rasheed
-
వినుకొండ ఘటనపై రషీద్ స్నేహితుడి మాటల్లో
-
బరువెక్కిన గుండెతో వినుకొండ రషీద్ తల్లి
-
ఒక వైపు కెప్టెన్, వైస్ కెప్టెన్‌కి పాజిటివ్.. అయినా టీమిండియా ఘన విజయం..
U-19 World Cup, IND Vs Ire: అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ జోరు కోనసాగుతోంది. ట్రినిడాడ్ వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో భాగంగా ఐర్లాండ్‌పై 174 పరుగుల భారీ తేడాతో టీమిండియా అద్భుత విజయాన్ని సాధించింది. ఈ విజయంతో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను భారత్ ఖరారు చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 307 పరుగులు చేసింది. ఓపెనర్లు హర్నూర్ సింగ్(88), రఘువంశీ(79) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత్ భారీ స్కోర్ సాధించగల్గింది. 308 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 39 ఓవర్లలో 133 పరుగులకే కూప్పకూలింది. భారత బౌలర్లలో సంగ్వాన్, అనీశ్వర్ గౌతమ్, కౌషల్ తంబే తలో రెండు వికెట్లు తీయగా... విక్కీ ఓస్వాల్, రవికుమార్, రాజవర్ధన్ తలో వికెట్ సాధించారు. భారత అండర్-19 ఆరుగురు పాజిటివ్ కాగా మ్యాచ్‌కు ముందు భారత శిబిరంలో కరోనా కలకలం రేపింది. భారత జట్టులో ఏకంగా ఆరుగురు ఆటగాళ్లకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. భారత కెప్టెన్ యశ్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌తో పాటు మరో నలుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. దీంతో ఈ మ్యాచ్‌లో నిశాంత్ సింధు భారత జట్టుకు నాయకత్వం వహించాడు. చదవండి: SA vs IND: తొలి వన్డేలో టీమిండియా ఓటమి... నిరాశపర్చిన రాహుల్ కెప్టెన్సీ.. -
ind vs Sa: భారత జట్టు ముందు సఫారీలు నిలవడం కష్టమే!
Under 19 World Cup 2022- జార్జ్‌టౌన్ (గయానా): వెస్టిండీస్ వేదికగా అండర్–19 ప్రపంచకప్‌లో భారత కుర్రాళ్ల పోరు శనివారం ఆరంభం కానుంది. యశ్ ధుల్ నేతృత్వంలోని యువ భారత్ తమ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. నాలుగు సార్లు చాంపియన్ అయిన భారత్ టోర్నీ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇక ఇటీవలే జరిగిన జూనియర్ ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత్ జోరు ముందు సఫారీ నిలవడం కష్టమే! భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. భారత జట్టు: హర్నూర్ సింగ్, అంగ్క్రిష్ రఘువంశి, షేక్ రషీద్, యశ్ ధుల్, ఆరాధ్య యాదవ్, నిశాంత్ సింధు, దినేశ్ బనా(వికెట్ కీపర్), కుశాల్ తంబే, రవి కుమార్, సిద్దార్థ్ యాదవ్, రాజ్వర్ధన్ హంగర్గేకర్, నామవ్ ప్రకాశ్, అనీశ్వర్ గౌతమ్, రాజ్ బవా, వసు వాట్స్, విక్కీ ఒత్వాల్, గర్వ్ సంగ్వాన్. దక్షిణాఫ్రికా జట్టు: ఈథన్ జాన్ కనింగ్హాం, వాలంటైన్ కిటిమె, డేవడ్ బ్రెవిస్, జీసే మ్యారీ, జార్జ్ వాన్ హీర్డన్, ఆండిలే సిమెలేన్, మిక్కీ కోప్లాండ్, మాథ్యూ బోస్ట్, లియామ్ ఆల్డర్, అఫివే న్యాండ, క్వెనా మఫాకా, ఆసఖే షాకా, జేడ్ స్మిత్ , కేడన్ సోలోమన్, జోషువా స్టీఫెన్సన్. చదవండి: Ind Vs Sa: కోహ్లికి భారీ జరిమానా విధించాలి.. నిషేధించాలి! ఐసీసీకి ఇదే నా విజ్ఞప్తి -
ప్లాట్ల పేరుతో రూ.5 కోట్లు స్వాహా
సాక్షి, హైదరాబాద్: ప్లాట్లు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసిన రషీద్ అనే నిందితుడిని సీసీఎస్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ అబ్దుల్ రషీద్ ప్లాట్లు ఇస్తానంటూ సుమారు 15 మంది నుంచి దాదాపు రూ.5 కోట్లు వసూలు చేశారు. నగదు చెల్లించినా ప్లాట్లు ఇవ్వకపోవడంతో ఆలం ఖాన్ అనే బాధితుడు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం రషీద్‌ను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
ఇంటివాడైన గాయకుడు రషీద్
నిజామాబాద్ ,డిచ్పల్లి: రేలారే.. రేలా.. ఫేమ్, ప్రముఖ జానపద అంధ గాయకుడు మహమ్మద్ రషీద్, మరో అంధ గాయకురాలు సమీరా(దీప)ను పెళ్లి చేసుకుని ఆదివారం ఓ ఇంటివాడయ్యాడు. రషీద్ అచ్చమైన పల్లె పాటలతో రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులను సంపాందించుకున్నాడు. మండలంలోని నడపల్లి జీపీ పరిధిలో గల గాంధీనగర్ కాలనీకి చెందిన రషీద్, వరంగల్ అర్బన్ జిల్లా ఫాతిమానగర్‌కు చెందిన సమీరా ఇద్దరూ హైదరాబాద్ బేగంపేట్ దేవనర్ ఫౌండేషన్‌లో చదువుకున్నారు. అదే సమయంలో రషీద్ టీవీ షోలతో బిజీతో చదువుకు తాత్కాలికంగా దూరం కావాల్సి వచ్చింది. తిరిగి మూడేళ్ల క్రితం రషీద్ డిగ్రీలో చేరడంతో మరోసారి ఇద్దరు ఒకే చోట కలిశారు. ఇద్దరు గాయకులు కావడంతో పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. గిరిజన కుటుంబానికి చెందిన దీప తల్లిదండ్రులు రాజేశ్వరి, రామదాస్ మరణించడంతో తాత కోక్యా, నానమ్మ పుల్లమ్మ వద్ద పెరిగింది. రషీద్‌తో పెళ్లి కోసం దీప తన పేరును సమీరాగా మార్చుకుంది. ఇరు కుటుంబాలు వీరి ప్రేమను ఆమోదించడంతో ఆదివారం డిచ్పల్లి మండలం ఘన్‌పూర్‌లోని షాదీఖానాలో పెళ్లి జరిపించారు. కట్న కానుకలు తీసుకోకుండా మతాంతర వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచిన రషీద్, సమీరా జంటను బంధువులు, కుటుంబీకులతో పాటు ఇరువర్గాల పెద్దలు, మండల ప్రజలు అభినందించి ఆశీర్వదించారు. -
రషీద్..అను నేను..!
సాక్షి, సిటీబ్యూరో: 2007 ఏప్రిల్‌లో అప్పటి బీజేపీ ఎంపీ బాబూభాయ్ కటారా ఢిల్లీలో అరెస్టుతో దొరికిన మనుషుల అక్రమ రవాణా తీగను లాగితే రాష్ట్రంలో డొంక కదిలింది.. దేశ వ్యాప్తంగా అనేక మంది రాజకీయ నాయకులకు ఈ స్కామ్‌లో ‘దళారి’గా వ్యవహరించిన రషీద్ పేరు వెలుగులోకి వచ్చింది... అతడి కోసం ïనగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులతో పాటు రాష్ట్రంలోని అన్ని నిఘా, పోలీసు విభాగాలు గాలింపు ప్రారంభించాయి... మోస్ట్ వాంటెడ్‌గా మారిన రషీద్ తనంతట తానుగా లొంగిపోవడానికి సీసీఎస్ మెట్లు ఎక్కాడు... అక్కడి పోలీసులు అతడిని దాదాపు గెంటేసినంత పని చేశారు...ఇదే రషీద్ ‘ఐటీ నోటీసులు చూపించి లూఠీ చేసిన కేసులో’ సీసీఎస్ పోలీసులు రెండోసారి బుధవారం అరెస్టు చేసిన విషయం విదితమే. అప్పట్లో అలా ఎందుకు జరిగింది? స్కామ్ వివరాలు ఇలా ఉన్నాయి.. వారికి అనుమతి లేనందునే... టూరిస్ట్ సహా వివిధ వీసాలపై వచ్చి అక్రమంగా స్థిరపడిపోతున్న నేపథ్యంలో అమెరికా, లండన్ తదితర దేశాలు గుజరాత్‌కు చెందిన మహిళలు, యువతులకు వీసా ఇవ్వడం మానేశాయి. అయితే రాజకీయ నాయకుల సిఫార్సుతో వారి కుటుంబీకులు, సంబంధీకులకు మాత్రమే వీటిని జారీ చేసేవారు. దీంతో మనుషుల అక్రమ రవాణా కుంభకోణానికి తెరలేచింది. గుజరాత్‌కు చెందిన వారిని ఎంపీలు, ఎమ్మెల్యేల సంబంధీకులుగా చూపిస్తూ నకిలీ పాస్పోర్ట్స్ తయారు చేయడ,ం వారి సిఫార్సుతో వీసాలు సంపాదించి అక్రమ రవాణా చేయడం మొదలైంది. నగరంలోని చాదర్‌ఘాట్ ప్రాంతానికి చెందిన మహ్మద్ రషీద్ అలీ, చెప్పల్‌బజార్ వాసి రాజుపిట్టి స్నేహితులు. వ్యాపారి, క్రికెట్ బుకీగా పని చేస్తున్న రాజు రషీద్‌కు అవసరమైన సొమ్ము వడ్డీకి ఇచ్చేవాడు. ఈ నేపథ్యంలో రషీద్ మనుషుల అక్రమ రవాణా వ్యవహారాన్ని పిట్టికి చెప్పడంతో అతను గుజరాత్‌లోని కల్లోల్ ప్రాంతానికి చెందిన భరత్భాయ్ని కలుసుకున్నాడు. అనంతరం వారితో కలిసి నకిలీ పాస్పోర్ట్స్ తయారీ ప్రారంభించాడు. బాబుభాయ్ అరెస్టుతో ప్రకంపనలు... ఈ ద్వయం అనేక మంది గుజరాతీయులను ప్రముఖ రాజకీయ నాయకుల బంధువులు, కుటుంబ సభ్యులుగా పేర్కొంటూ నకిలీ పాస్పోర్ట్స్ ఇప్పించే వారు. ఇందుకుగాను సదరు నేతలకు భారీగానే ముట్టచెప్పేవారు. 2006 నవంబర్‌లో రషీద్ నుంచి రాజుపిట్టికి ఓ సందేశం అందింది. నేరెళ్ల, బోథ్ నియోజకవర్గాలకు చెందిన అప్పటి ఎమ్మెల్యేలు కాసిపేట లింగయ్య, సోయం బాబూరావు తమకు సహకరించడానికి సమ్మతించారన్నది దాని సారాంశం. ఇక అక్కడి నుంచి ప్రారంభమైన వ్యవహారం 2007 మేలో ఢిల్లీలో బాబూభాయ్ కటారా, నగరంలో లింగయ్య, బాబూరావు అరెస్టుతో సంచలనం రేపింది. సిటీ సీసీఎస్లోనూ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో రషీద్ అటు ఢిల్లీ, ఇటు సిటీ పోలీసులకు రషీద్ మోస్ట్ వాంటెడ్‌గా మారాడు. ఇతడితో పాటు మహ్మద్ ముజఫర్ అలీఖాన్, భరత్‌భాయ్, షకీల్‌ల కోసం వేట ప్రారంభమైంది. మీడియా హడావుడి నేపథ్యంలో... సిటీ సీసీఎస్‌లో మనుషుల అక్రమ రవాణా కేసు నమోదైన రోజు నుంచి ఆ కార్యాలయం హడావుడిగా మారిపోయింది. మీడియా తాకిడితో ఉక్కిరిబిక్కిరైన సీసీఎస్ పోలీసులు ఎవరినీ లోపలకు అనుమతించవద్దంటూ గేటు వద్ద విధుల్లో ఉండే సెంట్రీకి స్పష్టం చేశారు. ఓ పక్క రషీద్ కోసం ఢిల్లీ, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీసుల వేట ముమ్మరంగా సాగుతోంది. 2007 మే 3న తన న్యాయవాది, ఇద్దరు మీడియా వ్యక్తులతో కలిసి రషీద్ నేరుగా సీసీఎస్ వద్దకు వచ్చాడు. లొంగిపోవాలనే ఉద్దేశంతో లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. సెంట్రీ అడ్డుకున్నాడు. ‘నేను రషీద్‌ని... లొంగిపోతా’ అని చెబుతున్నా వినకుండా నెట్టేసినంత పని చేశాడు. ఆయన పక్కనే ఉన్న మీడియా ప్రతినిధులు ప్రత్యేక బృందాలు గాలిస్తున్న రషీద్ వచ్చాడంటూ కేసు దర్యాప్తు అధికారికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు రషీద్‌ను తమవెంట తీసుకువెళ్లి విచారణ, అరెస్టు పూర్తి చేశారు. -
ఇక మనం చూడాలి
అది నిర్మల్ జిల్లాకేంద్రంలోని సోఫీనగర్‌లో ఓ చిన్న టీకొట్టు. దాన్ని నడిపేది అబ్దుల్ రషీద్, అబీదాబేగం. ఉదయం నాలుగు గంటలకే పెద్దకొడుకు ఫహీమ్ నిద్రలేచి.. తండ్రి కంటే ముందే ఇంటికి దగ్గరలోనే ఉన్న చాయ్హోటల్కు వెళ్లి తెరుస్తున్నాడు. రషీద్ వచ్చే సరికి సామగ్రిని సర్దిపెట్టేస్తాడు. చిన్నవాడైన నహీమ్ తండ్రితోపాటు హోటల్‌కు వస్తాడు. రషీద్ పొయ్యి వెలిగించి ఇస్తే.. ఫహీమ్ చాయ్ చేయడం మొదలు పెడతాడు. నహీమ్ గ్లాసులు, పాత్రలు శుభ్రం చేయడం, వచ్చిన వాళ్లకు టీ అందించడం తదితర పనులు చేసి పెడుతున్నాడు. ఇక రహీమ్ ఇంటి బాధ్యతను తీసుకున్నాడు. ఇంట్లోకి కావల్సిన వస్తువులను తానే దగ్గరలోని కిరాణ దుకాణానికి వెళ్లి తీసుకువస్తున్నాడు. ఇంటిపట్టునే ఉంటూ ఇల్లును చూసుకోవడమే తన బాధ్యత అని గర్వంగా చెబుతున్నాడు. ఇందులో ప్రత్యేకత ఏముంది అని పెదవి విరుస్తున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్టే! ఎందుకంటే రషీద్కన్నా ముందే లేచి చాయ్ దుకాణాన్ని తెరిచే ఫహీమ్కి కానీ, వచ్చిన వాళ్లకి టీ అందించే నహీమ్కి గానీ, ఇంటి దగ్గరే ఉండి ఇల్లు చూసుకుంటూ, ఇంట్లోకి కావలసిన వెచ్చాలు తెచ్చే రహీమ్కిగానీ కళ్లు కనిపించవు. అయినా, వాళ్లు ఏ మాత్రం నిరాశ పడటం లేదు. ‘హమ్ అంధే హై.. మగర్ హమ్ భీ బాబాకే సాథ్ కామ్ కర్తే..’ అని చెబుతూ, తండ్రికి చేదోడు వాదోడుగా నిలుస్తున్న వాళ్ల ధీమాను చూసి మెచ్చుకోవాలో, వారి అంధత్వాన్ని చూసి బాధపడాలో అర్థం కావడం లేదని స్థానికులు చెప్పుకుంటుంటారు. పెద్దకొడుకు ఫహీమ్కి మూడుపదులుండగా... మిగతా ఇద్దరు పిల్లలకూ పాతికేళ్లుంటాయి. కళ్లు బాగున్న రెండవకొడుకు సలీమ్ మాత్రం వేరుగా ఉంటూ తన కుటుంబాన్ని తను పోషించుకుంటున్నాడు. తర్వాత పుట్టిన ముగ్గురు ఆడపిల్లలు బీడీలు చుడుతూ వేణ్ణీళ్లకు చన్నీళ్లలా తండ్రి, అన్నలు నడిపే చాయ్ దుకాణ ం నుంచి వచ్చే ఆదాయానికి మరికొంత జత చేస్తూ, నడుము, కాళ్లు చచ్చుబడిపోయి పసిపాపలా పాకుతూనే ఇంటిపనులు చేసుకునే తల్లికి తోడుగా ఉంటున్నారు. అంధులైన వాళ్లకి ప్రభుత్వం ఇచ్చే పింఛను వారి అవసరాలకు ఏ మూలకూ చాలని పరిస్థితి. అద్దె ఇల్లు తప్ప సొంత ఇల్లు కూడా లేని ఆ కుటుంబం తమను ఆదుకునే దాతలకోసం గంపెడంత ఆశతో దీనంగా ఎదురు చూస్తోంది. నా కన్ను ఇస్తానన్నా... పెద్దకొడుకు ఫహీమ్ పుట్టిన ప్పుడే మస్తు దవాఖానాలు తిరిగినా. ఆఖరికి హైదరాబాద్‌లోని ఎల్.వి.ప్రసాద్ హాస్పిటల్‌కు తీసుకుపోయిన. అక్కడ అన్ని టెస్టులు చేసి.. మీ కొడుక్కి కళ్లు రావని చెప్పిండ్రు. సార్.. నాకన్ను ఇస్త.. నాకొడుక్కి పెట్టుండ్రి.. అని బతిమిలాడిన. అప్పుడు నాకు సమజయ్యేటట్లు డాక్టర్లు చెప్పిండ్రు. మాది మేనరికం వివాహం కావడం వల్లే పిల్లలకు చూపు రాలేదన్నరు. ఇగ ఏం చేయలేక ఏడుసుకుంట అచ్చిన. కనిపించకున్నా.. అందాజా (అంచనా) కొద్ది హోటల్ పనిలో తోడుంటున్నారు. – అబ్దుల్ రషీద్, తండ్రి కళ్లల్ల నీళ్లు ఇంకిపోతున్నయి... ముగ్గురు కొడుకులూ కళ్లు లేకుండనే పుట్టారు. వాళ్లు పుట్టినప్పుడల్లా ఏడ్చి..ఏడ్చి.. నా కళ్లల నీళ్లు ఇంకిపోతుండే. ‘ఏంజేస్తం.. నీకట్ల రాసిపెట్టుంది.. వాళ్లనే మంచిగ చూసుకో..’ అని అందరూ చెబుతుండేటోళ్లు. అట్లనన్న చూసుకుందామంటే.. నా కాⶠ్లు పని చేయకుండ అయినై. ఇగ నా బిడ్డలే అన్నలను, ఇల్లు చూసుకుంటున్నరు. కన్నబిడ్డలకు ఏం చేయలేకపోతున్నామన్న బాధ మనసుల పట్టనీయట్లేదు. – అబీదా బేగం, తల్లి – రాసం శ్రీధర్ సాక్షి, నిర్మల్ -
ప్రేమ కోసం రషీద్ .. రాహుల్‌గా మారాడు
చిన్నశంకరంపేట (మెదక్): ప్రియురాలి కోసం ఓ రాజు భాగ్యనగరం నిర్మించారని విన్నాం. ప్రేమ కోసం తాజ్ మహల్ నిర్మించారని చరిత్రలో చూస్తున్నాం. లవ్ జిహాద్ ఆరోపణలనూ గమనిస్తున్నాం. కానీ, ప్రేమించిన అమ్మాయి కోసం మతం మారిన ముస్లిం యువకుడి కథ ఇది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం అంబాజిపేట గ్రామానికి చెందిన ఎండీ రషీద్ మండల కేంద్రానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. విషయం పెద్దలకు తెలిస్తే తమ ప్రేమ పెళ్లికి అడ్డుగా నిలుస్తారని భావించారు. ఎవరికీ తెలియకుండా సికింద్రాబాద్‌లోని న్యూ బోయిన్పల్లి ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. అక్కడ హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్లి చేయాలంటే ఇద్దరు హిందువులే అయి ఉండాలని చెప్పడంతో రషీద్ మతం మారేందుకు నిర్ణయించుకున్నాడు. తన పేరును రాహుల్‌గా మార్చుకుని హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లికి సిద్ధపడ్డాడు. ఈ నెల 25న మతం మారడంతోపాటు, పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆ జంట చిన్న శంకరంపేట పోలీస్‌లను కలిసి ఇక ముందు తాము తల్లిదండ్రులతో సంబంధం లేకుండా స్వతంత్రంగా జీవిస్తామని, ఇందుకు సహకరించాలని కోరారు. యువకుడు హైదరాబాద్‌లోని జియో టెలికాం సంస్థలో పనిచేస్తుండగా, అమ్మాయి డీఈడీ చదువుతోంది. -
పోలీస్ కస్టడీకి ఇద్దరు ‘లష్కరే ఉగ్రవాదులు’
న్యూఢిల్లీ: రాజధానిలో పేలుళ్లకు కుట్రపన్నారనే ఆరోపణలపై అరెస్టయిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు ఇద్దరికి కోర్టు పోలీస్ కస్టడీ విధించింది. నిందితుడు రషీద్‌కు ఏడురోజులపా టు పోలీస్ కస్టడీకి పంపగా మరో నిందితుడు షాహిద్‌కు నాలుగు రోజులపాటు పోలీస్ కస్టడీకి పంపుతూ అదనపు సెషన్స్ జడ్జి దయాప్రకాశ్ ఆదేశాలు జారీ చేశారు. రషీద్, షాహిద్‌లకు పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ తో సంబంధాలున్నాయని, వారెదుర్కొంటున్న నేరారోపణలను రుజువు చేసేందుకు తమ విచారణకు పంపాలని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కోరడంతో కోర్టు అందుకు అనుమతిస్తూ నింది తులిద్దరికి పోలీస్ రిమాండ్‌కు పంపింది. -
డీడీటీడబ్ల్యూ సస్పెన్షన్‌తో ఆందోళనలు ఉధృతం
ఉట్నూర్, న్యూస్‌లైన్ : గిరిజనుల అభివృద్ధికి బాటలు వేసే ఇద్దరి అధికారుల మధ్య ముదిరిన విభేదాలు ఐటీడీఏను అస్తవ్యస్తంగా మార్చాయి. ఐటీడీఏ పీవో జనార్దన్‌కు, డీడీటీడబ్ల్యూ రషీద్‌కు మొదట నుంచి మనస్పర్థాలు ఉన్నాయని ప్రచారం ఉంది. రషీద్‌ను పీవో మూడు రోజుల క్రితం సస్పెండ్ చేయడంతో వివాదం ముదిరి పాకాన పడింది. పీవో చర్యలను నిరసిస్తూ ఐటీడీఏ సిబ్బంది ఆందోళన బాట పట్టారు. దీంతో ఐటీడీఏ సిబ్బంది లేక వెలవెల బోతోంది. పనుల నిమిత్తం వచ్చే గిరిజనులు, ఇతరులు వెనుదిరిగి పోతున్నారు. సమస్యలు పరిష్కరించకుం టే సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉ న్న తొమ్మిది ఐటీడీఏలలో ఆందోళన నిర్వహిస్తామని ట్రైబల్ వెల్ఫెర్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ గోపాల్, కార్యదర్శి లక్ష్మణ్ పేర్కొన్నారు. పరిస్థితి చేయిజారక ముందే ఉన్నతాధికారులు కలుగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. సఖ్యత లేదని ప్రచారం.. ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్‌కు డీడీటీడబ్ల్యూ రషీద్‌కు మొదటి నుంచే సఖ్యత లేదనే ప్రచారం ఐటీడీఏలో ఉంది. ఈ క్రమంలో పీవో నివాస్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ముక్కుసూటిగా వ్యవహరించడం, ఉద్యోగులను సస్పెండ్ చేయడం ఎవరికి మింగుడు పడటం లేదు. దాదాపు 30 మందికిపైగా ఉద్యోగులను సస్పెండ్, వంద మందికిపైగా ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రషీద్‌కు పీవోకు పడక పోవడంతో జూలై 31న అనారోగ్యం కారణం చూపుతూ రషీద్‌ను దీర్ఘకాలిక సెలవుపై పంపించారని ప్రచారం ఉంది. రషీద్ స్థానంలో అప్పటి ఏపీవో జనరల్ వెంకటేశ్వర్లు అదనపు బాధ్యతలు చేపట్టారు. అయన పదవీ విరమణతో ఏవో భీమ్ డీడీటీడబ్ల్యూగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అక్టోబర్ చివరి వారంలో గిరిజన సంక్షేమశాఖలో సుపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న నారాయణరెడ్డిని ఆశ్రమాలకు సరుకులు సకాలంలో సరఫరా చేయడం లేదని అక్టోబర్ 31న సస్పెండ్ చేశారు. ఇలా గిరిజన సంక్షేమ శాఖలో ఏం జరుగుతుందో తెలియక ఆ శాఖకు చెందిన ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. డీడీ విధుల్లో చేరడంతో.. అనారోగ్యం కారణంగా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన డీడీటీడబ్ల్యూ రషీద్ కమిషన్ కార్యాలయంలో విధులు నిర్వహించారు. వేతన చెల్లింపులో సాంకేతికలోపం ఏర్పడటంతో అయనను ప్రభుత్వం తిరిగి యథాస్థానికి పంపించింది. గత నెల 28న రషీద్ బాధ్యతలు స్వీకరించి ఈ నెల 5న విధుల్లో చేరారు. అప్పటికే డీటీఏఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు గిరిజన సంక్షేమశాఖలో విధులు నిర్వహిస్తూ సస్పెండైన ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోవాలని ఈ నెల 9 నుంచి ఐటీడీఏ ఎదుట రిలే దీక్షలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఐటీడీఏ పీవో అనారోగ్యం కారణంగా సెలవు పెట్టడంతో 13 నుంచి 16వ తేదీ వరకు రషీద్ ఇన్చార్జి పీవోగా వ్యవహరించారు. ఈ సమయంలో 15న డీటీఏఫ్ దీక్ష శిబిరాన్ని సందర్శించి సమస్యలు పరిష్కరిస్తామని దీక్ష విరమింపజేశారు. ఈ నేపథ్యంలోనే జీవో ఎంఎస్ నంబర్ 274 ప్రకారం రషీద్‌ను పీవో సస్పెండ్ చేశారు. డీడీటీడబ్ల్యూను సస్పెండ్ చేసే అధికారం ఐటీడీఏ పీవోకు లేకున్నా జీవో నంబర్ 274ను ఆధారంగా చూపుతూ సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. ఉద్యోగులంత ఏకమై ఆందోళన ఐటీడీఏ పీవో తీరును నిరసిస్తూ ఉద్యోగులు ఏకమయ్యారు. ఉద్యోగులను సస్పెండ్ చేయడం, షోకాజ్ నోటీసులు జారీచేయడం, నెలలు గడుస్తున్నా పోస్టింగ్‌లు ఇవ్వకుండా విచారణ పేరిట కాలయాపన చేయడంపై ఆందోళన బాట పట్టారు. డీడీటీడబ్ల్యూ, గజిటెడ్, నాన్‌గజిటెడ్, ఉపాధ్యాయుల సస్పెన్షన్లను ఎత్తి వేసి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెండు రోజుల నుంచి ఐటీడీఏ ఎదుట అందోళన నిర్వహిస్తున్నారు. పీవో కిందిస్థాయి ఉద్యోగులతో పనులు చేయిస్తూ గిరిజనుల అభివృద్ధికి బాటలు వేయాలి కాని ఇలా చేయడం సరికాదని వారు పేర్కొంటున్నారు. పీవో వైఖరి మార్చుకోకపోతే న్యాయం జరిగేంత వరకు ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు పేర్కొంటున్నారు. ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన బాట పట్టడంతో ఐటీడీఏ అస్తవ్యస్తంగా తయారైంది. గిరిజనుల అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది. -
వెంటాడుతున్న పీడ కల
ఖలీల్‌వాడి, న్యూస్‌లైన్ : ఆ దుర్ఘటనను ఒకసారి తలుచుకుంటే... నగరంలోని మాలపల్లికి చెం దిన నూర్జహాన్, రషీద్ కుటుంబం ముంబయిలోని హాజీ ఆలీ దర్గాను దర్శించుకునేందుకు వెళ్లిం ది. నాలుగు రోజుల అనంతరం తిరుగు ప్రయాణంలో భాగంగా ముంబయి రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. మరి కొద్ది క్షణాల్లో రెలైక్కబోతుం డగా, భయానకంగా కాల్పుల శబ్దాలు వినిపిం చాయి. బుల్లెట్లు దూసుకొచ్చాయి. ఒక్కొక్కరు గా నేలకొరుగుతున్నారు. ఈ క్రమంలోనే నూర్జహాన్ కూతురు అమీనా బేగం మెడలో బుల్లెట్లు దిగడంతో అక్కడికక్కడే కుప్పకూలి పోయింది. రషీద్ కాళ్లలోంచి రెండుమూడు బుల్లెట్లు చీల్చుకుంటూ వెళ్లాయి. ఇదంతా అక్క డే ఉన్న నూర్జహాన్ కళ్లెదుటే జరిగింది. రైల్వే స్టేషన్ ఆవరణలో భీతావాహ వాతావరణం... నూర్జహాన్ దిక్కులు పిక్కటిల్లేలా రోదించింది. స్పృహతప్పి పడిపోయింది. కొంత సేపటికి లేచి చూస్తే ఓ వైపు ప్రాణాలు విడిచిన కూతు రు, మరో వైపు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయస్థితిలో ఉన్న భర్త.. అతన్ని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది గానీ పది నెలల పాటు జీవచ్ఛవంలా పడి ఉన్నాడు. కూతురు పోయిన బాధ తో కుంగిపోయిన రషీద్ కొన్నాళ్లకు మరణించాడు. దీంతో నూర్జహాన్ కుటుంబ పరిస్థితి మరింత దీనావస్థకు చే రింది. ఈ ఘటనలో ఉగ్రవాది కసబ్‌కు ఉరి శిక్ష పడినప్పటికీ.. ఉగ్రవాదులు సృష్టించిన మారణ కాండకు నూర్జహాన్ కుటుంబం కోలుకోలేకపోయింది. మొదట్లో అధికారులు, ప్రజా ప్రతిని దులు ఎంతోకొంత సహాయం చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ఆదుకున్నవారు లేరు. ఐదేళ్లు గడుస్తున్నా నూర్జహాన్‌కు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు. కనీసం పింఛనుకు నోచుకోవడం లేదు.ఇప్పిటికైనా సర్కారు కరుణిస్తుందా! పట్టించుకునేదెవరు.. నా భర్త ఆటో నడిపి కు టుంబాన్ని పోషించేవా డు. కొడుకులు మెకాని క్ పనితో కుటుంబాన్ని సాదేవారు. కానీ ఇప్ప డు వారికి తగిన పనిలేక పొట్ట గడవని పరిస్థితు లు నెలకొన్నాయి. ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సా యం అందించలేదు. అప్పట్లో అన్నివిధాలా ఆ దుకుంటామన్నారు. కుటుంబంలో ఒకరికి ప్ర భుత్వ ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. ఇప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకుంట లేరు. - నూర్జహాన్, అమీనా తల్లి -
సీమాంధ్ర టీచర్లకు బదిలీలు?
కంఠేశ్వర్, న్యూస్‌లైన్ : ఎట్టకేలకు 610 జీఓపై కదలిక వచ్చింది. ఈ జీఓ అమలు పై రెండు రోజుల క్రితం విద్యాశాఖ ఉన్నత స్థాయిలో చర్చించి బదిలీలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో జిల్లాలో పనిచేస్తున్న సీమాంధ్ర జిల్లాలకు చెందిన వారు తిరిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితులు అనివార్యమయ్యాయి. గతంలో కొంతమంది టీచర్లు సీమాంధ్రకు వెళ్లిపోగా, మరికొందరు కోర్టు స్టేతో ఇక్కడే కొనసాగుతున్నారు. వీరికి ప్రస్తుతం బదిలీలు తప్పడంలేదు . జిల్లాలో 58మంది టీచర్లు...? జిల్లాలో 2,310 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 2.60 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి జిల్లాలో 10వేల మంది టీచర్లు బోధన చేస్తున్నారు. ఇందులో సీమాంధ్ర జిల్లాలకు చెందిన టీచర్లు 127 మంది వరకు ఉండేవారు. వీరిలో బదిలీపై వెళ్లిపోయినవారిని మినహాయిస్తే మరో 58మంది వర కు ఇక్కడే మిగిలిపోయినట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నా యి. 2001 సంవత్సరానికి ముందు ఓపెన్ కేటగిరిలో నియమితులైన టీచర్లు 30శాతం కాగా, ఆ తర్వాత ఓపెన్ కేటగిరిలో నియమితులైన టీచర్లు 20 శాతం మందికి బదిలీలు చేయాలని నిబంధనలు ఉన్నాయి. ఈ మేరకు బదిలీలు చేపట్టనున్నారు. ఇ దిలా ఉండగా జిల్లాలో 610 జీఓకు విరుద్ధంగా ఎంతమంది ఉపాధ్యాయులు కొనసాగుతున్నారో తదితర వివరాలపై నివేదికను విద్యాశాఖ ఈ నెల 26 లోపు పాఠశాల డెరైక్టర్‌కు పంపనున్నది. ఆదేశాలు అందాయి. -రషీద్, ఇన్చార్జి డీఈఓ 610 జీఓపై కోర్టు స్టేతో కొనసాగుతున్న టీచర్ల వివరాలను అందించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేశాం. ఈ నెల 26 లోపు వివరాలను పంపుతాము. దాని ప్రకారం బదిలీలు జరుగుతాయి.