plots fraud
-
‘సగం ధరకే సొంతిల్లు’.. ఈ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి
ప్రీలాంచ్, బై బ్యాక్, యూడీఎస్, అన్‌లాకబుల్ స్పేస్, రెంటల్ స్కీమ్.. ఇలా రకరకాలుగా నివాస, వాణిజ్య సముదాయాలలో ఆఫర్ల పేరిట కొనుగోలుదారులకు ఎర వేస్తున్న నిర్మాణ సంస్థలు అనేకం. సెంటు భూమి లేకుండానే ఆకాశంలో మేడలు కడుతున్నామని నమ్మించి నట్టేట ముంచేస్తున్నాయి. ఏ కంపెనీలు ఏ తరహా మోసాలకు పాల్పడుతున్నాయనే ప్రస్తావన కాసేపు పక్కన పెడితే.. అసలు ప్రీలాంచ్ మోసాలకు కారణం ఎవరు? చిన్న వస్తువు కొంటేనే బ్రాండ్, ధర, ఎక్స్పైరీ వంటి వివరాలన్నీ తెలుసుకునే కొనుగోలుదారులు.. జీవితంలో అత్యంత కీలకమైన గృహ కొనుగోలులో ఎందుకు పునఃపరిశీలన చేసుకోవటం లేదు? సగం ధరకే ఫ్లాట్ అనగానే గుడ్డిగా నమ్మేసి కష్టార్జితాన్నంతా బిల్డర్ చేతిలో పెట్టేయడం ఎంతవరకు కరెక్ట్? సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ రంగానికి పునాది నమ్మకం. ఒక ప్రాజెక్ట్‌ను ప్రారంభించేటప్పుడు అందులోని ఫ్లాట్లన్నింటినీ అమ్మగలననే నమ్మకం బిల్డర్‌కు, ఆ ప్రాజెక్ట్‌ను గడువులోగా పూర్తి చేసి అందించగలడనే నమ్మకం కొనుగోలుదారునికి ఉండాలి. అప్పుడే ప్రతికూల సమయంలోనూ బిల్డర్, కస్టమర్లు ఇద్దరూ ఆనందంగా ఉంటారు. కానీ, ప్రస్తుతం హైదరాబాద్ స్థిరాస్తి రంగంలో కొరవడింది ఈ నమ్మకమే.రాత్రికి రాత్రే పుట్టుకొచ్చే బిల్డర్లు, స్వలాభమే ఆశించే భూ యజమానులు, సగం ధరకే సొంతిల్లు కావాలనుకునే కస్టమర్లు.. వీరందరూ అత్యాశతో పరిశ్రమకు మచ్చ తెస్తున్నారు. నిధుల మళ్లింపుతో.. వ్యాపారంలో షార్ట్‌కర్ట్ దురుద్దేశంతో సాహితీ వంటి కొంతమంది బిల్డర్లు ప్రీలాంచ్ పేరుతో సగం ధరకే ఫ్లాట్లు విక్రయించే ప్రయత్నాలు చేస్తూ హోమ్ బయ్యర్లను ఆకర్షిస్తున్నారు. ఈ విధంగా సమీకరించిన సొమ్మును బిల్డర్లు ఇతర ప్రాజెక్ట్‌లకు, వ్యక్తిగత అవసరాలకు మళ్లిస్తున్నారు. సగం ధరకే అమ్మిన సొమ్ముతో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయలేక చతికిలపడిపోతున్నారు. అత్యాశ కలిగిన బిల్డర్లు, కొనుగోలుదారులు ఇద్దరూ సక్రమంగా ఉన్న పరిశ్రమకు చెడ్డ పేరు తెస్తున్నారు. విలువలతో కూడిన వ్యాపారం చేసే డెవలపర్లకు ఇబ్బందులు కలుగజేస్తున్నారు. అధ్యయనం చేయకుండానే.. ప్రీలాంచ్, యూడీఎస్ స్కీమ్‌ల పేరిట కస్టమర్లను మోసం చేసే వందలాది మంది బిల్డర్ల పుట్టుకకు కారణం కస్టమర్లే. వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయకుండా సగం ధరకే ఫ్లాట్ అనగానే నమ్మేసి, అత్యాశకు పోయి బిల్డర్లకు సొమ్ము సమర్పించుకునే కస్టమర్లు ఉన్నంతకాలం ప్రీలాంచ్ చీడపురుగులు వస్తూనే ఉంటారు. అత్యాశ కలిగిన కస్టమర్లే లేకపోతే ప్రీలాంచ్ డెవలపర్లు మొగ్గలోనే వాడిపోతారు. ప్రీలాంచ్ పేరిట డబ్బులు వసూలు చేసే బిల్డర్లను శిక్షించి నట్టుగానే వారిని ప్రోత్సహించే కొనుగోలుదారులనూ శిక్షించాల్సిన అవసరం ఉంది. కొనేముందు గమనించాల్సినవివే ► నిర్మాణ అనుమతులు, రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లలోనే కొనుగోలు చేయాలి. ►ప్రాజెక్ట్ నిర్మించే స్థలానికి న్యాయపరమైన అంశాలపై నిపుణులను సంప్రదించాలి. ►డెవలపర్ ప్రొఫైల్, ఆర్ధిక సామర్థ్యం తెలుసుకోవాలి. ►గతంలో పూర్తి చేసిన ప్రాజెక్ట్‌లను నేరుగా వెళ్లి పరిశీలించాలి. అందులోని కస్టమర్లతో మాట్లాడాలి. ►పాత ప్రాజెక్ట్‌లలో ధరల వృద్ధి ఎలా ఉంది? బ్రోచర్లలో ఇచ్చిన హామీలను అమలు చేశాడా లేదో తెలుసుకోవాలి. ►ప్రాజెక్ట్ రుణాలు, పాత లోన్ల చెల్లింపులు తదితర వివరాలపై ఆరా తీయాలి. ►డెవలపర్ లేదా కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ గురించి కూడా పరిశీలించాలి. కస్టమర్లూ శిక్షార్హులే.. లంచం తీసుకోవటం ఎంత నేరమో.. ఇవ్వటమూ అంతే నేరం. అలాగే ప్రీలాంచ్ స్కీమ్‌లతో ప్రజలను మోసం చేస్తున్న బిల్డర్లది ఎంత తప్పో.. ఆయా స్కీమ్‌లను నమ్మి బిల్డర్లను ప్రోత్సహించే కస్టమర్లదీ అంతే తప్పు. లంచం విషయాలలో ఎలాగైతే ఇద్దరూ శిక్షించబడతారో ప్రీలాంచ్ కేసుల్లోనూ అటు బిల్డర్, ఇటు కస్టమర్ ఇద్దరూ శిక్షార్హులే. – రవీందర్ రెడ్డి, ఫౌండర్, చైర్మన్ జనప్రియ -
ప్లాట్ల పేరుతో రూ.5 కోట్లు స్వాహా
సాక్షి, హైదరాబాద్: ప్లాట్లు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసిన రషీద్ అనే నిందితుడిని సీసీఎస్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ అబ్దుల్ రషీద్ ప్లాట్లు ఇస్తానంటూ సుమారు 15 మంది నుంచి దాదాపు రూ.5 కోట్లు వసూలు చేశారు. నగదు చెల్లించినా ప్లాట్లు ఇవ్వకపోవడంతో ఆలం ఖాన్ అనే బాధితుడు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం రషీద్‌ను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
ప్లాట్ల పేరుతో మోసం.. రూ.5 కోట్లు వసూలు
సాక్షి, హైదరాబాద్: ప్లాట్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని చాంద్రాయణగుట్ట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో ప్లాట్ రిజిస్ట్రేషన్ పేరుతో కోట్లలో మోసాలకు పాల్పడిన ఘరానా మోసగాడు అబ్దుల్ రషీద్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు అబ్దుల్ రషీద్ 15 మందికి ప్లాట్స్ ఇప్పిస్తానని నమ్మించి వారి నుంచి 5 కోట్లు వసూలు చేశాడు. ఆ డబ్బు తీసుకుని ప్లాట్స్ ఇప్పించకుండా సొంత ఖర్చులకు వాడుకున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు.. చాంద్రాయగుట్ట పోలీసులు రషీద్ మీద కేసు నమోదు చేశారు. శనివారం అదుపులోకి తీసుకున్నారు. -
మాయగాళ్లు, ఖాళీ ప్లాట్లు కనిపిస్తే చాలు..
సాక్షి, మీర్‌పేట: ఖాళీ ప్లాట్లపై కన్నేసి యజమానులకు తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లను విక్రయించి మోసాలకు పాల్పడుతున్న తొమ్మిది మంది ముఠా సభ్యుల్లో ఇద్దరిని మీర్‌పేట పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నాదర్గుల్కు చెందిన వల్లాల ప్రేమ్‌కుమార్ (45), బాలాపూర్‌కు చెందిన చెరుకూరి కిరణ్‌కుమార్, శ్రీనివాస్‌నాయక్, కృష్ణారెడ్డి, హేమలత, నరేష్, వి.శివారెడ్డి, ఏ.సంతోష్, ఎలిమినేటి సుకుమార్‌రెడ్డిలు కలిసి 1980–90 నాటి వెంచర్లలోని ఖాళీ ప్లాట్లపై కన్నేసి వాటికి సంబంధించి నకిలీ పత్రాలు తయారు చేసి అసలు యజమానులకు తెలియకుండా ఇతరులకు ప్లాట్లు విక్రయిస్తున్నారు. కాగా సికింద్రాబాద్ పద్మారావునగర్‌కు చెందిన అక్కాచెళ్లెల్లు తుమ్మల రమాదేవి, తుమ్మల యహేమలతలకు చెందిన మీర్‌పేట నందిహిల్స్ సర్వే నం.29లో రెండు ప్లాట్ల (నం–21, 22)కు సైతం 1985 నాటి నిజమైన పత్రాలను పోలి ఉండేలా నకిలీ పత్రాలను తయారు చేసి విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఇది తెలుసుకున్న ప్లాట్ల యజమానులు రమాదేవి, హేమలత వెంటనే మీర్‌పేట పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు చెరుకూరి కిరణ్‌కుమార్‌తో కలిసి మొత్తం 8 మంది సభ్యులు మోసానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. వీరిలో ఏ3గా ఉన్న వల్లాల ప్రేమ్‌కుమార్, ఏ6గా ఉన్న ఎలిమినేటి సుకుమార్‌రెడ్డిలను శుక్రవారం అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నకిలీ పత్రాలు తయారు చేసే సామగ్రిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని, ఇందులో హస్తినాపురం మాజీ కార్పొరేటర్ సోదరుడు కూడా ఉన్నాడని సీఐ పేర్కొన్నారు. -
కొండాపూర్‌లో మహిళ ఆగడాలు
గచ్చిబౌలి: ఎన్ఆర్ఐ,హైకోర్టు అడ్వొకేట్, నిజాం వారసురాలినని చెప్పుకుంటూ ఖాళీ ప్లాట్లు కనిపిస్తే పాగా వేస్తోంది ఓ కి‘లేడీ’. ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఒకటా రెండా ఏకంగా 2,700 చదరపు గజాల విస్తీర్ణం కల్గిన 9 ప్లాట్లను కబ్జా చేసేందుకు ప్రయత్నించింది. ఈ స్థలం విలువ రూ.16 కోట్లకు పైగానే ఉంటుంది. సదరు మహిళ ఆగడాలు శృతి మించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో నిందితురాలిని గచ్చిబౌలి పోలీసులు ఈ నెల 11న అరెస్ట్ చేశారు. మరికొన్ని కేసులు పెండింగ్‌లో ఉండటంతో కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎస్ఐ రమేష్ తెలిపిన ప్రకారం... మలక్‌పేట్‌కు చెందిన సయ్యద్ నస్రీన్ సయిదా అలియాస్ సానియా అజ్జనీ(40) కొద్ది నెలలుగా కొండాపూర్‌లోని రాఘవేంద్ర కాలనీ, రాజరాజేశ్వరీనగర్ కాలనీ, మాధవహిల్స్లో అనుచరులతో కలిసి బెదిరింపులకు పాల్పడుతూ ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఖాళీ ప్లాట్లను కబ్జా చేసేందుకు యత్నిస్తోంది. రాఘవేంద్ర కాలనీలో 200 చదరపు గజాల విస్తీర్ణం కల్గిన ప్లాట్ నంబర్ ‘495ఈ’లో యజమాని రామకృష్ణ బోరు వేస్తుండగా సానియా రంగప్రవేశం చేసింది. అనుచరులతో బెదిరింపులకు పాల్పడి ప్లాట్‌ను చదును చేసి ప్రహరీ నిర్మించేందుకు ప్రయత్నించింది. దీంతో బాధితుడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. క్రైమ్ నంబర్ 738/2018, మరో నాన్ బెయిలెబుల్ కేసు క్రైమ్ నంబర్ 634/2018లో నిందితురాలిని ఈ నెల 11న నిందితురాలిని అరెస్ట్ చేశారు. మరో నాలుగు కేసులు పెండింగ్‌లో ఉండడంతో కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ♦ కొండాపూర్‌లోని రాజరాజేశ్వరీనగర్ కాలనీలో గిరిజ లక్ష్మీకి 400 చదరపు గజాల విస్తీర్ణం కల్గిన ప్లాట్ నంబర్లు 1264, 1265 ఉన్నాయి. వీటికి సానియా ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి అనుచరులతో బెదిరింపులకు పాల్పడింది. ప్రహరీ నిర్మించే క్రమంలో మెటీరియల్ తేవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అక్కడి నుంచి ఉడాయించింది. ఈ కేసు (క్రైమ్ నంబర్ 188/2018) పెండింగ్‌లో ఉండటంతో ఇప్పటికే సానియాకు నోటీసులు జారీ చేశారు. ♦ కొండాపూర్‌లోని మాధవహిల్స్ లేఅవుట్లో ప్రవీణ్‌కుమార్‌కు 799 చదరపు గజాల విస్తీర్ణం కల్గిన ప్లాట్ నంబర్ 2, 3లకు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించిన సానియా కబ్జా చేసేందుకు అనుచరులతో కలిసి బెదిరింపులకు పాల్పడింది. ప్లాట్‌ను చదును చేసి ప్రహరీ నిర్మించేందుకు యత్నించింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు (క్రైమ్ నంబర్ 604/2018) గతంలోనే నోటీసులు జారీ చేశారు. ♦ రాజరాజేశ్వరీనగర్ కాలనీలో అరుణ్‌కుమార్ ఆప్టెకు 900 చదరపు గజాల విస్తీర్ణం కల్గిన ప్లాట్ నంబర్ 164,165,166 ఉన్నాయి. వాచ్‌మెన్‌ను సానియా అనుచరులు బెదిరించారు. ప్రహరీ నిర్మించేందుకు యత్నించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు (క్రైమ్ నంబర్ 468/2019) నమోదు చేసి, నిందితురాలికి నోటీసులు జారీ చేశారు. ♦ కొండాపూర్‌లోని మాధవహిల్స్లో ఉపేంద్రనాథ్కు 400 చదరపు గజాల విస్తీర్ణం కల్గిన ప్లాట్ ఉంది. ప్రహరీ నిర్మించి గేటు ఏర్పాటు చేశారు. సానియా అనుచరులు తాళం పగులగొట్టి ప్లాట్‌ను కబ్జా చేశారు. లోపల షెడ్డు నిర్మాణం చేపట్టారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు (క్రైమ్ నంబర్ 531/2019) నమోదు చేశారు. ఇది పెండింగ్‌లో ఉండడంతో పోలీసులు సానియాకు నోటీసులిచ్చారు. కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు ఎన్ఆర్ఐ, హైకోర్టు అడ్వొకేట్ అని చెప్పుకుంటూ ఖాళీ ప్లాట్లను కబ్జా చేసేందుకు యత్నించడం, నాన్ బెయిలెబుల్ కేసు పెండింగ్ ఉండడంతో సయ్యద్ నస్రీన్ సయిదా అలియాస్ సానియా అజ్జనీని అరెస్ట్ చేశాం. నిందితురాలికి మరో నాలుగు కబ్జా కేసుల్లో నోటీసులిచ్చాం. కబ్జాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. – ఆర్.శ్రీనివాస్, సీఐ -
తక్కువ ధరకే ఫ్లాట్స్, హాలిడే ట్రిప్స్..
పంజగుట్ట: తక్కువ ధరకే ఫ్లాట్స్.. హాలిడే ట్రిప్స్ తీసుకెళతామంటూ ప్రచారం చేసుకుని పలువురి నుంచి నగదు వసూలు చేసిన ఓ సంస్థ బోర్డు తిప్పేసిన ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన షేక్ ఖాధర్ బాషా, పానగంటి విజయ్ కుమార్, అనూజ్ పటేల్ కలిసి వెంకటరమణ కాలనీలో ఎలైట్ రియాలిటీ సర్వీసెస్ సంస్థను ఏడాదిన్నర క్రితం ప్రారంభించారు. తక్కువ ధరకే యాదగిరిగుట్ట సమీపంలో ఫ్లాట్స్ ఇస్తామంటూ ప్రచారం చేసుకున్నారు. సెలవుదినాల్లో దేశ, విదేశాల్లో హాలిడే ట్రిప్స్‌కు తీసుకువెళతామని నమ్మించి ఒకొక్కరి నుంచి అడ్వాన్స్‌గా రూ.లక్ష నుండి రూ.2 లక్షల వరకు వసూలు చేశారు. చెల్లించిన డబ్బులకు బాండ్ పేపర్‌పై రాసి ఇచ్చారు. వీరి మాటలు నమ్మిన 30 మంది రూ.40 లక్షలకు పైగా మోసపోయినట్లు పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సదరు సంస్థ కార్యాలయానికి వెళ్లగా అప్పటికే బోర్డు తిప్పేసి పారిపోయారు. నిందితులు ప్రయారిటీ సర్వీసెస్, ల్యాండ్ మార్క్ ఇన్ఫ్రా, ఫారŠూచ్యన్ గ్రూప్ ఆఫ్ ఎస్టేట్స్ పేరుతో పలు సంస్థలను స్థాపించి చాలా మందిని మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరి బాధితులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని ఎస్సై సతీష్ తెలిపారు. కాగా నిందితులు ముంబైలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
గిప్ట్ వచ్చిందని ఫోన్.. ఫ్లాట్ చూపించి మోసం
హిమాయత్‌నగర్: ప్లాట్లు ఇప్పిస్తామంటూ మోసానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సోమవారం రాత్రి హియాయత్ నగర్‌లోని ‘గ్లోబల్ టార్జ్ ప్రైడ్’ సంస్థ కార్యాలయంలో 100 మందికి పైగా బాధితులు ఆందోళన చేపట్టారు. దీనిపై సమాచారం అందడంతో నారాయణ గూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కూతురి పెళ్లి ఆగిపోయింది లక్కీ డ్రా ద్వారా బహుమతి వచ్చిందంటే నమ్మి వెళ్లాం. నగర శివారు ప్రాంతాల్లో ప్లాట్లు తక్కువ ధరకే ఇస్తామంటే ఆశపడి లక్షల్లో డబ్బులు చెల్లించాం, ఈరోజు, రేపు అంటూ మోసం చేశారు. డబ్బులు తిరిగి ఇవ్వలేదు. డబ్బులు లేక నా కూతురి పెళ్లి ఆగిపోయింది. –భాగ్యలక్ష్మి, సికింద్రాబాద్ రూ.3 లక్షలు కట్టాను తక్కువ ధరకే ప్లాట్ ఇస్తామంటే ఆశ పడ్డాను, అప్పుచేసి రూ.3 లక్షలు కట్టాను. ఇప్పుడు తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు లేదు. అప్పుల వాళ్ళు ఇంటిమీదకొస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. –సరిత, సంతోష్‌నగర్. గిప్ట్ వచ్చిందని ముంచారు.. గిప్ట్ వచ్చిందంటూ ఫోన్ రావడంతో అబిడ్స్ వెళ్లాం. నగర శివార్లలో మంచి ఫ్లాట్ చూపించి రూ.2 లక్షలు కట్టమంటే కట్టాం, ఏడాదిన్నర అవుతున్నా ప్లాటు లేదు , డబ్బు ఇ్వమంటే స్పందన లేదు, నా కూతురుకు మొహం చూపలేకపోతున్నా. నాకు న్యాయం చేయాలి. –రాజేశ్వరి, ఉప్పల్ -
నమ్మించి నట్టేట ముంచేసి..
నల్లగొండ టూటౌన్ :అమాయక రైతులకు మాయమాటలు చెప్పాడు.. ప్లాట్లు ఇప్పిస్తానని నమ్మబలికాడు.. రూ.కోటికిపైగా డబ్బులు వసూలు చేసి ఉడాయించాడు. న్యాయం చేయాలని కోరుతూ బాధితులు సోమవారం కలెక్టర్‌ను ఆశ్రయిం చా రు. వివరాలు.. నాంపల్లి మండలం లక్ష్మణాపురంలో లక్ష్మీనర్సింహస్వామి రిజర్వాయర్ నిర్మాణంలో గ్రామం మొత్తం ముంపునకు గురైంది. దీంతో ప్రభుత్వం బాధిత రైతులకు ఎకరాకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇచ్చిం ది. ఇదే అదునుగా భావించిన అదే గ్రామానికి చెందిన దేప ఈశ్వర్‌రెడ్డి ముంపు బాధితులకు హైదరాబాద్‌లో ప్లాట్లు ఇప్పిస్తానని నమ్మ బలికి సుమారు కోటి రూపాయాలకు పైగా వసూలు చేశాడు. హైదరాబాద్‌లో ఉంటున్న ఈశ్వర్‌రెడ్డి 20 రోజుల నుంచి గ్రామానికి రాకపోవడంతో డబ్బులు ఇచ్చిన రైతులు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లినా ఆచూ కీ లభించలేదు. తాము మోసపోయామని గ్రహించిన గ్రామానికి చెందిన 11 మంది రైతులు ఎస్పీకి ఫిర్యాదు చేసి ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సెల్ టవర్ ఎక్కిన యువకుడు ... తమ ఊరు ముంపునకు గురై తీవ్రంగా నష్టపోయామని, ఇలా తమను నిండా ముంచినా నాంపల్లి పోలీసులు తమకు న్యాయం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని బాధితుడు ఆరోపించారు. తమకు డబ్బులు ఇప్పించాలని కోరుతూ లక్ష్మాపురం గ్రామానికి చెందిన గడ్డి లింగయ్య అనే యవకుడు కలెక్టరేట్ ఆవరణలో ఉన్న సెల్ టవర్ ఎక్కాడు. యువకుడు సెల్ టవర్ ఎక్కడంతో కలకలం రేగింది. డీఎస్పీ సుధాకర్, పోలీసులు భారీగా అక్కడికి చేరుకున్నారు. జేసీ నారాయణరెడ్డి సెల్ టవర్ దగ్గరకు వచ్చి యువకుడితో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పడంతో కిందకి దిగాడు. పోలీసులు బాధిత రైతులతో పాటు టవర్ ఎక్కిన యువకుడిని జేసీ చాంబర్‌కు తీసుకెళ్లారు. జేసీ వారి నుంచి వివరాలు సేకరించారు. కలెక్టర్‌తో కూడా మాట్లాడారు. ఎస్పీతో మాట్లాడా.. లక్ష్మాపురం గ్రామానికి చెందిన రైతులు ఓ ప్రైవేట్ వ్యక్తికి డబ్బులు ఇచ్చి అతని చేతిలో మోసపోయారని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ విలేకరులకు తెలిపారు. ప్రజా వాణిలో ఫిర్యాదు చేశారని, జిల్లా ఎస్పీ, ఆర్డీఓ, డీఎస్పీ, తహసీల్దార్‌తో మాట్లాడడం జరిగిందని తెలి పారు. మోసం చేసిన వ్యక్తి ఈశ్వర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అతనిపై ఎల్బీనగర్లో కూడా మోసాలకు సంబంధించిన విషయంలో కేసు నమోదు అయినట్లు తెలిపారు. ప్లాట్లు ఇప్పిస్తామని ఈశ్వర్‌రెడ్డి గ్రామస్తులతో పాటు అతని సమీప బంధువులను కూడా మోసం చేశాడని తెలిపారు. ఇలాంటి వ్యక్తులను నమ్మి రైతులు ఎవరు డబ్బులు ఇవ్వవద్దని సూచించారు. – కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ -
ఇళ్ల పేరుతో ప్రధానోపాధ్యాయురాలి భారీ మోసం..
సాక్షి, తిరువళ్లూరు: హౌసింగ్ బోర్డులో ప్లాట్లు ఇప్పిస్తానంటూ వంద మందిని కోట్ల రూపాయల్లో మోసం చేసిన ప్రధానోపాధ్యాయురాలిపై బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వివరాలివీ.. చెన్నై అయపాక్కం ప్రాంతానికి చెందిన మేఖల తిరువళ్లూరు జిల్లా తిరుప్పాచ్చూర్‌లోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. అయపాక్కంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ హౌసింగ్ బోర్డులో ప్లాట్లను ఇప్పిస్తానని పాడి, మనలి, తిరువొత్తియూర్ ప్రాంతాలకు చెందిన 103 మంది వద్ద నుంచి రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు వసూలు చేసింది. అయితే ఇంత వరకు ప్లాట్లు ఇప్పించకపోగా, నగదును కూడా తిరిగి ఇవ్వడం లేదు. దీనిపై దాదాపు 50 మంది బాధితులు సోమవారం కలెక్టర్ సుందరవల్లికి వినతి పత్రం సమర్పించారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. తమ నగదును వాపసు చేయాలని కోరితే దాడులు చేస్తామని బెదిరిస్తున్నారని వారు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే విచారణ చేపట్టి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. -
సీఆర్డీఏ అధికారులను నిలదీసిన రైతులు
-
సీఆర్డీఏ అధికారులను నిలదీసిన రైతులు
అమరావతి: ప్లాట్ల తారుమారు పై సీఆర్డీఏ అధికారులను రైతులు నిలదీశారు. టీడీపీ నేతలకు లబ్ధి చేకూరేలా ప్లాట్ల కేటాయింపులకు అధికారులు ప్లాన్ చేశారు. శాకమూరులో ప్లాట్లను సీఆర్డీఏ అధికారులు తారుమారు చేశారు. లాటరీలో వచ్చిన 1290 బ్లాక్ నుంచి రోడ్డు పక్కనే ఉన్న 584 బ్లాక్‌కు ప్లాట్లను మార్చారు. టీడీపీ నేతలు తరిగొప్పుల సాంబశివరావు, సత్యనారాయణ, ధూళిపాళ్ల ఉమాదేవి కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా ప్లాట్లు మార్చారని రైతులు మండిపడుతున్నారు.