్పట్లో రోజుకు 4 లీటర్ల నీటిని తాగాను అని మరొకరు చెప్పుకొచ్చారు. అయితే రేణు రాఖేజా సూచనలు ఏమంటే.. దాహంగా ఉంటేనే నీటిని తాగాలి. ఇతర వేళల్లో పుచ్చకాయలు, స్పైనాచ్ పండ్లు.. వంటి నీరు అధికమోతాదులో ఉండే కూరగాయిలు లేదా పండ్లు తినాలి. అలాగే కొబ్బరి నీళ్లు, టీ, కాఫీ, జ్యూస్‌లతో కూడా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవచ్చు. రోజుకు 1.5 లీటర్ల నీరు తాగితే సరిపోతుందని సూచించారు. చదవండి: వైరల్: పె..ద్ద.. ఐస్‌గోళా ఖరీదెంతో తెలుసా? -
కూల్‌డ్రింక్స్ తాగుతున్నారా..? జర జాగ్రత్త
కూల్‌డ్రింక్స్ తాగితే లావెక్కుతారని చాలా కాలంగా తెలుసు. అందుకే వాటిని జంక్‌ఫుడ్ జాబితాలో చేర్చారు. అయితే ఎందుకు అలా జరుగుతుందన్నది మాత్రం స్పష్టంగా తెలియదు. అమెరికాకు చెందిన వీల్ కార్నెల్ మెడిసన్ శాస్త్రవేత్తలు ఈ లోపాన్ని పూరించారు. కూల్‌డ్రింక్స్‌తోపాటు అనేక ఇతర ఆహార పదార్థాల్లో వాడే హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ (హెచ్‌ఎఫ్‌సీఎస్) వల్ల శరీరంలో కొవ్వు ఎక్కువగా నిల్వ అవుతోందని, ఇదే అనారోగ్య హేతువు అవుతోందని వారు నిర్వహించిన తాజా అధ్యయనం స్పష్టం చేసింది. హెచ్ఎఫ్సీఎస్లు చిన్నపేగుల్లోని కణాల్లో కొన్ని మార్పులు జరిగేందుకు కారణమవుతోందని, ఫలితంగా పోషకాలు ఎక్కువ మొత్తంలో శరీరానికి చేరి లావెక్కుతున్నారని వారు చెబుతున్నారు. చదవండి: సూపర్ కెపాసిటర్! చిన్నగా ఉందని చిన్నచూపు చూస్తే దెబ్బతింటారు ఈ రకమైన చక్కెరలను అధికంగా తీసుకుంటే ఆహారంలోని కొవ్వును ఎక్కువగా శోషించుకునే పరిస్థితి వస్తుందని వివరించారు. 2019లో పేగు కేన్సర్‌పై జరిగిన ఒక పరిశోధన ఫ్రక్టోస్ కాస్తా కేన్సర్ కణితి పెరుగుదలకు దోహదపడుతుందని తేలడంతో దాని వెనుక ఉన్న కణస్థాయి వ్యవస్థలను తెలుసుకునేందుకు తాజా పరిశోధన చేపట్టారు. ఇందులో భాగంగానే చిన్నపేగుల్లోని ఇతర కణాలపై ఫ్రక్టోస్ ప్రభావాన్ని పరిశీలించారు. చిన్నపేగుల్లో వెంట్రుకలను పోలినట్లు ఉండే కోట్లాది నిర్మాణాలైన ‘విల్లీ‘లు పోషకాలను శోషించుకునేందుకు ఉపయోగపడుతుంటాయి. ఎలుకలకు హెచ్ఎఫ్సీఎస్లు ఎక్కువగా ఇచ్చినప్పుడు ఈ విల్లీల పొడవు 40 శాతం వరకూ పెరగడమే కాకుండా.. బరువు కూడా ఎక్కువైనట్లు తేలింది. కణాల్లో ఫ్రక్టోస్–1–ఫాస్పేట్ ఎక్కువగా పేరుకుపోతుండటం వల్లే ఈ సమస్య ఉత్పన్నమవుతున్నట్లు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త శామ్యూల్ టేలర్ తెలిపారు. -
ఆ సమస్య వల్లే బరువు పెరిగాను!
‘‘కోవిడ్ తర్వాత థియేటర్స్ రీ ఓపెన్ చేసిన ఈ సమయంలో నేను హీరోయిన్గా నటించిన రెండు సినిమాలు ఒక వారం గ్యాప్‌లో విడుదలవుతున్నాయని చాలా ఆందోళనకు గురయ్యాను. ‘తిమ్మరుసు’ చిత్రాన్ని హిట్ అన్నారు. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’కి మొదట్లో కాస్త మిక్డ్స్ టాక్ వచ్చింది కానీ ఆ తర్వాత సూపర్ కలెక్షన్స్ వస్తున్నాయి. నా రెండు సినిమాలకు మంచి స్పందన రావడంతో హ్యాపీగా ఉన్నాను ’’ అని హీరోయిన్ ప్రియాంకా జవాల్కర్ అన్నారు. ఇంకా ప్రియాంక చెప్పిన విశేషాలు ఈ విధంగా... ‘‘తిమ్మరుసు’ విడుదలైన తర్వాత శరీరాకృతి గురించి సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదా? అని నా గురించి కొందరి కామెంట్స్ వినిపించాయి. సడన్‌గా నాలో ఎందుకు మార్పులు వచ్చాయో నాక్కూడా అర్థం కాలేదు. బ్లడ్ టెస్ట్ చేయిస్తే థైరాయిడ్, ఇన్సులిన్ రెసిస్టెన్సీ అన్నారు. డాక్టర్స్ సలహాలతో ఫుడ్, వ్యాయామం ఇలా అన్ని అంశాల్లో కేర్ తీసుకుంటూ బరువు తగ్గాను. నా గురించి నేను కేర్ తీసుకోకపోవడం వల్లే బరువు పెరిగాను అనేది నిజం కాదు. మనం నిజంగా కనిపిస్తున్న దాని కంటే స్క్రీన్ పై 30 శాతం ఎక్కువగా కనిపిస్తాం. ఇది చాలామందికి తెలియదు. స్క్రీన్ మీద స్లిమ్‌గా కనిపించాలంటే నిజంగా చాలా చాలా స్లిమ్‌గా ఉండాలి. బరువు తగ్గే ప్రక్రియ నాకు చాలా కష్టంగా అనిపించింది. ఫుడ్ కంట్రోల్, వర్కౌట్స్ ఇలా చాలా కష్టపడ్డాను. ప్రొటీన్ ఇంత తినాలి? ఫ్యాట్ ఇంత తినాలి? షుగర్ ఇంత అని డైట్ ప్లాన్ ఉంటుంది. ఒక దశలో షుగర్ లేని టీకి అలవాటు పడిపోయాను. ఇది కరెక్ట్ కాదని నార్మల్ షుగర్ అలవాటు చేసుకుంటున్నాను. సరైన పద్ధతులతోనే తగ్గాను. ‘టాక్సీవాలా’ తర్వాత దాదాపు పాతిక కథలు విన్నాను. తమిళంలో ఓ సినిమా కమిటయ్యాను. నేను ఓ ప్రధాన పాత్రలో నటించిన ‘గమనం’ పూర్తయింది. అందరు హీరోలు, దర్శకులతో సినిమాలు చేయాలనుకుంటున్నాను. అల్లు అర్జున్ నా క్రష్. ఓటీటీ ఆఫర్స్ వస్తున్నాయి. మంచి స్క్రిప్ట్ కోసం చూస్తున్నాను. బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కోసం ఆడిషన్స్ ఇస్తున్నాను. మంచి పాత్ర దక్కితే ఇతర భాషల్లోనూ నటిస్తాను. -
‘రక్షాబంధన్’తో అమ్మ చేతి హల్వా తినే అదృష్టం
పాత్ర కోసం అక్షయ్‌కుమార్ ఎలాంటి రిస్క్ అయినా చేస్తారు. ఎలాంటి మేకోవర్కి అయినా రెడీ అయిపోతారు. తాజాగా అక్షయ్ ‘రక్షాబంధన్’ సినిమా కోసం బరువు పెరుగుతున్నారు. ఆనంద్ ఎల్. రాయ్ ఈ సినిమాకు దర్శకుడు. ఇందులో భూమీ ఫడ్నేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం 5 కేజీల బరువు పెరిగారు అక్షయ్. బరువు పెరగడం గురించి అక్షయ్‌కుమార్ మాట్లాడుతూ – ‘‘పాత్ర కోసం బరువు తగ్గడం లేదా పెరిగే ప్రాసెస్‌ను బాగా ఎంజాయ్ చేస్తాను. ‘రక్షాబంధన్’ కోసం సహజమైన పద్ధతిలోనే 5కిలోలు పెరిగాను. ఈ బరువు పెరిగే ప్రాసెస్‌లో మా అమ్మ చేతి హల్వా తినే అదృష్టం కూడా నాకు కలిగింది’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబయ్‌లో జరుగుతోంది. ఇదిలా ఉంటే... అక్షయ్‌కుమార్ పోలీసాఫీసర్‌గా నటించిన తాజా చిత్రం ‘సూర్యవంశీ’ విడుదల కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా కోసం అప్పట్లో 5 కేజీల బరువు తగ్గిన సంగతి తెలిసిందే. -
నా బరువుకు కారణం అదే.. పుకార్లు నమ్మొద్దు
‘జెమిని’, ‘సొంతం’ సినిమాల్లో సన్నగా నాజుకు నడుముతో కుర్రాళ్లను కట్టిపేడేశారు హీరోయిన్ నమిత. అయితే ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఆమె కొంతకాలం గ్యాప్ తర్వాత ‘సింహా’, ‘బిల్లా’ మూవీల్లో మెరిసారు. అయితే ఈ మూవీస్‌లో ఆమె బోద్దుగా కనిపించడంతో రానురాను నమితకు సినిమా ఆఫర్లు తగ్గిపోయాయి. ఈ క్రమంలో 2017లో తెలుగు అబ్బాయి వీరేంద్ర చౌదరిని ఆమె వివాహం చేసుకుని సెటిల్ అయిపోయారు. కాగా ఇప్పుడు నమిత మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టారని, ఇందుకోసం ఆమె లావు తగ్గేందుకు కసరత్తులు చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆమె బరువు పెరగడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెతున్నాయి. గతంలో నమిత విపరితంగా మద్యం సేవించడం వల్లే అంత బరువు పెరిగారని నెటిజన్లు ట్రోల్ చేయడం ప్రారంభించారు. (చదవండి: భర్తతో విడాకులు..అది బ్రేకప్‌లా ఉంది : నటి) దీంతో తాజాగా నమిత తనపై వస్తున్న పుకార్లపై స్పందించారు... థైరాయిడ్, పీసీఓడీ అరోగ్య సమస్యల వల్లే అధిక బరువు పెరిగానన్నారు. అంతేగాని మద్యం సేవించడం వల్ల కాదని స్పష్టం చేశారు. తనపై వస్తున్న పుకార్లను నమ్మెద్దని కూడా ఆమె తెలిపారు. ‘ఒకప్పుడు నేను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాను. ఈ క్రమంలో జీవితాన్ని కోల్పోయాననే భావన కలిగింది. మానసిక ప్రశాంత కరువైంది. దానికి తోడు థైరాయిడ్, పీసీఓడీ సమస్యలు, వీటి వల్లే అధిక బరువు పెరిగాను. అయితే ఆ సమమంలో యోగా, ఫిజికల్ ఆక్టివిటీస్‌తో తిరిగి ప్రశాంతతను పొందగలిగాను’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం తను 90 కిలోల బరువు ఉన్నానని, అందులో దాపరికం ఏం లేదన్నారు. (చదవండి: పెళ్లికి ముందు ఆ ఒప్పందం పెట్టుకున్నాం: ప్రియాంక) -
లాక్డౌన్లో బరువు పెరిగారా? ఇలా చేయండి
లాక్డౌన్ కారణంగా దాదాపు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో యూట్యూబ్‌లో కుకింగ్ వీడియోలను చూసి ప్రొఫెషనల్ షెఫ్ అవతారమెత్తారు. వంటలన్నీ ప్రయోగాలు చేస్తూ హల్చల్ చేశారు. దీంతో ఇప్పటివరకు ఫిట్నెస్ ప్రీక్‌గా ఉన్నవారు సైతం బరువు పెరిగారు. దీంతో సహజంగానే కాస్త ఒత్తిడి పెరుగుతుంది. అయితే దీని గురించి ఏమాత్రం ఆందోళన చెందవద్దు. కేవలం కొన్ని జాగ్రత్తలు, నియమాలతో మళ్లీ ఫిట్‌గా ఉండొచ్చు. పెరిగిన బరువును తగ్గించుకోవచ్చు. దీనికి బొప్పాయి పండే పరిష్కారమంటున్నారు ఆరోగ్య నిపుణులు. మన దినచర్యలో అల్పాహారం తీసుకోవడం అతి ముఖ్యమైనది. అయితే కొందరు సమయం లేదనో, ఒకేసారి మధ్యాహ్నం తినొచ్చనో ఏవేవో కారణాలు చెప్పి బ్రేక్‌ఫాస్ట్ మిస్ చేస్తుంటారు. ఇలా తరుచూ అల్పాహారం తీసుకోకపోవడం వల్ల తొందరగా బరువు పెరుగుతారు. కాబట్టి ఫిట్‌గా ఉండాలనుకునేవారు మొదట క్రమం తప్పకుండా అల్పాహారం చేయాలి. దీని వల్ల రోజంతా ఉత్సాహంగా కూడా ఉంటుందట. (అదృష్టం అంటే నీదిరా బాబు!) ఇక బరువు తగ్గాలనుకునేవారికి ఉత్తమమైన అల్పాహారం బొప్పాయి పండు.దీనిలోని ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు లాంటి ముఖ్యమైన పోషకాలు అంది ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. శరీరానికి ఎంతో శక్తినిచ్చే బొప్పాయిని తీసుకోవడం వల్ల బరువు పెరగకుండా చేస్తుందట. ఆఫీసుకు లేట్ అవుతుందని బ్రేక్‌ఫాస్ట్‌ని మానేసేవాళ్లకి ఇదో చక్కని పరిష్కారం. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే బొప్పాయితో మంచి బ్రేక్‌ఫాస్ట్ తయారు చేయవచ్చు. ఇందులోని ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ పొట్ట నిండిన అనుభూతిని కలిగిస్తుంది. తద్వారా మధ్యాహ్న సమయం వరకు మీ ఆకలిని అరికట్టేందుకు బెస్ట్ ఛాయిస్ అంటున్నారు నిపుణులు. బొప్పాయి గుజ్జు, కప్పు పెరుగు, పావుకప్పు పాలు కలిపి మిక్సీ పట్టాలి. తర్వాత దీనికి రెండు టేబుల్ స్పూన్ల తేనెను కలిపి ప్రతీరోజూ ఉదయం అల్పాహారంలా తీసుకోవాలి. దీని వల్ల ఆరోగ్యంతో పాటు అందమూ మెరుగుపడుతుంది. సో లాక్డౌన్లో కారణంగా బరువు పెరిగిన వారికి ఇదో చక్కటి పరిష్కారమంటున్నారు వైద్య నిపుణులు. ఈ లిస్ట్‌లో మీరూ ఉంటే ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ని ట్రై చేసేయండి. (నానమ్మ పిజ్జా సూపర్‌హిట్) -
బరువు పెరుగుతున్నా!
ఈ లాక్డౌన్ సమయంలో బరువు పెరిగే పనిలో బిజీగా ఉన్నారు బాలీవుడ్ హీరోయిన్ స్వరభాస్కర్. కృష్ణ సేన్ అలియాస్ స్వీటీ సేన్ అనే ఓ అమ్మాయి అబ్బాయిగా మారి రెండుసార్లు వివాహం చేసుకుంది. ఈ విషయం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ స్వీటీ సేన్ బయోపిక్‌లో స్వరభాస్కర్ నటించనున్నారు. ఈ చిత్రం గురించి స్వరభాస్కర్ మాట్లాడుతూ – ‘‘ఈ లాక్డౌన్ సమయంలో ఫుల్‌గా తింటూ బరువు పెరుగుతున్నాను. స్వీట్స్, కార్బొహైడ్రేట్స్ ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నాను. కొన్నిసార్లు అర్ధరాత్రి జంక్ ఫుడ్ తీసుకుంటున్నాను. ఇదంతా కృష్ణ సేన్ బయోపిక్ కోసమే. ఈ లాక్డౌన్ ఎప్పుడు ముగుస్తుందో, షూటింగ్స్ తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయో ఎవరికీ కచ్చితంగా తెలియదు. లాక్డౌన్ ముగిసిన తర్వాత నా ప్రస్తుత మూవీ కమిట్మెంట్స్ని పూర్తి చేసి ఈ ఏడాది చివర్లోనే ఈ బయోపిక్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ బయోపిక్కు స్వర ఓ నిర్మాత కూడా కావడం విశేషం. -
ఈ ఫుడ్ ఏ హీరోయినూ తినదు!
సినిమాల కోసం హీరోయిన్లు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వారు ఎంచుకునే సినిమాకు తగ్గట్టుగా వాళ్లు కూడా ఫిట్నెస్ను మార్చుకుంటూ ఉంటారు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నేనొక్కడినే చిత్రంతో తెలుగులో గుర్తింపు సంపాదించుకుంది కృతి సనన్. ఆ తర్వాత బాలీవుడ్‌కు పాగా మార్చిన ఈ హీరోయిన్ పలు సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించింది. తాజాగా మరాఠీ మూవీ ‘మాలా ఐ వైచై’ ఆధారంగా తెరకెక్కుతున్న మిమి అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. ఇందులో తొలుత నర్తకిగా దర్శనమిచ్చే కృతి.. సినిమా ముగింపుకు వచ్చేసరికి సరోగసి మదర్‌గా కనిపిస్తుంది. తల్లి పాత్రలో నూటికి నూరు మార్కులు వేయించుకోవడం కోసం ముద్దుగొమ్మ బొద్దుగుమ్మగా మారేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. చెమటలు కక్కేలా జిమ్‌లు, ఎక్సర్సైజ్లు అంటూ తిరగడం మాని హాయిగా పుష్టిగా తినడం ప్రారంభించింది. ఇక ఆమె ఉదయంపూట ఏం టిఫిన్ తీసుకుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. పూరీ, శనగల కూర, వీటికి తోడుగా హల్వ. ఈ మేరకు ఆమె తీసుకున్న అల్పాహారం ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘ఆయిల్ ఫుడ్‌ను చూస్తేనే ఆమడదూరం పరుగుపెట్టే భామ.. ఇప్పుడు దాన్ని ఆవురావురుమని తింటోంది’, ‘ఈ ఫుడ్‌ను ఈవిడ తప్ప.. ఏ హీరోయినూ తినదు’ అని నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు. (కృతి సనన్.. రెండోసారి) సినిమా కోసం బాగానే కష్టపడుతోందని కొంతమంది నెటిజన్లు ఆమెపై ప్రశంసలు సైతం కురిపిస్తున్నారు. ఇక మిమి చిత్రం గురించి కృతి సనన్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో చేస్తున్న పాత్ర నా మనసుకు ఎంతగానో నచ్చింది. దీనికోసం ఏమైనా చేస్తా. బరువు పెరగడం నాకు కొత్త, 15 కిలోలు పెరగడం నాకు చాలెంజింగ్‌గా ఉంది. అయితే లావెక్కితే ఎలా ఉంటానో నన్ను నేను చూసుకోవాలని నాకూ ఆతృతగా ఉంది’ అని చెప్పుకొచ్చింది. కాగా ఈ సినిమాను జూలైలో విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. చదవండి: రూ. 200 కోట్ల క్లబ్లో ‘దర్బార్’ -
డైటింగ్ చేసినా బరువు పెరుగుతారు!
సిడ్నీ: సాధారణంగా శరీర బరువు తగ్గడానికి డైటింగ్(తినే ఆహారాన్ని తగ్గించడం) చేస్తుంటారు. అయితే, డైటింగ్ చేయడంలో సరైన పద్ధతులను పాటించకుంటే బరువు పెరిగే అవకాశం ఉందని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. డైటింగ్ చేసేవారిలో వ్యాధి నిరోధక కణాల పనితీరు తెలుసుకునేందుకు ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన పరిశోధకులు అబిగెయిల్ పొల్లాక్ పలు పరిశోధనలు నిర్వహించారు. సరైన పద్ధతిలో డైటింగ్ చేయని వారిలో సంతృప్త కొవ్వులను శరీరం అత్యధికంగా గ్రహించుకుంటుందని ఫలితంగా శరీరం బరువు పెరుగుతుందని శాస్త్రవేత్తలు వివరించారు. ముఖ్యంగా టి-లింఫోైసైట్లు కొవ్వులను ఎక్కువగా గ్రహించుకోవడమే దీనికి కారణం. ‘దీనికి కారణాలు తెలుసుకునేందుకు ఎలుకలపై అధ్యయనం నిర్వహించాం. దాదాపు 9 నెలలపాటు వీటికి సంతృప్త కొవ్వులను అందజేశాం. డైటింగ్ సమయాల్లో తేడా వస్తే కొవ్వు నిలిచిపోయి బరువు పెరగడం గమనించామ’ ని పొల్లాక్ వెల్లడించారు. -
గోళ్ల రంగు వేసుకుంటే బరువు పెరుగుతారా?
మీరు తరచు గోళ్లకు రంగులు వేసుకుంటున్నారా? ఏరోజుకు ఆరోజు వేసుకున్న డ్రస్సుకు మ్యాచ్ అయ్యేలా పాత నెయిల్ పాలిష్‌ను రిమూవ్ చేసేసి కొత్తది వేసుకోవడం అలవాటు ఉందా? అయితే.. కాస్తంత జాగ్రత్త. ఎందుకంటే తరచు గోళ్లకు రంగులు వేసుకుంటే బరువు పెరిగే ప్రమాదం ఉందని డ్యూక్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకు వాటిలో ఉండే ఓ పదార్థం కారణం అవుతుందట. ట్రైఫీనైల్ ఫాస్ఫేట్ (టీపీహెచ్‌పీ) అనే ఈ పదార్థం వల్ల గోళ్ల రంగులు ఎక్కువ కాలం మన్నుతాయి. ప్లాస్టిక్ పదార్థాలు, ఫోమ్ ఫర్నిచర్‌కు త్వరగా మంటలు అంటుకోకుండా కూడా దీన్ని వాడతారు. గతంలో గోళ్ల రంగుల్లో వేరే పదార్థాలు వాడినప్పుడు పునరుత్పాదకతకు సంబంధించిన సమస్యలు తలెత్తాయి. దాంతో.. దానికి ప్రత్యామ్నాయంగా టీపీహెచ్‌పీని వాడుతున్నారు. టీపీహెచ్‌పీ అనేది ఎండోక్రైన్ డిజ్రప్టర్ అని, అంటే హార్మోన్లపై దాని ప్రభావం ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. పశువుల మీద చేసిన పరీక్షలలో వాటికి సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలు తలెత్తాయి. అయితే మనుషులలో మాత్రం కొంతవరకు బరువు పెరుగుతున్నట్లు గుర్తించారు. పరిశోధకులు మొత్తం 3వేల రకాల గోళ్ల రంగులు సేకరించి వాటిని పరీక్షించగా వాటిలో 49 శాతం వాటిలో ఈ పదార్థం ఉంది. కొంతమందైతే అసలు అది ఉన్నట్లు చెప్పకుండానే కలిపేస్తున్నారు. గోళ్ల రంగు వేసుకున్న 10-14 గంటల తర్వాత వాళ్ల శరీరంలోని టీపీహెచ్‌పీ మోతాదు దాదాపు ఏడు రెట్లు పెరిగింది. అయితే కృత్రిమ గోళ్లు పెట్టుకుని, వాటికి మాత్రమే రంగులు వేసుకున్నవాళ్లకు మాత్రం అలా పెరగలేదు. అందువల్ల తరచు గోళ్లరంగులు వేసుకోవడం అంత మంచిది కాదని, దానివల్ల శరీరంలో పలు రకాల మార్పులు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. మరీ తప్పనిసరైతే చర్మానికి తగలకుండా చూసుకోవాలని, అలా తగిలితే అది రక్తంలోకి కూడా వెళ్తుందని అంటున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త! -
ఒబేసిటీ, షుగర్‌పై పోరాడే కొత్త హార్మోన్!
మీరు ఊబకాయంతో బాధపడుతున్నారా? వ్యాయామం చేయాలంటే బద్దకమా? అయితే మీకో శుభవార్త! అధిక బరువును నియంత్రించే హార్మోన్ తొందర్లో మన ముందుకు రాబోతోంది. అవును .. న్యూయార్క్ శాస్త్రవేత్తలు ఈ హార్మోన్ ను కనిపెట్టారు. దీనికి "MOTS-c" అని పేరు కూడా పెట్టారు. అంతేకాదు ఈ హార్మోన్ సహాయంతో వృద్ధాప్యంలో వచ్చే ఇన్సులిన్ సమస్యల్ని కూడా కట్టడి చేయొచ్చని తమ పరిశోధనలో తేలిందిని వారు చెబుతున్నారు. పెద్ద వయసులో వచ్చే వ్యాధుల నియంత్రణలో ఇదొక మంచి పరిణామమని సదరన్ కాలిఫోర్నియా యూనివర్శిటీ కి చెందిన పించాస్ కోచెన్, జెరెంటాలజీ నిపుణుడు డేవిడ్ లియోనార్డ్ చెబుతున్నారు. ఎలుకలపై దీన్ని పరిశోధించి చూసినపుడు మంచి ఫలితాలు కనిపించాయని వారు ప్రకటించారు.