సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన పాస్‌పోర్టుల కుంభకోణం కేసులో తెలంగాణ సీఐడీ దర్యాప్తు వేగంగా సాగుతోంది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అనర్హులకు పాస్ పోర్టులు జారీ చేసిన వ్యవహారంలో మరో ముగ్గురిని సీఐడీ అరెస్ట్ చేసింది.
ఆదిలాబాద్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో పని చేసే ప్రణబ్, ఎస్‌బీ ఏఎస్‌ఐ లక్ష్మణ్‌తో పాటు మరొకరు అరెస్టయ్యారు. మరో పాస్‌పోర్టు ఏజెంట్‌ను ముంబైలో సీఐడీ అదుపులోకి తీసుకుంది. ఇప్పటి వరకు శ్రీలంక వాసులకు 95 పాస్‌పోర్టులు జారీ అయినట్లుగా సీఐడీ గుర్తించింది.
95 మంది వివరాలను పాస్‌పోర్ట్ అధికారులతో పాటు ఇమీగ్రేషన్ అధికారులకు సీఐడీ సమాచారం ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరెస్టయిన ఐదు మందిని కస్టడీకి తరలించి సీఐడీ విచారణ చేపట్టింది. ఇంకా అరెస్ట్‌లు పెరిగే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: సాంబశివరావుపై చీటింగ్ కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment