
సైదాబాద్–సంతోష్‌నగర్ ప్రధాన రహదారిపై కుంగిపోయిన రోడ్డు
సాక్షి, సంతోష్‌నగర్: సైదాబాద్–సంతోష్‌నగర్ ప్రధాన రహదారిపై రోడ్డు గురువారం రాత్రి ఒక్కసారిగా కుంగిపోయింది. ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీనిపై స్పందించిన పోలీసులు చర్యలు చేపట్టారు. ఐ.ఎస్.సదన్ చౌరస్తా నుంచి సంతోష్‌నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రోడ్డు మధ్యలో పిల్లర్ల కోసం గోతులు తీసి అలాగే వదిలేశారు.
దీంతో భూమి కుంగిపోవడంతో రోడ్డుపై భారీగా గుంత ఏర్పడింది. అప్రమత్తమైన స్థానికులు ట్రాఫిక్‌ను నియంత్రించారు. ఫలక్‌నుమా ట్రాఫిక్ పోలీసులతో సంతోష్‌నగర్ లా అండ్ ఆర్డర్ పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. రోడ్డుపై ఏర్పడిన గుంతను మట్టితో పూడ్చివేశారు.
చదవండి: ఉగాదికి ఉద్యోగ నోటిఫికేషన్లు.. తొలివిడతలో భారీ సంఖ్యలో భర్తీ?