వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఇంట్లో భారీ చోరీ జరిగింది. మణికొండలోని ఆమె నివాసంలో దొంగతనం జరిగింది. దొంగలు ఇంట్లోంచి రూ. 10లక్షలు విలువచేసే బంగారం, వెండి అభరణాలు ఎత్తుకెళ్లారు. ఇంట్లో తెలిసిన వారే ఈ దొంగతనానికి పాల్పడి ఉండొచ్చునని రాయదుర్గం పోలీసులు అంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మణికొండలోని పంచవటి కాలనీలో ఉన్న ఎమ్మెల్యే రోజా నివాసానికి చేరుకొని పరిశీలించారు.