
సాక్షి, హైదరాబాద్: ప్లాట్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని చాంద్రాయణగుట్ట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో ప్లాట్ రిజిస్ట్రేషన్ పేరుతో కోట్లలో మోసాలకు పాల్పడిన ఘరానా మోసగాడు అబ్దుల్ రషీద్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు అబ్దుల్ రషీద్ 15 మందికి ప్లాట్స్ ఇప్పిస్తానని నమ్మించి వారి నుంచి 5 కోట్లు వసూలు చేశాడు. ఆ డబ్బు తీసుకుని ప్లాట్స్ ఇప్పించకుండా సొంత ఖర్చులకు వాడుకున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు.. చాంద్రాయగుట్ట పోలీసులు రషీద్ మీద కేసు నమోదు చేశారు. శనివారం అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment