saidabad
-
అనాథలు కాదు.. ఆటగాళ్లు!
నవీన్ (పేరు, వివరాలు మార్చాం) అనాథ బాలుడు. బంధువులు పట్టించుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో బాల కారి్మకుడిగా మారాడు. కర్మాగారాల్లో, పరిశ్రమల్లో దుర్భర పరిస్థితుల్లో పనిచేశాడు. అధికారులు రెస్క్యూ చేయడంతో.. నాలుగేళ్ల కింద సైదాబాద్‌లోని ప్రభుత్వ బాలల సదనానికి చేరాడు. ఇప్పుడతను విలు విద్య (ఆర్చరీ)లో జాతీయస్థాయి క్రీడాకారుడు. స్కూల్ లెవల్, జిల్లా, రాష్ట్ర స్థాయిలు దాటి గత నవంబర్‌లో గుజరాత్లో నిర్వహించిన జాతీయ బాలల ఆర్చరీ పోటీల్లో పాల్గొన్నాడు. అందులో 800 మంది పోటీపడితే 158వ స్థానం దక్కించుకున్నాడు. ఇప్పుడు సదనంలోని ఆర్చరీ అకాడమీలో కోచ్ సాయంతో రాటుదేలుతున్నాడు. భవిష్యత్తులో చాంపియన్ అవుతానంటున్నాడు. - సైదాబాద్ఇది ఈ ఒక్క బాలుడి కథనంకాదు, అతడిలా దుర్భర పరిస్థితుల్లో జీవించి, రెస్క్యూ ఆపరేషన్లలో సదనానికి చేరుకున్న మరెందరో చిన్నారులు తమదైన ప్రతిభ చూపుతున్నారు. మరో ముగ్గురు బాలలూ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని, గుర్తింపు తెచ్చుకున్నారు.రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఆర్చరీ అకాడమీ.. తల్లిదండ్రులు లేక రహదారులపై భిక్షమెత్తుతూనో, రైళ్లలో సంచరిస్తూ, బాలకారి్మకులుగానో పనిచేస్తున్న పిల్లలను అధికారులు రెస్క్యూ చేసినప్పుడు.. సైదాబాద్‌లోని ప్రభుత్వ బాలల సదనానికి తరలిస్తారు. అలా వచ్చిన పిల్లలు పెద్దయ్యేదాకా ప్రభుత్వమే చూసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఆ బాలల్లోని ప్రతిభను వెలికితీయడంపై అధికారులు దృష్టిపెట్టారు. స్వతహాగా క్రీడాకారుడైన జువెనైల్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మీర్జా అలీ బేగ్ పలువురు బాలల్లో చురుకుదనాన్ని పసిగట్టారు.చక్కటి తరీ్ఫదు ఇస్తే మంచి క్రీడాకారులుగా ఎదుగుతారని గుర్తించారు. తన ఆలోచనను ఉన్నతాధికారులకు చెప్పి ఒప్పించారు. ఎక్కడా జువెనైల్ విభాగంలో లేనిరీతిలో.. హైదరాబాద్‌లోని సైదాబాద్ జువెనైల్ హోంలో 2022 నవంబర్‌లో జువైనల్ ఆర్చరీ అకాడమీ ఏర్పాటు చేయించారు. ఇక్కడ ఉదయం బాలికలకు, సాయంత్రం బాలురకు ఆర్చరీలో తరీ్ఫదు ఇస్తున్నారు.అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణి కోచ్‌గా..అకాడమీలో కోచ్‌గా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణి, యూత్ ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన, వరల్డ్ 7వ ర్యాంకర్ హేమలతా యాదవ్‌ను నియమించారు. ఆమె 15 రోజుల శిక్షణతోనే అకాడమీలోని ఒక బాలుడు జిల్లాస్థాయి పోటీల్లో రాణించి, రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించడం.. ఆ పోటీల్లోనూ ఏడో స్థానంలో నిలవడం విశేషం. తర్వాత ఇక్కడి బాలలు నలుగురు రాష్ట్రస్థాయిలో, ఒకరు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని రాణించారు.చదువులోనూ రాణిస్తూ..ఒడిదుడుకుల బాల్యం నుంచి సదనానికి చేరిన తర్వాత బాలలు క్రమశిక్షణతో కూడిన జీవితానికి అలవాటుపడుతున్నారు. అధికారులు, సిబ్బంది సూచనలతో చదువులోనూ రాణిస్తున్నారు. పదో తరగతి పరీక్షలు రాసి పాసవుతున్నారు. ఇద్దరు విద్యార్థులు సదనం నుంచి బయటికి వచ్చి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటరీ్మడియట్ చదువుతున్నారు. ఆ ఇద్దరూ ఆర్చరీ విభాగంలో రాష్ట్రస్థాయిలో చక్కగా రాణిస్తున్న వారే.చదువు, ఆర్చరీ రెండూ కొనసాగిస్తాం..కఠినమైన బాల్యాన్ని చూశాం. అప్పటి రోజులు గుర్తుకొస్తే ఇప్పటికీ బాధేస్తుంది. సదనానికి వచ్చిన తర్వాత క్రమపద్ధతిలో జీవిస్తున్నాం. చదువుతూనే ఆర్చరీలో శిక్షణ పొందుతున్నాం. ఉన్నత విద్య పూర్తి చేయాలని, ఆర్చరీ పోటీల్లో చక్కటి గుర్తింపు పొందాలని కోరుకుంటున్నాం..’’ - ఆర్చరీలో ప్రతిభ చూపుతున్న బాలల మనోగతంఅంతర్జాతీయ ఖ్యాతి సాధించాలన్న..తెలంగాణ ప్రభుత్వ బాలల సదనంలోని పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో రాణించి మంచి ఖ్యాతి గడించాలన్నదే మా ఆకాంక్ష. అందుకోసమే మరెక్కడా లేనట్టుగా సైదాబాద్‌లోని సదనంలో ఆర్చరీ అకాడమీ ఏర్పాటు చేశాం. ప్రభుత్వం, ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించడంతో అకాడమీ సాధ్యమైంది. ఆకాంక్షలకు అనుగుణంగా బాలలు రాణిస్తున్నారు. చదువులో, క్రీడల్లో వారు ఉన్నతులుగా ఎదిగేందుకు జువెనైల్ వెల్ఫేర్ అండ్ కరక్షనల్ సరీ్వసెస్ అధికారులు, సిబ్బంది ఎంతో కృషి చేస్తున్నారు. - మీర్జా అలీ బేగ్, జువెనైల్ శాఖ డిప్యూటీ డైరెక్టర్నా విద్యార్థులు ఒలింపిక్స్‌లో ఆడాలి.. నేర్చుకోవాలనే తపన, గెలవాలనే ఆకాంక్ష ఉన్న నా విద్యార్థులు ఎప్పటికైనా ఒలింపిక్స్‌లో ఆడుతారు. అకాడమీ ప్రారంభమైన నాటి నుంచి విద్యార్థులు ఎంతో ఇష్టంగా ఆర్చరీ నేర్చుకుంటున్నారు. ఏకాగ్రత, లక్ష్యంపై వారి గురి అబ్బురపరుస్తోంది. నేర్చుకున్న అనతి కాలంలోనే వారు రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించడమే దీనికి నిదర్శనం. – హేమలతా యాదవ్, ఆర్చరీ అకాడమీ కోచ్ -
అన్నయ్యలతో ఆడుకుందామని వెళ్తే..
సైదాబాద్: ఇంటి పక్కనే ఉండే అన్నయ్యలు ఆడుకుందామని అంటే వెళ్లిన అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారి లైంగిక దాడికి గురైన దారుణ ఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చిన ఓ కుటుంబం స్థానిక పూసలబస్తీలో నివసిస్తోంది. సోమవారం సాయంత్రం ఆ కుటుంబానికి చెందిన ఐదేళ్ల పాప ఇంటి ముందు ఆడుకుంటోండగా.. అదే సమయంలో పక్కింటి పైన ముగ్గురు బాలురు పతంగులు ఎగురవేస్తున్నారు. చిన్నారి ఒక్కతే ఉండటాన్ని గమనించిన వారు ఆడుకోవటానికి రమ్మంటూ పైకి పిలిచారు. పాప వారు ఉన్న దగ్గరికి వెళ్లడంతో ముగ్గురూ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అసలు తన పట్ల ఏం జరుగుతుందో కూడా తెలియని పాప రోదిస్తూ ఉండిపోయింది. బాలుర కదలికలు అనుమానంగా ఉండటం గమనించిన స్థానిక మహిళ ఒకరు పాప తల్లికి విషయం చెప్పింది. వారు చిన్నారిని అడగ్గా బాలుర అఘాయిత్యం బయటపడింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరి వయసు 16 కాగా, మిగిలిన ఇద్దరిలో ఒకరికి 11ఏళ్లు కాగా, మరొకరు 9 సంవత్సరాల బాలుడని తెలుస్తోంది. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
బడి భూమిలో పాగా!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని సైతం వదలడం లేదు అక్రమార్కులు. దర్జాగా ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతున్నా.. అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవరించడం విస్మయానికి గురిచేస్తోంది. ఏకంగా పాఠశాల ప్రాంగణం వరుసగా రెండుసార్లు ఆక్రమణకు గురై నిర్మాణాలు వెలుస్తున్నా... తాత్కాలిక అడ్డగింపు తప్ప శాశ్వత పరిష్కారానికి చొరవ కనిపించడం లేదు. నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలల భూములు మాయమవుతున్నా ఇటు విద్యా శాఖ అధికారులు అటు రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్లుగా ఉంటున్నారు. చెరలో శంకేశ్వర పాఠశాల ప్రాంగణం.. హైదరాబాద్ జిల్లాలో సుమారు 690 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 25 శాతం మినహా మిగిలిన పాఠశాలకు సొంత స్థలాల్లో భవనాలు ఉన్నాయి. వాటికి ప్రాంగణాలు కూడా ఉన్నాయి. పాఠశాలలకు ఆనుకొని ఉన్న స్థల యజమానులు ప్రాంగణాలను ఆక్రమించుకోవడం, అడ్డుకుంటే కోర్టుకు వెళ్లడం వంటి ఘటనలు సర్వసాధారణంగా మారాయి. ఇదే పరిస్థితిని తలపిస్తోంది సైదాబాద్‌లోని శంకేశ్వర బజార్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. ఈ పాఠశాలకు కేటాయించిన స్థలంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు వేర్వేరుగా కొనసాగుతున్నాయి. సుమారు వెయ్యి మందికి పైగా విద్యార్థులు చదువుతుండటంతో ఆటలకు అనువుగా ఉండేందుకు సుమారు 250 చదరపు గజాల స్థలాన్ని పాఠశాల ప్రాంగణంగా వదిలి మిగతా స్థలంలోని భవన సముదాయంలో పాఠశాల తరగతుల నిర్వహణ కొనసాగుతోంది. పదేళ్ల క్రితం పాఠశాలకు ఆనుకొని ఉన్న స్థలం యజమాని ప్రాంగణంలోని వంద గజాల స్థలాన్ని అక్రమించి తన ఇంటికి మార్గాన్ని సుగమం చేసుకున్నారు. అప్పట్లో విద్యా, రెవెన్యూ అధికారుల దృష్టికి కొందరు స్థానికులు ఈ విషయాన్ని తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనతోనే మిన్నకుండిపోయారు. దీంతో మిగిలిన 150 చదరపు గజాల స్ధలం రక్షించుకునేందుకు అప్పటి సైదాబాద్ కార్పొరేటర్ ప్రత్యేక చొరవ చూపించి పాఠశాల ప్రాంగణం రోడ్డు మార్గాన్ని మూసివేసి స్కూల్ ముందు మార్గంలో గేటు పెట్టించారు. మిగిలిన ప్రాంగణం కూడా మూడేళ్ల క్రితం పాఠశాల ప్రాంగణానికి చెందిన మిగిలిన 150 చదరపు గజాల స్థలంపై కొందరి కన్ను పడింది. ఏకంగా ప్రాంగంణంలోని రెండు భారీ వృక్షాలను తొలగించి సామాజిక భవన్ పేరుతో నిర్మాణ పనులు చేపట్టారు. దీంతో పాఠశాల ప్రాంగణం పూర్తిగా కనుమరుగైంది. క్షేత్రస్థాయి సందర్శనకే పరిమితం మూడేళ్లుగా పాఠశాల ప్రాంగణం ఆక్రమణ వ్యవహారంపై సంబంధిత అధికారుల క్షేత్ర స్థాయి సందర్శనకే పరిమితమైంది. శాశ్వత పరిష్కారం కోసం ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు. జిల్లా విద్యాశాఖ అధికారులు, రెవెన్యూ డివిజన్ అధికారి, తహసీల్దార్ తదితరులు పాఠశాలను సందర్శించడం, ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిశీలించడం తిరిగి వెళ్లిపోవడం సర్వసాధారణంగా మారింది. తాజాగా కొందరు అధికారులు ఆక్రమణదారులతో కుమ్మక్కై కింద పాఠశాల కోసం సెల్లార్, పైన సామాజిక వర్గం భవనం కొనసాగేలా సంధిమార్గం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా మన బస్తీ– మన బడి కార్యక్రమం కింద పాఠశాల ప్రాంగణం మార్గానికి ప్రహరీ పనులు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయమై పాఠశాల ప్రాంగణం ఆక్రమణ వ్యవహారంపై హైదరాబాద్ డీఈఓను ఫోన్లో వివరణ కోరేందుకు సంప్రదించగా ఆమె నుంచి స్పందన రాలేదు. (చదవండి: పోలీస్ స్టేషన్లో రాచమర్యాదలు అందుకుంటున్న పిల్లి...ఎందుకో తెలుసా!) -
Sai Pallavi: నటి సాయిపల్లవిపై ఫిర్యాదు
సైదాబాద్: అఖిల భారత గోసేవా ఫౌండేషన్ ప్రతినిధులు సినిమా హీరోయిన్ సాయిపల్లవిపై సైదాబాద్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఫౌండేషన్ అధ్యక్షుడు బాలకృష్ణ గురుస్వామి మాట్లాడుతూ... తన సినిమా ప్రచారం కోసం ఒక యూట్యూబ్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ హీరోయిన్ సాయిపల్లవి గో రక్షకులపై అనుచిత వ్యాఖ్యలు చేయటం సమంజసం కాదన్నారు. సైదాబాద్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేస్తున్న ఫౌండేషన్ ప్రతినిధులు తమ ప్రాణాలు పణంగా పెట్టి గోవులు కబేళాలకు తరలకుండా అడ్డుకుంటున్న గో–రక్షకులను సాయిపల్లవి ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. గోరక్షకులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆమె నటించిన సినిమాను అడ్డుకుంటామని తెలిపారు. ఈ మేరకు ఫౌండేషన్ ప్రతినిధుల బృందం గురువారం సాయంత్రం సైదాబాద్ ఇన్స్పెక్టర్ సుబ్బిరామిరెడ్డికి ఫిర్యాదు చేశారు. చదవండి: (‘విరాటపర్వం’ మూవీ రివ్యూ) -
రెండో పెళ్లి.. అడిగిన డబ్బులు తేకుంటే మొదటి భార్యను తీసుకొస్తానని..
సాక్షి, మలక్‌పేట: భర్త వేధింపులు తాళలేక వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ నెల 8న జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా దామరచర్లకు చెందిన గంగనపల్లి కాశీవిశ్వనాథం కుమార్తె స్వప్న(38)ఎంబీబీఎస్ చదివింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పీహెచ్సీలో వైద్యురాలిగా పని చేస్తున్న సమయంలో మహబూబ్‌నగర్‌కు చెందిన వ్యక్తితో ఆమెకు పెళ్లైంది. అనివార్య కారణాల వల్ల భర్త నుంచి విడాకులు తీసుకుంది. అనంతరం 2015 ఏప్రిల్‌లో కర్నూలుకు చెందిన ముత్యాల మద్దయ్య కుమారుడు శ్రీధర్‌తో రెండో వివాహం జరిగింది. రూ.10 లక్షలు నగదు, 14 తులాల బంగారం కట్నం కింద ముట్టజెప్పారు. శ్రీధర్ కూడా డాక్టర్. అతడికి మేనమామ కుమార్తెతో పెళ్లికాగా, విడాకులు తీసుకున్నారు. అప్పటికే వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్వప్నకు కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ సీటు రావడంతో హైదరాబాద్‌కు వచ్చింది. «శ్రీధర్ నల్లగొండ మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు. భార్యాభర్తలు అస్మాన్‌ఘడ్ తిరుమల హిల్స్‌లో ఉంటున్నారు. ఏడాది పాటు వీరి వైవాహిక జీవితం సాఫీగా సాగింది. అదనపు కట్నం తేవాలని, లేదంటే మొదటి భార్యను తీసుకొస్తానని భర్త వేధిస్తుండంతో స్వప్న మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య కూడా యత్నించింది. చదవండి: ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో.. 2020 సంవత్సరంలో స్వప్న తల్లి విజయ మృతి చెందగా అప్పటి నుంచి ఆమెకు చెందిన ఇంట్లో వాటా, ఆమె పేరిట ఉన్న నగదు తీసుకురావాలని స్వప్నను శ్రీధర్ ఒత్తిడి చేస్తున్నాడని తండ్రి విశ్వనాథం ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా, ఈనెల 8న స్వప్న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందంటూ ఆమె తండ్రికి శ్రీధర్ ఫోన్ చేసి చెప్పాడు. మృతదేహాన్ని పరిశీలించిన కుటుంబసభ్యులు స్వప్న మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతిరాలి తండ్రి సైదాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కేసుపై ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌ను వివరణ కోరగా, స్వప్న ఆత్మహత్య చేసుకుందన్నారు. శ్రీధర్‌పై కట్నం వేధింపుల కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. -
కుంగిన సైదాబాద్–సంతోష్‌నగర్ ప్రధాన రహదారి
సాక్షి, సంతోష్‌నగర్: సైదాబాద్–సంతోష్‌నగర్ ప్రధాన రహదారిపై రోడ్డు గురువారం రాత్రి ఒక్కసారిగా కుంగిపోయింది. ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీనిపై స్పందించిన పోలీసులు చర్యలు చేపట్టారు. ఐ.ఎస్.సదన్ చౌరస్తా నుంచి సంతోష్‌నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రోడ్డు మధ్యలో పిల్లర్ల కోసం గోతులు తీసి అలాగే వదిలేశారు. దీంతో భూమి కుంగిపోవడంతో రోడ్డుపై భారీగా గుంత ఏర్పడింది. అప్రమత్తమైన స్థానికులు ట్రాఫిక్‌ను నియంత్రించారు. ఫలక్‌నుమా ట్రాఫిక్ పోలీసులతో సంతోష్‌నగర్ లా అండ్ ఆర్డర్ పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. రోడ్డుపై ఏర్పడిన గుంతను మట్టితో పూడ్చివేశారు. చదవండి: ఉగాదికి ఉద్యోగ నోటిఫికేషన్లు.. తొలివిడతలో భారీ సంఖ్యలో భర్తీ? -
‘విషం తాగించి, హత్యాయత్నం చేశారు.. నా భర్తతో ప్రాణహాని ఉంది’
సాక్షి, సైదాబాద్: ప్రభుత్వ అధికారి అయిన తన భర్త నుంచి ప్రాణహాని ఉందని పోలీసులు తనను రక్షించి అతనిపై చర్యలు తీసుకోవాలని ఓ మహిళ వాపోయింది. ఐఎస్‌సదన్ డివిజన్ సరస్వతీనగర్ కాలనీకి చెందిన బాధితురాలు ఆదివారం విలేకరులకు వివరాలు వెల్లడించింది. నాగార్జునసాగర్‌లో ఎస్ఈగా పనిచేస్తున్న కొర్ర ధర్మపై గతంలో ఏసీబీ అధికారులు దాడి నిర్వహించి పలు ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న బాధితురాలి పేరుతో ఉన్న ఆస్తులను తన పేరుపై రాసివ్వాలని భర్త ధర్మ వేధింపులకు దిగాడని ఆమె పేర్కొంది. తనను ఇంటి నుండి బయటకు వెళ్లనీయకుండా ఒకగదిలో బంధించాడని ఆరోపించింది. ఈనెల 4న అతను, సహచరులతో కలిసి బలవంతంగా విషం తాగించి తనపై హత్యాయత్నం చేశారన్నారు. ఆసుపత్రిలో నాలుగు సర్జరీలతో తేరుకున్నానని వివరించారు. ఇంటి నుండి ఎలాగోలా బయట పడ్డానని, ఆస్తులన్నీ అతని పేరుతో బదలాయిస్తానని, కానీ తనకు అతని నుండి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. పోలీసు ఉన్నతాధికారులు రక్షణ కల్పించాలని ఆమె కోరారు. భార్య మిస్సింగ్ అంటూ భర్త ఫిర్యాదు ప్రభుత్వ అధికారి అయిన భర్తపై ఆరోపణలు చేసిన సదరు మహిళ కనపడటంలేదని ఆమె భర్త సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. సైదాబాద్ ఇన్స్పెక్టర్ సబ్బిరామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...నాగార్జునసాగర్‌లో ప్రభుత్వ ఉద్యోగి అయిన ధర్మ తన భార్య పద్మజకు కుటుంబ పరిస్థితుల కారణంగా మానసికస్థితి సరిగాలేదని ఆమె శనివారం మధ్యాహ్నం నుండి కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. శనివారం రాత్రి సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: హైదరాబాద్: ఇద్దరు పిల్లలతో కలిసి గృహిణి అదృశ్యం -
బోర్‌వాటర్ వివాదం.. వాటర్‌ట్యాంక్ ఎక్కి దంపతుల హల్చల్
సాక్షి, సైదాబాద్: అపార్ట్మెంట్లో బోర్‌నీటి వినియోగ వివాదం చినికి చినికి గాలి వానలా మారింది. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉండే మహిళ తమకు నీరు అందకుండా ఇబ్బందులు సృష్టిస్తోందంటూ పెంట్‌హౌస్‌లో నివసించే దంపతులు అపార్ట్మెంట్ వాటర్‌ట్యాంక్ పైకెక్కి ఆత్మహత్య చేసుకుంటామని హల్చల్ చేశారు. వివరాలు..సైదాబాద్ ఎల్ఐసీ కాలనీలోని రక్షిత అపార్ట్మెంట్లో గ్రౌండ్‌ఫ్లోర్‌లో నివసించే మహిళకు మిగిలిన పది కుటుంబాలకు కొంతకాలంగా బోర్‌వాటర్ వినియోగించుకోవడంపై వివాదం నడుస్తోంది. ఇరువర్గాలు గతంలో ఒకరిపై ఒకరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. మూడురోజుల క్రితం బోర్‌మోటర్‌ను గ్రౌండ్‌ఫ్లోర్‌లోని మహిళ తొలిగించింది. దీంతో అపార్ట్మెంట్లో వారికి బోర్‌నీటి సరఫరా లేక ఇబ్బందులు తలెత్తాయి. స్థానిక నేతలను సదరు మహిళ, అపార్టుమెంట్ వాసుల మధ్య రాజీకి యతి్నంచినా ఫలితం లేదు. అపార్ట్మెంట్లో బోర్‌నీటి కోసం తరచూ గొడవలు జరగటంతో పెంట్‌హౌస్‌లో నివసించే ప్రేమ్ దంపతులు మనస్తాపానికి గురయ్యారు. గురువారం అపార్ట్మెంట్ 3వ అంతస్తులోని పెంట్‌హౌస్‌పై ఉన్న వాట ర్‌ట్యాంక్‌పైకి నిచ్చెన సహాయంతో ఎక్కారు. అక్కడి నుంచి దూకుతామని బెదిరించారు. సైదాబా ద్ పోలీ సులు వచ్చి వారికి సర్దిచెప్పి కిందికి దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో నివసించే మహిళ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నామని ప్రేమ్ దంపతులు తెలిపారు. -
పార్కింగ్ విషయంలో గొడవ.. మహిళ చీర లాగి, దుర్భాషలాడుతూ
సాక్షి,సైదాబాద్: వాహనం పార్కింగ్ విషయమై జరిగిన గొడవలో ఓ మహిళ చీర లాగి, దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. సైదాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. నాందేడ్‌కు చెందిన ఓ మహిళ, భర్తతో కలిసి పూర్ణోదయాకాలనీ రహదారిపై టీ స్టాల్ నడుపుతున్నారు. కొంతకాలం క్రితం వీరి టీ స్టాల్‌కు దగ్గరలోనే పూసలబస్తీకి చెందిన తన్నీరు శ్రీనివాస్ టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో టీ స్టాల్ దంపతుల కుమారుడు తన బైక్‌ను టిఫిన్ సెంటర్ ముందు నిలపగా, యజమాని కుమారుడు కింద పడేశాడు. చదవండి: బ్లేడ్‌తో చేయి కోసుకుని, తల పగులగొట్టుకొని, కప్పు పెంకులు నమిలి.. ఎందుకిలా చేశావని ప్రశ్నించినందుకు అతడిపై టిఫిన్ సెంటర్ యజమాని, అతడి కుమారులు దాడి చేశారు. తన కుమారుడిపై దాడిని అడ్డుకొనేందుకు వచ్చిన తల్లిపై కూడా దాడి చేయగా ఆమె రోడ్డుపై పడిపోయింది. అయినా వదలకుండా ఆమె చీరలాగి కొట్టేందుకు యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన తన్నీరు రామారావు, రమేష్, రాజులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: నదిలో పడిన బస్సు.. 32 మంది మృతి మహిళలతో అసభ్యకర డ్యాన్స్: ముగ్గురి అరెస్టు నాగోలు: ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వార్షికోత్సవంలో మద్యం తాగి, డీజే ముసుగులో మహిళలతో అసభ్యకర నృత్యాలు చేయించిన ముగ్గురు నిర్వాహకులపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం... ల్యాండ్ మార్క్ రియల్ ఎస్టేస్ సంస్థ 5 వార్షికోత్సవం సోమవారం రాత్రి నాగోలులోని ఓ గార్డెన్స్‌లో జరిగింది. కంపెనీ ఉద్యోగుల సమావేశం పూర్తయ్యాక మద్యం తాగి, డీజే పాటల హోరులో మహిళలతో అసభ్యకరంగా నృత్యాలు చేయించారు. స్థానికులు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సదరు రియల్ ఎస్టేట్ సంస్థ ఆర్గనైజర్ పి.రవీందర్‌రెడ్డి, ఈవెంట్ ఆర్గనైజర్ వరదరాజన్, డీజే ఆపరేటర్ కడారి దిలీప్‌కుమార్‌ను అరెస్టు చేసి డీజేను స్వా«దీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
తాగిన మైకంలో పసికందును బలిచేసిన భార్యాభర్తలు
-
భార్యాభర్తల మధ్య గొడవ.. 22 రోజుల పసికందు బలి
సాక్షి, హైదరాబాద్: సైదాబాద్ పరిధి పూసల బస్తీలో దారుణం చోటు చేసుకుంది. తాగిన మైకంలో పసికందును బలిచేశారు భార్యాభర్తలు. దంపతుల మధ్య తలెత్తిన గొడవ కాస్త పసికందు ప్రాణం తీసింది. బాలింత అయిన భార్య, రోజుల శిశువుపై నిందితుడు రాజు విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో 22 రోజుల శిశువుకు తీవ్రగాయాలయ్యాయి. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. పోలీసులు పసికందు తల్లిదండ్రులైన రాజేష్ అలియాస్ రాజు, జాహ్నవిలను అదుపులోకి తీసుకున్నారు. (చదవండి: సైదాబాద్ ఘటన: మత్తు రహిత సింగరేణిగా మారాలి) రాజేశ్, జాహ్నవి దంపతులకు ఈ శిశువు రెండో సంతానం. రెండేళ్ల క్రితం ఈ దంపతులు వారి తొలి సంతానం.. ఐదు నెలల బాబును మద్యం మత్తులో ఇంట్లో నుంచి బయటికి విసిరేశారు. విషయం తెలుసుకున్న అధికారులు బాలుడిని కాపాడి.. అతడి సంరక్షణ కోసం యూసుఫ్‌గూడలోని శిశువిహార్ చేర్చారు. రెండో సంతానం కూడా వీరి ఘర్షణకు బలైన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. పసికందు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చదవండి: పెళ్లి కాకుండానే గర్భం.. బిడ్డను కిటికీలోంచి విసిరేసి.. -
సైదాబాద్ ఘటన: మత్తు రహిత సింగరేణిగా మారాలి
సాక్షి, సైదాబాద్(హైదరాబాద్): సింగరేణి కాలనీలో చోటు చేసుకున్న చిన్నారి అత్యాచారం, హత్య ఉదంతం లాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ ప్రాంతంలో అక్రమ మద్యం, గుడుంబా, గంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మత్తు రహిత సింగరేణికాలనీతోనే ఇక్కడ అనర్థాలు అంతం అవుతాయనే స్పృహ సింగరేణివాసుల్లో పెరగాలి. స్థానిక సైదాబాద్ పోలీసులు, మలక్‌పేట ఎక్సైజ్ పోలీసులు ఇప్పటికైనా అక్రమ మత్తు పదార్థాల అమ్మకాలపై పటిష్ట చర్యలు తీసుకోవాలి. తమ ప్రాంతంలో సాగుతున్న అక్రమ వ్యాపారాలపై సింగరేణివాసులు ఇప్పటి నుంచి అయినా అధికారులకు పక్కా సమాచారం ఇవ్వాలి. మనకెందుకులే అనే ధోరణి వీడాలి సింగరేణి కాలనీలో అక్రమ మద్యం, గంజాయి అమ్మకాలు సాగుతుండటం బహిరంగ రహస్యమే. ఇక్కడి స్థానికులకు ఎవరు ఏమేమి అమ్ముతారో కూడా విధితమే. కానీ ఎవరూ ఏమి అమ్ముకుంటే మనకెందుకు అనే ధోరణిలోనే ఇంతకాలం ఉన్నారు. ఆ ధోరణి విడాలి. అమ్మకాల పక్కా సమాచారాన్ని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయటానికి వెనుకడుగు వేయొద్దు. అప్పుడే ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ఉక్కుపాదం మోపాల్సిందే... మత్తు రహిత సింగరేణికాలనీగా మార్చాలంటే అధికారులు కూడా అక్రమ వ్యాపారులపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదో ఘటనలు జరిగినప్పుడో.. ఫిర్యాదులు వచ్చినప్పుడో లేక తమకు ఉన్నతాధికారులు టార్గెట్లు విధించినప్పుడో మొక్కుబడిగా దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయటం కాకుండా పక్కాప్రణాళికతో పటిష్ట చర్యలు తీసుకోవాలి. తూతూమంత్రంగా కేసులు పెట్టడం కాకుండా మరోసారి నిషేధిత మత్తు పదార్థాలు అమ్మటానికి భయపడేలా చర్యలు తీసుకోవాలి. తరుచు దాడులు జరిపి అక్రమ వ్యాపారులకు తగిన శిక్షలు పడేలా చూస్తేనే లక్ష్యం సాధ్యమవుతుంది. ఐక్యతతో ఏదైనా సాధ్యం... సింగరేణికాలనీలో అన్ని పార్టీల, కుల, ప్రజాసంఘాల నాయకులు ఉన్నారు. చిన్నారి ఘటనతో అందరూ సింగరేణివాసులతో ఏకమై పోరాడారు. వారి పోరాట ఫలితంగానే అన్ని పక్షాల అగ్రనాయకులు సింగరేణికి తరలి వచ్చారు. అందరి ఐక్యత కృషి వల్లనే బాధిత బాలిక కుటుంబానికి న్యాయం చేయగలిగారు. ఆ ఐక్యతను నాయకులు మరిచిపోవద్దు. అదే ఐక్యతను కొనసాగించి సింగరేణి కాలనీని మత్తురహితంగా మార్చాలి. కఠిన చర్యలు తీసుకుంటాం సింగరేణికాలనీలో అక్రమంగా మత్తుపదార్థాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే 15 మందిని న్యాయస్థానంలో బైండోవర్ చేశాం. మద్యం అమ్ముతున్న వారిపైన వారికి సహకరిస్తున్న షాపుల యజమానులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశా. అక్రమ వ్యాపారులు తమ తీరును మార్చుకోకుంటే వారిపై చార్జ్షీట్లు తెలరవటం, పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తాం. – సుబ్బిరామిరెడ్డి, ఇన్స్పెక్టర్, సైదాబాద్ పీఎస్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి సింగరేణికాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే అసాంఘిక కార్యాకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చు. వాటిని సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌కు అనుసంధానం చేయాలి. మేము కూడా సింగరేణికాలనీలో మత్తుపదార్థాల అమ్మకాలు అరికట్టడానికి యువకులతో ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సంకల్పించాం. ఇక నుంచి ఇక్కడ ఎవరైనా అక్రమ అమ్మకాలు చేస్తే వెంటనే అలాంటి వారిపై అధికారులకు సమాచారం ఇస్తాం. – కొర్ర మోతీలాల్‌నాయక్, అధ్యక్షుడు సేవాలాల్ బంజారా సంఘం ఫిర్యాదులపై పోలీసులు స్పందించాలి సింగరేణికాలనీలో అక్రమ వ్యాపారులపై గతంలో ఫిర్యాదులు చేసినా సంబంధిత అధికారులు సరిగా స్పందించేవారు కాదు. అందువల్ల కూడా అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సింగరేణిలో అక్రమ వ్యాపారంపై ఫిర్యాదులు చేయటానికి స్థానికులు సిద్ధంగా ఉన్నారు. సైదాబాద్ పోలీసులు, మలక్‌పేట ఎక్సైజ్ పోలీసులు ఫిర్యాదులపై సత్వరమే స్పందించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి. – నగరాగారి దేవదాసు, సింగరేణికాలనీ, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు చదవండి: రాజు మృతి: సింగరేణి కాలనీ ఊపిరి పీల్చుకుంది -
సైదాబాద్ నిందితుడు రాజు మృతిపై జ్యుడీషియల్ విచారణ
-
సైదాబాద్ నిందితుడి కదలికలు: సింగరేణి కాలనీ టు నష్కల్
సాక్షి, హైదరాబాద్: ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన రాజు.. వారం రోజుల పాటు తప్పించుకు తిరిగాడు. మొదటి రెండు రోజుల పాటు అతడి కదలికలను గుర్తించగలిగారు. తర్వాత ఐదు రోజుల పాటు ఎక్కడున్నది తెలియదు. గురువారం రైలు కింద పడి చనిపోయాడు. రాజు ఈ సమయంలో నిర్మానుష్య ప్రాంతాల్లో తలదాచుకుని ఉంటాడని, అదే క్రమంలో రైలు పట్టాల వైపు వెళ్లి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మొత్తంగా ఈ ఘటనలో ‘సైదాబాద్ టు నష్కల్’మధ్య ఎప్పుడు ఏం జరిగిందంటే.. (సీసీ కెమెరాల ఫుటేజీ, ఇతర అంశాల ఆధారంగా..) 9వ తేదీ సాయంత్రం 4.30: హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆడుకుంటున్న బాలికకు రాజు చాక్లెట్ల ఆశ చూపి తన గదికి తీసుకువెళ్లాడు. సాయంత్రం 5.47: బాలికను హత్య చేసిన తర్వాత తన ఇంటి నుంచి ఒక సంచితో పారిపోయాడు. సంతోష్‌నగర్ ప్రాంతంలోని లేబర్ అడ్డాకు చేరుకుని ఆ రోజు రాత్రంతా అక్కడే ఉన్నాడు. 10వ తేదీ ఉదయం 9.15: సంతోష్‌నగర్ లేబర్ అడ్డా నుంచి మరో కూలీతో కలిసి యాకుత్‌పురా రైల్వేస్టేషన్ సమీపంలో కూల్చివేత పనికి వెళ్లాడు. మధ్యాహ్నం 3.30: ఇద్దరూ పని ముగిశాక డబ్బులు తీసుకుని సంతోష్‌నగర్ చౌరస్తా దగ్గరికి వచ్చారు. అక్కడ ఆటో ఎక్కి సాగర్ రింగ్‌రోడ్డు వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం 3.52: సాగర్ రింగ్‌రోడ్డు సమీపంలోని ఓ కల్లు దుకాణంలో కల్లు తాగి, డబ్బు పంచుకున్నారు. తర్వాత ఎల్బీనగర్ రింగ్ రోడ్ వరకు వచ్చారు. రాజుతో ఉన్న మరో వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సాయంత్రం 4.46: కాసేపు ఎల్బీ నగర్ రింగ్‌రోడ్డు వద్ద తచ్చాడిన రాజు.. అక్కడి ఓ హోటల్ వద్ద ఆపి ఉన్న ఆటోను చోరీ చేసేందుకు ప్రయత్నించాడు. సాయంత్రం 5.03: ఆటో చోరీ వీలుకాకపోవడంతో.. నడుచుకుంటూ సమీపంలోని వైన్స్ షాపు వద్దకు వెళ్లాడు. మద్యం కొనుక్కుని, తాగాడు. కాసేపు అక్కడే తచ్చాడాడు. రాత్రి 7.28: వైన్స్‌షాపు సమీపంలో రన్నింగ్ బస్సును చెయ్యెత్తి ఆపాడు. బస్సు ఎక్కే సమయంలోనే తన బ్యాగ్‌ను అక్కడే పడేశాడు. రాత్రి 7.45: ఉప్పల్ రింగ్‌రోడ్ వద్ద రామంతపూర్ రోడ్ వైపు బస్సు దిగాడు. నడుచుకుంటూ రోడ్డు దాటి వరంగల్ రోడ్ వైపు వెళ్లాడు. ఆ తర్వాత ఆచూకీ లభించలేదు. 16న (గురువారం) ఉదయం 8.45: ఉప్పల్‌కు దాదాపు 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న నష్కల్ వద్ద రైలు పట్టాలపై శవమయ్యాడు. చదవండి: రాజు మృతి: సింగరేణి కాలనీ ఊపిరి పీల్చుకుంది -
రాజు... నేరచరితుడే!
సాక్షి, సిటీబ్యూరో: సైదాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలోని సింగరేణికాలనీలో గత గురువారం రాత్రి ఆరేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడి, హత్య చేసి... గురువారం ఉదయం స్టేషన్ ఘన్పూర్ సమీపంలోని నష్కల్ వద్ద ఆత్మహత్య చేసుకున్న కామాంధుడు పి.రాజుకు నేరచరిత్ర ఉంది. చైతన్యపురి పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఆటో ట్రాలీ చోరీ కేసులో అరెస్టు అయ్యాడు. తాజాగా గత శుక్రవారం పారిపోయే ప్రయత్నంలో ఉండి ఎల్బీనగర్ పరిధిలో మరో ఆటో చోరీకి యతి్నంచాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. జనవరి 22న.. ఎన్టీఆర్ నగర్‌కు చెందిన మహ్మద్ సాజిద్ ఈ ఏడాది జనవరి 22 మధ్యాహ్నం తన ఆటో ట్రాలీ డ్రైవర్‌తో కొత్తపేట పండ్ల మార్కెట్ వద్దకు వచ్చాడు. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఫ్రూట్ మార్కెట్ ఫ్లాట్‌ఫామ్‌పై పార్క్ చేసి ప్రార్థనల నిమిత్తం వెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి ఆటో ట్రాలీ కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న చైతన్యపురి పోలీసులు రాజును అరెస్టు చేశారు. (చదవండి: రంగారెడ్డి: మహిళ గొంతు కోసి.. కాలు నరికి..) పారిపోయేందుకు ఆటో చోరీకి యత్నం గత గురువారం రాత్రి నుంచి పరారీలో ఉన్న రాజు ఆ మరుసటి రోజు యాకత్పురా రైల్వేస్టేషన్ సమీపంలో ఓ కూలి్చవేత పనికి వెళ్లాడు. అది పూర్తయిన తర్వాత అక్కడ నుంచి తన సహ కూలీతో కలిసి ఎల్బీనగర్ వరకు చేరుకున్నాడు. ఆ చౌరస్తాలోని బ్రాండ్ల్యాండ్ హోటల్ సమీపంలో ఉన్న ఆటో స్టాండ్‌లో కొద్దిసేపు తచ్చాడాడు. అక్కడ పార్క్ చేసి ఉన్న ఓ ఆటోను తస్కరించి, అందులో పారిపోవాలని ప్రయత్నం చేశాడు. (చదవండి: సైదాబాద్ నిందితుడి మృతిపై చిరు ఏమన్నారంటే..) రాజు దాన్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తుండగా అసలు డ్రైవర్ అక్కడకు చేరుకున్నాడు. అతడు రాజును అడ్డుకోవడంతో పాటు కొద్దిసేపు వాగ్వాదానికీ దిగాడు. ఆపై అక్కడ నుంచి జారుకున్న రాజు ఉప్పల్‌కు చేరుకున్నాడు. అనేక సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌ను పరిశీలించిన పోలీసులు ఈ విషయాలు గుర్తించారు. నగర పోలీసులు శుక్రవారం నుంచే రాజు ఫొటోను వైరల్ చేసి ఉంటే... ఎల్బీనగర్లోనే ఆటోడ్రైవర్ గుర్తించి పట్టుకునే అవకాశం ఉండేది. చదవండి: నిందితుడు రాజు ఆత్మహత్య: దేవుడు ఉన్నాడంటూ మంచు మనోజ్ ట్వీట్ -
రాజు మృతి: సింగరేణి కాలనీ ఊపిరి పీల్చుకుంది
సైదాబాద్: ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడిచేసి హత్య చేసిన నిందితుడి మృతితో సింగరేణి కాలనీ ఊపిరిపీల్చుకుంది. వారం రోజులపాటు ప్రజాపోరాటాలతో దద్దరిల్లిన చోట ప్రశాంతత అలుముకుంది. రాజు మరణవార్తతో సింగరేణిలో ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. గురువారం ఉదయం పలువురు బాలిక చిత్రపటాలతో జోహార్లు చెపుతూ నినాదాలు చేశారు. సరిగ్గా వారం క్రితం... గత గురువారం (9వ తేదీన) బాలికపై దారుణం జరగ్గా ఈ గురువారం నిందితుడు మరణించాడు. గత వారం సాయంత్రం కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు వెతికారు. స్థానికులు కూడా వారికి తోడుగా నిలిచారు. కొందరు సామాజిక మాధ్యమాల్లో బాలిక ఫొటోలు పోస్ట్ చేసి ఆచూకీ తెలపాలని అభ్యర్థించారు. రాత్రి 12 గంటలకు బాలిక నిందితుడి ఇంట్లో విగత జీవిగా కనపడింది. దాంతో ఒక్కసారిగా స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిందితుడికి కఠినశిక్ష పడాలని, బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు. స్థానికులతో పాటు బాలిక కుటుంబానికి న్యాయం జరగాలంటూ కాంగ్రెస్, బీజేపీ, వైఎస్ఆర్టీపీ, జనసేన, బీఎస్పీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. (చదవండి: రాజును పోలీసులే చంపారు! నాకు, నా బిడ్డకు దిక్కెవరు?: మౌనిక) ఫలించిన పోరాటల ఒత్తిడి.. వారం రోజుల ఆందోళనల తరువాత గురువారం ఉదయం మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్‌లు బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరుపున నష్టపరిహారం అందించారు. తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చి వెళ్లారు. వారు వచ్చి వెళ్లిన రెండు గంటలకే నిందితుడి ఆత్మహత్య వార్త బయటకు వచ్చింది. దాంతో సింగరేణివాసులు తమ వారం రోజుల పోరాటానికి ఫలితం దక్కిందని ఊపిరిపీల్చుకున్నారు. (చదవండి: సైదాబాద్ చిన్నారి కేసు: ఉన్మాది కథ ముగిసింది!) ప్రభుత్వం ఆదుకోవాలి బాలికపై పాశవికంగా హత్యాచారం చేసిన నిందితుడు ఆత్మహత్య చేసుకోవడం.. అతనికి పడిన తగిన శిక్షగానే భావిస్తున్నాం. అయితే బాలిక కుటుంబాన్ని ప్రభుత్వం అన్నిరకాలుగా ఆదుకోవాలి. – నగరిగారి దేవదాసు, సింగరేణికాలనీ -
రాజును పోలీసులే చంపారు! నాకు, నా బిడ్డకు దిక్కెవరు?: మౌనిక
సాక్షి, అడ్డగూడూరు: రాజును పోలీసులే చంపారని, ఆత్మహత్య అని కట్టుకథ అల్లి ప్రచారం చేస్తున్నారని అతడి భార్య మౌనిక, తల్లి ఈరమ్మ ఆరోపించారు. రాజును పట్టుకున్న పోలీసులు.. కోర్టుకు అప్పజెప్పి ఉండాల్సిందని పేర్కొన్నారు. ఆ చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగిందని అంటున్నారని.. మరి తమ కుటుంబం పరిస్థితి ఏమిటని నిలదీశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చంపేసి పట్టాలపై వేశారు: ఈరమ్మ తన కొడుకు రాజును పోలీసులు పథకం ప్రకారమే చంపేశారని అతడి తల్లి ఈరమ్మ ఆరోపించింది. ‘‘నేను హైదరాబాద్‌లోని సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఉన్నప్పుడే.. నా కొడుకు రాజును పట్టుకున్నారని పోలీసులు అనుకుంటుంటే విన్నాను. కానీ చంపేసి రైలు పట్టాలపై వేశారు. ఆత్మహత్య చేసుకున్నాడని కట్టుకథ అల్లారు. హైదరాబాద్‌లోని మా కొడుకు ఇంటిని చిన్నారి బంధువులు కూలగొట్టారు. మాకు తలదాచుకోవడానికి ఏ దిక్కూ లేకుండా పోయింది.’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. నా బిడ్డకు న్యాయం చేయాలె.. తిరుమలగిరి (తుంగతుర్తి): రాజు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్తున్నారని, తన బిడ్డ బతుకు మాత్రం ఆగమైపోయిందని మౌనిక తల్లి యాదమ్మ వాపోయింది. సూర్యాపేట జిల్లా తిరు మలగిరి మండలం జలాల్పురం గ్రామానికి చెందిన ఆమె గురువారం మీడియాతో మాట్లాడింది. ‘‘రాజు నా బిడ్డను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పోయిన శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుంచి పోలీసులు వచ్చి నా భర్తను, ఇద్దరు కొడుకులను, బిడ్డను తీసుకొనిపోయారు. ఈ బుధవారం రాత్రి పంపించారు. తెల్లారే సరికి రాజు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారు. నా బిడ్డ బతుకు ఆగమైపోయింది. ఆమెకు ఓ ఆడపిల్ల ఉంది. వారి భవిష్యత్తు ఏమైపోవాలి. ప్రభుత్వమే న్యాయం చేయాలి..’’ అని విజ్ఞప్తి చేసింది. నాకు, నా బిడ్డకు దిక్కెవరు?: మౌనిక కొద్దిరోజులుగా తాను తల్లిగారి ఇంట్లో ఉంటున్నానని రాజు భార్య మౌనిక తెలిపింది. ‘‘గత శుక్రవారం హైదరాబాద్ నుంచి పోలీసులు వచ్చి.. నన్ను, మా అత్తమ్మ, ఆమె బిడ్డ, బిడ్డ భర్తను తీసుకెళ్లారు. రాజు గురించి అడిగారు. వెతకడానికి మమ్మల్ని వెంట తీసుకెళ్లారు. మాతో తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుని.. బుధవారం రాత్రి 10 గంటలకు హైదరాబాద్‌లోని ఉప్పల్ చౌరస్తాలో వదిలివెళ్లారు. అక్కడి నుంచి మేం భువనగిరికి బస్సులో వచ్చి.. ఓ బండి మాట్లాడుకుని గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అడ్డగూడూరుకు చేరుకున్నాం. కొద్దిగంటల్లోనే నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడని వార్తలు వచ్చాయి. నా భర్తను పోలీసులే పొట్టన పెట్టుకున్నారు. కోర్టుకు అప్పగిస్తే శిక్ష అనుభవించేవాడు. ఆ చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగితే.. మరి మా కుటుంబానికి కూడా న్యాయం చేయాలి. నాకు 11 నెలల కూతురు ఉంది. ఇప్పుడు మా ఇద్దరికి దిక్కెవరు?’’ అంటూ రోదించింది. -
సైదాబాద్ చిన్నారి కేసు: ఉన్మాది కథ ముగిసింది!
జనగామ/ స్టేషన్‌ఘన్‌పూర్/ హైదరాబాద్: గురువారం ఉదయం 8 గంటల సమయం.. రైలుపట్టాల దగ్గర ఓ యువకుడు కూర్చుని ఉన్నాడు.. ఆ పక్కనే ఉన్న పొలాలకు వెళ్తున్న రైతులు అతడిని చూశారు.. అనుమానంతో దగ్గరికి వెళ్లారు. వారిని చూసిన యువకుడు పారిపోయే ప్రయత్నం చేశాడు. దొరికిపోతాననే భయంతో అటుగా వస్తున్న రైలు కిందపడి చనిపోయాడు. వారం రోజుల కింద.. హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై దారుణంగా హత్యాచారానికి పాల్పడ్డ పల్లకొండ రాజు (28) కథ ఇలా ముగిసింది. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం చిల్పూరు మండలం నష్కల్ స్టేజీ సమీపంలో ఈ ఘటన జరిగింది. కాజీపేట నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న భువనేశ్వర్–ముంబై కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టడంతో రాజు శరీరభాగాలు ఛిద్రమయ్యాయి. మృతదేహం చేతిపై ఉన్న ‘మౌనిక’అనే పచ్చబొట్టు, ఇతర గుర్తుల ఆధారంగా అతడిని రాజుగా నిర్ధారించారు. మృతదేహానికి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారం రోజుల కింద.. ఈ నెల 9న సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిని అదే ప్రాంతానికి చెందిన రాజు అత్యాచారం చేసి చంపేసిన విష యం తెలిసిందే. అప్పటి నుంచి పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. అతడి ఫొటోలను విడుదల చేశారు. పట్టించిన వారికి రూ.10 లక్షలు రివార్డు ఇస్తామని కూడా ప్రకటించారు. అయితే రాజు ఎవరి కంట పడకుండా నిర్మానుష్య ప్రాంతాల్లో తిరుగుతూ వచ్చాడు. ఈ క్రమం లో రైల్వేట్రాక్ వెంబడి వెళ్తూ.. గురువారం జనగామ జిల్లా నష్కల్ స్టేజీ సమీపంలోని రాజారాం బ్రిడ్జి 309/1–3 కిలోమీటరు రాయి వద్దకు చేరుకున్నాడు. ఉదయం 8 గంటల సమయంలో రైల్వే కీమెన్లు కుతాటి సారంగపాణి, తాటి కుమార్‌లు ట్రాక్‌ను తనిఖీ చేస్తుండగా.. గడ్డం, పొడవాటి జుట్టుతో ఒక యువకుడు అనుమానాస్పదంగా కనిపించాడు. పట్టాల దగ్గర ఏం చేస్తున్నావని కీమెన్లు అతడిని నిలదీయగా.. ‘మీకెందుకంటూ’ఎదురు వాదనకు దిగాడు. దీంతో వారు రాజు దగ్గరికి వెళ్లగా పట్టాల పక్కన ఉన్న పొదల్లోకి వెళ్లిపోయాడు. కాసేపు వేచి చూసిన కీమెన్లు.. పట్టాలను తనిఖీ చేసుకుంటూ వెళ్లిపోయారు. రైతుల కంట పడటంతో.. కీమెన్లు వెళ్లిపోయాక రాజు మళ్లీ పట్టాల దగ్గరికి వచ్చాడు. ఆ పక్కన ఉన్న పొలాల్లోని రైతులు భూక్యా రామ్‌సింగ్, గౌతమ్‌సింగ్ పట్టాలపై రాజును చూశారు. హైదరాబాద్ చిన్నారి హత్యాచార ఘటన నిందితుడిలా ఉన్నాడని గుర్తించారు. పక్కనే పొలంలో ఉన్న సోదరుడు సురేశ్‌కు ఫోన్ చేసి పిలిచారు. ముగ్గురు కలిసి దూరం నుంచే.. ‘‘ఎవరు నువ్వు.. ఇక్కడేం చేస్తున్నావు’’అని ప్రశ్నించారు. రాజు ఆహార్యం, అడ్డదిడ్డంగా సమాధానాలు చెప్పడం చూసి.. కాస్త దూరంలోనే నిలబడ్డారు. ఆ సమయంలో కాజీపేట వైపు వెళుతున్న గూడ్స్ రైలు కింద దూకేందుకు రాజు ప్రయత్నించి, ఆగిపోయాడు. అది చూసిన రైతులు.. ‘‘ఏమైంది? ఎందుకు చనిపోదామనుకుంటున్నావు?’’అని ప్రశ్నిస్తూ దగ్గరికి వెళ్లారు. సుమారు 8.45 గంటల సమయంలో కాజీపేట నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు రావడంతో.. దాని కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైతులు వెంటనే కీమెన్లకు ఫోన్ చేయగా.. వారు పోలీసులకు, నష్కల్ రైల్వేస్టేషన్ మాస్టర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. రాజు కుడిచేయి మణికట్టు వరకు తెగిపోయింది. ముఖం, శరీరభాగాలు ఛిద్రమయ్యాయి. సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం: సీపీ తరుణ్ జోషి చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న రాజు.. నష్కల్ రైల్వే ట్రాక్ వరకు ఎలా వచ్చాడనే దానిపై ఆరాతీస్తున్నట్టు వరంగల్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. రాజును పట్టుకోవడం కోసం తమ పరిధిలోని ప్రజలను అప్రమత్తం చేశామని, పోలీసు బలగాలతో నిఘా పెట్టామని చెప్పారు. ఈ క్రమంలోనే నష్కల్ సమీపంలో పట్టాలపై రాజు మృతదేహం ఉన్నట్టు సమాచారం వచ్చిందని తెలిపారు. ఈ అంశంలో సమగ్ర విచారణ జరిపిస్తున్నామన్నారు. రైల్వే పోలీసుల విచారణ రైల్వే జీఆర్పీ సీఐ రామ్మూర్తి నేతృత్వంలోని పోలీసు బృం దం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, క్లూస్ టీంతో ఆధారాలు సేకరించామని రైల్వే ఎస్సై అశోక్‌కుమార్ తెలిపారు. గురు వారం రాత్రి పొద్దుపోయాక సికింద్రాబాద్ ఎస్సీ అనూ రాధ సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఘటన స్థలంలో సిమ్‌కార్డులు లేని రెండు సెల్ఫోన్లు లభించినట్టు ప్రకటిం చారు. కాగా, రాజు ఉదంతంపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు ఆమె చెప్పారు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో..! భువనేశ్వర్–ముంబై కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. గురువారం ఉదయం 8.30 గంటలకు కాజీపేటకు చేరుకున్న ఆ రైలు.. 8.33 నిమిషాలకు సికింద్రాబాద్ వైపు బయలుదేరింది. ఈ మధ్యలో రైలు ఎక్కడా ఆగదు. వీలైనంత వరకు వేగంగా ప్రయాణిస్తుంది. రాజు రైలు కింద పడిన సమయంలో రైలు గరిష్ట వేగంతో ఉన్నట్టు భావిస్తున్నారు. బాలిక కుటుంబ సభ్యులకు చెక్కు ఇస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్. చిత్రంలో మంత్రి మహమూద్ అలీ బాలిక కుటుంబానికి రూ.20 లక్షల చెక్కు సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని హోంమంత్రి మహమూద్ అలీ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గురువారం ఉదయం పరామర్శించారు. ప్రభుత్వం తరఫున రూ.20 లక్షల ఆర్ధిక సాయం చెక్కును వారికి అందజేశారు. ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలని బాలిక తల్లిదండ్రులు మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తప్పనిసరిగా తగిన చర్యలు తీసుకుంటుందని వారు హామీ ఇచ్చారు. మేం చూస్తుండగానే.. ఉదయం 6.30 గంటలకు ఇద్దరు తమ్ముళ్లతో కలిసి వ్యవసాయ బావి వద్దకు వచ్చిన. ఆ సమయంలో ఓ వ్యక్తి ట్రాక్‌పై కూర్చొని కనిపించాడు. పంటపై కోతులు దాడి చేయడంతో.. తమ్ముడు రాంసింగ్, నేను వాటిని తరమడానికి వెళ్లాం. 8.40 గంటల సమయంలో మరో తమ్ముడు గౌతమ్‌సింగ్ నా వద్దకు వచ్చాడు. పట్టాల వద్ద గడ్డం, పొడవాటి జుట్టుతో ఓ వ్యక్తి ఉన్నాడని చెప్పడంతో దగ్గరికి వెళ్లాం. అతన్ని చూసి రాజులా ఉన్నాడని అనుకున్నాం. కానీ అతను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ మేం ముగ్గురం ఉండడంతో.. దొరికిపోతాననే భయంతో అటువైపు వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు వెళ్లిపోయాక దగ్గరికి వెళ్లి చూశాం. చేతిపై మౌనిక అనే పచ్చబొట్టు కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాం. – రైతు సురేశ్, ప్రత్యక్ష సాక్షి పారిపోవడంతో రాళ్లు విసిరినం పట్టాలపై ఒక వ్యక్తి కనిపించడంతో పట్టుకునేందుకు ప్రయత్నించాం. కానీ పొదల్లోకి పారి పోయాడు. బయటికి రప్పించేం దుకు రాళ్లు విసిరాం. ఎంతకూ రాకపోవడంతో పిచ్చోడేమో అనుకుని యథావిధిగా ట్రాక్ తనిఖీ కోసం వెళ్లాం. కాసేపటికే కొందరు రైతు లు ఓ వ్యక్తి రైలు కిందపడి చనిపోయాడని సమా చారం ఇచ్చారు. వెంటనే స్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందించాం. – తాటి కుమార్, రైల్వే కీమెన్ పిచ్చోడేమో అనుకున్నాం ఉదయం 8 గంటలకు విధుల్లోకి వచ్చాం. ఆ సమయంలో ట్రాక్ పక్కన ఉన్న వ్యక్తిని మందలించాను. గడ్డం, జుట్టును చూసి అనుమానం వచ్చింది. కాగితా లు ఏరుకునేవాడో, పిచ్చివాడో అనుకున్నం. ఎవరది అని అరుస్తూ దగ్గరికి వెళ్లినం. కోపంగా చూసుకుంటూ పొదల్లోకి వెళ్లిపోయాడు. – కుతటి సారంగపాణి, రైల్వే కీమెన్ ఎంజీఎం: రైలు పట్టాలపై లభించిన రాజు మృతదేహానికి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో డాక్టర్ రజామ్ ఆలీఖాన్ ఆధ్వర్యంలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. రాజు ఒంటిపై అనుమానాస్పద గాయాలేమీ లేవని వారు తెలిపారు. రైలు ఢీకొనడంతో తల నుజ్జునుజ్జు అయిందని, రెండు చేతులకు తీవ్రగాయాలయ్యాయని వెల్లడించారు. పోస్టుమార్టం ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీశామని.. రాజు శరీర అవయవాల శాంపిల్స్‌ను హైదరాబాద్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కు పంపామని తెలిపారు. కాగా.. రాజు మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకువచ్చిన సమయంలో స్థానికులు ఆగ్రహంతో అంబులెన్స్‌పై చెప్పులు విసిరారు. రాజు బావమరదులు కేదిరి సురేశ్, కేదిరి మహేశ్‌లకు మృతదేహాన్ని, ఆనవాళ్లను చూపించగా.. రాజుదేనని వారు గుర్తించారు. తర్వాత రాజు తల్లి వీరమ్మ, భార్య మౌనిక, ఇతర బంధువులకు మృతదేహాన్ని చూపించారు. లాంఛనాలు పూర్తయ్యాక రాజు మృతదేహాన్ని బంధువులకు అప్పగించగా.. వరంగల్ పోతన శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. సింగరేణిలో నిందితుడు రాజు ఇంటిని కూల్చేస్తున్న స్థానికులు మృతదేహాన్ని చూస్తేగానీ నమ్మం హత్యాచార నిందితుడు రాజు చనిపోయాడని చెప్తే నమ్మబోమని.. మృతదేహాన్ని తాము కళ్లారా చూస్తేనే నమ్ముతామని బాలిక తల్లిదండ్రులు సభావత్ రాజు, జ్యోతి అన్నారు. గురువారం సింగరేణికాలనీలోని నివాసంలో వారు మాట్లాడారు. ముఖం గుర్తుపట్టకుండా ఉన్న మృతదేహం రాజు అని ఎలా చెప్తున్నారని ప్రశ్నించారు. మృతదేహాన్ని సింగరేణికాలనీకి తేవాలని, తాము చూసి నిర్ధారించుకుంటామని డిమాండ్ చేశారు. కాగా.. రైలు పట్టాలపై రాజు మృతదేహం కనిపించిందన్న వార్తలు తెలిశాక.. సింగరేణికాలనీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హత్యాచార ఘటన జరిగినప్పుడు నిందితుడు రాజు ఇంటిని కొంతమేర కూల్చిన స్థానికులు.. గురువారం మరోసారి ఇంటిపై దాడిచేసి కూల్చారు. రాజు మృతదేహాన్ని సింగరేణికాలనీకి తేవాలని డిమాండ్ చేశారు. -
Reporters Report: సైదాబాద్ చిన్నారి హత్య కేసు నిందితుడు రాజు ఆత్మహత్య
-
ప్రభుత్వం, పోలీసులు చేయలేని న్యాయం దేవుడు చేశాడు: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: సైదాబాద్ చిన్నారి అత్యాచార, హత్య ఘటనలో తాము దీక్ష చేసిన తర్వాతే ప్రభుత్వంలో కదలిక వచ్చిందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శాంతియుతంగా దీక్ష చేస్తుంటే రాత్రి 2 గంటలకు 200మంది పోలీసులు తమపై దాడిచేశారని పేర్కొన్నారు. తమను బలవంతంగా కార్లలోకి ఎక్కించి హౌస్ అరెస్ట్ చేశారని విమర్శించారు. దీక్ష చేస్తున్న తమపై దాడి చేయడం తాలిబన్ల చర్య వంటిదని తెలిపారు. 6 ఏళ్ళ చిన్నారిపై అత్యాచారం, హత్య జరిగి 7 రోజులు గడిచినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి కారణం ఆ కుటుంబ పేదరికమే అని ఆరోపించారు. చిన్నారికి ప్రభుత్వం, పోలీసులు చేయలేని న్యాయం దేవుడు చేశారన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక 300 శాతం మద్యం అమ్మకాలు పెరిగాయని విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 300 శాతం మహిళలపై దాడులు పెరిగాయన్నారు. మత్తు పదార్థాల వల్ల యువత చెడిపోతుందని, ప్రభుత్వం పట్టించుకోదన్న ధైర్యమే దాడులకు కారణమవుతోందని అన్నారు. -
ఆ భయంతోనే రాజు ఆత్మహత్య చేసుకున్నాడు: సీపీ అంజనీ కుమార్
సాక్షి, హైదరాబాద్: సైదాబాద్ చిన్నారి అత్యాచార, హత్య ఘటనపై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ స్పందించారు. ఈ రోజు (గురువారం) ఉదయం స్టేషన్ ఘన్పూర్ రైల్వే పట్టాల వద్ద రాజు మృతదేహం లభ్యమైనట్లు అంజనీ కుమార్ తెలిపారు. రైల్వే ట్రాక్‌పై మృత దేహం పడి ఉన్నదని సమాచారం వచ్చిందని, లభించిన ఆనవాళ్ల ప్రకారం నిందితుడి చేతిపై మౌనిక అనే టాటూ ఉన్నట్లు పేర్కొన్నారు. మరో చేతికి 5 స్టార్ మార్క్‌లు ఉన్నాయని, నిందితుడి కుటుంబ సభ్యులు రాజు మృతదేహాన్ని గుర్తించారని పేర్కొన్నారు. గత 5,6 రోజులుగా రాజు కోసం రాష్ట్రమంతా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారని తెలిపారు. పోలీసుల నుంచి తప్పించుకోలేనని నిందితుడి మైండ్‌లో పడిపోయిందని, ఆ భయంతోనే రాజు ఆత్మ హత్య చేసుకున్నాడని వెల్లడించారు. చదవండి: రాజు ఆత్మహత్య: కేటీఆర్ స్పందన.. సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్యకేసు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. వరంగల్-ఘట్కేసర్ మార్గంలో స్టేషన్ ఘన్పూర్ వద్ద రైలు పట్టాలపై రాజు మృతదేహం కనిపించింది. చేతిపై ఉన్న టాటూ ఆధారంగా రాజు మృతదేహాన్ని గుర్తించారు. 8 రోజులుగా రాజు కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పంచనామా అనంతరం రాజు మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. రాజు ఆత్మహత్య చేసుకోవడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. చిన్నారి ప్రాణాన్ని చిదిమేసిన కామాంధుడు రాజు మరణించడంతో బాధిత కుటుంబంతో పాటు అనేకమంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: సైదాబాద్ చిన్నారి కేసు: నిందితుడు రాజు ఆత్మహత్య -
సైదాబాద్ నిందితుడి మృతిపై చిరు ఏమన్నారంటే..
వారం రోజులుగా తెలంగాణలోని సింగరేణి ప్రాంతానికి చెందిన ఆరేళ్ళ చిన్నారి హత్యాచార కేసు కలకలం రేపిన సంగతి తెలిసిందే. నిందితుడు రాజుకు తగిన శిక్ష వేయాలని కొందరు, మరణ శిక్షే సరైనదని మరొకొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ జాబితాలో సామాన్యులు, సెలబ్రిటీలు ఉన్నారు. ఆ కీచకుడి మరణ వార్త అందరిలోనూ కాస్త సంతోషాన్ని నింపిందనే చెప్పాలి. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ మృతి స్పందిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ ద్వారా తన స్పందించారు. అందులో.. అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన రాజు అనే కిరాతకుడు తనకు తాను శిక్షను విధించుకోవడం బాధిత కుటుంబంతో పాటు మిగతా అందరికి కొంత ఊరట కలిగిస్తుంది. ఈ సంఘటనపై మీడియా, పౌర సమాజం గొప్పగా స్పందించాయి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వంతో పాటు పౌర సమాజ చొరవ చూపాలి. అలాంటి కార్యక్రమాలు ఎవరు చేపట్టినా నా సహకారం ఉంటుంది. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని తన ట్వీట్లో పేర్కొన్నారు. కాగా గురువారం ఘనపూర్ రైల్వే ట్రాక్ఫై రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి చేతిపై ఉన్న మౌనిక అనే పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు ఆ మృతదేహం రాజుదేనని నిర్థారించారు. ప్రస్తుతం రాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. Let’s not allow such dastardly acts to recur and let’s do whatever it takes towards this goal! #JusticeForChaithra pic.twitter.com/yWX5bwDloN — Chiranjeevi Konidela (@KChiruTweets) September 16, 2021 చదవండి: ‘టాలీవుడ్ డ్రగ్స్’ కేసు: కెల్విన్‌తో ఫోన్‌కాల్స్ మర్మమేమిటి? -
చిప్స్ ప్యాకెట్ చూపించి లోపలి తీసుకెళ్లి..
-
సైదాబాద్ చిన్నారి కేసు: నిందితుడు రాజు ఆత్మహత్య
-
పట్టుకునే లోపే చనిపోయాడు: ప్రత్యక్ష సాక్షి
-
నిందితుడు రాజు ఆత్మహత్య: దేవుడు ఉన్నాడంటూ మంచు మనోజ్ ట్వీట్
సైదాబాద్ బాలిక హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. స్టేషన్‌ఘన్‌పూర్ రైల్వే ట్రాక్‌పై రాజు శవమై కనిపించాడు. ఈ విషయం తెలిసి దీనిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా హీరో మంచు మనోజ్ కూడా ఈ ఘటనపై స్పందించాడు. నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారని తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయగా.. ఆయన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. ‘ఈ వార్త చెప్పినందుకు థ్యాంక్యూ సర్.. దేవుడు ఉన్నాడు. ఓం శాంతి చైత్ర’ అంటూ మంచు మనోజ్ స్పందించాడు. చదవండి: సైదాబాద్ చిన్నారి కేసు: నిందితుడు రాజు ఆత్మహత్య Thank you for the news sir.. God is there … #OmShantiChaitra #Chaitra https://t.co/hhe0UxFVNd — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 16, 2021 అలాగే మెగాస్టార్ చిరంజీవి రాజు ఆత్మహత్యపై ట్వీట్ చేస్తూ.. రాజు తనను తాను శిక్షించుకోవడం బాధిత బాలిక కుటుంబ సభ్యులతో పాటు అందరికీ ఊరట కలిగిస్తోందని చెప్పారు. బాలికలపై దారుణ ఘటనలు మరోసారి జరగకూడదని, అందుకు ప్రజలు చొరవచూపాలని ఆయన కోరారు. చదవండి: సైదాబాద్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన మంచు మనోజ్ Let’s not allow such dastardly acts to recur and let’s do whatever it takes towards this goal! #JusticeForChaithra pic.twitter.com/yWX5bwDloN — Chiranjeevi Konidela (@KChiruTweets) September 16, 2021 -
రాజు ఆత్మహత్య: కేటీఆర్ స్పందన..
సాక్షి, హైదరాబాద్: సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్యకేసు నిందితుడు రాజు ఆత్మహత్యపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘నిందితుడు రాజు ఆత్యహత్య చేసుకున్నట్లు తెలంగాణ డీజీపీ సమాచారం అందించారు. నిందితుడు రాజు మృతదేహం వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ రైల్వే ట్రాక్‌పై గుర్తించారు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. స్టేషన్ ఘన్పూర్ రైల్వే ట్రాక్‌వద్ద రాజు మృత దేహం లభ్యమైందని తెలంగాణ డీజీపీ ట్వీట్ చేశారు. రైల్వే ట్రాక్‌పై దొరికిన మృతదేహంపై మౌనిక అని పచ్చబొట్టు ఉండటంతో నిందితుడు రాజు అని నిర్థారించారు. Just been informed by @TelanganaDGP Garu that the beast who raped the child has been traced & found dead on a railway track at station Ghanpur#JusticeForChaithra https://t.co/TCx2BHvVhG — KTR (@KTRTRS) September 16, 2021 -
సైదాబాద్ చిన్నారి కేసు: నిందితుడు రాజు ఆత్మహత్య
సాక్షి, వరంగల్: సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్యకేసు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్-ఘట్కేసర్ మార్గంలో స్టేషన్ ఘన్పూర్ వద్ద రైలు పట్టాలపై రాజు మృతదేహం కనిపించింది. చేతిపై ఉన్న టాటూ ఆధారంగా రాజు మృతదేహాన్ని గుర్తించారు. 8 రోజులుగా రాజు కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పంచనామా అనంతరం రాజు మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని సీపీ తరుణ్ జోషి పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. స్టేషన్ ఘన్పూర్ రాజారాం బ్రిడ్జి నంబరు-436 వద్ద రాజు తిరిగాడని.. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడినట్లు రైల్వే కార్మికులు చెప్పినట్లుగా సీపీ వెల్లడించారు. రాజు మృతదేహాన్ని ముందుగా గమనించిన రైల్వే కార్మికులు డయల్ 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా నిందితుడు రాజుగా పోలీసులు గుర్తించారని చెప్పారు. హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో తోటిపిల్లలతో కలసి ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారికి గురువారం (సెప్టెంబర్ 9) చాక్లెట్ ఆశ చూపి తీసుకెళ్లి నిందితుడు రాజు అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. చిన్నారి తల్లిదండ్రులు నల్లగొండ జిల్లా దేవరకొండ సమీప తండాకు చెందిన గిరిజన కుటుంబం. బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి సింగరేణి కాలనీలో నివసిస్తోంది. ఈ సమయంలోనే ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఇక ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు సంఘాలు, సామాజికవేత్తలు నిరసనలు తెలిపారు. హైదరాబాద్ పోలీసులు ఈ కేసులో నిందితుడైన రాజు ఆచూకీ తెలియజేసిన వారికి రూ.10 లక్షలు రివార్డు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. నిందితుడు రాజు కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలింపు చేపట్టారు. గాలింపులో భాగంగా నిందితుడు రాజు స్నేహితుడు పోలీసులకు దొరికాడు. హైదరాబాద్ టాస్కఫోర్స్ అదుపులో నిందితుడు రాజు స్నేహితుడు దొరికాడు. చదవండి: సైదాబాద్ ఘటన: రూ. 20 లక్షలు చెక్కును తిరస్కరించిన బాధిత కుటుంబం పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించగా రాజు ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. అయితే రాజుకు తోడుగా ఎల్బీనగర్ వరకు అతడి స్నేహితుడు వచ్చాడు. సీసీ ఫుటేజ్‌లో అతడు కూడా కనిపించాడు. అనంతరం ఎల్బీనగర్ నుంచి రాజు ఒంటరిగా వెళ్లారు. అయితే పారిపోయే ముందు రాజు ఎల్బీనగర్లో ఆటో దొంగతనానికి యత్నించాడు. ఆటో డ్రైవర్ అప్రమత్తతో రాజు పరారయ్యాడు. అక్కడి నుంచి నాగోల్ వరకు బస్సులో వెళ్లాడు. నాగోల్‌లోని ఓ వైన్ షాప్ వద్ద మద్యం సేవించి అటు నుంచి బస్సులో ఉప్పల్ వెళ్లాడు. అక్కడి నుంచి ఘట్కేసర్ వైపు వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. -
సైదాబాద్ ఘటన: రూ. 20 లక్షలు చెక్కును తిరస్కరించిన బాధిత కుటుంబం
హైదరాబాద్: సైదాబాద్ బాలిక ఘటన పట్ల రోజురోజుకు ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. చిన్నారిని హత్య చేసిన దుర్మార్గుడి కోసం పోలీసులు తెలంగాణ వ్యాప్తంగా జల్లెడ పడుతున్న విషయం తెలిసిందే. కాగా, బాధిత కుటుంబానికి తెలంగాణ హోంశాఖ మంత్రి మహమ్ముద్ అలీ, మంత్రి సత్యవతి రాథోడ్‌లు గురువారం రూ. 20 లక్షల చెక్కును ఇచ్చారు. అయితే, మంత్రులు ఇచ్చిన చెక్కును బాధిత కుటుంబం తిరస్కరించింది. ‘మాకు చెక్ వద్దు.. ఆ దుర్మార్గుడిని ఉరితీయాలని’ వేడుకున్నారు. మంత్రులు ఇచ్చిన చెక్కును మీడియా ముఖంగా తిరిగి ఇచ్చేస్తామని బాలిక తండ్రి తెలిపారు. దీనిపై చిన్నారి తండ్రి.. తాము చెక్ తీసుకోలేదు.. బల్లపై పేట్టేసి వెళ్లారని తెలిపారు. ఆ చెక్కు మాకోద్దు.. దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని కన్నీటి పర్యంతమయ్యారు. చదవండి: చిన్నారి కేసులో కీలక మలుపు: పోలీసుల అదుపులో రాజు స్నేహితుడు -
సైదాబాద్ నిందితుడు రాజు కోసం కొనసాగుతున్న పోలీస్ సెర్చ్ ఆపరేషన్
-
మ్యాగజైన్ స్టోరీ 15 September 2021
-
దీక్ష భగ్నంపై వైఎస్ షర్మిల ధ్వజం
సాక్షి, హైదరాబాద్: సింగరేణికాలనీకి చెందిన ఆరేళ్ల బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన నిరాహారదీక్షను పోలీసులు బుధవారం అర్ధరాత్రి భగ్నం చేశారు. ఆమెతోపాటు శిబిరంలో ఉన్న నాయకులను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. కాగా, శాంతియుతంగా దీక్ష చేస్తున్న షర్మిలను తరలించటంపై సింగరేణికాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని బుధవారం పరామర్శించిన షర్మిల ఈ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించాలంటూ ఆ కుటుంబం ఇంటి సమీపంలోనే దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ధర్నా చేసే హక్కు లేదా?: కేసీఆర్ పాలనలో శాంతియుతంగా ధర్నా చేసే హక్కు కూడా లేదా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఆరేళ్ల చిన్నారికి జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించేందుకు వెళ్లిన తమను పోలీసులతో నిర్బంధించడాన్ని తాలిబన్ల చర్యగా ఆమె అభివర్ణించారు. లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ..బాలిక హత్యాచార ఘటనపై తాము ఆందోళనకు దిగాకే ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. శాంతియుతంగా దీక్ష చేస్తున్న తమపై అర్ధరాత్రి పోలీసులతో దాడి చేయించడం ఈ ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనమన్నారు. కేసీఆర్ పాలనలో యువత ఆశయం లేకుండా కాలం వెళ్లదీస్తోందని, మత్తు మందులకు బానిసయ్యే దురవస్థ ఏర్పడిందన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక మహిళలపై దాడులు పెరిగాయని, మద్యం విక్రయాలు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు. చదవండి: సైదాబాద్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ షర్మిల -
వైఎస్ షర్మిల దీక్ష భగ్నం
-
నిందితుడు ఎక్కడ
-
కేసీఆర్ స్పందించే వరకు నిరాహార దీక్ష
సాక్షి, సైదాబాద్ (హైదరాబాద్): ఆరేళ్ల గిరిజన బాలిక హత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించే వరకు నిరాహారదీక్ష చేస్తానని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబానికి భద్రత కల్పించాలని, వారికి ఏం నష్టపరిహారం చెల్లిస్తారో సీఎం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని వారి ఇంటి వద్దే దీక్షకు దిగారు. బుధవారం సింగరేణి కాలనీకి చేరుకున్న షర్మిల బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ తన ఇంట్లో కుక్కకు ఇచ్చే విలువ మనుషులకు ఇవ్వటం లేదని అన్నారు. గిరిజనుల ప్రాణాలంటే లెక్కలేదా అని సీఎంను ప్రశ్నించారు. ఫామ్‌హౌస్‌లో ఉండి పాలన చేసే సీఎం, ఉపఎన్నికలు వస్తేనే బయటకు వస్తారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి రాష్ట్రంలో మహిళల రక్షణ విషయంలో పట్టింపు లేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తెలంగాణలో మహిళలపై లైంగిక వేధింపుల కేసులు మూడురెట్లు పెరిగాయన్నారు. రాష్ట్రాన్ని అప్పులు, ఆత్మహత్యలు, బీరుల తెలంగాణగా మార్చారని దుయ్యబట్టారు. చిన్నారిని చిదిమేసిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా త్వరగా కఠిన శిక్ష వేయించాలని అన్నారు. బాధిత కుటుంబానికి రూ.10 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దత్తత కాలనీపై పట్టింపేది కేటీఆర్..! మున్సిపల్ ఎన్నికల సమయంలో సింగరేణి కాలనీని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని ప్రకటించిన మంత్రి కేటీఆర్, తర్వాత ఎందుకు పట్టించుకోవడంలేదని షర్మిల ప్రశ్నించారు. ఈ కాలనీలో బాలికపై దుర్మార్గపు చర్య చోటుచేసుకున్నా కేటీఆర్ ఎందుకు బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని నిలదీశారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలి బాలిక ఘటనపై ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదని షర్మిల అన్నారు. నిందితుడిపై బాధిత కుటుంబం అనుమానం వ్యక్తం చేసినా పట్టించుకోలేదన్నారు. బాధ్యత లేకుండా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. కాగా, అర్థరాత్రి దాటాక కూడా షర్మిల దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. షర్మిలకు మద్దతుగా విజయమ్మ బాలిక హత్యాచార ఘటనపై వైఎస్ షర్మిల చేపట్టిన దీక్షకు ఆమె తల్లి విజయమ్మ మద్దతు ప్రకటించారు. బుధవారం సాయంత్రం సింగరేణి కాలనీకి చేరుకున్న విజయమ్మ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వారికి మద్దతుగా దీక్ష చేస్తున్న షర్మిలను కలిశారు. దీక్షా శిబిరంలో కూర్చొని సంఘీభావం తెలిపారు. -
చిన్నారి కేసులో కీలక మలుపు: పోలీసుల అదుపులో రాజు స్నేహితుడు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సింగరేణి కాలనీ ఆరేళ్ల చిన్నారి హత్యాచారం కేసులో కీలక మలుపు తిరిగింది. నిందితుడు రాజు కోసం గాలిస్తుండగా అతడి స్నేహితుడు పోలీసులకు లభించాడు. హైదరాబాద్ టాస్కఫోర్స్ అదుపులో నిందితుడు రాజు స్నేహితుడు దొరికాడు. పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించగా రాజు ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. అయితే రాజుకు తోడుగా ఎల్బీనగర్ వరకు అతడి స్నేహితుడు వచ్చాడు. సీసీ ఫుటేజ్‌లో అతడు కూడా కనిపించాడు. అనంతరం ఎల్బీనగర్ నుంచి రాజు ఒంటరిగా వెళ్లారు. చదవండి: ‘రాజు’ కోసం వేట.. తెలంగాణ పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్ అయితే పారిపోయే ముందు రాజు ఎల్బీనగర్లో ఆటో దొంగతనానికి యత్నించాడు. ఆటో డ్రైవర్ అప్రమత్తతో రాజు పరారయ్యాడు. అక్కడి నుంచి నాగోల్ వరకు బస్సులో వెళ్లాడు. నాగోల్‌లోని ఓ వైన్ షాప్ వద్ద మద్యం సేవించి అటు నుంచి బస్సులో ఉప్పల్ వెళ్లాడు. అక్కడి నుంచి ఘట్కేసర్ వైపు వెళ్లినట్లుగా గుర్తించారు. అదుపులోకి తీసుకున్న రాజు స్నేహితుడి నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. రాజు ఎక్కడికి వెళ్లాడు? అని ప్రశ్నిస్తున్నారు. రాజును ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో తమదైన శైలిలో విచారణ చేపట్టి స్నేహితుడి నుంచి రాజు ఆచూకీ తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. స్నేహితుడు చిక్కడంతో రాజు కూడా ఇక చిక్కుతాడని పోలీసులు భావిస్తున్నారు. చదవండి: కులాలు వేరు.. అయినా ఘనంగా పెళ్లి చేస్తారని నమ్మివెళ్తే.. -
దేశంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు
-
బాధిత కుటుంబానికి రూ.10 కోట్ల పరిహారం ఇవ్వాలి: వైఎస్ షర్మిల
-
చిన్నారి చైత్ర కుటుంబసభ్యులను పరామర్శించిన వైఎస్ షర్మిల
-
సైదాబాద్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: సైదాబాద్ చిన్నారి కుటుంబ సభ్యులను బుధవారం వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్టీపీ) అధినేత్రి వైఎస్ షర్మిల పరామర్శించారు. బాధతురాలి ఇంటి వద్ద వైఎస్ షర్మిల నిరాహార దీక్ష చేపట్టారు. సీఎం కేసీఆర్ స్పందించేంతవరకు నిరాహార దీక్ష చేస్తానని పేర్కొన్నారు. ఆమెతోపాటు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్ విజయమ్మ కూడా దీక్షలో కూర్చున్నారు. బాధిత కుటుంబానికి రూ.10కోట్ల పరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ హయాంలో మహిళలపై లైంగికదాడులు అధికమైయ్యాయని మండిపడ్డారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. -
సైదాబాద్ ఘటనపై స్పందించిన ఆర్పీ, రూ. 50 వేలు రివార్డు ప్రకటన
సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటనపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. నిందితుడు రాజును పట్టించడంలో పోలీసులకు సహకరిద్దాం అంటూ సోషల్ మీడియా వేదికగా పిలుపునిస్తున్నారు. ఇక మంచు మనోజ్ సోమవారం బాధిత బాలిక కటుంబాన్ని పరామర్శించగా.. ఈ ఘటనపై సూపర్ స్టార్ మహేశ్ బాబు విచారం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హీరో నాని నిందితుడు బయటెక్కడో ఉన్నాడు.. ఉండకూడదంటూ ట్వీట్ చేశారు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ సైతం సైదాబాద్ ఘటనపై స్పందిస్తూ.. నిందితుడి ఆచూకీ తెలియజేస్తే రివార్డు ఇస్తానని ప్రకటించారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తేనే చిన్నారి ఆత్మకు శాంతి చేకూరుతుందంటూ ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేశారు. చదవండి: సైదాబాద్ హత్యాచార ఘటన: బయటెక్కడో ఉన్నాడు.. ఉండకూడదు ఆర్పీ పోస్టు చేస్తూ.. ‘చిట్టితల్లికి న్యాయం జరగాలంటే, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటే నిందితుడు రాజు దొరకాలి. అతడి ఆచూకీ తెలియజేసిన వారికి రూ.10 లక్షలు రివార్డు ఇస్తామని హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. పట్టించిన వారికి నా వంతుగా రూ.50 వేలు ఇస్తాను. అతడు దొరకాలి. చేతిపై ‘మౌనిక’ అనే పచ్చబొట్టు తప్పకుండా అతడిని పట్టించేలా చేస్తుంది. అతడు మీ దగ్గర్లోనే ఉండొచ్చు. ఒక కన్ను వేసి ఉంచండి. ఆ కిరాతకుడిని పట్టుకునే పనిలో పోలీసు శాఖకు మన వంతు సాయం అందిద్దాం’ అని ఆయన పిలుపునిచ్చారు. View this post on Instagram A post shared by Rp Patnaik (@rp.patnaik) -
Saidabad incident: ఇంకా దొరకని కామాంధుడు..
-
సైదాబాద్ ఘటన దారుణం: కోమటిరెడ్డి
హైదరాబాద్: సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి వెంకటరెడ్డి బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ఘటన దారుణమని తెలిపారు. బాధిత కుటుంబాన్ని సీఎం కేసీఆర్, కేటీఆర్, డమ్మీ హోమ్ మంత్రి పలకరించకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలిక కనిపించడం లేదనగానే.. పోలీసులు స్పందిస్తే అమ్మాయి బ్రతికి ఉండేదని అన్నారు. పోలీసులున్నది గాడిదలు కాయడానికా అని ఘాటుగా విమర్శించారు. బాలిక మృతికి రాక్షసుడు ఎంత కారణమో.. పోలీసులు కూడా అంతే కారణమని అన్నారు. నిందితుడిని పట్టిస్తే రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బతుకమ్మ అంటూ తెలంగాణ అంత తిరిగే కవిత, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఇక్కడికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దళిత, గిరిజన బిడ్డని కేసీఆర్ వివక్ష చూపిస్తున్నారా అని.. కోమటి రెడ్డి వెంటరెడ్డి ఎద్దేవా చేశారు. పోలీసు శాఖకు అవార్డులు వస్తున్నాయని గొప్పలు చెప్పుకుంటున్నారు.. అవన్ని డబ్బులతో కొనుక్కుంటున్న అవార్డులని విమర్శించారు. నిందితుడిని పట్టుకోవడంలో పోలీసుశాఖ అలసత్వం కనిపిస్తోందని అన్నారు. ఇలాంటి సమయంలో ఒక కలెక్టర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పడం బాధాకరమని అన్నారు. మంత్రి తలసానికి సినీయాక్టర్‌ను పరామర్శించడానికి సమయం ఉంది కానీ బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దిశ ఘటనలో చేసినట్లే ఈ ఘటనలోను నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. చదవండి: చిన్నారి అత్యాచారం కేసు: తెలంగాణ వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ -
సైదాబాద్ హత్యాచార ఘటనపై నాని షాకింగ్ ట్వీట్
సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటన ఎంత మందిని కలిచివేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభం,శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిని రాజు అనే మానవ మృగం అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హత్య చేశాడు. ఆ కీచకుడిని ఎన్కౌంటర్ చేయాలని వాదనలు వినిపిస్తున్నాయి. సెలబ్రిటీలు సైతం రాజుకి కఠిన శిక్షలు వేయలని కోరుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు మహేశ్ బాబు, మంచు మనోజ్ సోషల్ మీడియా ద్వారా రాజు అనే నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తాజాగా నాని కూడా ఈ ఘటనపై స్పందించాడు. తెలంగాణ పోలీస్ ట్వీట్‌ని షేర్ చేస్తూ.. బయటెక్కడో ఉన్నాడు, ఉండకూడదు అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. సామాన్యులు సైతం రాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: సైదాబాద్ చిన్నారి హత్యాచారంపై స్పందించిన మహేశ్) అయితే ఘటన అనంతరం నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 లక్షల రివార్డ్ అందిస్తామని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. బయటెక్కడో ఉన్నాడు వుండకుడదు https://t.co/yyiuvM6HP1 — Nani (@NameisNani) September 15, 2021 -
చిన్నారి అత్యాచారం కేసు: తెలంగాణ వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
-
సైదాబాద్ చిన్నారి హత్యాచారంపై స్పందించిన మహేశ్
సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటనపై హీరో మహేశ్ బాబు స్పందించారు. 'ఆరేళ్ల చిన్నారిపై జరిగిన ఈ దారుణం సమాజంలో పరిస్థితులు ఎంత దిగజారిపోయాయో గుర్తు చేస్తున్నాయి. అసలు మన బిడ్డలు సురక్షితమేనా? అన్నది ఎప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోవాలా! చిన్నారి కుటుంబం ఇప్పుడు ఎంతటి దుఖంలో మునిగిపోయిందో ఊహించలేం' అంటూ మహేశ్ ఎంతో ఎమోషనల్ అయ్యారు. The heinous crime against the 6-year old in Singareni Colony is a reminder of how far we have fallen as a society. "Will our daughters ever be safe?", is always a lingering question! Absolutely gut-wrenching.. Cannot imagine what the family is going through! — Mahesh Babu (@urstrulyMahesh) September 14, 2021 మరోవైపు హీరో మంచు మనోజ్ సైతం బాలిక హత్యాచారం కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చిన్నారి కుటుంబాన్ని మంగళవారం పరామర్శించిన మనోజ్.. ఈ దారుణ ఘటనకు మనమందరం బాధ్యత వహించాలని పిలుపు నిచ్చాడు. కాగా సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై రాజు అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఘటన అనంతరం నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రివార్డు అందిస్తామని హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. చదవండి : సైదాబాద్ చిన్నారి అత్యాచారం కేసు: పోలీసుల కీలక నిర్ణయం ఆరేళ్ల గిరిజన బాలికపై హత్యాచారం: పెల్లుబికిన ప్రజాగ్రహం.. -
సైదాబాద్ చిన్నారి అత్యాచారం కేసు: పోలీసుల కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసుపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారి అత్యాచారం కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రివార్డు అందిస్తామని హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాగా, సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల పాపను రాజు అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్న నిందితుడి కోసం రాష్ట్ర పోలీసు యంత్రాంగం ముమ్మర గాలింపు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో నిందితుడి ఆనవాళ్లను సైతం పోలీసులు విడుదల చేశారు. చదవండి: సైదాబాద్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన మంచు మనోజ్ నిందితుడి ఎత్తు సుమారు 5.9 అడుగులు ఉంటుందని, పెద్ద జుట్టుకు రబ్బర్ బ్యాండ్ వేసుకొని తిరుగుతాడని తెలిపారు. నిందితుడి వయసు సుమారు 30 ఏళ్లు ఉంటుందని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే అతని రెండు చేతులపై మౌనిక అనే టాటూ కూడా ఉంటుందని తెలిపారు. రాజు ఆచూకీ తెలిస్తే 9490616366, 9490616627 నెంబర్లకు కాల్ చేయాలని పోలీసులు సూచించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి అత్యాచారం కేసులో నిందితుడు ఇంకా లభించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆరురోజులైన నిందితుడి ఆచూకీ దొరకకపోవడంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పట్టుకుని ఎన్కౌంటర్ చేయాలని అనేకమంది డిమాండ్ చేస్తున్నారు. చదవండి: ఆరేళ్ల గిరిజన బాలికపై హత్యాచారం: పెల్లుబికిన ప్రజాగ్రహం.. -
నిందితుడు ఎక్కడ. సైదాబాద్ హత్యాచార కేసులో వీడని చిక్కుముడి..!
-
సైదాబాద్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన మంచు మనోజ్
-
సైదాబాద్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన మంచు మనోజ్
నల్గొండ(భువనగిరి): సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచారంపై హీరో మంచు మనోజ్ స్పందించాడు. మంగళవారం బాధిత చిన్నారి కుటుంబ సభ్యులను మనోజ్ పరామర్శించాడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిన్నారి విషయంలో జరిగింది అత్యంత క్రూరమైన చర్య అన్నాడు. బాలికపై జరిగిన ఈ దారుణ ఘటనకు మనమందరం బాధ్యత వహించాలని పిలుపు నిచ్చాడు. ఆడపిల్లలను ఎలా గౌరవించాలో అందరికీ నేర్పించాలన్నాడు. ఇంకా నిందితుడు దొరకలేదని పోలీసులు అంటున్నారని, దీనిని ప్రభుత్వం, పోలీసులు సీరియస్‌గా తీసుకోవాలని మనోజ్ కోరాడు. ఛత్తీస్‌గడ్‌లో మూడేళ్ళ క్రితం చిన్నారిపై జరిగిన హత్యాచారం కేసులో ఉరిశిక్ష వేయాలని ఇప్పుడు తీర్పు వచ్చిందని తెలిపాడు. అలాగే సైదాబాద్ ఘటనకు కారణమైన నిందితుడిని 24 గంటల్లో పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక టీవీ చానళ్లలో సాయి ధరమ్ తేజ్ గురించి యనిమేషన్లు వేయకుండా.. ఇలాంటి వారికి న్యాయం జరిగేలా చూడాలన్నాడు. చిన్నారి కుటుంబానికి అన్ని విధాలుగా తోడుంటామని మంచు మనోజ్ పేర్కొన్నాడు. -
చిన్నారిపై హత్యాచారం జరిగిన ప్రభుత్వం స్పందించలేదు: సీతక్క
-
‘సైదాబాద్ హత్యాచార ఘటన’పై మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటనపై మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి లైంగిక వేధింపులు, అత్యాచారం వార్తతో తీవ్ర మనస్తాపానికి గురయ్యా. నేరస్తుడిని గంటల వ్యవధిలో అరెస్ట్ చేశారు. బాధిత కుటుంబానికి సత్వర న్యాయం చేయాలి’ అని కేటీఆర్.. హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డిని విజ్ఞప్తి చేశారు. చదవండి: టీడీపీలో కుతకుతలు.. నిన్న జేసీ, కాల్వకు.. నేడు ఉమా, ఉన్నం సింగరేణి కాలనీలో తోటిపిల్లలతో కలసి ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారికి గురువారం (సెప్టెంబర్ 9) చాక్లెట్ ఆశ చూపి తీసుకెళ్లి ఓ యువకుడు అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. చిన్నారి తల్లిదండ్రులు నల్లగొండ జిల్లా దేవరకొండ సమీప తండాకు చెందిన గిరిజన కుటుంబం. బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి సింగరేణి కాలనీలో నివసిస్తోంది. ఈ సమయంలోనే ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఇక ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పలు సంఘాలు, సామాజికవేత్తలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబానికి పరిహారం అందించాలని, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: కాంగ్రెస్‌కు ఊహించని షాక్: హాట్‌హాట్‌గా ఉత్తరాఖండ్ రాజకీయం Deeply anguished with the news of a 6 year old child’s sexual molestation & murder in Singareni colony While the perpetrator has been arrested within hours, I request Home Minister @mahmoodalitrs Garu & @TelanganaDGP Garu to ensure that justice is delivered expeditiously 🙏 — KTR (@KTRTRS) September 12, 2021 -
ఆరేళ్ల గిరిజన బాలికపై హత్యాచారం: పెల్లుబికిన ప్రజాగ్రహం..
సైదాబాద్: తోటిపిల్లలతో కలసి ఇంటి ముందు సరదాగా ఆడుకుంటున్న ఓ చిన్నారిపై కామాంధుడి కన్నుపడింది. అభంశుభం తెలియని ఆ బాలికకు చాక్లెట్ ఆశ చూపాడు. నమ్మి అతడి ఇంటికి వెళ్లిన బాలికపై అత్యాచారం చేసి హతమార్చాడు. ఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి... నల్లగొండ జిల్లా దేవరకొండ సమీప తండా నుంచి బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చిన ఓ గిరిజన కుటుంబం సింగరేణి కాలనీలో నివసిస్తోంది. గురువారం తల్లిదండ్రులు పనికి వెళ్లగా కూతురు(6) ఇంటి వద్ద తోటిపిల్లలతో కలసి ఆడుకుంటోంది. వారి ఇంటి పక్కనే చిల్లర దొంగతనాలు చేసే యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరుకు చెందిన రాజు(30) ఉంటున్నాడు. సంవత్సరం క్రితం అతని ప్రవర్తన నచ్చక భార్య వదిలేసింది. ఈ క్రమంలో గురువారం ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికకు చాక్లెట్ ఆశ చూపించి ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడు. తరువాత గొంతు నులిమి చంపేశాడు. మృతదేహాన్ని పరుపులో చుట్టి అక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నించాడు. అది సాధ్యం కాకపోవడంతో అక్కడే వదిలేసి పరారయ్యాడు. అదేరోజు సాయంత్రం నుంచి తమ కూతురు కనపడటంలేదని తల్లిదండ్రులు సింగరేణి కాలనీ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. ఫలితం లేకపోవడంతో సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి ఇంట్లోనే చిన్నారి మృతదేహం బాలిక తల్లిదండ్రులు, స్థానికులు రాజుపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు రాత్రి 11 గంటల సమయంలో రాజు ఇంటి తాళం పగలకొట్టి చూడగా పరుపులో చుట్టి ఉన్న బాలిక మృతదేహం లభించింది. దీంతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించటానికి ప్రయత్నించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో కొందరు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులు వారికి సర్దిచెప్పి బాలిక మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఏడు గంటలపాటు నిరసన బాలిక హత్యాచారానికి గురైన విషయం తెలుసుకున్న స్థానికులు, పలు సంఘాల వారు సింగరేణి కాలనీలో శుక్రవారం నిరసనకు దిగారు. నిందితుడ్ని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. అనంతరం సాగర్ జాతీయ రహదారిపై బైఠాయించారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రాఫి క్కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. విషయం తెలుసుకున్న హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ సంఘటనాస్థ లిని సందర్శించి బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. ప్రభుత్వం తరపున సంతాపాన్ని తెలియజేశారు. బాధిత కుటుం బానికి ప్రభుత్వం అన్నివిధాలా బాసటగా ఉంటుందని హామీనిచ్చారు. బాధిత కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు, వారి కుటుంబంలోని ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగంతోపా టు వారి పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని కలెక్టర్ హామీనిచ్చారు. తక్షణ సహాయం కింద రూ.50 వేల చెక్కును వారికి అందజేశారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయటం ద్వారా నిందితుడికి కఠినశిక్ష పడేలా చూస్తామని కలెక్టర్, అడిషనల్ కమిషనర్ రమేశ్‌రెడ్డి హామీ ఇవ్వటంతో నిరసనకారులు ఆందోళన విరమించారు. నిందితుడు రాజు (ఫైల్‌ఫొటో) పోలీసుల అదుపులో నిందితుడి అక్క, బావ అడ్డగూడూరు/చందంపేట: నిందితుడు రాజు కోసం 10 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ క్రమంలో రాజు అక్క, బావను శుక్రవారం అడ్డగూడూరులో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ ఉదయ్‌కిరణ్ తెలిపారు. నిందితుడిని సైతం అదుపులో తీసుకున్నట్లు టీవీల్లో ప్రసారం కావడంతో మండల ప్రజలు ఉలిక్కిపడ్డారు. కాగా, రాజు స్వగ్రామం జనగామ జిల్లా కొడకండ్ల అని, అతని అక్క, బావ అడ్డగూడూరులో ఉంటారని అంటున్నారు. హత్యాచారానికి గురైన చిన్నారి అంత్యక్రియలు స్వగ్రామం నక్కలగండితండాలో శుక్రవారం రాత్రి పోలీస్ బందోబస్తు నడుమ జరిగాయి. -
ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి ,స్థానికులు, బంధువులు నిరసన..
-
సైదాబాద్ హత్యాచార ఘటన: రోడ్డుపై బాధితుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై రాజు అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బస్తీవాసులు ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సాగర్ జాతీయ రహదారిపై బైఠాయించి.. నిరసన తెలపడంతో అక్కడ రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. ఈ క్రమంలో అధికారులు ట్రాఫిక్ మళ్లించారు. బాధితుల నిరసన గురించి తెలుసుకున్న హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తాం.. నెల రోజుల్లో నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. బాధితుల కుటుంబానికి 50 వేల రూపాయల చెక్ అందజేశారు. అంతేకాక కుటుంబంలో ఒకరికి ఔట్సోర్సింగ్ జాబ్ ఇస్తామని.. కలెక్టర్ పరిధిలో ఏం ఇవ్వగలమో అవన్ని అందేలా చూస్తామని తెలిపారు. (చదవండి: సైదాబాద్‌లో దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి) డీసీపీ రమేష మాట్లాడుతూ.. ‘‘ఈ కేసును ఫాస్ట్రాక్ కోర్టు ద్వారా వేగవంతం చేసేలా చేస్తాం.. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తాం. బాధితుల నిరసనలో పోలీసులకు గాయాలు అయ్యాయి. చిన్నారి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సాగర్‌రోడ్డుపై పూర్తిగా రాకపోకలు బంద్ చేశాము. ఉద్రిక్తత పరిస్థితులు దృష్ట్యా భారీగా పోలీసులను మోహరించాం’’ అని తెలిపారు. చదవండి: ‘మా కూతురి మెడపై ఉరివేసిన గుర్తులున్నాయి’ -
ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, ఆపై హత్య?
-
సైదాబాద్ సింగరేణి కాలనీలో తీవ్ర ఉద్రిక్తత
-
సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి
-
సైదాబాద్‌లో దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి
సాక్షి, హైదరాబాద్: సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఆరేళ్ల చిన్నారిపై రాజు అనే యువకుడు లైంగిక దాడి చేసి హత్యకు పాల్పడ్డాడు. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి చిన్నారి అదృశ్యమైంది. అర్ధరాత్రి 12 గంటలకు నిందితుడు రాజు ఇంట్లో చిన్నారి మృతదేహం లభ్యమైంది. నిందితుడు రాజును తమకు అప్పగించే వరకు మృతదేహాన్ని కదిలించేది లేదని బస్తీవాసులు ఆందోళనకు దిగారు. స్థానికులు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాలనీలో 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుడు రాజు పరారీలో ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు, బంధువులు నిరసన.. బాలిక హత్యాచారం ఘటనలో నిందితుడు రాజును బహిరంగంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆగ్రహంతో రహదారిపై వాహనాలను అడ్డుకుంటున్నారు. సాగర్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. కర్మన్‌ఘాట్-చంపాట్ రహదారిపై చిన్నారి బంధువులు ఆందోళన చేపట్టారు. బాధితుల కుటుంబాలకు జిల్లా కలెక్టర్ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆరేళ్ల చిన్నారి తల్లితో కలెక్టర్ మాట్లాడారు. ఇవీ చదవండి: రూ.11 లక్షల నగదుతో డీఎస్పీ పరుగులు డ్రెస్ మార్చుకుంటుండగా వీడియో.. బ్లాక్ మెయిల్ చేసి -
Hyderabad: నడిరోడ్డుపై మహిళ ప్రసవం
సాక్షి, సైదాబాద్: ఆరాంఘర్‌లో నివసించే మేస్త్రీ రాజు, రాజేశ్వరి దంపతులకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. రాజేశ్వరి నిండు గర్భిణి. రాజుతో గొడవ పడిన ఆమె మూడు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చింది. సోమవారం సాయంత్రం శంకేశ్వరబజార్ నుంచి సైదాబాద్ వైపు వెళ్తుండగా రాజేశ్వరికి పురిటి నొప్పులు వచ్చాయి. రహదారి పక్కన ఆమె బాధపడుతూ కూర్చుండి పోయింది. అప్పుడు అక్కడే ఉన్న శంకేశ్వరబజార్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నల్లిమెల్లి మోజెస్ తదితర కాలనీవాసులు 108కు సమాచారం ఇచ్చారు. అలాగే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బందికి విషయం తెలిపి సహకరించాల్సిందిగా కోరారు. 108 వచ్చేలోపే పునే రాజేశ్వరి రోడ్డుపైనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది పుట్టిన బిడ్డను ఆసుపత్రికి తీసుకెళ్లి సపర్యాలు చేశారు. 108 సిబ్బంది రాజేశ్వరికి 108లో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం తల్లీబిడ్డలను 108లో కోఠి ప్రసూతి ఆసుపత్రికి తరలించారు. -
జువైనల్ హోం నుంచి 10 మంది బాలలు పరార్..!
హైదరాబాద్: సైదాబాద్ జువైనల్ హోం నుంచి 10 మంది బాలలు పరారయ్యారు. వెంటపడి నలుగురు బాలలను జువైనల్ సిబ్బంది అదుపులోకి తీసుకుంది. మరో ఆరుగురు బాలల తప్పించుకున్నట్లు తెలుస్తోంది. తప్పించుకున్న బాలల కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. కాగా తప్పించుకున్న వారంతా ఆపరేషన్ ముస్కాన్‌లో పోలీసులు రక్షించిన బాల కార్మికులని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ ఘటనపై పోలీసులకు సైదాబాద్ బాలుర గృహం ఫిర్యాదు చేయలేదని సమాచారం. -
వీడి తెలివి సల్లగుండ.. ఇళ్లంతా ఐరన్‌తోనే నిర్మాణం
సాక్షి, సైదాబాద్: అనుమతులు లేకుండా నిర్మాణం చేపడితే కూల్చేస్తారని అతి తెలివితో ఓ వ్యక్తి ఐరన్‌తో నిర్మాణం చేపట్టాడు. ఐఎస్‌సదన్ డివిజన్ ఆర్టీసీకాలనీలో ప్రధాన రహదారికి ఆనుకొని ఐరన్‌తో జీ–ప్లస్ వన్ను నిర్మించాడు. శ్లాబు, గోడలు, మెట్లు అంతా ఐరన్‌తోనే నిర్మించడం గమనార్హం. కింది భాగంలో నాలుగు షెట్టర్లను ఏర్పాటు చేశాడు. ఈ అక్రమ నిర్మాణాన్ని స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సదరు నిర్మాణదారుడికి నోటీసులు ఇచ్చామని టౌన్‌ప్లానింగ్ అధికారి మల్లీశ్వర్ తెలిపారు. స్పందించకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
యువకుల వివాదం.. గర్భవతి అని చూడకుండా..
సాక్షి, సైదాబాద్: చిన్న విషయంలో చెలరేగిన వాగ్వివాదం యువకుడిపై దాడికి దారి తీసింది. సైదాబాద్ ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. సింగరేణికాలనీలో నివసించే ప్రశాంత్ అలియాస్ రాజు (24) జీహెచ్ఎంసీ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈనెల 2న రాత్రి 9గంటలకు రాజుకు అదే ప్రాంతంలో నివసించే అహ్మద్‌తో స్వల్ప విషయమై గొడవ జరిగింది. రాజు అక్కడి నుంచి వెళ్లిన తరువాత అహ్మద్ తన కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి రాజు ఇంటికి వెళ్లారు. రాజు ఎక్కడున్నాడని అడుగుతూ వారితో వచ్చిన మహిళలు రాజు వదిన గర్భవతి అయిన సలోమిని చితకబాదారు. విషయం తెలుసుకున్న రాజు చంపాపేటలో స్నేహితుడి ఇంటి వద్ద తలదాచుకున్నాడు. మరుసటి రోజు రాజును చంపాపేటలో కలుసుకున్న అహ్మద్ రాజీ చేసుకుందామని సింగరేణికాలనీకి తీసుకువచ్చారు. అక్కడ అతడిపై అహ్మద్ అతని కుటుంబసభ్యులు కర్రలతో చితకబాదారు. ఆ దృశ్యాలను అక్కడి యువకుడు సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ అయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితుడిని అతడి వదినను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. అనంతరం వారి ఫిర్యాదుతో నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: బారికేడ్లో ఇరుక్కున్న బాలుడు చత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్: ఎవరీ హిడ్మా -
‘మా కూతురి మెడపై ఉరివేసిన గుర్తులున్నాయి’
సాక్షి, సైదాబాద్: ‘మా బిడ్డది అనుమానస్పద మృతి కాదు.. కావాలనే ఎవరో చంపేశారు.. మాకు న్యాయం చేయండి’ అని బాలిక తల్లిదండ్రులు పోలీస్ ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. ఈనెల 23న సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖాజాబాగ్‌లో బాలిక అనుమానస్పదస్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం బాలిక తల్లిదండ్రులు జ్యోతి, సేవ్యానాయక్ మాట్లాడుతూ... గత మంగళవారం పనికి వెళ్లి వచ్చేసరికి తమ పదేళ్ల పెద్ద కూతురు పడిపోయి ఉందని పరిశీలించగా అప్పటికే మృతి చెందిందన్నారు. బాలిక ఒంటిపై దుస్తులు లేకుండా పలు గాయాలున్నాయని రోధిస్తూ తెలిపారు. తమ కూతురు మెడపై ఉరి వేసిన గుర్తులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆత్మహత్యపై కనీస అవగాహన లేని పిల్ల ఉరి వేసుకుంటుందా అని వారు ప్రశ్నించారు. ఇది కావాలనే ఎవరో చేసిన హత్య అని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు వాస్తవాలు వెలికి తీయాలని విన్నవించుకున్నారు. తమకు ఉన్నతాధికారులు న్యాయం చేయాలని కోరారు. దర్యాప్తు కొనసాగుతోంది.. సైదాబాద్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ... ఘటన జరిగిన రోజు తమ విచారణలో పాప ఉరి వేసుకోవటంతోనే మృతి చెందిందని తెలిపారు. ఆ రోజు తల్లిదండ్రులు కూడా ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదన్నారు. ఇప్పటికీ కేసు విచారణలోనే ఉందని పేర్కొన్నారు. పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చిన తరువాత దర్యాప్తు చేస్తామన్నారు. బాలిక మృతి ఘటనపై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు అవాస్తవం అన్నారు. చదవండి: సెల్‌ఫోన్ ద్వారా మెసేజ్.. ‘నేను చనిపోతున్నా’ -
తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్‌లో ఏసీబీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్‌లో బుధవారం ఏసీబీ సోదాలు నిర్వహించింది. రూ. 40వేలు లంచం తీసుకుంటూ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఏసీబీకి పట్టుబడ్డాడు. అసలు విషయంలోకి వెళితే ఫైల్ క్లియరెన్స్ కోసం శ్రీనివాస్ రూ. లక్ష డిమాండ్ చేశాడు. అయితే రూ. 40వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కడంతో శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా సైఫాబాద్ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. -
విద్యార్థి ఫిర్యాదు: హలో అటవీ అధికారులా..
హైదరాబాద్: ఇంటి నిర్మాణానికి అడ్డుగా ఉన్న చెట్టును కూల్చివేయడంపై ఓ 8వ తరగతి విద్యార్థి అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రాత్రికి రాత్రే అనుమతి లేకుండా చెట్టును తొలగించి నామరూపాల్లేకుండా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో విచారణ చేసిన అధికారులు సంబంధికులపై భారీగా జరిమానా విధించారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో జరిగింది. సైదాబాద్ ప్రాంతంలో ఇంటి నిర్మాణానికి అడ్డుగా ఉందని ఒకరు దాదాపు 40 ఏళ్లకు పైగా వయసు ఉన్న భారీ వేపచెట్టును కొట్టేశారు. చెట్టును రాత్రికి రాత్రి కొట్టేయడంతో సమీపంలో ఉండే ఓ 8వ తరగతి పిల్లోడు షాకయ్యాడు. తెల్లవారుజామున కలపను తరలించడం, చెట్టు ఆనవాళ్లు కనిపించకుండా తగులబెట్టడం వంటివి చేయడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో వెంటనే అటవీ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1800 425 5364కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. తాను పచ్చదన పరిరక్షకుడిగా చెప్పి తన ఇంటి సమీపంలో చెట్టును నరివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరాడు. దీంతో అటవీ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. అనుమతి లేకుండా చెట్టు కొట్టివేశారని నిర్ధారించుకుని బాధ్యులైన వారికి రూ.62,075 భారీ జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఫిర్యాదు చేసిన బాలుడిని అటవీ శాఖ ఉన్నతాధికారులు అభినందించారు. -
సహజీవనం చేస్తున్న ప్రియుడు మోసం చేశాడని..
సాక్షి, సైదాబాద్ : సహజీవనం చేస్తున్న ప్రియుడు పెళ్లికి అంగీకరించకపోవడంతో మనస్థాపానికి లోనైన మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సత్తయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఐఎస్‌సదన్ డివిజన్ బాలాజీనగర్‌కు చెందిన ఉమారాణికి 1997లో నర్సింగ్‌రావు అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె . మూడేళ్లకే భర్త చనిపోవడంతో కుమార్తెతో కలిసి కేశవనగర్ కాలనీలో ఉంటూ సిద్దేశ్వర ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తుంది. ఈ క్రమంలో కారు డ్రైవర్‌గా పని చేస్తున్న శ్రావణ్‌కుమార్‌తో పరిచయం ఏర్పడటంతో గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే పెళ్లి విషయమై గత కొద్ది రోజులుగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం కూడా ఆమె పెళ్లి ప్రస్తావన తేవడంతో తన చెల్లెళ్ల పెళ్లి అయిపోగానే చేసుకుదామని చెప్పి డ్యూటీకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆమె పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో మనస్థాపానికి గురైన ఉమారాణి ఇంట్లో ప్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన శ్రావణ్ తలుపుకొట్టినా స్పందన లేకపోవడంతో అనుమానంతో ఆమె సోదరుడికి ఫోన్ చేశారు. ఇద్దరూ గడియ విరగొట్టి లోపలికి వెళ్లగా ఉమారాణి ఫ్యాన్‌కు వేలాడుడూ కనిపిచింది. సంఘటనా స్థలానికి చేరుకుని శ్రావణ్ అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి సోదరుడు రాంచందర్ ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సైదాబాద్‌లో కార్డెన్ సర్చ్
-
కార్డన్ సెర్చ్.. అదుపులోకి 12 మంది
హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. స్థానిక సింగరేణి కాలనీలో ఉదయం 3 గంటల నుంచి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 12 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పాటు సరైన పత్రాలు లేని 37 ద్విచక్రవాహనాలు, 48 గ్యాస్ సిలిండర్లు, 150 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో 300 మంది పోలీసులు పాల్గొన్నారు. -
మద్యం మత్తులో కత్తితో దాడి
హైదరాబాద్: మద్యం మత్తులో స్నేహితుడిపై కత్తితో దాడి చేసిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని "డి"కాలనిలో సోమవారం అర్ద రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా ఉంటున్న ముగ్గురు వ్యక్తులు సోమవారం రాత్రి మద్యం సేవించారు. అనంతరం క్రికెట్ బెట్టింగ్ కాశారు. ఈ నేపధ్యంలో దేవేందర్(30) అనే వ్యక్తిపై యూసుఫ్ కత్తితో దాడి చేశాడు. దీంతో అతనికి ఛాతిపై గాయాలయ్యాయి. గాయపడిన దేవేందర్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు. నిందితుడు యూసుఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ దేవేందర్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
కోతి కోసం భారీ వేట..
హైదరాబాద్: కొద్ది రోజులుగా నగరంలోని సైదాబాద్ వాసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోన్న వానరాన్ని బంధించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) రంగంలోకి దిగింది. కమిషనర్ జనార్థన్ రెడ్డి ఆదేశాల మేరకు వెటర్నరీ, మున్సిపల్, జూపార్క్ సిబ్బంది.. భారీ సంరంజామాతో బుధవారం నుంచి కోతి ఆపరేషన్‌ను ప్రారంభించారు.. మతిస్థిమితం కోల్పోయిన ఓ కోతి.. సైదాబాద్ ప్రాంతంలోని ప్రజలపై తరచూ దాడులకు తెగబడుతోంది. ఇప్పటివరకు కనీసం 90 మందిని కరిచింది. దీంతో కొందరు కోతికి భయపడి ఇళ్లు వదిలి వెళ్ళిపోయారు. ఈ వ్యవహారంపై స్పందించాల్సిందిగా సైదాబాద్ కార్పొరేటర్ స్వర్ణలత జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. స్పందించిన కమిషనర్.. వెటర్నరి, జూ, మున్సిపల్ సిబ్బందిని తక్షణమే అక్కడికి పంపించి, కోతిని బంధించే ఏర్పాట్లు చేస్తామని హమీ ఇచ్చారు. (చదవండి.. కోతి భయంతో హైదరాబాద్ నుంచి చెన్నైకి..) -
గ్యాస్ అక్రమ రీఫిల్లింగ్ కేంద్రాలపై దాడులు
సైదాబాద్: అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నారన్న సమాచారంతో ఐఎస్‌సదన్ డివిజన్లోని సింగరేణి గుడిసెల్లో సోమవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రీఫిల్లింగ్ చేయడానికి సిద్ధంగా ఉంచిన 34 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. సైదాబాద్ ఇన్స్పెక్టర్ సత్తయ్య మాట్లాడుతూ గ్యాస్ రీఫిల్లింగ్ కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయన్నారు. స్థానికుల సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు తెలిపారు. గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్న గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులపైన కూడ కేసులు నమోదు చేస్తామని అన్నారు. గ్యాస్ సిలిండర్లను అక్రమంగా సరఫరా చేసినట్లు రుజువైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
కోతి భయంతో హైదరాబాద్ నుంచి చెన్నైకి..
హైదరాబాద్: సైదాబాద్ కల్యాణ్‌నగర్ కాలనీకి చెందిన సత్యవతి తన ఇంట్లో వంట చేస్తుండగా ప్రధాన ద్వారం గుండా ఓ కోతి ఇంట్లోకి ప్రవేశించింది. నిశ్శబ్దంగా వంటింట్లోకి చేరి పనుల్లో నిమగ్నమైన సత్యవతి చేతిని పట్టుకుని కొరికేసింది. ఊహించని ఘటనతో భయపడిన ఆమె బయటకు పరుగులు తీసింది. చుట్టుపక్కల వారి సాయంతో వెంటనే ఆస్పత్రి వెళ్లి వైద్యం చేయించుకుంది. కోతి కరిచిన విషయాన్ని చెన్నైలో ఉండే కుమారుడికి ఫోన్లో తెలిపింది. వెంటనే అతను హైదరాబాద్ నుంచి వచ్చేయమని సలహా ఇచ్చి, రైలు టికెట్ బుక్ చేశాడు. ఈ మేరకు సత్యవతి చెన్నై వెళ్లిపోయారు. ఇటీవల జరిగిన ఈ ఘటన వినేందుకు వింతగా ఉన్నా ఇది నిజం. సైదాబాద్ మండల ప్రజలను కోతుల గుంపొకటి కొద్దిరోజులుగా కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. ఆ సమూహంలో ఉన్న రెండు కోతులు మతిస్థిమితం కోల్పోయి కనిపించిన వారినల్లా కరిచేస్తున్నాయి. ఉదయాన్నే పాల ప్యాకెట్లు, పేపర్ల కోసం.. వాకింగ్‌కు వెళ్లే వారితో పాటు స్కూలుకు వెళ్లే పిల్లలు కూడా కోతుల బారిన పడి ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. పిచ్చెక్కిన కోతులు ఎవరిపై ఎప్పుడు దాడి చేస్తాయోనని భయం భయంగా గడుపుతున్నారు. సైదాబాద్ డివిజన్ వీకేదాగ్‌నగర్‌లో 20 మందిని, కల్యాణ్‌నగర్‌లో 30, ఎస్బీహెచ్ ఏ, బీ, సీ కాలనీలో 30 మంది కోతుల బారినపడ్డారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోతి కాటుకు వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవటంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి రూ. వేలు ఖర్చు చేసి వైద్యం చేయించుకుంటున్నారు. కోతులను పట్టుకోడానికి రంగంలోకి దిగిన జూ సిబ్బంది కల్యాణ్‌నగర్, వీకేదాగ్‌నగర్, సీ కాలనీలలో పార్కులు, ఇళ్లపైన జాలీలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు రెండు కోతులను పట్టుకున్నప్పటికీ మిగిలిన కోతుల జాడ మాత్రం తెలియలేదు. -
వ్యభిచార గృహంపై దాడి: 9మంది అరెస్ట్
సైదాబాద్: నగరంలోని ఓ వ్యభిచార గృహంపై సోమవారం పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు మహిళలు సహా తొమ్మిది మందిని అరెస్టు చేశారు. సైదాబాద్ ఇన్స్పెక్టర్ కె.సత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం టూఆర్టీ క్వార్టర్స్ లక్ష్మీనగర్ కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం అందిందన్నారు. ఈ మేరకు నిర్వహించిన దాడిలో ముగ్గురు మహిళలతో పాటు ఆరుగురు విటులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు చేసినట్లు ఇన్స్పెక్టర్ చెప్పారు. -
సైదాబాద్‌లో చోరీ
హైదరాబాద్ : సైదాబాద్ పరిధిలోని ఓ అపార్టుమెంటులో బుధవారం రాత్రి చోరీ జరిగింది. దుండగులు ఇంటి తలుపు గొళ్లెం తొలగించి లోపలికి ప్రవేశించారు. ఇంటిలో దాచిన 4 తులాల బంగారం, రూ.45 వేల నగదు, ఒక కెమెరా దొంగిలించారు. ఆ విషయాన్ని గురువారం ఉదయం కుటుంబ సభ్యులు గుర్తించి... పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా దొంగతనం జరిగిన తీరును పోలీసులు పరిశీలించారు. -
ప్రేమ పేరుతో న్యాయవాది మోసం
సైదాబాద్ : ప్రేమ పేరుతో న్యాయవాది నమ్మించి మోసం చేయడంతో యువతి సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కర్మన్‌ఘాట్‌కు చెందిన ఓ యువతి సైదాబాద్ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ లక్డీకాపూల్‌లోని యాడ్ ఏజెన్సీలో మెనేజర్‌గా పని చేస్తోంది. అదే ఇంట్లో తన పెదనాన్న అయిన హైకోర్టు న్యాయవాది రాజిరెడ్డి వద్ద రాజశేఖర్‌రెడ్డి అనే యువకుడు న్యాయవాదిగా శిక్షణ పొందుతున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. గత మూడేళ్లుగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మబలికాడు. తీరా పెళ్లి విషయం ఎత్తే సరికి ముఖం చాటేశాడు. గత పది రోజులుగా అతను అందుబాటులో లేకుండా వేరే యువతిని పెళ్లి చేసుకోడానికి సిద్దపడ్డాడు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న సదరు యువతి సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రాజశేఖర్‌రెడ్డి తనను ప్రేమ పేరుతో మోసం చేసి శారీరకంగా వాడుకున్నాడని, అతడిని తనకు అందుబాటులో లేకుండా వాళ్ల కుటుంబ సభ్యులు అడ్డుకుంటున్నారని ఆరోపించింది. తనను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించాలని పోలీసులను కోరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లీపిల్లలు అదృశ్యం
హైదరాబాద్ : తల్లీ పిల్లలు అదృశ్యమైన ఘటన సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా చౌదరపల్లికి చెందిన జంగయ్య, లక్ష్మి(23) దంపతులు పని రీత్యా సైదాబాద్‌లో నివాసముంటున్నారు. వీరికి లోకేశ్(4), చరణ్(1) అనే ఇద్దరు పిల్లలున్నారు. భార్యాభర్తల మధ్య ఈ నడుమ గొడవలు మొదలయ్యాయి. దీంతో గత నెల 28 న లక్ష్మి తన ఇద్దరు పిల్లలతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె జాడ లేదు. దీంతో ఆందోళన చెందిన బంధువులు శుక్రవారం సైదాబాద్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
జనపథం - సాయిరాంబస్తీ
-
జువైనల్ హోం నుంచి బాలుడు పరారీ
సైదాబాద్ (హైదరాబాద్) : సైదాబాద్‌లోని జువైనల్ హోం నుంచి ఓ బాలుడు తప్పించుకున్నాడు. ఈ ఘటన ఆదివారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం బూర్లపాడుకు చెందిన ఓ బాలుడి(16)ని స్థానిక పోలీసులు ఓ కేసు విషయంలో అదుపులోకి తీసుకుని సైదాబాద్ జువైనల్ హోంకు అప్పగించారు. కాగా గత నెల 30న పరిశీలన గృహంలో భోజనం చేయడానికి బాలలు ఆవరణలోకి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన ఆ బాలుడు గోడ దూకి పరారయ్యాడు. దీనిపై పరిశీలన గృహం సూపరింటెండెంట్ రామచంద్రమూర్తి సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై రాష్ట్ర బాలుర సంస్కరణల, సంక్షేమశాఖ విచారణ చేపట్టింది. -
సైదాబాద్, కార్మికనగర్‌లో కార్డన్ సెర్చ్