సాక్షి,కోల్‌కతా: సులభతర వాణిజ్యంలో పశ్చిమ బెంగాల్ మెరుగైన సామర్థ్యం కనబరిచినా గత వామపక్ష ప్రభుత్వ హయాం నుంచి సంక్రమించిన సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ప్రవాస భారతీయులు బెంగాల్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులతో తరలిరావాలని పిలుపు ఇచ్చారు.హొరాసిస్ ఏసియా సదస్సును ఉద్దేశించి మమతా బెనర్జీ మాట్లాడారు.
సులభతర వాణిజ్యంలో బెంగాల్ ర్యాంక్ గణనీయంగా మెరుగుపడి దేశంలోనే తృతీయ స్ధానానికి ఎగబాకిందన్నారు. 34 ఏళ్ల వామపక్ష పాలనతో కొన్ని అంశాలు ముందుకొచ్చాయని, అవి సమసిపోయేందుకు కొద్దిసమయం పడుతుందన్నారు.
బెంగాల్‌లో మౌలిక సదుపాయాలు, పనిసంస్కృతి గణనీయంగా మెరుగయ్యాయని అన్నారు. జనవరి 16,17 తేదీల్లో జరిగే బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సదస్సుకు హాజరుకావాలని ప్రతినిధులను మమతా బెనర్జీ ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment