
తుపాకితో కాల్చి.. 3లక్షల దోపిడీ
పాతబస్తీలోని సంతోష్నగర్ రక్షపురంలో కాల్పుల కలకలం రేగింది. ఇద్దరు వ్యక్తులపై కొంతమంది దుండగులు కాల్పులు జరిపి, వాళ్ల వద్ద ఉన్న 3 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. వాళ్ల పరిస్థితి విషమంగా ఉండటంతో సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు.
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు డ్రా చేసుకుని వెళ్తున్న బాలరాజు, రాజేష్ అనే ఇద్దరు వ్యక్తులను కొంతమంది దుండగులు అటకాయించారు. వాళ్లు తేరుకునేలోపే వారిపై కాల్పులు జరిపారు. వారి వద్ద ఉన్న మొత్తం 3 లక్షల నగదును దోచుకుని అక్కడి నుంచి పారిపోయారు. బాధితుల పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వారిని అక్కడకు సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.