santosh nagar
-
హైదరాబాద్‌లో విషాదం.. ఇంటర్లో ఫెయిలయ్యామని..
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయ్యామని, మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపం చెంది పలువురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. సంతోష్‌నగర్ ప్రాంతానికి చెందిన పి.జాహ్నవి (17) ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ విద్యనభ్యసిస్తుంది. మంగళవారం విడుదలైన ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా సంగెం లక్ష్మీబాయి జూనియర్ కళాశాలలో జాహ్నవి ఎంపీసీ పూర్తిచేసింది. వనస్థలిపురంలో ఇంటర్ ఇద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో గాయత్రి అనే విద్యార్తి ఇంట్లో ఉరేసుకుంది. హస్తినాపురం నవీన కళాశాలలో అక్కాచెల్లెల్లు చదవుతుండగా .. చెల్లి పాస్ అయి తాను ఫెయిల్ అవ్వడంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడింది. ఖైరతాబాద్‌లోని తుమ్మల బస్తీకి చెందిన ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటర్ సెకండ్ ఇయర్లో (బైపీసీ) ఓ సబ్జెక్ట్ ఫెయిల్ కావడంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థిని గౌతమ్ కుమార్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న సైఫాబాద్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి తరలించారు. మణికొండలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి శాంతకుమారి ఆత్మహత్యకు పాల్పడింది. పరీక్షలో ఫెయిల్ అయ్యానని తీవ్ర మనస్తాపం చెంది ఐదో అంతస్తు నుంచి కిందకి దూకింది. హుటాహుటిన ఆసుపత్రి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా శాంతకుమారి రాయదుర్గం ప్రభుత్వ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్‌లోని నేరేడ్మెట్లో ఠాణా పరిధి వినాయక్ నగర్‌కు చెందిన ఓ విద్యార్థి(17) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివాడు. ఒక సబ్జెక్టులో తప్పడంతో ఇంట్లో ఉరేసుకున్నాడు. చదవండి: అయ్యో ఐశ్వర్య! పుట్టిన రోజు చేసుకోకుండానే మృత్యుఒడికి.. -
హైదరాబాద్ లో కూంభవృష్టికి కుంగిన రోడ్లు
-
కుంగిన సైదాబాద్–సంతోష్‌నగర్ ప్రధాన రహదారి
సాక్షి, సంతోష్‌నగర్: సైదాబాద్–సంతోష్‌నగర్ ప్రధాన రహదారిపై రోడ్డు గురువారం రాత్రి ఒక్కసారిగా కుంగిపోయింది. ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీనిపై స్పందించిన పోలీసులు చర్యలు చేపట్టారు. ఐ.ఎస్.సదన్ చౌరస్తా నుంచి సంతోష్‌నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రోడ్డు మధ్యలో పిల్లర్ల కోసం గోతులు తీసి అలాగే వదిలేశారు. దీంతో భూమి కుంగిపోవడంతో రోడ్డుపై భారీగా గుంత ఏర్పడింది. అప్రమత్తమైన స్థానికులు ట్రాఫిక్‌ను నియంత్రించారు. ఫలక్‌నుమా ట్రాఫిక్ పోలీసులతో సంతోష్‌నగర్ లా అండ్ ఆర్డర్ పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. రోడ్డుపై ఏర్పడిన గుంతను మట్టితో పూడ్చివేశారు. చదవండి: ఉగాదికి ఉద్యోగ నోటిఫికేషన్లు.. తొలివిడతలో భారీ సంఖ్యలో భర్తీ? -
రయ్యిరయ్యిమంటూ..
-
సంతోష్ నగర్ అత్యాచారం కేసు.. అంతా ఫేక్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో జరిగిన రెండు సామూహిక అత్యాచార కేసులను పోలీసులు చేధించారు. గాంధీ ఆసుపత్రి, సంతోష్ నగర్ కేసుల ఫిర్యాదులో వాస్తవం లేదని, అంతా ఫేక్ అని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో కూడా మహిళపై సామూహిక అత్యాచారం జరగలేదని వెల్లడించారు. గాంధీ ఆస్పత్రిలో మహిళపై గ్యాంగ్ రేప్ జరగలేదని, అక్కా చెల్లెల్లిద్దరికీ కల్లు తాగే అలవాటు ఉందని పోలీసులు తెలిపారు. అక్క ఆస్పత్రి నుంచి వెళ్లిపోవడంతో చెల్లెలు అక్కడే ఉండిపోయిందన్నారు. కల్లు తాగి అపస్మారక స్థితిలో ఉన్న చెల్లి.. అక్క విషయాన్ని దాచిపెట్టేందుకు అత్యాచారం కథ అల్లినట్లు వెల్లడించారు. ఇక సంతోష్ నగర్ కేసు పూర్తి అభూత కల్పన అని, తనపై ముగ్గురు ఆటో డ్రైవర్లు అత్యాచారం చేశారంటూ యువతి కట్టు కథ అల్లిందని పేర్కొన్నారు. ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో అతన్ని కేసులో ఇరికించేందుకు ప్లాన్ చేసినట్లు వెల్లడించారు. అసలేం జరిగిందంటే.. దక్షిణ మండలంలోని సంతోష్‌నగర్ పోలీసులకు మరో సవాల్ ఎదురైంది. ఆటోలో ఎక్కిన తనకు మత్తుమందు ఇచ్చి ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ బాధితురాలు బుధవారం ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న సంతోష్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మూడు రోజుల వ్యవధిలో నమోదైన రెండో కేసు కావడంతో నగర పోలీసు ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు. ఈ కేసును కొలిక్కి తీసుకురావడానికి డీసీపీ గజరావ్ భూపాల్ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వివరాలు... మత్తు మందు ప్రయోగించి.. పిసల్‌బండ ప్రాంతానికి చెందిన యువతి సంతోష్‌నగర్‌లో ఉన్న డయాగ్నస్టిక్ సెంటర్లో పని చేస్తోంది. ప్రతి రోజూ తన విధులు ముగిసిన తర్వాత అక్కడ నుంచి పిసల్‌బండకు ఆటోలో వెళుతూంటుంది. మంగళవారం రాత్రి 9 గంటలకు సంతోష్‌నగర్ వద్ద ఆటో ఎక్కింది. ఆ సమయంలో ఆటోలో ఆమెతో పాటు ఓ మహిళ, ఇద్దరు యువకులు ఉన్నారు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత మహిళ దిగిపోగా.. డ్రైవర్‌తో పాటు ఇద్దరు యువకులు ఆటోలోనే ఉన్నారు. ఆ సమయంలో తనపై మత్తు మందు ప్రయోగించినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. బుధవారం ఉదయం తనకు మెలకువ వచ్చే సమయానికి షాహిన్‌నగర్‌లోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఉన్నానని, తనపై ఆ ముగ్గురూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారంటూ పోలీసులకు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సంతోష్‌నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వైద్య పరీక్షల నిమిత్తం యువతిని భరోసా కేంద్రానికి తరలించారు. ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి దర్యాప్తు చేయగా యువతి నాటకం బహిర్గతమైంది. కిడ్నాప్, అత్యాచారం జరిగినట్లుగా ఎక్కడ కూడా ఆనవాళ్లు దొరకలేదు. ఆమె తన ప్రియుడిని కేసులో ఇరికించాలనే ఆలోచనతో ఇదంతా చేసిందని, హైడ్రామా ఆడిందని తేలింది. పోలీసుల విచారణలోనూ తాజాగా యువతి తన తప్పును ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. తన ప్రియుడితో వేరొకరితో ఎంగేజ్మెంట్ చేసుకున్న నేపథ్యంలో అతనిపై పగ సాధించేందుకు.. ఈ కేసులో ఇరికించాలని యువతి డ్రామ మొదలు పెట్టినట్టు సమాచారం. మరోవైపు యువతిపై లైంగిక దాడి జరగలేదని దర్యాప్తు అధికారులకు మెడికల్ రిపోర్ట్ కూడా అందినట్టు తెలుస్తోంది. -
సంతోష్‌నగర్‌లో కార్డన్ సెర్చ్: అనుమానితులు అరెస్ట్
హైదరాబాద్ : నగరంలోని సంతోష్‌నగర్‌లో పోలీసులు బుధవారం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. 300 మంది పోలీసులతో విస్తృత తనిఖీలు జరుపుతున్నారు. సంతోష్‌నగర్ ప్రాంతాన్ని వారు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. అందులోభాగంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న 56 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 10 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 23 వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. -
గుండెపోటుతో మహిళా కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్ : సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అమృత రెడ్డి సోమవారం మధ్యాహ్నం విధుల్లో ఉండగానే గుండెపోటుకు గురై మృతి చెందారు. గుండెపోటుకు గురైన ఆమెను సహచరులు వెంటనే సమీపంలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
ప్రేమ పేరుతో బాలిక కిడ్నాప్
సంతోష్‌నగర్ (హైదరాబాద్) : ప్రేమ పేరుతో బాలికకు మాయమాటలు చెప్పి అపహరించుకుపోయిన యువకుడిని కంచన్‌బాగ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ ఎన్.శంకర్ తెలిపిన వివరాల ప్రకారం... హఫీజ్‌బాబానగర్ ప్రాంతంలో నివసించే బాలిక (17)ను ప్రేమిస్తున్నానంటూ సైఫ్ అలీ ఖాన్ (23) అనే యువకుడు వెంటపడుతున్నాడు. ఈ క్రమంలో గత నెల 25 వ తేదీన సైఫ్ అలీ ఖాన్ సదరు బాలికను అపహరించుకుపోయాడు. దీనిపై బాలిక తల్లి మునీరా బేగం కంచన్‌బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్తాప్తు చేపట్టారు. అయితే రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో సైఫ్ అలీ ఖాన్‌తోపాటు బాలికను గుర్తించారు. సైఫ్ అలీ ఖాన్‌పై కేసు నమోదు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. -
గురుకులాలు దేశానికే గర్వకారణం
అలంపూర్ రూరల్: తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కొనియాడారు. గురుకులాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్ది అం దరి ఆదరాభిమానాలు పొందానని అన్నా రు. ఇక్కడ చదువుతున్న పేదవిద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించానని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తన సొంతూరు అలంపూర్‌కు వచ్చారు. స్థానిక సంతోష్‌నగర్ కాలనీలో అంబేద్కర్ విజ్ఞానకేంద్రాన్ని సందర్శించి అక్కడివారితో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. అనేక రాష్ట్రా లు తమ విద్యాలయాల విధానాలనే పాటిస్తున్నాయని చెప్పారు. అన్ని వి ద్యాలయాల్లో అన్ని హంగులతో అధునాతన సౌకర్యాలు కల్పించామన్నారు. ఇక్కడ విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామని వివరించారు. గత వేసవిసెలవుల్లో విద్యార్థులకు ఎన్నో అంశాలతో శిక్షణ ఇచ్చామని తెలిపారు. వివిధ దేశాల నిపుణులతో కోచింగ్ ఇప్పించామన్నారు. జిల్లాలోని ఇటిక్యాల, గోపాలపేటలో రూ.30కోట్లతో గురుకుల విద్యాలయాన్ని నిర్మిస్తున్నామని వివరించారు. ఇటిక్యాల గురుకుల పాఠశాల విద్యార్థులు సుందర్రాజు, ఈదన్న థాయ్‌లాండ్‌లో జరిగిన యోగాపోటీల్లో చాంపియన్లుగా నిలవడం గర్వంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న 135 గురుకులాల్లో 19వేల సీట్ల కోసం 89వేల దరఖాస్తులు వచ్చాయని వివరించారు. కేజీ టు పీజీ విద్యావిధానంలో సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయని అన్నారు. పదో తరగతిలో ప్రైవేట్‌సంస్థలకు దీటుగా 89శాతం ఫలితాలు సాధించామన్నారు. 40మంది విద్యార్థులను ఐఐటీకి పంపించామని, ప్రముఖ అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీలో 30సీట్లకు 27 సీట్లు తమ విద్యార్థులకే వచ్చాయని చెప్పారు. ఆయన వెంట ఏపీ ఉమెన్స్ కమిషన్ సభ్యురాలు సునితాకృష్ణన్ ఉన్నారు. అక్టోబర్ నాటికి గురుకుల పాఠశాలను ప్రారంభిస్తాం ఇటిక్యాల: గోపాల్పేట, ఇటిక్యాల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను అక్టోబర్ నాటికి ప్రారంభిస్తామని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ఇటిక్యాల మండల కేంద్రంలో నిర్మాణమవుతున్న గురుకుల భవనాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తామన్నా రు. భవన నిర్మాణాన్ని నాణ్యవంతంగా చేపట్టాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్న వివరించారు. ఆయన వెంట అలంపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రవీందర్, భవననిర్మాణ సైట్ ఇంజనీర్ ఆంజనేయులు ఉన్నారు. -
సంతోష్ నగర్లో కాల్పుల కలకలం
-
తుపాకీతో కాల్చి.. 3లక్షల దోపిడీ!
-
తుపాకితో కాల్చి.. 3లక్షల దోపిడీ
పాతబస్తీలోని సంతోష్‌నగర్ రక్షపురంలో కాల్పుల కలకలం రేగింది. ఇద్దరు వ్యక్తులపై కొంతమంది దుండగులు కాల్పులు జరిపి, వాళ్ల వద్ద ఉన్న 3 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. వాళ్ల పరిస్థితి విషమంగా ఉండటంతో సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు డ్రా చేసుకుని వెళ్తున్న బాలరాజు, రాజేష్ అనే ఇద్దరు వ్యక్తులను కొంతమంది దుండగులు అటకాయించారు. వాళ్లు తేరుకునేలోపే వారిపై కాల్పులు జరిపారు. వారి వద్ద ఉన్న మొత్తం 3 లక్షల నగదును దోచుకుని అక్కడి నుంచి పారిపోయారు. బాధితుల పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వారిని అక్కడకు సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. -
చిన్నారుల అదృశ్యంపై ఆర్జేడీ విచారణ
నకిరేకల్ : జిల్లాలో సంచలనం సృష్టించిన ఆశ్రమ చిన్నారుల అదృశ్యంపై ఉన్నతాధికారులు స్పందించారు. మోత్కూరు పట్టణంలో స్మైల్ వెల్ఫేర్‌ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అబ్బాస్ చిల్డ్రన్ హోం నుంచి చిన్నారులు అదృశ్యం అయిన విషయం తెలిసిందే. దీనిపై శనివారం మహిళా శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర రీజనల్ జా యింట్ డెరైక్టర్ రాజ్యలక్ష్మీ విచారణ జరిపారు. నకిరేకల్ని సంతోష్‌నగర్‌లో నివాసముంటున్న ఆశ్రమ నిర్వాహకురాలు కవిత గృహాన్ని ఆర్జేడీ, జిల్లా ఇన్చార్జ్ ఐసీడీఎస్ పీడీ మోతి, సీఐ శ్రీనివాస్‌రావు సందర్శించారు. నిర్వాహకురాలిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె వద్ద ఉన్న ఐదుగురు చిన్నారులు ఐతరాజు విష్నేష్, వేముల సురేష్, వేముల శివ, నోముల రవి, నోముల సాయి విచారించారు. జ్వరం వచ్చిందని.. జ్వరం రావడంతోనే అనాథాశ్రమంలోని 22 మంది చిన్నారులను వారి సంరక్షకులకు అప్పగించి మిగిలిన ఐదుగురు అనాథలను తన వద్ద ఉంచుకున్నట్టు ఆశ్రమ నిర్వాహకురాలు కవిత అధికారులకు వివరణ ఇచ్చింది. కవిత వద్ద ఉన్న ఆ చిన్నారులను నల్లగొండలోని బాలసదన్‌కు తరలించాలని ఆర్జేడీ ఐసీడీఎస్ సిబ్బందిని ఆదేశించారు. పిల్లలను ఇబ్బంది పెడితే చర్యలు: ఆర్జేడీ ఆశ్రమాల పేరుతో నిరుపేద, అనాథ పిల్లలను ఇబ్బందులకు గురిచేస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని మహిళా శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర రిజినల్ జాయింట్ డెరైక్టర్ రాజ్యలక్ష్మి హెచ్చరించారు. ఆమె విలేకరులతో మాట్లాడారు. విదేశాల నుంచి నిధులు వస్తాయని ఆశతో కొంత మంది ఆశ్రమాలు స్థాపించి అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. మోత్కూరులో కూడా అబ్బాస్ పిల్లల ఆశ్రమం నిర్వాహకురాలు కవిత కూడా అదే పని చేయబోయిందని పేర్కొన్నారు. గత జనవరిలో ఇలాంటి ఆశ్రమాలు ఉంటే దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ నోటిఫికేషన్ జారీచేశారని గుర్తుచేశారు. అయిన మోత్కూర్ అబ్బాస్ పిల్లల అనాథాశ్రమం నిర్వాహకులు దరఖాస్తులు కూడా చేసుకోలేదన్నారు. ఆశ్రమంలో ఉండాల్సిన పిల్లలు ఇతర ప్రాంతాలకు ఇష్టానుసారంగా తరలించండం చట్టరీత్యా నేరమన్నారు. చీటింగ్ చేసిన కవితపై శాఖ పరంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు ఫిర్యాదు చేస్తున్నామన్నారు. ఆమె వెంట నకిరేకల్, రామన్నపేట సీఐలు శ్రీనివాసరావు, బాల గంగిరెడ్డి, ఐసీడీఎస్ ఏపీడీ కృష్ణవేణి, నకిరేకల్ మోత్కూర్ మండలాల ఐసీడీఎస్ సూపర్ వైజర్లు అరుణశ్రీ, సావిత్రమ్మ, డీసీపీఓ సైదులు ఉన్నారు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తాం : ఓఎస్డీ నల్లగొండ క్రైం : మోత్కూరులోని స్మైల్ చైల్డ్ హోం కేంద్రాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని ఐసీడీఎస్ అధికారులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి నిర్వాహకులను అరెస్టు చేస్తామని జిల్లా ఇన్చార్జ్ ఏఎస్పీ, ఓఎస్డీ రాధాకిషన్‌రావు తెలిపారు. కేంద్రంలోని 27 మంది విద్యార్థుల అదృశ్యంపై శనివారం ఆయన స్పందించారు. తక్కువ మంది పిల్లలు ఉన్నప్పటికీ రికార్డులో ఎక్కువగా చూపించారని తేలిందన్నారు. 22 మంది పిల్లలు చైల్డ్ హోం కేర్ సెంటర్లో ఉండగా 16 మంది పిల్లలు మోత్కూరు మండలానికి సంబంధించిన వాళ్లు కాగా మరో ఐదుగురు పిల్లలను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారని తెలిపారు. ఇతర దేశాల నుంచి డబ్బులు లాగేందుకు ఎక్కువ మంది పిల్లలను చూపించారన్నారు. -
ఘనంగా ఈదుల్ ఫితర్
కొత్త జుబ్బా పైజామాలు... సరికొత్త రంగురంగుల టోపీలు.. అత్తరు గుబాళింపులు... దూద్సేమియాల ఘుమఘుమలతో నగరంలో ఈదుల్ ఫితర్ వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం ఉదయం 7 గంటల నుంచే నగరంలోని వన్‌టౌన్, పూలబజార్, గడియారం ఆసుపత్రి ప్రాంతం, గడ్డా వీధి, పాతబస్టాండ్, రాజ్‌విహార్, కొత్తబస్టాండ్, మద్దూర్‌నగర్, క్రిష్ణానగర్, అబ్బాస్‌నగర్ తదితర వీధులలో ముస్లింల సందడి కనిపించింది. ఉదయం 8కే జొహరాపురం సమీపంలోని ఈద్గాలలో ఈదుల్ఫితర్ నమాజు ప్రారంభమైంది. ఉదయం 9:30కి పాత ఈద్గాలో నమాజు ప్రారంభమైంది. పాత ఈద్గాలో జరిగిన ఈదుల్ ఫితర్ నమాజులో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గఫూర్, ఎస్పీ రవికృష్ణ పాల్గొన్నారు. సంతోష్‌నగర్‌లోని కొత్త ఈద్గాలో ఉదయం 10:30 గంటలకు ఈదుల్ఫితర్ నమాజు ప్రారంభమైంది. ఆయా ఈద్గాలలో ప్రపంచలోని మానవులందరూ సుఖశాంతులతో నివసించేటట్లు భగవదనుగ్రహం లభించాలని దువా(ప్రార్థన) చేశారు. నమాజు అనంతరం ముస్లింలు రహదారులపై నడిచివస్తుండగా పలువురు హిందూమిత్రులు వారిని ఆలింగనం చేసుకొని ఈద్‌ముబారక్ తెలిపారు. అలాగే జిల్లాలోని పలు ప్రాంతాల్లో ముస్లింలంతా రంజాన్‌ను ఘనంగా నిర్వహించుకున్నారు. - కర్నూలు, కల్చరల్