![Lavanya Key Comments On Raj Tarun](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/Lavanya1.jpg.webp?itok=9QgXcXDO)
సాక్షి, హైదరాబాద్: మస్తాన్ సాయి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చంచల్ గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న నిందితుడు మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అమాయక యువతులు, మహిళలను లోబరుచుకుని అఘాయిత్యాలకు పాల్పడిన మస్తాన్‌సాయిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసింది. కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వడంతో నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.
ఈ క్రమంలో లావణ్య.. ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ.. రాజ్ తరుణ్ మీద కేసులు వెనక్కి తీసుకుంటానని.. రాజ్, తాను విడిపోవడానికి మస్తాన్ సాయే కారణమని ఆమె తెలిపారు. ‘‘నేను మస్తాన్ సాయి ఇంటికి పార్టీ కోసం వెళ్లాను. నాకు తెలియకుండానే నేను బట్టలు మారుస్తున్నపుడు వీడియో తీసుకున్నాడు. అవి పెట్టుకుని నన్ను బెదిరించాడు. నేను నా వీడియోలు డిలీట్ చేయటానికి ప్రయత్నించాను. ఆ టైం లో నన్ను చంపటానికి మస్తాన్ సాయి ప్రయత్నించాడు. మస్తాన్ సాయి డ్రగ్ పార్టీలు ఇచ్చి యువతులను వశపర్చుకుంటున్నాడు. మస్తాన్ సాయి ఆగడాలు పోలీసులు బయటపెట్టాలి’’ అని లావణ్య కోరారు.
‘‘యువతులు వీడియోలు ఎక్కడ అమ్ముతున్నాడో పోలీసులు తేల్చాలి. నేను రాజ్ తరుణ్ కోసం ఒంటరి పోరాటం చేశాను. నేను సహాయం కోసం మాత్రమే కొందరితో పర్సనల్ గా మాట్లాడాను. నేను నా కేసులో ఏమవుతుందో తెలుసుకోవడం కోసమే వేరే వ్యక్తులతో వీడియో కాల్స్ మాట్లాడాను. రాజ్ తరుణ్ ఇప్పుడు వచ్చిన కాళ్ళు మొక్కుతాను. నేను మస్తాన్ సాయి నుంచి బయటపడితే చాలు’’ అంటూ లావణ్య వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: లావణ్య హత్యకు మస్తాన్ సాయి ప్లాన్.. సంచలన విషయాలు వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment