ఔనా..! స్లిప్పర్స్‌కు లక్ష! | Saudi Arabia mall sells hawai chappals for Rs 1 lakh | Sakshi
Sakshi News home page

ఔనా..! స్లిప్పర్స్‌కు లక్ష!

Published Thu, Jul 18 2024 11:33 AM | Last Updated on Thu, Jul 18 2024 11:33 AM

Saudi Arabia mall sells hawai chappals for Rs 1 lakh

మీరు విన్నది నిజమే! మన రెగ్యులర్‌గా ఉపయోగించే స్లిప్పర్స్‌ సౌదీలో అక్షరాలా లక్షకు పైమాటే! కువైట్, చుట్టుపక్కల న్యూస్‌ పంచుకునే ఓ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాదారు ఒక స్టోర్‌లో రికార్డ్‌ చేసిన వీడియోను షేర్‌ చేసింది. ‘అత్యాధునికమైనవి’గా ‘చెప్పు’ కుంటున్న ఈ స్ల్లిప్పర్స్‌ ధర 4,590 సౌదీ రియాల్స్‌ పలుకుతోంది. 

ఇది మన రూ΄ాయలలో లక్షా రెండువేలకు పైగానే! ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ రంగులతో సహా వివిధ రంగులలో ఉన్న స్లిప్పర్స్‌ జతలను ఓ ఉద్యోగి గ్లాస్‌ కేస్‌లోంచి తీసి వీడియో రికార్డ్‌ చేస్తున్న వ్యక్తికి  చూపించాడు. ఈ వీడియో చూసిన నెటిజనులు... ‘ఇవి మా కుటుంబం వాడే బాత్రూమ్‌ చెప్పులు’ అని, ‘ఇండియాలో వీటిని టాయిలెట్‌ ΄ాదరక్షలుగా ఉపయోగిస్తారనీ కామెంట్‌ చేస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement