CID Department
-
సీఐడీకి హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసు..
సాక్షి, హైదరాబాద్: కిడ్నీ రాకెట్ కేసును తెలంగాణ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలన్నారు. కేసు పూర్వపరాలను సమీక్షించిన మంత్రి.. తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రభుత్వాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు.హైదరాబాద్‌లోని అలకనంద ఆసుపత్రిలో జరిగిన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ వ్యవహారంపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం తన నివాసంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. డాక్టర్ల కమిటీ ఇచ్చిన ప్రిలిమినరీ రిపోర్ట్‌ను మంత్రి పరిశీలించారు. అలకనంద హాస్పిటల్లో ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలకు ఎటువంటి అనుమతి లేదని, నిబంధనలకు విరుద్ధంగా సర్జరీలు జరిగాయని అధికారులు మంత్రికి వివరించారు.మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు ఈ అక్రమ వ్యవహారంతో సంబంధం ఉందన్నారు. అమాయకులు, అత్యంత నిరుపేదల ఆర్థిక దుస్థితిని ఆసరాగా తీసుకుని, వారిని మభ్యపెట్టి కిడ్నీల డొనేషన్‌కు ఒప్పిస్తున్నారన్నారు. అలకనంద హాస్పిటల్లో తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళల నుంచి కిడ్నీలు తీసుకుని, కర్ణాటకకు చెందిన వారికి అమర్చారని అధికారులు తెలిపారు. అలకనంద ఆసుపత్రిని సీజ్ చేశామని, ఆసుపత్రి ఓనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని మంత్రికి తెలిపారు. ఈ కేసులో లోతైన విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను సహించేది లేదన్నారు. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా పరిగణిస్తున్నామని తెలిపారు. కేసుతో సంబంధం ఉన్నవాళ్లందరిని కఠినంగా శిక్షించాలని, ఇందుకు అవసరమైన అన్ని ఆధారాలను సేకరించాలన్నారు. పూర్తిస్థాయి విచారణ కోసం కేసును సీఐడీకి అప్పగించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలని హెల్త్ సెక్రటరీకి మంత్రి సూచించారు.ఇదీ చదవండి: మీర్పేట్ హత్య కేసులో సంచలన విషయాలు.. రెండు ఎవిడెన్స్ లభ్యం?కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ వ్యవహారం గురించి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. గతంలో ఇలాంటి కేసు కేరళలో నమోదైన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. గతంలో జరిగిన వ్యవహారాలకు, ప్రస్తుత కేసుకు ఏమైనా సంబంధం ఉందా? అనే దానిపై ఆరా తీయాలన్నారు. ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అక్రమాలలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల పాత్ర ఉన్నట్టు గతంలో వచ్చిన ఆరోపణలను గుర్తు చేసిన మంత్రి, ఆ దిశగా కూడా ఎంక్వైరీ జరిపించాలని ఆదేశించారు.ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రిల్లో జరుగుతున్న శస్త్ర చికిత్సలపై నిఘా ఉంచాలన్నారు. గర్భిణుల వివరాలను నమోదు చేస్తున్నట్టుగానే, ఇతర సర్జరీలకు సంబంధించిన వివరాలను నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చేటప్పుడు, రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసేటప్పుడు అన్ని వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించాలని సూచించారు. అనుమతుల జారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో జరుగుతున్న ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్లపై ఆడిట్ నిర్వహించాలని గతంలో మంత్రి ఆదేశాలు జారీ చేశారు. -
కేసుల మాఫీకి బాబు కుట్రలు
-
బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
-
చంద్రబాబే సుప్రీం.. రెడ్బుక్కే రాజ్యాంగం!
సాక్షి, అమరావతి: భారత రాజ్యాంగమే ప్రామాణికం.. సుప్రీంకోర్టు తీర్పులే మార్గ నిర్దేశం.. అన్నది దేశంలో పరిపాలన వ్యవస్థకు దిక్సూచి. పాలకులు, అఖిల భారత సర్వీసు అధికారులతోపాటు అందరూ పాటించాల్సిన విధివిధానాలవి. కానీ రాష్ట్ర సీఐడీ విభాగం అందుకు పూర్తి విరుద్ధంగా బరితెగిస్తోంది. ‘చంద్రబాబే మాకు సుప్రీం.. టీడీపీ రెడ్బుక్కే మాకు రాజ్యాంగం.. చంద్రబాబు అవినీతి కేసులు నీరుగార్చడమే ఏకైక లక్ష్యం’ అని చెలరేగిపోతోంది. అందుకోసం ఏకంగా న్యాయస్థానాల్లో సీఆర్పీసీ 164 కింద నమోదు చేసిన వాంగ్మూలం పవిత్రత, ప్రమాణికతనే దెబ్బ తీసేలా కుట్రలకు పదును పెడుతోంది. ఓసారి సీఆర్పీసీ 164 కింద ఇచ్చిన వాంగ్మూలాన్ని మార్చేందుకు వీల్లేదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను బరితెగించి మరీ ఉల్లంఘిస్తోంది. చంద్రబాబు సూత్రధారి, పాత్రధారిగా సాగిన కుంభకోణాల గురించి గతంలో పలువురు ఐఏఎస్ అధికారులు న్యాయస్థానంలో ఇచ్చిన వాంగ్మూలాలకు భిన్నంగా తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయించేందుకు సీఐడీ సన్నాహాలు వేగవంతం చేస్తోంది. డీజీపీ పోస్టు ఇస్తానని ముఖ్య నేత ఎర వేయగానే సుప్రీంకోర్టు మార్గరద్శకాలను కూడా తోసిరాజంటూ సీఐడీ ఉన్నతాధికారి చెలరేగిపోతుండటం విస్మయ పరుస్తోంది. ఈ వ్యవహారం యావత్ దేశాన్ని విస్మయానికి గురి చేస్తోంది.కుంభకోణాల కుట్రదారు చంద్రబాబే..2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అక్రమాల కుంభకోణం, ఫైబర్‌నెట్ కుంభకోణం, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం, మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం.. ఇలా వివిధ కుంభకోణాలతో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. వాటిపై సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కేసు నమోదు చేసి పూర్తి ఆధారాలతోసహా ఆ భారీ దోపిడీని బట్టబయలు చేసింది. ఆ వ్యవహారాల్లో కీలక పాత్రధారులగా ఉన్న ఐఏఎస్ అధికారులను విచారించింది. నిబంధనలకు విరద్ధమని తాము అభ్యంతరం తెలిపినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదని వారు చెప్పారు. చంద్రబాబు ఒత్తిడితోనే నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూముల బదలాయింపు, ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్లో మార్పులు, కాంట్రాక్టుల కేటాయింపు, నిధుల విడుదల.. ఇలా అన్ని వ్యవహారాలు సాగాయని వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వంలో సీఆర్డీఏ కమిషనర్‌గా వ్యవహరించిన చెరుకూరి శ్రీధర్, ఫైబర్‌నెట్ ఎండీగా వ్యవహరించిన అజయ్ జైన్, గుంటూరు కలెక్టర్‌గా చేసిన కాంతిలాల్ దండే తదితరులు ఆ వాస్తవాలను ‘సిట్’కు తెలిపారు. అంతే కాకుండా ఆ విషయాలను న్యాయస్థానంలోనూ వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఆర్పీసీ 164 కింద వారు ఇచ్చిన వాంగ్మూలాలను న్యాయస్థానం నమోదు చేసింది. అందుకే ఆ కేసుల్లో చంద్రబాబును ప్రధాన నిందితుడు(ఏ1)గా పేర్కొంటూ సిట్ కేసులు నమోదు చేసింది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్ట్ చేయగా, ఆయన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.తప్పుడు వాంగ్మూలాల నమోదుకు ప్రభుత్వ కుట్రగత ఏడాది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు అవినీతి కేసులను నీరుగార్చేందుకు కుట్రకు తెరతీసింది. అందుకోసం డీజీపీ, సీఐడీ అధికారులు ఆ కేసుల దర్యాప్తు వివరాలను చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అంటే ప్రధాన నిందితుడే ఆ కేసులను సమీక్షించారు. ఆ కేసులను ఎలా నీరుగార్చాలనే కుట్రకు అప్పుడే బీజం పడింది. అనంతరం చంద్రబాబు తరఫున గతంలో వాదించిన ఢిల్లీ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా రంగ ప్రవేశం చేశారు. డీజీపీ, సీఐడీ అధికారులతో సమావేశమై చంద్రబాబుపై కేసులను నీరుగార్చే కుట్రకు కార్యాచరణ రూపొందించారు. గతంలో చంద్రబాబే కుట్రదారు.. కుంభకోణాలకు ఆయనే సూత్రధారి.. అని న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన వారితో తాజాగా తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించాలని పన్నాగం పన్నారు. ఆ బాధ్యతను సీఐడీకి అప్పగించారు. గతంలో సిట్‌లో సభ్యులుగా ఉన్న కింది స్థాయి అధికారులను డీజీపీ, సీఐడీ చీఫ్ పిలిపించుకుని మరీ తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేసే ప్రక్రియను వివరించారు. బాధిత రైతులు, సాధారణ సాక్షులను కింది స్థాయి అధికారులు బెదిరిస్తుండగా, ఐఏఎస్ అధికారులతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించే బాధ్యతను సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ భుజానికెత్తుకున్నారు.బెదిరించి.. భయపెట్టి..కుట్రలో భాగంగా ఐఏఎస్ అధికారులు చెరుకూరి శ్రీధర్, అజయ్ జైన్‌లతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించేందుకు సీఐడీ బరితెగించింది. గతంలో న్యాయస్థానంలో 164 సీఆర్పీసీ కింద తాము ఇచ్చిన వాంగ్మూలానికి విరద్ధుంగా వాంగ్మూలం ఇవ్వాలని వారిపై సీఐడి తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చింది. బెదిరింపులకు పాల్పడింది. తప్పుడు వాంగ్మూలం ఇవ్వకపోతే సంగతి తేలుస్తామని హెచ్చరించింది. గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా తప్పుడు వాంగ్మూలం ఇవ్వడం సాధ్యం కాదని, అది నేరమని కూడా ఆ అధికారులు, న్యాయ నిపుణులు చెప్పినా సరే సీఐడీ చీఫ్ రవి శంకర్ అయ్యన్నార్ ఏమాత్రం వినిపించుకోలేదని సమాచారం. ఇలా సీఐడీ సామ, దాన, బేధ, దండోపాయాలను ప్రయోగించి చెరుకూరి శ్రీధర్, అజయ్ జైన్లను బెంబేలెత్తించారు. దాంతో వారు తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చేందుకు సమ్మతించినట్టుగా సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. వారిద్దరితో గుంటూరులోని న్యాయస్థానంలో శుక్రవారం తప్పుడు వాంగ్మూలం నమోదు చేయించేందుకు సీఐడీ అధికారులు తీసుకువచ్చేందుకు సిద్ధపడ్డారు. అయితే న్యాయాధికారి సెలవులో ఉండటంతో ఆ ప్రయత్నాన్ని శనివారానికి వాయిదా వేశారు. తీరా శనివారం చెరుకూరి శ్రీధర్ ఒక్కరినే తీసుకెళ్లారు. కోర్టు బయట కొద్ది సేపు హైడ్రామా నడిచింది. ఆ తర్వాత కోర్టు హాలు లోపలికి వెళ్లకుండానే శ్రీధర్ వెనుదిరిగారు. మళ్లీ ఈ నెల 8వ తేదీన ఆయన్ను న్యాయస్థానానికి తీసుకొచ్చి వాంగ్మూలం నమోదు చేయించాలని సీఐడీ నిర్ణయించినట్లు తెలిసింది.నాడు గూండాల బెదిరింపులు.. నేడు సర్కారు వేధింపులు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజధానిలో అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణాల గురించి న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చిన ఐఏఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్.. తనను ఆ కేసుల్లో సాక్షిగా పరిగణించాలని కోరారు. దాంతో ఆయన అంతు చూస్తామని టీడీపీ గూండాలు బెదిరించారు. తీవ్ర ఆందోళన చెందిన ఆయన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శికి ఫిర్యాదు చేశారు. టీడీపీ గూండాల నుంచి తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా పోలీసు శాఖను కోరారు. దాంతో ఆయనకు పోలీసు శాఖ ప్రత్యేకంగా గన్‌మెన్‌ను కేటాయించింది. అప్పటి నుంచి ఆయనకు గన్‌మెన్ భద్రత కొనసాగుతోంది. అప్పట్లో టీడీపీ గుండాలు బెదిరింపులకు పాల్పడగా, ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వమే అధికారికంగా ఆయన్ను బెదిరిస్తోంది. తప్పుడు వాంగ్మూలం ఇవ్వకపోతే అంతు తేలుస్తామని సీఐడీ ద్వారా వేధిస్తోంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ తీరుపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సీఆర్సీపీ 164 వాంగ్మూలాల గురించి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతోపాటు గతంలో ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తున్నారు.మొదటి వాంగ్మూలానికి విరుద్ధంగా ఉండకూడదు సీఆర్సీపీ 164 కింద ఓసారి న్యాయస్థానంలో నమోదు చేసిన వాంగ్మూలం అత్యంత విశ్వసనీయమైనదిగా పరిగణిస్తాం. ఎందుకంటే న్యాయమూర్తి ఎదుట ప్రమాణ పూర్వకంగా నమోదు చేసిన వాంగ్మూలమది. ఆ వాంగ్మూలాన్ని మార్చేందుకు వీల్లేదు. గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా వాంగ్మూలం ఇచ్చేందుకు సాక్షులు ప్రయత్నిస్తే వారిని సంబంధిత న్యాయస్థానం ప్రశ్నించాలి. మొదట ఇచ్చిన వాంగ్మూలాన్నే సాక్షంగా పరిగణలోకి తీసుకోవాలి.– 2024 నవంబరు 25న ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు. ఈ మేరకు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ కేసులో జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విస్పష్టమైన తీర్పునిచ్చింది.విరుద్ధంగా ఇస్తే కఠిన చర్యలు ఓసారి సీఆర్సీపీ 164 కింద ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరోసారి వాంగ్మూలం ఇస్తే అది నేరంగా పరిగణిస్తాం. ఎందుకంటే ప్రమాణ పూర్వకంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి చదవి వినిపించిన తర్వాత సమ్మతించి, మరీ సంతకం చేసి ఇచ్చిన వాంగ్మూలమది. మొదటిసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరో వాంగ్మూలం ఇవ్వడమంటే.. మొదట ఇచ్చింది తప్పుడు వాంగ్మూలమని అంగీకరించినట్టే. అత్యంత విశ్వసనీయమైన న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట ప్రమాణం చేసి మరీ తప్పుడు వాంగ్మూలం ఇచ్చినట్టు అవుతుంది. అంటే అబద్ధపు వాంగ్మూలం ఇచ్చినందుకు నేరంగా పరిగణిస్తాం. ఆ విధంగా అబద్ధపు వాంగ్మూలం ఇచ్చిన వారిపై ఐపీసీ 193, సీఆర్సీపీ 340 కింద కఠిన చర్యలు తీసుకుంటాం. – వినోద కుమారి వర్సస్ మధ్యప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పుఎదుర్కోవాల్సిన పరిణామాలను న్యాయమూర్తి వివరించాలి సీఆర్పీసీ 164 కింద ఓసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరో వాంగ్మూలం ఇచ్చేందుకు సాక్షి ప్రయత్నిస్తే.. దాని వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు, ఎదుర్కోవాల్సి వచ్చే పరిణామాల గురించి న్యాయమూర్తి ఆ సాక్షికి వివరించాలి.– అలహాబాద్ హైకోర్టు తీర్పుఏడేళ్ల వరకూ జైలు శిక్ష న్యాయస్థానాల్లో కేసుల విచారణ ప్రక్రియలో ఏ సందర్భంలో అయినా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వడం తీవ్రమైన నేరం అని సెక్షన్ 229 (1) స్పష్టం చేస్తోంది. అటువంటి అబద్ధపు వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు అవకాశం కల్పిస్తోంది. అంటే సీఆర్పీసీ 164 కింద న్యాయమూర్తి ఎదుట ప్రమాణ పూర్వకంగా రెండు విరుద్ధ వాంగ్మూలాలు ఇస్తే అందులో ఒకటి అబద్ధపు వాంగ్మూలమే అవుతుంది. మొదటి వాంగ్మూలం గానీ రెండో వాంగ్మూలం గానీ ఏది అబద్ధపు వాంగ్మూలం అయినా శిక్షార్హమే. దాన్ని నేరంగా పరిగణించి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. -
సీఎం సమోసాలు ఎవరు తిన్నారు? సీఐడీ దర్యాప్తు..
-
ఐసీఐసీఐ బ్యాంకులో భారీ స్కామ్.. సీఐడీ విచారణ
-
ఈనాడుకు బాబు గిఫ్ట్
పరస్పర ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఎలా పణంగా పెడతారో సీఎం చంద్రబాబు, ఈనాడు రామోజీ కుటుంబం మరోసారి రుజువు చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఈనాడు పత్రిక ఐదేళ్లపాటు సాగించిన విష ప్రచారానికి గానూ బాబు ప్రభుత్వం నుంచి భారీ ప్రతిఫలాన్ని పొందింది. మార్గదర్శి విషయంలో అక్రమాలు జరిగినట్లు సీఐడీ గతంలో పక్కా ఆధారాలతో చార్జిషిట్లు వేసింది.దీంతో తేడా వస్తే తమ ఆస్తులు జప్తు అయ్యే అవకాశం ఉండటంతో బయట పడేందుకు మార్గదర్శి వ్యూహాలను అమలు చేస్తోంది. ఇందుకు చంద్రబాబు సర్కారు, కీలక దర్యాప్తు సంస్థలు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. సాక్షి, అమరావతి: ‘కుమ్మక్కు బంధం’ రాష్ట్ర ప్రయోజనాలకు ఎంతటి విఘాతమో మరోసారి తేటతెల్లమైంది. పరస్పర ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఎలా పణంగా పెడతారో సీఎం చంద్రబాబు, ఈనాడు రామోజీ కుటుంబం మరోసారి రుజువు చేసింది. వైఎస్సార్సీపీ సర్కారుపై ఐదేళ్ల పాటు దుష్ప్రచారం చేసిన రామోజీ కుటుంబానికి టీడీపీ కూటమి ప్రభుత్వం కృతజ్ఞతాపూర్వకంగా ‘కానుక’ సమర్పించింది. అదీ రాష్ట్రంలో వేలాదిమంది మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారుల ప్రయోజనాలను కాలరాసి మరీ!! మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు ఆంధ్రప్రదేశ్ డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 వర్తించదంటూ ప్రత్యేక కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను, అలాగే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు చెందిన దాదాపు రూ.1,050 కోట్ల విలువైన ఆస్తుల జప్తును ఖరారు చేసేందుకు నిరాకరిస్తూ గుంటూరు కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన అప్పీళ్లను సీఐడీ ద్వారా ఉపసంహరింప చేశారు. ఈమేరకు సీఐడీ అదనపు డీజీ గురువారం హైకోర్టుకు నివేదించారు. దీంతో అప్పీళ్ల ఉపసంహరణకు హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ వ్యాజ్యాలు తాజాగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ముందు విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ స్పందిస్తూ.. సీఐడీ కేసులన్నింటినీ తనకు అప్పగిస్తూ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ (ఈ అప్పీళ్లలో శైలజా కిరణ్ తరఫున వాదనలు వినిపించారు) ప్రొసీడింగ్స్ ఇచ్చారని నివేదించారు. అందువల్ల సీఐడీ తరఫున తాను హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ అప్పీళ్లను ఉపసంహరించుకోవాలంటూ సీఐడీ అదనపు డీజీ లేఖ రాశారన్నారు. దీంతో తాము తమ అప్పీళ్లను ఉపసంహరించుకుంటున్నట్లు అదనపు డీజీ రాసిన లేఖను కోర్టుకు సమర్పించారు. ఆ లేఖను పరిశీలించిన న్యాయస్థానం పీపీ లక్ష్మీనారాయణ చెప్పిన వివరాలను పరిగణనలోకి తీసుకుని నమోదు చేసింది. అప్పీళ్లను ఉపసంహరించుకున్న నేపథ్యంలో వాటిని పరిష్కరిస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి అనంతరం ఉత్తర్వులు జారీ చేశారు. చిట్స్ రిజిస్ట్రార్ల ఫిర్యాదుతో రంగంలోకి సీఐడీ.. మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ధిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై చిట్స్ అసిస్టెంట్ రిజిష్ట్రార్లు గతంలో సీఐడీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగా రామోజీరావు, శైలజా కిరణ్‌లతో పాటు మొత్తం 15 మందిపై ఐపీసీ, డిపాజిటర్ల పరిరక్షణ చట్టం, చిట్‌ఫండ్ చట్ట నిబంధనల కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. మార్గదర్శి చిట్స్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. పలువురు ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించింది. వారి వాంగ్మూలాలను రికార్డ్ చేసింది. గడువు ముగిసినా, ష్యూరిటీలు సమర్పించిన తరువాత కూడా బ్రాంచ్ మేనేజర్లు సకాలంలో చెల్లింపులు చేయలేదని పలువురు చందాదారులు దర్యాప్తు సంస్థకు వాంగ్మూలం ఇచ్చారు. సాకులు చెబుతూ ష్యూరిటీలను తిరస్కరించడం, అదనపు ష్యూరిటీలు సమర్పించాలని కోరడంతో పాటు ప్రైజ్ మొత్తాలను చెల్లించకుండా మార్గదర్శి ఇబ్బంది పెడుతోందంటూ చందాదారులు స్పష్టంగా ఫిర్యాదు చేశారు. పకడ్బందీ ఆధారాలతో చార్జిషీట్లు... మార్గదర్శి చిట్‌ఫండ్స్ అవకతవకలపై పకడ్బందీగా అన్ని ఆధారాలను సేకరించిన సీఐడీ ప్రత్యేక కోర్టుల్లో చార్జిషిట్లు దాఖలు చేసింది. ఇదే సమయంలో ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించే నిమిత్తం చట్ట ప్రకారం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు చెందిన దాదాపు రూ.1,050 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఖరారు చేయాలని కోరుతూ సీఐడీ పిటిషన్లు దాఖలు చేసింది. అయితే సీఐడీ దాఖలు చేసిన చార్జిషిట్లను పరిశీలించిన గుంటూరు, విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులు వాటిని రిటర్న్ చేశాయి. ఆస్తుల జప్తు ఖరారు కోసం సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను గుంటూరు కోర్టు కొట్టివేసింది. మార్గదర్శి, శైలజా కిరణ్ వాదనలను గతంలో తీవ్రంగా వ్యతిరేకించిన సీఐడీఈ అప్పీళ్లపై హైకోర్టు గత ఏడాది డిసెంబర్ నుంచి విచారణ జరుపుతూ వస్తోంది. ఈ అప్పీళ్ల విచారణార్హతపై రామోజీ, శైలజా కిరణ్, మార్గదర్శి చిట్‌ఫండ్స్ తరఫున నాడు దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు అభ్యంతరం చెప్పారు. మొదట విచారణార్హతపై తేల్చాలని పట్టుబట్టారు. దీనిపై సీఐడీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. తమ అప్పీళ్ల విచారణార్హతపై అభ్యంతరం ఉంటే ఆ విషయాన్ని అనుబంధ పిటిషన్ లేదా కౌంటర్ రూపంలో తెలియచేయాలే తప్ప మౌఖికంగా కాదంది. అనుబంధ పిటిషన్ లేదా కౌంటర్ దాఖలు చేసినప్పుడే అందుకు తగిన సమాధానం ఇచ్చేందుకు తమ అవకాశం ఉంటుందని తెలిపింది. దీంతో మార్గదర్శి, శైలజా కిరణ్ తదితరులు ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో జప్తు ఆస్తుల విషయంలో యథాతథస్థితి (స్టేటస్ కో) కొనసాగిస్తామని మార్గదర్శి తరఫున న్యాయవాది పోసాని కోర్టుకు హామీ ఇచ్చారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఆ మేర మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అటు తరువాత ఈ అప్పీళ్లపై ఇప్పటిదాకా విచారణ జరుగుతూ వస్తోంది.అప్పీళ్ల ఉపసంహరణతో జరిగేదిది..తాజాగా అప్పీళ్లను సీఐడీ ఉపసంహరించుకోవడంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు భారీ ఊరట లభించినట్లయింది. తద్వారా నామమాత్రమైన ఐపీసీ సెక్షన్ల కింద విచారణకు ఆస్కారం ఉంటుంది. దీని వల్ల మార్గదర్శి యాజమాన్యానికి వచ్చే నష్టం ఏమీ లేదు. ప్రత్యేక కోర్టులో విచారణ జరిగి మార్గదర్శి డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 కింద ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలే పరిస్థితి ఉంటే దాని యాజమాన్యానికి, మేనేజర్లకు పదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా, అలాగే ఆ సంస్థకు రూ 5 లక్షల జరిమానా విధించే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి మార్గదర్శి, దాని యాజమాన్యం బయటపడినట్లే. అదే రీతిలో రూ.1050 కోట్ల ఆస్తుల జప్తు కూడా ఉండదు. ఎందుకంటే ఆ జప్తును ఖరారు చేసేందుకు గుంటూరు కోర్టు తిరస్కరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. ఇలా ఈ మొత్తం కేసును నీరుగార్చి దాన్ని కొట్టేసేందుకు సీఐడీ ఆస్కారం కలిగించింది.భారీ గురు దక్షిణ..వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఈనాడు పత్రిక ఐదేళ్లపాటు సాగించిన విష ప్రచారానికిగానూ చంద్రబాబు ప్రభుత్వం నుంచి భారీ ప్రతిఫలాన్ని పొందింది. ప్రజలకిచ్చిన ఎన్నికల హామీలను, కీలక ప్రాజెక్టులను అటకెక్కించేసిన సీఎం చంద్రబాబు.. రామోజీ కుటుంబం కోసం మాత్రం రంగంలోకి దిగారు. సీఐడీ దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టు పూర్తిస్థాయిలో విచారణ జరిపి కింది కోర్టు ఉత్తర్వులను కొట్టివేస్తే మార్గదర్శి ఫైనాన్షియర్స్ మాదిరిగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ కూడా ఇరుక్కుపోవడం ఖాయమని పసిగట్టి ఆ పరిస్థితి తలెత్తకుండా సీఐడీని రంగంలోకి దించి అనుకున్న విధంగా పనికానిచ్చేశారు. అంతేకాదు.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్ధిక మోసాలపై ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉన్న కేసులను క్రమంగా ఎత్తివేసే దిశగా పావులు కదులుతున్నాయి. మార్గదర్శి విషయంలో రామోజీ కుటుంబం అక్రమాలకు పాల్పడినట్లు సీఐడీ గతంలో పూర్తి ఆధారాలతో సీఐడీ కేసు నమోదు చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితులు సంఘం ఏర్పాటు చేసుకుని మరీ ఆందోళనలను నిర్వహిస్తున్నారు. తెలంగాణతో పాటుఇతర రాష్ట్రాల్లోనూ బాధితులున్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ మోసాలు నాలుగు రాష్ట్రాలకు విస్తరించడం, మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినందున ఈ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించాలని సీఐడీ అధికారులు గతంలో కోరడం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి రూ.4,600 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసి చట్టపరంగా పీకల్లోతుల్లో కూరుకుపోయిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ యాజమాన్యం ఇప్పుడు మార్గదర్శి చిట్‌ఫండ్స్ వ్యవహారంలో ఇరుక్కోకుండా జాగ్రత్త పడుతోంది. తేడా వస్తే దాదాపు రూ.1,050 కోట్ల ఆస్తులు జప్తు అయ్యే అవకాశం ఉండటంతో బయట పడేందుకు వ్యూహాలను అమలు చేస్తోంది. ఇందుకు చంద్రబాబు సర్కారు, కీలక దర్యాప్తు సంస్థలు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. అందులో భాగంగా రామోజీరావు (ఇటీవల మృతి చెందారు) డైరెక్టర్‌గా, ఆయన కోడలు శైలజా కిరణ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్న మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై ఆర్ధిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు పెద్ద ఎత్తున ఉన్న ఆరోపణలను నీరుగారుస్తోంది.మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలలో కొన్ని..సకాలంలో చందాదారులకు చెల్లింపులు చేయకపోవడం, చెల్లించాల్సిన ప్రైజ్ మొత్తాన్ని డిపాజిట్‌గా తమ వద్దే అట్టిపెట్టుకోవడం, తక్కువ వడ్డీ చెల్లించడం, చెల్లింపులు ఎగవేయడం. చందాదారులకు చెల్లించాల్సిన ప్రైజ్‌మనీని చెల్లించకుండా వడ్డీ చెల్లింపు పేరుతో తమ వద్దే అట్టిపెట్టుకోవడానికి ప్రధాన కారణం చెల్లింపులు చేయడానికి మార్గదర్శి చిట్‌ఫండ్స్ వద్ద సరిపడినంత డబ్బు లేకపోవడమే. తమ వద్ద డబ్బు లేదు కాబట్టి చందాదారులకు చెల్లించాల్సిన డబ్బునే భవిష్యత్తులో చెల్లించాల్సిన చందాగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ తమ వద్దే అట్టిపెట్టుకుంది. అలా అట్టిపెట్టుకున్న మొత్తాలను రొటేషన్ చేస్తూ వస్తోంది. చట్ట నిబంధనల ప్రకారం చందాదారుల డబ్బును ప్రత్యేక ఖాతాల్లో ఉంచడం తప్పనిసరి. అయితే అలా ఉంచకుండా దానిని ఇతర అవసరాలకు మళ్లించేశారు. ఈ ఉల్లంఘనలన్నీ డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 కిందకే వస్తాయి. నాడు సీఐడీ అభ్యంతరం.. అప్పీళ్లు దాఖలుఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తున్నా వాటిని పట్టించుకోకుండా, ప్రైజ్ మొత్తాల ఎగవేత జరిగినట్లు కనిపించడం లేదంటూ గుంటూరు, విశాఖపట్నం కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులపై గతంలో సీఐడీ అభ్యంతరం తెలిపింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ గత ఏడాది డిసెంబర్లో హైకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేసింది. మరికొన్ని అప్పీళ్లను ఈ ఏడాది జనవరిలో దాఖలు చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలు, ఆర్ధిక అవకతవకలు, చట్ట ఉల్లంఘనలపై పూర్తిస్థాయి ఆధారాలను చార్జిషీట్ రూపంలో ప్రత్యేక కోర్టుల ముందు ఉంచినా, వాటిని పట్టించుకోకపోవడం ఎంత మాత్రం సరికాదని సీఐడీ తన అప్పీళ్లలో పేర్కొంది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినకుండానే అలా నిర్ధారించడం చట్ట విరుద్ధమంది. చార్జిషిట్‌లోని అంశాలపై మినీ ట్రయల్ నిర్వహించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిన విషయాన్ని తన అప్పీళ్లలో హైకోర్టుకు వివరించింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5కు ప్రత్యేక కోర్టులు భాష్యం చెప్పాయని, అలా చెప్పి ఉండకూడదంది. చార్జిషిట్లను రిటర్న్ చేస్తూ ప్రత్యేక కోర్టులు జారీ చేసిన ఉత్తర్వులను, జప్తును ఖరారు చేసేందుకు నిరాకరిస్తూ గుంటూరు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టును కోరింది. -
AP: మన కేసులు ఎత్తేద్దాం!
ఓ ఘరానా దొంగ భారీ దోపిడీకి పాల్పడ్డాడు. దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తదనంతర పరిణామాల్లో ఆ దొంగే.. పోలీసుగా ఉద్యోగంలోకి వచ్చాడు! మరి దోపిడీపై అప్పటికే నమోదైన కేసు విచారణ ఏమవుతుంది? సహజంగానే కేసును ఆ పోలీసు మూసివేస్తాడు! సక్రమంగా దర్యాప్తు జరిగితే తానే దొంగ అన్నది రుజువై శిక్ష పడుతుంది కాబట్టి! ఈ ఉదాహరణ ఊహాజనితమే కావచ్చు. కానీ రాష్ట్రంలో అదే వాస్తవ రూపం దాల్చి కళ్ల ముందు ఆవిష్కృతమవుతోంది. 2014–19 మధ్య ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు యథేచ్ఛగా సాగించిన అవినీతి దందాపై సీఐడీ ఇప్పటికే కేసులు నమోదు చేయగా.. ప్రస్తుతం సీఎంగా ఉన్న అదే చంద్రబాబు ఆ కేసులను నీరుగార్చే కుతంత్రానికి తెర తీశారు!– సాక్షి, అమరావతి పక్కా ఆధారాలతోనే కేసులు నమోదు..నాటి టీడీపీ ప్రభుత్వంలో అవినీతి దందాపై సీఐడీ ప్రత్యేక దర్యాప్తు విభాగం (సిట్) చంద్రబాబుపై పలు కేసులు నమోదు చేసింది. రూ.241 కోట్లు కొల్లగొట్టిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఆయన్ను అరెస్ట్ చేయడంతో 52 రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక అమరావతిలో దాదాపు రూ.5 వేల కోట్ల అసైన్డ్, ప్రభుత్వ భూముల దోపిడీ.. రూ.2 వేల కోట్ల మేర ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్లో అక్రమాలు.. రూ.333 కోట్లు కొల్లగొట్టిన ఫైబర్‌నెట్ స్కామ్‌పై సిట్ పూర్తి ఆధారాలతో కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో విచారణ ప్రక్రియ దిశగా చర్యలు చేపట్టింది. 2015లో ప్రవేశపెట్టిన మద్యం విధానం ద్వారా టీడీపీ లిక్కర్ సిండికేట్ ఏటా రూ.2.50 లక్షల కోట్లు చొప్పున కొల్లగొట్టడంతోపాటు ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల పన్ను రాబడికి గండి కొట్టింది. ఇక ఉచిత ఇసుక ముసుగులో రూ.10 వేల కోట్ల దోపిడీ వెలుగులోకి వచ్చింది. ఈ కేసుల్లో సీఐడీ గతంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఆయా కేసుల్లో ప్రధాన నిందితులుగా చంద్రబాబు, లోకేశ్‌తోపాటు పి.నారాయణ, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, చింతమనేని ప్రభాకర్, పీతల సుజాత, లింగమనేని రమేష్ కుటుంబ సభ్యులు, చంద్రబాబు బినామీలు, సన్నిహితులను నిందితులుగా చేర్చి సీఐడీ కేసులు నమోదు చేసింది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తనపై గతంలో సీఐడీ నమోదు చేసిన కేసుల దర్యాప్తును తొలుత నీరుగార్చి అనంతరం విచారణను ఉపసంహరిస్తూ మంత్రి మండలి ద్వారా నిర్ణయం తీసుకోవాలనే పన్నాగాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారు. అందుకోసం ఏకంగా పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ డీజీపీ, సీఐడీ చీఫ్‌ల ద్వారా కుట్ర కథను నడిపిస్తున్నారు. అటకెక్కిన దర్యాప్తుజూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడగానే చంద్రబాబు తనపై ఉన్న సీఐడీ కేసులను నీరు గార్చే కుట్రకు తెర తీశారు. ముఖ్యమంత్రిగా ఆయన జూన్ 12న ప్రమాణ స్వీకారం చేయగా ఫలితాలు వెలువడిన రోజు నుంచే సీఐడీ కేసులను తొక్కిపెట్టే ఆపరేషన్ చేపట్టారు. చంద్రబాబుపై అవినీతి కేసులను విచారిస్తున్న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కార్యాలయాన్ని పోలీసులు జప్తు చేశారు. తద్వారా ఆ కేసుల దర్యాప్తును అటకెక్కిస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలిచ్చారు.సిట్ కేసులు క్లోజ్ చేయాలనే షరతులతో డీజీపీ, సీఐడీ చీఫ్‌లకు పోస్టింగ్లుచంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తనపై సిట్ కేసులను పక్కదారి పట్టించడమే లక్ష్యంగా పావులు కదిపారు. అందుకోసం పోలీసు వ్యవస్థను పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసేందుకు తెగించారు. ప్రధానంగా డీజీపీ, సీఐడీ చీఫ్‌ల నియామకాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. తనపై ‘సిట్’ గతంలో నమోదు చేసిన స్కిల్ స్కామ్, అసైన్డ్ భూముల కుంభకోణం, ఇన్నర్‌రింగ్ రోడ్ కుంభకోణం, ఫైబర్ నెట్ కేసులను నీరు గార్చేసి అనంతరం విచారణను పూర్తిగా నిలిపివేయాలని షరతు విధించారు. దీనికి లోబడే డీజీపీ, సీఐడీ అదనపు డీజీలకు పోస్టింగ్‌లు ఇచ్చినట్లు పోలీసువర్గాలు అప్పట్లోనే వ్యాఖ్యానించాయి. తదనంతర పరిణామాలు అదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి.నిందితులపై లుక్ అవుట్ నోటీసుల ఉపసంహరణ!2014–19 మధ్య చంద్రబాబు అవినీతి కార్యకలాపాల్లో పలువురు షెల్ కంపెనీల ప్రతినిధులు, ప్రైవేటు వ్యక్తులు కీలక పాత్రధారులుగా వ్యవహరించారు. సీమెన్స్‌కు తెలియకుండా ఆ కంపెనీ పేరుతో స్కిక్ల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ముసుగులో నిధులు కొల్లగొట్టడం.. అసైన్డ్ భూములను కాజేసేందుకు షెల్ కంపెనీల ద్వారా నిధుల తరలింపు.. ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్రమాల్లో షెల్ కంపెనీల ప్రతినిధుల పాత్ర... ఫైబర్‌నెట్ స్కామ్ ద్వారా నిధుల అక్రమ తరలింపులో చంద్రబాబు సన్నిహితులు, బినామీల బాగోతం.. ఇలా ఈ కుంభకోణాల్లో కీలకంగా వ్యవహరించిన వారిని సీఐడీ అధికారులు గతంలోనే గుర్తించారు. నిందితులు విదేశాలకు పరారు కాకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కేసులను నీరుగార్చేందుకు ముందుగా లుక్ అవుట్ నోటీసులను లక్ష్యంగా చేసుకున్నారు. చంద్రబాబుపై నమోదైన కేసులను విచారిస్తున్న దర్యాప్తు అధికారులను డీజీపీ, సీఐడీ అదనపు డీజీ తమ కార్యాలయానికి పిలిపించారు. ఆ కేసుల్లో జారీ చేసిన లుక్ అవుట్ నోటీసులను ఉపసంహరించాలని దర్యాప్తు అధికారులను ఆదేశించారు. అంటే ఆ కేసుల దర్యాప్తును ఇక పట్టించుకోవద్దని స్పష్టం చేశారు. అందులో మొదటి అడుగుగా ఆ కేసుల్లో కొందరు నిందితులపై జారీ చేసిన లుక్ అవుట్ నోటీసులను ఉపసంహరింపజేశారు.నీరుగార్చుదాం... ఉపసంహరిద్దాంఇదీ చంద్రబాబు పన్నాగంచంద్రబాబుపై అవినీతి కేసుల్లో విచారణ ప్రక్రియను పూర్తిగా ఉపసంహరించే దిశగా కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం వ్యవహరిస్తోంది. ఆ కేసుల్లో సిట్ అధికారులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతోపాటు న్యాయస్థానాల్లో చార్జిషీట్లను కూడా దాఖలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా చంద్రబాబు పూర్తిస్థాయిలో కుతంత్రానికి తెరతీశారు. ముందుగా ఆ కేసుల్లో సీఐడీ వాదన వీగిపోవాలి..! విచారణ ప్రక్రియ సందర్భంగా సీఐడీ న్యాయవాదులు చేతులెత్తేయాలి...! న్యాయస్థానం లేవనెత్తే ప్రశ్నలకు దర్యాప్తు అధికారులు ఉద్దేశపూర్వకంగా సమాధానం చెప్పకుండా ఉండిపోవాలి...! అవసరమైతే న్యాయస్థానం ఆగ్రహానికి కూడా గురి కావాలి...! కేసుల విచారణలో డిఫెన్స్ న్యాయవాదుల వాదనకు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏమాత్రం ఎదురు చెప్పకూడదు...! కేసుల విచారణ ప్రక్రియ సందర్భంగా అన్ని పరిణామాలు సీఐడీకి వ్యతిరేకంగా సాగాలనే లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. ఇది మొదటి వ్యూహం కాగా అదే అదనుగా చంద్రబాబుపై నమోదైన కేసులను ఉపసంహరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నది చంద్రబాబు రెండో వ్యూహం. సీఐడీ అభియోగాలకు తగిన ఆధారాలు లేవని, ఆ కేసులను ఉపసంహరించుకోవడమే సరైన చర్యని న్యాయ శాఖ అభిప్రాయపడినట్టుగా ఓ నోట్ తయారు చేయించి అనంతరం ఈమేరకు రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేయించుకోవాలన్నది చంద్రబాబు అంతిమ లక్ష్యం. ఆ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసి కేసులను పూర్తిగా మూసివేయడం ద్వారా తన అవినీతి దందాకు ప్రభుత్వ పరంగా రక్షణ కల్పించాలని చంద్రబాబు పకడ్బందీగా కుట్రను వేగంగా అమలు చేస్తున్నారు. -
ఫోన్ తీయనందుకే అంజలి హత్య
హుబ్లీ: నగరంలోని వీరాపుర ఓణిలో ఈ నెల 14వ తేదీ తెల్లవారు జామున జరిగిన అంజలి అంబిగేర హత్య కేసు దర్యాప్తు చేపట్టిన సీఐడీ బృందం ఎదుట నిందితుడు నిజాలను చెప్పినట్లుగా తెలుస్తోంది. నిందితుడు గిరీష్ తాను మొదట అంజలిని మైసూరుకు రమ్మని పిలిచాను. అయితే ఆమె రాలేదు. హత్య చేయడానికి ముందు రోజు అంజలికి రూ.1000 ఫోన్ పే చేశాను. డబ్బులు పంపాక ఆమె తన ఫోన్ నెంబర్‌ను బ్లాక్ చేసింది. ఈ కారణంతోనే కోపం తట్టుకోలేక హత్య చేసినట్లుగా నిందితుడు గిరీష్ అలియాస్ విశ్వ సీఐడీ అధికారుల వద్ద విచారణ సందర్భంగా నోరు విప్పాడు. కాగా గత ఏప్రిల్ 18న విద్యార్థిని నేహా హిరేమఠ హత్య చేసిన మాదిరిగానే అంజలి హత్య కూడా జరిగిన సంగతి తెలిసిందే. కాగా అంతకు ముందు నిందితుడు అంజలిని నేహా మాదిరిగానే చంపుతానని బెదిరించేవాడని అంజలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
సైలెంట్ మోడ్‌లో సీబీఐ.!
సాక్షి, విశాఖపట్నం: ప్రత్యేక విమానంలో విశాఖ వచ్చి.. భారీగా డ్రగ్స్ పట్టుకున్న సీబీఐ దాని వెనుక ఉన్న పాత్రధారులు, సూత్రధారులను కనిపెట్టే విషయంలో మాత్రం నిర్లిప్తత వహిస్తోంది. మూలాలు శోధించేందుకు బ్రెజిల్ వెళ్లిన బృందాలు కొండని తవ్వి కనీసం ఎలుక జాడ కూడా కనిపెట్టలేకపోయాయి. ప్రధాన పాత్రధారులుగా ఉన్న సంధ్యా ఆక్వా ప్రతినిధులు కళ్లెదుటే ఉన్నా కనీసం సమగ్రంగా విచారించకుండా వదిలేయడంపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్స్ తీసుకొచ్చిన సంస్థపై చర్యలు తీసుకోకుండా గాలికొదిలేయడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మార్చి 19న విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ (వీసీటీపీఎల్)లో 25 వేల కిలోల డ్రైఈస్ట్‌తో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ దిగుమతి రాకెట్‌ని సీబీఐ బట్టబయలు చేసింది. బ్రెజిల్‌లోని శాంటోస్ పోర్టు నుంచి బయలుదేరిన షిప్‌లోని కంటైనర్‌లో డ్రైఈస్ట్‌ని తీసుకొచ్చిన సంధ్యా ఆక్వా సంస్థ.. అందులో డ్రగ్స్ ఎలా వచ్చాయో తమకు తెలీదంటూ బుకాయిస్తోంది. డ్రగ్స్ దొరికిన తొలి రోజున సంస్థ ప్రతినిధులను రెండు గంటల సేపు మాత్రమే సీబీఐ అధికారులు విచారించారు. తమకేమీ తెలీదని చెప్పడంతో వదిలేశారు. తర్వాత ఇంత వరకూ సంధ్యా ఆక్వా ప్రతినిధుల జోలికి సీబీఐ వెళ్లకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రాథమికంగా సంధ్య ఆక్వా ప్రతినిధుల నుంచి కీలక సమాచారం రాబట్టే అవకాశాలున్నా కనీసం ఆ దిశగా సీబీఐ విచారించకపోవడం గమనార్హం. మొత్తం కంటైనర్‌లో వచ్చిన వెయ్యి బ్యాగుల్లో 70 శాతం బ్యాగ్స్‌లో ఉన్న డ్రైఈస్ట్లో కొకై న్, హెరాయిన్, ఓపియం, కొడైన్, మెథలాక్విన్ తదితర డ్రగ్స్ అవశేషాలున్నాయి. ఈ పరిణామాలు చూస్తుంటే 30 శాతం బ్యాగుల్లో పూర్తిస్థాయిలో డ్రైఈస్ట్ లోడ్ చేసి ఒకవేళ పరీక్షలు నిర్వహించినా దొరకవనే ఉద్దేశంతో పక్కా ప్రణాళికలతోనే డ్రగ్స్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే సీబీఐకి ఇంటర్‌పోల్ నుంచి సమాచారం రావడంతో ఈ రాకెట్ గుట్టురట్లు అయింది. పక్కాగా డ్రగ్స్ అక్రమంగా రవాణా చేసినట్లు ఆధారాలున్నా సంధ్యా ఆక్వాపై ఇంతవరకూ సీబీఐ ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.రిపోర్టులూ మరింత ఆలస్యం.?తమ దగ్గర ఉన్న కిట్స్ సాయంతో నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో డ్రగ్స్ అవశేషాలున్నట్లు సీబీఐ గుర్తించింది. అయితే ఒక్కో బ్యాగ్‌లో ఎంత మొత్తం డ్రగ్స్ ఉన్నాయి.. ఏఏ డ్రగ్స్ ఎంత మేర ఉన్నాయన్న అంశంపై సమగ్ర నివేదిక కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కి పంపించారు. అయితే ఇంతవరకూ దీనికి సంబంధించిన రిపోర్టులు రాలేదని సీబీఐ చెబుతోంది. సాధారణంగా ఎఫ్ఎస్ఎల్ నుంచి 10 నుంచి 15 రోజుల్లో నివేదిక వస్తుందని సంధ్యా డ్రగ్స్‌కు సంబంధించిన రిపోర్టు దాదాపు రెండు నెలలు కావస్తున్నా బయటికి రాకపోవడంపైనా సీబీఐ తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి.బ్రెజిల్ వెళ్లి ఏం చేశారు..?మరోవైపు డ్రగ్స్ మూలాలు ఎక్కడ ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తామంటూ సీబీఐకి చెందిన బృందం బ్రెజిల్ పయనమయ్యాయి. శాంటోస్ పోర్టుకు డ్రైఈస్ట్ తరలించిన ఓషన్ నెట్వర్క్ ఎక్స్‌ప్రెస్ సంస్థతో పాటు కార్గో షిప్ వచ్చిన మార్గంతో పాటు షిప్ ఆగిన పోర్టుల్లో సీసీటీవీ పుటేజ్ సేకరించాలని సీబీఐ బృందం బ్రెజిల్ వెళ్లినట్లు తెలిసింది. అయితే దాదాపు 2 నెలలు కావస్తున్నా ఇంతవరకూ ఎలాంటి ఆధారాలు సేకరించకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే బ్రెజిల్ నుంచి సీబీఐ బృందం తిరిగి వచ్చేసినట్లు తెలుస్తోంది. కానీ అసలు దర్యాప్తు ఎంతవరకూ వచ్చిందో కూడా సీబీఐ వెల్లడించకపోవడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.ఎక్కడ కంటైనర్ అక్కడే..రూ.వేల కోట్ల విలువైన డ్రగ్స్ విషయంలోనూ సీబీఐ నిర్లక్ష్యం వహిస్తోంది. ఎక్కడైతే తనిఖీలు నిర్వహించారో ఆ ప్రాంతమైన వీసీటీపీఎల్లోనే డ్రగ్స్ దొరికిన కంటైనర్‌ని సీబీఐ సీజ్ చేసి విడిచి పెట్టేసింది. కంటైనర్ టెర్మినల్‌లో కస్టమ్స్ తనిఖీల్లో పట్టుబడిన కంటైనర్లతో పాటు ఈ డ్రగ్స్ కంటైనర్ కూడా విడిచిపెట్టేశారు. ఎర్రచందనం, నిషేధిత వస్తువులతో వచ్చిన కంటైనర్లను వీసీటీపీఎల్లోని ఓ ప్రాంతంలో ఉంచేస్తారు. దాదాపు 10 నుంచి 15 ఏళ్లుగా ఈ కంటైనర్లు ఇక్కడే ఉన్నాయి. వాటితో పాటుగా.. డ్రగ్స్ కంటైనర్‌ని కూడా సీబీఐ విడిచి పెట్టేసింది. కస్టమ్స్, వీసీటీపీఎల్ ప్రతినిధుల్ని ఆ కంటైనర్ భద్రపరచాలని సీబీఐ సూచించిందే తప్ప.. తమ తరఫున ఒక భద్రతా సిబ్బందిని కూడా కంటైనర్ వద్ద ఉంచకుండా నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. వీలైనంత త్వరగా డ్రగ్స్ దోషులను బయటకి లాగాలని దర్యాప్తును సీబీఐ త్వరగా పూర్తి చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. -
బాబు, లోకేష్ కు నోటీసులు..?
-
భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు
-
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
-
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
-
రాజధాని కేసుల్లో..బాబుకు జైలే..
సాక్షి, అమరావతి: చట్టాల్ని ఏమార్చి పదుల కేసుల్లో స్టేలు తెచ్చుకొని.. సచ్చిలుడని విర్రవీగిన చంద్రబాబు అవినీతి పుట్ట పగిలింది. మేకవన్నె పులికి మారుపేరైన ఆయన అసలు రూపం కోర్టుల సాక్షిగా సాక్షాత్కారమైంది. ఎంతో నేర్పుగా చేసిన స్కిల్ స్కామ్.. అమరావతి అసైన్డ్ భూ దోపిడీ.. ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం.. ఇలా అవినీతి దందాలతో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు. అవినీతి చేశాను.. అయితే నాకు చట్టాలు వర్తించవనే జిత్తులమారి తెలివితేటలతో సెక్షన్ 17–ఏను అడ్డం పెట్టుకొని తప్పించుకుందామన్న పన్నాగం బెడిసికొట్టింది. చంద్రబాబుపై కేసుల్లో నేరం నిరూపితమైతే రాజధాని కుంభకోణం కేసుల్లో యావజ్జీవ ఖైదు తప్పదని న్యాయ నిపుణులు అంటున్నారు. ఒక్కో కేసులో భారీ అవినీతి స్కిల్ స్కామ్: జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ పేరిట ఆ కంపెనీకే తెలియకుండా ప్రాజెక్ట్‌ను సృష్టించి స్కిల్ స్కామ్‌కు పాల్పడ్డారు. ఈ కేసులోనే చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేయడంతోపాటు న్యాయస్థానం రిమాండ్ విధించగా.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజలపాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అసైన్డ్ భూదోపిడీ:అమరావతిలో ఏకంగా రూ.5 వేల కోట్ల భూదోపిడీకి పాల్పడ్డారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు స్కామ్: అలైన్మెంట్లో అక్రమాల ద్వారా క్విడ్ ప్రోకోతో రూ.2,500 కోట్ల మేర అవినీతి.. అందుకోసం కేబినెట్ ఆమోదం లేకుండానే జీవోలు జారీ. నోట్ ఫైళ్లపై స్వయంగా చంద్రబాబే సంతకాలు చేసి అక్రమాల కథ నడిపించారు. అనంతరం నోట్ ఫైళ్లను గల్లంతు చేశారు. సీఐడీ ఆ అవినీతిని వెలికి తీయడంతో అతని బాగోతం బట్టబయలైంది. ఈ కుంభకోణాలన్నిటికీ సూత్రధారి చంద్రబాబే అని కీలక సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. 164 సీఆర్పీసీ కింద న్యాయస్థానంలో వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ కుంభకోణాల్లో చంద్రబాబు ప్రధాన కుట్రదారు, ప్రధాన లబ్ధిదారుడిగా ఉన్నారని డాక్యుమెంటరీ ఆధారాలు, కీలక సాక్షుల వాంగ్మూలాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కేసుల నుంచి చంద్రబాబు తప్పించుకోవడం ఇక అసాధ్యమని న్యాయ నిపుణుల అభిప్రాయం. కేబినెట్‌కు తెలియకుండా చీకటి జీవోలు చంద్రబాబు అవినీతి విశ్వరూపాన్ని ఛేదించడం అంత తేలిక కాదు. కొన్ని సార్లు తప్పించుకోవచ్చు.. అన్నిసార్లూ తప్పించుకోలేరు.. చివరకు పక్కా ఆధారాలతో దొంగ దొరికాడు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సర్వం తానై కుంభకోణాలకు పాల్పడ్డారు. 2014 నుంచి 2019 వరకు బరితెగించి సాగించిన అన్ని కుంభకోణాల్లోనూ కర్త, కర్మ, క్రియ చంద్రబాబేనని సీఐడీ పూర్తి ఆధారాలతో నిగ్గు తేలి్చంది. కేబినెట్‌కు తెలియకుండా చీకటి జీవోలు జారీ చేసి ఏకపక్షంగా టెండర్లు కట్టబెట్టేశారు. ప్రభుత్వ నిధులు అస్మదీయులకు మళ్లించి.. షెల్ కంపెనీల ద్వారా అక్రమంగా ఆ డబ్బును విదేశాలకు తరలించారు. అవి హవాలా మార్గంలో తన బంగ్లాకే చేరేలా పక్కా వ్యూహం అమలుచేశారు. చంద్రబాబుకు 17ఏ వర్తించదు: సుప్రీంకోర్టు స్కిల్ స్కామ్‌లో సీఐడీ దర్యాప్తు చేసి చంద్రబాబును అరెస్ట్ చేశాక విజయవాడ ఏసీబీ న్యాయ స్థానంలో హాజరుపర్చింది. దాదాపు 10 గంటలు ఇరుపక్షాల వాదనల అనంతరం ఆయనకు న్యాయమూర్తిజ్యుడిíÙయల్ రిమాండ్ విధించారు. సీఐడీ అభియోగాలు, అందులో పేర్కొన్న సెక్షన్లతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ ఈ నిర్ణయం ప్రకటించారు. చంద్రబాబు 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం అనారోగ్య కారణాలతో బెయిల్ మంజూరైంది. సెక్షన్ 17–ఏను వక్రీకరిస్తూ కేసుల నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 17–ఏ వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సర్వం తానై.. కుట్రదారు, లబ్ధిదారుగా సర్వం తానై చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని సీఐడీ ఆధారాలతో నిగ్గు తేల్చింది. సిŠక్ల్, అసైన్డ్ భూములు, ఐఆర్ఆర్ అలైన్మెంట్ కుంభకోణాల్లో చంద్రబాబును ఏ1గా చేరుస్తూ కేసు నమోదు చేయడంతోపాటు న్యాయస్థానాల్లో చార్జిïÙట్లు దాఖలు చేసింది. ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఎ), 409, 201, 109 రెడ్‌విత్ 34, 37తోపాటు అవినీతి నిరోధక చట్టం 13(2) రెడ్‌విత్ 13(1), (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేసింది. ఇప్పటికే చంద్రబాబుకు 74 ఏళ్లు. నేరం నిరూపితమై శిక్షలు పడితే యావజ్జీవం తప్పదు. ఇన్నర్ రింగ్ రోడ్, అసైన్డ్ భూముల కేసుల్లో లోకేశ్ నిందితుడిగా ఉన్నారు. నారాయణతోపాటు టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారు ఈ కేసుల్లో ఉన్నారు. వారంతా శిక్ష అనుభవించాల్సిందేనని న్యాయ నిపుణులు అంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉంటూ అవినీతికి పాల్పడిన కేసుల్లో హరియాణా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలాకు 16 ఏళ్ల తర్వాత జైలు శిక్ష పడింది. తాజాగా తమిళనాడులో మంత్రిగా చేసిన సెంథిల్ బాలాజీ, మద్యం కేసుల్లో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఇప్పటికీ బెయిల్ రాకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. వేర్వేరుగా శిక్షలు అనుభవించాల్సిందే అత్యంత కీలకమైన సెక్షన్ 409 కింద నేరం నిరూపితమైతే యావజ్జీవం విధిస్తారు. అవినీతి నిరోధక చట్టంలోని 13(2) రెడ్‌విత్ 13(1), (సి), (డి) కింద నేరం నిరూపితమైతే గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష.. ఒక్కో కేసులో గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. ఇతర సెక్షన్ల కేసుల్లో తీర్పులు వేర్వేరుగా వస్తాయి. నేరం నిరూపితమై శిక్ష పడితే చంద్రబాబు వేర్వేరుగా శిక్షలు అనుభవించాలి. -
సీఐడీ కేసుల్లో దోషులకు శిక్ష ఖాయం
సిట్ దర్యాప్తు చేస్తున్న కేసులకు సంబంధించిన పత్రాలన్నీ న్యాయస్థానాల్లో ఉన్నాయి. ఆ కేసుల్లో దోషులకు శిక్షలు పడటం ఖాయం. – సిట్‌కు నేతృత్వం వహిస్తున్న ఐజీ కొల్లి రఘురామరెడ్డి సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి, కుంభకోణాలపై సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నమోదు చేసిన కేసుల్లో దోషులకు శిక్ష ఖాయమని తేలడంతో ఎల్లో గ్యాంగ్ బెంబేలెత్తుతోంది. దాంతో సిట్‌పై దుష్ప్రచారం చేసేందుకు యత్నించి బోర్లా పడింది. చంద్రబాబు కేసుల పత్రాలను సిట్ కార్యాలయం ప్రాంగణంలో కాల్చివేస్తున్నారంటూ ఎల్లో చానళ్లు సోమవారం హడావుడి చేశాయి. ఈ ఎన్నికల తరువాత వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని భావించే సిట్ అధికారులు ఇలా పత్రాలను కాల్చివేస్తున్నారంటూ వక్రీకరించిన కథనాలతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించాయి. కానీ తాము దర్యాప్తు చేస్తున్న అయిదు కేసుల్లో పూర్తి ఆధారాలతో న్యాయస్థానాల్లో చార్జ్షీట్లు దాఖలు చేశామని, అంతకు ముందే కీలక కేస్ డైరీలు, ఆధారాలుగా ఉన్నఒరిజినల్ పత్రాలను కూడా న్యాయస్థానాలకు సమర్పించామని సిట్ స్పష్టం చేసింది. ఆ సందర్భంగా తీసిన లక్షలాది ఫొటోస్టాట్ కాపీల్లో సరిగా రాని వాటిని చిత్తుగా పరిగణించి కాల్చివేశామని వెల్లడించడంతో ఎల్లో మీడియా నోళ్లు మూతపడ్డాయి. అసలు కేసులకు సంబంధించిన పత్రాలను రహస్యంగా కాల్చివేసే ఉద్దేశమే ఉంటే ఎక్కడో రహస్యంగా చేస్తారు. అది పెద్ద కష్టమేమీ కాదు. కానీ, సిట్ కార్యాలయ ప్రాంగణంలో.. అదీ పట్టపగలు అందరూ చూస్తుండగా ఎందుకు చేస్తారు? ఈ చిన్న లాజిక్‌ను మర్చిపోయిన ఎల్లో మీడియా బోల్తా పడింది. అదిగో తోక.. ఇదిగో పులి తాడేపల్లిలోని సిట్ కార్యాలయం ఉన్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాంగణం సమీపంలో కొన్ని చిత్తుకాగితాలను సిబ్బంది సోమవారం ఉదయం కాల్చివేశారు. అది చూసి టీడీపీ నేతలు, ఆ పారీ్టకి కొమ్ముకాసే ఎల్లో మీడియా చానళ్లు హడావుడి మొదలుపెట్టాయి. చంద్రబాబుపై నమోదు చేసిన కేసుల కీలక పత్రాలను సిట్ అధికారులు రహస్యంగా దహనం చేసేస్తున్నారని, వాటిలో హెరిటేజ్ ఫుడ్స్‌కు సంబంధించిన పత్రాలు ఉన్నాయంటూ ప్రచారం ప్రారంభించాయి. అనుమతి లేకుండా సిట్ అధికారులు తీసుకున్న హెరిటేజ్ ఫుడ్స్, నారా భువనేశ్వరిల ఆదాయ పన్ను రిటర్న్ కాపీలు వీటిలో ఉన్నాయని ఊదరగొట్టాయి. చంద్రబాబుపై అక్రమంగా కేసులు నమోదు చేశారని, లోకేశ్‌ను అక్రమంగా విచారించారని, అందుకే ఆ కేసుల కాపీలను దహనం చేసేస్తున్నారని కూడా చెప్పుకొచ్చాయి. అంతే కాదు.. ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బండారం బయటపడుతుందనే ఆందోళనతోనే సిట్ అధికారులు ఇలా పత్రాలను రహస్యంగా దహనం చేసేస్తున్నారని కూడా ఇష్టానుసారం వక్రీకరణలతో కూడిన కథనాలను ప్రసారం చేశాయి. ఎన్నికల వేళ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు పడరాని పాట్లు పడ్డాయి. దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన సిట్ టీడీపీ నేతలు, ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని సిట్ ఓ ప్రకటనలో సమర్థంగా తిప్పికొట్టింది. ‘సిట్ కార్యాలయం సమీపంలో దహనం చేసినవి చిత్తు ప్రతులే. మేము దర్యాప్తు చేస్తున్న 5 కేసుల్లో పూర్తి ఆధారాలతో ఇప్పటికే విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో చార్జిషిట్లు దాఖలు చేశాం. ఈ కేసుల కేస్ డైరీలు, ఇతర కీలక ఆధారాలను న్యాయస్థానానికి ఎప్పటికప్పుడు సమర్పించాం. ఆధారాల్లో వేటినీ ధ్వంసం చేయలేదు. ఆధారాలన్నీ భద్రంగా ఉన్నాయి. పూర్తి ఆధారాలతో నమోదు చేసిన ఈ కేసుల్లో దోషులకు శిక్షలు పడటం ఖాయం. ప్రతి కేసులో 40 మంది వరకు నిందితులు ఉన్నారు. ఒక్కో కేసులో ఒక్కో నిందితునికి సంబంధించి దాదాపు 10 వేల పేజీలను ఫొటోస్టాట్ కాపీలు తీయాల్సి వచ్చింది. లక్షలాది పేజీలు కాపీలు తీసే క్రమంలో మెషిన్లు వేడెక్కడం కాగితాలు వాటిలో ఇరుక్కుపోవడం, ఇంకు తగ్గిపోవడం వంటి కారణాలతో చాలా కాపీలు ఫేడ్ అవుట్ అయ్యాయి. వీటిని పక్కనపెట్టేసి కొత్తగా మళ్లీ కాపీలు తీయాల్సి వచ్చింది. ఫేడ్ అవుట్ అయిన వాటిని చిత్తుగా పరిగణించి కాల్చివేశాం. ఇది అన్ని దర్యాప్తు సంస్థల్లో, సాధారణ ఆఫీసుల్లో కూడా పాటించే ప్రక్రియే’ అని సిట్ అధికారులు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారమే హెరిటేజ్ ఐటీ రిటర్న్‌లు తీసుకున్నాం హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ, చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల ఆదాయ పన్ను రిటర్న్ కాపీలను అక్రమంగా తీసుకున్నారని, అందుకే వాటిని దహనం చేశారన్న ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని కూడా సిట్ తిప్పికొట్టింది. తాము నిబంధనల ప్రకారమే హెరిటేజ్ ఫుడ్స్, ఇతర నిందితుల ఆదాయ పన్ను రిటర్న్ కాపీలను తీసుకున్నామని తెలిపింది. ఆదాయ పన్ను శాఖకు అధికారికంగా లిఖిత పూర్వకంగా కోరి వారి నుంచి ఆ కాపీలను తీసుకున్నామని చెప్పింది. హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ నుంచి కూడా అధికారికంగానే లేఖ రాసి మరీ చాలా పత్రాలను తీసుకున్నామంది. ఆ ఐటీ రిటర్న్‌లు, హెరిటేజ్ ఫుడ్స్ నుంచి తీసుకున్న పత్రాల ఆధారంగానే ఈ కేసులో లోకేశ్, ఇతర నిందితులను విచారించామని సిట్ తెలిపింది. ఆ దర్యాప్తు నివేదికను కూడా న్యాయస్థానానికి సమర్పించామని చెప్పింది. ఓ వర్గం మీడియా ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేయడాన్ని సిట్ తీవ్రంగా ఖండించింది. ఆ మీడియా చానళ్లు దుష్ప్రచారాన్ని మాని వాస్తవాలను తెలుసుకోవాలని హితవు చెప్పింది. ‘హెరిటేజ్’కు దీటైన జవాబు ఇచ్చిన సిట్ చంద్రబాబుపై నమోదైన కేసులకు సంబంధించిన తమ కంపెనీ పత్రాల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ హెరిటేజ్ ఫుడ్స్ రాసిన లేఖకు సీఐడీ దీటైన సమాధానం ఇచ్చింది. హెరిటేజ్ ఫుడ్స్‌కు సంబంధించిన పత్రాలపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, అవన్నీ న్యాయస్థానానికి తాము ఎప్పుడో సమర్పించామని, అన్ని పత్రాలు భద్రంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఈమేరకు సిట్ అధికారులు హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ సెక్రటరీ ఉమాకాంత బారిక్‌కు సోమవారం ఓ లేఖ రాళారు. తాము హెరిటేజ్ ఫుడ్స్‌కు అధికారికంగా లేఖ ద్వారా కోరి 2022 సెప్టెంబర్ 12 నుంచి 2023 అక్టోబరు 4 వరకు ఏడుసార్లు పొందిన ఆ కంపెనీ పత్రాల వివరాలను వెల్లడించారు. ఆ ఒరిజినల్ పత్రాలను న్యాయస్థానానికి సమర్పించిన వివరాలను సీఎఫ్ఆర్ నంబర్లతో సహా తెలిపారు. ఓ వర్గం మీడియా ఉద్దేశపూర్వకంగా చేసిన దుష్ప్రచారాన్ని ఖండిస్తూ తాము జారీ చేసిన ప్రెస్ నోట్‌ను కూడా ఈ లేఖకు జతపరిచారు. ఆ వర్గం మీడియా రాజకీయ దురుద్దేశాలతో సిట్‌పై చేస్తున్న దుష్ప్రచారంపై ఎన్నికల కమిషన్‌కు చేసిన ఫిర్యాదు కాపీని కూడా హెరిటేజ్ ఫుడ్స్‌కు అందించారు. -
ఫైబర్ నెట్ స్కామ్ లో ఆస్తుల అటాచ్..సీఐడీకి అనుమతి
-
‘మార్గదర్శి’ షట్టర్ క్లోజ్!
సాక్షి, అమరావతి : అక్రమ పునాదులపై ఈనాడు రామోజీరావు నిర్మించుకున్న ఆర్థిక సామ్రాజ్యానికి చట్ట విరుద్ధంగా నిధులు అందించే కామథేనువు ‘మార్గదర్శి’ ఒట్టిపోయింది. చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా ఆయన తమ సొంత పెట్టుబడులుగా మళ్లించడంతో ‘మార్గదర్శి’ పాపాల పుట్ట బద్దలైంది. కేంద్ర చిట్‌ఫండ్ చట్టాన్ని కచ్చితంగా అమలుచేయాలని చిట్ రిజిస్ట్రార్ స్పష్టంచేయడంతో ఆ సంస్థలోని ఆర్థిక కార్యకలాపాలు దాదాపు 16 నెలలుగా స్తంభించిపోయాయి. దీంతో లక్షలాది మంది చందాదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిర్ణీత కాలంలో చందాదారులకు చిట్టీపాటల ప్రైజ్‌మనీ చెల్లించలేక మార్గదర్శి ముఖం చాటేస్తోంది. ష్యూరిటీలపై కొర్రీలు వేస్తూ కాలహరణం చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘మార్గదర్శి’ ఇక ప్యాకప్ చెప్పడమే తరువాయి అన్నట్లుగా ఉంది పరిస్థితి. రూ.4,880 కోట్లకు పైగా బకాయిలు కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం–1982కు విరుద్ధంగా చందాదారుల సొమ్మును రామోజీరావు తమ సొంత వ్యాపార సంస్థలైన ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ప్రైజెస్లతోపాటు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులుగా మళ్లించారు. రాష్ట్ర స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడింది. నిబంధనల ప్రకారం కొత్త చిట్టీలు ప్రారంభించాలంటే జిల్లా చిట్ రిజిస్ట్రార్ అనుమతి తీసుకోవాలి. అలాగే, కేంద్ర చిట్‌ఫండ్ చట్టాన్ని అమలుచేస్తున్నట్లుగా ఆధారాలు చూపాలని చిట్ రిజిస్ట్రార్లు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి మేనేజర్లను ఆదేశించారు. అందుకు రామోజీరావు ససేమిరా అన్నారు. మరోవైపు.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాలపై సీఐడీ విభాగం 2022, నవంబరులో కేసు నమోదు చేసింది. సొమ్మును రామోజీరావు అక్రమంగా మళ్లిస్తున్నారని తెలియడంతో కొత్త చందాదారులు చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేరడంలేదు. అప్పటి నుంచి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో కొత్త చిట్టీలు నిలిచిపోయాయి. దశాబ్దాలుగా మనీ సర్క్యులేషన్ (గొలుసుకట్టు మోసాలు) తరహాలో వ్యాపారం నిర్వహిస్తున్న రామోజీరావు అక్రమాలకు అడ్డుకట్ట పడింది. ఆ సంస్థలో మనీ టర్నోవర్ నిలిచిపోయింది. దాంతో ఇప్పటికే కొనసాగుతున్న చిట్టీ గ్రూపుల చిట్టీపాటల మొత్తం (ప్రైజ్‌మనీ) చెల్లించడం రామోజీకి తలకు మించిన భారంగా మారింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ రాష్ట్రంలో దాదాపు 16 నెలలుగా తమ చందాదారులకు ప్రైజ్‌మనీ సక్రమంగా చెల్లించలేకపోతోంది. ► ఇక రాష్ట్రంలో 37 బ్రాంచీల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు నెలనెలా రూ.260 కోట్ల టర్నోవర్ ఉంది. అందులో రూ.80 కోట్లు డివిడెండ్లుగా చెల్లించాల్సి ఉండగా.. రూ.180 కోట్లు వరకు చిట్టీ పాటల ప్రైజ్‌మనీగా చెల్లించాల్సి ఉంది. 2022 నవంబరు నుంచి ఆ ప్రైజ్‌మనీ మొత్తం సక్రమంగా చెల్లించకుండా బకాయిలు పేరుకుపోయాయి. ఆ ప్రకారం 16 నెలలకు రూ.2,880 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయని స్టాంపులు–రిజిస్ట్రేషన్లు, సీఐడీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ► అలాగే, మార్గదర్శి చిట్‌ఫండ్స్ రశీదు రూపంలో సేకరించిన అక్రమ డిపాజిట్లు కాలపరిమితి ముగుస్తున్నా చెల్లించలేకపోతోంది. 4 శాతం నుంచి 5 శాతం వడ్డీ చొప్పున ఆరునెలల నుంచి రెండేళ్ల కాలపరిమితితో అక్రమంగా ఆ డిపాజిట్లను సేకరించింది. కాల పరిమితి ముగిసిన ఆ రశీదు డిపాజిట్లను కూడా మార్గదర్శి చిట్‌ఫండ్స్ 16 నెలలుగా చెల్లించలేకపోతోంది. ఈ బకాయిలు కూడా కలిపితే మొత్తం మీద దాదాపు రూ.2వేల కోట్ల వరకు ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వెరసి మార్గదర్శి చిట్‌ఫండ్స్ దాదాపు రూ.4,880 కోట్ల వరకు చందాదారులకు చెల్లించాల్సి ఉంటుందని సీఐడీ అధికారులు అంచనా వేశారు. కొర్రీలతో చందాదారులకు ముప్పుతిప్పలు ఇదిలా ఉంటే.. చిట్టీ పాటల ప్రైజ్‌మనీ, కాలపరిమితి ముగిసిన డిపాజిట్ల సొమ్ము కోసం చందాదారులు మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. కానీ, తమ గల్లాపెట్టే ఖాళీ కావడంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ కొర్రీలు వేస్తూ చందాదారులను మొండిచేయి చూపిస్తోంది. నిబంధనల ప్రకారం మూడు ష్యూరిటీలు చూపించినా.. వారు ప్రభుత్వ ఉద్యోగులు అయినా సరే ఏవేవో కొర్రీలు వేస్తూ తిరస్కరిస్తోంది. పైగా.. చందాదారులకు చెల్లించాల్సిన మొత్తాన్ని మళ్లీ రశీదు డిపాజిట్‌గానే తమ డిపాజిట్ చేయాలని సూచిస్తోంది. ప్రస్తుతం తాము ఆ మొత్తాన్ని చెల్లించలేమని చెబుతుండటం గమనార్హం. ఇలా అక్రమంగా రశీదు డిపాజిట్ల దందాను కొనసాగించాలని రామోజీరావు భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన అక్రమ వ్యాపార సామ్రాజ్యానికి ఇంధనం ఆ అక్రమ డిపాజిట్లే కాబట్టి. కానీ, సీఐడీ అధికారులు నిశితంగా కేసు దర్యాప్తు చేస్తుండడంతో అక్రమ డిపాజిట్ల దందాకు చెక్ పడింది. చందాదారులకు సీఐడీ రక్షణ.. మరోవైపు.. ఈ వ్యవహారాన్ని ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లకు కూడా సీఐడీ నివేదించింది. దాంతో రామోజీ ఆర్థిక అక్రమాల ఆట కట్టింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులు మోసపోకుండా, వారి చిట్టీల మొత్తం, డిపాజిట్లకు న్యాయస్థానాల ద్వారా రక్షణ కల్పించేందుకు సీఐడీ ఉద్యుక్తమైంది. తద్వారా అగ్రిగోల్డ్ తరహాలో రామోజీరావు మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులను ముంచేయకుండా సీఐడీ కార్యాచరణను చేపట్టింది. -
అయినా రామోజీ మారలేదు... అక్రమ డిపాజిట్లు ఆగలేదు
సాక్షి, అమరావతి : ఈనాడు పత్రికాధిపతిగా శ్రీరంగ నీతులు వల్లించే చెరుకూరి రామోజీరావు.. ‘మార్గదర్శి’ అధినేతగా యథేచ్ఛగా ఆర్థిక దోపిడీకి పాల్పడుతుంటారు. చట్టాలను ఎడాపెడా ఉల్లంఘిస్తూ ఆయన సాగించే ఆర్థిక దోపిడీకి ఈనాడు పత్రికను రక్షా కవచంగానే వాడుకుంటున్నారన్నది నగ్న సత్యం. మరోవైపు చంద్రబాబుకు రాజగురువు కాబట్టి తాను చట్టాలకు అతీతమని భావిస్తూ ఉంటారు. పత్రికాధిపతి కాబట్టి ఆయన అక్రమాలను ఎవరూ ప్రశ్నించకూడదని వాదిస్తూ ఉంటారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం చేపట్టిన కఠిన కార్యాచరణతో ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ను మూసివేసుకోవాల్సి వచ్చినా, అక్రమ డిపాజిట్ల దందాను మాత్రం విడిచిపెట్టలేదు. ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్’ పేరిట డిపాజిట్లు యథేచ్చగా వసూలు చేస్తూ భారీగా ఆర్థిక అక్రమాలను కొనసాగించారు. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం, రాష్ట్ర డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టాలను దర్జాగా ఉల్లంఘిస్తూ అక్రమ డిపాజిట్లు వసూలు చేసి ఆ నిధులను సొంత ప్రయోజనాల కోసం దారి మళ్లించారు. గత ఏడాది స్టాంపులు, రిజిస్ట్రేషన్లు శాఖ, సీఐడీ అధికారులు రాష్ట్రంలోని 38 మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో చేసిన సోదాలతో ఈ ఆర్థిక దోపిడీ ఆధారాలతో సహా బట్టబయలైంది. దాంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు ఏ–1గా, ఆయన పెద్ద కోడలు, మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ చెరుకూరి శైలజ ఏ–2గా, మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి మేనేజర్లను ఏ–3గా సీఐడీ కేసు నమోదు చేసింది. వారిపై సెక్షన్లు 120 (బి), 409, 420, 477 (ఎ) రెడ్‌విత్ 34 సీఆర్సీపీ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజర్లను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. రామోజీరావు, శైలజ కిరణ్‌ను విచారించి కీలక సమాచారాన్ని రాబట్టారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ముసుగులో రామోజీరావు సాగించిన ఆర్థిక దోపిడీ తీరు ఇదిగో ఇలా ఉంది... భారీగా అక్రమ డిపాజిట్ల సేకరణ కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం–1982, బ్యానింగ్ ఆఫ్ నాన్ రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్స్( బీఎన్డీఎస్)–1999 చట్టాలను ఉల్లంఘిస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ ముసుగులో రామోజీరావు యథేచ్ఛగా అక్రమంగా డిపాజిట్లను సేకరించారు. ఆ రెండు చట్టాల ప్రకారం చిట్‌ఫండ్ కంపెనీలు వాటి ఖాతాదారులు, ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించకూడదు. కానీ ఈ చట్టాన్ని రామోజీరావు ఏమాత్రం పట్టించుకోకుండా యథేచ్ఛగా అక్రమ డిపాజిట్లు సేకరించారు. రశీదు రూపంలో డిపాజిట్లు సేకరించారు. యాజమాన్య కోటా టికెట్ల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు. చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా రామోజీ సొంత కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్‌లో అక్రమ పెట్టుబడులుగా పెట్టి భారీగా సొంత ఆస్తులు పెంచుకున్నారు. రశీదుల ముసుగులో అక్రమ డిపాజిట్లే రశీదులు, భవిష్యత్ చిట్టీలకు ష్యూరిటీల పేరుతో రామోజీరావు అక్రమ డిపాజిట్ల దందా కొనసాగిస్తున్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థలో చిట్టీ పాడిన చందాదారులకు వారికి రావాల్సిన సొమ్ములో మొత్తం చెల్లించడంలేదు. అందులో కొంత సొమ్మును సంస్థ వద్ద డిపాజిట్‌గా ఉంచుకుంటోంది. ఆమేరకు ఓ రశీదు ఇస్తోంది. అలా రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు చందాదారుల నుంచి రశీదు రూపంలో డిపాజిట్లు సేకరిస్తోంది. ఆ డిపాజిట్లపై 4 శాతం, 5 శాతం వడ్డీ చెల్లిస్తామని చెబుతోంది. ఏదైనా ఆర్థిక సంస్థ ఖాతాదారుల నగదును దాని వద్ద అట్టిపెట్టుకుని దానిపై వడ్డీ చెల్లిస్తామని లిఖితపూర్వకంగా తెలిపితే దానిని డిపాజిట్‌గానే పరిగణిస్తారు. అలా డిపాజిట్లు సేకరించాలంటే ఆర్బీఐ నిబంధనలను అనుసరించాలి. ఆర్బీఐ నిబంధన ప్రకారం చిట్‌ఫండ్స్ సంస్థలు డిపాజిట్లు వసూలు చేయకూడదు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ రశీదు ముసుగులో డిపాజిట్లు సేకరిస్తోంది. ఇక చందాదారుల నుంచి ష్యూరిటీ తీసుకోవడానికి కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం నిర్దేశించిన విధానాలకు విరుద్ధంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ వ్యవహరిస్తోంది. జాతీయ/షెడ్యూల్డ్ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల పత్రాలు, బంగారు ఆభరణాలు, లైఫ్ ఇన్సూ్యరెన్స్ పత్రాలు, స్థిరాస్తి పత్రాలు గానీ ముగ్గురు వ్యక్తుల హామీ గానీ ష్యూరిటీగా తీసుకోవాలని చట్టం నిర్దేశించింది. అంతే కానీ, చిట్టీ పాట కింద చెల్లించాల్సిన మొత్తంలోనే కొంత ష్యూరిటీగా అట్టిపెట్టుకోడానికి అవకాశం లేదు. కానీ రామోజీరావు తమ చందాదారుల చిట్టీ పాట మొత్తం నుంచి కొంత భాగాన్ని ష్యూరిటీ పేరుతో అట్టిపెట్టుకుంటున్నారు. ఆ పేరుతో అక్రమంగా డిపాజిట్లు వసూలు చేస్తున్నారు. యాజమాన్య టికెట్ల పేరుతో దందా యాజమాన్య కోటా పేరుతో చిట్టీ గ్రూపుల్లోని టికెట్ల ముసుగులో రామోజీరావు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. చిట్‌ఫండ్ కంపెనీలు వేసే చిట్టీలలో నిర్ణీత చందాదారుల సంఖ్య (వీటిని టికెట్స్ అని వ్యవహరిస్తారు)లో కొన్ని ఖాళీగా ఉండిపోతాయి. అలా ఖాళీగా ఉండిపోయే టికెట్స్‌ను ఆ కంపెనీ తీసుకోవాలి. ఆ టికెట్స్‌పై చందాను కంపెనీయే చెల్లించాలి. తరువాత కొత్త చందాదారులు వస్తే వాటితో ఆ టికెట్స్‌ను భర్తీ చేయవచ్చు. చిట్‌ఫండ్ చట్టంలోని సెక్షన్లు 27, 32లలో స్పష్టంగా నిర్దేశించిన ఈ నిబంధనలను రామోజీరావు ఏనాడూ పట్టించుకోలేదు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఏర్పాటు చేసినప్పుడు ప్రతి చిట్టీలోనూ కనీసం ఒకటి నుంచి 50శాతం టికెట్లను సొంతంగా కలిగి ఉంటామని పేర్కొంది. కానీ, తమ పేరుతో ఉన్న టికెట్లపై చందాను ఏనాడూ చెల్లించలేదు. కేవలం ఒక చిట్టీలోని తమ పేరుతో ఉన్న టికెట్లకు చెల్లించాల్సిన మొత్తాన్ని మరో చిట్టీలోని టికెట్లపై డిస్కౌంట్ మొత్తం నుంచి.., మళ్లీ ఆ చిట్టీలోని తమ టికెట్లను మరో చిట్టీలోని డిస్కౌంట్ మొత్తం నుంచి మళ్లించినట్టు రికార్డుల్లో కనికట్టు చేసింది. అంటే సంస్థ పేరిట ఉన్న టికెట్లపై మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందా ఏనాడూ చెల్లించలేదు. కేవలం రికార్డుల్లో జంబ్లింగ్ అంటే బుక్ అడ్జస్ట్మెంట్స్ ద్వారా చూపించి చందాదారులను మోసం చేసింది. మళ్లీ తమ టికెట్లపై చందా పాట మొత్తాన్ని మాత్రం వసూలు చేసుకుంటోంది. ఆ విధంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఒక్క రూపాయి కూడా చందాగా పెట్టకుండానే భారీగా చందాదారుల సొమ్మును దాని ఖాతాల్లోకి మళ్లించుకుంటోంది. ఆ ఒక్క బ్యాంకు ఖాతా... రామోజీ దోపిడీకి కేంద్ర బిందువు బ్యాంకు ఖాతాల నిర్వహణలోనూ రామోజీరావు నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. చిట్‌ఫండ్ సంస్థలు ప్రతి చిట్టీకి ఓ ప్రత్యేక బ్యాంకు ఖాతా నిర్వహించాలి. ఆ చిట్టీకి సంబంధించిన చందాల వసూళ్లు, చెల్లింపులు దాని ద్వారానే జరగాలి. ఇలా ఏ ఏ బ్యాంకు ఖాతాల ద్వారా చిట్టీలు నిర్వహిస్తారో వెల్లడించాలి. ఈ నిబంధనలను మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఉల్లంఘిస్తోంది. అన్ని చిట్టీల చందా మొత్తాలను ఒకే బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. చిట్టీల ఒప్పందాల్లో కేవలం బ్యాంకు పేరునే పేర్కొంటోంది గానీ, బ్యాంకు ఖాతాల నంబర్లు, ఇతర వివరాలను ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తోంది. తద్వారా ఒక బ్యాంకు ఖాతాలో భారీ మొత్తాన్ని పోగేస్తోంది. రామోజీరావు ఇలా చేయడం వెనుక అతి పెద్ద ఆర్థిక కుతంత్రం దాగుంది. నిబంధనల ప్రకారం చిట్టీల బ్యాంకు ఖాతాలపై చిట్çœండ్ సంస్థ బ్రాంచి మేనేజర్ (ఫోర్మేన్)కు చెక్ పవర్ ఉండాలి. ఆ మేనేజరే చందాదారులకు చిట్టీ మొత్తాన్ని చెల్లించడంతోపాటు ఆన్లైన్ వ్యవహారాలు నిర్వహించాలి. కానీ మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థలో ఏ బ్రాంచి మేనేజర్‌కూ చెక్ పవర్ ఇవ్వలేదు. చెక్ పవర్ అంతా ప్రధాన కార్యాలయం వద్దే అట్టిపెట్టారు. రామోజీరావు, శైలజ కిరణ్‌తోపాటు ప్రధాన కార్యాలయంలో ఉన్న కొద్దిమందికే చెక్ పవర్ కల్పించారు. సొమ్ము చందాదారులది.. సోకు రామోజీది కేంద్ర చట్టం ప్రకారం చిట్‌ఫండ్ కంపెనీలు చందాదారుల సొమ్మును ఇతర కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టకూడదు. కానీ రామోజీరావు మాత్రం చందాదారుల సొమ్మును సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం అక్రమ పెట్టుబడులుగా మళ్లిస్తున్నారు. తమ కుటుంబ సభ్యులే డైరెక్టర్లుగా ఉన్న ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్‌ప్రైజస్, మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్–చెన్నై, మార్గదర్శి చిట్స్ (కర్ణాటక) ప్రైవేట్ లిమిటెడ్–బెంగళూరులో అక్రమ పెట్టుబడులుగా తరలించారు. ఆ కంపెనీల్లో ఏకంగా 88.5% వాటా పెట్టుబడిగా పెట్టడం గమనార్హం. దాంతోపాటు ముంబయిలోని పలు మ్యూచువల్ ఫండ్స్‌లో అక్రమ పెట్టుబడులు పెట్టారు. రామోజీరావు సొంతంగా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా చందాదారుల సొమ్మును అక్రమంగా పెట్టుబడులుగా మళ్లిస్తూ భారీగా అక్రమ ఆదాయాన్ని పొందుతున్నారు. -
చంద్రబాబు లూటీ...కీలక ఆధారాలను సేకరించిన సీఐడీ
-
ఎల్లో మీడియా దుష్ప్రచారంపై సీఐడీ సీరియస్
సాక్షి, విజయవాడ: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఎల్లో మీడియా దుష్ప్రచారంపై సీఐడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఛార్జ్‌షీట్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించిందన్న వార్తలను సీఐడీ ఖండించింది. ఛార్జ్‌షీట్‌కు దాఖలు చేయబడిన అనుబంధ పత్రాలను పరిశీలించడానికి కొంత సమయం పడుతుందని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. ఎల్లో మీడియాపై న్యాయపరమైన చర్యలకు సీఐడీ సిద్ధమవుతుంది. కాగా, టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు యథేచ్ఛగా సాగించిన కుంభకోణాలపై సీఐడీ దూకుడు పెంచింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో గురువారం చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా పొంగూరి నారాయణలను పేర్కొంది. లింగమనేని కుటుంబంతో కలిసి సాగించిన ఈ క్విడ్ ప్రో కో కుంభకోణంలో హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్‌గా వ్యవహరించిన నారా లోకేశ్‌ను ఏ–14గా, లింగమనేని రమేశ్ తదితరులను కూడా నిందితులుగా పేర్కొంది. వారిపై ఐపీసీ 120(బి), 409, 420, 34, 35, 37.. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2), రెడ్‌విత్ 13(1)(సి),(డి)ల ప్రకారం వారిపై కేసు నమోదు చేసినట్టు ఆ చార్జ్‌షీట్‌లో వెల్లడించింది. తద్వారా ఈ భారీ భూ కుంభకోణంపై న్యాయ విచారణ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. కాగితాల మీదే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో ఇష్టానుసారం మార్పులు చేసి, వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన చంద్రబాబు ముఠా అవినీతి బాగోతం విభ్రాంతి పరుస్తోంది. టీడీపీ ప్రభుత్వంలో సీఆర్డీఏ చైర్మన్‌గా అప్పటి సీఎం చంద్రబాబు, వైస్ చైర్మన్‌గా అప్పటి మంత్రి పొంగూరు నారాయణ బరితెగించి ఇలా అవినీతికి పాల్పడ్డారు. ఇందుకోసం లింగమనేని రమేశ్‌తో క్విడ్ ప్రో కో కు తెరలేపారు. ఈ తతంగంలో నారా లోకేష్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. చంద్రబాబు బినామీ, సన్నిహితుడు లింగమనేని భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లకు.. రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లకు చేరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను ఖరారు చేయడం భారీ దోపిడీకి నిదర్శనం. ఈ అవినీతి పాపంలో చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్‌కు కూడా వాటా ఇవ్వడం గమనార్హం. ఇదీ చదవండి: 'దొరికారు దొంగలు' ఏ–1 చంద్రబాబు, ఏ–2 నారాయణ -
దొరికారు దొంగలు..ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసులో సీఐడీ ఛార్జ్ షీట్
-
HYD: పాస్‌పోర్టు కేసు దర్యాప్తు.. 15కి చేరిన అరెస్ట్‌ల సంఖ్య
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన పాస్‌పోర్టుల కుంభకోణం కేసులో తెలంగాణ సీఐడీ దర్యాప్తు వేగంగా సాగుతోంది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అనర్హులకు పాస్ పోర్టులు జారీ చేసిన వ్యవహారంలో మరో ముగ్గురిని సీఐడీ అరెస్ట్ చేసింది. ఆదిలాబాద్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో పని చేసే ప్రణబ్, ఎస్బీ ఏఎస్ఐ లక్ష్మణ్‌తో పాటు మరొకరు అరెస్టయ్యారు. మరో పాస్‌పోర్టు ఏజెంట్‌ను ముంబైలో సీఐడీ అదుపులోకి తీసుకుంది. ఇప్పటి వరకు శ్రీలంక వాసులకు 95 పాస్‌పోర్టులు జారీ అయినట్లుగా సీఐడీ గుర్తించింది. 95 మంది వివరాలను పాస్‌పోర్ట్ అధికారులతో పాటు ఇమీగ్రేషన్ అధికారులకు సీఐడీ సమాచారం ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరెస్టయిన ఐదు మందిని కస్టడీకి తరలించి సీఐడీ విచారణ చేపట్టింది. ఇంకా అరెస్ట్‌లు పెరిగే అవకాశం ఉంది. ఇదీ చదవండి: సాంబశివరావుపై చీటింగ్ కేసు నమోదు -
'స్కిల్' దొంగ బాబే
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో చంద్రబాబే అవినీతి తిమింగళం అని మరోసారి నిగ్గు తేలింది. యువతకు నైపుణ్య శిక్షణ పేరిట ఆయన గారు సాగించిన బాగోతం చూసి యావత్ దేశం అవాక్కయ్యింది. అసలు జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో ప్రాజెక్ట్‌ను కాగితాలపై సృష్టించడం.. రూ.370 కోట్ల ప్రాజెక్ట్ వ్యయాన్ని ఏకంగా రూ.3,300 కోట్లకు పెంచడం.. సీమెన్స్ కంపెనీ పేరున జీవో జారీ చేసి, తన బినామీ కంపెనీ డిజైన్ టెక్ కంపెనీతో ఒప్పందం చేసుకోవడం.. ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిధులు రూ.271 కోట్లు విడుదల చేయడం.. షెల్ కంపెనీల ద్వారా అక్రమ నిధులు తన నివాసానికే చేర్చడం.. పైగా అంతా పద్దతి ప్రకారం చేశామంటూ అడ్డగోలుగా వాదించడం.. మరోమారు చర్చకు వచ్చింది. సాక్షి, అమరావతి: స్కిల్ స్కామ్ వంటి ఎన్నో కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన అక్రమ నిధుల తరలింపు కోసం ఏర్పాటు చేసుకున్న అవినీతి నెట్వర్క్ గుట్టును సీఐడీ ఛేదించడం.. స్కిల్ స్కామ్‌లో ఏసీబీ కోర్టు బాబుకు రిమాండ్ విధించడం.. సాక్ష్యాధారాలన్నీ బలంగా ఉండటంతో ఏసీబీ కోర్టు తీర్పులో, విచారణలో జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు చెప్పడం చూస్తుంటే చంద్రబాబే అసలు దొంగ అని మరోసారి ఎలుగెత్తి చాటినట్లయింది. సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ప్రాజెక్ట్‌ను రూపొందించిందీ ఆయనేనని, అక్రమంగా మళ్లించిన నిధులు చేరింది ఆయన నివాసానికే అన్నది సీఐడీ నిగ్గు తేల్చిన విషయం తెలిసిందే. దాంతో సీఐడీ ఆయనపై కేసు నమోదు చేసింది. కీలక ఆధారాలతో ఈ కేసులో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ చార్జ్‌షీట్ నమోదు చేసింది. ఆయనపై ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఏ), 409, 201, 109 రెడ్‌విత్ 34, 37లతోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్‌విత్ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో కార్మీక శాఖ మంత్రిగా వ్యవహరించిన కింజరాపు అచ్చెన్నాయుడు ఏ–2గా, మరో 38 మందిని నిందితులుగా పేర్కొంటూ సిట్ కేసు నమోదు చేసింది. గత ఏడాది సెప్టెంబరు 9న చంద్రబాబును అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరిచింది. ఈ స్కామ్‌లో చంద్రబాబు పాత్రను నిర్ధారిస్తూ సీఐడీ అధికారులు సమర్పించిన నివేదికతో సంతృప్తి చెందిన న్యాయమూర్తి ఆయనకు జ్యుడిíÙయల్ రిమాండ్ విధించారు. దాంతో పోలీసులు ఆయన్ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఖైదీ నంబర్ 7691గా ఆయన అక్కడ 52 రోజులు జ్యుడిíÙయల్ రిమాండ్‌లో ఉన్నారు. పలుమార్లు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన తర్వాత అనారోగ్య కారణాలను చూపిస్తూ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌తో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. విజనరీగా వేసుకున్న ముసుగు తొలగి చంద్రబాబు ఏ–1 అన్న నిజం ప్రపంచానికి తెలిసింది. స్కిల్ స్కామ్ ఎలా సాగిందంటే.. సీమెన్స్ పేరిట ఉత్తుత్తి ప్రాజెక్టు ► డిజైన్ టెక్ కంపెనీకి చెందిన సంజయ్ దంగాను పిలిపించుకుని యువతకు నైపుణ్యాల శిక్షణ పేరిట ఉత్తుత్తి ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ ముసుగులో ఆ కంపెనీకి ఏమాత్రం తెలియకుండానే ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. భారత్‌లో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్ బోస్, డిజైన్‌టెక్ ఎంపీ వికాస్ వినాయక్ కని్వల్కర్ సహకారంతో చంద్రబాబు అక్రమాలకు తెర తీశారు. ► విద్యా శాఖ ద్వారా సీమెన్స్ కంపెనీ పేరుతో 2014 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ మేరకు జీవో జారీ చేశారు. కేబినెట్ ఆమోదం కూడా లేకుండానే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ) ఏర్పాటు చేశారు. తద్వారా సీమెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు మభ్యపుచ్చారు. ► ఈ ప్రాజెక్ట్‌లో చంద్రబాబు బినామీలు, సన్నిహితులే అంతా తామై వ్యవహరించారు. ఏపీఎస్ఎస్డీసీకి అప్పట్లో డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, చంద్రబాబు సన్నిహితుడు కే లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు కీలకంగా వ్యవహరించారు. గంటా సుబ్బారావును ఏకంగా ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–సీఈవో పోస్టుతోపాటు ఉన్నత విద్యా శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ – ఇన్నోవేటివ్ కార్పొరేషన్ కార్యదర్శి, ముఖ్యమంత్రికి ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా ఏకంగా నాలుగు పోస్టులు కట్టబెట్టారు. ► ఉన్నత విద్య శాఖ ముఖ్య కార్యదర్శికి ఎలాంటి పాత్ర లేకుండా గంటా సుబ్బారావుతో నేరుగా నిధులు మంజూరు ప్రక్రియ కొనసాగించడానికి కుతంత్రం పన్నారు. అనంతరం సీమెన్స్ కంపెనీ సీనియర్ డైరెక్టర్ జీవీఎస్‌భాస్కర్ సతీమణి, యూపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి అపర్ణను ఏపీఎస్ఎస్డీసీ డిప్యూటీ సీఈవోగా నియమించారు. ఇది పరస్పర ప్రయోజనాల విరుద్ధ చట్టానికి వ్యతిరేకమైనా సరే చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. ► సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, ఇతర అంశాలకు సంబంధించిన ఇన్వాయిస్లు, ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్టు విలువ రూ.370 కోట్లు మాత్రమే. చంద్రబాబు దీన్ని అమాంతం రూ.3,300 కోట్లకు పెంచేసి ఆ మేరకు నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వం పది శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్‌టెక్ 90 శాతం పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. షెల్ కంపెనీల ద్వారా డబ్బులు ► డిజైన్ టెక్కు చెల్లించిన రూ.371 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి వివిధ దశల్లో అక్రమంగా తరలించారు. ప్రతి దశలోనూ షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ చంద్రబాబుకు రూ.241 కోట్లు చేర్చారు. టీడీపీ ప్రభుత్వం పుణేకు చెందిన డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించింది. ► డిజైన్ టెక్ కంపెనీ నుంచి పుణెలోని పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి రూ.238.29 కోట్లు, ఢిల్లీలోని ఏసీఐ కంపెనీకి రూ.2.71 కోట్లు అంటే మొత్తం రూ.241 కోట్లు తరలించారు. ► మొత్తం రూ.140.53 కోట్లను ఆ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి యోగేశ్ గుప్తా డ్రా చేసి మనోజ్ వాసుదేవ్ పార్థసానికి అందించారు. మనోజ్ పార్ధసాని ఆ నగదు మొత్తాన్ని చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లో ముట్టజెప్పారు. అంటే ఆ రూ.140.53 కోట్లను చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ► మిగిలిన రూ.100.47 కోట్లను పీవీఎస్పీ కంపెనీ దుబాయి, సింగపూర్‌లోని కంపెనీలకు మళ్లించింది. ఆ నిధులను మళ్లీ హవాలా మార్గంలో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ మనోజ్ పార్థసాని ద్వారా చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు అందించారు. అనంతరం చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ఏపీఎస్ఎస్డీసీకి చెందిన రూ.241 కోట్లు అవినీతి నెట్వర్క్ ద్వారా ఇలా గుట్టు చప్పుడు కాకుండా చంద్రబాబు బంగ్లాకు వచ్చి చేరాయి. అమెరికాకు శ్రీనివాస్.. దుబాయ్‌కి మనోజ్ ► అక్రమ నిధుల తరలింపు పాత్రధారులు చంద్రబాబు ఆదేశాలతో విదేశాలకు పరారయ్యారు. విచారణకు రావాలని నోటీసులు జారీ చేయగానే చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ అమెరికాకు, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ పార్థసాని దుబాయ్‌కు ఉడాయించారు. టీడీపీ హయాంలోనే 2017లోనే ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం గుట్టు రట్టైంది. ► కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్ కంపెనీల్లో సోదాలు చేసి భారీగా నకిలీ ఇన్వాయిస్లను గుర్తించారు. వాటిలో ఏపీఎస్ఎస్డీసీకి సరఫరా చేసిన నకిలీ ఇన్వాయిస్లను గుర్తించడంతో ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. అయితే దీనిపై విచారణ చేయకుండా ఏసీబీని చంద్రబాబు అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు. ప్రాజెక్ట్ గురించి తెలియదన్న సీమెన్స్ ► సీఐడీ అధికారులు జర్మనీలోని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు తమకు ఆ ప్రాజెక్టు గురించే తెలియదని స్పష్టం చేసింది. ఆ వెంటనే సీమెన్స్ కంపెనీ భారత్‌లోని తమ ఎండీ సుమన్ బోస్‌ను పదవి నుంచి తొలగించింది. ఈ కేసులో కీలక సాక్షులైన ఐవైఆర్ కృష్ణారావు, పీవీ రమేశ్, సునీత తదితరులు చంద్రబాబు ఆదేశాలతోనే నిబంధనలకు విరుద్ధంగా నిధులను విడుదల చేసినట్లు వాంగ్మూలం ఇచ్చారు. స్కిల్ స్కామ్‌లో కీలక పాత్రధారిగా ఉన్న ఏసీఐ కంపెనీ ఎండీ చంద్రకాంత్ షా మొత్తం అవినీతి నెట్‌వర్క్‌ను వెల్లడిస్తూ వాంగ్మూలం ఇచ్చారు. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణానికి కర్త కర్మ క్రియ అంతా చంద్రబాబే అన్నది నిర్ధారణ అయింది. ► తాము ఇచ్చింది మూడో పార్టీ నివేదికే కాదని.. కేవలం ఏపీఎస్ఎస్డీసీ ఇచ్చిన పత్రాల పరిశీలన మాత్రమేనని సెంటర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) స్పష్టం చేసింది. సీఐటీడీ నివేదిక ఇవ్వక మునుపే డిజైన్ టెక్కు టీడీపీ సర్కారు నిధులు విడుదల చేసేసింది. ► ఈ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు చేపట్టింది. షెల్ కంపెనీల లావాదేవీల విషయాన్ని గుర్తించింది. ఇప్పటికే రూ.70 కోట్లు హవాలా మార్గంలో తరలించినట్టు నిర్ధారించింది. డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ శుక్రవారం జప్తు చేసింది. మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసి పలువురిని ఇప్పటికే విచారించింది. పలువురిని అరెస్టు చేసింది. ఈ ప్రాజెక్టులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి పడిందని కాగ్ కూడా నిగ్గు తేలి్చంది. ఈ వాస్తవాల కారణంగానే.. ఈ కేసు 2017లో నమోదైనందున చంద్రబాబుకు 17ఏ వర్తించదని సుప్రీంకోర్టు కూడా చెప్పడం గమనార్హం. న్యాయ నిపుణులు కూడా పాత కేసులకు పాత చట్టమే వర్తిస్తుందని తేల్చి చెబుతున్నారు. నో రూల్స్.. రూ.371 కోట్లు ఇచ్చేయండి ► సీమెన్స్ కంపెనీకి తెలియకుండా సుమన్ బోస్ నడిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో (నేరుగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుకు లేఖలు రాశారు) గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే పదం ఎక్కడా లేదు. ఆ స్థానంలో ‘గ్రాంట్ ఇన్ కైండ్’ అని పేర్కొన్నారు. ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న రూ.3,300 కోట్లలో 90 శాతం కాదు కదా కనీసం ఒక్క రూపాయి విలువైన ఆర్థిక సహకారంగానీ, వస్తు సహాయాన్ని గానీ అందించ లేదు. అయినా ఏపీఎస్ఎస్డీసీ తన వాటా కింద జీఎస్టీ కలిపి డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించేశారు. ► అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్, ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న సునీత అభ్యంతరం తెలిపినా పట్టించుకోలేదు. ఈ విషయాన్ని పీవీ రమేశ్ తన నోట్ ఫైల్లో పొందుపరిచారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా ఒప్పుకోలేదు. అయినప్పటికీ చంద్రబాబు.. గంటా సుబ్బారావు చెప్పినట్లుగా నిధులు విడుదల చేయాలని ఐవైఆర్ కృష్ణారావును ఆదేశించారు. ► దీంతో నోట్ ఫైళ్లలో సీఎం కాలమ్‌లో ‘ఏఐ’ (ఆఫ్టర్ ఇష్యూ..) అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోట్ చేశారు. అప్పటి సీఎం ఆదేశాల మేరకు నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్ఎస్డీసీ ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు మంజూరు చేశారు. ఇందుకు సంబంధించి మొత్తం 13 నోట్ ఫైళ్లలో అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు సంతకాలు చేశారు. అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు 5 చోట్ల సంతకాలు చేశారు. -
పూచికత్తు సమర్పణ..లొంగిపోనున్న చంద్రబాబు