Laddus
-
అయోధ్యకు 1,11,111 కేజీల లడ్డూలు
లక్నో: అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి బాల రాముడి ప్రాణప్రతిష్ఠ అనంతరం తొలి రామనవమి వేడుకలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 17న జరిగే ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రామ నవమి సందర్భంగా 1,11,111 కిలోల లడ్డూలను అయోధ్యలోని రామాలయానికి ప్రసాదంగా పంపి భక్తులకు పంపిణీ చేయనున్నట్లు దేవ్రహ హన్స్ బాబా ట్రస్ట్ ట్రస్టీ అతుల్ కుమార్ సక్సేనా తెలిపారు. కాశీ విశ్వనాథ ఆలయం సహా దేశంలోని పలు ఆలయాలకు ప్రతి వారం లడ్డూ ప్రసాదాన్ని పంపుతున్నట్లు ఆయన చెప్పారు. జనవరి 22న అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ రోజున కూడా దేవ్రహ హన్స్ బాబా ఆశ్రమం 40 వేల కిలోల లడ్డూను నైవేద్యంగా పంపినట్లు తెలిపారు. ప్రధాని మోదీ గత జనవరి 22న అయోధ్య రామాలయంలో రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమం జరగుతుండగా ఆర్మీ హెలికాప్టర్లు ఆలయంపై పూలవర్షం కురిపించాయి. ఆరోజు మొదలుకొని అయోధ్యలో సందడి కొనసాగుతోంది. ఏప్రిల్ 17న రామ నవమి సందర్భంగా ఆలయ తలుపులు మూడు రోజుల పాటు 24 గంటలూ తెరచి ఉండనున్నాయి. నైవేద్యం సమర్పించేటప్పుడు, అలంకారం చేసేటప్పుడు మాత్రమే తలుపులు మూసివేయనున్నారు. శ్రీరాముని జన్మదినోత్సవ వేడుకలకు అయోధ్యకు వచ్చే రామభక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. -
TTD: తిరుమల నుంచి అయోధ్యకు లక్ష లడ్డూలు
సాక్షి, తిరుపతి: అయోధ్య రామాలయానికి తిరుమల శ్రీవారి ప్రసాదాలను పంపుతామని ప్రకటించింది టీటీడీ. ఈ నెల 22న రామాలయం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా దేశమంతా ఎదురుచూస్తోంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల క్షేత్రం నుండి లడ్డులను పంపనున్నారు. అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం సమీపిస్తోంది. మరో 17 రోజుల్లో భారత్‌లోనే అత్యంత అద్భుతమైన రామాలయం ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేయడంలో తలమునకలయ్యారు. అయితే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి తిరుమల లడ్డూలు పంపనున్నట్లు ఆలయ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఒక్కో లడ్డూ 25 గ్రాములు ఉంటుందని చెప్పారు. లక్ష లడ్డూలను అయోధ్యకు చేరవేయనున్నట్లు ధర్మారెడ్డి వెల్లడించారు. ఈ లడ్డులను టీటీడీ ప్రత్యేకంగా తయారు చేయిస్తుంది. భక్తులకు విక్రయించే లడ్డులు 75 గ్రాములు ఉండగా, అయోధ్య లో వచ్చే భక్తుల కోసం లక్ష లడ్డులు ఉచితంగా అందిచనుంది. తిరుమలలోని పోటులో ఈ లడ్డు తయారు చేయిస్తుంది టీటీడీ. త్వరలో అయోధ్యకు చేరుకోనున్నాయి. ఇదీ చదవండి: చేనేత కార్మికుడు నాగరాజుకు సీఎం జగన్ అభినందనలు -
పండుగ స్పెషల్ గా ఈ రుచికరమైన లడ్డూలు
కావలసిన పదార్థాలు: శనగపిండి – 2 కప్పులు, ఏలకుల పొడి – 1 టీ స్పూన్, లెమన్ ఎల్లోకలర్ – చిటికెడు, పంచదార – రెండున్నర కప్పులు, ఆరెంజ్ కలర్ – చిటికెడు, రిఫైండ్ నూనె – వేయించటానికి తగినంత తయారు చేసే విధానం: శనగపిండిలో 2 కప్పుల నీళ్ళు కలిపి దీనిలో కొంత భాగానికి ఆరెంజ్ కలర్, ఇంకొంత భాగానికి లెమన్ రంగును చేర్చి చిన్న రంధ్రాల జల్లెడ సహాయంతో దోరగా వేయించుకోవాలి. మందపాటి గిన్నెలో పంచ దారకు ఒక కప్పు నీళ్ళు చేర్చి లేతపాకం తయారు చేసుకున్న బూందీని పాకంలో సుమారు ఒక గంటసేపు ఉంచి ఏలకుల పొడి, కలిపి లడ్డూగా చుట్టుకోవాలి. (చదవండి: వినాయక చవితి స్పెషల్: సేమిలా లడ్డు.. ఇలా చేసుకోండి) -
రాజన్న లడ్డూ భోగం ధరలు మరింత ప్రియం
వేములవాడ: ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడలోని రాజరాజేశ్వరి స్వామి(రాజన్న) లడ్డూ భోగం ప్రసాదాలు మరింత ప్రియం అయ్యాయి. వీటి ధరలను దేవాదాయ శాఖ భారీగా పెంచేసింది. లడ్డూ భోగం (40 లడ్డూలు) రూ.400లు ఉండగా దానిని రూ.700లకు పెంచింది. సిరా భోగం రూ.౩౦౦ నుంచి రూ.600 లకు, దధ్యోజనం రూ.150 నుంచి రూ.300 లకు పెంచింది. పెరిగిన ధరలు ఈ నెల 13వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని ఇ.ఒ. దూస రాజేశ్వర్ తెలిపారు. -
అదే దందా
► తిరుమలలో ఆగని లడ్డూ అక్రమ విక్రయాలు ► ఇంటిదొంగల చేతివాటంతో పెచ్చుమీరుతున్న వైనం ► పట్టించుకోని విజిలెన్స్ విభాగం ► వేసవిలో మరిన్ని విక్రయాలకు రంగం సిద్ధం తిరుమలేశుని లడ్డూల అక్రమ దందా ఆగడం లేదు. ఇంటిదొంగల చేతివాటంతో దళారులు రెచ్చిపోతున్నారు. అందినకాడికి లడ్డూలను అడ్డదిడ్డంగా అమ్మేస్తున్నారు. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని అక్రమ విక్రయాలు సాగించేందుకు సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. సాక్షి, తిరుమల : తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారి దర్శనం, లడ్డూ ప్రసాదం కోసం ఎంత ఖర్చుచేయడానికైనా వెనుకాడరు. భక్తుల అవసరాలు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. లడ్డూ దళారులు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో లడ్డూ టోకెన్లు ఇచ్చే సిబ్బంది, స్కానింగ్ చేసే సిబ్బంది, లడ్డూ కౌంటర్ సిబ్బంది, లడ్డూ ట్రే లిఫ్టర్లు.. ఇలా సామూహికంగా కలసిపోయి అక్రమ దందాను నడిపిస్తున్నారు. భక్తులకు అందాల్సిన లడ్డూలను నల్లబజారులోకి తరలిస్తున్నారు. సరిపడా లడ్డూలు తయారు చేస్తున్నా.. సరాసరిగా రోజూ 72 వేల మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. వీరికోసం టీటీడీ రోజూ 3 లక్షల లడ్డూలు తయారుచేసి విక్రయిస్తోంది. సర్వదర్శనం భక్తులకు ఒక్కొక్కరికి 4 (రూ.25 చొప్పున రెండు, రూ.10 చొప్పున 2), కాలిబాట భక్తులకు ఒకరికి 5 (ఒకటి ఉచితం, రూ.25 చొప్పున రెండు, రూ.10 చొప్పున 2), రూ.300 టికెట్ల భక్తులకు ఒకరికి 2, వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల భక్తులకు ఒకరికి 2, వివిధ దర్శన టికెట్లతోపాటు అదనపు లడ్డూల కోసం రూ.25 నగదు చెల్లించిన వారికి 2 నుంచి 6 లడ్డూలు పొందవచ్చు. టీటీడీ తయారు చేసే లడ్డూలు భక్తులకు చాలడం లేదు. భక్తులు బయటవ్యక్తులను ఆశ్రయించాల్సి వస్తోంది. దొడ్డిదారిలో కాలిబాట టోకెన్లు, సబ్సిడీ లడ్డూ టోకెన్ల దాటవేత ఓ లడ్డూ తయారు చేయడానికి టీటీడీకి ప్రస్తుతం రూ.35 దాకా ఖర్చవుతోంది. ధర్మప్రచారం, సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని టీటీడీ కాలిబాటల్లో నడిచి వచ్చిన భక్తులకు ఒక లడ్డూ ఉచితంగా అందజేస్తోంది. కాలిబాటతోపాటు సర్వదర్శనం భక్తులకు సబ్సిడీ ధరతో రూ.20కే రెండు లడ్డూలు అందజేస్తున్నారు. రూ.25 చొప్పున రూ.50కి మరో రెండు లడ్డూలు ఇస్తుంటారు. కాలిబాటలో వచ్చిన భక్తులకు ఒకరికి ఉచిత లడ్డూతో కలిపి 5 లడ్డూ టోకెన్లు, సర్వదర్శనం భక్తులకు 4 లడ్డూల టోకెన్లు పొందే అవకాశం ఉంది. వీటిలో దాదాపు 20 శాతం వరకు దొడ్డిదారిలో తరలివెళుతున్నట్టు విమర్శలున్నాయి. ఇంటిదొంగల చేతివాటంతోనే.. కాలిబాటల్లో నడిచివచ్చే భక్తులకు ఇచ్చే టోకెన్లకు ఒక లడ్డూ ఉచితంగా పొందవచ్చు. అలాంటి టోకెన్లను కొందరు సిబ్బంది దొడ్డిదారిన దళారులకు అందజేస్తుంటారు. వాటిని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో కొందరు స్కానింగ్ సిబ్బందితో ఒప్పందం కుదుర్చుకుని పద్ధతి ప్రకారం స్కానింగ్ చేస్తారు. వాటిని వెలుపల ట్రేలిఫ్టర్లు దళారులకు అందజేస్తారు. కాలిబాట భక్తులకు రూ.20 రెండు లడ్డూల సబ్సిడీ టోకెన్లు కూడా అదే పద్ధతి ప్రకారమే వెలుపల దళారులకు అందజేస్తారు. వాటిని భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తుంటారు. అక్రమ వాటాలు శ్రీవారి లడ్డూ అక్రమ విక్రయాల్లో ఇంటి దొంగలదే హవా. కౌంటర్ సిబ్బంది నుంచి ట్రే లిఫ్టర్ల వరకు ఎక్కువ మంది ఈ అక్రమాల్లో వాటాదారులే. కొందరు నేరుగా భక్తులకు లడ్డూలు విక్రయిస్తుంటారు. మరికొందరు దళారులతో ఈ అక్రమ దందా నడిపిస్తున్నారు. ఆలయ సమీప ప్రాంతాల్లో సుమారు 200మందికిపైగా లడ్డూ దళారులు అక్రమ విక్రయాలు సాగిస్తున్నట్టు సమాచారం. ఇంటి దొంగల్ని పట్టించుకోని విజిలెన్స్ టీటీడీ విజిలెన్స్ విభాగం ఇంటిదొంగల విషయంలో చోద్యం చూస్తోంది. దీనికి కారకులైన ఇంటిదొంగల్ని ఏరివేయడంలో సంబంధిత అధికారులు చొరవ చూపడం లేదనే విమర్శలున్నాయి. టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు ఆదేశాలతో కొన్నాళ్లు తగ్గినా మళ్లీ లడ్డూల అక్రమ దందా పుంజుకుంది. ఈ వేసవి రద్దీలో కాసులు దండుకోవాలని ఇంటిదొంగలు, దళారులు నిమగ్నమైనట్లు సమాచారం. -
శ్రీవారి పోటులో అగ్నిప్రమాదం
– ఇద్దరు కార్మికులకు గాయాలు సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలోని లడ్డూ తయారీ పోటులో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పోటు కార్మికులు గాయపడ్డారు. శ్రీవారి ఆలయంలోని పోటులో లడ్డూల తయారీతో పాటు వివిధ రకాల ప్రసాదాలను తయారు చేస్తారు. బుధవారం సాయంత్రం కెజీ.రమేష్, వరద అనే కార్మికులు వడలను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. వడలను వేడివేడి నెయ్యిలో వేస్తున్న సమయంలో నెయ్యి ఎగిసి కింద ఉన్న మంటపై పడింది. దీంతో ఒక్కసారి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో కేజీ రమేష్ తప్పించుకునేందుకు వెనక్కి తిరిగాడు. దీంతో అతని వీపు బాగా కాలింది. పక్కనే ఉన్న మరో కార్మికుడు వరద కూడా స్వల్పంగా గాయపడ్డాడు. వారిని హుటాహుటిని స్థానిక అశ్విని ఆస్పత్రికి తరలించి వైద్యం చేశారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న టీటీడీ ఆలయ అధికారులు గాయపడిన వారిని పరామర్శించారు. ఘటన ఎలా జరిగిందని అడిగి తెలుసుకున్నారు. అదృష్టవసాత్తు మంటలు అదుపుకావడంతో భారీ అగ్నిప్రమాదం తప్పింది. -
కొత్త జంటలకు శ్రీవారి లడ్డూలు
తిరుమల : తిరుమల కల్యాణవేదికలో బుధవారం పెళ్లి చేసుకున్న జంటలకు పది చిన్న లడ్డూలు, శ్రీవారి ఆలయం నుంచి అక్షింతలు, కంకణాలు, తిరుచానూరు అమ్మవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ తెప్పించి అందజేశారు. తిరుమలలోని పురోహిత సంఘంలోని కల్యాణవేదిక కేంద్రంగా ఈనెల 25వ తేది నుంచి టీటీడీ ఉచిత వివాహాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం 25 గ్రాముల బరువు కలిగిన 10 ఉచిత లడ్డూలు బహుమానంగా అధికారులు అందజేశారు. అలాగే, శ్రీవారి ఆలయం నుంచి కంకణాలు, అక్షింతలతోపాటు తిరుచానూరు అమ్మవారి ఆలయం నుంచి తెప్పించిన పసుపు, కుంకుమ అందజేశారు. కల్యాణకట్ట డిప్యూటీ ఈవో బేబీ సరోజిని వాటిని కొత్త జంటకు అందజేసి ఆశీర్వదించారు. మలివిడతలో కొత్త జంటలకు శ్రీవారి కానుకగా ఇదే సందర్బంగా ఉచితంగా రూ. 300 టికెట్లతో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. -
టీటీడీలో 60 వేల లడ్డూలు హాంఫట్!
తిరుమల: తిరుమల తిరుపతిలో దేవస్థానం(టీటీడీ)లో మంగళవారం మరో అక్రమ బాగోతం వెలుగుచూసింది. స్వామివారి లడ్డూలను వెంకట రమణ అనే ఉద్యోగి కాజేసినట్టు ఆరోపణలు వెలువెత్తాయి. దాంతో టీటీడీ అధికారులు అతన్ని సస్పెండ్ చేసినట్టు తెలిసింది. అయితే ఏడాది కాలంలో 60 వేల లడ్డూలు కాజేసినట్లు విజిలెన్స్ అధికారులు వెల్లడించారు.