saloon
-
హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో బ్యూటెక్ కాస్మెటిక్ అండ్ సెలూన్ ఎక్స్పో (ఫోటోలు)
-
ఇదేం పోయేకాలం.. సెలూన్లో షేవింగ్ చేయించుకున్న మహిళ
బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు.. కలియుగంలో వింతలు, విచిత్రాలు జరగుతాయని. అందుకు తగ్గట్లే సోషల్ మీడియా వచ్చాక అవన్నీ నిజమనే సంఘనటలు చాలానే జరిగాయి. తాజాగా మరో వింత సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది చూసిన వాళ్లంతా ఇదేం విచిత్రం అంటూ నోరెళ్లబెడుతున్నారు. ఇలాంటి వింతలు చూస్తామనుకోలేదు అంటూ షాక్ అవుతున్నారు. ఇంతకీ అసలేం జరిగింది?ఆ వింతైన సంఘటన ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. సాధారణంగా అబ్బాయిలు షేవింగ్ కోసం సెలూన్‌కి వెళ్తుంటారు. కానీ తాజాగా ఓ అమ్మాయి సెలూన్‌కి వెళ్లి షేర్ చేయించుకుంది. బార్బర్ ఆమె ముఖం మీద షేవింగ్ క్రీమ్ రాసి అబ్బాయిలకు చేసినట్లే షేవింగ్ చేశాడు. దీనికోసం మగవాళ్లకు వాడే బ్లేడ్‌నే ఉపయోగించడం మరో విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు.. 5జీ కదా.. అన్నీ మరుతుంటాయి. మహిళలు కూడా అన్నింట్లో సమానమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ఏంటీ పిచ్చి పనులు? ఆమె నిజంగా అమ్మాయేనా అంటూ విస్మయం చెందుతున్నారు. బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు. ఇలాంటి వింతలు జరుగుతాయని ఎవడి పిచ్చి వాడికి ఆనందం అంటూ స్పందిస్తున్నారు. గతంలోనూ ఇలాగే ఓ అమ్మాయి షేవింగ్ చేసుకున్న వీడియో ఒకటి టిక్‌టాక్‌లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. రోజూ షేవింగ్ చేయడం చర్మానికి మంచిదని, దీనివల్ల మృణకణాలు తొలిగిపోయి, చర్మం మరింత మృదువుగా, సహజసిద్ధంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. షేవింగ్ వల్ల ఎలాంటి హానీ జరగదని, దీని వెనుక అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని షేవింగ్ వెనుక తనకున్న ఇష్టాన్ని బయటపెట్టింది. -
మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కార్ల చరిత్రకు ఇదే నిదర్శనం (ఫోటోలు)
-
హెయిర్ కటింగ్‌కు రూ.230..చెల్లించింది.. రూ.1.15 లక్షలు.. ఏమైందంటే..?
టెక్నాలజీ పెరిగేకొద్దీ మోసాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. రోజురోజుకు చాలా విచిత్రమైన మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా అమాయకులే ప్రధాన అజెండాగా దుండగులు మోసాలకు పాల్పడుతున్నారు. చైనాలో ఓ వ్యక్తి మోసపోయిన తీరు చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. అంతా.. నాటకీయంగా అనిపించినప్పటికీ ఓ వ్యక్తి హెయిర్ కటింగ్‌కు రూ.230 చెల్లించడానికి రూ.1.15 లక్షలు చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇంతకూ అతడెలా మోసపోయాడో చదివేయండి.. బీజింగ్‌కు చెందిన ఈ వ్యక్తి పేరు లీ. ఇతనికి ఓ హెయిర్ సెలూన్ నుంచి రూ.230 గిఫ్ట్ కార్డ్ వచ్చింది. దానిని వాడుకోవడానికి సెలూన్‌కు వెళ్లాడు. కార్డు చూపించగానే హెడ్ మసాజ్ చేశారు సెలూన్ నిర్వహకులు. అనంతరం లీ ముఖానికి లోషన్‌ను పూశారు. లోషన్ బాటిల్ ఖరీదు రూ.4,582గా బిల్లును చూపించారు. రూ.57,571 ఖరీదైన మరో కూపన్‌ను కొనుగోలు చేసేలా లీని సలూన్ మేనేజర్ ప్రోత్సహించారు. హెయిర్ కట్ చేసే ముందు లీకి బిల్‌ను చూపించారు. కానీ కళ్లద్దాలు పెట్టుకోనందున లీ దాన్ని చూడలేకపోయారు. ఎయిర్ కట్ అనంతరం లీకి అసలు విషయం అర్ధమైంది. రూ.1.15లక్షల బిల్ చెల్లించాల్సిందిగా సెలూన్ యాజమాన్యం అతనిపై ఒత్తిడి చేసింది. డబ్బులు లేవన లీ చెప్పగా.. సెల్‌ఫోన్ ద్వారా లోన్‌కు అప్లై చేసేలా ఒత్తిడి చేశారు. చేసేదేమీ లేక లీ లోన్ ద్వారా ఆ మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చింది. మోసపోయానని తెలుసుకున్న లీ.. ఈ విషయాన్ని స్థానిక మీడియా ద్వారా తెలియజేశారు. తన డబ్బులు తిరిగి ఇప్పించాలని పోలీసులను ఆశ్రయించారు. అయితే.. ఈ ఘటన అనంతరం ఆ సెలూన్ మూసి ఉందని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: వామ్మో..! తాళ్లు లేకుండా 123 ఫ్లోర్ల బిల్డింగ్‌పైకి సగం ఎక్కేశాడు..కానీ.. -
మహిళను వేధించిన కాంగ్రెస్ లీడర్.. ఫ్రెండ్స్‌తో వచ్చి చితకబాదిన లవర్
బెంగళూరు: మహిళను లైంగికంగా వేధించిన కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు మనోజ్ కర్జాగిని పోలీసులు అరెస్టు చేశారు. తన సెలూన్లో బ్యుటీషియన్‌గా పనిచేసే మహిళతో అతను అసభ్యంగా ప్రవర్తించాడు. ధార్వాడ్ జిల్లాలో శనివారం ఈ ఘటన జరిగింది. తాను సెలూన్లో ఉన్నప్పుడు మనోజ్ వచ్చి బలవంతంగా వాటేసుకుని ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు జరిగిన విషయాన్ని తన ప్రియుడికి వెంటనే తెలియజేసింది. దీంతో అతను మరో ఇద్దరు స్నేహితులతో కలిసి సెలూన్‌కు వచ్చి కాంగ్రెస్ నేతను చితకబాదాడు. మనోజ్ కర్జాగిని అరెస్టు చేసినట్లు పోలీసులు ధ్రువీకరించారు. అతను తమ హయాంలో ఓ మంత్రికి సహాయకుడిగా పనిచేశాడని కాంగ్రెస్ తెలిపింది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనోజ్ నార్త్‌వెస్ట్ కర్ణాటక స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్ డైరెక్టర్‌గా ఉన్నాడు. వీరిద్దరూ కలిసి దిగిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: 60 మంది అమ్మాయిల వీడియోలు లీక్..? స్పందించిన యూనివర్సిటీ -
సెలబ్రిటీల ఫేవరెట్ F3సెలూన్ గ్రాండ్ లాంఛ్
Favourite To All Film Personalities F3 Saloon Inauguratedat Hitech City: ఇండస్ట్రీకి చెందిన చాలామంది ఫేవరెట్ అయిన ఎఫ్-3 సెలూన్ కొత్త బ్రాంచి హైటెక్ సిటీలో ఆదివారం ప్రారంభమైంది. 2వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, అధునాతన పరికరాలతో ఏర్పాటైంది. ఈ క్యార్యక్రమానికి దిల్‌రాజు, అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ సెలూన్ అధినేత ఎఫ్-3 సురేష్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో ఫేజ-3 జనాలకుమంచి అనుభవం ఉన్న హెయిర్ స్టైలిస్టులు కావాలి. వాళ్లకు అత్యంత ఆధునిక స్టైళ్లు చేయాలి. మంచి పార్టీలకు వెళ్లాలని, వాటిలో బాగా కనిపించాలని అనుకునే వారికి ఎఫ్3 సెలూన్లు అత్యుత్తమ సేవలు అందిస్తాయి. స్వయంగా నేను ప్యారిస్‌లో శిక్షణ పొందాను, ఎఫ్3 సెలూన్లో ఉన్న సిబ్బంది అందరూ అత్యుత్తమ నాణ్యత కలిగిన సేవలు అందించడానికి తగిన శిక్షణ పొందినవారే' అని పేర్కొన్నారు. -
బంజారాహిల్స్: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: మసాజ్ ముసుగులో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ స్పా సెంటర్‌పై హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా మసాజ్ సెంటర్ నిర్వాహకులతో పాటు ఒక విటుడిని, 10 మందికి పైగా యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 లో ‘ఎలిగంట్ బ్యూటీ స్పాలూన్, అథర్వ హమామ్ స్పా’ పేర్లతో మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. చదవండి: మసాజ్ సెంటర్ల సీజ్.. యువతులు, మహిళలను రప్పించి వ్యభిచారం అయితే ఈ మసాజ్ కేంద్రాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు కొందరు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సోమవారం రాత్రి స్పా సెంటర్లపై దాడులు జరిపారు. మసాజ్ సెంటర్ నిర్వాహకులతో పాటు ఒక విటుడు, పలువురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నిమిత్తం బంజారాహిల్స్ పోలీసులకు నిందితులను అప్పగించారు. -
సలోన్ ను ఓపెన్ చేసిన రోజా సెల్వమణి
-
ఫ్యామిలీ సెలూన్ ముసుగులో..
రసూల్‌పురా: ఫ్యామిలీ సెలూన్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సం ఘటన కార్ఖాన పీఎస్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. కార్ఖాన సీఐ మధుకర్‌స్వామి కథనం మేరకు కార్ఖాన ప్రధాన రోడ్డులో అశోక్ అనే వ్యక్తి గత కొన్ని నెలలుగా ఏఐజీ ఫ్యామిలీ సెలూన్ నిర్వహిస్తున్నాడు. సెలూన్‌కు వచ్చే వారి బలహీనతలు తెలుసుకుని వారి అవసరాల కోసం ఇతర ప్రాంతాల నుంచి యువతులను రప్పించి భవనంలోని రెండు, మూడు అంతస్తుల్లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నాడు. ఇందుకుగాను ఆకాష్‌కుమార్ జైస్వాల్, మరో మహిళ అతడికి సహకరిస్తున్నారు. దీనిపై సమాచారం అందడంతో దాడులు నిర్వహించిన కార్ఖాన పోలీసులు ఆకాష్‌కుమార్ జైస్వాల్‌ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మహిళతో పాటు నిర్వాహకుడు అశోక్ కోసం గాలిస్తున్నారు. ఇద్దరు యువతులను విముక్తి కలిగించారు. -
కిడ్నాప్ చేసి గుండు గీయించారు
బంజారాహిల్స్: మాట్లాడదామని అర్థరాత్రి పిలిచి కిడ్నాప్ చేసి కారులో పాతబస్తీలో తిప్పుతూ ఓ సెలూన్లో బలవంతంగా గుండు గీయించడమే కాకుండా ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫస్ట్‌లాన్సర్ సమీపంలోని అహ్మద్ నగర్‌కు చెందిన మన్సూర్‌అలీ ఖాన్ అలియాస్ నాసర్(19) విద్యార్థి. సోమవారం అర్థరాత్రి అతడికి ఫోన్ చేసిన ఓ యువకుడు తనను హయత్‌గా పరిచయం చేసుకుని మాట్లాడేది ఉందంటూ బంజారాహిల్స్ రోడ్ నెం.1లోని జీవీకే వన్ చౌరస్తాకు పిలిపించాడు. అర్థరాత్రి అక్కడికి వచ్చిన మన్సూర్‌ను ఇబ్రహీం ఖాన్‌తో పాటు మరో ఇద్దరు యువకులు బలవంతంగా కారులో ఎక్కించుకొని అసభ్యంగా దూషిస్తూ సైదాబాద్‌కాలనీ అక్బర్బాగ్లో తిప్పారు. సైదాబాద్ కాలనీలోని ఓ సెలూన్‌లోకి బలవంతంగా తీసుకెళ్లి అతడికి గుండుకొట్టించారు. సెల్‌ఫోన్, జేబులో ఉన్న రూ.5 వేల నగదు లాక్కుని తీవ్రంగా కొట్టారు. అనంతరం మళ్లీ కారులో ఎక్కించుకొని ఆరంఘర్ చౌరస్తాకు తీసుకెళ్లారు. ఉదయం 7.45 గంటల ఈ దృశ్యాలను వీ డియో తీయడేగాక ఇంకోసారి నీ ఇంటికి వచ్చి చ ంపేస్తామంటూ బెదిరించారు. వీడియోను సో షల్‌మీడియాలో పెడతామని హెచ్చరించారు. తీవ్రంగా గాయపడిన అతడిని గుర్తించిన సా ్థనికులు ఆస్పత్రికి తరలించారు. కోలుకున్న తర్వాత బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులపై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ఓ అమ్మాయి విషయం మాట్లాడదామని తనను పిలిపించి కిడ్నాప్ చేశారని, బలవ ంతంగా తలవెంట్రుకలు కట్ చేయించి తీవ్రంగా కొట్టడమే కాకుండా సెల్‌ఫోన్‌తో పాటు నగదు లా క్కున్నారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫి ర్యాదులో పేర్కొన్నాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సెలూన్ పేరుతో వ్యభిచారం
హైదరాబాద్ : శ్రీనగర్ కాలనీలో వ్యభిచార స్థావరంపై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మికదాడులు నిర్వహించారు. వి2 సెలూన్ పేరుతో నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అమ్మాయిలను, నిర్వాహకుడు వెంకట్ రావు, కస్టమర్ లోకేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతులను కౌన్సెలింగ్ నిమిత్తం స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక సీఐ గట్టుమల్లు తెలిపారు. -
సెలూన్‌కు రూ.1.27 లక్షల కరెంట్ బిల్లు
పటాన్చెరు: చిన్న హెయిర్ కటింగ్ సెలూన్‌కు వచ్చిన కరెంటు బిల్లు అక్షరాలా రూ.1.27లక్షలు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగికి చెందిన శ్రీనివాస్ స్థానికంగా హెయిర్ కటింగ్ సెలూన్ నిర్వహిస్తున్నాడు. ప్రతీనెల (విద్యుత్ మీటర్ నంబర్ 0558 02239) రూ.200 నుంచి ఎక్కువలో ఎక్కువ రూ.1,000 వరకు కరెంటు బిల్లు వచ్చేది. అంతకుమందు నెల రూ.971 బిల్లు రాగా జూన్ 28న చెల్లించాడు. ఇక జూలైకి సంబంధించిన బిల్లు ఈ నెల 10న వచ్చింది. బిల్లు చూసిన శ్రీనివాస్‌కు ఒక్కసారిగా కళ్లు బైర్లు కమ్మాయి. రూ.1,27,751 అంకె చూడగానే అతని గుండె గు‘బిల్లు’మంది. బిల్లుపై జూన్ 14 నుంచి ఆగస్టు 10 వరకు అని, 12,782 యూనిట్లు వినియోగించినట్లు చూపుతోంది. స్థానిక విద్యుత్ అధికారులను సంప్రదిస్తే సంగారెడ్డిలో లోక్ అదాలత్ నిర్వహిస్తారని అప్పుడు నీ సమస్య చెప్పుకోమని ఉచిత సలహా ఇచ్చారు. -
బీజేపీ నాయకుడు దారుణ హత్య
సెలూన్లో నరికేసిన ప్రత్యర్థులు కేఆర్ పురంలో ఉద్రిక్తత అదనపు బలగాలు మొహరింపు మేయర్ ధర్నా బెంగళూరు, న్యూస్‌లైన్: బెంగళూరు నగరంలో మళ్లీ పాతకక్షలు భగ్గుమన్నాయి. పట్టపగలు రద్దీగా ఉండే ప్రాంతంతో బీజేపీ నాయకుడిని కిరాతకంగా నరికివేశారు. ఇక్కడి కేఆర్ పురంలోని దేవసంద్ర కార్పొరేటర్ మంజుల భర్త శిరిపురం శ్రీనివాస్ అలియాస్ శ్రీనివాస్ (44) హత్యకు గురయ్యాడు. శ్రీనివాస్ గత బీబీఎంపీ ఎన్నికల్లో ఆయన భార్యకు బీజేపీ టిక్కెట్ ఇప్పించి దేవసంద్ర వార్డు నుంచి కార్పొరేటర్‌గా గెలిపించుకున్నాడు. శ్రీనివాస్ భార్య మంజుల, కుమారుడు సాయి ధనుష్ (14), కుమార్తె మేఘనా (12)తో కలిసి పాత కేఆర్ పురంలోని న్యూ ఎక్స్టెన్షన్ రోడ్డులో నివాసం ఉంటున్నాడు. స్థానిక ఎమ్మెల్యే నందీష్‌రెడ్డి (బీజేపీ)కి కుడిభుజం. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో శ్రీనివాస్ సమీపంలోని బాయ్స్ మెన్స్ సెలూన్‌లోకి బయలుదేరాడు. అప్పటికే ఈ విషయాన్ని గమనించిన ప్రత్యర్థులు రోడ్డుపైనే హతమార్చాలని పథకం వేశారు. అయితే రోడ్డు చిన్నది కావడం... అయ్యప్ప నగర, దేవసంద్ర ఏరియా రద్దీగా ఉంటుందని ఆ సమయంలో శ్రీనివాస్ తప్పించుకునే అవకాశం ఉందని వెనుకడుగువేశారు. సెలూన్‌లోకి వచ్చిన వెంటనే దాడి చెయ్యాలని పథకం మార్చుకున్నారు. శ్రీనివాస్ బాయ్స్ మెన్స్ సెలూన్‌లోకి వెళ్లి కుర్చీలో కుర్చుని షేవింగ్ చేసుకుంటున్న సమయంలో బైక్‌లలో ముసుగులు ధరించిన వచ్చిన ఆరుగురు వ్యక్తులు ఒక్కసారిగా మారణాయుధాలతో దాడి చేశారు. తల, మెడ, ఛాతి తదితర చోట్ల విచక్షణారహితంగా నరికివేశారు. దీంతో శ్రీనివాస్ కూర్చీలోనే కుప్పకూలిపోయాడు. నింది తులు బయటకు వచ్చి కేకలు వేస్తు బైక్‌లలో పరారయ్యారు. ఈ సంఘటనతో చుట్టుపక్కల వారు హడలిపోయారు. సెలూన్ యజమాని రమేష్ పోలీసులు, శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తీవ్రగాయాలైన శ్రీనివాస్‌ను వెంటనే మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న నగర అడిషనల్ పోలీసు కమిషనర్ కమల్‌పంత్, జాయింట్ పోలీసు కమిషనర్ శరత్చంద్ర, డీసీపీ డాక్టర్ పీఎస్. హర్ష, ఏసీపీ సిద్దప్ప సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నగదు లావాదేవీలు, రియల్ వ్యాపారం, పాతకక్షల కారణంగానే హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యు లు, సెలూన్ యజమాని తెలిపిన వివరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితులు : శ్రీనివాస్ హత్యకు గురి కావడంతో కేఆర్‌పురం, దేవసంద్రతో సహ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రీనివాస్ అనుచరులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు గుమికూడటంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే నందీష్‌రెడ్డి కేఆర్‌పురంలో ధర్నా నిర్వహించారు. హంతకులను అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్థానిక పోలీసులతో సహ అదనపు బలగాలను రంగంలోకి దింపారు మేయర్ ధర్నా : బీజేపీ నాయకుడు, కార్పొరేటర్ మంజుల భర్త శ్రీనివాస్‌ను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని బీబీఎంపీ మేయర్ కట్టె సత్యనారాయణ ఆధ్వర్యలో పాలికె కేంద్ర కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కట్టె సత్యనారాయణ మాట్లాడుతూ... రాజకీయంగా శ్రీనివాస్‌ను ఎదుర్కొలేకనే హత్య చేశారని ఆరోపించారు. బలమైన నాయకుడు : గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న శ్రీనివాస్ కేఆర్‌పురం నగర సభ ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందారు. తరువాత 2008లో జరిగిన శాసన సభ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు. స్థానికంగా శ్రీనివాస్ బలమైన నాయకుడు. గతంలో రెండు మూడు సార్లు ఈయనపై దాడి చెయ్యడానికి ప్రయత్నించారు. బలిజ కులస్తుడు అయిన శ్రీనివాస్ స్థానికంగా ఉన్న కుల సంఘాలకు పూర్తి మద్దతు ఇచ్చి ప్రోత్సహించేవాడు. ఇలాంటి నాయకుడిని పక్కా పథకంతో హతమార్చారు.