
సాక్షి,తూర్పుగోదావరి జిల్లా: గ్రూప్-2 అభ్యర్థులను సీఎం చంద్రబాబు దారుణంగా మోసం చేశారని మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శించారు. ఈ విషయమై హర్షకుమార్ మంగళవారం(ఫిబ్రవరి 25) మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు ఫోన్ రికార్డింగ్ ఆడియో రిలీజ్ చేసి గ్రూప్-2 పరీక్ష విషయంలో డ్రామా ఆడారు.
పవన్ కళ్యాణ్, బాలకృష్ణ కంటే సీఎం చంద్రబాబు గొప్ప నటులు. ఎల్లుండి జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రూప్- 2 అభ్యర్థులు ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారు. గవర్నర్ ప్రసంగంలో ఎన్నికల హామీల గురించి ఎందుకు ప్రస్తావించలేదు.
వైఎస్సార్‌సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా అనేది ప్రభుత్వం నిర్ణయం. ఢిల్లీలో గతంలో మూడు సీట్లు వచ్చినా ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ప్రభుత్వం వైఎస్ జగన్‌ను చూసి భయపడుతోంది. అందుకే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు’అని హర్షకుమార్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment