ఇంటర్ విద్యార్థులు గౌతమ్ కుమార్, పి.జాహ్నవి
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయ్యామని, మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపం చెంది పలువురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. సంతోష్‌నగర్ ప్రాంతానికి చెందిన పి.జాహ్నవి (17) ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ విద్యనభ్యసిస్తుంది. మంగళవారం విడుదలైన ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా సంగెం లక్ష్మీబాయి జూనియర్ కళాశాలలో జాహ్నవి ఎంపీసీ పూర్తిచేసింది.
వనస్థలిపురంలో ఇంటర్ ఇద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో గాయత్రి అనే విద్యార్తి ఇంట్లో ఉరేసుకుంది. హస్తినాపురం నవీన కళాశాలలో అక్కాచెల్లెల్లు చదవుతుండగా .. చెల్లి పాస్ అయి తాను ఫెయిల్ అవ్వడంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడింది.
ఖైరతాబాద్‌లోని తుమ్మల బస్తీకి చెందిన ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటర్ సెకండ్ ఇయర్‌లో (బైపీసీ) ఓ సబ్జెక్ట్ ఫెయిల్ కావడంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థిని గౌతమ్ కుమార్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న సైఫాబాద్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి తరలించారు.
మణికొండలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి శాంతకుమారి ఆత్మహత్యకు పాల్పడింది. పరీక్షలో ఫెయిల్ అయ్యానని తీవ్ర మనస్తాపం చెంది ఐదో అంతస్తు నుంచి కిందకి దూకింది. హుటాహుటిన ఆసుపత్రి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా శాంతకుమారి రాయదుర్గం ప్రభుత్వ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
సికింద్రాబాద్‌లోని నేరేడ్‌మెట్‌లో ఠాణా పరిధి వినాయక్ నగర్‌కు చెందిన ఓ విద్యార్థి(17) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివాడు. ఒక సబ్జెక్టులో తప్పడంతో ఇంట్లో ఉరేసుకున్నాడు.
చదవండి: అయ్యో ఐశ్వర్య! పుట్టిన రోజు చేసుకోకుండానే మృత్యుఒడికి..
Comments
Please login to add a commentAdd a comment