హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. స్థానిక సింగరేణి కాలనీలో ఉదయం 3 గంటల నుంచి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 12 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పాటు సరైన పత్రాలు లేని 37 ద్విచక్రవాహనాలు, 48 గ్యాస్ సిలిండర్లు, 150 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో 300 మంది పోలీసులు పాల్గొన్నారు.