
పోలీసుల అదుపులో అనుమానితులు
చాంద్రాయణగుట్ట, కంచన్బాగ్ ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ ..
హైదరాబాద్ : చాంద్రాయణగుట్ట, కంచన్బాగ్ ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ జరిపి 113 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 600 మంది పోలీసులతో సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
బంగ్లాదేశ్, బర్మా, మయన్మార్ దేశాలతో పాటు, బీహార్, ఉత్తరప్రదేశ్, అస్సాం, మధ్య ప్రదేశ్‌కు చెందిన అనుమానితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.