రాజధాని కేసుల్లో..బాబుకు జైలే.. | Amaravati Assigned Lands Case: CID files Chargesheet against Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

రాజధాని కేసుల్లో..బాబుకు జైలే..

Published Sat, Apr 20 2024 1:11 AM | Last Updated on Sat, Apr 20 2024 1:11 AM

Amaravati Assigned Lands Case: CID files Chargesheet against Chandrababu Naidu - Sakshi

స్టేల బాబు శేషజీవితం చెరసాల్లోనే అంటున్న న్యాయనిపుణులు 

చుట్టుముట్టిన స్కిల్, అసైన్డ్‌ భూములు, ఐఆర్‌ఆర్‌ స్కాంలు 

పూర్తి ఆధారాలతో చార్జ్ షీట్లు దాఖలు చేసిన సీఐడీ 

చంద్రబాబుకు 17ఏ కింద రక్షణ లభించదని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

సెక్షన్‌ 409 కింద ఒక్కో కేసులో యావజ్జీవ ఖైదుకు అవకాశం 

అవినీతి నిరోధక చట్టం కింద ఒక్కో కేసులో గరిష్టంగా పదేళ్ల జైలు 

కాస్త జాప్యమయినా కఠిన శిక్ష మాత్రం ఖాయం: న్యాయ కోవిదులు

సాక్షి, అమరావతి: చట్టాల్ని ఏమార్చి పదుల కేసుల్లో స్టేలు తెచ్చుకొని.. సచ్చిలుడని విర్రవీగిన చంద్రబాబు అవినీతి పుట్ట పగిలింది. మేకవన్నె పులికి మారుపేరైన ఆయన అసలు రూపం కోర్టుల సాక్షిగా సాక్షాత్కారమైంది. ఎంతో నేర్పుగా చేసిన స్కిల్‌ స్కామ్‌.. అమరావతి అసైన్డ్‌ భూ దోపిడీ.. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కుంభకోణం.. ఇలా అవినీతి దందాలతో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు. అవినీతి చేశాను.. అయితే నాకు చట్టాలు వర్తించవనే జిత్తులమారి తెలివితేటలతో సెక్షన్‌ 17–ఏను అడ్డం పెట్టుకొని తప్పించుకుందామన్న పన్నాగం బెడిసికొట్టింది.  చంద్రబాబుపై కేసుల్లో నేరం నిరూపితమైతే రాజధాని కుంభకోణం కేసుల్లో యావజ్జీవ ఖైదు తప్పదని న్యాయ నిపుణులు అంటున్నారు. 

ఒక్కో కేసులో భారీ అవినీతి 
స్కిల్‌ స్కామ్‌: జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీ పేరిట ఆ కంపెనీకే తెలియకుండా ప్రాజెక్ట్‌ను సృష్టించి స్కిల్‌ స్కామ్‌కు పాల్పడ్డారు. ఈ కేసులోనే చంద్రబాబును సీఐడీ అరెస్ట్‌ చేయడంతోపాటు న్యాయస్థానం రిమాండ్‌ విధించగా.. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో 52 రోజలపాటు ఆయన రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.  

అసైన్డ్‌ భూదోపిడీ:అమరావతిలో ఏకంగా రూ.5 వేల కోట్ల భూదోపిడీకి పాల్పడ్డారు.  

ఇన్నర్‌ రింగ్‌రోడ్డు స్కామ్‌: అలైన్‌మెంట్‌లో అక్రమాల ద్వారా క్విడ్‌ ప్రోకోతో రూ.2,500 కోట్ల మేర అవినీతి.. అందుకోసం కేబినెట్‌ ఆమోదం లేకుండానే జీవోలు జారీ. నోట్‌ ఫైళ్లపై స్వయంగా చంద్రబాబే సంతకాలు చేసి అక్రమాల కథ నడిపించారు. అనంతరం నోట్‌ ఫైళ్లను గల్లంతు చేశారు. సీఐడీ ఆ అవినీతిని వెలికి తీయడంతో అతని బాగోతం బట్టబయలైంది. ఈ కుంభకోణాలన్నిటికీ సూత్రధారి చంద్రబాబే అని కీలక సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. 164 సీఆర్‌పీసీ కింద న్యాయస్థానంలో వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ కుంభకోణాల్లో చంద్రబాబు ప్రధాన కుట్రదారు, ప్రధాన లబ్ధిదారుడిగా ఉన్నారని డాక్యుమెంటరీ ఆధారాలు, కీలక సాక్షుల వాంగ్మూలాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కేసుల నుంచి చంద్రబాబు తప్పించుకోవడం ఇక అసాధ్యమని న్యాయ నిపుణుల అభిప్రాయం. 

కేబినెట్‌కు తెలియకుండా చీకటి జీవోలు
చంద్రబాబు అవినీతి విశ్వరూపాన్ని ఛేదించడం అంత తేలిక కాదు. కొన్ని సార్లు తప్పించుకోవచ్చు.. అన్నిసార్లూ తప్పించుకోలేరు.. చివరకు పక్కా ఆధారాలతో దొంగ దొరికాడు.   ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సర్వం తానై కుంభకోణాలకు పాల్పడ్డారు. 2014 నుంచి 2019 వరకు బరితెగించి సాగించిన అన్ని కుంభకోణాల్లోనూ కర్త, కర్మ, క్రియ చంద్రబాబేనని సీఐడీ పూర్తి ఆధారాలతో నిగ్గు తేలి్చంది. కేబినెట్‌కు తెలియకుండా చీకటి జీవోలు జారీ చేసి ఏకపక్షంగా టెండర్లు కట్టబెట్టేశారు. ప్రభుత్వ నిధులు అస్మదీయులకు మళ్లించి.. షెల్‌ కంపెనీల ద్వారా అక్రమంగా ఆ డబ్బును విదేశాలకు తరలించారు. అవి హవాలా మార్గంలో తన బంగ్లాకే చేరేలా పక్కా వ్యూహం అమలుచేశారు.  

చంద్రబాబుకు 17ఏ వర్తించదు: సుప్రీంకోర్టు
స్కిల్‌ స్కామ్‌లో సీఐడీ దర్యాప్తు చేసి చంద్రబాబును అరెస్ట్‌ చేశాక విజయవాడ ఏసీబీ న్యాయ స్థానంలో హాజరుపర్చింది. దాదాపు 10 గంటలు ఇరుపక్షాల వాదనల అనంతరం ఆయనకు న్యాయమూర్తిజ్యుడిíÙయల్‌ రిమాండ్‌ విధించారు. సీఐడీ అభియోగాలు, అందులో పేర్కొన్న సెక్షన్లతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ ఈ నిర్ణయం ప్రకటించారు. చంద్రబాబు 52 రోజులపాటు రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. అనంతరం అనారోగ్య కారణాలతో బెయిల్‌ మంజూరైంది. సెక్షన్‌ 17–ఏను వక్రీకరిస్తూ కేసుల నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 17–ఏ వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

సర్వం తానై.. 
కుట్రదారు, లబ్ధిదారుగా సర్వం తానై చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని సీఐడీ ఆధారాలతో నిగ్గు తేల్చింది. సిŠక్ల్, అసైన్డ్‌ భూములు, ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ కుంభకోణాల్లో చంద్రబాబును ఏ1గా చేరుస్తూ కేసు నమోదు చేయడంతోపాటు న్యాయస్థానాల్లో చార్జిïÙట్లు దాఖలు చేసింది. ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఎ), 409, 201, 109 రెడ్‌విత్‌ 34, 37తోపాటు అవినీతి నిరోధక చట్టం 13(2) రెడ్‌విత్‌ 13(1), (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేసింది. ఇప్పటికే చంద్రబాబుకు 74 ఏళ్లు. నేరం నిరూపితమై శిక్షలు పడితే యావజ్జీవం తప్పదు.

ఇన్నర్‌ రింగ్‌ రోడ్, అసైన్డ్‌ భూముల కేసుల్లో లోకేశ్‌ నిందితుడిగా ఉన్నారు. నారాయణతోపాటు టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారు ఈ కేసుల్లో ఉన్నారు. వారంతా శిక్ష అనుభవించాల్సిందేనని న్యాయ నిపుణులు అంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉంటూ అవినీతికి పాల్పడిన కేసుల్లో హరియాణా మాజీ సీఎం ఓం ప్రకాశ్‌ చౌతాలాకు 16 ఏళ్ల తర్వాత జైలు శిక్ష పడింది. తాజాగా తమిళనాడులో మంత్రిగా చేసిన సెంథిల్‌ బాలాజీ, మద్యం కేసుల్లో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాకు ఇప్పటికీ బెయిల్‌ రాకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు.  

వేర్వేరుగా శిక్షలు అనుభవించాల్సిందే 
అత్యంత కీలకమైన సెక్షన్‌ 409 కింద నేరం నిరూపితమైతే యావజ్జీవం విధిస్తారు. అవినీతి నిరోధక చట్టంలోని 13(2) రెడ్‌విత్‌ 13(1), (సి), (డి) కింద నేరం నిరూపితమైతే గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష.. ఒక్కో కేసులో గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. ఇతర సెక్షన్ల కేసుల్లో తీర్పులు వేర్వేరుగా వస్తాయి. నేరం నిరూపితమై శిక్ష పడితే చంద్రబాబు వేర్వేరుగా శిక్షలు అనుభవించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement