తల్లీపిల్లలు అదృశ్యం | Mother and two children missing | Sakshi
Sakshi News home page

తల్లీపిల్లలు అదృశ్యం

Published Fri, Mar 4 2016 5:19 PM | Last Updated on Thu, Apr 4 2019 4:44 PM

తల్లీ పిల్లలు అదృశ్యమైన ఘటన సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా చౌదరపల్లికి చెందిన జంగయ్య, లక్ష్మి(23) దంపతులు పని రీత్యా సైదాబాద్‌లో నివాసముంటున్నారు.

హైదరాబాద్ : తల్లీ పిల్లలు అదృశ్యమైన ఘటన సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా చౌదరపల్లికి చెందిన జంగయ్య, లక్ష్మి(23) దంపతులు పని రీత్యా సైదాబాద్‌లో నివాసముంటున్నారు. వీరికి లోకేశ్(4), చరణ్(1) అనే ఇద్దరు పిల్లలున్నారు. భార్యాభర్తల మధ్య ఈ నడుమ గొడవలు మొదలయ్యాయి. దీంతో గత నెల 28 న లక్ష్మి తన ఇద్దరు పిల్లలతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె జాడ లేదు. దీంతో ఆందోళన చెందిన బంధువులు శుక్రవారం సైదాబాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement