సాక్షి, సిటీబ్యూరో: సైదాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలోని సింగరేణికాలనీలో గత గురువారం రాత్రి ఆరేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడి, హత్య చేసి... గురువారం ఉదయం స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలోని నష్కల్ వద్ద ఆత్మహత్య చేసుకున్న కామాంధుడు పి.రాజుకు నేరచరిత్ర ఉంది. చైతన్యపురి పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఆటో ట్రాలీ చోరీ కేసులో అరెస్టు అయ్యాడు. తాజాగా గత శుక్రవారం పారిపోయే ప్రయత్నంలో ఉండి ఎల్బీనగర్ పరిధిలో మరో ఆటో చోరీకి యతి్నంచాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.
జనవరి 22న..
ఎన్టీఆర్ నగర్‌కు చెందిన మహ్మద్ సాజిద్ ఈ ఏడాది జనవరి 22 మధ్యాహ్నం తన ఆటో ట్రాలీ డ్రైవర్‌తో కొత్తపేట పండ్ల మార్కెట్ వద్దకు వచ్చాడు. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఫ్రూట్ మార్కెట్ ఫ్లాట్‌ఫామ్‌పై పార్క్ చేసి ప్రార్థనల నిమిత్తం వెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి ఆటో ట్రాలీ కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న చైతన్యపురి పోలీసులు రాజును అరెస్టు చేశారు.
(చదవండి: రంగారెడ్డి: మహిళ గొంతు కోసి.. కాలు నరికి..)
పారిపోయేందుకు ఆటో చోరీకి యత్నం
గత గురువారం రాత్రి నుంచి పరారీలో ఉన్న రాజు ఆ మరుసటి రోజు యాకత్‌పురా రైల్వేస్టేషన్ సమీపంలో ఓ కూలి్చవేత పనికి వెళ్లాడు. అది పూర్తయిన తర్వాత అక్కడ నుంచి తన సహ కూలీతో కలిసి ఎల్బీనగర్ వరకు చేరుకున్నాడు. ఆ చౌరస్తాలోని బ్రాండ్‌ల్యాండ్ హోటల్ సమీపంలో ఉన్న ఆటో స్టాండ్‌లో కొద్దిసేపు తచ్చాడాడు. అక్కడ పార్క్ చేసి ఉన్న ఓ ఆటోను తస్కరించి, అందులో పారిపోవాలని ప్రయత్నం చేశాడు.
(చదవండి: సైదాబాద్ నిందితుడి మృతిపై చిరు ఏమన్నారంటే..)
రాజు దాన్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తుండగా అసలు డ్రైవర్ అక్కడకు చేరుకున్నాడు. అతడు రాజును అడ్డుకోవడంతో పాటు కొద్దిసేపు వాగ్వాదానికీ దిగాడు. ఆపై అక్కడ నుంచి జారుకున్న రాజు ఉప్పల్‌కు చేరుకున్నాడు. అనేక సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌ను పరిశీలించిన పోలీసులు ఈ విషయాలు గుర్తించారు. నగర పోలీసులు శుక్రవారం నుంచే రాజు ఫొటోను వైరల్ చేసి ఉంటే... ఎల్బీనగర్‌లోనే ఆటోడ్రైవర్ గుర్తించి పట్టుకునే అవకాశం ఉండేది.
చదవండి: నిందితుడు రాజు ఆత్మహత్య: దేవుడు ఉన్నాడంటూ మంచు మనోజ్ ట్వీట్
Comments
Please login to add a commentAdd a comment