కొత్త జంటలకు శ్రీవారి లడ్డూలు | Srivari laddus for new couples | Sakshi
Sakshi News home page

కొత్త జంటలకు శ్రీవారి లడ్డూలు

Published Wed, Apr 27 2016 8:53 PM | Last Updated on Sat, Oct 20 2018 7:44 PM

కొత్త జంటలకు శ్రీవారి లడ్డూలు - Sakshi

కొత్త జంటలకు శ్రీవారి లడ్డూలు

తిరుమల : తిరుమల కల్యాణవేదికలో బుధవారం పెళ్లి చేసుకున్న జంటలకు పది చిన్న లడ్డూలు, శ్రీవారి ఆలయం నుంచి అక్షింతలు, కంకణాలు, తిరుచానూరు అమ్మవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ తెప్పించి అందజేశారు. తిరుమలలోని పురోహిత సంఘంలోని కల్యాణవేదిక కేంద్రంగా ఈనెల 25వ తేది నుంచి టీటీడీ ఉచిత వివాహాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం 25 గ్రాముల బరువు కలిగిన 10 ఉచిత లడ్డూలు బహుమానంగా అధికారులు అందజేశారు.

అలాగే, శ్రీవారి ఆలయం నుంచి కంకణాలు, అక్షింతలతోపాటు తిరుచానూరు అమ్మవారి ఆలయం నుంచి తెప్పించిన పసుపు, కుంకుమ అందజేశారు. కల్యాణకట్ట డిప్యూటీ ఈవో బేబీ సరోజిని వాటిని కొత్త జంటకు అందజేసి ఆశీర్వదించారు. మలివిడతలో కొత్త జంటలకు శ్రీవారి కానుకగా ఇదే సందర్బంగా ఉచితంగా రూ. 300 టికెట్లతో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement