manikonda
-
రంగారెడ్డి జిల్లా మణికొండలో హైడ్రా కూల్చివేతలు
-
కాలింగ్ బెల్ కొట్టి..ఇంట్లోకి చొరబడి..
మణికొండ: చైన్‌స్నాచర్లు రోడ్ల పక్కన ఏమరుపాటుగా వెళుతున్న మహిళలను టార్గెట్ చేసి చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడతారు. అందుకు భిన్నంగా ఇంట్లో ఉన్న మహిళలోని గొలుసును చోరీ చేసిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని హైదర్షాకోట్లో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితురాలు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్షాకోట్ గ్రామం సన్సిటీలోని విజయ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో మంజుల నివసిస్తుంది. దీనికి సమీపంలోనే ఓ జిరాక్స్‌సెంటర్ నడుపుతుంది. ప్రతిరోజూ మాదిరిగానే మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చి తిని కొద్ది సేపు పడుకునే ప్రయత్నం చేసింది. అంతలోనే కాలింగ్ బెల్ పలుమార్లు మోగటంతో నిద్రమత్తులోనే వచ్చి డోరు తీసింది. మొహానికి మాస్క్ ధరించిన ఓ ఆగంతకుడు ఇంట్లోకి చొరబడి ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును లాక్కుని పరారయ్యాడు. ఆమె గట్టిగా అరవంటంతో పక్కఫ్లాట్లోని వ్యక్తి అతని వెంబడించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో బాధితురాలు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
రెండ్రోజుల క్రితమే గృహ ప్రవేశం.. అంతలోనే అగ్ని ప్రమాదం
రెండ్రోజుల క్రితం ఆనందంగా బంధు మిత్రులను పిలుచుకుని గృహ ప్రవేశం చేశారు. సొంతింటి కల నెరవేరిందని సంబరపడ్డారు. అంతలోనే కలల సౌధం కాలిపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. హైదరాబాద్ మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. పుప్పాలగూడలో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఈఐపీఎల్ కార్నర్‌స్టోన్ గేటెడ్ కమ్యూనిటీలోకి కొందరు చేరుతున్నారు. అందులోని 8వ అంతస్తు 804 ఫ్లాట్‌ను ఐటీ ఉద్యోగి సంతోష్ కొనుగోలు చేశారు.రెండు నెలలుగా ఇంటిరీయర్ పనులు చేయించారు. సోమవారం గృహ ప్రవేశం చేశారు. మూడు రోజుల పాటు కొత్త ఫ్లాట్‌లోనే నిద్ర చేశాక పూర్తి స్థాయిలో సామాన్లతో ఇక్కడకు వచ్చే ఆలోచనలో ఉన్నారు. కిచెన్‌లో పూజ చేసి వెలిగించిన దీపం బుధవారం దాని కింద ఉన్న దుస్తులకు అంటుకుంది. ఇది గమనించిన కుటుంబీకులు దీపాన్ని ఆర్పకుండా భయంతో బయటికి పరుగులు తీశారు. దీంతో మంటలు వ్యాపించడంతో ఫ్లాట్ మొత్తం కాలిపోయింది. మంటలను ఆర్పిన సిబ్బంది... కిచెన్‌లో మొదలైన మంటలను చూసి బయటకు పరుగులు తీసిన ఇంటి యజమాని, బంధువులు మెయింటెనెన్స్ వారికి అగ్ని ప్రమాదం విషయం చెప్పారు. సెక్యూరిటీ, మెయింటెనెన్స్ సిబ్బంది వెంటనే నీటిని చల్లి మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఫ్లాట్ మొత్తం వుడ్ వర్క్‌తో పాటు కాలి బూడిదయ్యింది. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మరోసారి నీటిని చల్లారు. చదవండి: సరోగసీ కోసం వచ్చి.. ఆపై పారిపోదామనుకొని..పది రోజుల క్రితం పక్క గేటెడ్ కమ్యూనిటీలోని ఓ ఫ్లాట్‌లో ఇదే మాదిరిగా అగ్ని ప్రమాదం జరగటంతో ఇందులోని నివాసితులకు అలాంటి పరిస్థితి ఎదురయినపుడు మంటలను ఎలా ఆర్పాలి? ఫైర్ గ్యాస్‌ను ఎలా ఉపయోగించాలి? నీటి లభ్యత ప్రతి ఫ్లాట్‌కు ఎలా వస్తుంది? అనే విషయంలో మాక్‌డ్రిల్ నిర్వహించారు. అయినా బుధవారం వాటిని పట్టించుకోకపోవటంతో ప్రమాదం సంభవించిందని మెయింటెనెన్స్ ఇన్చార్జి గిరి తెలిపారు. -
Hyderabad: పేలిన రిఫ్రిజిరేటర్ సిలిండర్
మణికొండ: రిఫ్రిజిరేటర్లోని గ్యాస్ సిలిండర్ పేలి మంటలు రావడంతో అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్ కిచెన్, హాల్, బెడ్రూం వరకు వ్యాపించడంతో అందులోని వ్యక్తులు హాహాకారాలు చేస్తూ కిందకు పరుగులు తీశారు. గేటెడ్ కమ్యూనిటీలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు స్థలంలో పార్కును అభివృద్ధి చేయటంతో అగ్నిమాపక వాహనాలు ప్రమాదం జరిగిన అపార్ట్మెంట్ వరకు సకాలంలో చేరలేక పోయాయి. మణికొండ మున్సిపాలిటీ, పుప్పాలగూడలోని గోల్డెన్ ఓరియల్ కమ్యూనిటీలోని బీ బ్లాక్ మూడో అంతస్తులోని 301 ఫ్లాట్‌లో శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఫ్రిడ్జిలోని గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగడంతో వంట గది మొత్తం అంటుకుని మిగతా గదులకూ వ్యాపించాయి. మంటలు వంట గ్యాస్ సిలిండర్‌కూ అంటుకోవటంతో పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీంతో ఇంటి యజమాని వెంకటరమణతో పాటు మిగతా నలుగురు కుటుంబ సభ్యులు భయభ్రాంతులతో కిందకు వచ్చేశారు. చుట్టు పక్కల వారు సైతం నిద్రనుంచి మేల్కొని అగి్నమాపక శాఖకు సమాచారం ఇచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. అపార్ట్మెంట్ వరకూ వెళ్లలేక పోయిన ఫైరింజిన్.. గోల్డెన్ ఓరియల్లో రెండు బ్లాక్‌ల మధ్య ఉన్న రోడ్డును పార్కుగా మార్చారు. సకాలంలోనే గేటు వద్దకు చేరుకున్న మూడు ఫైరింజిన్లు ఫ్లాట్ వద్దకు చేరుకోలేక 300 మీటర్ల దూరంలోనే నిలిచిపోయాయి. దీంతో ఫ్లాట్ పూర్తిగా కాలిపోయిందని అగ్నమాపక శాఖ అధికారులు తెలిపారు. మంటలు ఫ్లాట్ మొత్తం వ్యాపించి విలువైన గృహోపకరణాలతో పాటు దుస్తులు, నగదు కాలిపోవటంతో రూ.50 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు ఫ్లాట్ యజమాని తెలిపారు. ఫ్లాట్ వద్దకు చేరుకునేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది గంట పాటు ప్రయత్నం చేసినా సఫలం కాక పక్క బ్లాక్ నుంచి నీటిని చల్లి మంటలను ఆర్పారు. కాగా.. స్థానికులు అంతలోపే పక్క ఫ్లాట్ల నుంచి పైపులను వేసి సాధ్యమైనంత వరకు మంటలను ఆర్పారు.కేసు నమోదు గోల్డెన్ ఓరియల్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో జరిగిన అగ్ని ప్రమాదంపై ఇంటి యజమాని వెంకటరమణ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మణికొండ మున్సిపల్ డీఈపై అవినీతి ఆరోపణలు
-
లంచగొండి భార్య... పట్టించిన భర్త!
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ డీఈఈ దివ్యజ్యోతి అవినీతి బండారాన్ని కట్టుకున్న భర్తే అవినీతి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. తన భార్య జ్యోతి ప్రతి రోజూ లంచం తీసుకుంటుందంటూ ఇంట్లో గుట్టలు గుట్టలుగా ఉన్న డబ్బుల వీడియోలను విడుదల చేశారు ఆమె భర్త. ఇంట్లో డబ్బుల్ని దాచిన ప్రతి చోటు చూపిస్తూ వీడియోల్ని విడుదల చేశారు.జ్యోతి నిత్యం లక్షల్లో లంచం తీసుకుంటుందని, ఏడేళ్ల నుంచి లంచం తీసుకోవద్దని వద్దని వారించినా భారీ మొత్తంలో డబ్బులు తీసుకోవడం తనని మనోవేదనకు గురి చేస్తుందంటూ విడుదల చేసిన వీడియోల్లో పేర్కొన్నారు.లంచం మంచిది కాదంటూ వార్నింగ్ ఇచ్చినా.. డబ్బులు తీసుకోకుండా ఇంటికి వచ్చేది కాదు. దాదాపూ రూ.80లక్షల విలువైన నోట్ల కట్టలు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ దాచిపెట్టిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. తన భార్య తీసుకున్న లంచానికి ఇవే సాక్షాలంటూ వీడియోల్ని విడుదల చేశారు.మణికొండలోని కాంటట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకుంటూ ఇంటికి భారీగా లంచాలు తీసుకువస్తుందంటూ ఆమె భర్తే ఆరోపించారు. ఇదే విషయంలో జ్యోతితో గొడవ పడ్డానని, అయినా తనలో మార్పురాలేదన్నారు. పైగా తాను లంచం తీసుకోకూడదు అని అనుకున్నా.. పై అధికారులు లంచం తీసుకోమని ప్రోత్సహిస్తున్నారని చెబుతూ వస్తుందని వాపోయారు. చివరికి భార్య చేస్తున్న తప్పును తట్టుకోలేక ఈ వీడియోలు తీసినట్లు జ్యోతి భర్త విడుదల చేసిన వీడియోలో తెలిపారు. మరోవైపు జ్యోతిపై అవినీతి ఆరోపణలు వెలుగులోకి రావడంతో రెండు రోజుల క్రితం జీహెచ్ఎంసీకి బదిలీ చేయించుకున్నారు. -
మణికొండలో విషాదం.. గుండెపోటుతో టెక్కీ మృతి
సాక్షి, హైదరాబాద: మణికొండ అల్కాపూరి కాలనీలో విషాదం చోటుచేసుకుంది. అల్కాపూరి టౌన్ షిప్ గణేష్ ఉత్సవ కమిటీ లడ్డు వేలం పాటలో పాల్గొన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్.. అనంతరం ఆకస్మికంగా మృతిచెందాడు. ఆదివారం రాత్రి టౌన్షిప్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగిన లడ్డు వేలం పాటలో శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నాడు. 15 లక్షల వరకు లడ్డు వేలంలో పాల్గొన్నాడు. అనంతరం స్నేహితుడు లడ్డూ కైవసం చేసుకోవడంతో గణనాథుడి వద్ద ఉత్సాహంగా డాన్స్‌లు చేశాడు. స్నేహితులతో కలిసి తీన్మార్ స్టెప్పులేశాడు. అయితే ఇంటికి వెళ్లిన తర్వాత గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. దీంతో కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు విషాదంలో మునిగిపోయారు.చదవండి: Ganesh Immersion: ఆ అనుభవాల నుంచి పాఠాలు! -
హైడ్రా ఎంట్రీ.. చిత్రపురి కాలనీలో విల్లాలకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్రమ కట్టడాలను కూల్చివేయడమే టార్గెట్‌గా హైడ్రా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా నేలమట్టం చేసింది. దీంతో, హైడ్రా చర్యలు హాట్ టాపిక్‌గా మారాయి. మరోవైపు, తాజాగా మణికొండ చిత్రపూరి కాలనీలో నిర్మించిన 225 విల్లాలకు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది.కాగా, చిత్రపురి కాలనీలో నిర్మించిన 225 విల్లాలకు నిర్మాణ అనుమతులు లేవంటూ మణికొండ మున్సిపల్ కమిషనర్ నోటీసులు అందజేశారు. ఈ సందర్బంగా జీవో 658కు విరుద్దంగా 225 రోహౌజ్‌ల నిర్మాణాలు చేపట్టినట్లు మున్సిపల్ అధికారులు గుర్తించారు. ఇక, గత సొసైటీ పాలక వర్గం దొంగ చాటున నిర్మాణాలకు అనుమతులు పొందిందని అధికారులు తేల్చారు. అలాగే, ఈ నిర్మాణాల కోసం కేవలం జీ+1 అనుమతులు పొంది అక్రమంగా జీ+2 నిర్మాణాలు చేపట్టారని గుర్తించారు.దీంతో, 15 రోజుల్లో నోటీసులకు రిప్లై ఇవ్వాలని మణికొండ మున్సిపల్ కమిషనర్ సూచించారు. గత పాలక వర్గం తప్పుడు నిర్ణయం వల్ల చిత్రపురి సొసైటీకి సుమారు రూ.50 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు తెలిపారు. చిత్రపురి కాలనీలో జరిగిన అవకతవకల గుట్టురట్టు చేయాలంటూ ఫిర్యాదుల వెల్లువెట్టడంతో రంగంలోకి మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో సినీ కార్మికుల్లో టెన్షన్ నెలకొంది. -
Saina Nehwal: నా ఆత్మలో.. బ్యాడ్మింటన్!
మణికొండ: బ్యాడ్మింటన్ తన ఆత్మలో ఉందని, దాన్ని ఎప్పటికీ వదలిపెట్టనని పద్మవిభూషన్ అవార్డు గ్రహీత, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ అన్నారు. మణికొండ మున్సిపాలిటీ, అలకాపూర్ టౌన్షిప్ రోడ్డు నంబర్–3 వద్ద యోనెక్స్ స్పోర్ట్స్ స్టోర్‌ను ఆమె ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన దేశంలో క్రీడాకారుల సంఖ్య మరింతగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువులతో పాటు వారికి నచి్చన క్రీడలో రాణించేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడలకు మన దేశంలో రాబోయే రోజుల్లో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. పిల్లలకు పౌష్టికాహారంతో పాటు ఫిట్‌గా ఉండేలా చూసుకుని క్రీడల్లో శిక్షణ ఇప్పించాలన్నారు. రెజ్లర్ వినేష్ పోగట్‌కు మరో పథకం వస్తుందనే ఆశతోనే ఉన్నానన్నారు. కార్యక్రమంలో స్టోర్ యజమానులు అమర్, కిరణ్, వెంకట్‌తో పాటు ఆమె అభిమానులు పాల్గొన్నారు. -
ఔటర్‌పై కార్లు, ఇతర వాహనాలకు వేర్వేరు మార్గాలు
మణికొండ: ఔటర్ రింగ్‌రోడ్డుపై పెరుగుతున్న ట్రాఫిక్‌తో టోల్గేట్ల వద్ద వాహనదారుల పడిగాపులు పెరిగిపోతున్నాయి. వాటిని నివారించే ఉద్దేశంతో అధిక రద్దీ ఉండే పుప్పాలగూడ టోల్గేట్ వద్ద నిర్వాహకులు ప్రత్యేక దారులను ఏర్పాటు చేసి రద్దీ నివారణ చర్యలు చేపట్టారు. ఆదివారం నుంచి శంషాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాల కోసం ఉన్న మూడు టోల్ వసూలు కౌంటర్లలోకి కార్లను మాత్రమే అనుమతించారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వెళ్లే మార్గంలో కార్లకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు. ఫాస్ట్‌ట్యాగ్ ఉన్న వాహనదారులే ప్రవేశించాలని సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఫాస్ట్‌ట్యాగ్ లేకుండా ఆయా మార్గాల్లోకి ప్రవేశిస్తే చెల్లించాల్సిన డబ్బుకు రెండితలు వసూలు చేస్తున్నామని టోల్గేట్ నిర్వాహకులు తెలిపారు. ఫాస్టాగ్‌లకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మార్గాల్లోకి ఇతర వాహనదారులు రావొద్దని బోర్డులు ఏర్పాటు చేసినా వారు ప్రవేశించి నగదు రూపంలో టోల్ చెల్లిస్తుండటంతో రద్దీ పెరిగిపోతోందన్నారు. అందుకే కచ్చితంగా ఫాస్టాగ్ ఉన్న కార్లను ఆయా మార్గాల్లో.. మిగతా వాహనాలను ఇతర కౌంటర్లలోకి అనుమతిస్తున్నామన్నారు. దాంతో ఆదివారం ఎక్కువగా ట్రాఫిక్ స్తంభించలేదని చెప్పారు. రాబోయే రోజుల్లో అధిక రద్దీ ఉండే మరిన్ని టోల్ కేంద్రాల వద్ద ఇలాంటి ఏర్పాట్లను చేస్తామని వారు తెలిపారు. -
ల్యాండ్ మార్క్ చెట్లు
మణికొండ: ఒక్కో గ్రామంలో ఒక్కో భవనం, విగ్రహాలు, చౌరస్తాలు, బావులు లాండ్ మార్క్‌గా నిలవటం సహజం. కానీ రెండు చెట్లు ఈ ప్రాంతంలో దశాబ్దాల కాలం పాటు ల్యాండ్ మార్క్‌గా నిలుస్తున్నాయి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందే క్రమం నుంచి ఇప్పటికీ అవి అలాగే కొనసాగుతున్నాయి. వాటి చుట్టు పక్కల మరో ల్యాండ్ మార్క్ ఏర్పాటు చేసినా ప్రజలు వాటిని గుర్తించలేక పాత వాటితోనే పిలుస్తున్నారంటే ప్రజల్లో ఎంతలా నాటుకుపోయాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆ చెట్లేంటి? వాటి కథేంటి? తెలుసుకుందాం.. దైనా కొత్త ప్రాంతానికి వెళ్లాలన్నా.. ఎవరికైనా అడ్రస్ చెప్పాలన్నా.. ముందుగా ఆ ప్రాంతం పేరుతోపాటు అక్కడ ప్రాచుర్యం పొందిన ల్యాండ్ మార్క్ చెప్పడం పరిపాటి.. అయితే అభివృద్ధి చెందే క్రమంలో కొన్ని పేర్లు మారుతుంటాయి.. మరికొన్ని ఏళ్ల తరబడి అవే గుర్తింపుగా మారుతుంటాయి.. అలాంటి గుర్తింపు పొందిన రెండు వృక్షాల కథే ఇది..పూర్తి వివరాల్లోకి వెళితే గతంలో మణికొండకు కొత్తగా వచ్చే వారు మీ ఇంటికి ఎలా రావాలి అంటే ముందుగా మర్రిచెట్టు వద్దకు వచ్చి ఎడమవైపు, కుడి వైపు, నేరుగా ఇటువైపు రావాలని చిరునామా చెప్పే వారు. దాని కేంద్రంగానే మణికొండకు కొత్తగా వచ్చే వారు గమ్యస్థానాలను చేరేవారు. ఇదే మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడ, నెక్నాంపూర్ వాసులు అలకాపూర్ టౌన్షిప్ ప్రవేశంలో ఉండే చింత చెట్టును కేంద్రంగా చేసుకుని చిరునామా చెప్పేవారు. అక్కడి నుంచి ఎడమ, కుడి, నేరుగా అనే రోడ్లతో వారి గమ్యస్థానాలకు చేరుకునే వారు. ఆ తరువాతి క్రమంలో గూగుల్ మ్యాప్‌లు, లొకేషన్ పాయింట్లు వచ్చి వాటి ఆదారంగా కొత్త వారు గమ్య స్థానాలను చేరుకుంటున్నా వీటి గుర్తింపు ఏమాత్రం చెక్కు చెదరలేదు. వాటిలో ముందుగా మణికొండ మర్రిచెట్టు, పుప్పాలగూడ, నెక్నాంపూర్ చింతచెట్టు అడ్రస్‌కి కేరాఫ్‌గా మారాయి.మార్పులు చేసినా... మణికొండ మర్రిచెట్టు కూడలికి కాల క్రమంలో పేరు మార్చాలనే ఉద్దేశంతో ఓ సంస్థ దాని కింద భరతమాత విగ్రహాన్ని నెలకొలి్పంది. అప్పటి నుంచి దాన్ని భరతమాత కూడలిగా పిలవాలని ప్రకటించారు. అది ఏమాత్రం ప్రజల్లోకి ఎక్కకుండా అదే మర్రిచెట్టు కూడలిగానే ప్రసద్ధి చెందుతోంది. ఇదే తరహాలో పుప్పాలగూడ, నెక్నాంపూర్ వాసులకు ల్యాండ్ మార్క్‌గా ఉన్న చింత చెట్టు పక్కనే మున్సిపాలిటీ నుంచి శోభాయమానంగా సీతాకోకచిలుకలు ఎగురుతున్నట్టుగా కూడలిని అభివృద్ధి చేశారు. దాన్ని బటర్‌ఫ్లై కూడలిగా నామకరణం చేసినా దాన్ని ఎవరూ పట్టించుకోవటం లేదు. అదే చింతచెట్టు సర్కిల్గానే దాని పేరు కొనసాగుతోంది. అదే రోడ్డులో అలకాపూర్ టౌన్íÙప్లోకి నేరుగా వెళితే మూలమలుపు వద్ద ఏర్పాటు చేసిన యోగ సర్కిల్(సూర్యనమస్కారాల బొమ్మలు) మాత్రం ఇప్పుడిపుడే ప్రాచూర్యం పొందుతున్నాయి. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మర్రిచెట్టు, చింతచెట్ల చరిత్ర అవి జీవించినంత కాలం కొనసాగుతుందని స్థానికులు భావిస్తున్నారు. మణికొండలోని అదే మర్రిచెట్టుపై కొత్తగా రావి చెట్టు, దాని కింద వేపచెట్టు పెరుగుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. -
‘తాన్సేన్’ మొఘల్ వైభవం..
ఐదు దశాబ్దాల వారసత్వంతో ఆహార ప్రియులకు విభిన్న రుచులను అందిస్తున్న ఓహ్రీస్ గ్రూప్ ఔటర్‌రింగ్ రోడ్డు పక్కన, ఐటీ జోన్‌కు సమీపంలో తాన్సేన్ రెస్టారెంట్‌ను గురువారం ప్రారంభించింది.అద్భుతమైన పాకశాస్త్ర వారసత్వం, మొఘల్ వైభవంతో దీన్ని తీర్చిదిద్దామని సంస్థ చైర్మెన్ అమర్ ఓహ్రి పేర్కొన్నారు. లెజండరీ సంగీత కారకుడు తాన్సేన్ నుంచి ప్రేరణ పొంది గ్యాస్టోన మీ స్వచ్ఛమైన ఆనందాన్ని పొందుపరిచే రుచుల వేడుకగా ఇది నిలుస్తుందన్నారు. విభిన్న రుచులు, వంటకాల నైపుణ్యంతో ప్రతి వంటకం ఓ అద్భుత కళాఖండంలా తాన్సేన్లో ఉంటుందని చెఫ్ కన్సల్టెంట్ అనూజ్ వాధావన్ అన్నారు. - మణికొండ -
ధరణిలో గోల్మాల్.. మణికొండలో భారీ భూకబ్జా!
హైదరాబాద్, సాక్షి: మణికొండ పోకల్‌వాడలో భారీ భూదందా వెలుగు చూసింది. ధరణిలో గోల్మాల్ చేసి వెయ్యి కోట్లు విలువ చేసే భూమిని కబ్జా చేశారు. కలెక్టర్లంతా ఎన్నికల హడావిడిలో ఉండగా.. ధరణి నుంచి పాస్‌బుక్‌లు జారీ అయ్యాయి. ధరణి ఉద్యోగులు చేతి వాటం ప్రదర్శించి ఈ స్కామ్‌కు పాల్పడ్డారు. ఎమ్మార్వో ఫిర్యాదు చేయడంతో ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది.ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఐదెకరాల భూమిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ధరణి ఉద్యోగులతో రూ.3 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు. కొంత డబ్బు తీసుకున్న తర్వాతే రంగారెడ్డి ఇద్దరు కలెక్టర్ల సంతకాలతో పాస్‌బుక్‌లు జారీ చేశారు. అయితే.. బ్లాక్ లిస్ట్‌లో ఉన్న ల్యాండ్‌కు పాస్ బుక్‌లు జారీ కావడంతో ఎమ్మార్వో ఖంగుతిన్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. సైబరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరు ధరణి ఉద్యోగులతో పాటు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. భూమిని తమ పేరు మీద రిజిస్టర్ చేసుకున్న ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల పాత్రపైనా సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. -
బుల్లితెర నటి కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటుడు చందు బలవన్మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్‌లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్కాపూర్ కాలనీలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. చందు ప్రస్తుతం త్రినయిని, రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం లాంటి సీరియల్స్‌లో నటించారు. కాగా.. 2015లో శిల్పను ప్రేమ వివాహం చేసుకున్న చందుకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.కాగా.. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరాం మృతి చెందిన సంగతి తెలిసిందే. గత ఆరేళ్లుగా చందుకు టీవీ నటి పవిత్ర జయరాంతో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే పవిత్ర పుట్టినరోజు సందర్భంగా తనను రమ్మంటుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే కాకుండా ఓ యూట్యూబ్ ఛానెల్‌తో తనకు బ్రెయిన్ వ్యాధి ఉందని వెల్లడించారు. కాగా.. పవిత్రతో సహజీవనం చేసిన చందు ఆమెను గుర్తు చేసుకుంటూ ఆవేదన చెందారు. ఈ నేపథ్యంలో చందు సూసైడ్ చేసుకోవడం ఒక్కసారిగా టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనతో సీరియల్ నటి పవిత్ర జయరాం యాక్సిడెంట్ కేసు కీలక మలుపులు తిరగనుంది. -
మణికొండలో అక్రమ నిర్మాణాలపై అధికారుల కొరడా
-
కారులో మృతదేహం కంగారు పడ్డ జనం
-
మణికొండలో కలకలం.. కారులో మృతదేహం
సాక్షి, హైదరాబాద్: మణికొండలో కారులో మృతదేహం కలకలం రేపుతోంది. మారుతి వ్యాన్‌లో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే 100 ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ సీటు వెనుక లో మృతదేహం లభ్యం కావడంతో హత్యా? ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? అనే సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. కారు నంబర్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. స్థానికంగా ఉన్న సీసీ టీవీ ఫూటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. -
గాన సరస్వతి
పువ్వుకు రాగం అబ్బితే ఎలా ఉంటుంది? ఆ పువ్వు స్వరాన్ని ఎలా సవరించుకుంటుంది? ఆ తావి గానాన్ని ఎలా శ్రుతి చేసుకుంటుంది? అక్షరాలను పూలరెక్కల్లా పొదివి పట్టుకుంటుంది. సరిగమలు కందకుండా సున్నితంగా గానం చేస్తుంది. ఆ గాన సరస్వతి... మన రావు బాలసరస్వతీదేవి. పువ్వు పాడితే ఎలా ఉంటుందో... రావు బాలసరస్వతీదేవి పాట వింటే తెలుస్తుంది. హైదరాబాద్, మణికొండలోని గాయత్రి ప్లాజాలో ఆమె ఫ్లాట్ గోడలు ఆ గానసరస్వతి రాగాలను నిత్యం వింటుంటాయి. తొంభై ఐదేళ్ల వయసులో కూడా ఆమె స్వరంలో రాగం శ్రుతి తప్ప లేదు. తొంభై ఏళ్లుగా సాగుతున్న సాధనతో ఆ స్వరం అద్దుకున్న తియ్యదనం అది. పారిజాత పువ్వులాంటి మృదుత్వం ఆమె రాగానిది. ఆ గొంతు సన్నజాజి మొగ్గలా పరిమళం వెదజల్లుతోందిప్పటికీ. ఆ సుమధుర గానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. తొమ్మిది దశాబ్దాల ఆమె సంగీత సేవను గౌరవిస్తోంది. నవంబర్ ఒకటవ తేదీన (రేపు) ఆమె వైఎస్సార్ జీవన సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. గ్రామఫోన్ నుంచి సీడీల వరకు సరస్వతి నాలుగవ ఏట నుంచి వేదికల మీద పాడుతున్నారు. ఆరవ ఏట హెచ్.ఎం.వి కంపెనీ ఆమె పాటను గ్రామఫోన్‌లో రికార్డు చేసింది. తెలుగు సినిమాలో తొలి నేపథ్య గాయనిగా రికార్డు ఆమెదే. ఆకాశవాణి కేంద్రాలు మద్రాసు, విజయవాడ స్టేషన్ల కోసం ప్రారంభగీతం పాడిన రికార్డు కూడా ఆమెదే. తెలుగు, తమిళ, కన్నడ భాషలతోపాటు సింహళ గీతాలనూ ఆలపించారు. బాలనటిగా, బాల గాయనిగా సినీరంగం ఆమెను గారం చేసింది. పేరు ముందు ‘బాల’ను చేర్చింది. కర్ణాటక సంగీతం, హిందూస్థానీ సంగీతాలు సాధన చేసింది. సినిమా షూటింగ్‌ల కారణంగా స్కూలుకెళ్లడం కుదరకపోవడంతో ఆమె చదువు కోసం ట్యూటర్ ఇంటికి వచ్చి పాఠాలు చెప్పేవారు. ఆమెకు ఇంగ్లిష్ నవలలు చాలా ఇష్టం. ఆ అలవాటును ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. గ్రామఫోన్ రికార్డుల కాలం నుంచి క్యాసెట్ టేప్‌లో రికార్డ్ చేసే టెక్నాలజీని చూశారు. సీడీలు, ఎంపీత్రీలనూ చూశారు. టెక్నాలజీతోపాటు అప్డేట్ అవుతూ వచ్చారు. కానీ, సినిమా సంగీతం, సాహిత్యంలో వచి్చన భాషాపరంగా విలోమమవుతున్న ప్రమాణాలను అంగీకరించలేకపోయారు. సినిమా అంటే శక్తిమంతమైన వినోదసాధనం. పిల్లలు, యువతకు మానసిక వికాసం, మేధో వికాసంతోపాటు వాళ్ల అభివృద్ధికి... వినోదం అనే సాధనంతో బాటలు వేసే గొప్ప కళామాధ్యమంగా ఉండాలి సినిమా. అంతే తప్ప విలువలను దిగజార్చుకునే సాధనం కాకూడదని చెబుతారామె. రెండు వేలకు పైగా పాటలు పాడిన ఈ సంగీత సరస్వతి ఈ రోజుల్లో పాటల సాహిత్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పాట కలిపింది ఇద్దరినీ! చెన్నై (మద్రాసు) లో పుట్టి పెరిగిన బాల సరస్వతి పెళ్లి తర్వాత కోడలిగా కోలంక జమీందారీలో అడుగుపెట్టారు. ప్రకృతి ఇద్దరు వ్యక్తులను దూరం చేసిన విషాదాంతాలను సినిమాల్లో చూస్తుంటాం. కానీ ప్రకృతి ఇద్దరు మనుషులను దగ్గర చేయాలనుకుంటే చాలా చమత్కారంగా దగ్గర చేస్తుంది. అందుకు ఈ గానసరస్వతి పెళ్లే గొప్ప ఉదాహరణ. ‘‘నా పాటను వినడానికి స్వయంగా కోలంక జమీందార్... శ్రీ రాజారావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావు గారు మద్రాసులో మా ఇంటికి వచ్చారు. నేనప్పుడే ‘కలువ రేకుల కనులు గల నా స్వామీ’ అనే పాట రికార్డింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాను. మా నాన్న పాట పాడమనగానే అదే పాట పాడాను. రాజా వారేమో తన పెద్ద కళ్లను వరి్ణస్తూ, వారి మీద ప్రేమను అలా పాట రూపంలో వ్యక్తం చేశాననుకున్నారట. అదే మా పెళ్లికి నాందీ గీతం’ అంటూ ఆనాటి జ్ఞాపకాన్ని సంతోషంగా గుర్తు చేసుకున్నారామె. అందుకే తనకు ఇష్టమైన ప్రదేశం మద్రాసేనని చెబుతారామె. ఈ బాల రెండో బాల్యమిది! బాలసరస్వతీ దేవికి హాఫ్ వైట్ పట్టు చీరలిష్టం. క్రీమ్ కలర్‌తో అనేక రంగుల కాంబినేషన్లలోనే ఎక్కువగా కనిపిస్తారు. ఆమెకు మల్లెలన్నా ఇష్టమే. ఇక స్వీట్స్... ముఖ్యంగా గులాబ్ జామూన్, జాంగ్రీలను చూస్తే చిన్నపిల్లయిపోతారు. చాక్లెట్ చేతికిస్తే పసి పిల్లల ముఖం వికసించినట్లే ఆమె ముఖంలో నవ్వులు పూస్తాయి. భోజనం గుప్పెడే కానీ, ఆ వెంటనే స్వీట్ తినడం ఆమెకిష్టం, ఆ తర్వాత తియ్యగా పాడడం మరింత ఇష్టం. ఆ సరిగమల వారసత్వం ఇద్దరు కొడుకులకు రాలేదు, మనుమడు, మనుమరాలికీ రాలేదు. కానీ మనుమరాలి కూతురు నేహకు వచ్చింది. గానసరస్వతి కళ్ల ముందే ఆ ఇంట్లో సరిగమల కొత్తతరం వెల్లివిరుస్తోంది. తొంబై ఐదేళ్ల వయసులో హైదరాబాద్‌లోని పెద్ద కుమారుని ఇంటిలో ప్రశాంతంగా పసిబిడ్డలా జీవిస్తున్నారు బాల సరస్వతీదేవి. కన్నతల్లిని ‘కన్నక్కా’ అని పిలుస్తూ తల్లిని కన్నబిడ్డలా చూసుకుంటున్నారాయన. కోడలు అత్తగారి చిన్నప్పటి జ్ఞాపకాలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ ఆమెను అపురూపంగా చూసుకుంటున్నారు. సాక్షి ఇంటర్వ్యూలో ఆమె కొన్ని సంగతులు చెప్తూ మధ్యలో మర్చిపోతుంటే ఆమె పెద్ద కొడుకు, పెద్ద కోడలు అందుకుని పూర్తి చేయడమే అందుకు నిదర్శనం. సినిమాలకు మాత్రమే దూరం... స్వరానికి కాదు! పెళ్లి తర్వాత పదిహేనేళ్లకు బాల సరస్వతీదేవి సినిమాల కోసం పాడడం మానేశారు. కానీ సంగీత సాధన మాత్రం ఆపలేదు. సినారె తెలుగులోకి అనువదించిన మీరాభజన్ గీతాలను ఆలపించారామె. ఎనభై ఏళ్ల వయసులో ఆమె తనకిష్టమైన కొన్ని లలిత గీతాలను ఎంచుకుని స్వీయ సంగీత దర్శకత్వం వహించి ‘రాధా మాధవం’ సీడీ విడుదల చేశారు. కోవిడ్‌కి ముందు 2018లో అంటే ఆమె తొంబయ్యేళ్ల వయసులో ‘స్వరాభిషేకం’ కార్యక్రమంలో పాడడమే ఆమె చివరి వేదిక. ఆ వేడుక తర్వాత మూడవ రోజు ఇంట్లో జరిగిన ప్రమాదం ఆమెను ఇంటికే పరిమితం చేసింది. అయితే ఆశ్చర్యంగా జారి పడడంతో విరిగిన తుంటి ఎముక దానంతట అదే సరయింది. సంగీతమే తనను స్వస్థత పరిచిందంటారామె. ఇప్పటికీ రోజూ ఆ స్వరం రాగాలను పలుకుతుంటుంది. ఆమె ఊపిరితిత్తులకు శక్తినిస్తున్నది సంగీతమేనని వైద్యులు కూడా నిర్ధారించారు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: మోహనాచారి -
పని మనిషి ఆత్మహత్య.. పదేళ్లుగా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం
హైదరాబాద్: ల్యాంకోహిల్స్‌లో 21వ అంతస్తు నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి కృష్ణ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదుచేశారు. యువతి బలవన్మరణానికి వేధింపులే కారణమని నిర్ధారించారు. పోలీసుల దర్యాప్తులో వ్యాపారి, కన్నడ నటుడు అయిన ఓ వ్యక్తి సాగిస్తున్న చీకటి కార్యకలాపాలు, దారుణాలు బయటపడుతున్నాయి. స్థానికులు, పోలీసుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పూర్ణచంద్రావు కొన్ని కన్నడ సినిమాల్లో నటించాడు. పదేళ్ల క్రితం నగరానికి చేరి బంజారాహిల్స్ కేంద్రంగా హోం థియేటర్ల వ్యాపారం చేస్తున్నాడు. మణికొండ ల్యాంకోహిల్స్ అపార్ట్మెంట్స్ 15 ఎల్‌హెచ్ బ్లాక్‌లో భార్య, కుమార్తెతో ఉంటున్నాడు. కుమార్తె కేర్‌టేకర్‌గా పదేళ్లుగా కాకినాడకు చెందిన బిందుశ్రీ పనిచేస్తోంది. అక్కడే తనకు కేటాయించిన గదిలో ఉంటోంది. పదేళ్లుగా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం . కొద్దిరోజులుగా వీరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఐదురోజుల క్రితం పూర్ణచంద్రావు కుమార్తెను సాకేందుకు మరో యువతిని ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో శుక్రవారం రాత్రి గొడవలు తారాస్థాయికి చేరాయి. రాత్రి 9 నుంచి అర్ధరాత్రి దాటేంత వరకూ పరస్పరం వాదించుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో నిర్ధారించారు. ఆ తరువాత బిందుశ్రీపై 21వఅంతస్తుపై నుంచి కిందకు దూకింది. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది రాయదుర్గం పోలీసులకు సమాచారమిచ్చారు. పనిమనిషి ఆత్మహత్య విషయం పూర్ణచంద్రావుకు తెలియజేసేందుకు అతడి ఫ్లాట్‌కు చేరగా.. అరగంట తర్వాత తలుపులు తీయటంతో పోలీసులు విస్మయానికి గురయ్యారు. వేధింపుల వల్లేనా? కన్నడ సినిమాల్లో నటించానంటూ పూర్ణచంద్రావు ప్రచారం చేసుకునేవాడు. సినీపరిశ్రమలో తన పరిచయాలతో అవకాశాలు ఇప్పిస్తానంటూ అమ్మాయిలకు ఆశచూపేవాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందజేసినట్టు తెలుస్తోంది. తరచూ ఇదే విధంగా కొంతమంది మహిళలు, యువతులు వచ్చిపోవటం, అనుమానాస్పదంగా తిరగటం గమనించినట్టు అదే అపార్ట్మెంట్లో ఉంటున్న కొందరు మీడియాకు తెలిపారు. ఘటన జరగడానికి మూడ్రోజుల ముందు నలుగురు యువతులు అతడి ఫ్లాట్‌కు వచ్చారని వివరించారు. అనుమానాస్పద మరణంగా తొలుత భావించిన పోలీసులు వేధింపులతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు నిర్ధారించారు. పూర్ణచంద్రావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు కలకలం.. 15 బృందాలతో దాడులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మరోసారి ఈడీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్టలో మంగళవారం(ఆగస్టు1) ఉదయం నుంచే దాడులు జరుపుతోంది. మాలినేని సాంబశివరావుతో పాటు పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 15 బృందాలతో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. కాగా మాలినేని సాంబశివరావు నాలుగు కంపెనీలకు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ట్రాన్స్ ట్రై పవర్ ప్రాజెక్ట్, టెక్నో యూనిట్ ఇన్ఫ్రా టెక్, కాకతీయ క్రిస్టల్ పవర్ లిమిటెడ్, ట్రాన్స్ ట్రై రోడ్డు ప్రాజెక్ట్‌లకు డైరెక్టర్‌గా ఉన్నారు. ఇదిలా ఉండగా 2020 జనవరిలో మలినేని సాంబశివరావు కంపెనీపై సీబీఐ దాడులు జరిపింది. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ నుంచి ట్రాన్స్ ట్రాయ్ సింగపూర్ లిమిటెడ్‌కు నిధులు బదిలీ అయ్యాయన్న ఆరోపణలతో సోదాలు జరిపింది. దీంతో మనీలాండరింగ్ జరిగినట్టు ఈడి అభియోగం మోపింది. యూనియన్ బ్యాంక్ నుండి ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ రూ. 300 కోట్ల రూపాయల రుణాలు పొందగా.. తిరిగి ఆ రుణాలు చెల్లించకపోవడంపై సీబీఐ కేసు నమోదు చేసింది. రూ. 260 కోట్ల రూపాయలను ఇతర కంపెనీకి మళ్ళీ ఇచ్చినట్టు సీబీఐ గుర్తించింది. లోన్ కోసం తీసుకున్న డబ్బులను బంగారం, వెండి ఆభరణాలకు ఖర్చు చేశారంటూ ఆరోపించింది. 2013లో ట్రాన్స్ ట్రాయ్‌ను కెనరా బ్యాంక్ ఆడిట్ చేసింది. అప్పటినుంచి బ్యాంక్‌ల లిస్ట్‌లో నాన్ పర్ఫామింగ్ అసెట్‌గా మారింది ట్రాన్స్ ట్రాయ్. ఇక ఇదే కంపెనీకి మలినేని సాంబశివరావు డైరెక్టర్‌గా ఉన్నారు. చదవండి: సీఎం కేసీఆర్ ప్రజలనే కాదు, రాముడినీ మోసం చేశారు: భట్టి -
HYD: తల్లీకూతుళ్ల ఆత్మహత్య.. చేతిపై ఏం రాసి ఉంది?
సాక్షి, హైదరాబాద్: తల్లీకూతుళ్ల ఆత్మహత్యలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. కూతురు లాస్యకి ఉరి వేసి చంపి, తల్లి అలివేలు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎనిమిదేళ్ల కొడుకును కూడా చంపే ప్రయత్నం చేసిన తల్లి.. గాడ నిద్రలో ఉండటంతో వదిలేసింది. గత కొంత కాలం నుంచి తీవ్ర మానసిక వేదనలో ఉన్న తల్లి, కూతురు కరోనా సమయం నుంచి బయటికి రావడం లేదు. రెండేళ్లుగా ఇంటికే పరిమితమయ్యారు. పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకునేందుకు అలివేలు.. భర్తనుదూరంగా పంపించింది. భర్త సదానందానికి రూ.5 వేలు ఇచ్చి యాదాద్రి వెళ్లమని బలవంతంగా పంపించింది. కూతురు చేతిపై ‘Do Something That Make You Happy’ అని రాసింది. ‘The Game Is Started’ అని గోరింటాకుతో రాసుకున్న తల్లీకూతుళ్లు.. ఆత్మహత్యకి ముందు.. ఇంట్లో ఉన్న పాత బట్టలు తగలబెట్టారు. ఇదే విషయంపై కొడుకుతో వాగ్వివాదం జరిగింది. ఉద్యోగం మానేసిన భర్త సదానందం.. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నారు. చదవండి: ఖమ్మం జిల్లాలో విషాదం.. మామిడితోటలో కుటుంబం ఆత్మహత్య లాస్య, అలివేలు మానసిక స్థితి సరిగ్గా లేదని, కరోనా టైం నుంచి అందరికీ దూరంగా ఉంటున్నారన్నారని రాయదుర్గం సీఐ మహేష్ తెలిపారు. రెండేళ్లగా ఇల్లు దాటి బయటకు రావడం లేదు. ఇంటి పక్కన వాళ్లతో కూడా మాట్లాడటం లేదు.. ఆత్మహత్యకి ముందు.. తల్లీ కూతుళ్ళు ఇంట్లో ఉన్న పాత బట్టలు తగలబెట్టారు.. ఎందుకు అని బాబు అడిగితే.. చిన్న పిల్లాడివి.. నీకేం తెలియదు అంటూ తల్లి మందలించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం’’ అని సీఐ వెల్లడించారు. -
భర్తను యాదాద్రికి పంపించి.. హైదరాబాద్‌లో తల్లీకూతురు ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మణికొండ ఆంధ్రా కాలనీలో తల్లి, కూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు అలివేలు, ఆమె కుమార్తె లాస్యగా గుర్తించారు. నిన్న సాయంత్రం భర్తకు రూ.5 వేలు ఇచ్చి యాదాద్రి ఆలయానికి వెళ్లమని అలివేలు చెప్పినట్లు సమాచారం. ఈ రోజు(శుక్రవారం) తెల్లవారుజామున పడక గదిలో కూతురు లాస్య, వంటగదిలో తల్లి అలివేలు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు పాత దుస్తుల్ని అలివేలు తగులబెట్టింది. తల్లి పాత బట్టలను తగులబెడుతుండగా ప్రశ్నించిన కుమారుడికి సమాధానం ఇవ్వలేదు. కూతురు లాస్యకి ఉరి వేసి చంపి, తల్లి అలివేలు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎనిమిదేళ్ల కొడుకును కూడా చంపే ప్రయత్నం చేసిన తల్లి.. గాడ నిద్రలో ఉండటంతో వదిలేసింది. లాస్య, అలివేలు మానసిక స్థితి సరిగ్గా లేదని, కరోనా టైం నుంచి అందరికీ దూరంగా ఉంటున్నారన్నారని రాయదుర్గం సీఐ మహేష్ తెలిపారు. చదవండి: నాచారంలో సెల్ఫీ సూసైడ్ -
ప్లే స్కూల్ లో అగ్ని ప్రమాదం
-
మణికొండ: ప్లే స్కూల్లో మంటలు.. పరుగు తీసిన చిన్నారులు
సాక్షి, హైదరాబాద్: మణికొండలోని జోల్లి కిడ్స్ ప్లేస్కూల్ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం షార్ట్ సర్క్యూట్‌తో మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. కాగా, మంటలు ఎగసిపడటం, పొగ బయటకు రావడంతో భయంతో చిన్నారులు పరుగు తీశారు. ఇక, అగ్ని ప్రమాదం సంభవించడంతో చిన్నారుల పేరెంట్స్ భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్కూల్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ టెండర్స్ అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇది కూడా చదవండి: ఆరు లేన్లుగా ఎన్‌హెచ్-65.. నితిన్ గడ్కరీ హామీ! -
హైదరాబాద్‌లో విషాదం.. ఇంటర్లో ఫెయిలయ్యామని..
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయ్యామని, మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపం చెంది పలువురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. సంతోష్‌నగర్ ప్రాంతానికి చెందిన పి.జాహ్నవి (17) ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ విద్యనభ్యసిస్తుంది. మంగళవారం విడుదలైన ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా సంగెం లక్ష్మీబాయి జూనియర్ కళాశాలలో జాహ్నవి ఎంపీసీ పూర్తిచేసింది. వనస్థలిపురంలో ఇంటర్ ఇద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో గాయత్రి అనే విద్యార్తి ఇంట్లో ఉరేసుకుంది. హస్తినాపురం నవీన కళాశాలలో అక్కాచెల్లెల్లు చదవుతుండగా .. చెల్లి పాస్ అయి తాను ఫెయిల్ అవ్వడంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడింది. ఖైరతాబాద్‌లోని తుమ్మల బస్తీకి చెందిన ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటర్ సెకండ్ ఇయర్లో (బైపీసీ) ఓ సబ్జెక్ట్ ఫెయిల్ కావడంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థిని గౌతమ్ కుమార్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న సైఫాబాద్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి తరలించారు. మణికొండలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి శాంతకుమారి ఆత్మహత్యకు పాల్పడింది. పరీక్షలో ఫెయిల్ అయ్యానని తీవ్ర మనస్తాపం చెంది ఐదో అంతస్తు నుంచి కిందకి దూకింది. హుటాహుటిన ఆసుపత్రి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా శాంతకుమారి రాయదుర్గం ప్రభుత్వ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్‌లోని నేరేడ్మెట్లో ఠాణా పరిధి వినాయక్ నగర్‌కు చెందిన ఓ విద్యార్థి(17) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివాడు. ఒక సబ్జెక్టులో తప్పడంతో ఇంట్లో ఉరేసుకున్నాడు. చదవండి: అయ్యో ఐశ్వర్య! పుట్టిన రోజు చేసుకోకుండానే మృత్యుఒడికి..