west beangal
-
‘మహా కుంభ్‌కాదు.. మృత్యుకుంభ్’ : దీదీ
కోల్‌కతా : పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం ‘మహాకుంభ మేళా’ను (Maha Kumbha Mela) మహా కుంభ్ కాదు.. మృత్యుకుంభ్ అని వ్యాఖ్యానించారు.పశ్చిమబెంగాల్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ అసెంబ్లీలో మమతా బెనర్జీ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై స్పందించారు. ‘కుంభమేళాకు వెళ్లి భక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు.. యూపీ సర్కార్ వీఐపీల కోసమే ఏర్పాట్లు చేసింది. సామాన్యుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు.నేను మహా కుంభమేళాను గంగామాతకు గౌరవ సూచికంగా భావిస్తున్నాను. కానీ పేదలకు కనీస సదుపాయాలు లేవు. వీఐపీల కోసం మాత్రమే ఏర్పాట్లు చేశారు. తొక్కిసలాటలో మరణించిన బాధిత కుటుంబాలకు ఇప్పటి వరకు ఎలాంటి ఎక్స్‌గ్రేషియా అందలేదు. పోస్ట్‌మార్టం చేయకుండా మృతదేహాల్ని వారి కుటుంబాలకు అప్పగించారు. పోస్టుమార్టం చేసి, డెత్ సర్టిఫికెట్ జారీ చేస్తేనే కదా ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియా అందేది. బాధిత కుటుంబాలు ఇప్పుడు ఎక్స్ గ్రేషియా ఎలా పొందుతారు’ అని ప్రశ్నించారు. కాగా, ప్రయాగ్‌రాజ్‌లో (Prayag Raj) జనవరి 13 ప్రారంభమైన మహాకుంభ మేళా 45 రోజులపాటు అంటే ఫిబ్రవరి 26వరకు కొనసాగనుంది. -
ప్రొఫెసర్ సుమనా.. ఒక ట్రాన్స్జండర్ విజయ గాథ
ట్రాన్స్‌జండర్లు తమ జీవితంలో లెక్కలేనన్న అవమానాలను ఎదుర్కొంటుంటారు. అయితే వీటిని అధిగమించి, కష్టనష్టాలను దిగమింగుకుంటూ, అత్యున్నత స్థానానికి చేరుకున్నవారు కూడా ఉన్నారు. ఇలాంటివారు ఈ తరహా వ్యక్తులకే కాకుండా అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తుంటారు. అలాంటివారిలో ఒకరే సుమనా ప్రామాణిక్. నేడు అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయికి ఎదిగిన ఆమె ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు.పశ్చిమబెంగాల్‌కు చెందిన ట్రాన్స్ జండర్ సుమనా ప్రామాణిక్ తన కలను సాకారం చేసుకున్నారు. ఇటీవలే రాష్ట్రప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షల్లో విజయం సాధించిన సుమనా అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యే అర్హతను దక్కించుకున్నారు. త్వరలోనే ఆమె ఏదో ఒక యూనివర్శిటీలో లేదా కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకం అందుకోనున్నారు. సుమనా తన చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ టీచర్ కావాలని కలలుగనేవారు.సుమనా 2019లో స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(సెట్)కు హాజరయ్యారు. అప్పుడు ఆమె ఆ పరీక్షలో విజయం సాధించలేకపోయారు. అయితే ఈ ఏడాది నిర్వహంచిన సెట్ పరీక్షలో ఆమె విజయం దక్కించుకున్నారు. ట్రాన్స్‌జండర్లు కొన్ని పనులకు మాత్రమే అర్హులనే భావన తప్పని, వారు ఏ రంగంలోనైనా రాణించగలరని సుమనా నిరూపించారు. సుమనా గతంలో అధ్యాపక వృత్తి చేపట్టాలని ప్రయత్నించినప్పుడు పలు వ్యతిరేకతలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆమె వాటన్నింటికీ సమాధానం చెప్పారు.సుమానా అత్యంత బీదకుటుంబంలో జన్మించారు. బాల్యంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఆరేళ్ల వయసులోనే ఆమె అనాథాశ్రమానికి చేరుకున్నారు. అక్కడ ఉంటూనే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. తరువాత కృష్ణాకాలేజీలో డిగ్రీ చేశారు. అనంతరం కల్యాణీ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వర్థమాన్ యూనివర్శిటీలో బీఈడీ కూడా పూర్తిచేశారు. ఈ సమయంలో సుమనా విద్యార్థులకు ట్యూషన్లు చెబుతూ వచ్చారు. ఒక కౌన్సిలర్ అందించిన ధైర్యంతో సుమనా చదువులో ముందడుగు వేశారు. ఐదేళ్ల కృషి అనంతరం సుమనా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా మారి, తన కలను సాకారం చేసుకున్నారు. ఇది కూడా చదవండి: పెళ్లి వేడుకల్లోకి చిరుత.. బంధించే పనిలో అటవీ సిబ్బంది -
అనుమానాస్పద రేడియో సిగ్నళ్లు..ఉగ్రవాదుల పనే..?
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ల్లో ఇటీవల అనుమానాస్పద రేడియో సంకేతాలను గుర్తించారు. ఇవి దేశంలో త్వరలో జరగబోయే ఉగ్రదాడులకు సంబంధించిన సంకేతాలేనని అమెచ్యూర్ హామ్ రేడియో సంస్థ అనుమానం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ యాసలో ఉర్దూ,బెంగాలీ,అరబిక్ కోడ్ భాషల్లో అనుమానాస్పద రేడియో సిగ్నళ్లను గత రెండు నెలలుగా తమ ఆపరేటర్లు గుర్తించారని తెలిపింది.పశ్చిమ బెంగాల్‌తో సరిహద్దులున్న బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు నెలకొనడం, ఇదే సమయంలో పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ అధికారులు సన్నిహితంగా ఉండడం వంటి పరిస్థితుల నేపథ్యంలో అనుమానాస్పద రేడియో సిగ్నళ్లు ఆందోళన కలిగిస్తున్నాయి. మళ్లీ ఇటువంటి సిగ్నల్స్ వస్తే తమకు తెలియజేయాని రేడియో ఆపరేటర్లకు పోలీసులు సూచించారు.గతేడాది డిసెంబర్లో ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసిర్హట్,బొంగావ్,దక్షిణ 24 పరగణాలలోని సుందర్బన్స్ ప్రాంతాల నుంచిఉర్దూ, అరబిక్ భాషలను వాడి వివిధ కోడ్లలో మాట్లాడుకుంటున్నట్లు తాము గుర్తించినట్లు హామ్ రేడియో సంస్థ అధికారులు తెలిపారు. మరికొన్ని సార్లు ఇతర భాషల్లోనూ సిగ్నల్స్ అందుతున్నాయన్నారు.అయితే, తాము తొలుత వీటిని పట్టించుకోలేదన్నారు.జనవరిలో జరిగిన గంగాసాగర్ మేళా సమయంలో వినియోగదారులు తమకు అనుమానాస్పద సంకేతాలు వినిపిస్తున్నాయని ఫిర్యాదు చేయడంతో వెంటనే అప్రమత్తమై కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.ఈ కోడ్ భాష అర్థం తెలుసుకోవడానికి కోల్‌కతాలోని ఇంటర్నేషనల్ మానిటరింగ్ స్టేషన్ (రేడియో)కి సమాచారం పంపినట్లు బీఎస్ఎఫ్ అధికారి పేర్కొన్నారు. స్మగ్లర్లు,తీవ్రవాద గ్రూపులు రహస్య చర్చల కోసం ఇటువంటి సంకేతాలను వినియోగించుకుంటారన్నారు. వీటిని ట్రాక్ చేయడం కష్టమయినప్పటికీ డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 2002-03లో కూడా ఇదే విధంగా వచ్చిన అనుమానాస్పద సంకేతాలను ట్రాక్ చేసి దక్షిణ 24 పరగణాల జిల్లాలోని గంగాసాగర్ ప్రాంతం నుంచి అక్రమ రేడియో స్టేషన్లను నిర్వహిస్తున్న ఆరుగురు తీవ్రవాదులను అదుపులోకి తీసుకున్నామన్నారు.2017లో బసిర్‌హట్‌లో మత ఘర్షణలు జరగడానికి ముందు హామ్ రేడియో వినియోగదారులు తమకు అనుమానాస్పద సంకేతాలను వినిపిస్తున్నాయని తెలిపినట్లు చెప్పారు. హామ్ రేడియో దేశ భద్రత విషయంలో అనేకసార్లు కీలక పాత్ర పోషించిందన్నారు. -
బెంగాల్ మాజీ మంత్రికి భవిష్యత్ బెయిల్!
న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం ఒక బెయిల్ కేసులో వినూత్న పోకడకు శ్రీకారం చుట్టింది. బెయిల్‌కు ముందు పూర్తిచేయాల్సిన విధివిధానాలపై కిందికోర్టు సంతృప్తి చెందితే వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటోతేదీ లోపు మాజీ మంత్రి పార్థా ఛటర్జీని షరతులతో కూడిన బెయిల్‌పై విడుదల చేయాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం కింది కోర్టుకు వినూత్న ఉత్తర్వులు జారీచేసింది. సాధారణంగా ఏదైనా కేసులో ఇరువైపులా వాదనలు విన్నాక బెయిల్‌కు అవకాశం ఉంటే వెంటనే బెయిల్ ఉత్తర్వులు ఇస్తారుగానీ ఇలా కొద్దిరోజుల తర్వాతనే బెయిల్‌పై విడుదల చేయాలని సూచించడం ఇదే తొలిసారి అని కోర్టు వర్గాలు పేర్కొన్నాయి. నగదుకు ఉద్యోగం కుంభకోణంలో 2022 జూలై 22న అరెస్టయి ఇన్నాళ్లుగా విచారణ ఖైదీగా జైళ్లో గడుపుతున్న పశ్చిమబెంగాల్ మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత పార్థా ఛటర్జీ బెయిల్ కేసులో విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వినూత్న ఉత్తర్వులు జారీచేసింది. #SupremeCourt to shortly pronounce judgment on the #bail plea of former West Bengal Education Minister and now MLA #ParthaChatterjee in the money laundering case arising out of the West Bengal cash-for-jobs scamBench: Justices Surya Kant and Ujjal Bhuyan pic.twitter.com/IB9mOBSFHI— Live Law (@LiveLawIndia) December 13, 2024‘‘జనవరి రెండో, మూడో, నాలుగో వారా ల్లో సాక్షుల వాంగ్మూలాలతోపాటు నేరాభి యోగాల సమర్పణ ట్రయల్ కోర్టులో పూ ర్తవ్వాలి. ఇదంతా పూర్తయితే ఫిబ్రవరి ఒకటి లోపు ఆయనకు బెయిల్ ఇవ్వండి’’ అని జడ్జి సూర్యకాంత్ తీర్పు రాశారు. భవిష్యత్ బెయిల్‌గా అభివర్ణించిన ఈ కేసులో ఫిబ్రవరిలో కూడా ఆయన బెయిల్‌పై బయటికొచ్చే అవకాశం లేకపోవడం గమనార్హం. ఈ కుంభకోణానికి సంబంధించిన వేరే కేసుల్లోనూ ఆయనను ఈడీ, సీబీఐ అరెస్ట్ చేయడమే ఇందుకు కారణం. మనీలాండరింగ్, ఇతర అక్ర మాల కోణాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)లు పలు ఎఫ్ఐఆర్లు నమోదుచేసి విచారిస్తున్నాయి. ఈయనపై ఈడీ 3, సీబీఐ 5 కేసులను నమోదు చేశాయి. అరెస్ట్ సమయంలో మంత్రిగా ఉన్నా రన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్న ఛటర్జీ తరఫు లాయర్ల వాదనను కోర్టు తప్పుబట్టింది. ‘‘ఎవరైనా నిందితుడు మంత్రి వంటి పదవులు, హోదాల్లో ఉన్నంత మాత్రాన వారికి బెయిల్ ఇచ్చే విషయంలో ప్రత్యేక మినహాయింపులు అంటూ ఏవీ ఉండవు’’ అని ధర్మాసనం స్పష్టంచేసింది. -
దుర్గాపూజ మండపంలో కలకలం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని మెటియాబ్రూజ్ ప్రాంతంలో దుర్గాపూజ సందర్భంగా కలకలం చెలరేగింది. పశ్చిమ బెంగాల్ బీజేపీ సోషల్ మీడియా సైట్ ‘ఎక్స్’లో ఈ ఉదంతానికి సంబంధించిన పోస్ట్‌ను షేర్ చేసింది.ఆ పోస్ట్‌లోని వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని మెటియాబ్రూజ్‌లోని బెంగాలీ హిందువులు దుర్గాపూజ చేస్తున్నారు. ఇంతలో కలకలం నెలకొంది. పూజలో భాగంగా శంఖం ఊదుతుండగా, సీఎం మమతా బెనర్జీ మద్దతుదారులు మండపంలోకి ప్రవేశించి, వేడుకలను వెంటనే ఆపకపోతే, అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తామని బెదిరించారని బీజేపీ ఆరోపించింది. వెంటనే బీజేపీ నేతలు తాము నమాజ్ జరుగుతున్నప్పుడు స్పీకర్ ఆపివేస్తామని తెలిపారు. కాగా ఈ ఘటనపై ‘న్యూ బెంగాల్ స్పోర్టింగ్ క్లబ్’ పోలీసులకు ఫిర్యాదు చేసింది.బెంగాల్ బీజేపీ ఈ ఫిర్యాదు లేఖను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దుర్గామండపంలోకి 50 మంది బలవంతంగా ప్రవేశించారని, వారు మహిళలను కూడా దూషించారని బీజేపీ ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా బీజేపీ షేర్ చేసింది. నిందితులపై వెంటనే కఠిన చర్యలు చేపట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. Disturbing scenes have emerged from West Bengal, in KMC Ward 133, Metiaburuz, where Bengali Hindus were celebrating Durga Puja. This year, many of the Tithis occurred in the morning, which led to the sound of Dhaks and conch shells being heard earlier in the day.This angered a… pic.twitter.com/h8JYHCBYX8— BJP West Bengal (@BJP4Bengal) October 11, 2024ఇది కూడా చదవండి: అంబరాన్నంటుతున్న దసరా సంబరాలు -
కోల్‌కతా: విధుల్లో చేరిన జూనియర్ డాక్టర్లు
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీకర్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ హత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దారుణ ఘటన నేపథ్యంలో బెంగాల్లో జూనియర్ డాక్టర్లు సమ్మె ద్వారా తమ నిరసనలు కొనసాగించిన విషయం తెలిసిందే. అయితే.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో జరిపిన చర్చల అనంతరం 42 రోజుల విరామం తర్వాత జూనియర్ డాక్టర్లు బెంగాల్ వ్యాప్తంగా శనివారం తిరిగి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా అత్యవసర వైద్య సేవల్లో విధులు నిర్వహిస్తామని జూనియర్ డాక్టర్లు వెల్లడించారు. ఇక.. తమ డిమాండ్లలో కొన్నింటికి సీఎం మమత ప్రభుత్వం అంగీకరించడంతో ఇవాళ విధుల్లోకి చేరినట్లు పేర్కొన్నారు. కానీ, ఔట్ పేషెంట్ విభాగానికి సంబంధించిన జూనియర్ డాక్టర్లు ఇంకా విధుల్లో చేరలేదు.చదవండి: కోల్‌కతా డాక్టర్ కేసు: కుట్ర కోణంలో సీబీ‘ఐ’ దర్యాప్తు!‘‘ఈరోజు తిరిగి విధుల్లో చేరడం ప్రారంభించాం. జూనియర్ ఈ ఉదయం నుంచి అవసరమైన, అత్యవసర సేవలకు సంబంధించిన విభాగాల్లో తిరిగి సేవలు ప్రారంభించారు.కానీ ఔట్ పేషెంట్ విభాగాల్లో ఇంకా చేరలేదు. ఇది పాక్షికంగా విధులను ప్రారంభించడం మాత్రమే. నా తోటి ఉద్యోగులు ఇప్పటికే రాష్ట్రంలోని వరద బాధిత జిల్లాలకు బయలుదేరారు. అక్కడ ప్రజారోగ్యం పట్ల తమ నిబద్ధతను ప్రదర్శించడానికి ‘అభయ క్లినిక్‌లు’(వైద్య శిబిరాలు) ప్రారంభిస్తారు’’ అని సమ్మె చేసిన డాక్టర్లలో ఒకరైన అనికేత్ మహతో తెలిపారు.బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జూనియర్ డాక్టర్ల మధ్య ఇటీవల కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జూడాల డిమాండ్లకు దీదీ అంగీకరించారు. తమ డిమాండ్లలో అధిక శాతానికి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో శనివారం నుంచి పాక్షికంగా విధులకు హాజరుకావాలని జూనియర్ వైద్యులు నిర్ణయించారు. అయితే.. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని అత్యవసర, తప్పనిసరి సేవల విభాగాల్లో మాత్రమే తాము విధుల్లో పాల్గొంటామని ప్రకటించారు. కానీ, అవుట్ పేషంట్ విభాగాల్లో మాత్రం విధులు చేపట్టబోమని స్పష్టం చేశారు. చదవండి: కోల్‌కతా కేసు.. సందీప్ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దు -
కోల్‌కతా: ఈడీ దాడుల్లో సందీప్ ఘోష్ లగ్జరీ బంగ్లా గుర్తింపు!
కోల్‌కతా:కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాట ఆయన బంధువుల నివాసాలు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం సోదాలు చేశారు. ఈ సోదాల్లో పలు కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు సందీప్ ఘోష్‌కు సంబంధించిన ఓ లగ్జరీ రెండతస్తుల ఇంటిని ఈడీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. సౌత్ 24 పరగణాల జిల్లాలోని ఇంటి ప్రాపర్టీ సందీప్ ఘోష్, ఆయన భార్య సంగీతకు చెందినదిగా ఈడీ వర్గాలు పేర్కొంటున్నాయి.ఈడీ గుర్తించిన లగ్జరీ బంగ్లా చుట్టూ వందల ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ‘‘సంగీతసందీప్ విల్లా’’ అనే నేమ్‌ప్లేట్‌ను కలిగి ఉన్న ఈ బిల్డింగ్ సందీప్ ఘోష్, ఆయన భార్య సంగీత పేరు మీద ఉన్నట్లు తెలుస్తోంది. ఇక.. ఆ బంగ్లాను ‘డాక్టర్ బాబు’ ఇల్లు అని పిలుస్తామని.. సందీప్ ఘోష్ తరచూ కుటుంబంతో ఇక్కడికి వస్తారని స్థానికులు చెబుతున్నారు. డాక్టర్ సందీప్ ఘోష్ సూచనల మేరకు ఈ ప్రాంతంలో అనేక ఫామ్ హౌస్‌లు నిర్మించారని, భూములను కూడా కొనుగోలు చేసినట్లు ఈడీ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. మొత్తం 9 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు కోల్‌కతా జాతీయ వైద్య కళాశాలలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ప్రసూన్ ఛటోపాధ్యాయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.డాక్టర్ కేసు విచారణను సీబీఐకి బదిలీ చేసిన కోల్కత్తా హైకోర్టు.. సందీప్ ఘోష్‌పై అవినీతి ఆరోపణల కేసు దర్యాప్తును సైతం సీబీఐకే అప్పజెప్పింది. ఈ క్రమంలో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సందీప్ ఘోష్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఆయన అభ్యర్ధనను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు మరో ముగ్గురు నిందితులకు కోల్‌కతా కోర్టు ఇటీవల ఎనిమిది రోజల సీబీఐ కస్టడీ విధించింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో సందీప్ ఘోషతో పాటు, మరో ముగ్గురు నిందితులు బిప్లవ్ సింఘా, సుమన్ హజ్రా, అఫ్సర్ అలీ ఖాన్‌లను సోమవారం రాత్రి సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
కోల్‌కతా ఘటన: సందీప్ ఘోష్ పాత్రపై కొత్త ఆరోపణ!
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీ కర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆర్జీ కర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ఘోష్‌పై బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ తాజాగా తీవ్రమైన ఆరోపణలు చేశారు. మరుసటి హత్యాచారం జరిగిన సెమినార్ హాల్ వద్ద మరమత్తు పనులు జరిపించాలని సందీప్ ఘోష్ ఆదేశాలు జారీచేశారని అన్నారు. దానికి సంబంధించిన ఓ ఆర్డర్ లెటర్‌ను సైతం విడుదల చేశారాయన.‘‘ఆగస్ట్ 10వ తేదీన ఈ ఆర్డర్‌పై ఆర్జీ కర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ సంతకం చేశారు. అంటే కేవలం జూనియర్ డాక్టర్ మృతిచెందిన మరుసటి రోజే. ఈ ఆర్డర్‌ను పరిశీలిస్తే.. మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. క్రైం సీన్లోని ఆధారాలను తారుమారు చేశారని ఇప్పటికే ఆర్జీ కర్ ఆస్పత్రిలోని డాక్టర్లు, నిరసన తెలిపే వైద్య సిబ్బంది ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను మాత్రం పోలీసులు కమిషనర్ ఖండించారు’’అని తెలిపారు.‘‘ ఆర్జీ కర్ హాస్పిటల్‌లోని వివిధ విభాగాలలో ఆన్-డ్యూటీ డాక్టర్ల గదులు, ప్రత్యేక అటాచ్డ్ టాయిలెట్లలో మరమత్తు పనులు చేయవల్సిందిగా కోరుతున్నా. రెసిడెంట్స్ డాక్టర్ల డిమాండ్ మేరకు అవసరమైన పనులుచేయండి’’ అని సందీప్ ఘోష్ పీడబ్ల్యూడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు రాసిన లేఖలో ఉండటం గమనార్హం.మరోవైపు..మృతురాలి తల్లిదండ్రులు రాష్ట్ర పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసును అణిచివేసేందుకు పోలీసులు తమకు లంచం ఇవ్వాలని చూశారని ఆరోపించారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని, సమగ్ర దర్యాప్తు లేకుండా కేసును మూసివేయడానికి యత్నించారని మండిపడ్డారు. -
కోల్‌కతా వైద్యురాలి కేసు: సీఎం మమతకు ప్రియాంకా గాంధీ విజ్ఞప్తి
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ దారుణంపై జూనియర్ వైద్యులు, నర్సులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఈ నిరసనలతో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజీనామా చేశారు. తాజాగా ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమని అన్నారు. ఇది హృదయవిదారకమైన ఘటనగా అభివర్ణించారు. ఈ కేసు దర్యాఫ్తును వేగవంతం చేసి, నిందితులను కఠినంగా శిక్షించాలని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి విజ్ఞప్తి చేశారు. నిందితులను కఠినంగా శిక్షించినప్పుడే మృతురాలి కుటుంబానికి, వైద్య సిబ్బందికి న్యాయం జరుగుతుందని అన్నారు. మహిళలు పని చేసే ప్రదేశంలో భద్రత అనేది పెద్ద సమస్యగా మారిందని వాపోయారు. మహిళల భద్రత కోసం తీవ్రమైన కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.कोलकाता के आरजी कर मेडिकल कॉलेज में ट्रेनी डॉक्टर के साथ दुष्कर्म और हत्या की घटना दिल दहलाने वाली है। कार्यस्थल पर महिलाओं की सुरक्षा देश में बहुत बड़ा मुद्दा है और इसके लिए ठोस प्रयास की जरूरत है। मेरी राज्य सरकार से अपील है कि इस मामले में त्वरित और सख्त से सख्त कार्रवाई…— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 12, 2024చదవండి: కోల్‌కతా వైద్యురాలి కేసు.. పోలీసులకు చుక్కలు చూపిస్తున్న నిందితుడు -
ప్రధాని మోదీ సినిమా ఫ్లాప్.. కల్యాణ్ బెనర్జీ విమర్శలు
కోల్‌కతా: ప్రధాని నరేంద్ర మోదీ తన పదేళ్ల పాలనను ట్రైలర్ అంటున్నారని కానీ సినిమా అంతా ఫ్లాప్ అయిందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఎద్దేవా చేశారు. ప్రజలకు హామీలు ఇచ్చి.. నెరవేర్చకుండా కేవలం అబద్ధాలు చెప్పే వ్యక్తి ప్రధాని మోదీ అని మండిపడ్డారు. కల్యాణ్ బెనర్జీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ‘బేటీ బచావో, బేటీ పడావో ప్రచారంలో భాగంగా వేల కోట్ల రూపాయల నిధులను కేంద్ర కేటాయిస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ప్రచారం పేరుతో ఎక్కడెక్కడ ఎంత ఖర్చు చేశారో మాకు జాబితా అందించండి. 2014 నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెబుతున్నారు. గత పదేళ్ల పాలనలో ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి. మోదీ అబద్ధాలు చెప్పే వ్యక్తి. ఆయన ఒక నకిలీ నటుడు. ప్రజలు నకిలీ నటుడు మోదీకి, బీజేపీ ఓటు వేయొద్దు. ప్రధాని మోదీ ట్రైలర్లో ఫెయిల్ అయ్యారు. సినిమా కూడా సక్సెస్ కాబోదు. మోదీ ఇక గుజరాత్ వెళ్లిపోతారు. మార్కెట్లో మోదీ సినిమా ఎక్కవ కాలం పని చేయదు. విదేశాలకు వెళ్లి కరచాలనాలు చేసే నకిలీ నటుడికి ప్రజలు అస్సలు ఓటువేయొద్దు’ అని ఎంపీ కల్యాణ్ బెనర్జీ అన్నారు. ఇక.. జనవరిలో జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భారీగా ఎంపీలను సస్పెండ్ చేసిన విషయంలో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మణ్ జగదీప్ ధన్‌ఖడ్ తీరును ఎంపీ కల్యాణ్ బెనర్జీ అనుకరించి వివాదాస్పదమైన విషయం తెలిసిందే. -
ఒకే డ్రెస్ ఎన్ని రోజులేసుకుంటాం.. ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు
కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల తేదీలను ప్రకటించింది. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరికా ఘోష్ (TMC MP Sagarika Ghose) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికలను సత్యం గెలిచే తరుణంగా ఆమె అభివర్ణించారు. "ఈ ఎన్నికలు ఎందుకు అవసరం? ఈ ఎన్నికలు మనకు సత్యాన్ని గెలిపించే క్షణాలు. ఒక పార్టీకి, ఒక నాయకుడికి, ఒకే భాషకు, ఒకే మతానికి, ఒకే దుస్తులకు కట్టుబడి ఉందామా? లేదా మన సమాఖ్య, భిన్న విశ్వాసాలు, బహుళ సాంస్కృతిక వైవిధ్యమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామా?" అని ఆమె ప్రజలను ప్రశ్నించారు. "మన ప్రాథమిక స్వేచ్ఛకు ముప్పు ఉన్న కాలంలోనే జీవించాలనుకుంటున్నారా? గుర్తుంచుకోండి.. తెలివిగా ఓటు వేయండి" అంటూ ఆమె ఓటర్లకు పిలుపునిచ్చారు. కాగా, దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలకు సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో జరుగుతాయని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. జూన్ 4న కౌంటింగ్ నిర్వహించనున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 స్థానాల్లో ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. Why are the #GeneralElections2024 important ? This is a moment of truth for us. Do we want to live under a one-leader-one-party-one-religion-one-language rule? Or do we want to preserve our multi faith multi cultural multi party democracy? Remember that and vote well & vote… pic.twitter.com/FPsJhmGV48 — Sagarika Ghose (@sagarikaghose) March 17, 2024 -
బిష్ణుపూర్ లోక్‌సభ బరిలో విచిత్ర పోరు
2024 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచి బరిలోకి దిగే తమ 42 మంది అభ్యర్థుల పేర్లను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రకటించింది. ఈ నేపధ్యంలో ఇక్కడి బిష్ణుపూర్ స్థానం చర్చనీయాంశంగా మారింది. విడాకులు తీసుకున్న ఒక జంట ఈ సీటు నుంచి పరస్పరం పోటీకి దిగడం ఆసక్తికరంగా మారింది. బంకురా జిల్లాలోని బిష్ణుపూర్ లోక్‌సభ స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ సౌమిత్రా ఖాన్‌కు బీజేపీ టిక్కెట్ కేటాయించింది. అదే స్థానం నుండి అతని మాజీ భార్య సుజాత మండల్‌కు టీఎంసీ టికెట్ ఇచ్చింది. రాష్ట్రంలో 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సౌమిత్రా ఖాన్, సుజాత మండల్ విడిపోయారు. ఆ సమయంలో సుజాత మండల్ తృణమూల్ కాంగ్రెస్‌లో ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు సౌమిత్ర ఖాన్ టీఎంసీ నుండి బీజెపీలో చేరారు. టీఎంసీ లోక్‌సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించడంతో కాంగ్రెస్‌తో పొత్తుపై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియకు ముందు ఏ సమయంలోనైనా కూటమి ఏర్పడవచ్చని అన్నారు. కాగా పశ్చిమ బెంగాల్‌లోని 42 లోక్‌సభ స్థానాల్లో ఆరుగురు ముస్లిం అభ్యర్థులకు టీఎంసీ టిక్కెట్లు ఇచ్చింది. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన మెగా ర్యాలీలో టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ, మోదీ హామీకి ఎలాంటి వారెంటీ లేదని వ్యాఖ్యానించారు. -
‘సందేశ్‌ఖాలీ’ ప్రధాన నిందితుడు షాజహాన్ షేక్ అరెస్ట్!
పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో చోటుచేసుకున్న హింసాకాండ ఘటన ప్రధాన నిందితుడు, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత షాజహాన్ షేక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో షాజహాన్ షేక్‌ను ప్రత్యేక పోలీసు బృందం బుధవారం అర్ధరాత్రి అరెస్టు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. టీఎంసీ నేత షాజహాన్ షేక్ 55 రోజులుగా పరారీలో ఉన్నాడు. ఈ నేపధ్యంలో షాజహాన్ షేక్ కార్యకలాపాలపై పోలీసుల బృందం నిఘా పెట్టిందని అధికారులు తెలిపారు. షాజహాన్ షేక్‌ను పోలీసులు బసిర్హత్ కోర్టుకు తరలించారు. జనవరి 5న సందేశ్‌ఖాలీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు జరిపింది. రేషన్ పంపిణీ కుంభకోణంపై దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు షేక్ ఇంటిపై దాడి చేశారు. ఆ తరువాత షాజహాన్ షేక్ పరారయ్యాడు. ఈ నేపధ్యంలో షేక్‌తోపాటు అతని మద్దతుదారులు స్థానికుల భూమిని ఆక్రమించారని, మహిళలను లైంగికంగా వేధిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వెంటనే షేక్‌ను అరెస్టు చేయాలంటూ సందేశ్‌ఖాలీ ప్రాంతంలో పలువురు నిరసనలు చేపట్టారు. -
‘మమత అక్క కాదు.. గయ్యాళి అత్త’
పశ్చిమ బెంగాల్లో సందేశ్‌ఖాలీ ఘటన వెలుగు చూసినప్పటి నుంచి మమత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఉద్యమించాయి. అయితే రాష్ట్రంలోని శాంతియుత వాతావరణాన్ని బీజేపీ చెడగొట్టిందని అధికార పార్టీ ఆరోపిస్తోంది. ఇప్పుడు బెంగాల్ రాజకీయాలన్నీ సందేశ్‌ఖాలీ చుట్టూ తిరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ బీజేపీ సీనియర్ నేత శుభేందు అధికారి మరోసారి బెంగాల్ ముఖ్యమంత్రిని టార్గెట్ చేశారు. మమతా బెనర్జీ ఇప్పుడు అక్క(దీదీ) కాదని, గయ్యాళి అత్తగా మారిపోయారని ఆరోపించారు. ఇకపై మమతా బెనర్జీని ‘దీదీ’ అని పిలవడం మానేయాలని అన్నారు. ఇది అత్త, మేనల్లుడి ప్రభుత్వమని ఆరోపించారు. దీదీ అనే పేరులో మానవత్వం స్ఫురిస్తుందని, అయితే మమతా బెనర్జీలో క్రూరత్వం ప్రతిబింబిస్తోందని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఆమెను ఓడించానని, అందుకే తనపై 42 కేసులు పెట్టారని శుభేందు అధికారి ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణ జిల్లాలో ఉన్న సందేశ్‌ఖాలీ గ్రామం నిరసనలకు సాక్షిగా మారింది. ఈ ప్రాంతానికి చెందిన మహిళలు ఇటీవల టీఎంసీ నేత షాజహాన్ షేక్‌తో పాటు ఇతర నేతలు తమ భూములను స్వాధీనం చేసుకున్నారని, లైంగిక దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ నేపధ్యంలోనే ఈ ప్రాంతం నిరసనలకు నిలయంగా మారింది. -
లోక్ సభలో నోరు మెదపని ఎంపీలు వీరే..
దేశంలోని ఓటర్లు తమ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తారని ఎంపీలను పార్లమెంట్‌కు పంపిస్తారు. అయితే దీనికి విరుద్దంగా ప్రవర్తించిన ఎంపీలు కూడా ఉన్నారు. ఎంపీల ఐదేళ్ల పదవీకాలం ముగియనుండడంతో త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. 17వ లోక్‌సభలో వివిధ పార్టీలకు చెందిన తొమ్మిది మంది ఎంపీలు తమ పదవీ కాలంలో ఒక్కసారి కూడా సభలో మాట్లాడనేలేదు. లోక్‌సభ సెక్రటేరియట్ నుండి అందిన సమాచారం ప్రకారం ఈ ఎంపీలలో అమితమైన ప్రజాదరణ పొందినవారు కూడా ఉన్నారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సన్నీ డియోల్, శతృఘ్న సిన్హా సభలో ఒక్కమాట కూడా మాట్లాడలేదు. మరోవైపు పార్లమెంటు కార్యకలాపాల్లో పాల్గొనని నేతల వర్గంలో శత్రుఘ్న సిన్హా చేరారు. శత్రుఘ్న సిన్హా ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ నియోజకవర్గానికి చెందిన ఎంపీ. గతంలో శత్రుఘ్న సిన్హా పట్నా సాహిబ్ లోక్‌సభ స్థానానికి ఎంపీగా ఉన్నారు. బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ పార్లమెంటులో ఒక్కసారి కూడా ఎటువంటి అంశాన్ని లేవనెత్తలేదు. అదేవిధంగా కర్ణాటకలోని బీజాపూర్ స్థానానికి చెందిన బీజేపీ ఎంపి రమేష్ చంద్రప్ప జిగజినాగి కూడా ఎప్పుడూ సభలో మాట్లాడలేదు. ఉత్తరప్రదేశ్‌లోని ఘోసీ నియోజకవర్గం ఎంపీ అతుల్ రాయ్ కూడా ఈ జాబితాలోనే ఉన్నారు. -
Mamata Banerjee: జమిలి ఎన్నికలను అంగీకరించం
కోల్‌కతా: ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ విధానాన్ని తాము అంగీకరించబోమని టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. మన దేశ సమాఖ్య నిర్మాణం ప్రకారం ’ఒక దేశం– ఒకే ఎన్నిక’ ఆలోచన ఆచరణ సాధ్యం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. జమిలి ఎన్నికల విధానం అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ కార్యదర్శి డాక్టర్ నితేన్ చంద్రకు ఈ మేరకు మమతా బెనర్జీ లేఖ రాశారు. ఈ అంశాన్ని హేతుబద్ధతతో పరిశీలించాలని ఆమె ఎన్నిల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. ‘జమిలి ఎన్నికల యోచన సమాఖ్య నిర్మాణ కోణంలో చూస్తే సాధ్యం కాదు, ఆమోద యోగ్యం కాదు. సరైన విధానం కూడా కాదు. అందుకే, నేను ఈ విధానాన్ని ఆచరణాత్మక కోణంలో అంగీకరించను. ఈ అంశాన్ని చాలా చాలా హేతుబద్ధంగా ప్రత్యేకంగా పరిశీలించాలని కూడా భారత ఎన్నికల కమిషన్‌ను కోరుతున్నాను’అని ఆమె గురువారం సెక్రటేరియట్ వద్ద విలేకరుల సమావేశంలో అన్నారు. ‘ఇది కేవలం టీఎంసీ అభిప్రాయం మాత్రమే కాదు, ఇండియా కూటమి పార్టీలది కూడా. ఈ యోచనను పరిశీలించేటప్పుడు కేంద్ర, రాష్ట్ర విధానాలు, కేంద్రం, రాష్ట్ర నిర్మాణాలు వంటి వాటిని కూడా చూడాలి’అని ఆమె పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ జమిలి ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు తెలపాలంటూ రాజకీయ పార్టీలకు లేఖలు రాసిన విషయం తెలిసిందే. -
ఇటుక బట్టీలో భారీ పేలుడు.. నలుగురు మృతి!
పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణా జిల్లాలోని ఒక ఇటుక బట్టీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో చిమ్నీ కూలిపోయి నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో 25 మందికి పైగా కూలీలు గాయపడ్డారు. ఈ ఘటనపై ఫోరెన్సిక్ విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన బసిర్‌హత్‌లోని ధాల్టితా గ్రామంలో చోటుచేసుకున్నదని పోలీసులు తెలిపారు. ఇటుక బట్టీలో పొయ్యి మండుతుండగా పేలుడు సంభవించిందని చెబుతున్నారు. ఈ విషయమై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ప్రమాదంలో గాయపడిన వారంతా ఇటుక బట్టీ కార్మికులేనని తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా, శిథిలాల కింద ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోందని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం భారీ పేలుడు థాటికి ఇటుక బట్టీలోని చిమ్నీ పూర్తిగా కూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. కాగా ఈ పేలుడు వెనుక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: కిడ్నీ దానంతో భర్త ప్రాణాలు కాపాడిన భార్య! -
దుర్గామాతకు పానీపూరీల అలంకరణ.. ఎక్కడంటే?
కోల్‌కతాలో జరిగే దుర్గా పూజలలో భక్తుల సృజనాత్మకత కనిపిస్తుంటుంది. ఈసారి నగర దక్షిణ శివారు బెహలాలోని ఒక దుర్గామండపం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ మండపం అందంలో మాత్రమే కాదు రుచిలో కూడా పోటీ పడుతోంది. బెహలా నోటున్ దాల్ క్లబ్ ఏర్పాటు చేసిన ఈప్రత్యేక దుర్గా మండపం అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మండపాన్ని పానీపూరీలతో అలకంరించారు. దీనిని గోల్గప్ప అని కూడా అంటారు. చాలామందికి ఇష్టమైన ఈ స్ట్రీట్ ఫుడ్‌తో దుర్గాపూజను ముడిపెట్టడాన్ని పలువురు ఎంజాయ్ చేస్తున్నారు. వ్యాపార దిగ్గజం హర్ష్ గోయెంకా ఈ దుర్గామండపం క్లిప్‌ను షేర్ చేశారు. ఇది కూడా చదవండి: కశ్మీర్ శక్తిపీఠంలో నవరాత్రులు Kolkata's Durga Puja pandals: where phuchka (panipuri) meets divine architecture, a truly heavenly combination! 🙌🏛️ pic.twitter.com/Ytz6a0Aafy — Harsh Goenka (@hvgoenka) October 16, 2023 -
ఏ రాష్ట్రంలో బిచ్చగాళ్లు అధికం? మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఏమిటి?
ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలో ఉపాధి మార్గాలు లేక వేలాది మంది అల్లాడిపోతున్నారు. ఈ నేపధ్యంలోనే చాలామంది వీధుల్లో, ఇతర రద్దీ ప్రదేశాలలో భిక్షాటనకు దిగుతున్నారు. తద్వారా వారు రెండు పూటలా కడుపు నింపుకుంటున్నారు. భారతదేశంలో కూడా బిచ్చగాళ్ల సంఖ్య అత్యధికం. పలు నగరాల్లో సిగ్నల్స్ దగ్గర, మాల్స్ వెలుపల కూడా బిచ్చగాళ్లు కనిపిస్తారు అయితే దేశంలో ఎక్కువ మంది బిచ్చగాళ్లు ఏ రాష్ట్రంలో ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో సుమారు 4 లక్షల మంది భిక్షాటన చేస్తూ తమ కుటుంబాలను పోషిస్తున్నారు. ఇవి ప్రభుత్వం చెబుతున్న గణాంకాలు. వాస్తవంగా దీనిని మించిన సంఖ్యలో బిచ్చగాళ్లు ఉండవచ్చు. ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం అత్యధికంగా యాచకులు కలిగిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఈ రాష్ట్రంలో బిచ్చగాళ్ల సంఖ్య 81 వేలకు పైగానే ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో మొత్తం 4 లక్షల 13 వేల మంది యాచకులు ఉండగా, వీరిలో రెండు లక్షల మందికి పైగా పురుషులు, దాదాపు రెండు లక్షల మంది మహిళలున్నారు. దీంతోపాటు చిన్నారులు కూడా యాచక వృత్తిలో కొనసాగుతున్నారు. పశ్చిమ బెంగాల్ తర్వాత ఉత్తరప్రదేశ్‌లో 65 వేలకు పైగా యాచకులు ఉన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లు ఉన్నాయి. చండీగఢ్‌లో 121 మంది యాచకులు మాత్రమే ఉన్నారు. దేశంలో అత్యల్పంగా బిచ్చగాళ్లు ఉన్న ప్రాంతం విషయానికొస్తే లక్షద్వీప్‌లో కేవలం ఇద్దరు బిచ్చగాళ్లు మాత్రమే ఉన్నారు. ఇది కాకుండా దాదర్ నగర్ హవేలీలో 19 మంది, డామన్-డయ్యూలో 22 మంది యాచకులు ఉన్నారు. అయితే ఈ సంఖ్య ఖచ్చితమైమనది కాదు. ఎందుకంటే ప్రభుత్వం 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ఆధారంగా ఈ గణాంకాలను ఉన్నాయి. ఇది కూడా చదవండి: ఆంటీ ల్యాప్‌టాప్ ఇవ్వకపోతేనేం.. చిట్టితల్లి ఏం చేసిందో చూడండి! -
ఒడిశా రైలు ప్రమాదం: బాధితులకు రూ. 2000 నోట్లు!
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో వందలమంది ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున పరిహారం ప్రకటించారు. దీనికితోడు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ పార్టీ టీఎంసీ తరపున బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత్ మజూమ్దార్ మాట్లాడుతూ బెంగాల్‌కు చెందిన ఒక మంత్రి మృతుల కుటుంబాలకు రూ .2 లక్షలు పంపిణీ చేశారని, అయితే అవన్నీ రూ. 2000 నోట్లు అని ఆరోపించారు. ఆయన ఒక వీడియోను ట్వీట్ చేశారు. దానిలో ఇద్దరు మహిళలు చాపమీద కూర్చుని ఉండగా, ఒక మహిళ కుర్చీలో కూర్చున్న దృశ్యం కనిపిస్తోంది. ఆ ముగ్గురు మహిళలు రూ. 2000 నోట్లతో కూడిన బండిల్ పట్టుకుని కనిపిస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన సదరు బీజేపీ నేత... బ్లాక్ మనీని వైట్ మనీ చేసేందుకు టీఎంసీ ఈ పని చేయడం లేదు కదా? అని ప్రశ్నించారు. మమతా బెనర్జీ ఆదేశాలకు అనుగుణంగా తృణమూల్ పార్టీ తరపున రూ. 2 లక్షల సాయం అందిస్తున్నారు. ఇది మంచి విషయమే. కానీ ఈ రూ. 2000 నోట్ల కట్టలు ఎక్కడి నుంచి వచ్చాయన్నారు. ప్రస్తుతం మార్కెట్లో రూ. 2000 నోట్ల చలామణి తక్కువగా ఉన్నదని, బ్యాంకులలో వీటిని మార్చుకునే ప్రక్రియ జరుగుతున్నదని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబాలకు రూ. 2000 నోట్లు ఇవ్వడం వలన వారికి ఇబ్బందిగా మారుతుందన్నారు. నల్ల ధనాన్ని తెల్ల ధనంగా మార్చేందుకే ఇలా చేస్తున్నారా? అని ప్రశ్నించారు. అయితే దీనిపై వెంటనే స్పందించిన టీఎంసీ నేత కుణాల్ ఘోష్ మాట్లాడుతూ బీజేపీ నేత సుకాంత్ మజూమ్దార్ చేసిన ఆరోపణలు నిరాధారమన్నారు. రూ. 2000 నోటు మారకంలో లేనిదా? అని ప్రశ్నస్తూ, వారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇదేమీ అక్రమం కాదు. ఎవరైనా రూ. 2000 నోటు ఇస్తే అదేమీ నల్ల ధనం అయిపోదని అన్నారు. రైలు ప్రమాద బాధితులకు రూ. 2000 నోటు పంపిణీ చేసిన ఉదంతం పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాలోని బసంతీలో చోటుచేసుకుంది. టీఏంసీ నేత బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా అందరినీ కలచివేసింది. ఈ ఘటనలో ఇప్పటివరకూ 288 మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి: 40 మృతదేహాలపై కనిపించని గాయాలు মমতা বন্দ্যোপাধ্যায়ের নির্দেশে তৃণমূল দলের পক্ষ থেকে নিহতদের পরিবারকে 2 লক্ষ টাকার আর্থিক সাহায্য করছেন রাজ্যের একজন মন্ত্রী। সাধুবাদ জানাই। কিন্তু এপ্রসঙ্গে এই প্রশ্নটাও রাখছি, একসাথে 2000 টাকার নোটে 2 লক্ষ টাকার বান্ডিলের উৎস কি? pic.twitter.com/TlisMituGG — Dr. Sukanta Majumdar (@DrSukantaBJP) June 6, 2023 -
2001లో కేవలం రూ.6,300.. 2022లో కోట్లకు చేరిన మంత్రి సంపద..
కోల్‌కతా: బెంగాల్ మాజీ మంత్రి పార్థ చటర్జీని టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్రేట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన సన్నిహితురాలు, నటి అర్పిత ముఖర్జీ నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు ఇప్పటివరకు మొత్తం రూ.50కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇన్ని కోట్లున్న మాజీ మంత్రి వద్ద పదేళ్ల క్రితం కేవలం రూ.6,300 ఉన్నాయంటే నమ్మగలరా? 2011 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్థ చటర్జీ సమర్పించిన అఫిడవిట్లో ఆయన వద్ద రూ.6,300 నగదు మాత్రమే ఉందని పేర్కొన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఈ మొత్తం 23 రెట్లు పెరిగింది. ఈసారి అఫిడవిట్లో తన వద్ద రూ.1,48,676 నగదు ఉన్నట్లు ఆయన తెలిపారు. కానీ ఇప్పుడు అవినీతి కేసులో మంత్రి సన్నిహితుల ఇంట్లో కోట్ల రూపాయలు లభించడం రాజకీయంగా కలకలం రేపింది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించడమే కాకుండా పార్టీలోని అని పదవుల నుంచి తప్పించింది. ఇంకా పార్థ చటర్జీ, ఆయన సన్నిహితులకు సంబంధించిన నివాసాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు. మరోవైపు ఆయన మాత్రం తనపై కుట్ర చేస్తున్నారని అంటున్నారు. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందనడం గమానార్హం. చదవండి: ఐదేళ్లుగా నమ్మకంగా ఉంటున్నాడని ఇంటి తాళమిచ్చిన యజమాని.. రూ.10కోట్లతో చెక్కేసిన వ్యక్తి -
మిథున్ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీతో టచ్‌లో టీఎంసీ ఎమ్మెల్యేలు!
కోల్‌కతా: నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వెస్ట్ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ పార్టీ టీఎంసీకి చెందిన 38 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. వీరిలో 21 మంది నేరుగా తనతోనే మాట్లాడుతున్నారని చెప్పారు. టీఎంసీ మంత్రి పార్థ చటర్జీ అరెస్టు తర్వాత ఆ పార్టీలో తుఫాన్ చెలరేగిందని, ఇదే బిగ్ బ్రేకింగ్ అన్నారు. ఈమేరకు మీడియా సమావేశంలో మాట్లాడారు. దీంతో మిథున్ చక్రవర్తి వ్యాఖ్యలు బెంగాల్లో కలకలం రేపుతున్నాయి. బెంగాల్ టీచర్ల రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో పార్థ చటర్జీ అరెస్టుపై మాట్లాడుతూ.. ఆయన తప్పు చేయకపోతే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని మిథున్ పేర్కొన్నారు. ఒకవేళ తప్పు చేస్తే మాత్రం ఎవరూ ఆయన్ను కాపాడలేరని స్పష్టం చేశారు. ఇది రూ.2000కోట్ల భారీ కుంభకోణం అని ఆరోపించారు. అలాగే బీజేపీ ముస్లిం వ్యతిరేక పార్టీనా? అనే అంశంపైనా ఆయన స్పందించారు. ప్రస్తుతం దేశంలో అతిపెద్ద సూపర్స్టార్లు అయిన సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్లు ముస్లింలే అని చెప్పారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు ఆదరించడం వల్లే తను నటుడిగా ఈ స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు. బీజేపీ 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని అక్కడ కూడా వాళ్ల సినిమాలకు భారీ కలెక్షన్లు వస్తున్నట్లు వివరించారు. ఒకవేళ బీజేపీ వాళ్లను ద్వేషిస్తే ఇది సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. గతేడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు మిథున్ చక్రవర్తి. మమతా బెనర్జీ కచ్చితంగా ఓడిపోతుందని అప్పుడు వ్యాఖ్యానించారు. కానీ ఎన్నికల్లో టీఎంసీ భారీ మెజార్టీతో గెలిచింది. బీజేపీ 70 పైచిలుకు స్థానాలతో సరిపెట్టుకుంది. చదవండి: శివసేన నుంచి మరో సీఎం వస్తారు.. బీజేపీ మాట తప్పడం వల్లే ఎంవీఏ పుట్టింది -
తెలుగు టైటాన్స్, బెంగాల్ వారియర్స్ మ్యాచ్ ‘టై’
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌ను తెలుగు టైటాన్స్ జట్టు 32–32 స్కోరుతో ‘టై’ చేసుకుంది. ఈ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌కిది నాలుగో ‘టై’ కావడం గమనార్హం. టైటాన్స్ తరఫున అంకిత్ తొమ్మిది పాయింట్లు, రజనీశ్ ఏడు పాయింట్లు స్కోరు చేశారు. బెంగాల్ తరఫున మణీందర్ అత్యధికంగా 11 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 36–31తో గుజరాత్ జెయింట్స్ జట్టును ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో హరియాణా స్టీలర్స్; యు ముంబాతో పట్నా పైరేట్స్ తలపడతాయి. చదవండి: ఆర్సీబీ కెప్టెన్‌గా జాసన్ హోల్డర్.. రాయుడుతో పాటు.. రూ. 27 కోట్లతో భారీ స్కెచ్..! -
మానవత్వం చచ్చిపోయింది.. రష్మి గౌతమ్ ఎమోషనల్ కామెంట్
బుల్లితెరపై యాంకర్ రష్మీ గౌతమ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందచందాలతో పాటు తనదైన మాటతీరుతో ప్రస్తుతం టాప్ యాకర్స్‌లో ఒకరుగా కొనసాగుతుంది. బుల్లితెరపైనే కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తుంది ఈ అందాల యాంకరమ్మ. గుంటూరు టాకీస్ మూవీతో హీరోయిన్గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీ అయింది. కెరీర్ పరంగా ఎంత బిజీ ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేయడంతో పాటు సమాజంలో చోటు చేసుకుంటున్న ఘటనలపై రియాక్ట్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా జంతువులపై దాడి చేసే ఘటనలపై.. వాటికి హాని కలిగించే విషయాలపై ఎప్పటికప్పుడు రష్మీ స్పందిస్తుంటుంది. అలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా వెంటనే వాటిని సోషల్ మీడియా వేదికగా ఖండిస్తుంది. తాజాగా మరోసారి అలాంటి ఓ పోస్ట్ పెడుతూ ఎమోషనల్ అయింది రష్మి. ఇటీవల దీపావళి సంబరాల్లో పశ్చిమబెంగాల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సంబరాల్లో భాగంగా కొందరు ఆకతాయిలు.. ఓ వీధి కుక్క తోకకు టపాసులు కట్టి పేల్చేశారు. దీంతో ఆ కుక్కకు తీవ్రగాయాలవడంతో పాటు తోక తెగిపోయింది. ఇది గమనించిన చుట్టుపక్కల జనం కుక్కను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ప్రస్తుతం ఆ కుక్క సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం. సోషల్ మీడియా ద్వారా ఈ విచారకరమైన వార్త తెలుసుకున్న రష్మి.. ఆ ఘటన పై తనదైన స్టైల్లో స్పందిస్తూ.. ‘మానవత్వం చచ్చిపోయింది. అలాంటి మనుషులకు ఈ భూమిపై బతికే హక్కు లేదు’ అంటూ విరుచుకుపడింది. రష్మిక పోస్ట్ చూసిన నెటిజన్స్ సైతం.. ఆ ఆకతాయిలను కఠినంగా శిక్షించాలని కామెంట్స్ చేస్తున్నారు. -
సువేందును భయపెడుతున్న ఆ 24 మంది..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో కాషాయ పార్టీకి షాకుల మీద షాకుల తగులుతున్నాయి. బీజేపీ తరఫున గెలిచిన ముకుల్ రాయ్ తృణమూల్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. ఆయన బాటలో మరి కొందరు పయణించే అవకాశం ఉందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యేలందరు తమతోనే ఉన్నారని నిరూపించుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు గండి పడింది. బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి, గవర్నర్ భేటీకి పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఈ సంఘటనతో మరికొందరు బీజేపీ ఎమ్మెల్యేలు టీఎంసీలోకి తిరుగుపయనం కానున్నారనే వార్తలకు బలం చేకూరినట్లయ్యింది. సువేందు అధికారి సోమవారం సాయంత్రం గవర్నర్ జగ్దీప్ ధన్కర్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అనుచిత సంఘటనలు, వాటి పరిణామాలతో పాటు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో బీజేపీకి చెందిన 24 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరుకాలేదు. దాంతో వారంతా తిరిగి టీఎంసీలో చేరతారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఎన్నికలకు కొన్ని నెలల ముందు పార్టీలోకి వచ్చిన సువేందుకు ప్రతిపక్ష నేత పదవి కట్టబెట్టడాన్ని పలువురు నేతలు జీర్ణించుకోలకపోతున్నారు. సువేందు నాయకత్వాన్ని అంగీకరించడానికి వారు సుముఖంగా లేరు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే ముకుల్ రాయ్ టీఎంసీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన బాటలోనే మరికొందరు బీజేపీని వీడి తృణమూల్‌లో చేరతారని భావిస్తున్నారు. 30 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ టీఎంసీ ప్రకటించడం గమనార్హం. చదవండి: ముకుల్‌రాయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి -
విషాదం: ప్రముఖ కవి, డైరెక్టర్ కన్నుమూత
కోల్‌కతా: ప్రముఖ కవి, చిత్ర దర్శకుడు బుద్ధదేవ్ దాస్‌గుప్తా (77) కన్నుమూశారు. కిడ్నీ వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన కోల్‌కతాలోని తన నివాసంలో గురువారం తుదిశ్వాస విడిచారు. రెండుసార్లు జాతీయ అవార్డు గ్రహీత బుద్ధదేబ్ దాస్‌గుప్తా మృతిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి, సహచరులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇంకా పలువురు పరిశ్రమ పెద్దలు, అభిమానులతోపాటు, నిర్మాత, రాజ్ చక్రవర్తి తదితరులు దాస్‌గుప్తా మరణంపై సంతాపం తెలిపారు. మోండో మేయర్ ఉపఖ్యాన్, కాల్‌పురుష్ వంటి చిత్రాల్లో దాస్‌గుప్తాతో కలిసి పనిచేసిన నటి సుదీప్తా చక్రవర్తి కూడా దాస్‌గుప్తా మరణంపై విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ప్రముఖ సమకాలీన బెంగాలీ చిత్రనిర్మాతలు సత్యజిత్ రే, ఘటక్ తర్వాత అంతర్జాతీయ సినిమా వేదికలపై ప్రముఖంగా నిలిచిన గొప్ప భారతీయ దర్శకుడంటూ ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. 1980,90 దశకాల్లో ప్రముఖ దర్శకులు గౌతమ్ ఘోష్, అపర్ణ సేన్లతో కలిసి బెంగాల్లో సమాంతర సినిమా ఉద్యమానికి నాంది పలికారు దాస్‌గుప్తా. దూరత్వా (1978), గ్రిహజుద్ధ (1982) ఆంధీ గాలి (1984) బెంగాల్‌లోని నక్సలైట్ ఉద్యమం, బెంగాలీల చైతన్యంపై దాని ప్రభావం ప్రధాన అంశాలుగావచ్చిన గొప్ప సినిమాలు. బాస్ బహదూర్, తహదర్ కథ, చారచార్, ఉత్తరా వంటి చిత్రాల ద్వారా దాస్‌గుప్తా మంచి పేరు తెచ్చుకున్నారు. ఉత్తరా (2000), స్వాప్నర్ దిన్ (2005) చిత్రాలకు రెండుసార్లు ఉత్తమ దర్శకత్వానికి జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకున్నారు. గోవిర్ అరలే, కాఫిన్ కింబా సూట్‌కేస్, హిమ్జోగ్, చాటా కహిని, రోబోటర్ గాన్, శ్రేష్ట కబితలతో సహా పలు కవితా రచనలు చేశారు. 2019ay పశ్చిమ బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (డబ్ల్యుబిఎఫ్‌జెఎ) బుద్ధదేవ్ దాస్‌గుప్తాకు దివంగత సత్యజిత్ రే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేశారు. Saddened at the passing away of eminent filmmaker Buddhadeb Dasgupta. Through his works, he infused lyricism into the language of cinema. His death comes as a great loss for the film fraternity. Condolences to his family, colleagues and admirers — Mamata Banerjee (@MamataOfficial) June 10, 2021 Recipient of numerous National and International honours, legendary filmmaker and renowned poet, #BuddhadebDasgupta has passed away. Sincere condolences to his family and friends. pic.twitter.com/8F5N2yXGZT — Raj chakrabarty (@iamrajchoco) June 10, 2021 Poet and Filmmaker Buddhadeb Dasgupta is no more. In the post Ray-Ghatak era,he was one of the most celebrated and valued Indian(nd Bengali)Filmmaker in the International Diaspora.I've n fortunate enuf 2 hv wrkd in 2 of his films #MondoMeyerUpakhyan and #Kalpurush .... — Sudiptaa Chakraborty (@SudiptaaC) June 10, 2021 -
Covid: దేశంలోనే తొలి మహిళగా నిలిచిన జ్యోత్స్న బోస్
కోల్‌కతా: కోవిడ్ ఎందరినో బలి తీసుకుంది. ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. రూపు మార్చుకుంటూ.. ఆనవాలు చిక్కకుండా జనాలను అంతం చేస్తుంది. వైరస్ సోకిన వారిలో ఎలాంటి మార్పలు చోటు చేసుకుంటున్నాయి.. ఏ అవయవాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలియాలి అంటే.. మహమ్మారి బారిన పడి మరణించిన వారి శరీరాన్ని పూర్తి స్థాయిలో పరీక్షించాలి. కానీ మన దగ్గర చాలా మంది చనిపోయిన వారి శరీరాలను ఇలాంటి ప్రయోగాలకు ఇవ్వడానికి ఒప్పుకోరు. ఈ క్రమంలో కోల్‌కతాకు చెందిన 93 సవంత్సరాల వృద్ధురాలు వైద్య పరిశోధనల కోసం తన శరీరాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చారు. దేశంలో కరోనాపై వైద్య పరిశోధనల కోసం శరీరాన్నీ దానం చేసిన తొలి మహిళగా నిలిచారు. ఇక ఆమె మృతదేహం మీద కరోనా వల్ల మానవ శరీరంలో కలిగే ప్రభావాలను గుర్చి అధ్యయనం చేశారు. ఆ వివరాలు.. పశ్చిమబెంగాల్‌కు చెందిన ట్రేడ్ యూనియన్ నాయకురాలు జ్యోత్స్న బోస్(93) కొద్ది రోజుల క్రితం కోవిడ్‌తో మరణించారు. అయితే పదేళ్ల క్రితమే ఆమె మరణించిన తర్వాత తన శరీరాన్ని రాయ్ ఆర్గనైజేషన్‌కు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఆమె కోవిడ్‌తో మరణించారు. ఇక ఆమె నిర్ణయం మేరకు కుటుంబ సభ్యులు జ్యోత్స్నా బోస్ శరీరాన్ని వైద్య పరిశోధనల కోసం ఆర్జీకార్ మెడికల్ కాలేజీకి అప్పగించారు. ఈ సందర్భంగా ఆమె మనవరాలు, పాథాలజీలో ఎండీ చేస్తున్న డాక్టర్ టిస్టా బసు మాట్లాడుతూ.. ‘‘కోవిడ్ బారిన పడిన మా నానమ్మను ఈ నెల 14న ఉత్తర కోల్‌కతాలోని బెలియాఘాట ప్రాంతంలోని ఆసుపత్రిలో చేర్పించామని, రెండు రోజుల తరువాత ఆమె మరణించారు. ఇక మా నానమ్మ నిర్ణయం మేరకు ఆమె మృతదేహానికి ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో పాథలాజికల్ శవ పరీక్షలు నిర్వహించారు. కరోనా వైరస్ కొత్త వ్యాధి.. దీని గురించి నేటికి కూడా మనకు పూర్తిగా తెలియదు. అవయవాలు, అవయవ వ్యవస్థలపై దాని పూర్తి ప్రభావాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ అన్వేషణలో పాథలాజికల్ శవపరీక్షలు మాకు సహాయపడతాయి’’ అని తెలిపారు. లాభాపేక్షలేని సంస్థ 'గందర్‌పాన్' విడుదల చేసిన ఒక ప్రకటనలో, వైద్య పరిశోధనల నిమిత్తం కోవిడ్ వల్ల మరణించిన అనంతరం తమ శరీరాలను ఇచ్చిన వారిలో బోస్ దాని వ్యవస్థాపకుడు బ్రోజో రాయ్ మొదటి వ్యక్తి కాగా.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన జ్యోత్స్న బోస్ రెండవ వ్యక్తిగా నిలిచారు. కోవిడ్‌తో మరణించిన ఆమె శరీరంపై నిర్వహించిన రోగలక్షణ శవపరీక్షను ఇక్కడ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించారు. కరోనా బారిన పడి మరణించిన మరో నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ బిస్వాజిత్ చక్రవర్తి అవశేషాలు కూడా ఇదే ప్రయోజనం కోసం విరాళంగా ఇవ్వబడ్డాయి. తద్వారా అతను రాష్ట్రంలో మూడవ వ్యక్తిగా నిలిచాడు. -
‘దీదీ భయపడింది.. అందుకే ఆ నిర్ణయం’
కోల్‌కతా: మరి కొద్ది రోజుల్లో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీ, టీఎంసీ ఢీ అంటే ఢీ అన్నట్లు ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ వేడి రాజేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం బీజేపీ కుచ్‌బిహార్‌లో ‘‘పరివర్తన్ యాత్ర’’ ప్రారంభించింది. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా అమిత్ షా బెంగాల్లో త్వరలోనే హింసా కాండను అంతం చేసి.. అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. బెంగాల్లో జై శ్రీ రామ్ అంటే నేరం చేసినట్లు చూస్తారేందుకు అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘బెంగాల్లో ప్రస్తుతం ఎలాంటి వాతావరణం ఉందంటే.. జై శ్రీ రామ్ అంటే ఇక్కడ నేరం చేసినట్లు భావిస్తారు. మమత దీదీని ఒక్కటే అడుగుతున్నాను.. జై శ్రీరాం నినాదాలు భారత్‌లో కాక పాక్‌లో ప్రతిధ్వనిస్తాయా’’ అని అమిత్ షా ప్రశ్నించారు. దీదీ భయపడింది.. అందుకే రెండు చోట్ల పోటీ ‘‘రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ.. మమత, ఆమె మేనల్లుడి హింసా కాండకు చరమగీతం పాడనుంది. ప్రారంభంలో మాకు బెంగాల్లో గుడ్డి సున్నా వచ్చింది.. కానీ మేం భయపడలేదు.. పోరాడాం. ఇప్పుడు 18 స్థానాల్లో విజయం సాధించాం. ఈ సారి ఎన్నికల్లో దీదీకి సున్నా అనుభవం ఎదురుకానుంది. ప్రస్తుతం దీదీ చాలా భయపడుతున్నారు. ఎక్కడ నుంచి పోటీ చేయాలో ఆమెకు అర్థం కావడం లేదు. ఓటమి భయంతో రెండు చోట్ల బరిలో నిల్చున్నారు’’ అని అమిత్ షా ఎద్దేవా చేశారు. చదవండి: మమత మాత్రమే మిగులుతారు! ఇప్పుడు చెప్పండి..ఎవరు అగౌరపరిచారో : అమిత్ షా -
కాపురంలో పొలిటికల్ చిచ్చు; స్పందించిన సుజాత
కోల్కత్తా : పశ్చిమ బెంగాల్లో భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టిన పొలిటికల్ డ్రామా ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం విడాకుల వరకు దారితీసింది. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు సౌమిత్రా ఖాన్ భార్య సుజాతా మండల్ ఖాన్ సోమవారం తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. తన భార్య సుజాతా ఖాన్ పార్టీ మారడంపై స్పందించిన భర్త సౌమిత్రా ఖాన్ ఆమె పార్టీ మారినందుకు తమ పదేళ్ల వివాహిక బంధాన్ని తెంపేసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. త్వరలోనే విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంటానని, ఇక ముందు తన భార్య తన ఇంటి పేరును వాడుకోరాదని తేల్చి చెప్పారు. ఇదిలా ఉండగా మరో నాలుగు నెలల్లో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్ననేపథ్యంలో భార్యాభర్తల పొలిటికల్ డ్రామా చర్చనీయాంశంగా మారింది. తాజాగా భర్త నిర్ణయంపై సుజాత స్పందించి మంగళవారం మీడియా ముందుకు వచ్చారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసిన ఓ పార్టీయే (బీజేపీ) నాకు విడాకులివ్వాలని నా భర్తను కోరుతోంది అని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను పార్టీ మారినందుకే నా భర్త విడాకులు ఇస్తానని అంటున్నాడు. ఇందుకు ఆయనను బీజేపీ నేతలే రెచ్ఛగొడుతున్నారు. వారిలో ఒక్కరైనా ఆయనను ఎందుకు అడ్డుకోవడంలేదు. ఇది మంచిది కాదని ఆయనకు ఎందుకు నచ్ఛజెప్పడంలేదు. కానీ నేను ఆయన్ను ఇంకా ప్రేమిస్తున్నాను’. అని పేర్కొన్నారు. అయితే పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన రాజకీయ పార్టీలు మాత్రం ఈ విషయంపై నోరుమెదపకుండా జరుతున్న తతంగాన్ని చూస్తూ కూర్చున్నాయి. చదవండి: మాటల యుద్ధం.. ఆ దమ్ముందా: ప్రశాంత్ కాగా బెంగాల్‌లోని బిష్ణూపూర్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన సౌమిత్రా ఖాన్ భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భర్తను గెలిపించుకునేందుకు ఎంతో కష్టపడినప్పటికీ బీజేపీలో తనకు తగిన గుర్తింపు రాకపోవడంతో తాను పార్టీ మారాల్సి వచ్చిందని సుజాతా మండల్ ఖాన్ ఆరోపించారు. ఎప్పటి నుంచో పార్టీకి విధేయంగా పని చేస్తున్న తమ లాంటి వారికి కాకుండా ఇటీవల పార్టీలో చేరిన అవినీతి పరులకు గుర్తింపు ఇస్తుండడంతో విధిలేని పరిస్థితుల్లో తాను పార్టీ మారానని ఆమె వివరించారు. ఇప్పటికీ బీజేపీలో కొనసాగుతోన్న ఆమె భర్త గురించి ప్రశ్నించగా, అది ఆయన ఇష్టమని, ఏదోరోజున వాస్తవాలను గుర్తించి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరినా చేరిపోవచ్చని ఆమె చెప్పారు. -
వివాదాస్పద వీడియో.. మధు పూర్ణిమపై కేసు
కోల్‌కతా : సామాజిక మాధ్యమంలో వివాదాస్పద వీడియోను పోస్ట్ చేసినందుకు సామాజిక కార్యకర్త మధు పూర్ణిమా కిష్వార్‌పై కేసు నమోదైంది. బంగ్లాదేశ్‌లో జరిగిన ఓ మత ర్యాలీని కోల్‌కతాలో జరిగినట్టు ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఆమెపై కోల్కత్తా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మధు పూర్ణిమా పోస్ట్ చేసిన వీడియోలో ఉండే గీతం బంగ్లాదేశ్‌కు చెందిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఆమె పోస్ట్ చేసిన వీడియోలో బంగ్లాదేశ్ జాతీయ పతాకం స్పష్టం కనిపిస్తోందన్నారు. ఎక్కడో జరిగిన సంఘటనను కోల్‌కతాలో జరిగిందని చూపి శాంతి, భద్రతలకు విఘాతం కలిగించేదిలా ఉందని అందుకే ఆమెపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఇలాంటి చర్యలను ఊపేక్షించమని, మత వ్యవహారాలను కించే పరిచే విధంగా పోస్టులు చేసేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన చెప్పారు. పుకార్లను నమ్మద్దు: సోషల్ మీడియాలో పోలీసులు బంగ్లాదేశ్‌లో జరిగిన ఓ సంఘటనను కోల్‌కతాలో జరిగిందని తెలుపుతూ వచ్చిన వీడియోలో ఎటువంటి వాస్తవం లేదని, దీనిని పోస్ట్ చేసిన వారిపై చట్టపరమైనా చర్యలు చేపడతామని పోలీసులు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. వీడియోను పోస్ట్ చేసిన కిష్వార్ ట్విట్టర్ ఖాతాలో సుమారు 20 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నిజం తెలుసుకున్న తరువాత కిష్వార్ పోస్ట్ చేసిన వివాదస్పద వీడియోను తొలగించి, ఈ వీడియో తనకు దగ్గరి వ్యక్తుల నుంచి వచ్చిందని అందుకే పోస్ట్ చేసినట్టు చెప్పారు. అనంతరం తాను చేసిన తప్పుకు క్షమాపణ కోరుతున్నట్టు ఆమె ట్విట్టర్లో తెలిపారు. -
‘దీదీ సర్కార్‌పై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు’
కోల్‌కతా : మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని కేంద్రం హోంమంత్రి అమిత్‌షా విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందనివ్వకుండా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రెండు రోజుల పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా గురువారం ఆయన బంకురా జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మమతా సర్కార్‌పై అమిత్‌షా నిప్పులు చెరిగారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో హత్యలు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. (చదవండి : ఇవే నా చివరి ఎన్నికలు : నితీష్ కుమార్) ‘గత రాత్రి నుంచి నేను పశ్చిమ బెంగాల్లో ఉన్నాను. ఎక్కడికి వెళ్లినా మమతా సర్కార్‌పై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె పాలనలో రాష్ట్రంలో మరణాల సంఖ్య విపరీతంగా పెరిగాయి. కేంద్రం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను అందరికి అందనివ్వకుండా ఆమె అడ్డుకుంటున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కుడా మమతా బెనర్జీ అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. పేదల కోసం ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన పథకాలను అడ్డుకోవడం ద్వారా బీజేపీని అడ్డుకోగలమని మమతా భావిస్తున్నారని, కానీ అది అసాధ్యమని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి, నరేంద్రమోదీ నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం’అని అమిత్ షా పేర్కొన్నారు. -
కోల్‌కతాలో యుద్ధ వాతావరణం
కోల్‌కతా/హౌరా: బీజేపీ చేపట్టిన ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమం సందర్భంగా గురువారం కోల్‌కతా, హౌరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ కార్యకర్తల హత్యలకు నిరసనగా భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) చేపట్టిన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు పోలీసులతో ఘర్షణలకు దిగారు. పోలీసులు పెట్టిన బారికేడ్లను ధ్వంసం చేశారు. పోలీసులపై రాళ్లు విసిరారు. దాంతో, పోలీసులు వారిపై వాటర్ కెనాన్లను, టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. లాఠీచార్జ్ చేశారు. ఘర్షణల్లో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు. ఘర్షణల నేపథ్యంలో కోల్‌కతా, హౌరాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. రోడ్లపై ఎక్కడ చూసినా.. కాల్చిన టైర్లు, రువ్విన రాళ్లు కనిపించాయి. కరోనా నిబంధనలను పట్టించుకోకుండా, వేలాది కార్యకర్తలు మధ్నాహ్నం 12.30 గంటల ప్రాంతంలో సచివాలయం వైపునకు వెళ్లడం ప్రారంభించారు. హౌరా మైదాన్ నుంచి బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య, రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షుడు సౌమిత్ర ఖాన్ మార్చ్ ప్రారంభించారు. వారిని మాలిక్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఒక కార్యకర్త నుంచి బుల్లెట్లతో ఉన్న పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. బీజేపీ కార్యకర్తలు తమపై నాటు బాంబులు వేశారని పోలీసులు ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయంతన్ బసు నేతృత్వంలో సాగిన మార్చ్‌ను సాంత్రాగచి వద్ద పోలీసులు అడ్డుకోవడంతో, అక్కడా ఘర్షణ జరిగింది. పోలీసులతో ఘర్షణల్లో బీజేపీ నేత రాజు బెనర్జీ, ఎంపీ జ్యోతిర్మయి సింగ్ మహతో గాయపడ్డారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్‌వర్ఘీయ, జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్‌ల నేతృత్వంలో సాగిన చలో సెక్రటేరియట్ మార్చ్‌ను కోల్‌కతాలోని హాస్టింగ్స్–ఖిద్దర్‌పోర్ క్రాస్ రోడ్స్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, టీఎంసీ గూండాలు తమపై దాడి చేశారని విజయ్‌వర్ఘీయ ఆరోపించారు. దాదాపు వంద మందికి పైగా బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేవైఎం తలపెట్టిన మార్చ్‌కు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం లేదు పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న తృణమూల్ కాంగ్రెస్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుతామని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదన్నారు. మమత సర్కారును సాగనంపాలని రాష్ట్ర ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారన్నారు. మమత బెనర్జీ అవినీతిమయ, హింసాత్మక, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పోరాటం కొనసాగిస్తారన్నారు. మమత పాలనకు బీజేపీ అంతం పలకడం ఖాయమన్నారు. ‘మమత తన సచివాలయాన్ని మూసివేసుకునేలా ధీరులైన మా బీజేవైఎం కార్యకర్తలు పోరాడారు. ఆమె ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారనేందుకు ఇదే ఉదాహరణ’ అని నడ్డా ట్వీట్ చేశారు. రాజకీయ ప్రత్యర్థులను అణచివేసే విషయంలో మాత్రం గత వామపక్ష ప్రభుత్వం కన్నా మమత సర్కారు మెరుగ్గా ఉందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. లాఠీచార్జీలో గాయపడి, రోడ్డుపైనే పడిపోయిన ఓ కార్యకర్త -
ఉంఫాన్ తుఫాను బీభత్సం
-
బెంగాల్, ఒడిశాల్లో విధ్వంసం
సాక్షి, విశాఖపట్నం/కోల్‌కతా/భువనేశ్వర్: అతి తీవ్ర తుపాను ‘ఉంపన్’ పశ్చిమబెంగాల్, ఒడిశాల్లో భారీ విధ్వంసం సృష్టించింది. ప్రభుత్వాలు తీసుకున్న ముందస్తు జాగ్రత్తలతో.. ప్రాణనష్టం తప్పినా.. ఆస్తినష్టం భారీగానే వాటిల్లింది. పశ్చిమబెంగాల్లోని దీఘా బంగ్లాదేశ్‌లోని హతియా ద్వీపం మధ్య బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో అతి తీవ్ర తుపానుగా ఉంపన్ తీరం దాటింది. ఆ సమయంలో తీరం వెంబడి బీభత్సం సృష్టించింది. (తగ్గుతున్న వెరీయాక్టివ్ క్లస్టర్లు) గంటకు సుమారు 190 కిమీల వేగంతో వీచిన పెనుగాలులు, భారీ వర్షాల కారణంగా బలహీనమైన ఇళ్లు నేలమట్టం అయ్యాయి. భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్, సమాచార వ్యవస్థ ధ్వంసమయింది. ఇళ్ల పై కప్పులు ఎగిరిపోయాయి. తీరం దాటే సమయంలో తీరంలో అలలు భారీగా ఎగసిపడ్డాయి. కోల్‌కతాలో లోతట్టు ప్రాంతాలు వర్షం నీటిలో మునిగిపోయాయి. ఒడిశాలో పురి, ఖుర్ద, జగత్సింగ్పుర్, కటక్, కేంద్రపార, జాజ్‌పుర్, గంజాం, భద్రక్, బాలాసోర్‌ల్లో మంగళవారం నుంచి భారీ వర్షపాతం నమోదైంది. తుపాను ప్రభావం ప్రారంభమవడానికి ముందే రెండు రాష్ట్రాల్లో 6.58 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. భారీ ఈదురుగాలులకు చెట్లు నేలకూలి తమపై పడిన వేర్వేరు ఘటనల్లో పశ్చిమబెంగాల్లోని హౌరా, నార్త్ 24 పరగణ జిల్లాల్లో ముగ్గురు చనిపోయారు. జాతీయ విపత్తు స్పందన దళాలు రెండు రాష్ట్రాల్లో సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టాయని ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్ బుధవారం తెలిపారు. ఒడిశాలో 20 బృందాలు, పశ్చిమబెంగాల్లో 19 బృందాలు ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యాయన్నారు. రోడ్లపై పడిన భారీ వృక్షాలను తొలగిస్తున్నాయన్నారు. పశ్చిమబెంగాల్లో 5 లక్షల మందిని, ఒడిశాలో 1.58 లక్షల మందిని సహాయ కేంద్రాలకు చేర్చామన్నారు. పశ్చిమబెంగాల్లోని దక్షిణ, ఉత్తర 24 పరగణ జిల్లాలు, తూర్పు మిద్నాపూర్ జిలాల్లో తుపాను ప్రభావం తీవ్రంగా ఉందని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహోపాత్ర తెలిపారు. వర్షాలు, ఈదురుగాలుల కారణంగా పంటలు, మౌలిక వసతులకు ఎక్కువగా నష్టం వాటిల్లిందన్నారు. ఈ తుపాను కారణంగా అస్సాం, మేఘాలయాల్లో గురువారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. బంగాళాఖాతంలో తుపాను ఏర్పడినప్పటి నుంచి, తుపాను దిశ, తీవ్రత విషయంలో వాతావరణ శాఖ అంచనాలన్నీ 100% కచ్చితత్వంతో వాస్తవమయ్యాయన్నారు. సహాయ చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ సమర్ధంగా వ్యూహాలు రూపొందించుకోగలిగిందన్నారు. బంగ్లాదేశ్‌లో... ఉంపన్ బంగ్లాదేశ్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. పెను గాలులు, భారీ వర్షాల కారణంగా తీర ప్రాంతాల్లో ఇళ్లు కూలాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరానిలిచిపోయింది. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సమయంలో బోటు బోల్తా పడటంతో వాలంటీరు చనిపోయారు. పలు జిల్లాల్లో అత్యంత ప్రమాదకర హెచ్చరిక స్థాయిని అధికారులు ప్రకటించారు. 20 లక్షల మందిని సహాయ కేంద్రాలకు తరలించామని, ఆర్మీని రంగంలోకి దింపామని ప్రధాని షేక్ హసీనా చెప్పారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పంజాబ్‌లో లాక్డౌన్ పొడిగింపు
చండీగఢ్/కోల్‌కతా: మే 3 తర్వాత లాక్ డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లు పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ బుధవారం ప్రకటించారు. ఇందులో కొంత మేర సడలింపులు ఉన్నప్పటికీ, రెడ్ జోన్లలో సడలింపులు ఉండబోవన్నారు. మే 17 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తమ వారిని వెనక్కు తీసుకొస్తామని, అయితే వారు 21 రోజుల లాక్ డౌన్ లో ఉండాల్సిందేనని చెప్పారు. కరోనాను అదుపులో ఉంచేందుకు మే చివరి వరకూ లాక్ డౌన్ విధించక తప్పదని, ఈ విషయాన్ని పలువురు నిపుణులు, వైద్యులు చెబుతున్నారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. -
హాస్పిటల్స్‌లో మొబైల్ ఫోన్లపై బాన్
కోల్‌కతా : హాస్పిటల్ లోపల మొబైల్ ఫోన్ల వాడకాన్నినిషేధిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే రోగుల సహాయార్థం ల్యండ్లైన్స్ ఏర్పాటు చేస్తామని రాష్ర్ట ప్రధాన కార్యదర్శి రాజీవా సిన్హా బుధవారం తెలిపారు. కోల్‌కతాలోని బాంగూర్ హాస్పిటల్లో కరోనా పేషెంట్స్ ఉన్న ఐసోలేషన్ వార్డులో రెండు మృతదేహాలను గంటల కొద్ది అలాగే వదిలేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండు మృతదేహాలకు చాలా దగ్గర్లోనే కరోనా రోగులు కూర్చొని ఉన్నారు. అయినప్పటికీ వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. డెడ్‌బాడీస్‌ని తక్షణమే తీసెకెళ్లాల్సిందిగా బాధితులు మొర పెట్టుకున్నా సిబ్బంది పట్టించుకోలేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని అక్కడే ఉన్న ఓ కరోనా రోగి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్ అయ్యింది. ప్రభుత్వం కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవట్లేదంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో మాట్లాడుతూ...వీడియో వైరల్ కావడంతోనే హాస్పిటల్స్ లోపల మొబైల్ ఫోన్లను నిషేదించారని మమతాసర్కార్పై ఆరోపణలు గుప్పించారు. నిజాలను నొక్కిపెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ చర్యకు పూణుకున్నట్లు ద్వజమెత్తారు. అంతేకాకుండా ఈ వైరల్ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన మంత్రి..ఇంత జరుగుతున్నా మమతా బెనర్జీ మాత్రం దీనిపై స్పందించట్లేదని, కనీసం అది నకిలీ వీడియో అని చెప్పడానికి కూడా ముందుకు రావట్లేదని పేర్కొన్నారు . దీన్ని బట్టి ఈ వీడియో నిజం అని నమ్మడానికి చాలా ఆస్కారం ఉందని ట్వీట్ చేశారు. What’s very concerning is, inspite of this VDO being super-viral on all platforms, TILL NOW the WB Govt of @MamataOfficial Didi, did not come up with any claim that this is a fake VDO or that the hospital is not Bangur!!That takes us Very Close to believing it is indeed authentic https://t.co/Ec92ByNdgg — Babul Supriyo (@SuPriyoBabul) April 21, 2020 -
పశ్చిమ బంగ్లాదేశ్‌గా మారబోతుంది!
కలకత్తా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోకి చొరబాట్లను ప్రోత్సహిస్తున్నారని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ దిలీప్ ఘోష్ ఆరోపించారు. ఈ చొరబాట్ల కారణంగా పశ్చిమ బెంగాల్‌ను కాస్తా ‘పశ్చిమ బంగ్లాదేశ్’గా మార్చేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మమతా బెనర్జీ ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశంతో బెంగాల్, బంగ్లాదేశ్‌ను కలిపి పశ్చిమ బంగ్లాదేశ్‌గా ఏర్పాటు చేయాలనుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. భారతదేశం నుంచి బెంగాల్‌ను దూరం చేయాలని ఆమె కుట్రకు పాల్పడుతోందన్నారు. సోమవారం భట్పారా అల్లర్లలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులను పరామర్శించిన ఆయన.. టీఎంసీ బెంగాల్‌ను మరో పాకిస్తాన్‌గా మార్చాలనుకుంటుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం భట్పారా అల్లర్ల సమస్యకు పరిష్కారం చూపడం లేదన్నారు. ఇక్కడి బాధితులకు న్యాయం జరిగే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించడానికి బీజేపి ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి గూండాలను తీసుకువస్తోందని కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ విమర్శించిన విషయం తెలిసిందే. దీనిపై ఘోష్ స్పందిస్తూ.. బెంగాల్‌ను పాకిస్తాన్‌గా మర్చే ఉద్దేశంతో ‘జై శ్రీరామ్ నినాదాలను’ రాష్ట్రంలో అనుమతించడం లేదన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న మొత్తం 42 పార్లమెంట్ స్థానాల్లో.. 18 ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్ 22 స్థానాలను గెలుచుకొని కొంత బలాన్ని కోల్పోయిన సంగతి విదితమే. -
బెంగాల్లో కొనసాగుతున్న జూడాల ఆందోళన
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న జూనియర్ డాక్టర్ల ఆందోళన ఆరో రోజుకు చేరుకుంది. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సిబ్బందికి రోగుల నుంచి భద్రత కల్పించాలన్న తమ డిమాండ్ నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు పట్టుబడుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆహ్వానం మేరకు చర్చలు జరపడానికి తాము సిద్ధమని పునరుద్ఘాటించారు. అయితే చర్చావేదిక ఎక్కడనేది గవర్నింగ్ బాడీలో చర్చించి తామే నిర్ణయం తీసుకుంటామన్నారు. కానీ, దానికన్నా ముందు ఆందోళన జరుగుతున్న ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజ్‌ను సీఎం మమతా బెనర్జీ సందర్శించాలని వారు కోరుతున్నారు. నిన్న జరిగిన చర్చలు విఫలమైన అనంతరం మమత మాట్లాడుతూ డాక్టర్ల డిమాండ్‌కు ప్రభుత్వం ఒప్పుకుంటుందనీ, వారు వెంటనే విధుల్లోకి చేరాలని కోరారు. అలాగే వారిమీద ఎలాంటి చట్టాలను ప్రయోగించబోమనీ, అలా చేసి వారి భవిష్యత్తును ఇబ్బందిలో పెట్టదల్చుకోలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై బెంగాల్ గవర్నర్ కె.ఎన్.త్రిపాఠి వైద్యుల భద్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. మరోవైపు డాక్టర్ల ఆందోళన విషయంలో ఆదేశాలు జారీచేయడానికి హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వమే తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో డాక్టర్లు, వైద్యసిబ్బంది భద్రతపై దేశం నలుమూలల నుంచి కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖలు అందుతున్నాయి. వైద్యుల భద్రతకు తీసుకుంటున్న చర్యల గురించి తెలపాలని హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. -
‘కళ్ల ముందే నా భర్తను కాల్చిచంపారు’
కోల్కత్తా: తన కళ్ల ముందే తన భర్తను తృణమూల్ కార్యకర్తలు కాల్చిచంపారని రెండురోజుల క్రితం హత్యకు గురైన బీజేపీ కార్యకర్త ప్రదీప్ భార్య పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి బెంగాల్‌లోని 24 పరగణా జిల్లాలో బీజేపీ-టీఎంసీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు బీజేపీ మద్దతుదారులు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వీరిలో ప్రదీప్ మొండల్ అనే వ్యక్తిని తన ఇంట్లోనే భార్య ముందే దారణంగా కాల్చిచంపారని ఆయన భార్య పద్మ మొండల్ కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రదీప్‌తో పాటు శంకర్ మొండల్‌ను కూడా ఇదే విధంగా కాల్చి చంపారని ఆమె ఆరోపిస్తున్నారు. ఇదిలావుడంగా.. పశ్చిమబెంగాల్లో (టీఎంసీ), బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణల అనంతరం కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై కేంద్ర హోంశాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బెంగాల్లో శాంతిభద్రతలను పరిరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. హింసను అరికట్టడంలో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం విఫలమయిందని విమర్శించింది. ఆందోళనలు, అల్లర్లను నియంత్రించే విషయంలో కఠినంగా వ్యవహరించాలని హితవు పలికింది. మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కేంద్రానికి జవాబు ఇచ్చింది. సంఘవిద్రోహక శక్తుల కారణంగా చెలరేగిన అల్లర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని స్పష్టం చేసింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలో శనివారం రాత్రి టీఎంసీ, బీజేపీ శ్రేణుల మధ్య చెలరేగిన ఘర్షణల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో బీజేపీ, టీఎంసీ నేతలు మాటలయుద్ధానికి దిగారు. టీఎంసీ శ్రేణుల దాడుల్లో బీజేపీ కార్యకర్తలు చనిపోయారని బీజేపీ ప్రధాన కార్యదర్శి సయతన్ బసూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే ఘర్షణల్లో కయూమ్ మొల్లాహ్ అనే టీఎంసీ కార్యకర్త చనిపోయినట్లు టీఎంసీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు బీజేపీ కార్యకర్తల మృతదేహాలతో కోల్‌కతాలోని పార్టీ కార్యాలయానికి కమలనాథులు ఊరేగింపుగా తీసుకురాగా, పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. మరోవైపు సీఎం మమతా బెనర్జీ తన ప్రసంగాల ద్వారా రాజకీయ ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారని బీజేపీ నేత ముకుల్‌రాయ్ ఆరోపించారు. తమ కార్యకర్తల చావుకు నిరసనగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగడంతో 11 మంది మహిళలు సహా 62 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
బెంగాలీ సెంటిమెంట్‌పై ‘ఎన్నికల దాడి’
లోక్‌సభ ఎన్నికల ప్రచారం చివరి దశ వేడెక్కింది. కోల్‌కతాలో మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఎన్నికల ర్యాలీలో జరిగిన విధ్వంసంతో దేశం దృష్టి యావత్తు బెంగాల్‌పైకి మళ్లింది. అమిత్ షా ర్యాలీకి మమత సర్కారు అడ్డంకులు కల్పించడం, ర్యాలీని తృణమూల్, సీపీఎం శ్రేణులు అడ్డుకోవడం, ప్రతిగా బీజేపీ కార్యకర్తలు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. మాటల యుద్దం నుంచి దాడుల వరకు... సాధారణంగా బిహార్ తదితర ఉత్తరాది రాష్ట్రాలు కొన్నింటిలో ఎన్నికలప్పుడు అల్లర్లు, హింస జరగడం గత ఎన్నికల్లో చూశాం. అయితే, ఈ సారి ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు చెప్పుకోతగ్గ గొడవలు లేకుండా ప్రశాంతంగా జరగ్గా పశ్చిమ బెంగాల్లో ఎన్నికల హింస, అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఇంత వరకు జరిగిన వివిధ దశల పోలింగులో హింస జరగడం ఒక ఎత్తయితే, తాజాగా అమిత్‌షా మంగళవారం నిర్వహించిన రోడ్‌షోలో ఇరు పక్షాలు విధ్వంసానికి పాల్పడటంతో ఎన్నికల ప్రచార కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఈశ్వర్ చంద్ర విగ్రహ విధ్వంసానికి కారకులు మీరంటే మీరంటూ తృణమూల్, బీజేపీలు ఆరోపణలు చేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ ఎన్నికల నియమావళిని యథేచ్చగా ఉల్లంఘిస్తున్నా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదంటూ బీజేపీ నేత అమిత్ షా మండి పడ్డారు. తృణమూల్ అభివృద్ధి, ప్రజాస్వామ్య వ్యతిరేక పార్టీ అంటూ ప్రధాని మోదీ దుయ్యబట్టారు. అమిత్‌షా పొరుగు రాష్ట్రాల నుంచి గూండాలను తీసుకొచ్చి విధ్వంసానికి పాల్పడ్డారని మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాలీ సంస్కృతి, సంప్రదాయాలపై బీజేపీ దాడి చేసిందంటూ మండి పడ్డారు. ఘటనపై ఇరు పక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. బుధవారం పరిస్థితిని సమీక్షించిన ఎన్నికల సంఘం తొమ్మిది నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిషేధించింది. తృణమూల్ బలప్రయోగం పశ్చిమ బెంగాల్ ఎన్నికలు మమతా బెనర్జీ, ప్రధాని మోదీల మధ్య పోరుగా మారాయి. వీలయినన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంటే, కమలనాథులకు అవకాశం దక్కకుండా చేసేందుకు దీదీ అన్ని మార్గాలు అవలంబిస్తోంది. అధికారాన్ని ఉపయోగించుకుని విపక్ష నేతల పర్యటనలకు, ఎన్నికల ప్రచారాలకు, ర్యాలీలకు మోకాలడ్డుతోంది. అంతే కాకుంగా, విపక్ష నేతలకు పట్టున్న జిల్లాల్లో ఓట్లు వేసేందుకు ఓటర్లను అనుమతించడం లేదు. తృణమూల్ చేస్తున్న ఈ ప్రయత్నాలను అడ్డుకునే క్రమంగా తరచు హింస,అల్లర్లు చోటు చేసుకుంటున్నాయి. ఈ తీవ్ర పోరుకి కారణం... తృణమూల్, బీజేపీలు రెండూ ఇంతటి తీవ్ర స్థాయి పోరుకు దిగడానికి కారణం బెంగాల్లో విజయం ఇద్దరికీ తప్పనిసరి కావడమే. దేశంలో తృణమూల్ అధికారంలో ఉన్నది ఒక్క బెంగాల్లోనే. ఇక్కడ అధికారం కోల్పోతే దాని మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో తృణమూల్ శ్రేణుల పెత్తనం పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉంది. మరోవైపు 34 ఏళ్ల తమ అధికారాన్ని కొల్లగొట్టిన తృణమూల్‌పై సీపీఎం కన్నెర్రగా ఉంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా మమతాని మట్టి కరిపించాలని సీపీఎం శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం అవసరమైతే బీజేపీకి సహకరించడానికి కూడా కమ్యూనిస్టులు సిద్దపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ గెలుపు కోసం ప్రత్యర్థులను బల ప్రయోగంతో అణచివేయడానికి తృణమూల్ వెనుకాడటం లేదు. మమత మేనల్లుడు పోటీ చేస్తున్న డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో తృణమూల్, బీజేపీల మధ్య వరసగా కొన్ని రోజుల పాటు ఘర్షణలు జరగడం దీనికి నిదర్శనం. మరోవైపు బీజేపీకి కూడా బెంగాల్లో మెజారిటీ సీట్లు సాధించడం జాతీయ రాజకీయాల దృష్ట్యా అవసరం. రెండో సారి కేంద్రంలో అధికారం కోసం ప్రయత్నిస్తున్న కమలనాధులకు హిందీ బెల్ట్‌లో గతంలోలా ఈ సారి మెజారీటీ స్థానాలు రావని తేలిపోయింది. అక్కడి నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి అత్యధిక లోక్‌సభ స్థానాలున్న బెంగాల్లో పట్టు సాధించడం బీజేపీకి అనివార్యం. అందుకే బెంగాల్లో వీలైనన్ని సీట్లు సాధించేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. తృణమూల్‌పై ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడం, తృణమూల్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి చూస్తున్న కమ్యూనిస్టుల సహాయం తీసుకోవడం ద్వారా దీదీకి చెక్ చెప్పేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇది కూడా ఇరు పక్షాల మధ్య ఘర్షణలకు దారి తీస్తోంది. సత్తా చాటుకునేందుకే... తమ సత్తా చాటేందుకు మమత, మోదీలు పరోక్షంగా ప్రయత్నించడం రెండు పార్టీల మధ్య రాజకీయ పోరాటానికి దారి తీసింది. చివరిదశ పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ ఇరు పక్షాలు ఎన్నికల నిబంధనలను, సంప్రదాయాలను పక్కన పెట్టి గెలుపే లక్ష్యంగా ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నాయి. తాజా అల్లర్లు, విధ్వంసాలు రెండు పార్టీల్లో నైరాశ్యం ఏ స్థాయిలో ఉందో నిరూపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తృణమూల్–బీజేపీల మధ్య జరిగిన తాజా ఘర్షణల్లో ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్ విగ్రహం విధ్వంసం బెంగాల్ ప్రజల భావోద్వేగాలపై ప్రభావం చూపుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇది బెంగాలీ సంస్కృతిపై దాడిగా పలువురు అభివర్ణిస్తున్నారు.ఈ ఘటనను సీపీఎం సహా అనేక పార్టీలు తీవ్రంగా ఖండించడం, తృణమూల్ నేతలు తమ ఫేస్బుక్ ప్రొఫైల్స్‌ను మార్చడం ఈ ఘటన ప్రాధాన్యతను వెల్లడిస్తున్నాయి. విగ్రహ ధ్వంసానికి కారణమెవరైనా మరో 4 రోజుల్లో జరగనున్న పోలింగ్‌పై దీని ప్రభావాన్ని తోసి పుచ్చలేమని ఎన్నికల పరిశీలకులు భావిస్తున్నారు. హద్దులు దాటిన ప్రచార యుద్ధం యూపీ మాదిరిగానే బెంగాల్‌లోని 42 సీట్లకు ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. చివరి దశలో మిగిలిన 9 లోక్‌సభ స్థానాలకు మే 19వ తేదీన పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రంలో నాలుగు, ఐదు, ఆరు దశల పోలింగ్ సరళిని బట్టి చూస్తే బీజేపీ బలపడుతోందని, ఈసారి ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. తృణమూల్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని వారు చెబుతున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ పశ్చిమ బెంగాల్‌ను లక్ష్యంగా చేసుకుందని రాష్ట్ర సీపీఎం నేత ఒకరు అన్నారు. బెంగాల్‌ను 34 ఏళ్లు పాలించిన సీపీఎం బాగా బలహీనం కావడం, కాంగ్రెస్ బలం ఊహించని స్థాయిలో కుంచించుకుపోవడంతో బీజేపీకి మమతా బెనర్జీ పెద్ద సవాలుగా మారారు. ఇద్దరూ ఇద్దరే... మోదీ ఆరెసెస్‌లో, తర్వాత బీజేపీలో సంస్థాగత పదవులు సమర్థంగా నిర్వహించి నాలుగు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. చివరికి ప్రధాని పదవి చేపట్టారు. వామపక్ష పాలనలో మమత వీధి పోరాటాలతో రాటుదేలారు. సీపీఎం భౌతిక దాడులను సైతం తట్టుకుని హింసకు హింసతోనే ఆమె జవాబిచ్చారు. 1998లో కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి తృణమూల్ కాంగ్రెస్ స్థాపించాక బీజేపీతో చేతులు కలిపారు. వరుసగా 1998, 99, 2004 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో పోటీచేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన మమత రాష్ట్రంలో తృణమూల్‌కు గట్టి పునాదులు వేయగలిగారు. చివరికి 2011 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పదవి కైవసం చేసుకున్నారు. ఆమె తన రాజకీయ ప్రత్యర్థులను అణచివేసే క్రమంలో సీపీఎం, కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరై బలం కోల్పోయాయి. ఈ పరిణామాలను అనుకూలంగా మలచుకున్న బీజేపీ రాష్ట్రంలో తృణమూల్‌కు ప్రత్యామ్నాయంగా అవతరించింది. ఆరో దశ పోలింగ్‌కు ముందు మేదినీపూర్ ఎన్నికల ర్యాలీలో మమత ప్రసంగిస్తూ, ‘‘1942లో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా నడిచిన క్విట్ ఇండియా ఉద్యమం లాంటివే 2019 లోక్‌సభ ఎన్నికలు. ఫాసిస్టు మోదీ సర్కారును అధికారం నుంచి కూలదోయడానికే మా పార్టీ పోరాడుతోంది,’’ అని ప్రకటించారు. మోదీ ఇటీవల బెంగాల్లో ఓ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ, ‘‘ మమత అనగానే ‘టీ’ అక్షరంతో మొదలయ్యే మూడు పదాలు గుర్తుకొస్తాయి. అవి తణమూల్, టోల్‌బాజీ(బలవంతపు వసూళ్లు) టాక్స్. అన్నారు. బుధవారం కోల్‌కతాలో భారీ ర్యాలీ చేపట్టిన తృణమూల్ చీఫ్, సీఎం మమతా బెనర్జీ ఢిల్లీలో మౌన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న కేంద్రమంత్రి నిర్మల, ఇతర సీనియర్ బీజేపీ నేతలు -
మోదీ x దీదీ
బెంగాల్ అంటే ఎన్నికల్లో హింస, బెంగాల్ అంటే నాటు బాంబుల పేలుళ్లు, బెంగాల్ అంటే తుపాకుల రాజ్యం. ఇన్నాళ్లూ ఇదే మాట. ఈ సారి లోక్‌సభ ఎన్నికల వేళ బెంగాల్ అంటే మోదీ వర్సెస్ దీదీ అనే మాటే వినిపిస్తోంది. ఒకరు కొదమ సింహమైతే, మరొకరు రాయల్ బెంగాల్ టైగర్. వీరిద్దరి మధ్య రాజకీయ యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తృణమూల్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారంటూ చేసిన కామెంట్స్ బెంగాల్ రాజకీయాల్ని కుదిపేశాయి. ఇద్దరు సమ ఉజ్జీల మధ్య జరుగుతున్న సమరం రసకందాయంలో పడింది. ఇప్పుడు ఇదే ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపించే అంశంగా మారింది. ఈ నెల 6న జరిగే అయిదో దశ పోలింగ్‌లో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో రెండింట్లో మాత్రమే బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నట్టు అంచనా. స్వాతంత్య్ర సమరయోధుడు గోపాలకృష్ణ గోఖలే బెంగాల్ రాష్ట్రం గురించి చెప్పిన మాట ఒకటుంది. ‘‘ఇవాళ బెంగాల్ ఏం ఆలోచిస్తుందో, రేపు భారత్ కూడా అదే ఆలోచిస్తుంది‘‘ అంటే ఆ రాష్ట్ర ప్రజలు ఆలోచనల్లో ఎంత ముందు ఉంటారో అన్న అర్థంలో గోఖలే బెంగాల్‌ను ప్రశంసించారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. 42 లోక్‌సభ స్థానాలతో కేంద్రంలో చక్రం తిప్పగలిగే ఈ రాష్ట్రంలో రాజకీయపరమైన హింస, ఎన్నికల వేళ హింస, వ్యక్తిగత దూషణలు, ధనబలం, కండబలం ఒక్కొక్కటిగా వచ్చి చేరాయి. ఇప్పుడు క్షేత్రస్థాయిలో బీజేపీ బలపడడం మొదలు పెట్టాక మతపరమైన విభజన కూడా మొదలైంది. కనీసం 22 లోక్‌సభ సీట్లలోనైనా నెగ్గాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్న మోదీ, షా ద్వయం వ్యూహాలు అంత తేలిగ్గా అమలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అయితే తనకు తిరుగులేదని, తన మాటే శాసనమన్న నియంతృత్వ ధోరణిలో పాలిస్తున్న మమతా బెనర్జీ(దీదీ)లో ఒక కలవరమైతే తెప్పించారు. ఈ సారి ఎన్నికల పోరు టీఎంసీ, బీజేపీ మధ్యే సాగుతోంది, సీపీఎం, కాంగ్రెస్ సైడ్ ప్లేయర్లుగా మారి బిత్తర చూపులు చూస్తున్నాయి. బన్‌గావ్‌లో మార్పు కోరుతున్నారా ? భారత్, బంగ్లాదేశ్‌లకు సరిహద్దుగా ఉన్న బన్గావ్ నియోజకవర్గం (ఎస్సీ నియోజకవర్గం)లో ఎస్సీల్లో విష్ణువుని పూజించే మతువా వర్గం ఓట్లు అత్యంత కీలకం. ఈ సారి ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకున్నట్టు స్పష్టమవుతోంది. బంగ్లాదేశ్ నుంచి ఎగుమతులు, దిగుమతులు అత్యధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో పారిశ్రామిక పురోగతి జరగలేదు. అందుకే ఇక్కడ యువత మోదీ పట్ల ఆకర్షితులవుతున్నారు. ‘ఎప్పుడైనా మార్పు మంచికే జరుగుతుంది. కొత్త తరం మోదీపైనే ఆశలు పెట్టుకున్నారు’ అని స్థానిక వ్యాపారులు అంటున్నారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చే వలసలు, వారిని అక్కున చేర్చుకోవడానికి తృణమూల్ అనుసరించే బుజ్జగింపు విధానాలు ఎంత మేర ప్రభావితం చూపిస్తాయో చూడాల్సిందే. తృణమూల్ తరపు నుంచి సిట్టింగ్ ఎంపీ మమతా బాల్ ఠాకూర్ పోటీ పడుతుంటే, అదే కుటుంబానికి చెందిన శాంతను ఠాకూర్ బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. బ్యారక్‌పూర్‌లో కమల వికాసం ? బ్యారక్‌పూర్‌లో ఇతర రాష్ట్రాలైన యూపీ, బీహార్ నుంచి వలస వచ్చిన ఓటర్లే ఎక్కువ. ఈ సారి ఎన్నికల్లో తృణమూల్ నుంచి పార్టీ ఫిరాయించి బీజేపీ గూటికి చేరిన అర్జున్ సింగ్ బరిలో ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఒకప్పుడు రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన దినేశ్ త్రివేది పోటీ పడుతున్నారు. రాష్ట్రేతరులు ఎక్కువగా ఉండడం, పరిశ్రమలు మూతపడి ఉద్యోగాలు కోల్పోయిన వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడంతో బీజేపీకి అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయి. ఇక మిగిలిన నియోజకవర్గాలైన హౌరా, ఉల్బేరియా, శ్రీరామ్‌పూర్, హుగ్లీ, ఆరంబాగ్‌లో మోదీపై దీదీ పైచేయి సాధించే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఓట్ల శాతం పెరుగుతుంది కానీ... 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 17శాతం ఓటు షేరుతో 2 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఈ సారి ఓటింగ్ శాతం పెరగడం ఖాయం అన్న అంచనాలున్నాయి. అయిదు నుంచి ఏడు సీట్లు బీజేపీ గెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరో 15 సీట్లలో తృణమూల్‌కి గట్టి పోటీ ఇస్తుందని చెబుతున్నారు. ఉత్తర బెంగాల్లో హోరాహోరీ పోరు నెలకొంది. ఇక అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పశ్చిమ ప్రాంతాలు, బెంగాల్‌కు సరిహద్దు ప్రాంతాల్లో బీజేపీ తన పట్టు ప్రదర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో మొత్తం 42 నియోజకవర్గాలకు గాను 40 శాతం ఓటుషేర్‌తో 34 సీట్లలో నెగ్గి తన పవరేంటో చూపించిన మమతపై బెంగాల్ ప్రజలు ఎంత మమత కురిపిస్తారో చూడాల్సిందే మరి. బెంగాలీలు త్వరగా మార్పుని ఆహ్వానించలేరు బెంగాల్ ఓటర్లు మార్పుని త్వరితగతిన కోరుకోరు. వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం జెండాలు, ఎజెండాలు మారుస్తారేమో కానీ, ఓటరు రాత్రికి రాత్రి పార్టీలను మార్చడు. పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టుల కంచుకోట బద్దలవడానికే మూడు దశాబ్దాలకుపైగానే పట్టింది. ఇందుకు టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ రేయింబగళ్లు కష్టపడాల్సి వచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కమ్యూనిజంతోనే సమాజంలో మార్పు వస్తుందన్న నమ్మకం బెంగాల్ మధ్యతరగతి ప్రజల్లో బలంగా ఉండేది. 1977లో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చాక రాజకీయ, ఆర్థిక, ఎన్నికల ప్రణాళికకు సంబంధించి ఒక మోడల్ని సృష్టించారు. బెంగాల్ గ్రామాల్లో దున్నేవాడికే భూమిపై హక్కుల్ని కట్టబెట్టడంతో వ్యవసాయ రంగం పరుగులు పెట్టింది. అయితే పారిశ్రామిక రంగంపై మాత్రం నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. పట్టణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో అసంఘటిత రంగాలనే సీపీఎం ప్రోత్సహించింది. చిల్లర వ్యాపారులు, వీధి వ్యాపారులు, దుకాణదారులు, వారి సహాయకులు ఇలా కార్మిక శక్తినే కామ్రేడ్లు నమ్ముకున్నారు. 1990ల్లో అసంఘటిత రంగాల్లో ఉద్యోగాల రేటు ఏడాదికి 12 శాతం వరకు వెళ్లింది. కర్షక, కార్మిక శక్తులు బలపడినా ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఆ రాష్ట్రం మెరుగైన ఫలితాలు సాధించింది ఏమీ లేదు. పారిశ్రామిక రంగ పురోగతి సాధించకపోవడం, చిన్న కమతాలు కలిగిన రైతుల సంఖ్య పెరిగిపోవడం వల్ల పశ్చిమ బెంగాల్ మోడల్ ఒక విఫలప్రయోగంగానే మిగిలిపోయింది. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కూడా భారత్ జాతీయ సగటుకి చేరుకోలేకపోయింది. దీంతో సీపీఎం తన దారి మార్చుకొని పారిశ్రామికీకరణను బలవంతంగా అమలు చేయడం మొదలు పెట్టింది. అదే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత దీదీ ఒక అస్త్రంలా మార్చుకొని పోరు బాట పట్టారు. సింగూర్ ఆందోళనలు జనంలో ఆమె ఇమేజ్ను పెంచాయి. ఫలితం బెంగాల్లో ఎర్రకోట బీటలు వారింది. 2011లో తొలిసారిగా అధికారం చేపట్టిన దీదీ తనపైనున్న సింగూర్ ఇమేజ్‌ని చెరిపేసుకోలేక, కొత్త విధానాలు అమలు చెయ్యలేక కొంతకాలం సతమతమయ్యారు. ఆ తర్వాత మార్క్సిస్టుల బాటలో నడవక తప్పలేదు. బడా బడా పారిశ్రామికవేత్తల పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచారు. ముఖేశ్ అంబానీ వంటి వారు ఆ రాష్ట్రాన్ని ‘వెస్ట్ బెంగాల్ ఈజ్ బెస్ట్ బెంగాల్’ అనేలా పారిశ్రామిక విధానాలు సరళతరం చేశారు. ఎన్నికల మోడల్ సూపర్ హిట్ పరిపాలనలో చతికిలపడినా ఎన్నికల ప్రణాళికలో సీపీఎం అనుసరించిన విధానాలు సక్సెస్ అయ్యాయి. 1990లలో సీపీఎంకి కార్యకర్తల బలం ఎంత ఉందంటే, అప్పట్లో బెంగాల్లో ఓటర్ల సంఖ్య 4 కోట్లు ఉంటే, దాదాపుగా 20 లక్షల మంది సీపీఎం కార్యకర్తలే ఎన్నికల్లో పనిచేసేవారు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అంతకు అంత కార్యకర్తల అండదండ సంపాదించింది. అయితే ఇదంతా అధికార దర్పంతో, నియంతృత్వ విధానాలతోనే సాధించారు. రాష్ట్రంలో ఆరెస్సెస్ చాలా కాలంగా పనిచేస్తున్నప్పటికీ కమలనాథులు తృణమూల్ పార్టీ స్థాయిలో బలపడలేదు. కానీ మతపరమైన విభజన రేఖ గీయడంలో విజయం సాధించారు. అదే ఇప్పుడు ఎన్నికల్లో కీలక భూమిక పోషించబోతోంది. ముస్లిం ఓటర్లే కీలకం పశ్చిమ బెంగాల్ ఓటర్లలో 27శాతం ముస్లింలే. 28 లోక్‌సభ స్థానాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారు. సీపీఎం ఓటు బ్యాంకు అటూ ఇటూ మళ్లిందేమో కానీ, ముస్లింలు మాత్రం దీదీ వైపే ఉన్నారు. ఆమె పాలనలోనే వారు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగారు ‘‘ముస్లింలు ఇప్పుడు సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. టీఎంసీలో కూడా స్థానికంగా నాయకత్వం వహిస్తున్నారు’’ అని ప్రశాంత చటోపాధ్యాయ అనే జర్నలిస్టు వ్యాఖ్యానించారు. నదీ తీరంలో రాజకీయాలు ఏ మలుపు తిప్పుతాయి? ఈ నెల 6న జరగనున్న అయిదో దశ పోలింగ్‌లో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో అయిదు హుగ్లీ నదికి చెరోవైపున విస్తరించి ఉన్నాయి. బన్గావ్, బ్యారక్‌పూర్, హౌరా, ఉల్బేరియా, శ్రీరామ్‌పూర్, హుగ్లీ, ఆరంబాగ్‌లలో పోలింగ్ జరగనుంది. వీటిలో ఉత్తర 24 పరగణా జిల్లాలకు సరిహద్దుగా ఉన్న బన్గావ్, బ్యారక్పూర్లలో మతపరమైన హింస చెలరేగిన చోట బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నట్టుగా అంచనా. మమతఠాకూర్, శాంతను ఠాకూర్, అర్జున్ సింగ్, దినేశ్ త్రివేది -
బీజేపీకి ‘రసగుల్లా’
బాలుర్ఘాట్/గంగరామ్‌పూర్: లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీకి ‘రసగుల్లా’నే (సున్నాను సూచిస్తూ) దక్కుతుందని, ఆ పార్టీ కనీసం ఒక్క స్థానం గెలవదని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బెంగాల్లో ఎక్కువ సీట్లు గెలవాలన్న ప్రధాని మోదీ ఆశ కలగానే మిగులుతుందన్నారు. దక్షిణ్ దినాజ్‌పూర్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆమె ప్రసంగించారు. రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో కనీసం సగమైనా గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని, కానీ 2014 ఎన్నికల్లో వచ్చిన రెండు సీట్లలో కూడా ఈసారి గెలవదన్నారు. దేశవ్యాప్తంగా ఆ పార్టీకి 100 సీట్లు కూడా రావన్నారు. ఈశాన్య రాష్ట్రాలు, ఏపీ, తమిళనాడు, కేరళ, ఒడిశాలో ఆ పార్టీ ఖాతా తెరవదన్నారు. బెంగాల్లో ఆశ్చర్యం కలిగించే ఫలితాలు వస్తాయన్న కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై స్పందించిన ఆమె... సున్నా స్థానాలు గెలుపొంది నిజంగానే ఆశ్చర్యానికి గురవుతారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఛాయ్‌వాలా ప్రధానికి, కేథీవాలా (ఛాయ్ ఉంచే పాత్ర) ఆర్థిక మంత్రి అని జైట్లీని విమర్శించారు. ఐదు సంవత్సరాల క్రితం తాను ఛాయ్‌వాలా అని, ఇప్పుడు చౌకీదార్ అని చెప్పుకుంటున్న మోదీకి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మిగిలేది చౌకీనే (మంచం) అన్నారు. 2014లో బీజేపీ గెలిచిన డార్జిలింగ్ సహా రాష్ట్రంలో మొదటి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్న ఐదు స్థానాల్లో టీఎంసీ విజయం సాధిస్తుందని మమతా ధీమా వ్యక్తం చేశారు. -
రోడ్లపై ఉమ్మివేస్తే రూ. లక్ష జరిమానా
కోల్‌కతా: బహిరంగ ప్రదేశాల్లో చెత్తను పారవేసే, ఉమ్మివేసే వారిపై బెంగాల్ ప్రభుత్వం కొరడా ఝుళిపించనుంది. ఇలాంటి వ్యక్తులకు గరిష్టంగా రూ.లక్ష జరిమానా విధించేలా ‘కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ బిల్లు’కు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కోల్‌కతాలోని దక్షిణేశ్వర్ కాళీమాత ఆలయాన్ని, రైల్వేస్టేషన్‌ను అనుసంధానిస్తూ గాజు, ఉక్కుతో నిర్మించిన ‘దక్షిణేశ్వర్ వంతెన’ను సీఎం మమతా బెనర్జీ ఇటీవలే ఆవిష్కరించారు. అయితే పలువురు ప్రజలు వంతెనపై పాన్‌మసాలా ఉమ్మివేయడంతో దాని రూపురేఖలే మారిపోయాయి. దీంతో తీవ్ర అసహనానికి లోనైన మమత గరిష్ట జరిమానాగా రూ.లక్ష విధించేలా చట్టాన్ని సవరించారు. -
ఈ చిక్కులు వారి చలవే..
సాక్షి,కోల్‌కతా: సులభతర వాణిజ్యంలో పశ్చిమ బెంగాల్ మెరుగైన సామర్థ్యం కనబరిచినా గత వామపక్ష ప్రభుత్వ హయాం నుంచి సంక్రమించిన సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ప్రవాస భారతీయులు బెంగాల్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులతో తరలిరావాలని పిలుపు ఇచ్చారు.హొరాసిస్ ఏసియా సదస్సును ఉద్దేశించి మమతా బెనర్జీ మాట్లాడారు. సులభతర వాణిజ్యంలో బెంగాల్ ర్యాంక్ గణనీయంగా మెరుగుపడి దేశంలోనే తృతీయ స్ధానానికి ఎగబాకిందన్నారు. 34 ఏళ్ల వామపక్ష పాలనతో కొన్ని అంశాలు ముందుకొచ్చాయని, అవి సమసిపోయేందుకు కొద్దిసమయం పడుతుందన్నారు. బెంగాల్లో మౌలిక సదుపాయాలు, పనిసంస్కృతి గణనీయంగా మెరుగయ్యాయని అన్నారు. జనవరి 16,17 తేదీల్లో జరిగే బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సదస్సుకు హాజరుకావాలని ప్రతినిధులను మమతా బెనర్జీ ఆహ్వానించారు. -
రూపా గంగూలీపై దాడి
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ బీజేపీ నాయకురాలు రూపా గంగూలీపై గర్తు తెలియని దుండగులు ఆదివారం దాడికి పాల్పడ్డారు. దక్షిణ 24 పరగణ జిల్లాలోని కాక్ డ్విప్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈశ్వరిపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన బీజేపీ కార్యకర్తను పరామర్శించి కాక్ డ్విప్ నుంచి తిరిగొస్తుండగా దుండగులు ఆమెపై దాడి చేశారు. టీఎంసీ మద్దతుదారుల దాడిలో గాయపడి కాక్ డ్విప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ కార్యకర్తను పరామర్శించేందుకు ఆమె వెళ్లారు. అక్కడి నుంచి తిరిగొస్తుండగా కొంతమంది గామస్తులు ఆమె కారును అడ్డుకున్నారు. ఆమెపై చేయి చేసుకున్నారు. ఆమె కారు కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనలో రూపా గంగూలీ తలకు గాయం కావడంతో ఆమెను డైమండ్ హార్బర్ ఆస్పత్రికి తరలించారు. స్థానిక టీఎంసీ నాయకులే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీ జాతీయ కార్యదర్శి రాహుల్ సిన్హా ఆరోపించారు. దాడికి కారణమైన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఘటనా స్థలానికి భారీగా పోలీసులను తరలించారు.