
న్యూఢిల్లీ: ఎన్‌పీఎస్ వాత్సల్య పథకాన్ని లక్ష మంది పిల్లల పేరిట తెరిచినట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి మండలి (పీఎఫ్‌ఆర్‌డీఏ) వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్‌లో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది.
దేశంలో పింఛను సదుపాయం ఉన్నవారు తక్కువగా ఉండడంతో ఈ పథకాన్ని మరింత మందికి చేరువ చేసేందుకు ఎన్నో చర్యలను అమలు చేస్తున్నట్టు పీఎఫ్‌ఆర్‌డీఏ చైర్‌పర్సన్ దీపక్ మహంతి తెలిపారు.
‘అప్పుడే పుట్టిన శిశువులు సైతం ఎన్‌పీఎస్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఆర్ధిక మంత్రి గత సెప్టెంబర్‌లో ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచి లక్ష మందికి పైగా శిశువులు ఎంపిక చేసుకున్నందుకు సంతోషంగా ఉంది’’అని చెప్పారు. ఎన్‌పీఎస్ వాత్సల్యలో 18 ఏళ్లు నిండని వారంతా చేరొచ్చు. పీఎఫ్‌ఆర్‌డీఏ నిర్వహించే అన్ని పింఛను పథకాల కింద (ఎన్‌పీఎస్, ఏపీఎస్) 7 కోట్ల మంది చందాదారులు ఉన్నట్టు మహంతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment