చార్మినార్: హైదరాబాద్ నగరంలోని బహదూర్‌పుర, కామాటిపుర, మీర్‌చౌక్, మొఘల్‌పుర ప్రాంతాల్లో సౌత్‌జోన్ పోలీసులు బుధవారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీర్‌చౌక్, మొఘల్‌పుర పోలీస్‌స్టేషన్ల పరిధిలో సరైన పత్రాలు లేని 100 వాహనాలను సీజ్ చేశారు. బహదూర్‌పుర, కామాటిపుర ప్రాంతంలో దొంగ సొత్తును కొనుగోలు చేస్తున్న సుమారు 13 తుక్కు దుకాణాలను సీజ్ చేశారు.