one lakh
-
నలుగురిని కంటే రూ.లక్ష బహుమతి: పరశురాం బోర్డు
భోపాల్:మధ్యప్రదేశ్(MadhyaPradesh)లో పరశురామ్ కల్యాణ్ బోర్డు(Parashuram Kalyan Board) ఓ ఆసక్తికర ప్రకటన చేసింది. తమ సామాజికవర్గాన్ని పెంచుకునేందుకు బ్రాహ్మణులు ఎక్కువ మంది పిల్లలను కనాలిని పిలుపునిచ్చింది. సోమవారం(జనవరి13) జరిగిన ఓ కార్యక్రమంలో పరశురామ్ కల్యాణ్ బోర్డు అధ్యక్షుడు పండిత్ విష్ణు రాజోరియా ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.మనం మన కుటుంబాలపై దృష్టి పెట్టడం లేదని,ఈ మధ్య యువత ఒక బిడ్డతో సరిపెడుతున్నారన్నారు. ఇది చాలా సమస్యాత్మకంగా మారిందన్నారు. భవిష్యత్ తరాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదేనన్నారు. అందుకే కనీసం నలుగురు సంతానం ఉండాలని పిలుపునిచ్చారు.నలుగురు పిల్లల్ని కనే మహిళలకు బోర్డు తరఫున రూ.లక్ష నజరానా అందిస్తామని ప్రకటించారు.తాను బోర్డు అధ్యక్షుడిగా దిగిపోయిన తర్వాత కూడా ఈ అవార్డు కొనసాగుతుందని రాజోరియా స్పష్టం చేశారు.రాజోరియా చేసిన ప్రకటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: ఇంటి నుంచే కుంభమేళా స్నానం..ఎలాగంటే.. -
ఆస్పత్రిలో ఊర్వశి రౌతేలా.. లక్ష గులాబీలు పంపిన అభిమానులు (ఫోటోలు)
-
ఔనా..! స్లిప్పర్స్‌కు లక్ష!
మీరు విన్నది నిజమే! మన రెగ్యులర్‌గా ఉపయోగించే స్లిప్పర్స్ సౌదీలో అక్షరాలా లక్షకు పైమాటే! కువైట్, చుట్టుపక్కల న్యూస్ పంచుకునే ఓ ఇన్స్టాగ్రామ్ ఖాతాదారు ఒక స్టోర్‌లో రికార్డ్ చేసిన వీడియోను షేర్ చేసింది. ‘అత్యాధునికమైనవి’గా ‘చెప్పు’ కుంటున్న ఈ స్ల్లిప్పర్స్ ధర 4,590 సౌదీ రియాల్స్ పలుకుతోంది. ఇది మన రూ΄ాయలలో లక్షా రెండువేలకు పైగానే! ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ రంగులతో సహా వివిధ రంగులలో ఉన్న స్లిప్పర్స్ జతలను ఓ ఉద్యోగి గ్లాస్ కేస్‌లోంచి తీసి వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తికి చూపించాడు. ఈ వీడియో చూసిన నెటిజనులు... ‘ఇవి మా కుటుంబం వాడే బాత్రూమ్ చెప్పులు’ అని, ‘ఇండియాలో వీటిని టాయిలెట్ ΄ాదరక్షలుగా ఉపయోగిస్తారనీ కామెంట్ చేస్తున్నారు. -
TTD: తిరుమల నుంచి అయోధ్యకు లక్ష లడ్డూలు
సాక్షి, తిరుపతి: అయోధ్య రామాలయానికి తిరుమల శ్రీవారి ప్రసాదాలను పంపుతామని ప్రకటించింది టీటీడీ. ఈ నెల 22న రామాలయం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా దేశమంతా ఎదురుచూస్తోంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల క్షేత్రం నుండి లడ్డులను పంపనున్నారు. అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం సమీపిస్తోంది. మరో 17 రోజుల్లో భారత్‌లోనే అత్యంత అద్భుతమైన రామాలయం ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేయడంలో తలమునకలయ్యారు. అయితే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి తిరుమల లడ్డూలు పంపనున్నట్లు ఆలయ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఒక్కో లడ్డూ 25 గ్రాములు ఉంటుందని చెప్పారు. లక్ష లడ్డూలను అయోధ్యకు చేరవేయనున్నట్లు ధర్మారెడ్డి వెల్లడించారు. ఈ లడ్డులను టీటీడీ ప్రత్యేకంగా తయారు చేయిస్తుంది. భక్తులకు విక్రయించే లడ్డులు 75 గ్రాములు ఉండగా, అయోధ్య లో వచ్చే భక్తుల కోసం లక్ష లడ్డులు ఉచితంగా అందిచనుంది. తిరుమలలోని పోటులో ఈ లడ్డు తయారు చేయిస్తుంది టీటీడీ. త్వరలో అయోధ్యకు చేరుకోనున్నాయి. ఇదీ చదవండి: చేనేత కార్మికుడు నాగరాజుకు సీఎం జగన్ అభినందనలు -
హెయిర్ కటింగ్‌కు రూ.230..చెల్లించింది.. రూ.1.15 లక్షలు.. ఏమైందంటే..?
టెక్నాలజీ పెరిగేకొద్దీ మోసాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. రోజురోజుకు చాలా విచిత్రమైన మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా అమాయకులే ప్రధాన అజెండాగా దుండగులు మోసాలకు పాల్పడుతున్నారు. చైనాలో ఓ వ్యక్తి మోసపోయిన తీరు చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. అంతా.. నాటకీయంగా అనిపించినప్పటికీ ఓ వ్యక్తి హెయిర్ కటింగ్‌కు రూ.230 చెల్లించడానికి రూ.1.15 లక్షలు చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇంతకూ అతడెలా మోసపోయాడో చదివేయండి.. బీజింగ్‌కు చెందిన ఈ వ్యక్తి పేరు లీ. ఇతనికి ఓ హెయిర్ సెలూన్ నుంచి రూ.230 గిఫ్ట్ కార్డ్ వచ్చింది. దానిని వాడుకోవడానికి సెలూన్‌కు వెళ్లాడు. కార్డు చూపించగానే హెడ్ మసాజ్ చేశారు సెలూన్ నిర్వహకులు. అనంతరం లీ ముఖానికి లోషన్‌ను పూశారు. లోషన్ బాటిల్ ఖరీదు రూ.4,582గా బిల్లును చూపించారు. రూ.57,571 ఖరీదైన మరో కూపన్‌ను కొనుగోలు చేసేలా లీని సలూన్ మేనేజర్ ప్రోత్సహించారు. హెయిర్ కట్ చేసే ముందు లీకి బిల్‌ను చూపించారు. కానీ కళ్లద్దాలు పెట్టుకోనందున లీ దాన్ని చూడలేకపోయారు. ఎయిర్ కట్ అనంతరం లీకి అసలు విషయం అర్ధమైంది. రూ.1.15లక్షల బిల్ చెల్లించాల్సిందిగా సెలూన్ యాజమాన్యం అతనిపై ఒత్తిడి చేసింది. డబ్బులు లేవన లీ చెప్పగా.. సెల్‌ఫోన్ ద్వారా లోన్‌కు అప్లై చేసేలా ఒత్తిడి చేశారు. చేసేదేమీ లేక లీ లోన్ ద్వారా ఆ మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చింది. మోసపోయానని తెలుసుకున్న లీ.. ఈ విషయాన్ని స్థానిక మీడియా ద్వారా తెలియజేశారు. తన డబ్బులు తిరిగి ఇప్పించాలని పోలీసులను ఆశ్రయించారు. అయితే.. ఈ ఘటన అనంతరం ఆ సెలూన్ మూసి ఉందని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: వామ్మో..! తాళ్లు లేకుండా 123 ఫ్లోర్ల బిల్డింగ్‌పైకి సగం ఎక్కేశాడు..కానీ.. -
ఇకపై నెలకు లక్ష వీసాలు జారీ
న్యూఢిల్లీ: అమెరికా వీసాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూపులు ఇక బాగా తగ్గే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది వేసవి తర్వాత వీసాల మంజూరుకయ్యే రోజులు బాగా తగ్గిపోతాయని, నెలకి లక్ష వీసాలు మంజూరు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం అధికారి ఒకరు వెల్లడించారు. 2023 ఏడాది వేసవి నాటికి వీసా దరఖాస్తులు 12 లక్షలకు చేరుకుంటాయన్న అంచనాలున్నాయని తెలిపారు. కోవిడ్–19 కారణంగా ఉద్యోగుల సంఖ్య తగ్గిపోవడం, వీసాల జారీ తాత్కాలికంగా నిలిపివేత వంటి కారణాలతో భారతీయులు వీసాల కోసం ఏడాదికి పైగా ఎదుచు చూడాల్సిన పరిస్థితి ఉంది. ‘వీసాల మంజూరులో భారత్‌కు మేము అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. వచ్చే ఏడాది నాటికి కరోనా కంటే ముందున్న పరిస్థితులు వస్తాయి. నెలకి లక్ష వీసాలు మంజూరు చేయడమే మా లక్ష్యం’’ అని ఆయన చెప్పారు. వీసాల త్వరితగతి మంజూరు కోసం సిబ్బందిని పెంచడం, డ్రాప్ బాక్స్ సదుపాయం కల్పన వంటి చర్యల్ని తీసుకుంటామని ఆ అధికారి వెల్లడించారు గతంలో కొన్ని కేటగిరీల వీసా కోసం 450 రోజులు ఎదరుచూడాల్సి వచ్చేదని, ఇప్పుడది తొమ్మిది నెలలకి తగ్గిందని వివరించారు. -
దీపావళి కానుకగా ఖరీదైన గిఫ్టులు ఇచ్చిన పర్యాటక మంత్రి
బెంగళూరు: కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ సింగ్ తన నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన సభ్యులకు ఖరీదైన గిఫ్ట్‌లు ఇచ్చి వివాదంలో చిక్కుకున్నారు. ఈ మేరకు ఆనంద్ సింగ్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రామ పంచాయతీ సభ్యులకు రెండు గిఫ్ట్ బాక్సులను పంపారు. ఐతే మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులకు ఇచ్చిన గిఫ్ట్ బాక్స్‌లో రూ. లక్ష రూపాయలు నగదు, 144 గ్రాముల గోల్డ్, 1 కేజీ వెండి, సిల్క్ చీర, ధోతీ, డ్రై ఫ్రూట్ బాక్స్ ఉన్నాయి. కానీ గ్రామ పంచాయతీ సభ్యులకు పంపిన గిఫ్ట్ బాక్స్‌లో తక్కువ మొత్తంలో నగదు, బంగారం తప్పించి అన్ని ఇతర వస్తువులు ఉండటం గమనార్హం. (చదవండి: ఆ తండ్రి కోరిక నెరవేరింది.. ముగ్గురు కూతుళ్లకు పోలీసు ఉద్యోగం!) -
ఐస్‌క్రీం తిని ఫ్లేవర్ చెప్తే చాలు.. రూ. లక్ష మీవే..
సాక్షి, హైదరాబాద్: హైబిజ్ టీవీ ఆధ్వర్యంలో ‘ది గ్రేట్ ఇండియా ఐస్‌క్రీం టేస్టింగ్ చాలెంజ్’ నిర్వహిస్తున్నట్లు హైబిజ్ టీవీ ఎండీ రాజగోపాల్ తెలిపారు. గురువారం గోల్కొండ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇండియన్ ఐస్‌క్రీం మాన్యుఫ్రాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధీర్‌షా, దొడ్ల డెయిరీ ఐసీక్రీమ్స్ ప్రతినిధి అజయ్ సింహాలతో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 29న హైటెక్స్‌లో ఈ ఛాలెంజ్ నిర్వహిస్తున్నామని, కళ్లకు గంతలు కట్టుకుని ఐస్‌క్రీం రుచి చూసి నగదు బహుమతిని గెలుచుకోవచ్చునన్నారు. ఈ సందర్భంగా నటి, మిస్ఇండియా–2018 స్పందన కళ్లకు గంతలు కట్టుకుని ఏ విధంగా ఐస్‌క్రీం రుచి చూడాలో చేసి చూపించారు. మొదటి బహుమతిగా రూ. లక్ష, రెండో బహుమతి రూ.50 వేలు, ఉత్తమ ప్రతిభ కనబరచిన 25 మందికి రూ. 10 వేల చొప్పున నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ ఛాలెంజ్‌లో పలు ఫ్లేవర్ల ఐస్క్రీంలను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఈ చాలెంజ్‌లో ఎవరైనా పాల్గొనవచ్చునని రూ. 150 ఎంట్రీ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. పోటీల్లో పాల్గొనదలచిన వారు 8340974747 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. చదవండి: రూ. కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్.. ‘వన్ ప్లస్’తో చిక్కాడు! -
కాగ్నిజెంట్‌లో కొలువుల జాతర: లక్ష ఉద్యోగాలు
సాక్షి, ముంబై: అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది సుమారు లక్ష మందిని ఒప్పంద ఉద్యోగులుగా నియమించుకోవాలని కాగ్నిజెంట్ భావిస్తోంది. సంస్థలో అట్రిషన్ రేటు అధికంగా నమోదవుతున్న కారణంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ ఏడాది 30 వేల మంది ఫ్రెషర్లకు ఉద్యోగావకాశాలను కల్పించనుంది. 2022 ఏడాదిలో భారతదేశంలో ఫ్రెషర్లకు 45వేల ఆఫర్లను అందించాలని భావిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. కాగ్నిజెంట్‌కు ఇదొక అసాధారణమైన త్రైమాసికమనీ, అనేక సవాళ్ల మధ్య ముఖ్యంగా కోవిడ్-19 సంక్షోభంలో కూడా రెండవ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 15 శాతం ఎగిసి 4.6 బిలియన్ డాలర్లకు పెరిగిందనీ, 2015 నుండి ఇదే అత్యధిక త్రైమాసిక ఆదాయమని డిజిటల్ బిజినెస్ అండ్ టెక్నాలజీ ప్రెసిడెంట్, కాగ్నిజెంట్ ఛైర్మన్ రాజేష్ అబ్రహం తెలిపారు. కొత్త డిజిటల్ నైపుణ్యాలలో సుమారు 95,000 మందికి శిక్షణ ఇచ్చామన్నారు. 2021లో అత్యధికంగా క్యాంపస్ నియామకాల కింద 30 వేల మందిని, 2022లోఆన్బోర్డింగ్ కింద 45 వేల గ్రాడ్యుయేట్లకు ఆఫర్స్ ఇస్తామన్నారు. అలాగే ఈ ఏడాది సుమారు లక్షమందిని నియమించుకో నున్నట్టు తెలిపారు. తాజా అంచనాల ప్రకారం బీపీవో, ఐటీ సర్వీసుల్లో జూన్ త్రైమాసికం ముగిసే సమయానికి ట్రైనీలు, కార్పొరేట్ ఉద్యోగులు 3 లక్షలమంది సంస్థకు గుడ్‌బై చెప్పారు. ఈ కారణంగానే అట్రిషన్‌ను తగ్గించుకోవడంతోపాటు, కాంపెన్సేషన్, సర్దుబాట్లు, ఉద్యోగ భ్రమణాలు, నైపుణ్యాల మెరుగుదల, ప్రమోషన్లు లాంటి చర్యలపై దృష్టిపెట్టినట్టు కాగ్నిజెంట్ సీఈఓ బ్రియాన్ హంఫ్రీస్ చెప్పారు. దాదాపు లక్షమందిని కాంట్రాక్ట్ విధానంలో నియమించుకోవడంతోపాటు, 2021 లో మరో లక్షమంది అసోసియేట్లకు శిక్షణా కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. ఈ త్రైమాసికంలో డిజిటల్ రెవెన్యూ వృద్ధి సంవత్సరానికి 20 శాతానికి పెరిగిందని వెల్లడించిన ఆయన భవిష్యత్తు ఆశాజనకంగా ఉందన్నారు. మూడవ త్రైమాసిక ఆదాయం 4.69 - 4.74 బిలియన్ డాలర్ల పరిధిలో ఉండనుందని, 10.6-11.6 శాతం వృద్ధిని ఆశిస్తున్నట్లు కాగ్నిజెంట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జాన్ సీగ్మండ్ చెప్పారు. కాగా జూన్ 2020 త్రైమాసికంలో కాగ్నిజెంట్ 41.8 శాతం వృద్దితో, 512 మిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 3,802 కోట్లు) నికర ఆదాయాన్ని నివేదించింది. అలాగే 10.2-11.2 శాతం (స్థిరమైన కరెన్సీలో 9-10 శాతం) వృద్ధి అంచనాలను ప్రకటించింది. కాగ్నిజెంట్‌కు భారతదేశంలో సుమారు 2 లక్షల మంది ఉద్యోగులున్నారు. -
తాజాగా ఆంధ్రప్రదేశ్ లో మరో లక్ష కోవిడ్ వాక్సిన్ లు
-
24 గంటల్లో లక్షకు పైగా రికవరీలు
న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో లక్ష మందికి పైగా రోగులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. ఇటీవల కొద్ది రోజుల నుంచి రికవరీల సంఖ్య భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. సోమవారం ఏకంగా 1,01,468 మంది కరోనా నుంచి కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 44,97,867కు చేరుకుంది. మరోవైపు కొత్త కేసుల సంఖ్య కూడా ఇటీవల వస్తున్న రోజూవారీ కేసులతో పోలిస్తే తగ్గాయి. మంగళవారం 75,809 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 55,62,663కు చేరుకుంది. గత 24 గంటల్లో 1,053 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 88,935 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 9,75,861 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 17.54 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 80.86 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.60 శాతానికి పడిపోయిందని తెలిపింది. సెప్టెంబర్ 21 వరకు 6,53,25,779 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. సోమవారం మరో 9,33,185 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. గత 24 గంటల్లో సంభవించిన మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 344 మంది మరణించారు. మొత్తం మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారతే బెటర్.. నాలుగు రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉంటున్నాయని కేంద్రం తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఉన్న మొత్తం కేసుల్లో భారత్ నుంచి 17.7 శాతం కేసులు ఉన్నాయని చెప్పారు. అయితే కోలుకున్న వారిలో 19.5 శాతం ఉన్నారని చెప్పారు. అమెరికా నుంచి 22.4 శాతం కేసులు ఉండగా, అక్కడ కోలుకున్న వారి శాతం 18.6గా ఉందని చెప్పారు. బ్రెజిల్‌తో పోల్చినప్పటికీ, భారత్ నుంచే రికవరీలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. కోవిడ్–19 టాస్క్‌ఫోర్స్ సభ్యుడు వీకీ పాల్ మాట్లాడుతూ.. రానున్న పండుగ సీజన్లో ప్రజలంతా భౌతిక దూరం పాటించడం వంటివి మరచిపోరాదని చెప్పారు. -
అమ్మమ్మా.. ఇదేందమ్మా!
వీణవంక (హుజూరాబాద్): నెల రోజుల శిశువును అమ్మమ్మ అమ్మేసింది. మనవరాలి ఆలనా పాలనా చూడాల్సిన ఆమె అప్పులు తీర్చుకోవడం కోసం రూ లక్షకు విక్రయించింది. శిశువు కనిపించకపోవడంపై కూతురు నిలదీయడం.. తల్లీకూతుళ్ల గొడవను ఓ వ్యక్తి డయల్ 100కు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన జమల్పూరి పద్మ, రమేశ్ నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లో నెల రోజుల క్రితం పద్మ ఆడశిశువుకు జన్మనిచ్చింది. వారం క్రితం భర్తతో గొడవ పడిన పద్మ.. స్వగ్రామంలోని తల్లి కనకమ్మ ఇంటికి వచ్చింది. కూతురికి మాయమాటలు చెప్పిన కనకమ్మ.. నాలుగు రోజుల క్రితం శిశువును పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి రూ.1.10 లక్షలకు విక్రయించింది. శిశువు కనిపించకపోవడంతో తల్లిని నిలదీయగా మాయమాటలు చెప్పి కాలం వెళ్లదీసింది. పద్మ గట్టిగా నిలదీయడంతో డబ్బులకు అమ్మేశానని చెప్పడంతో రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు శుక్రవారం విచారణ జరిపారు. ప్రేమ వివాహం నచ్చనందుకే..! పద్మకు గతంలోనే వివాహమైంది. కుమారుడు, కూతురు ఉన్నారు. రమేశ్‌ను రెండో వివాహం చేసుకుంది. కులాంతర వివాహం చేసుకోవడంతో తల్లికి నచ్చలేదు. కూతురుపై కక్ష పెంచుకుంది. భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో అదునుగా తీసుకున్న కనకమ్మ.. కూతురును తన ఇంటికి తీసుకొచ్చింది. శిశు విహార్‌కు తరలింపు శిశువు విక్రయంపై ఎస్సై కిరణ్‌రెడ్డి పూర్తి స్థాయిలో విచారణ జరిపి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరు పర్చేందుకు కరీంనగర్‌లోని శిశువిహార్‌కు తరలించారు. కాగా, శిశువు విక్రయంలో కొందరు మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు తెలిసింది. కనకమ్మ రూ.2 లక్షలు డిమాండ్ చేయగా రూ.1.10 లక్షలకు బేరం కుదిర్చినట్లు సమాచారం. -
5 రోజుల్లోనే మరో లక్ష
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా ప్రతీ రోజూ 19 వేలు దాటి కేసులు నమోదవుతూ ఉండడంతో మొత్తం కేసుల సంఖ్య 6 లక్షలను మించిపోయింది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు 19,148 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 6,04,641కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయిదు లక్షల మార్కు దాటిన అయిదు రోజుల్లోనే ఆరు లక్షల కేసులు దాటేయడం ఆందోళన కలిగించే అంశం. మొత్తంగా మరణించిన వారి సంఖ్య 17,834కి చేరుకుంది. ఇక కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,59,859గా ఉంది. రికవరీ రేటు 59.52 శాతంగా ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంది. అయితే రష్యాతో పోల్చి చూస్తే మన దేశంలో 55 వేల కేసులు మాత్రమే తక్కువ ఉన్నాయి. ఇదే స్థాయిలో కేసులు నమోదైతే అయిదారు రోజుల్లోనే రష్యాను మించి భారత్ మూడోస్థానంలోకి చేరుకుంటుందని నిపుణుల అంచనా. కోవిడ్ మృతదేహాల అప్పగింతలో ఆలస్యం వద్దు: కేంద్రం కోవిడ్–19 అనుమానిత లక్షణాలతో చనిపో యిన వ్యక్తుల మృతదేహాలను వారి సంబంధీ కులకు వెంటనే అప్పగించాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. మృతుల పరీక్షల ఫలితాలు వచ్చే వరకు ఎదురు చూడవద్దని తెలిపింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) రాజీవ్ గర్గ్ రాష్ట్రాలకు లేఖ రాశారు. -
మరో న్యూయార్క్‌గా మహారాష్ట్ర
సాక్షి, ముంబై: కరోనా వైరస్ ఉక్కు పిడికిలిలో చిక్కుకొని మహారాష్ట్ర విలవిలలాడుతోంది. దుబాయ్ నుంచి వచ్చిన పుణే జంటకు మార్చి 9న కోవిడ్–19 సోకిన దగ్గర్నుంచి 96 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా లక్ష కేసులు దాటేశాయి. మహారాష్ట్ర కనుక ఒక దేశమే అయి ఉంటే, వరల్డో మీటర్ ప్రకారం ప్రపంచంలో అత్యధిక కేసుల్లో 17వ స్థానంలో ఉన్నట్టు లెక్క. చైనా, కెనడా వంటి దేశాలను కూడా దాటి పోయి రోజురోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. 50 వేలు కేసులు నమోదు కావడానికి 77 రోజుల సమయం తీసుకుంటే మరో 50 వేల కేసులు కేవలం 19 రోజుల్లో దాటాయంటే వైరస్ ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతోందో అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో మూడో వంతు కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. ఇప్పటివరకు 1,01,141 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో సగానికి పైగా కేసులు వాణిజ్య రాజధాని ముంబైని వణికిస్తున్నాయి. నగరంలో మొత్తంగా 55,451 కేసులు నమోదు కావడం కలవరపెట్టే అంశం. ముంబై తర్వాత థానేలో 16,443 కేసులు, పుణేలో 11,281 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 3,717 మంది ప్రాణాలు కోల్పోతే ముంబైలో మృతుల సంఖ్య 2,044గా ఉంది. 3 వేల కంటైన్మెంట్ జోన్లు మహారాష్ట్ర వ్యాప్తంగా 3 వేలకు పైగా కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. ఒకే ప్రాంతంలో వరసగా 28 రోజులు కొత్త కేసులు నమోదు అవకపోతే ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ నుంచి మినహాయిస్తారు. ముంబైలో 4,500 భవనాల్లో కరోనా కేసులు బయట పడడంతో అక్కడ్నుంచి రాకపోకలు నిలిపివేశారు. బెడ్స్ లేక ఒకే మంచంపై ఇద్దరు రోగుల్ని ఉంచి చికిత్స అందిస్తున్నారు. న్యూయార్క్ కంటే ప్రమాదకరమైన స్థితిలోకి ముంబై వెళ్లిపోతోంది. వెంటిలేటర్ కావాలంటే 2 గంటలు కంటే ఎక్కువ సేపు వేచి చూడాల్సి వస్తోందని స్వయంగా ఆస్పత్రి వైద్యులే చెబుతున్నారు. ఎందుకిన్ని కేసులు ? ► 11,6 కోట్ల మంది జనాభా ఉన్న మహారాష్ట్రలో ప్రతీ చదరపు కిలోమీటర్‌కి 370 మంది నివసిస్తారు. ముంబై నగరంలో 42 శాతం జనాభా మురికివాడల్లోనే ఉంటారు. వీరే కరోనా వ్యాప్తికి క్యారియర్స్‌గా మారారు. ► లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు విధుల్లోకి వచ్చారు. దుకాణాలన్నీ తెరవడంతో జనం రోడ్లపై భారీ సంఖ్యలో కనిపిస్తున్నారు. ► లాక్డౌన్ సమయాన్ని ఆరోగ్య రంగంలో సదుపాయాలు పెంచుకోవడానికి వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ► రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉండడంతో కరోనా కట్టడి చర్యల్లో పార్టీల మధ్య సమన్వయం కొరవడింది.. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకి పాలనా అనుభవం లేకపోవడంతో కేసుల కట్టడికి క్రమబద్ధమైన ప్రణాళిక రూపొందించలేకపోయారు. నియంత్రణలో ఉంది: రాజేశ్ తోపే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌కు రెండు రోజుల ముందే అంటే మార్చి 23 నుంచే మహారాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ నిర్ణయం తీసుకుంది. అప్పటికి రాష్ట్రంలో 97 కేసులు మాత్రమే ఉండేవి. అయితే మహారాష్ట్ర జనాభా, జనసాంద్రతతో పోల్చి చూస్తే కేసుల్ని బాగా నియంత్రించామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే అంటున్నారు. వైరస్‌ను నియంత్రించడానికి తొలిదశలో లాక్డౌన్ సాయపడిందన్నారు. అమెరికా, యూరప్ దేశాలతో పోల్చి చూస్తే మహారాష్ట్ర పరిస్థితి అంత ఘోరంగా లేదని రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 47.34% ఉంటే, మరణాల రేటు 3.7%గా ఉంది. -
లక్ష దాటేశాయ్..!
పేరుకే లాక్డౌన్ అమల్లో ఉంది. ఆర్థిక రంగాన్ని నిలబెట్టడానికి ఒక్కొక్కటిగా ఆంక్షలు సడలిస్తున్నారు. కరోనాతో సహజీవనం ఇక తప్పదు. ఇప్పటికే లక్ష కేసులు దాటేశాం. అయినా ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే లాక్డౌన్ సమర్థవంతంగానే పనిచేసిందనే చెప్పాలి భారత్‌లో లాక్‌లు తెరుచుకుంటున్నాయి. ఒక్కో రాష్ట్రం కేసుల ఆధారంగా ఆంక్షలు సడలిస్తోంది. చాలా రాష్ట్రాలు మార్కెట్లు తెరిచినా అంతర్రాష్ట్ర రాకపోకలపై నిషేధం కొనసాగిస్తున్నాయి. రాకపోకలు ఎక్కువైతే భౌతిక దూరం పాటించడానికి వీలుకాక కేసులు పెరిగిపోతాయన్న ఆందోళన ప్రభుత్వాల్లో ఉంది. ఇతర దేశాలతో పోల్చి చూస్తే మనం కరోనాని బాగా కట్టడి చేశామనే అభిప్రాయం నెలకొంది. ప్రపంచ దేశాల్లో ప్రతీ లక్ష మందిలో సగటున 60 మందికి వైరస్ సోకితే, భారత్‌లో ఏడుగురికి మాత్రమే సోకింది. ఇప్పటివరకు 25 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించాం. భారత్‌లో మే 18న అత్యధికంగా 5,242 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక రికవరీ రేటు కూడా భారత్‌లో ఎక్కువగానే ఉంది. దేశంలో కోవిడ్ రోగుల సగటు రికవరీ రేటు 40% ఉంటే మృతుల సగటు రేటు 3.1%గా ఉంది. సెకండ్ వేవ్? భారత్‌లో లక్ష కోవిడ్ కేసుల్లో 67శాతం ఈ నెలలో నమోదయ్యాయి. గత రెండు రోజుల్లో 11శాతానికిపైగా కేసులు నమోదు కావడం ఆందోళన పుట్టిస్తోంది. కేసులు ఇలా పెరుగుతూ ఉంటే మరో 8 రోజుల్లో లక్షా 50 వేల కేసులు దాటేస్తామని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేరళ, హిమాచల్‌ప్రదేశ్, అస్సాం, గోవా రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కట్టడికి అందరికీ తోవ చూపించిన గోవాలో మళ్లీ కేసులు నమోదు కావడంతో సెకండ్ వేవ్ మొదలైందా అన్న సందేహాలైతే వస్తున్నాయి. వేరే రాష్ట్రాల నుంచి గోవాకి వచ్చిన వారిలో ఏడుగురికి గత వారంలో కరోనా పాజిటివ్ వచ్చింది. మార్చి చివరి వారం తర్వాత మళ్లీ కేసులు నమోదు కావడం ఇప్పుడే. హిమాచల్ ప్రదేశ్‌లో కరోనాతో బాధపడుతున్నవారందరినీ ఈ నెల మొదట్లో డిశ్చార్జ్ చేసి అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. గత వారం రోజుల్లోనే మళ్లీ 34 మందికి కరోనా సోకడంతో ప్రభుత్వం ఉలిక్కి పడింది. మార్చి 30 తర్వాత కేరళలో సింగిల్ డిజిట్‌లోనే కేసులు నమోదవుతూ వచ్చాయి. కానీ గత నాలుగైదు రోజుల్లోనే 50కి పైగా కేసులు నమోదయ్యాయి. గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన వారితో ఈ కొత్త కేసులు వచ్చాయి. అదే విధంగా అసోంలో 40 మందికి కోవిడ్ సోకడం అందరిలోనూ ఆందోళన పెంచుతోంది. బిహార్‌కి వలస కూలీల టెన్షన్ ఢిల్లీ నుంచి బిహార్ వస్తున్న వలస కూలీలకి కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతూ ఉండడంతో ఆ రాష్ట్రంలో తీవ్రమైన ఆందోళన నెలకొంది. రాజధాని నుంచి వచ్చిన వలస కూలీల్లో 835 మందిలో 218 మందికి కరోనా సోకిందని పరీక్షల్లో వెల్లడైందని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతీ నలుగురిలో ఒకరికి కరోనా ఉండడంతో క్వారంటైన్ నిబంధనల్ని మరింత కఠినతరం చేసింది. బిహార్‌తో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్, యూపీ రాష్ట్రాలకు తిరిగివస్తున్న వలస కూలీలతో వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందన్న ఆందోళన నెలకొంది. -
కోవిడ్ కేసులు లక్ష పైనే
బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బాధితుల సంఖ్య శనివారం నాటి లెక్కల ప్రకారం లక్ష దాటిపోగా, 3500 మందికిపైగా చనిపోయారు. చైనాలోని వూహాన్ సిటీలో గత డిసెంబరులో తొలిసారి కరోనా వైరస్‌ను గుర్తించగా.. తాజాగా ఇది 97 దేశాలకు విస్తరించడం ప్రపంచ ఆరోగ్య సంస్థను ఆందోళనకు గురి చేస్తోంది. భూటాన్, కామరూన్, సెర్బియా, దక్షిణాఫ్రికాల్లో కొత్తగా కోవిడ్ కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వేసవి కారణంగా వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతుందన్న అంచనాలకు శాస్త్రీయ ఆధారాలేవీ లేవని, అన్ని దేశాలూ వైరస్ కట్టడికి చేస్తున్న ప్రయత్నాల తీవ్రతను తగ్గించరాదని డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ రయన్ స్పష్టం చేశారు. అమెరికాలో కోవిడ్ కారణంగా 14 మంది, ఇటలీలో 233 మంది మరణించారు. చైనాలో కొత్త కేసులూ తగ్గుముఖం చైనాలో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 3070కు చేరుకుందని చైనా ఆరోగ్య కమిషన్ అధికారులు శనివారం తెలిపారు. వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయిన వారి సంఖ్య 80,651గా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఇది 1.02 లక్షలకు చేరుకుందని వివరించారు. చైనా మొత్తమ్మీద శుక్రవారం 28 మంది మరణించగా, కొత్తగా 99 మందికి వైరస్ సోకింది. ఒక రోజులో కొత్తగా వ్యాధి సోకిన వారి సంఖ్య వంద కంటే తక్కువగా ఉండటం ఇదే తొలిసారి. వ్యాధి తీవ్రత తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో హుబే ప్రాంతంలో క్వారంటైన్ (విడిగా ఉంచడం)ను ఎత్తివేయనున్నట్లు చైనా సూచన ప్రాయంగా తెలిపింది. చైనా పొరుగునే ఉన్న దక్షిణ కొరియాలో శనివారం నాటికి వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య ఏడు వేలకు చేరుకుంది. ఇరాన్ లో ఇప్పటివరకు 145 మంది మరణించారు. వ్యాధిసోకిన వారి సంఖ్య 5823కి చేరినట్లు అయింది. ‘కోవిడ్’ భవనం కూలింది కోవిడ్ బాధితులను చికిత్స కోసం ఉంచిన ఓ భవనం కూలింది. చైనాలోని ఫుజియాన్ ప్రావిన్సు క్వాన్ఝౌ నగరంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. 80 గదులున్న ఓ హోటల్‌ను ప్రస్తుతం కోవిడ్ బాధితుల క్వారంటైన్ కోసం ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకు 30 మందిని రక్షించామని, శిథిలాల కింద మరో 70 మంది చిక్కుకుని ఉంటారని అధికారులు తెలిపారు. -
లక్షకు మించి రుణాలుంటే పోటీకి అనర్హులు
సాక్షి, హైదరాబాద్: లక్ష రూపాయలకు మించి రుణాలున్న రైతులెవరైనా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారు. లక్ష రూపాయలలోపున్న రైతులకు మాత్రం పోటీ చేయడానికి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల్లోపు రుణమాఫీ ప్రకటించినందున, ఆ మేరకు మినహాయింపు ఇస్తూ సహకార ఎన్నికల అథారిటీ అంతర్గత ఆదేశాలు జారీ చేసింది. ఎవరికైనా రూ.లక్షకు మించి రుణాలుంటే, వారు నామినేషన్ నాటికి లక్షకు పైబడి ఉన్న బకాయిలను చెల్లించాలి. లేదంటే వారి నామినేషన్‌ను తిరస్కరిస్తారు. అదీ రుణమాఫీకి గడువుగా ప్రకటించిన గతేడాది డిసెంబర్ 11లోపు రూ.లక్షలోపు బకాయి ఉన్న రైతులకే వర్తిస్తుంది. ఆ తర్వాత అంతకంటే ఎక్కువ అప్పు చేసి ఉంటే దాన్ని చెల్లించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులకే ఈ నిబంధనలు వర్తిస్తాయి. వాణిజ్య బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులకు ఈ నిబంధనలు వర్తించబోవని స్పష్టంచేశారు. బకాయిలు వసూలు చేసేందుకు సహకారశాఖ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. మహిళలు, బీసీలకు చెరో 1,812 పదవులు.. మొత్తం 906 ప్యాక్స్‌కు ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రతీ ప్యాక్స్‌కు 13 మంది డైరెక్టర్లను రైతులు ఎన్నుకుంటారు. వాటిలో 2 డైరెక్టర్ పదవులు మహిళలకు, మరో 2 డైరెక్టర్ పదవులు బీసీలకు, ఒక డైరెక్టర్ పదవి ఎస్సీ, ఎస్టీల్లో ఎవరో ఒకరికి రిజర్వు చేశారు. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 906 ప్యాక్స్‌ల్లో 11,778 డైరెక్టర్ పదవులుంటే, వాటిల్లో మహిళలకు 1,812 డైరెక్టర్ పదవులు రిజర్వు చేసినట్లయింది. బీసీలకూ 1,812 డైరెక్టర్ పదవులు రిజర్వు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు 906 డైరెక్టర్ పదవులు రిజర్వు చేస్తారు. అయితే ప్యాక్స్ చైర్మన్ పదవులను రిజర్వు చేయలేదు. ప్యాక్స్ ఎన్నికలకు దాదాపు రూ.12 కోట్ల మేరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఆ సొమ్మును ప్యాక్స్‌లే సమకూర్చుకోవాలి. లేదంటే డీసీసీబీ బ్యాంకుల నుంచి అప్పుగా తెచ్చుకోవాలి. ఎన్నికలను బ్యాలెట్‌తోనే నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. ప్యాక్స్ డైరెక్టర్లు ఎన్నికయ్యాక, వారంతా ఆయా జిల్లాల్లోని డీసీసీబీ చైర్మన్లను ఎన్నుకుంటారు. డీసీసీబీ చైర్మన్లు టెస్కాబ్ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ప్యాక్స్ ఎన్నికలయ్యాక డీసీసీబీ, టెస్కాబ్ చైర్మన్ల ఎంపిక ఉంటుంది. -
రోడ్లపై ఉమ్మివేస్తే రూ. లక్ష జరిమానా
కోల్‌కతా: బహిరంగ ప్రదేశాల్లో చెత్తను పారవేసే, ఉమ్మివేసే వారిపై బెంగాల్ ప్రభుత్వం కొరడా ఝుళిపించనుంది. ఇలాంటి వ్యక్తులకు గరిష్టంగా రూ.లక్ష జరిమానా విధించేలా ‘కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ బిల్లు’కు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కోల్‌కతాలోని దక్షిణేశ్వర్ కాళీమాత ఆలయాన్ని, రైల్వేస్టేషన్‌ను అనుసంధానిస్తూ గాజు, ఉక్కుతో నిర్మించిన ‘దక్షిణేశ్వర్ వంతెన’ను సీఎం మమతా బెనర్జీ ఇటీవలే ఆవిష్కరించారు. అయితే పలువురు ప్రజలు వంతెనపై పాన్‌మసాలా ఉమ్మివేయడంతో దాని రూపురేఖలే మారిపోయాయి. దీంతో తీవ్ర అసహనానికి లోనైన మమత గరిష్ట జరిమానాగా రూ.లక్ష విధించేలా చట్టాన్ని సవరించారు. -
షావోమీ యూజర్లకు బిగ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: బడ్జెట్ ఫోన్లతో భారతీయ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఆకట్టుకున్న చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమి వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. రెడ్ మి వినియోగదారులకు తక్షణమే లోన్ అందించే సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తోంది. వెయ్యి నుంచి లక్ష రూపాయల వరకు పర్సనల్ లోన్‌ను అందిస్తున్నట్లు గురువారం వెల్లడించింది. ఇందుకు క్రెడిట్ బి (KreditBee )అనే సంస్థతో కలిసి షావోమీ 'ఎంఐ క్రెడిట్ సర్వీస్' అనే ప్రాజెక్ట్‌ను ఇండియాలో ప్రారంభించినట్టు తెలిపింది. ఎంఐ క్రెడిట్ సర్వీస్ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను కూడా రూపొందించింది. ముఖ్యంగా "యువ నిపుణులు కోసం తక్షణ వ్యక్తిగత రుణ వేదిక" ద్వారా ఆర్థిక రుణాన్ని అందివ్వనుట్టు షావోమీ తెలిపింది. సాధారణ కేవైసీ ధృవీకరణతో కేవలం 10 నిమిషాల్లోఈ పక్రియ పూర్తవుతుందని వివరించింది. యంగ్ ప్రొఫెనల్స్ కోసం క్రెడిట్‌బీ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు షావోమీ ఇండియా వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ మను జైన్ చెప్పారు. ‘ఎం ఐ క్రెడిట్’ మరో కీలక ముందడుగు అని ఆయన అభివర్ణించారు. హార్డ్‌వేర్, ఇంటర్నెట్ సేవల మధ్య స్థిరమైన అనుసంధానంతో తమ స్మార్ట్ఫోన్లు యూజర్లకు మంచి అనుభవాన్ని అందించడానికి ఈ ప్లాట్‌ఫాం బాగా ఉపయోగపడుతుందన్నారు. తమ వినియోగదారులకు ఇది నిజంగా లాభదాయకంగా ఉంటుందని తాము విశ్వసిస్తున్నామన్నారు. ఇందుకోసం యూజర్లు తమ వివరాలను యూజర్ (ఆధార్,పాన్)ఎంఐ క్రెడిట్ సర్వీస్‌లో నమోదు చేసుకోవాలి. ఈ వివరాల ఆధారంగా కేవైసీ వెరిఫికేషన్ అనంతరం లోన్‌కు అర్హత ఉందా లేదా అనేది నిర్ధారిస్తారు. కేవలం పది నిమిషాల్లోపే ఈ ప్రక్రియ ముగుస్తుంది. కావాల్సిన లోన్ మొత్తాన్ని ఎంపిక చేసుకోవాలి. వెరిఫికేషన్ అనంతరం అర్హులైన వినియోగదారులకు యూజర్ బ్యాంక్ అకౌంట్లో మనీ క్రెడిట్ అవుతుంది. ఈ విధంగా పొందిన పర్సనల్ లోన్‌పై 3 శాతం వడ్డీని వసూలు చేస్తారు. 15 నుంచి 90 రోజుల్లో లోన్ క్లియర్ చేయవచ్చు. క్రెడిట్ బీ యాప్ ద్వారా ఈ లోన్‌ను తిరిగి చెల్లించవచ్చు. అయితే ఈ అవకాశం ఎంఐయుఐ యూజర్లకు మాత్రమేనని, షావోమీ ఎంఐ ఎ1 లాంటి ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈ లోన్ సదుపాయం వర్తించదని షావోమి స్పష్టం చేసింది. -
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం లక్ష్యం
ముస్తాబాద్(సిరిసిల్ల): గ్రామీణప్రాంత పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడం లక్ష్యంగా పనిచేస్తున్నామని ఐఏంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చింతోజు శంకర్ అన్నారు. ముస్తాబాద్ పీపుల్స్ హాస్పిటల్‌కు చెందిన ప్రముఖ వైద్యులు శంకర్ లక్ష ఆపరేషన్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జెడ్పీటీసీ శరత్‌రావు గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ నలభై ఏళ్ల క్రితం ఎంబీబీఎస్, డీజీవో పూర్తి చేసి ముస్తాబాద్‌లో ఆసుపత్రి పెట్టామన్నారు. అతితక్కువ ఖర్చుతో పేదలకు వైద్యం అందిస్తూ తమ ప్రస్థానాన్ని కొనసాగించామన్నారు. ఎన్నో వందలాది క్రిటికల్ కేసులను పరిష్కరించడం ఆత్మ సంతృప్తిని ఇచ్చిందన్నారు. పేదల దేవుడిగా శంకర్ తెలంగాణకే గర్వకారణమని జెడ్పీటీసీ శరత్‌రావు అన్నారు. పిలిస్తే పలికే డాక్టర్‌గా లక్ష సర్జరీలు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ముస్తాబాద్ నేడు వైద్యానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో డాక్టర్ శంకర్, డాక్టర్‌రాజారాంను సన్మానించారు. ఎంపీపీ శ్రీనివా స్, జెడ్పీ కో–ఆప్షన్ సభ్యుడు సర్వర్, సెస్ డైరెక్టర్ విజయరామారావు, సర్పం చ్ నల్ల నర్సయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుర్ర రాములు, డీసీసీ కార్యదర్శి ఓరగంటి తిరుపతి, సంతోష్‌రావు, రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు. -
చేయని నేరాన్ని చితక్కొట్టి ఒప్పించారు
-
శ్రీశైలంలో లక్ష దీపార్చన
-
నిత్య అన్నదాన ట్రస్ట్‌కు రూ.లక్ష విరాళం
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల చినవెంకన్న నిత్యాన్నదాన ట్రస్టుకు ఒక భక్తుడు సోమవారం రూ.1,00,116 లను విరాళంగా అందించాడు. తాడేపల్లిగూడెంకు చెందిన వడ్డి రఘురామ్, సుధ దంపతులు శ్రీవారిని, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం అన్నదాన కార్యాలయంలో ఈ విరాళాన్ని జమ చేశారు. దాతలకు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు బాండ్‌ను అందజేశారు. -
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న నిత్యాన్నదానానికి పోరంకిలోని శ్రీనివాసనగర్‌కు చెందిన యనిగళ్ల భరత్‌కుమార్ శనివారం రూ.లక్ష విరాళంగా అందజేశారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయన రూ.1,00,011 విరాళాన్ని ఆలయ ఈవో అచ్యుతరామయ్యకు ఇచ్చారు. అనంతరం దాతలకు అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. -
సిద్ధేశ్వరుడికి లక్ష పుష్పార్చన
హన్మకొండ పద్మాక్షికాలనీలోని సిద్ధేశ్వరాలయంలో శ్రావణమాసం మాస శివరాత్రిని పురస్కరించుకుని మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం సిద్ధేశ్వరస్వామికి అన్నపూజ చేశారు. తర్వాత గులాబీ, చామంతి పూలతో అలంకరించి లక్ష పుష్పార్చన నిర్వహిం చారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు రవికుమార్, మధుకుమార్, సురేష్‌కుమార్ పాల్గొన్నారు. –న్యూశాయంపేట -
కొడుకులను అమ్మకానికి పెట్టిన తండ్రి
-
వేములవాడ ఆలయంలో లక్షదీపోత్సవం
-
వేదం నాగయ్యకు కేటీఆర్ రూ.లక్ష సాయం
-
'వేదం' నాగయ్యకు కేటీఆర్ రూ.లక్ష సాయం
హైదరాబాద్ : 'వేదం' సినిమాలో సిరిసిల్ల రాములుగా నటించిన నటుడు నాగయ్య దీనస్థితిపై పంచాయతీ, ఐటీశాఖ మంత్ర కేటీఆర్ స్పందించారు. నాగయ్యను తన నివాసానికి పిలిపించి అతనికి రూ.లక్ష చెక్కును అందించారు. కళాకారుల వృద్ధాప్య పింఛన్ కింద నెలకు నాగయ్యకు రూ.1500 అందిస్తామని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. భవిష్యత్‌లో నాగయ్యకు ఇల్లు కూడా మంజూరు చేస్తామని ఆయన చెప్పారు. ప్రాంతమేదైనా వృద్ధ కళాకారులను ఆదుకుంటామని కేటీఆర్ తెలిపారు. దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించిన వేదం చిత్రంలో రాములు పాత్ర ద్వారా నాగయ్య తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. అతడికి అది తొలి చిత్రమే అయినా ఆ పాత్రలో ఒదిగిపోయి నటించాడు. నాగయ్య తన నటనకు ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత రెండు, మూడు చిత్రాల్లో నటించినా ఆ తర్వాత అవకాశాలు రాలేదు. దాంతో అటు సొంత ఊరుకు వెళ్లలేక, ఇటు సినిమా ఛాన్స్‌లు లేక చివరకు ఫిల్మ్ నగర్లో భిక్షాటన చేస్తూ కాలం గడుపుతున్నాడు. నాగయ్య దీనస్థితి గురించి తెలుసుకున్న కేటీఆర్...అతడికి ఆర్థిక సాయం అందించటంతో పాటు పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు. -
లక్ష ఈ-కామర్స్ కొలువులు!
ముంబై: ఆన్లైన్ షాపింగ్ పరిశ్రమలో కొలువుల జోరు పెరగనుంది. ఈ-కామర్స్ మార్కెట్‌కు వచ్చే ఆరు నెలల్లో లక్ష కొత్త ఉద్యోగాల అవసరం ఉందనేది పరిశ్రమ వర్గాల అంచనా. నియామకాలకు సంబంధించిన కన్సల్టెంగ్ సంస్థలకు ఈ-కామర్స్ నుంచి హైరింగ్ విజ్ఞప్తులు భారీగా పెరుగుతున్నాయని గ్లోబల్ హెర్ఆర్ దిగ్గజం ఇన్హెల్మ్ లీడర్షిప్ సొల్యూషన్స్ కంట్రీ హెడ్ ప్రశాంత్ నాయర్ చెప్పారు. రానున్న ఆరు నెలల వ్యవధిలో కనీసం లక్ష కొత్త ఉద్యోగులను నియమించుకునే అవకాశం ఉందన్నారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. 2009లో దేశీ ఈ-కామర్స్ మార్కెట్ విలువ 3.8 బిలియన్ డాలర్లు ఉండగా... 2013లో ఇది 12.6 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. చక్రీయగతిన(సీఏజీఆర్) 30% వృద్ధిని నమోదు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వృద్ధి 8-10 శాతం స్థాయిలో ఉంది. అయితే, కీలక స్థానాల్లో నిపుణులను అట్టిపెట్టుకోవడం దేశీ ఈ-కామర్స్ రంగానికి అతిపెద్ద సవాలు. కంపెనీలు భారీ స్థాయిలో విస్తరణ ప్రణాళికలను అమలు చేస్తుండటంతో.. సిబ్బంది అవసరం కూడా గణనీయంగా పెరుగుతోంది. దీంతో నియామకాల కోసం ఈ రంగంలో నైపుణ్యంగల కన్సల్టెన్సీలపై అధికంగా ఆధారపడుతున్నాయి.