వెంటాడుతున్న పీడ కల
ఖలీల్‌వాడి, న్యూస్‌లైన్ : ఆ దుర్ఘటనను ఒకసారి తలుచుకుంటే... నగరంలోని మాలపల్లికి చెం దిన నూర్జహాన్, రషీద్ కుటుంబం ముంబయిలోని హాజీ ఆలీ దర్గాను దర్శించుకునేందుకు వెళ్లిం ది. నాలుగు రోజుల అనంతరం తిరుగు ప్రయాణంలో భాగంగా ముంబయి రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. మరి కొద్ది క్షణాల్లో రెలైక్కబోతుం డగా, భయానకంగా కాల్పుల శబ్దాలు వినిపిం చాయి. బుల్లెట్లు దూసుకొచ్చాయి. ఒక్కొక్కరు గా నేలకొరుగుతున్నారు. ఈ క్రమంలోనే నూర్జహాన్ కూతురు అమీనా బేగం మెడలో బుల్లెట్లు దిగడంతో అక్కడికక్కడే కుప్పకూలి పోయింది. రషీద్ కాళ్లలోంచి రెండుమూడు బుల్లెట్లు చీల్చుకుంటూ వెళ్లాయి. ఇదంతా అక్క డే ఉన్న నూర్జహాన్ కళ్లెదుటే జరిగింది. రైల్వే స్టేషన్ ఆవరణలో భీతావాహ వాతావరణం... నూర్జహాన్ దిక్కులు పిక్కటిల్లేలా రోదించింది. స్పృహతప్పి పడిపోయింది.
కొంత సేపటికి లేచి చూస్తే ఓ వైపు ప్రాణాలు విడిచిన కూతు రు, మరో వైపు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయస్థితిలో ఉన్న భర్త.. అతన్ని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది గానీ పది నెలల పాటు జీవచ్ఛవంలా పడి ఉన్నాడు. కూతురు పోయిన బాధ తో కుంగిపోయిన రషీద్ కొన్నాళ్లకు మరణించాడు. దీంతో నూర్జహాన్ కుటుంబ పరిస్థితి మరింత దీనావస్థకు చే రింది. ఈ ఘటనలో ఉగ్రవాది కసబ్‌కు ఉరి శిక్ష పడినప్పటికీ.. ఉగ్రవాదులు సృష్టించిన మారణ కాండకు నూర్జహాన్ కుటుంబం కోలుకోలేకపోయింది. మొదట్లో అధికారులు, ప్రజా ప్రతిని దులు ఎంతోకొంత సహాయం చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ఆదుకున్నవారు లేరు. ఐదేళ్లు గడుస్తున్నా నూర్జహాన్‌కు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు. కనీసం పింఛనుకు నోచుకోవడం లేదు.ఇప్పిటికైనా సర్కారు కరుణిస్తుందా!
పట్టించుకునేదెవరు..
నా భర్త ఆటో నడిపి కు టుంబాన్ని పోషించేవా డు. కొడుకులు మెకాని క్ పనితో కుటుంబాన్ని సాదేవారు. కానీ ఇప్ప డు వారికి తగిన పనిలేక పొట్ట గడవని పరిస్థితు లు నెలకొన్నాయి. ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సా యం అందించలేదు. అప్పట్లో అన్నివిధాలా ఆ దుకుంటామన్నారు. కుటుంబంలో ఒకరికి ప్ర భుత్వ ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. ఇప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకుంట లేరు.
- నూర్జహాన్, అమీనా తల్లి