Investors meet
-
రాజమండ్రిలో టూరిజం ఇన్వెస్టర్స్ సమావేశం
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో పర్యాటక శాఖ అధ్వర్యంలో టూరిజం ఇన్వెస్టర్స్ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఎమ్మెల్సీ సోమువీర్రాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలో 45శాతం దేశాలు టూరిజం మీద ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయని అన్నారు. అలాగే టూరిజానికి అవకాశం ఉన్న పలు ప్రాంతాల్లో మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉందని పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి భద్రతకు ప్రాధాన్యం కల్పించాలని మంత్రి అధికారులను అదేశించారు. ఈ క్రమంలో పర్యాటక ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టుల కోసం పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. సీతానగరం మండలంలో ఉన్న రామవరపు ఆవను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని అన్నారు. అలాగే కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద రోప్‌వే ఏర్పాటు చేస్తే భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందరని, దీంత టెంపుల్ టూరిజం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. స్టార్హోటల్లో మద్యం ధరలు అధికంగా ఉన్నందువల్ల టూరిజంపై దీని ప్రభావం పడే అవకాశం ఉందని అన్నారు. అయితే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్సీ సోమువీర్రాజు మాట్లాడుతూ.. ఆత్రేయపురం పరిధిలో ఉన్న పిచ్చుకలను 10కోట్లతో రిసార్ట్స్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేయవచ్చనునని తెలిపారు. -
పొద్దున లేవగానే ఇషాను చూడాల్సిందే!
ముంబై : ధీరుబాయి అంబానీగా పేరుపొందిన ధీరాజ్లాల్ హిరచాంద్ అంబానీ గురించి ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. పేదరికం నుంచి అత్యంత ధనికుడైన భారతీయుడు ఇతను. ఆయన స్థాపించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు ప్రపంచ వ్యాపారాల్లో ఒకటిగా ఉంది. ప్రపంచ అత్యంత ధనిక కుటుంబాలలో ప్రస్తుతం అంబానీలది కూడా ఒకటి. తొలిసారి 1977లో రిలయన్స్ పబ్లిక్ ఇష్యూకు వెళ్లింది. ఇక అప్పటి నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ తప్పకుండా ప్రతేడాది ఇన్వెస్టర్లతో ముచ్చటించడం, వారి సలహాలను, సూచనలను స్వీకరించడం, కొత్త కొత్త ఆవిష్కరణలను లాంచ్ చేయడం పరిపాటిగా వస్తోంది. రిలయన్స్ ఏజీఎం, ఇతర కంపెనీలలతో పోలిస్తే చాలా ప్రత్యేకమైనది. ఈ సమావేశంలో ఇన్వెస్టర్లతో ముచ్చటించడం జరుగుతుంది. పెట్టుబడిదారులు అడిగే ప్రశ్నలకు, చైర్మన్ ముఖేష్ సమాధానాలు ఇస్తూ ఉంటారు. ఇలా ఇన్వెస్టర్ల సలహాలు, సూచనలు, ప్రశ్నలతో ఈ సమావేశం ఎంతో ముచ్చటగా జరుగుతూ ఉంటుంది. గతవారంలో కూడా రిలయన్స్ తన 41వ వార్షిక సాధారణ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి కూడా చైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ, తల్లి కోకిలాబెన్, అంబానీల గారాలపట్టి ఇషా అంబానీ, పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, ఆయనకు కాబోయే భార్య శ్లోకా మెహతా, చిన్న కొడుకు అనంత్ అంబానీ ఇలా అందరూ ఇన్వెస్టర్ల సమావేశానికి హాజరయ్యారు. దక్షిణ ముంబై ఆడిటోరియమంతా కంపెనీ పెట్టుబడిదారులతో నిండిపోయింది. ఈ సమావేశంలో ఓ స్పీకర్, ముఖేష్ తండ్రి ధీరూభాయ్ అంబానీ గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని రివీల్ చేశారు. ధీరూభాయ్ అంబానీ తన రోజును అంబానీల ప్రిన్సెస్ ఇషా అంబానీని చూసిన తర్వాతనే ప్రారంభించేవారని చెప్పారు. పొద్దున లేవగానే ధీరూభాయ్ అంబానీ తొలుత ఇషా అంబానీ ఫోటోను చూస్తారని, ఆ అనంతరమే టీ లేదా టిఫిన్ తీసుకుని తన రోజూవారీ కార్యకలాపాలకు సిద్ధమవుతారని తెలిపారు. ప్రస్తుతం ఇషా మన కళ్ల ముందే పెరిగి, టెలికాం రంగంలో పెను సంచలనమైన జియోను ఆవిష్కరించినట్టు ఇన్వెస్టర్ల సమావేశంలో కొనియాడారు. అంటే ధీరూభాయ్‌కి ఇషా అంటే అంత ఇష్టమనమాట. ముఖేష్ అంబానీకి కూడా ఇషా అంటే ప్రాణమని పలు సందర్భాల్లో వెల్లడైంది. పెద్ద కొడుకు ఆకాశ్ పెళ్లితో పాటు, వారి గారాల పట్టి ఇషా పెళ్లిని కూడా పిరమాల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమాల్‌తో నిశ్చయమైన సంగతి తెలిసిందే. ఇషా పెళ్లి ప్రకటన చేసిన అనంతరం నిర్వహించిన పార్టీల్లో ముఖేష్ తన కూతురితో కలిసి డ్యాన్స్‌లు కూడా వేశారు. ఇటీవల ఆకాశ్-శ్లోకాల ఎంగేజ్మెంట్లో కూడా ముఖేష్ తన కూతురి ఇషాతో వేసిన డ్యాన్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. -
ఈ చిక్కులు వారి చలవే..
సాక్షి,కోల్‌కతా: సులభతర వాణిజ్యంలో పశ్చిమ బెంగాల్ మెరుగైన సామర్థ్యం కనబరిచినా గత వామపక్ష ప్రభుత్వ హయాం నుంచి సంక్రమించిన సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ప్రవాస భారతీయులు బెంగాల్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులతో తరలిరావాలని పిలుపు ఇచ్చారు.హొరాసిస్ ఏసియా సదస్సును ఉద్దేశించి మమతా బెనర్జీ మాట్లాడారు. సులభతర వాణిజ్యంలో బెంగాల్ ర్యాంక్ గణనీయంగా మెరుగుపడి దేశంలోనే తృతీయ స్ధానానికి ఎగబాకిందన్నారు. 34 ఏళ్ల వామపక్ష పాలనతో కొన్ని అంశాలు ముందుకొచ్చాయని, అవి సమసిపోయేందుకు కొద్దిసమయం పడుతుందన్నారు. బెంగాల్లో మౌలిక సదుపాయాలు, పనిసంస్కృతి గణనీయంగా మెరుగయ్యాయని అన్నారు. జనవరి 16,17 తేదీల్లో జరిగే బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సదస్సుకు హాజరుకావాలని ప్రతినిధులను మమతా బెనర్జీ ఆహ్వానించారు. -
కొత్తూరులో ఇన్వెస్టర్స్ మీట్ : హాజరైన పారిశ్రామిక వేత్తలు
కొత్తూరు (మహబూబ్‌నగర్) : మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలోని ఓ రిసార్ట్‌లో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం 'ఇన్వెస్టర్స్ మీట్' జరిగింది. పలువురు పారిశ్రామిక వేత్తలు హాజరైన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి మాట్లాడుతూ... పరిశ్రమల ఏర్పాటుకు జిల్లాలో ఉన్న వసతులు, సౌకర్యాల గురించి వివరించారు. ముఖ్యంగా కొత్తూరుకు రోడ్డు, రైల్వే వసతులతోపాటు సమీపంలోనే విమానాశ్రయం అందుబాటులో ఉన్నట్టు తెలిపారు.