టెక్నాలజీ పెరిగేకొద్దీ మోసాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. రోజురోజుకు చాలా విచిత్రమైన మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా అమాయకులే ప్రధాన అజెండాగా దుండగులు మోసాలకు పాల్పడుతున్నారు. చైనాలో ఓ వ్యక్తి మోసపోయిన తీరు చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. అంతా.. నాటకీయంగా అనిపించినప్పటికీ ఓ వ్యక్తి హెయిర్ కటింగ్‌కు రూ.230 చెల్లించడానికి రూ.1.15 లక్షలు చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇంతకూ అతడెలా మోసపోయాడో చదివేయండి..
బీజింగ్‌కు చెందిన ఈ వ్యక్తి పేరు లీ. ఇతనికి ఓ హెయిర్ సెలూన్ నుంచి రూ.230 గిఫ్ట్ కార్డ్ వచ్చింది. దానిని వాడుకోవడానికి సెలూన్‌కు వెళ్లాడు. కార్డు చూపించగానే హెడ్ మసాజ్ చేశారు సెలూన్ నిర్వహకులు. అనంతరం లీ ముఖానికి లోషన్‌ను పూశారు. లోషన్ బాటిల్ ఖరీదు రూ.4,582గా బిల్లును చూపించారు. రూ.57,571 ఖరీదైన మరో కూపన్‌ను కొనుగోలు చేసేలా లీని సలూన్ మేనేజర్ ప్రోత్సహించారు.
హెయిర్ కట్ చేసే ముందు లీకి బిల్‌ను చూపించారు. కానీ కళ్లద్దాలు పెట్టుకోనందున లీ దాన్ని చూడలేకపోయారు. ఎయిర్ కట్ అనంతరం లీకి అసలు విషయం అర్ధమైంది. రూ.1.15లక్షల బిల్ చెల్లించాల్సిందిగా సెలూన్ యాజమాన్యం అతనిపై ఒత్తిడి చేసింది. డబ్బులు లేవన లీ చెప్పగా.. సెల్‌ఫోన్ ద్వారా లోన్‌కు అప్లై చేసేలా ఒత్తిడి చేశారు. చేసేదేమీ లేక లీ లోన్ ద్వారా ఆ మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చింది.
మోసపోయానని తెలుసుకున్న లీ.. ఈ విషయాన్ని స్థానిక మీడియా ద్వారా తెలియజేశారు. తన డబ్బులు తిరిగి ఇప్పించాలని పోలీసులను ఆశ్రయించారు. అయితే.. ఈ ఘటన అనంతరం ఆ సెలూన్ మూసి ఉందని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: వామ్మో..! తాళ్లు లేకుండా 123 ఫ్లోర్ల బిల్డింగ్‌పైకి సగం ఎక్కేశాడు..కానీ..
Comments
Please login to add a commentAdd a comment