
సాక్షి, హైదరాబాద్: ప్లాట్లు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసిన రషీద్ అనే నిందితుడిని సీసీఎస్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ అబ్దుల్ రషీద్ ప్లాట్లు ఇస్తానంటూ సుమారు 15 మంది నుంచి దాదాపు రూ.5 కోట్లు వసూలు చేశారు. నగదు చెల్లించినా ప్లాట్లు ఇవ్వకపోవడంతో ఆలం ఖాన్ అనే బాధితుడు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం రషీద్‌ను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment