బయటపడ్డ టీడీపీ దొంగ నాటకం.. జైళ్లశాఖ డీఐజీ క్లారిటీ | AP Prisons Department DIG Clarity On Chandrababu Health And Weight | Sakshi
Sakshi News home page

బయటపడ్డ టీడీపీ దొంగ నాటకం.. జైళ్లశాఖ డీఐజీ క్లారిటీ

Published Fri, Oct 13 2023 1:54 PM | Last Updated on Fri, Oct 13 2023 2:51 PM

AP Prisons Department DIG Clarity On Chandrababu Health And Weight - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు ఆరోగ్యం విషయంలో టీడీపీ దొంగ నాటకం బయటపడింది. బాబు బరువు తగ్గారంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు బరువు పెరిగారని ఏపీ జైళ్లశాఖ డీఐజీ రవి కిరణ్‌ గురువారం వెల్లడించారు. బాబు జైల్లోకి వచ్చినప్పుడు 66 కేజీలు ఉండగా.. ప్రస్తుతం 67 కేజీలకు చేరుకున్నారని తెలిపారు. చంద్రబాబు జైల్లో ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు.

కాగా ఏపీ స్కిల్‌ డెవెలప్‌మెంట్‌ స్కాంలో అరెస్ట్‌ అయిన చంద్రబాబు గత 34 రోజులుగా రాజమండ్రి సెంట్రల్‌లో జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే జైలులో బాబు ఆరోగ్యాన్ని అధికారులు పట్టించుకోవడం లేదని, సరైన వైద్యం అందించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ కారణాలతో బాబు 5 కిలోల బరువు తగ్గారని.. దీని వల్ల ఆయన ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలుగుతుందంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. తాజాగా చంద్రబాబు కేజీ బరువు పెరిగారంటూ జైళ్ల అధికారులు చెప్పడంతో టీడీపీ నేతల మాటలు పచ్చి అబద్ధాలుగా పటాపంచలయ్యాయి.
చదవండి: తండ్రికి న్యాయం చేయాలంటూ వేడుకోలు.. లోకేష్‌కు అమిత్‌ ‘షా’క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement