సాక్షి, తిరుపతి: అయోధ్య రామాలయానికి తిరుమల శ్రీవారి ప్రసాదాలను పంపుతామని ప్రకటించింది టీటీడీ. ఈ నెల 22న రామాలయం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా దేశమంతా ఎదురుచూస్తోంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల క్షేత్రం నుండి లడ్డులను పంపనున్నారు.
అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం సమీపిస్తోంది. మరో 17 రోజుల్లో భారత్‌లోనే అత్యంత అద్భుతమైన రామాలయం ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేయడంలో తలమునకలయ్యారు. అయితే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి తిరుమల లడ్డూలు పంపనున్నట్లు ఆలయ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
ఒక్కో లడ్డూ 25 గ్రాములు ఉంటుందని చెప్పారు. లక్ష లడ్డూలను అయోధ్యకు చేరవేయనున్నట్లు ధర్మారెడ్డి వెల్లడించారు. ఈ లడ్డులను టీటీడీ ప్రత్యేకంగా తయారు చేయిస్తుంది. భక్తులకు విక్రయించే లడ్డులు 75 గ్రాములు ఉండగా, అయోధ్య లో వచ్చే భక్తుల కోసం లక్ష లడ్డులు ఉచితంగా అందిచనుంది. తిరుమలలోని పోటులో ఈ లడ్డు తయారు చేయిస్తుంది టీటీడీ. త్వరలో అయోధ్యకు చేరుకోనున్నాయి.
ఇదీ చదవండి: చేనేత కార్మికుడు నాగరాజుకు సీఎం జగన్ అభినందనలు
Comments
Please login to add a commentAdd a comment