ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని పీర్లమాన్యం ప్రాంతంలో పట్టణ పోలీసులు ఆదివారం కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని సోదా చేశారు. అందులోభాగంగా 30 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని కారణంగా 22 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించి.... విచారించారు. విచారణ అనంతరం 20 మందిని విడిచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.