సాక్షి, హైదరాబాద్: అమాయక యువతులు, మహిళలను లోబరుచుకుని అఘాయిత్యాలకు పాల్పడిన మస్తాన్‌సాయి రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. హార్డ్ డిస్క్ కోసం ఆమెను చంపేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మస్తాన్‌సాయి, అతడి స్నేహితుడు ఖాజాకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు నిర్ధరణ అయినట్లు రిమాండ్ రిపోర్టు ద్వారా వెల్లడైంది.
మస్తాన్‌సాయి రిమాండ్ రిపోర్టు ప్రకారం..‘మస్తాన్‌సాయి, అతడి స్నేహితుడు ఖాజాకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు నిర్ధరణ అయినట్లు రిమాండ్ రిపోర్టు ద్వారా వెల్లడైంది. డ్రగ్స్ మత్తులో లావణ్య ఇంటికి మస్తాన్ సాయి వెళ్లి గొడవ చేశాడు. అతడిపై ఎన్డీపీఎస్ సెక్షన్‌ను కూడా పోలీసులు జత పరిచారు. మస్తాన్ సాయి ల్యాప్‌టాప్‌లో ఉన్న లావణ్య వీడియోలను రాజ్‌తరుణ్ గతంలోనే తొలగించాడు. అయితే, ఆలోపే ఇతర డివైస్‌లలోకి ఆ వీడియోలను మస్తాన్ సాయి కాపీ చేసుకున్నాడు. లావణ్యను పలు మార్లు చంపేందుకు అతడు యత్నించాడు. హార్డ్ డిస్క్ కోసం ఆమెను చంపేందుకు ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు. గత నెల 30న లావణ్య ఇంటికి వెళ్లి హత్యాయత్నం చేసినట్లు వెల్లడించారు.
వెలుగులోకి వస్తున్న ఆకృత్యాలు..
కొన్నేళ్లుగా మస్తాన్‌సాయి పబ్‌లు, వీఐపీ పార్టీలలో యువతులు, వివాహిత మహిళలను మచ్చిక చేసుకుని వారితో ఏకాంతంగా గడిపిన వీడియోలు, వాట్సాప్ చాటింగ్‌లు, ఫోన్ రికార్డింగులను హార్డ్ డిస్క్‌లో భద్రపరిచాడు. ఆ హార్డ్ డిస్క్‌ను మస్తాన్‌సాయి ఇంటినుంచి తీసుకున్న లావణ్య.. పోలీసులకు అందించారు. ఆ హార్డ్ డిస్క్ కోసమే మస్తాన్‌సాయి తన ఇంటిపై దాడిచేసి తనను చంపేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదు చేశారు.
చదవండి: రాజ్ తరుణ్- లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్..
కాగా, లావణ్యను డ్రగ్స్ కేసులో మరోమారు ఇరికించేందుకు మస్తాన్‌సాయి, శేఖర్‌బాషా యత్నిస్తున్నారని ఆమె తరపు న్యాయవాది నాగూర్‌బాబు ఆరోపించారు. వారి మధ్య జరిగిన సంభాషణ రికార్డులను మంగళవారం పోలీసులకు అందించామని తెలిపారు. లావణ్య ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసి, ఇంట్లో డ్రగ్స్ పెట్టి పోలీసులకు పట్టించాలనే పథకం వేశారని ఆరోపించారు. ఆ వివరాలన్నీ పోలీసులకు అందించి చర్యలు తీసుకోవాలని కోరామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment