కోల్‌కతా: బహిరంగ ప్రదేశాల్లో చెత్తను పారవేసే, ఉమ్మివేసే వారిపై బెంగాల్ ప్రభుత్వం కొరడా ఝుళిపించనుంది. ఇలాంటి వ్యక్తులకు గరిష్టంగా రూ.లక్ష జరిమానా విధించేలా ‘కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ బిల్లు’కు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కోల్‌కతాలోని దక్షిణేశ్వర్ కాళీమాత ఆలయాన్ని, రైల్వేస్టేషన్‌ను అనుసంధానిస్తూ గాజు, ఉక్కుతో నిర్మించిన ‘దక్షిణేశ్వర్ వంతెన’ను సీఎం మమతా బెనర్జీ ఇటీవలే ఆవిష్కరించారు. అయితే పలువురు ప్రజలు వంతెనపై పాన్‌మసాలా ఉమ్మివేయడంతో దాని రూపురేఖలే మారిపోయాయి. దీంతో తీవ్ర అసహనానికి లోనైన మమత గరిష్ట జరిమానాగా రూ.లక్ష విధించేలా చట్టాన్ని సవరించారు.
Comments
Please login to add a commentAdd a comment