అనుమానాస్పద రేడియో సిగ్నళ్లు..ఉగ్రవాదుల పనే..? | Suspecious Radio Signals Identified In Westbengal | Sakshi
Sakshi News home page

వెస్ట్‌ బెంగాల్‌లో అనుమానాస్పద రేడియో సిగ్నళ్లు..ఉగ్రవాదుల పనే..?

Feb 9 2025 4:08 PM | Updated on Feb 9 2025 4:35 PM

Suspecious Radio Signals Identified In Westbengal

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ల్‌లో ఇటీవల అనుమానాస్పద రేడియో సంకేతాలను గుర్తించారు. ఇవి దేశంలో త్వరలో జరగబోయే ఉగ్రదాడులకు సంబంధించిన సంకేతాలేనని అమెచ్యూర్‌ హామ్‌ రేడియో సంస్థ అనుమానం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్‌ యాసలో ఉర్దూ,బెంగాలీ,అరబిక్‌ కోడ్‌ భాషల్లో అనుమానాస్పద రేడియో సిగ్నళ్లను గత రెండు నెలలుగా తమ ఆపరేటర్లు గుర్తించారని తెలిపింది.

పశ్చిమ బెంగాల్‌తో సరిహద్దులున్న బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు నెలకొనడం, ఇదే సమయంలో పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్‌ అధికారులు సన్నిహితంగా ఉండడం వంటి పరిస్థితుల నేపథ్యంలో అనుమానాస్పద రేడియో సిగ్నళ్లు ఆందోళన కలిగిస్తున్నాయి. మళ్లీ ఇటువంటి సిగ్నల్స్‌ వస్తే తమకు తెలియజేయాని రేడియో ఆపరేటర్లకు పోలీసులు సూచించారు.

గతేడాది డిసెంబర్‌లో  ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసిర్‌హట్,బొంగావ్,దక్షిణ 24 పరగణాల‌లోని సుందర్‌బన్స్ ప్రాంతాల నుంచిఉర్దూ, అరబిక్‌ భాషలను వాడి వివిధ కోడ్‌లలో మాట్లాడుకుంటున్నట్లు తాము గుర్తించినట్లు హామ్‌ రేడియో సంస్థ అధికారులు తెలిపారు. మరికొన్ని సార్లు ఇతర భాషల్లోనూ సిగ్నల్స్‌ అందుతున్నాయన్నారు.

అయితే, తాము తొలుత వీటిని పట్టించుకోలేదన్నారు.జనవరిలో జరిగిన గంగాసాగర్ మేళా సమయంలో వినియోగదారులు తమకు అనుమానాస్పద సంకేతాలు వినిపిస్తున్నాయని ఫిర్యాదు చేయడంతో వెంటనే అప్రమత్తమై కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.

ఈ కోడ్‌ భాష అర్థం తెలుసుకోవడానికి కోల్‌కతాలోని ఇంటర్నేషనల్ మానిటరింగ్ స్టేషన్ (రేడియో)కి సమాచారం పంపినట్లు బీఎస్‌ఎఫ్‌ అధికారి పేర్కొన్నారు. స్మగ్లర్లు,తీవ్రవాద గ్రూపులు రహస్య చర్చల కోసం ఇటువంటి సంకేతాలను వినియోగించుకుంటారన్నారు. వీటిని ట్రాక్‌ చేయడం కష్టమయినప్పటికీ డీకోడ్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 

2002-03లో కూడా ఇదే విధంగా వచ్చిన అనుమానాస్పద సంకేతాలను ట్రాక్‌ చేసి దక్షిణ 24 పరగణాల జిల్లాలోని గంగాసాగర్ ప్రాంతం నుంచి అక్రమ రేడియో స్టేషన్లను నిర్వహిస్తున్న ఆరుగురు తీవ్రవాదులను అదుపులోకి తీసుకున్నామన్నారు.2017లో బసిర్‌హట్‌లో మత ఘర్షణలు జరగడానికి ముందు హామ్ రేడియో వినియోగదారులు తమకు అనుమానాస్పద సంకేతాలను వినిపిస్తున్నాయని తెలిపినట్లు చెప్పారు. హామ్ రేడియో దేశ భద్రత విషయంలో అనేకసార్లు కీలక పాత్ర పోషించిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement