cordon search
-
502 ప్రాంతాల్లో ఏపీ పోలీసుల కార్డెన్ సెర్చ్
-
కరోనా ఎఫెక్ట్; అక్కడ పోలీసుల తనిఖీలు
సాక్షి, ఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశ రాజధానిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో పోలీసుల విస్తృత తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ వైద్య శాఖ అధికారుల సహాయంతో దాదాపు 200 మందిని కోవిడ్ నిర్ధారణ పరీక్షల కోసం ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రాంతంలో ఏడుగురికి కరోనా పాజిటివ్ రావడం, మరికొందరిలో కోవిడ్ లక్షణాలు కనబడటంతో ‘నిజాముద్దీన్’పై పోలీసులు దృష్టి సారించారు. ఈ ప్రాంతంలో కార్డన్ సర్చ్ చేపట్టి విస్తృత తనిఖీలు చేపట్టారు. నిజాముద్దీన్ ప్రాంతాన్ని డ్రోన్ కెమెరాలతో పోలీసుల జల్లెడ పడుతున్నారు. ప్రార్ధనలకు హాజరైన వారిని వివరాలపై ఆరా తీస్తున్నారు. మార్చి 10న స్థానిక నిజాముద్దీన్ మార్కజ్ మసీదులో జరిగిన మత కార్యక్రమానికి మలేసియా, ఇండోనేసియా, సౌదీ అరేబియా, కిర్గిజిస్తాన్ దేశాలకు చెందిన యాత్రికులు హాజరయ్యారు. వీరి ద్వారా కరోనా వైరస్ స్థానికులకు వ్యాపించినట్టు అనుమానిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక్కడికి వచ్చివెళ్లిన మతగరువు గతవారం శ్రీనగర్‌లో మృతి చెందారు. నిజాముద్దీన్‌కు రావడానికి ముందు ఉత్తరప్రదేశ్‌లోని దియోబండ్ ప్రాంతంలో ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ‘రెండు రోజుల క్రితం 30 మందిని కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ఢిల్లీ ప్రభుత్వాసుపత్రికి తరలించాం. వీరిలో ఏడుగురికి కరోనా సోకినట్టు నిర్ధారణయింది. నిజాముద్దీన్ ప్రాంతం నిత్యం జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో జనాన్ని బృందాల వారీగా కరోనా నిర్ధారణ పరీక్షలకు తరలించాలని నిర్ణయించామ’ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ఎంతమందిని తరలించారనేది కచ్చితంగా వెల్లడించలేదు. (కోవిడ్-19: ఖైదీలకు శుభవార్త) కాగా, ఇప్పటివరకు ఒక్క కోవిడ్-19 కేసు నమోదు కాలేదని నిజాముద్దీన్ మార్కజ్ మసీదు అధికార ప్రతినిధి డాక్టర్ మహ్మద్ షోయబ్ తెలిపారు. జలుబు, దగ్గుతో సహా ఎటువంటి అనారోగ్య లక్షణాలున్నా అటువంటి వివరాలు ప్రభుత్వాధికారులకు అందజేశామని చెప్పారు. వయసు, ప్రయాణ చరిత్ర(ట్రావెల్ హిస్టరీ) ఆధారంగా కొంత మంది ఆస్పత్రుల్లో చేరారని తెలిపారు. (కేజ్రివాల్ ప్రభుత్వం కీలక చర్యలు) -
విజయవాడ: నేరాల అదుపునకు స్పెషల్ డ్రైవ్
సాక్షి, విజయవాడ: బెజవాడ శివారు ప్రాంతాల్లో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. డోర్ టు డోర్ సెర్చ్ చేశారు.అనుమానితులని, నేరప్రవృత్తి ఉన్నవారిని అదుపులోకి తీసుకొన్నారు. పత్రాలు లేని వాహనాలు స్వాధీనం చేసుకొన్నారు. మాచవరం ,గుణదల,పడమటలలో పోలీసులు ఆదివారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. విజయవాడలో నేరాల అదుపుకు పోలీసులు స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నారు. గంజాయి అమ్మకాలు, బ్లేడ్ బ్యాచ్ బాబులు, వ్యభిచార గృహాలు, రౌడీషీటర్ల ఆట కట్టించేందుకు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. బృందాలుగా విడిపోయిన పోలీసులు మాచవరం, గుణదల ఏరియాల్లో తెల్లవారుజామున మెరుపుదాడులు చేసారు. అనుమానిత ప్రదేశాల్లో నిర్బంధ తనిఖీలు నిర్వహించి.. డోర్ టు డోర్ సోదా చేశారు. వాహన తనిఖీలు చేపట్టారు. కొత్త వ్యక్తులు ఎవరైనా ఇటీవలి కాలంలో ఎంటరయ్యారా అన్న విషయంపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరి డేటాను సేకరించారు. నేరగాళ్ల గుండెల్లో దడపుట్టించారు. తప్పు చేస్తే తాట తీస్తామనే సంకేతాలు పంపిస్తున్నారు. డీసీపీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సోదాల్లో 200 మంది పోలీసులు పాల్గొన్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారంతో తనిఖీలు చేసామని డీసీపీ చెప్పారు. సోదాల్లో సరైన పత్రాలు లేని 21 వాహనాలు స్వాధీనం చేసుకొని, ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇక్కడ 12 మంది రౌడీ షీటర్స్ ఉన్నారని, వారిని కూడా విచారించి నేరప్రవృత్తిని వదిలిపెట్టాలని హెచ్చరించామన్నారు.ఇక్కడి నుంచి జరిగే గంజాయి సరఫరాని అరికట్టేందుకు ప్రత్యేక నిఘా పెడతామంటున్నారు. -
కలప స్మగ్లింగ్ అడ్డుకట్టకు అటవీ, పోలీస్ శాఖల చర్యలు
సాక్షి.హైదరాబాద్: కలప స్మగ్లింగ్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు అటవీ, పోలీస్ శాఖలు సంయుక్తంగా తీసుకుంటున్న చర్యలను ముమ్మరం చేశాయి. అడవుల్లోపల అక్రమంగా చెట్లు కొట్టడం, ఆ దుంగలను అక్రమ రవాణా కోసం ఇళ్లు, ఇతర పరిసరాల్లో దాచిపెడుతున్న ఘటనలు ఎక్కువ కావడంతో తనిఖీలు, రక్షణచర్యలు మరింత పెంచారు. దీనిలో భాగంగా మంగళవారం ఉదయం కొమరంభీమ్ జిల్లా చింతల మానేపల్లి మండలం లంబాడీ హట్టిలో పోలీస్, అటవీశాఖ, ఎక్సైజ్ అధికారులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌ను నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా కలప దుంగలతో పాటు పెద్దమొత్తంలో గుడుంబా నిల్వలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెట్లు కొట్టడం, కలప అక్రమ రవాణా, వంటి అక్రమాలకు, నేరాలకు పాల్పడితే కఠిన చట్టాల ప్రయోగంతో పాటు పీడీయాక్ట్ కింద బెయిల్ దొరకని విధంగా కేసులు పెట్టే అవకాశం ఉందని గ్రామస్థులకు అధికారులు తెలియజేశారు. దీనికి సంబంధించి శాఖల అధికారులు ఆ గ్రామ ప్రజలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అడవుల పరిరక్షణకు, పచ్చదనాన్ని కాపాడేందుకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని, దానికి అందరూ సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ ప్రభుత్వ పథకాలను వినియోగించుకొని ఉపాధి పొందాలని సూచించారు. ఇకపై అడవుల్లో చెట్లు నరకడం, గుడుంబా కాయడం వంటి నేరాలకు పాల్పడబోమంటూ గ్రామస్థులతో అధికారులు ప్రమాణం చేయించారు. -
ఎయిర్‌పోర్టులో కార్డన్ సెర్చ్
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం రాత్రి డీసీపీ ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనుమతి లేకుండా ప్రయాణికులను బలవంతంగా కార్లలో ఎక్కించుకుంటున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు బుకింగ్ లేకుండా ప్రయాణికులను కార్లలో ఎక్కించుకోవడం ఎయిర్‌పోర్టులో నిషేధం ఉంది. అయితే, కొంత కాలంగా విమానాశ్రయంలో కొందరు డ్రైవర్లు ఈవిధంగా నిబంధనలను అతిక్రమిస్తున్నారు. గతంలో కార్డన్‌సెర్చ్ నిర్వహించగా కొందరు వ్యక్తులు పట్టుబడ్డారు. తాజాగా నిర్వహించిన తనిఖీల్లో కూడా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికులు కూడా ముందస్తు బుకింగ్ ఉన్న కార్లలోనే ప్రయాణించడం క్షేమమని డీసీపీ ప్రకాశ్‌రెడ్డి సూచించారు. కార్యక్రమంలో ఏసీపీ అశోక్‌కుమార్, ఆర్జీఐఏ సీఐ గంగాధర్, సుమారు వంద మంది పోలీసులు పాల్గొన్నారు. -
జక్కంపూడి కాలనీ ‘స్కాన్’!
విజయవాడ పశ్చిమ: కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో బుధవారం తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు చేపట్టారు. త్వరలో జరగనున్న ఎన్నికలు, శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. కాలనీలోని 1వ బ్లాక్ నుంచి 56వ బ్లాక్‌లోని 1792 ప్లాట్ల తనిఖీలను పోలీసులు చేపట్టారు. తెల్లవారుజామున 3 గంటలకు కాలనీకి చేరుకున్న పోలీసులు 4 గంటల నుంచి తనిఖీలు ప్రారంభించారు. ఉదయం 8 గంటల వరకు తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతి ఇంటికి వెళ్లి ఫ్లాట్‌లో నివాసం ఉంటున్న వారి వివరాలను ఆరా తీయడంతో పాటు ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు కార్డులను పరిశీలించారు. డీసీపీ వెంకట అప్పలనాయుడు నేతృత్వంలో 12 మంది ఎస్ఐలు, వెస్ట్ జోన్ పరిధిలోని 35 మంది ఎస్ఐలు, 56 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, 180 మంది కానిస్టేబుల్స్, మరో 50 మంది ఉమెన్ కానిస్టేబుల్స్ ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఏడీసీపీ నవాబ్‌జాన్, ఏసీపీలు సత్యనారాయణ, సుధాకర్ తనిఖీలను పర్యవేక్షించారు. కొత్తపేట సీఐ ఎండీ. ఉమర్, కొత్తపేట ఎస్ఐలు కాలనీలో పలు చోట్ల అనుమానాస్పదంగా కనిపించిన వాహనాల గురించి ఆరా తీశారు. తొలుత కాలనీలోని ప్రధాన రహదారిపై సిబ్బందికి అధికారులు పలు సూచనలు చేశారు. ప్రతి ఇంటిని తనిఖీ చేయడంతో పాటు వారి వివరాలను నమోదు చేసుకోవడంతో పాటు చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారి వివరాలను, వారు ఎంత కాలం నుంచి నివాసం ఉంటున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో అనుమానాస్పదంగా ఉన్న వారికి ఐరిష్ తీయడంతో పాటు ఇతర వివరాలను నమోదు చేసుకున్నారు. తనిఖీలలో పాత కేసులలో ముద్దాయిలుగా ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. -
శాంతిభద్రతల కోసమే కార్డెన్‌సెర్చ్
జడ్చర్ల టౌన్: బాదేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మబావిగడ్డ, ఫజల్‌బండ, నిమ్మబావిగడ్డతండాలో గురువారం తెల్లవారుజామున మహబూబ్‌నగర్ డీఎస్పీ భాస్కర్‌గౌడ్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారుజామున ఉన్నట్టుండి పోలీసులు తలుపుతట్టి పోలీస్.. అనడంతో ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తర్వాత కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారని తెలుసుకుని కుదుటపడ్డారు. ఉదయం 5గంటల నుంచి పోలీసులు ఇంటింటిని సోదాచేశారు. సెర్చ్‌లో డీఎస్పీతోపాటు నలుగురు సీఐలు, 10మంది ఎస్ఐలు, స్పెషల్‌పార్టీకి చెందిన 100మంది పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి ఇంటింటిని తనిఖీ చేశారు. సోదాల్లో సరైన పత్రాలు లేని 39 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 9ఆటోలు, 5 కార్లు, 3ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటి పత్రాలను చూసి కొన్నింటిని వదిలిపెట్టారు. ఇదిలాఉండగా అదే ప్రాంతంలో ఉన్న ఇద్దరు పాత నేరస్తులైన లక్ష్మయ్య, మహమూద్‌లను విచారించారు. తనిఖీల్లో భాగంగా ఓ ఇంట్లో గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయి. ప్రజల రక్షణకే.. ప్రజల రక్షణ కోసమే ఎస్పీ ఆదేశాల మేరకు కార్డెన్‌సెర్చ్ నిర్వహించామని డీఎస్పీ భాస్కర్‌గౌడ్ తెలిపారు. భద్రత విషయంలో పూర్తిహామీ ఇచ్చేందుకు ఇలాంటి కార్డెన్ సెర్చ్‌లు ఉపయోగపడతాయని, ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకే సోదాలు నిర్వహించామని చెప్పారు. సోదాల్లో సరైన పత్రాలు లేని 39 ద్విచక్రవాహనాలు, 9 ఆటోలు, 5కార్లు, 3ట్రాక్టర్లను స్వాధీనపర్చుకున్నామన్నారు. కార్డెన్‌సెర్చ్‌లో సీఐలు బాల్‌రాజ్‌యాదవ్, రవీందర్‌రెడ్డి, పాండురంగారెడ్డి, ఎస్ఐలు కృష్ణయ్య, మధుసూదన్‌గౌడ్, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు. జమ్మిచేడులో గద్వాల రూరల్: మండలంలోని జమ్మిచేడులో గు రువారం ఉదయం ఏఎస్పీ కృష్ణ ఆధ్వర్యంలో పో లీసులు కార్డెన్‌సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భం గా పలు వార్డుల్లో పొద్దున్నే పోలీసులు సంచరిస్తూ అనుమానితుల కోసం నిఘా పెట్టారు. అనుమ తులు లేని 36 బైకులు, ఒక ఆటోను స్వాధీనం చే సుకున్నారు. అనంతరం కాలనీవాసులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో జీవించాలనే ఉద్దేశంతో ఈ తనిఖీలు చేపట్టామని ఏఎస్పీ తెలిపారు. ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో ఎలాంటి గొడవలు జరిగినా ప్రజలు నిర్భయంగా పోలీసులకు సమాచారం చేరవేయాలని కోరారు. కార్డెన్‌సెర్చ్‌లో ఒక సీఐ, ముగ్గురు ఎస్సైలు, 60 మంది పోలీసులు పాల్గొన్నారు. -
కశ్మీర్లో హిజ్బుల్ ఉగ్రవాది ఎన్కౌంటర్
శ్రీనగర్: కశ్మీర్లో ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పుల్వామా జిల్లాలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో భద్రతాబలగాలు ఓ ఉగ్రవాదిని హతమార్చాయి. పుల్వామాలోని బబ్‌గుంద్‌లో ఉగ్రవాదులు నక్కిఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు శుక్రవారం రాత్రి కార్డన్ సెర్చ్ చేపట్టాయి. బలగాల కదలికల్ని పసిగట్టిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకూ సాగిన ఈ ఎన్కౌంటర్లో ఉగ్రసంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ సభ్యుడు సబీర్ అహ్మద్ దార్ హతం కాగా, మరో ఉగ్రవాదిని భద్రతా బలగాలు సజీవంగా పట్టుకున్నాయి. -
హైదరాబాద్ మధురానగర్‌లో కార్డన్ సర్చ్
-
పౌష్టికాహారం పక్కదారి!
కల్వకుర్తి టౌన్ : భావిభారతమైన చిన్నారుల ఆరోగ్యం, ఎదుగుదల కోసం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న పౌష్టికాహారం పక్కదారి పడుతోంది. రూ.లక్షలు వెచ్చించి సమకూరుస్తున్న ఎంతో విలువైన ’బాలామృతం’ పశువుల పాలు అవుతోంది. చిన్నారుల పోష్టికాహార లోపాన్ని తొలగించడానికి ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు 12రకాల పోషక పదార్థాలతో కూడిన బాలామృతంను పంపిణీ చేస్తోంది. అయితే దీన్ని ఎక్కువగా పాడిపశువులకు దాణాగా వాడుతున్నారు. అన్ని అంగన్వాడీ కేంద్రాలలో ఈ బాలామృతాన్ని ప్రతి చిన్నారికి పుట్టిన ఏడవ నెల నుంచి మూడేళ్ల వరకు అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కువగా వలసలు వెళుతూ వారి పిల్లలను ముసలోళ్ల వద్ద ఇంటి వద్దే ఉంచుతున్నారు. ఆ చిన్నారులకు అత్యధిక పోషక విలువలు కలిగిన తల్లి పాలు లేకపోవడంతో వారికోసం పంపిణీ చేరాల్సిన బాలామృతం పాకెట్లు పక్కదారి పడుతున్న విషయం బయటపడింది. కార్డెన్‌సెర్చ్‌లో భాగంగా శనివారం రాత్రి కల్వకుర్తి పట్టణంలోని బలరాంనగర్ కాలనీలో పోలీసులు ఇంటింటి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కాలనీలోని యాదగిరి అనే వ్యక్తి ఇంట్లో భారీగా 46పాకెట్ల అంగన్వాడీ కేంద్రంలో పంపిణీ చేసే బాలామృతం పాకెట్లు దొరికాయి. అది చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని, ఈ పాకెట్లు ఎక్కడవనే విషయంపై ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో నిర్వహించిన తనిఖీల్లో గతంలో చార్మినార్ ప్రాంతంలో, తర్వాత కల్వకుర్తి పట్టణంలో బాలామృతం దొరికిందని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే యాదగిరిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అంగన్వాడీ టీచర్ల నుంచే ఈ పాకెట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పాకెట్లను యాదగిరి తన పొలంలోని షెడ్డులో ఉన్న పశువులకు దాణాగా వేస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో చాలా ప్రాంతాల్లో బాలామృతంపాకెట్లను పాడిపశువులకు దాణాగా వేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో ఇలా.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 18 ప్రాజెక్టులు ఉండగా అందులో 4,322అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 7 ప్రాజెక్టులు ఉండగా అందులో 1,889 అంగన్వాడీ కేంద్రాల్లో 73,368మంది చిన్నారులు ఉన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 5 ప్రాజెక్టులు ఉండగా అందులో 1,131 అంగన్వాడీ కేంద్రాల్లో 10,275 మంది చిన్నారులు ఉన్నారు. అలాగే వనపర్తి జిల్లాలో 3 ప్రాజెక్టులకు గాను 589 అంగన్వాడీ కేంద్రాల్లో 25,523 మంది చిన్నారులు ఉన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 3 ప్రాజెక్టుల పరిధిలో 713 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా అందులో 24,900 మంది చిన్నారులు ఉన్నారు. ఇలా ఉమ్మడి జిల్లాతో కలుపుకొని 1,64,911మంది చిన్నారులు ఉన్నారు. వీరందరికీ కలిపి ప్రతినెలా ఒక్కో చిన్నారికి 2.5 కిలోల బాలామృతాన్ని ఇస్తారు. ఇంటింటి విచారణ.. కార్డెన్ సెర్చ్‌లో దొరికిన బాలామృతం ఎక్కడ నుంచి వచ్చిందన్న విషయమై ఐసీడీఎస్ అధికా రులు ఇంటింటి విచారణ చేపట్టారు. రాష్ట్ర పౌష్టికాహార సంస్థ ప్రతినిధి ఎలక్షన్ రెడ్డి కూడా ఈ విషయమై కల్వకుర్తి పోలీసుల నుంచి సమాచారం తీసుకున్నారు. దీనిపై లోతుగా విచారణ చేపట్టాలని ఐసీడీఎస్ అధికారులకు ఆదేశించారు. బలరాంనగర్ కాలనీలో మొత్తం ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, అందులో ఎంతమంది బాలామృతం తీసుకున్నారు, ఎవరెవరికి అందలేదో.. ఇంటింటికి వెళ్లి విచారణ చేపట్టారు. అయితే విచారణ చేస్తున్న అధికారులు అక్కడి లబ్ధిదారులు చెప్పే విషయాలు విని నివ్వెరపోతున్నారు. స్థానిక అంగన్వాడి కేంద్రానికి వెళ్లి బాలామృతం అడిగితే అసలు మీ బిడ్డపేరు రిజిస్టర్లో లేదని అంగన్వాడీ టీచర్ చెప్పినట్లు ఓ మహిళ తెలిపింది. ఐసీడీఎస్ అధికారులు రికార్డులు పరిశీలించగా.. సదరు మహిళ పేరు రిజిస్టర్లో ఉందని, బాలామృతం క్రమం తప్పకుండా తీసుకుంటున్నట్లు సంతకాలు చేసినట్లు గుర్తించారు. అలాగే కాలనీలో చాలామంది మహిళలు సంతకాలు చేసి, ప్రతినెలా బాలామృతం తీసుకున్నట్లు రికార్డుల్లో ఉన్నట్లు అధికారులు తేల్చారు. దీంతో దొంగ సంతకాలతో బాలమృతం పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని అధికారులు తెలిపారు. రిజిస్టర్లో పేరులేదని చెప్పి.. ఈమె బలరాంనగర్‌కు చెందిన అనిత. ఆమెకు 2016లో బిడ్డ పుట్టింది. అప్పుడు అంగన్వాడీ కేంద్రంలో పేరు నమోదు చేయించుకుంది. బిడ్డ పుట్టిన ఆరు నెలల తర్వాత బాలామృతం ఇస్తారని తెలిసి.. నా బిడ్డకు ఎందుకు ఇవ్వడం లేదని అంగన్వాడీ టీచర్‌ను అడిగింది. నీ పేరు రికార్డుల నుంచి తొలగించాం అని చెబితే.. ఆమె మళ్లీ అడగలేదు. అయితే ఏడాదిగా అనిత ప్రతి నెలా సంతకం చేసి బాలామృతం తీసుకున్నట్లుగా రికార్డుల్లో నమోదు చేశారని ఐసీడీఎస్ అధికారులు వచ్చి చెబితే గానీ విషయం బయటపడలేదు. తాను ఏరోజు రికార్డుల్లో సంతకం పెట్టలేదని, బాలామృతం తీసుకోలేదని అనిత చెబుతోంది. చర్యలు తీసుకుంటాం బలరాంనగర్ కాలనీలో దొరికిన బాలామృతం పాకెట్లపై విచారణ ప్రారంభించాం. అసలు అతని దగ్గరికి అవి ఎలా చేరాయి, అంగన్వాడీ కేంద్రాల నుంచి ఎలా బయటకు వెళ్లిందనే విషయాన్ని లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి విచారణ చేస్తున్నాం. ఈ విషయాలన్ని ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయి. – చందనేశ్వరీ, కల్వకుర్తి ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి -
నేరాల నియంత్రణకే కార్డన్ సెర్చ్
నిజామాబాద్ క్రైం (నిజామాబాద్ అర్బన్): జిల్లాలో శాంతిభద్రతల కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని, తద్వారా అనుమానితులు, చోరీలకు గురైన వాహనాలు బయటపడే అవకాశాలు ఉన్నందున దీనికి అందరూ సహకరించాలని సీపీ కార్తికేయ ప్రజలను కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని రెండో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి బురుడుగల్లి ప్రాంతంలో ఉదయం 4 నుంచి 6 గంటల వరకు సీపీ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజల తలుపులు తడుతుంటే ఏమైందోనంటూ కొంతమంది భయపడ్డారు. వీరు తలుపులు తీసేందుకు సందేహం వ్యక్తం చేయగా, ఈ ప్రాంతాలకు చెందిన వారితోనే పోలీసులు తలుపులు తెరిపించి వారిని భయటకు రప్పించారు. అనంతరం పోలీసులు వారికి అసలు విషయాలు తెలుపుతూ వారి వివరాలు, వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 66 బైకులు, నాలుగు ఆటోలు, కారును స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఎనిమిది ప్రాంతాల్లో.. అనంతరం సీపీ కార్తికేయ మాట్లాడారు. ఇప్పటి వరకు జిల్లాలో 8 ప్రాంతాలలో కార్డెన్ సెర్చ్ నిర్వహించామన్నారు. గురువారం దాదాపు 300 మంది పోలీసు బలగాలతో తనిఖీలు చేశామన్నారు. నేరాల నియంత్రణ కోసం కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామన్నారు. దీని ద్వారా కొద్దిగనైనా నేరాలు అదుపులో ఉంటాయన్నారు. ఎవరూ ఎలాంటి పరిచయం లేనివారికి తమ ఇండ్లు అద్దెకు ఇవ్వరాదన్నారు. కొత్త వ్యక్తులకు అద్దెకు ఇచ్చే ముందు వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు. అనుమానితులు కాలనీలో తిరుగుతుంటే వారి సమాచారం తెలుసుకుని దగ్గరలోని పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరు వాహనాల ప్రతాలు తమవద్ద ఉంచుకోవాలని, ఇతరులకు తమ వాహనాలను ఇవ్వద్దని, వారు మీ వాహనాలపై వెళ్లి నేరాలు చేస్తారని, ఆ నేరం వాహన యజమానిపై పడుతుందన్నారు. నేరాల నియంత్రణ కోసం ప్రతిఒక్కరు పోలీసులకు సహకరించాలన్నారు. ఆర్థిక స్థోమత గలవారు తమ ఇండ్ల ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వీటి ద్వారా ఎన్నో చోరీలకు పాల్పడిన వారిని పట్టుకున్నామన్నారు. కిడ్నాప్ కేసులో నిందితులను సులువుగా పట్టుకున్నామని గుర్తు చేశారు. ద్విచక్రవాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మరాదన్నారు. ప్రజల సమస్యలపై డయల్ 100ను సద్వినియోగం చేసుకోవాలని సీపీ కోరారు. చిన్నచిన్న విషయాలకు గొడవలకు పోకుండా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, అందుకు స్థానిక పోలీసుల సహకారాన్ని పొందాలన్నారు. పోలీస్‌స్టేషన్‌లో అన్ని పనులకు టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగిస్తున్నామని, గల్ఫ్ మోసాల నియంత్రణలో భాగంగా పోలీస్ కళాబృందం ద్వారా ప్రచారం చేస్తున్నామన్నారు. తనిఖీలలో అదనపు డీసీపీ ఆకుల రాంరెడ్డి, నిజామాబాద్, బోధన్, ఎన్ఐబీ, ఏఆర్ ఏసీపీలు సుదర్శన్, రఘు, సీహెచ్ మల్లిఖార్జున్, జి. రవీందర్, ఎస్బీ సీఐ రాజశేఖర్, సోమేశ్వర్‌గౌడ్, 12 మంది సీఐలు, ఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ 215 మంది, మహిళా పోలీసులు 28 మంది, డిప్యూటీ మేయర్ ఫయీమ్, 25వ డివిజన్ కార్పొరేటర్ ఫాతీమా జెహార్(ఎజాస్ సాగర్) పాల్గొన్నారు. -
ప్రజల రక్షణకే కార్డెన్ సెర్చ్
దేవరకద్ర: ప్రజల రక్షణ కోసమే కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని ఎస్పీ బి.అనురాధ తెలిపారు. శుక్రవారం రాత్రి దేవరకద్రలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన అనంతరం దళితవాడలో ఆమె విలేకరులతో మాట్లాడారు. శాంతిభద్రతలను కాపాడేందుకు నేరాలను అరికట్టడానికి కార్డెన్ సెర్చ్ ఉపయోగపడుతుందన్నారు. అనుమానితులు, దొంగలు, పాతనేరస్థులను గుర్తించే అవకాశం ఉంటుందని.. ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరుగుతుందన్నారు. అనుమానితులు సంచరిస్తే పోలీసులకు సమాచాం ఇవ్వాలని.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. సోషల్ మీడియాలో వచ్చే కథనాలను నమ్మొద్దని కోరారు. ఎలాంటి సమస్య వచ్చిన 100కు డయల్ చేస్తే పోలీసులు రక్షణ కల్పిస్తారని తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి కాలనీలో కొంత ఆర్థికస్థోమత ఉన్నావారు సీసీ కెమెరాలు పెట్టుకోవాలని ఎస్పీ కోరారు. దళితవాడ ప్రజలతో ఎస్పీ ముఖాముఖి చర్చించారు. ఎంతో ఖర్చు చేసి గృహాలను నిర్మించుకుంటారు.. కొంత ఖర్చుతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే, దొంగలు, నేరస్థుల ఆట కట్టించవచ్చని తెలిపారు. ప్రతికాలనీలో కనీసం అయిదు నుంచి ఆరు కెమెరాలను పెట్టుకోవాలని సూచించారు. పోలీసులు రాత్రివేళ పెట్రోలింగ్ చేస్తున్నారా? అని ప్రజలను అడిగారు. యువత సమయం వృథా చేయకుండా చదువులో శద్ధచూపాలని, లేదంటే స్వయం ఉపాధి చేసుకోవాలన్నారు. కొన్ని గృహాలను స్వయంగా తిరిగి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీతోపాటు ఏఎస్పీ వెంకటేశ్, డీఎస్పీ భాస్కర్, సీఐలు రవీందర్‌రెడ్డి, రామకృష్ణ, ఎస్ఐ అశోక్‌కుమార్‌తోపాటు మరో ఏడు మంది ఎస్ఐలు, వందమంది పోలీసులు పాల్గొన్నారు. ఆరు వాడల్లో తనిఖీలు దేవరకద్రలోని ఆరు వాడల్లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. దళితవాడ, తెలుగువాడ, బండగేరి, కురువవాడ, బీసీ కాలనీ, బోయగేరి ఇంకా పలు ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. మొత్తం 210 ఇళ్లల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 8 వాహనాలను సీజ్ చేశారు. కొందరు అనుమానితులను గుర్తించి వివరాలు తీసుకున్నారు. కార్డెన్ సెర్చ్ ఇక్కడ మొదటిసారి నిర్వహించడంతో ప్రజలు భయపడిపోయారు. ఏం జరిగిందని ఇంతమంది పోలీసులు వచ్చారని రోడ్లపైకి వచ్చి చూశారు. -
డోర్నకల్‌లో కార్డన్ సెర్చ్
డోర్నకల్ : డోర్నకల్ పట్టణంలోని పలు వీధుల్లో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మహబూబాబాద్, డోర్నకల్, బయ్యారం, గార్ల, కురవి, కేసముద్రం, నెక్కొండ తదితర పోలీస్స్టేషన్ల సీఐలు, ఎస్సైలు, సిబ్బంది, స్పెషల్‌పార్టీ పోలీసులు నాలుగు బందాలుగా తనిఖీలు చేశారు. మహబూబాబాద్ డీఎస్పీ నరేష్కుమార్ కార్డన్ సెర్చ్‌ను పర్యవేక్షించారు. ఎస్సీ, బీసీ కాలనీ, అంబేడ్కర్ నగర్, శాంతినగర్, యాదవనగర్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇళ్లలోకి వెళ్లి క్షుణ్ణంగా సోదాలు చేశారు. ఇళ్లలో పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను స్టేషన్‌కు తరలించారు. రోడ్లపై వెళ్తున్న వాహనాలను నిలిపి తనిఖీలు నిర్వహించారు. తెల్లవారుజామున వీధుల్లో పోలీసులు సంచరించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. తనిఖీల్లో అనుమతి పత్రాలు లేని 63 ద్విచక్ర వాహనాలు, 8 గ్యాస్ సిలిండర్లు, నాలుగు ఆటోలు, రూ.15వేల విలువైన 45 బీర్లు, 31 క్వార్టర్ మద్యం బాటిళ్లు, 12లీటర్ల కిరోసిన్, రైల్వేశాఖ, విద్యుత్‌శాఖ ఇనుప సామగ్రి, 20 అంబర్ ప్యాకిట్లను స్వాధీనం చేసుకున్నారు. డోర్నకల్‌లో మొదటిసారిగా కార్డన్‌సెర్చ్ నిర్వహించడం, తెల్లవారుజామున పోలీసులు వీధుల్లోకి రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణకే...ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. ఆదివారం డోర్నకల్ కార్డన్ సెర్చ్ తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజంలో 99శాతం మంది ప్రజలు చట్టాలకు లోబడి ప్రశాంతంగా జీవిస్తున్నారని, ఒక్కశాతం మాత్రమే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. వారి ఆగడాలను అరికట్టేందుకే కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. డోర్నకల్‌లో పట్టుబడిన వస్తువులను ఆయా శాఖలకు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ నరేష్కుమార్, డోర్నకల్ సీఐ ఆవుల రాజయ్యతోపాటు పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
పోలీసుల దిగ్బంధనంలో ఉస్మానియా ఆస్పత్రి!
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసులు అనూహ్యంగా శనివారం సాయంత్రం ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఏకంగా 100 మంది ఈస్ట్ జోన్ పోలీసులు రంగంలోకి దిగి ఆస్పత్రిని దిగ్బంధనం చేశారు. ఆస్పత్రిలో పలు అక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు ఈ ఆకస్మిక కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఆస్పత్రిలోని రోగులు, వారి సహాయకుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా పలువురు ఇన్సూరెన్స్ బ్రోకర్లను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రిలోని రోగులను మాయమాటలతో మోసం చేసే దళారులనూ అదుపులోకి తీసుకున్నారు. యాక్సిడెంట్ కేసుల్లో ఇన్సూరెన్స్ ఇప్పిస్తామంటూ రోగులను మోసం చేస్తున్న బోకర్ల బాగోతం కార్డాన్ సెర్చ్‌లో బహిర్గతం అయింది. ఉస్మానియా ఆస్పత్రిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించడం ఇదే తొలిసారి. -
అనుమానం వస్తే ప్రశ్నించండి
మహబూబ్‌నగర్ క్రైం: మీ ప్రాంతంలో కొత్తగా.. అనుమానితులుగా ఎవరైనా వ్యక్తులు గాని, మహిళలు కనిపిస్తే ఒక కాలనీ చెందిన వ్యక్తులుగా ముందు మీరే వాళ్లను ప్రశ్నించి పూర్తి వివరాలు సేకరించాలని.. పొంతన లేని సమాధానాలు చెబితే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని మహబూబ్‌నగర్ ఎస్పీ అనురాధ స్థానిక ప్రజలకు సూచించారు. కార్డెన్ సెర్చ్‌లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భాగంగా గురువారం జిల్లాకేంద్రంలోని టీడీగట్టు, ఖలీల్చౌక్ ప్రాంతాల్లోని 300 ఇళ్లను క్షుణ్ణంగా పరిశీలించి ఆయా ఇంట్లో నివాసం ఉండే వ్యక్తుల వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ స్వయంగా ఇళ్లను పరిశీలిస్తూ వారి ఇంట్లో ఎవరు ఉంటున్నారు.. వాళ్ల జీవన విధానం ఇతర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రధానంగా కాలనీలో ఉండే కిరాణం, పాన్ దుకాణాలను ఎస్పీ పరిశీలించి వాటిలో అమ్ముతున్న సరుకులను తనిఖీ చేశారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు సాగిన తనిఖీల్లో 14 ద్విచక్రవాహనాలను, 7 ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకుని.. 8 మంది అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భం గా అనుమానిత వ్యక్తుల వేలిముద్రలను పోలీసులు సేకరించారు. తనిఖీల్లో అద నపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ భాస్కర్, ఐదు మంది సీఐలు, 10 మంది ఎస్‌ఐలతోపాటు 200 మంది పోలీస్ సిబ్బంది పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ ప్రతి వారానికి ఒకసారి పట్టణంలో ఒ క కాలనీలో తనిఖీలు చేపడుతామన్నారు. -
వనపర్తిలో కార్డెన్ సెర్చ్
వనపర్తి విద్యావిభాగం: జిల్లాకేంద్రంలో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పట్టణంలోని గాంధీనగర్, ఇంద్రకాలనీల్లో పోలీసులు గురువారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు తనిఖీలు చేపట్టారు. ఏఎస్పీ సురేందర్‌రెడ్డి నేతృత్వంలో ఒక సీఐ, 9 మంది ఎస్ఐలు, 123 మంది సిబ్బంది 15 బృందాలుగా ఏర్పడి ఇంటింటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 59 ద్విచక్రవాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఇతర రాష్ట్రాలకు చెందిన 14 మందిని అనుమానితులుగా గుర్తించి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న రెండు బెల్టు షాపులను తనిఖీ చేసి 34 బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల భద్రతే ముఖ్యం.. జిల్లాకేంద్రంలో నేరాలు, దొంగతనాలను అరికట్టేందుకు ప్రజల భద్రత పర్యవేక్షణలో భాగంగానే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఏఎస్పీ సురేందర్‌రెడ్డి తెలిపారు. ఇతర ప్రాంతాల వారికి ఇళ్లను అద్దెకు ఇచ్చే ముందు వారి సరైన ధ్రువపత్రాలు తీసుకోవాలని ఏఎస్పీ సూచించారు. ఒకవేళ అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. పట్టణంలో ఈవ్‌టీజింగ్, వేధింపులకు పాల్పడడం వంటి సంఘటనలు జరిగితే వెంటనే షీ టీం బృందాలకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలకు సంబంధించి యజమానులు సరైన ధ్రువపత్రాలు చూయిం చి వాహనాలను తీసుకెళ్లాలని సూచించా రు. పట్టణంలోని అన్ని వార్డుల్లో విడతల వారీగా కార్డెన్ సెర్చ్ తనిఖీలు చేపడుతామన్నారు. దొంగతనాలు, నేరాలను అదుపు చేసేందుకు పట్టణ ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, పట్టణ ఎస్ఐ నాగశేఖరరెడ్డి, జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు. అయిజలోనూ తనిఖీలు.. అయిజ (అలంపూర్): అయిజ నగర పంచాయతీలోని వల్లూరుపేట వీధిలో గురువారం ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఆధ్వర్యంలో పోలీస్ బృందాలు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. అదనపు ఎస్పీ, డీఎస్పీతో కలిసి 83 మంది పోలీసులు, ముగ్గురు సర్కిల్ ఇన్స్పెక్టర్లు 8 టీంలుగా ఏర్పడి ఆపరేషన్ చేపట్టారు. వీధిలోని 240 ఇళ్ల వద్దనున్న వివిధ వాహనాలను, ఆయా ఇళ్లలో ఉన్నవారి ఆధార్ కార్డులను తనిఖీ చేసారు. సరైన ధ్రువపత్రాలు లేని 5 ప్యాసింజర్ ఆటోలు, ఒక కారు, 45 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ అయిజలో త్వరలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు ఉంటే దొరికిపోతారన్నారు. ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఫలితంగా ఎంతోమం అమాయకులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ రూల్స్ గురించి చాలామందికి అవగాహన లేదని, త్వరలో అయిజలో లైసెన్స్ మేళా ఏర్పాటు చేస్తామన్నారు. సీజ్ చేసిన వాహనాలపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానంగా సంచరిస్తున్నా, అద్దె ఇళ్లలో నివాసముంటున్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీ పోలీస్ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ భాస్కర్, డీఎస్పీ సురేందర్‌రావు, గద్వాల, అలంపూర్ సీఐలు వెంకటేశ్వర్లు, రజిత, అయిజ ఎస్ఐ బాలవెంకటరమణతోపాటు జిల్లాలోని ఆయా మండలాల ఎస్ఐలు పాల్గొన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణకే కార్డన్‌సెర్చ్
జగిత్యాలక్రైం: శాంతిభద్రతల పరిరక్షణకే కార్డన్‌సెర్చ్ నిర్వహిస్తున్నట్లు జగిత్యాల డీఎస్పీ భద్రయ్య అన్నారు. జగిత్యాలలోని తెనుగువాడ, రెహ్మతాపూర్లో గురువారం ఇంటింటా తనిఖీలు చేపట్టారు. ఐదుగురు సీఐలు, 15 మంది ఎస్సైలతో డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో కార్డన్‌సెర్చ్ చేపట్టారు. డీఎస్పీ మాట్లాడుతూ ఎవరు అనుమానితులు వచ్చినా పోలీసులకు సమాచారం అందించాలని, కొత్తగా అద్దెకుంటామని వచ్చిన వారి వివరాలు సేకరించిన తర్వాతే ఇల్లు అద్దెకివ్వాలని సూచించారు. కొత్తవారు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు సరైన పత్రాలు చూసుకోవాలని సూచించారు. ఈసందర్భంగా 33 బైక్‌లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. సీఐలు ప్రకాశ్, నవీన్, కోటేశ్వర్, నాగేందర్‌బాబు, లక్ష్మణ్‌బాబు, ఎస్సైలు కిరణ్‌కుమార్, ట్రాఫిక్ ఎస్సై అంజయ్య, శ్రీనివాస్, ప్రసాద్, సతీశ్ పాల్గొన్నారు. -
ఇందూరులో కార్డన్ సెర్చ్
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్): ప్రశాంతంగా నిద్రపోతున్న ప్రజల ఇంటి తలుపులు తట్టడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇళ్ల నుంచి బయటకు రండని పిలుపులతో ఏమైందోనంటూ భయపడ్డారు. కిటికీలో నుంచి చూస్తే ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో పోలీసులు వచ్చారేంటి అని కంగారుపడ్డారు. కొందరు తమ బయటకు వచ్చేందుకు భయపడ్డారు. అలాంటి వారిని బయటకు రప్పించేందుకు పోలీసులు ముందస్తుగా వారితో పరిచయం ఉన్న వ్యక్తిని వెంట తీసుకెళ్లి అతడితో ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రప్పించారు. అనంతరం పోలీసులు కార్డన్ సెర్చ్ చేశారు. విషయం తెలుసుకున్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నేరాలను అరికట్టేందుకే: సీపీ కార్తికేయ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నేరాల నియంత్రణకు కార్డన్ సెర్చ్ నిర్వహించాం. ఇండ్లున్నవారు పరిచయం లేనివారికి ఇల్లు అద్దెకు ఇవ్వరాదు. కొత్త వ్యక్తులకు ఇంటిని అద్దెకు ఇచ్చేటప్పుడు వారి పూర్తి సమాచారం తెలుసుకోవాలి. ఆధార్ కార్డు పరిశీలించాలి. కొత్త వ్యక్తులు తిరిగితే పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి. సీపీ కార్తికేయ ఆధ్వర్యంలో తనిఖీలు.. నేరాల నియంత్రణలో భాగంగా నగరంలోని ఒకటో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో గల ఎరుకలవాడ, ఇస్లాంపురా, కోజాకాలనీ, అశోక్‌నగర్, మహబుబ్ భాగ్, మిర్చి కంపౌడ్ ప్రాంతాల్లో సీపీ కార్తికేయ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 4.30 నుంచి 6.30 గంటల వరకు కార్డన్ సెర్చ్ చేశారు. అదనపు డీసీపీ ఆకుల రాంరెడ్డి, ముగ్గురు ఏసీపీలు, 12 మంది సీఐలు, ముగ్గురు ఆర్ఐలు, 16మంది ఎస్ఐలు, 250 మంది పోలీసులు, 40 మంది మహిళా కానిస్టేబుళ్లు కార్డన్ సెర్చ్‌లో పాల్గొన్నారు. వారు 12 బృందాలుగా తనిఖీ చేశారు. అనుమానితులను ఆరాతీసి, క్రిమినల్స్ ఎవరైనా షెల్టర్ తీసుకున్నారా?, పాత నేరస్తులు ఉన్నారా లేదా ఆరాతీశారు. ప్రతి వాహనం డాక్యూమెంట్లను పరిశీలించారు. సరైన ధ్రువపత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని మొత్తం 67 బైకులు, 7 ఆటోలు, ఒక జీపును పోలీసులు స్వాధీనం చేసుకుని వాటిని గాంధీగంజ్‌కు తరలించారు. ఐదుగురు పాత రౌడీ షీటర్లను, 10 మంది అనుమానితులను ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో 25 బైకులు, మూడు ఆటోలు, ఒక జీపు ఉంది. ధ్రుపత్రాలు లేనివారికి ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో నాగేశ్వర్రావు రూ.28,500 జరిమానాలు విధించారు. -
కార్డన్ సెర్చ్.. అదుపులో మైనర్ ప్రేమజంట!
సాక్షి, హైదరాబాద్ : ఉప్పల్‌లోని దేవేందర్ నగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఈ ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసి.. సరైన పత్రాలు లేని 15 బైకులు, రెండు ఆటోలు, 51 గ్యాస్ సిలిండర్లు, 20 లీటర్ల డీజిల్, రెండు గుట్కా పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక మైనర్ ప్రేమజంటను కూడా అదుపులోకి తీసుకున్నారు. మరో 11మంది అనుమానితులను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్డన్ సెర్చ్‌లో మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వరశర్మ, ఏసీపీ గోనె సందీప్ సహా 300 మంది పోలీసులు పాల్గొన్నారు. బొట్టుగూడలోనూ.. నల్లగొండ : శనివారం ఉదయం 4 గంటల నుంచి బొట్టుగూడ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ తనిఖీలు చేపట్టారు. ఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో ఇద్దరు డీఎస్పీలు, 15 మంది సీఐలు, 30 మంది ఎస్సైలు, 50 మంది మహిళా సిబ్బంది, మొత్తం 300 మంది పోలీసులు పాల్గొన్నారు. బొట్టుగూడ పరిధిలో ఎలాంటి పత్రాలు 36 బైకులు, 11 ఆటోలు, 2 కార్లు, ఒక గుట్కా డబ్బా, 34 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మట్లాడుతూ.. ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపిస్తే.. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి తెలుపాలని, పరిచయం లేని వారికి ఇల్లు అద్దెకు ఇవ్వవద్దని సూచించారు. -
‘గుట్ట’లో కార్డన్ సెర్చ్
యాదగిరిగుట్ట (ఆలేరు) : యాదగిరిగుట్ట పట్టణంలోని పలుకాలనీల్లో ఆదివారం వేకువజామున పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. డీసీపీ రాంచంద్రారెడ్డి, ట్రైనీ ఐపీఎస్ రక్షిత ఆధ్వర్యంలో ఖాకీలు నిర్బంధ తనిఖీలు నిర్వహించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. వేకువ జామున గాఢ నిద్రలో ఉన్న ఆయా కుటుంబాలు.. ఒక్క సారిగా ఇంటి తలుపుల శబ్దం విని తీసే సరికి పోలీసులు కనిపించడంతో ఏమీ జరిగిందోననే ఆందోళన నెలకొంది. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన రెండో రోజే కార్డన్ సెర్చ్ చేయడంతో సర్వత్ర చర్చనీయాంశమైంది. పట్టణంలోని ప్రశాంత్‌నగర్, సుభాష్‌నగర్, అంగడిబజారు, పెద్దకందుకూర్ ప్రాంతాల్లో సుమారు 300 ఇళ్లు, వ్యభిచార గృహాలపై పోలీసులు ఒక్కసారిగా సోదాలు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. భక్తులు బస చేసే ప్రవేట్ లాడ్జీల్లోకి వెళ్లి పలు జంటలను అదుపులోకి తీసుకున్నారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, కుటుంబాల్లో ఉన్న వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. పత్రాలు సరిగ్గా లేకుండా అడిగిన ప్రశ్నలకు సమాధానం దాటవేసిన వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సోదాల్లో పత్రాలు సరిగ్గా లేని 23 ద్విచక్రవాహనాలు, 4 కార్లు, 4 ఆటోలను ఠాణాకు తరలించారు. అంతే కాకుండా లాడ్జీల్లో ఉన్న 16 జంటలను అదుపులోకి తీసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆరుగురులాడ్జీ యాజమానులను అరెస్టు చేసి 5మంది ఉమెన్స్ రెస్క్యూ చేశారు. ఉదయాన్నే మద్యం అమ్మకాలు జరుపుతున్న రెండు బెల్ట్ దుకాణాపై దాడులు చేసి సీజ్ చేశామని, అనుమానితుడిని, 8మంది పాత నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ రాంచంద్రారెడ్డి తెలిపారు. ఈ సోదాల్లో యాదగిరిగుట్ట, భువనగిరి ఏసీపీలు సముద్రాల శ్రీనివాసచార్యులు, జీతేందర్‌రెడ్డి, ఎనిమిదిమంది సీఐలు, 20మంది ఎస్ఐలు, 15మంది మహిళా పోలీసులు, 150మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కార్డన్ సెర్చ్‌కు ప్రజలు మద్దతునిచ్చారని, రానున్న రోజుల్లో యాదాద్రి పుణ్యక్షేత్రం పెద్దదిగా మారుతుండటంతో నిత్యం ఇలాంటి దాడులు చేయాలని ప్రజలు పోలీసులను కోరారు. వాహనాల పత్రాలు సరిగ్గా ఉన్న పలు వాహనాలను యాజమానులు పత్రాలు తీసుకెళ్లి పోలీసులకు అందజేయడంతో పలువురికి ఇచ్చారు. -
ఉలిక్కిపడ్డ ధర్మాజిపేట
దుబ్బాకటౌన్: దుబ్బాక నగర పంచాయతీ పరిధిలోని ధర్మాజిపేటలో గురువారం తెల్లవారుజామున సిద్దిపేట పోలీస్ కమిషనర్ శివకుమార్ ఆధ్వర్యంలో పోలీ సులు కార్డెన్ సెర్చ్ చేపట్టారు. సీపీ శివకుమార్, డీసీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ రామేశ్వర్ ఆధ్వర్యంలో దుబ్బాక సీఐ నీరంజన్, ఎస్ఐ సుభాష్గౌడ్తో పాటు మిరుదొ డ్డి, చిన్నకోడూర్ ఎస్ఐలు.. మొత్తం 65 మంది సిబ్బం ది బ్యాచ్‌లుగా విడిపోయి ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటినీ తనిఖీ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేని 94 మోటార్ సైకిళ్లు, 3 ఆటోలు, 2 కార్లు, 3 ట్రాక్టర్లను సీజ్ చేశారు. గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న ముగ్గురిని గుర్తించా రు. వారిపై చర్యలు తీసుకోవాలని సీపీ శివకుమార్.. ఎస్ఐ సుభాష్‌గౌడ్‌కు సూచించారు. గతంలో 30 నేరాలతో సంబంధం ఉన్న భిక్షపతితో పాటు పలు నేరాలు చేసిన కాస్తి కనకయ్య, శ్రీనివాస్‌ను విచారణ చేశారు. ఆందోళనకు గురైన ప్రజలు తెల్లవారుజామున 5 గంటలకు ఒక్కసారిగా ధర్మాజిపేటను పోలీసులు చట్టుముట్టడంతో ప్రజలు ఆందోళన చెందారు. గతంలో నక్సలైట్ల కోసం పోలీసులు గ్రామాలను చుట్టుముట్టేవారు.. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ అలాంటి సంఘటలన ఏదైనా జరుగుతుందేమోనని ధర్మాజీపేట ప్రజలు ఉలిక్కిపడ్డారు. పోలీసులు అన్ని వివరాలు చెప్పడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. నేర రహిత సమాజం కోసమే.. నేరరహిత గ్రామాలుగా తీర్చిదిద్దడంలో భాగంగా నిరంతరం పనిచేస్తున్నామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శివకుమార్ అన్నారు. గురువారం ధర్మాజిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల అదుపునకు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రజల మేలు కోసమే కార్డెన్ సెర్చ్‌లు నిర్వహిస్తున్నామని చెప్పారు. వాహనదారులు తమ వాహనాల ఆర్సీ, ఇన్సురెన్స్, డ్రైవింగ్ లైసెన్స్‌లు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సీపీ సూచించారు. -
పాతబస్తీలో పోలీసులు కార్డన్‌సెర్చ్
-
భువనగిరిలో పోలీసుల నిర్బంధ తనిఖీలు
సాక్షి, యాదాద్రి భువనగిరి: భువనగిరిలోని సంజీవనగర్‌లో పోలీసులు శనివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. భువనగిరి జోన్ డీసీపీ రాంచందర్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృతంగా సోదాలు చేశారు. ఇద్దరు ఏసీపీలు, 10 మంది సీఐలు, 20 మంది ఎస్ఐలు, 200 మంది పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. సరైన అనుమతి పత్రాలు లేని 2 కార్లు, 40 బైకులు, ఒక ఆటోను సీజ్ చేశారు. ఇద్దరు రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీలో గుట్కాలు విక్రయిస్తున్న వ్యక్తి సహా మద్యం అమ్ముతున్న మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
పాతబస్తీలో పోలీసుల కార్డన్ సెర్చ్
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో గురువారం వెకువజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. బహుదూర్పురలో సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 250 మంది పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. కిషన్‌బాగ్ దాల్మండిలో 300 మంది పోలీసులు 12 బృందాలుగా విడిపోయి సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో పలువురు అనుమానితుల అరెస్ట్ చేశారు. సరైన ధృవపత్రాలులేని వాహనాలు సీజ్ చేశారు. మారణాయుధాలను స్వాదీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న హుక్కా సెంటర్లపై దాడులు చేశారు. -
పాతబస్తీ, ఫలక్నుమలో పోలీసులు కార్డన్ సెర్చ్
-
నల్లగొండలో కార్డన్ సెర్చ్
జిల్లా కేంద్రం హౌసింగ్ బోర్డు కాలనీలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఏఎస్పీ పద్మనాభరెడ్డి, డీఎస్పీ సుధాకర్ ఆధ్వర్యంలో 120 మంది పోలీసులు కాలనీ మొత్తాన్ని జల్లెడపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని 15 వాహనాలను సీజ్ చేశారు. పాతబస్తీలో అనుమానితుల కదలికలు ఉన్నట్టు సమాచారం అందడంతోనే నిర్బంధ తనిఖీలు నిర్వహించినట్టు ఖాకీలు పేర్కొన్నారు. నల్లగొండ క్రైం : పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో పోలీసులు ఆదివారం ఉదయం 5గంటల ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఏఎస్పీ పద్మనాభరెడ్డి, డీఎస్పీ సుధాకర్ ఆధ్వర్యంలో 120 మంది పోలీసులు హౌసింగ్‌బోర్డు ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని జల్లెడ పట్టడంతో ప్రజలు ఒక్కసారిగా ఏం జరిగిందోనని ఆందోళన చెందారు. గంజాయి అమ్మకాలు, శివారు ప్రాంతాల్లో పేకాటలాంటి అసాంఘిక కార్యక్రమాలు, అనుమానిత వ్యక్తుల కదలికలను ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆధారాలు సక్రమంగా లేని 15 వాహనాలు సీజ్ చేశారు. పలువురు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించి సాయంత్రం వదిలేశారు. అనుమానిత నివాసాలను కూడా తనిఖీలు చేసి వారి దగ్గర ఉన్న గుర్తింపు కార్డుల ఆధారంగా వదిలేశారు. అనుమానిత వ్యక్తులు, గుర్తుతెలియని వారికి ఇళ్లు కిరాయికి ఇవ్వొద్దని, అనుమానిత వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు అందించాలని సూచించారు. సీజ్ చేసిన వాహనాల ఆధారాలను చూపించి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో సీఐలు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ఆదిరెడ్డి, రమేష్, అనురాధ, ఎస్ఐలు మోతిరామ్, హన్మంతరెడ్డి, రామలింగదుర్గాప్రసాద్, హరిబాబు, శేఖర్ పాల్గొన్నారు. -
జహీరాబాద్‌లో కార్డెన్ సెర్చ్
సంగారెడ్డి: జిల్లాలోని జహీరాబాద్‌లోని భరత్‌నగర్ కాలనీలో గురువారం తెల్లవారుజామున పోలీసులు నిర్భంధ తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులు ఈ తనిఖ్లీల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 10 ద్విచక్రవాహనాలతో పాటు 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. -
సూర్యాపేటలో కార్డెన్ సెర్చ్
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్‌లో గురువారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీని నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టిన పోలీసులు గాలింపు జరిపారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని 20 ద్విచక్రవాహనాలు, ఓ ఆటో స్వాధీనం చేసుకున్నారు. కార్డెన్ సెర్చ్‌ల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని.. సురక్షిత సమాజం కోసమే ఈ తనిఖీలు చేపడుతున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. -
గోదావరిఖని, పెద్దపల్లిలో పోలీసుల తనిఖీలు
కరీంనగర్: గోదావరిఖని ఒకటవ పోలీస్ స్టెషన్ పరిధిలోని 7బి కాలనీ, విఠల్‌నగర్‌లో ఆదివారం వేకువజామున పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. అనుమతి పత్రాలు లేని 50 ద్విచక్రవాహనాలు, నాలుగు ట్రాలీ ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. సరైన అడ్రస్ తెలపని ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ ఆధ్వర్యంలో సబ్ఇన్స్పెక్టర్లు, పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. అలాగే పెద్దపల్లి శాంతినగర్‌లో పోలీసులు తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 60 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. -
జమ్మికుంటలో కార్డన్‌సెర్చ్
జమ్మికుంట: కరీంనగర్జిల్లా జమ్మికుంట పట్టణంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దుర్గా కాలనీలోని ప్రతి ఇంటినీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 10 ద్విచక్ర వాహనాలు, రెండు కార్లు, రూ.30 వేల విలువ గల గుట్కా ప్యాకెట్లు, బాణసంచా, మద్యం నిల్వలు, 25 లీటర్ల కిరోసిన్, 4 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో 300 పోలీసులు పాల్గొన్నారు. కాగా, జమ్మికుంట పోలీసు స్టేషన్లో జనగణమన కార్యక్రమంలో సీపీ పాల్గొన్నారు. -
కరీంనగర్లో కార్డన్ సెర్చ్
కరీంనగర్: నగరంలోని హుస్సెనీపుర, ప్రియదర్శని కాలనీలను పోలీసులు దిగ్బంధం చేశారు. పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సోమవారం వేకువజామున 200మంది పోలీసులు ఒక్కసారిగా రెండు కాలనీల్లో ఇంటింటా సోదాలు నిర్వహించారు. ఈ సదంర్భంగా సరైన పత్రాలు లేని 19 ద్విచక్రవాహనాలు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ రౌడీషీటర్‌తోపాటు నలుగురు పాత నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు. అక్రమం మద్యాన్ని గుర్తించి బెల్ట్ షాప్‌ను సీజ్ చేశారు. అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికే తనిఖీలు నిర్వహించామని సీపీ తెలిపారు. -
కార్డెన్ సెర్చ్: 34 బైక్‌లు స్వాధీనం
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట, శాంతినగర్‌లో బుధవారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. చోరీలకు పాల్పడుతున్న ఇద్దరితో పాటు మరో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువ పత్రాలు లేని 34 బైక్‌లు, 13 ఆటోలో, రెండు బస్తాల గుట్కా ప్యాకెట్లు, మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సీపీ కమలాసన్ రెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. -
కార్డన్ సెర్చ్: అదుపులో 9 మంది రౌడీషీటర్లు
హైదరాబాద్: హుమయున్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వర్రావు ఆధ్వర్యంలో సుమారు 400 మంది పోలీసులు ఆ ప్రాంతాన్నంతా జల్లెడ పట్టారు. ఈ సందర్భంగా 9 మంది రౌడీషీటర్లతో పాటు 51 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేనటువంటి 55 బైక్‌లు, 5 ఆటోలు, ఓ కారును పోలీసులు సీజ్ చేశారు. -
కార్డన్ సెర్చ్‌లో 50 బైక్‌లు స్వాధీనం
సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలోని చింతలచెరువులో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున నిర్వహించిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని 50 బైక్‌లను, 8 ఆటోలను పోలీసులు స్వాధీనం. ఈ సందర్భంగా పలువురు అనుమానితులను పోలీసులు విచారించి వివరాలు సేకరించారు. -
కార్డన్ సెర్చ్: 50 బైక్‌లు స్వాధీనం
-
కార్డన్ సెర్చ్: 50 ద్విచక్రవాహనాలు స్వాధీనం
హైదరాబాద్: పాతబస్తీ, చంద్రాయణగుట్ట ప్రాంతంలో సోమవారం వేకువజామున పోలీసులు నిర్భంధ తనిఖీలు చేపట్టారు. దక్షిణ మండల డీసీపీ ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 50 ద్విచక్రవాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో 90 మద్యం సీసాలు పట్టుబడ్డాయి. పోలీసులు 11 మంది రౌడీషీటర్లు, 14 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. -
కార్డన్ సెర్చ్.. అదుపులోకి 12 మంది
హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. స్థానిక సింగరేణి కాలనీలో ఉదయం 3 గంటల నుంచి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 12 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పాటు సరైన పత్రాలు లేని 37 ద్విచక్రవాహనాలు, 48 గ్యాస్ సిలిండర్లు, 150 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో 300 మంది పోలీసులు పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో 12 మంది రౌడీ షీటర్లు
హైదరాబాద్: పాతబస్తీలో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వర్ రావు అధ్వర్యంలో 400 మంది పోలీసులు శుక్రవారం తెల్లవారు జామున టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 12 మంది రౌడీషీటర్లు, 69 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సరైన పత్రాలు లేనటువంటి 69 బైక్‌లను సీజ్ చేశారు. -
దేవరకొండలో కార్డన్ సెర్చ్
దేవరకొండ పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున డీఎస్పీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పట్టణంలోని సంతోషిమాతా కాలనీలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నలుగురు సీఐలు, 10 మంది ఎస్ఐలు, 100 మంది పోలీస్ సిబ్బందితో కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, రెండు కాటన్ల బీర్లు, రెండు కాటన్ల చీప్ లిక్కర్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చంద్రమోహన్ తెలిపారు. ఈ కార్డన్ సెర్చ్‌లో సీఐలు ఎంజీఎస్ రామకృష్ణ, వెంకటేశ్వర్‌రెడ్డి, బాలగంగిరెడ్డి, శివరాంరెడ్డి, ఎస్ఐలు రాఘవేందర్‌రెడ్డి, శేఖర్, నాగభూషణ్‌రావు, సర్ధార్, క్రాంతికుమార్, సర్ధార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కరీంనగర్లో 43 బైక్‌లు సీజ్
కరీంనగర్: కరీంనగర్‌లోని కార్ఖానగడ్డలో కమిషనర్ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామున 200మంది పోలీసులు ఒక్కసారిగా కార్ఖానగడ్డ నలుదిక్కుల దారులను మూసివేసి ఇంటింటా సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 43 బైక్‌లు, నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు బీహార్‌కు చెందిన ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రాంతంలో అనుమానితులు నివాసం ఉంటున్నారనే సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించామని కమలాసన్‌రెడ్డి తెలిపారు. -
సూర్యాపేటలో కార్డన్ సెర్చ్
సూర్యాపేట: సూర్యాపేటలో బుధవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. స్థానిక ఇందిరమ్మ కాలనీలో నిర్వహించిన ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో.. సీఐ మొగులయ్య ఆధ్వర్యంలో 100 మంది పోలీసులు పాల్గొని ఆ ప్రాంతాన్నంతా జల్లెడ పట్టారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేనటువంటి 70 బైక్‌లు, 20 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
‘మిర్యాల’లో కార్డన్ సెర్చ్
మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో ఆదివారం రాత్రి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ సురభీ రాంగోపాల్‌రావు ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, 11మంది ఎస్ఐలు, 100మంది కానిస్టేబుళ్లు, హోంగార్డులు, మహిళా హోంగార్డులతో కాలనీలో ఇంటింటికీ తిరిగి సోదాలు నిర్వహించారు. ప్రతి ఒక్కరి ఆధారుకార్డును అడిగి వారు ఏ పని చేస్తున్నారు. ఎన్ని ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నారని వివరాలు సేకరించారు. కాలనీలో నాలుగు బృందాలుగా విడిపోరుున పోలీసులు ప్రధాన విధుల్లో ఎవరూ కాలనీ నుంచి బయటికి పోకుండా లోనికి రాకుండా బందోబస్తు నిర్వహించారు. కాలనీలోకి వచ్చే వారిని పూర్తిగా తనిఖీలు చేసిన అనంతరమే అనుమతించారు. కాలనిలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఉన్నారా..? అనే కోణంలో విచారణ చేపట్టారు. అనుమానిత వ్యక్తులు, పత్రాలు లేని ద్విచక్రవాహనాలను గుర్తిస్తే వాటిని పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు.ఈ సందర్భంగా డీఎస్పీ సురభీ రాంగోపాల్‌రావు మాట్లాడుతూ ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి ఆదేశాల ప్రకారం ఇందిరమ్మకాలనీలో ముమ్మర తనిఖీలు చేపట్టామని తెలిపారు. అనుమానిత వ్యక్తులు సంచరిస్తున్నట్లు తెలిస్తే కాలనీ వాసులు వెంటనే పోలీసుల దృష్టికి తీసుకరావాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వున్న ఎలాంటి కార్యకలాపాలను సహించేదిలేదని తెలిపారు. కార్యక్రమంలో వన్‌టౌన్, చిట్యాల, హాలియా సీఐలు దూసరి భిక్షపతి, పాండురంగారెడ్డి, పార్థసారథి, ఎస్ఐలు ప్రసాదరావు, శ్రీకాంత్ పాల్గొన్నారు. కాలనీవాసుల కలవరం.. పోలీసులు ఒక్కసారిగా రాత్రి సమయంలో ఇందిరమ్మకాలనీలోకి రావడంతో స్థానికులు కలవరానికి గురయ్యారు. ప్రతి ఇంటికి వెళ్లిన పోలీసులు కాలనీవాసులు వివరాంగా చెప్పి వివరాలు అడగడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
చొప్పదండిలో కార్డన్ సెర్చ్
చొప్పదండి: కరీంనగర్జిల్లా చొప్పదండిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 37 ద్విచక్ర వాహనాలను, 25 లీటర్ల కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 11 క్వింటాళ్ల బియ్యాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. -
కార్డన్‌సెర్చ్: అదుపులో 17 మంది
-
కార్డన్‌సెర్చ్: అదుపులో 17 మంది
హైదరాబాద్: హైదరాబాద్ నార్త్జోన్పరిధిలోని బేగంపేట, రసూల్‌పురా, ఇంద్రానగర్, ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నార్త్‌జోన్ డీసీపీ సుమతి పర్యవేక్షణలో సుమారు 400 మంది సిబ్బంది ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఐదుగురు పాతనేరస్తులతో పాటు 17 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేని 2 ఆటోలను, 22 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. -
కార్డన్ సెర్చ్, అదుపులో 101 మంది అనుమానితులు
హైదరాబాద్: హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున నగరంలో సంయుక్త కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 588 పోలీసులు.. మీర్ఆలం, ముస్తఫానగర్, పహడీషరీఫ్, రాజేంద్రనగర్, చందానగర్, శంషాబాద్, గుల్జర్నగర్ ప్రాంతాల్లో విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 101 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురు రౌడీషీటర్లతో పాటు.. 26 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేనటువంటి 120 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. తనిఖీల సందర్భంగా గుర్తించిన 12 మంది బాలకార్మికలకు పోలీసులు విముక్తి కల్పించారు. నగరంలో ఉగ్రవాదుల కదలికలు బయటపడిన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వరుస కార్డన్ సెర్చ్ ఆపరేషన్లతో నేరగాళ్లకు వణుకుపుట్టిస్తున్నారు. -
హైదరాబాద్‌లో విస్తృత సోదాలు
-
యాదగిరి గుట్టలో కార్డెన్ సెర్చ్
యాదగిరి గుట్ట: నల్గొండ జిల్లా యాదగిరి గుట్ట పట్టణంలో భువనగిరి డీఎస్పీ సాదు మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం వేకువజామున కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పట్టణంలోని లాడ్జీలు, హోటళ్లు, అనుమానిత ప్రాంతాలలో తనిఖీలు చేశారు. ఈ కార్డెన్ సెర్చ్‌లో ఐదుగురు సీఐలు, 25 మంది ఎస్ఐలు, 200 మంది పోలీసులు పాల్గొన్నారు. రహదారిలో వాహనాలను కూడా తనిఖీ చేశారు. -
పాతబస్తీలో కార్డన్ సెర్చ్
-
పాతబస్తీలో కార్డన్ సెర్చ్
హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలోని హసన్ నగర్, బహదూర్‌పూరలో శనివారం తెల్లవారుజాము నుంచి పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహిస్తున్నారు. దక్షిణ మండల డీసీపీ ఆధ్యర్యంలో 300 మంది పోలీసులతో తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటిని జల్లెడ పడుతున్న పోలీసులు ఐదుగురు అనుమానిత బంగ్లాదేశ్ వాసులను అదుపులోకి తీసుకున్నారు. సోదాలు కొనసాగుతున్నాయి. -
నగరంలో పోలీసుల కార్డన్ సెర్చ్..
హైదరాబాద్: ఎస్ఆర్ నగర్ పోలీసులు బుధవారం రాత్రి అంబేద్కర్‌నగర్, జయప్రకాశ్‌నగర్, ఎల్లారెడ్డిగూడ ప్రాంతాల్లో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. మొత్తం 412 ఇళ్లను సోదా చేయగా అందులో 17 హాస్టళ్లు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న 61 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నేపాల్ దేశంతోపాటు వివిధ రాష్ట్రాల వారు ఉన్నారు. అలాగే, ఎలాంటి పత్రాలు లేని 39 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. -
కార్డన్ సెర్చ్.. 40 వాహనాలు స్వాధీనం
హైదరాబాద్: మాదాపూర్, పంజగుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు ఆదివారం వేకువజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మాదాపూర్ సిద్ధిక్‌నగర్‌లో డీసీపీ కార్తికేయ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు ఆదివారం ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 34 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలోనూ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. హాస్టళ్లలో తనిఖీల సందర్భంగా 30 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
హైదరాబాద్ లో కార్డన్ సెర్చ్.. రౌడీ షీటర్ల అరెస్ట్
హైదరాబాద్: హైదరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు కార్డన్ సెర్చ్ జరిగింది. డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు. మంగళహాట్, హజమ్ కేఫ్, జంజీర్ పాన్ షాప్ ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్ లో ఏడుగురు రౌడీ షీటర్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో 53 మంది అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు 50 బైక్ లు, రెండు ఆటోలను సీజ్ చేసినట్లు డీసీసీ వెల్లడించారు. -
కార్డన్‌సెర్చ్‌లో 51 వాహనాలు సీజ్
హైదరాబాద్: సైదాబాద్ వాంబే కాలనీలో పోలీసులు బుధవారం రాత్రి కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పత్రాలు లేని 46 ద్విచక్ర వాహనాలు, ఐదు ఆటోలు, పది గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. -
మైలార్‌దేవ్‌పల్లిలో కార్డన్‌సెర్చ్
హైదరాబాద్: మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హౌసింగ్‌బోర్డ్ కాలనీలో పోలీసులు సోమవారం తెల్లవారుజామున కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. శంషాబాద్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగిన తనిఖీల్లో 300 మంది పోలీసులు పాల్గొన్నారు. 23 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల వారు ఇక్కడ ఎక్కువగా నివసిస్తున్నారని, ఇటీవల బ్యాంకు దోపిడీ ఘటన నేపథ్యంలో ఇంటింటి తనిఖీలు నిర్వహించామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. -
కాచిగూడలో కార్డెన్ సెర్చ్
హైదరాబాద్: నగరంలోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులతో సుందర్ నగర్లో కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాలనీలో ప్రతి ఇంటినీ పోలీసులు జల్లెడ పడుతున్నారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల కార్డెన్ సెర్చ్ కొనసాగుతుంది. -
పాతబస్తీలో కార్డన్ సెర్చ్.. ఆయుధాలు స్వాధీనం
హైదరాబాద్: పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణారెడ్డినగర్, మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని సుల్తాన్షాహి ప్రాంతాల్లో సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం తెల్లవారు జామున కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని సుమారు 220 ద్విచక్ర వాహనాలు, రెండు ఆయుధాలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 60 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 10 మందిపై నాన్‌బెయిలబుల్ వారంట్లు జారీ కాగా తప్పించుకు తిరుగుతున్నారు. నకిలీ స్టాంప్ వెండర్లు కూడా పట్టుబడ్డారు. గుడుంబా తయారుచేస్తున్న గ్యాంగ్, తెల్లవారుజాము వరకు హుక్కా సెంటర్లు నడుపుతున్న కొందరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ సత్యనారాయణ వెల్లడించారు. సౌత్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో సుమారు 500 మంది పోలీసులు ఉదయం 5 గంటల నుంచి కార్డన్ సెర్చ్ కొనసాగిస్తున్నారు. -
రెజిమెంట్ బజార్లో కార్డన్ సర్చ్
నేరాలు లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి సికింద్రాబాద్ రెల్వేస్టేషన్ సమీపంలోని రెజిమెంటల్ బజార్లో కార్డెన్ సర్చ్ నిర్వహిస్తున్నారు. వాహనాల తనిఖీలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. -
భారీగా వాహనాలు, లాడ్జీల తనిఖీలు!
హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి 6 గంటల వరకు పెద్ద ఎత్తున నాకాబందీ నిర్వహించారు. నేరాలను నిరోధించేందుకు ముందుజాగ్రత్తగా చేపట్టిన ఈ గస్తీ ఆపరేషన్‌లో సైబరాబాద్ కమిషనరేట్ అధికారాలంతా పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని లాడ్జీల్లో క్షణంగా తనిఖీలు నిర్వహించారు. వాహనాల సోదాలు నిర్వహించారు. అదేవిధంగా షాహీనగర్, పహడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 20 బృందాలు ఏకకాలంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో ఏడుగురు రౌడీషీటర్లు, 11 నిందితులు, ఒక నాన్‌బెయిలబుల్ వారెంట్ ఉన్న నిందితుడు, ఒక హత్యకేసు నిందితుడు.. మొత్తంగా 50 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 45 ద్విచక్ర వాహనాలు, రెండు వాహనాలు, ఏడు ఆటోలు, మూడు గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కర్డన్ సెర్చ్‌లో డీసీపీ సత్యనారాయణ స్వయంగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో చిలకలగూడ పోలీసు స్టేషన్‌కు వచ్చి ఆస్ట్రేలియా పోలీసులు ఈ వివరాలు తెలుసుకున్నారు. -
13మంది రౌడీ షీటర్లు సహా అదుపులో 96మంది
-
13మంది రౌడీ షీటర్లు సహా అదుపులో 96మంది
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో పలుచోట్ల పోలీసులు సోమవారం అర్థరాత్రి తర్వాత కార్డన్ సెర్చ్ నిర్వహిచారు. బోరబండ, ఎస్ఆర్ నగర్ వంటి ప్రాంతాల్లో డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్డన్ సెర్చ్ ప్రారంభమైంది. ఇందులో మొత్తం 500మంది పోలీసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 13మంది రౌడీషీటర్లతో సహా మొత్తం 96మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇతర రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సరైన ధృవపత్రాలు లేని 123 వాహనాలు కూడా సీజ్ చేశారు. అదుపులోకి తీసుకున్నవారిని విచారిస్తున్నారు. -
కార్డన్ సెర్చ్‌లో 28 మంది రౌడీ షీటర్ల అరెస్ట్
హైదరాబాద్: ఫలక్ నుమ పీఎస్ పరిధిలోని వట్టేపల్లి బస్తీ, ఫాతిమానగర్లలో పోలీసులు మంగళవారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వేకువజాము నుంచే పోలీసులు ఈ ప్రాంతాల్లో చాలా మంది ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. కొందరు అనుమానితులను ప్రశ్నించి అదుపులోనికి తీసుకున్నారు. సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్యర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. 28 మంది రౌడీ షీటర్లను అరెస్ట్ చేసినట్లు సమాచారం. కాగా, ఈ కార్డన్ సెర్చ్ ద్వారా 24 మంది బాల కార్మికులకు విముక్తి లభించింది. 350 మంది పోలీసులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కార్డన్ సెర్చ్, 51 వాహనాలు స్వాధీనం
-
కార్డన్ సెర్చ్, 87 వాహనాలు స్వాధీనం
ఉస్మానియా యూనివర్సిటీ(హైదరాబాద్): ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాణికేశ్వర్‌నగర్‌లో శుక్రవారం రాత్రి తూర్పు మండలం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మాణికేశ్వర్‌నగర్‌లోని పలు షాపులు, ఇళ్లల్లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా పది మంది పాత నేరస్తులను అదుపులోకి తీసుకన్నారు. వాహనాల తనిఖీలలో భాగంగా పత్రాలులేని 87 ద్విచక్రవాహనాలు, మూడు ఆటోలు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ధ్రువపత్రాలు లేకుండా ఆర్ఎంపీ డాక్టర్లుగా ఆస్పత్రిని నడుపుతున్న నలుగురు వ్యక్తులకు నోటీసులు ఇచ్చిన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తూర్పు మండల డీసీపీ డాక్టర్ రవీందర్, అడిషనల్ డీసీపీ ఎల్టీ చంద్రశేఖర్‌రావు, కాచిగూడ ఏసీపీ లక్ష్మీనారాయణ, ఓయూ సీఐ అశోక్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
రాయదుర్గంలో కార్డాన్ సెర్చ్
-
పోలీసుల అదుపులో 70మంది యువకులు
హైదరాబాద్: పాతబస్తీలోని 9 చోట్ల ఆదివారం తెల్లవారుజామున దక్షిణ మండల పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నగరంలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోతుండటంతో.. వారిని అదుపులోకి తీసుకురావడానికి ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కార్డన్ సెర్చ్‌లో బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 70 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 40 ద్విచక్రవాహనాలు, మూడు ఆటోలు, ఒక టాటాసుమో వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజామున ప్రారంభమైన దాడులు ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. అనుమానాస్పద యువకులతో పాటు, రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. -
పోలీసుల కార్డాన్ సెర్చ్.. అదుపులో 32మంది
-
పోలీసుల కార్డాన్ సెర్చ్.. అదుపులో 32మంది
హైదరాబాద్: పాతబస్తీలో సౌత్ జోన్ పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. చార్మినార్ ఏసీపీ అశోక్ చక్రవర్తి ఆధ్వర్యంలో హుస్సేని ఆలం పరిధిలో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 32మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని బైకులను కూడా స్వాధీనం చేసుకున్నారు. -
కార్డన్ సెర్చ్.. పోలీసుల అదుపులో రౌడీ షీటర్లు
రాజేంద్రనగర్ (రంగారెడ్డి): రాజేంద్రనగర్‌లోని చింతల్మెట్ ప్రాంతంలో పోలీసులు ఆదివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శంషాబాద్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 60 మందిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, పత్రాలు లేకపోవడంతో 50 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో నలుగురు రౌడీ షీటర్లు, పది మంది పాత నేరస్తులు ఉన్నారని సమాచారం. -
కార్డన్ సెర్చ్.. 100 వాహనాలు సీజ్
చార్మినార్: హైదరాబాద్ నగరంలోని బహదూర్‌పుర, కామాటిపుర, మీర్‌చౌక్, మొఘల్‌పుర ప్రాంతాల్లో సౌత్‌జోన్ పోలీసులు బుధవారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీర్‌చౌక్, మొఘల్‌పుర పోలీస్స్టేషన్ల పరిధిలో సరైన పత్రాలు లేని 100 వాహనాలను సీజ్ చేశారు. బహదూర్‌పుర, కామాటిపుర ప్రాంతంలో దొంగ సొత్తును కొనుగోలు చేస్తున్న సుమారు 13 తుక్కు దుకాణాలను సీజ్ చేశారు. -
కార్డన్ సెర్చ్.. అనుమానితుల అరెస్ట్
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని పీర్లమాన్యం ప్రాంతంలో పట్టణ పోలీసులు ఆదివారం కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని సోదా చేశారు. అందులోభాగంగా 30 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని కారణంగా 22 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించి.... విచారించారు. విచారణ అనంతరం 20 మందిని విడిచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. -
కార్డన్ సెర్చ్.. అనుమానితుల అరెస్ట్
-
కార్డన్ సెర్చ్.. అనుమానితుల అరెస్ట్
హైదరాబాద్: సికింద్రాబాద్ తుకారాంగేటు ప్రాంతంలోని మాంగారి బస్తీలో పోలీసులు శనివారం వేకువజామున కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. బస్తీలోని ఇంటింటినీ సోదా చేశారు. నార్త్‌జోన్ డీసీపీ సుధీర్‌బాబు ఆధ్వర్యంలో కొనసాగిన సెర్చ్ లో 200మంది పోలీసులు పాల్గొన్నారు. రెండు బైక్‌లు, అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సెర్చ్ లో ఏడుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పోలీసుల అదుపులో 50 మంది అనుమానితులు
హైదరాబాద్: మోతీ ధర్వాజలోని ఐదు ప్రాంతాల్లో వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో శనివారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్ లో డీసీపీతో పాటు, 400మంది పోలీసులు పాల్గొన్నారు. సెర్చ్ లో భాగంగా పోలీసులు ఐదు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. 50 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 44 వాహనాలను స్వాధీనం చేసుకొని, పలువురి పై కేసులు నమోదు చేశారు. -
కాచిగూడ స్టేషన్లో కార్డాన్ సెర్చ్
హైదరాబాద్ : నగరంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. శుక్రవారం రాత్రి కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. స్టేషన్లో ప్రయాణికులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. రైల్వే డీఎస్పీ మురళీధర్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. -
పోలీసుల అదుపులో అనుమానితులు
హైదరాబాద్ : చాంద్రాయణగుట్ట, కంచన్‌బాగ్ ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ జరిపి 113 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 600 మంది పోలీసులతో సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. బంగ్లాదేశ్, బర్మా, మయన్మార్ దేశాలతో పాటు, బీహార్, ఉత్తరప్రదేశ్, అస్సాం, మధ్య ప్రదేశ్‌కు చెందిన అనుమానితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. -
సారా బట్టీల స్థావరాలపై పోలీసుల కార్డన్ సెర్చ్
-
సారా బట్టీల స్థావరాలపై పోలీసుల కార్డన్ సెర్చ్
హైదరాబాద్: నగరంలోని శివారుప్రాంతంలో సారా బట్టీల సరఫరా యథేచ్చగా కొనసాగుతోంది. గతకొంతకాలంగా నానక్‌రామ్‌గూడలో సారా బట్టీల స్థావరాల నుంచి గుడుంబాను భారీగా సరఫరా చేస్తున్నారు. అందిన ప్రాథమిక సమాచారం మేరకు మాదాపూర్ పోలీసులు రంగంలోకి దిగి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ కార్తికేయ ఆధ్వర్యంలో 400మంది పోలీసులతో సోమవారం ఉదయం నుంచి నగరంలోని నానక్‌రామ్‌గూడలో గుడంబా, సారా బట్టీల స్థావరాలపై దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో భారీగా సారా బట్టీలను పోలీసులు ధ్వంసం చేశారు. పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సైదాబాద్, కార్మికనగర్‌లో కార్డన్ సెర్చ్
-
సైదాబాద్, కార్మికనగర్‌లో కార్డన్ సెర్చ్
హైదరాబాద్ : హైదరాబాద్‌లో అర్థరాత్రి పోలీసులు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేశారు. ఈస్ట్‌జోన్ డీసీపీ ఆధ్వర్యంలో సుమారు 250మంది పోలీసులుతో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 18మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 11వేల గుడుంబా ప్యాకెట్లు, 170 సిలెండర్లు, 17 గ్యాస్ రీఫిల్లింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే జూబ్లీహిల్స్ కార్మికనగర్, రెహ్మత్ నగర్లోనూ సోదాలు జరిపారు. ఎనిమిదిమంది రౌడీషీటర్లు, 32మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. 2వేల గుడుంబా ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని 24 వాహనాలను సీజ్ చేశారు.